Handloom Workers
-
చేనేత సొసైటీల్లో ఎన్నికలకు కసరత్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాల (సొసైటీ) ఎన్నికల కసరత్తును ప్రభుత్వం ప్రారంభించింది. అక్టోబర్ 21న షెడ్యూల్ విడుదల చేసి, డిసెంబర్ 6వ తేదీకి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఏ సొసైటీల పరిధిలో ఎంత మంది సభ్యులున్నారన్న వివరాలతో కూడిన జాబితాలను చేనేత జౌళి శాఖ సేకరిస్తోంది. ఆ జాబితాలను పరిశీలించి నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాలను అధికారులు ఖరారు చేస్తారు. అయితే, ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.పదేళ్లుగా సొసైటీలకు ఎన్నికలు జరగకపోవడంతో ఓటర్ల జాబితా ఖరారు, బోగస్ సొసైటీల వ్యవహారం వంటి అనేక సమస్యలు ఎన్నికలకు అవరోధంగా మారాయి. మరోవైపు వ్యవసాయ పరపతి సంఘాల ఎన్నికలు సైతం నిర్వహించాలనే ప్రతిపాదన ఉండటంతో చేనేత సొసైటీ ఎన్నికలు ముందు వెనుక అయ్యే అవకాశం ఉందని చేనేత జౌళి శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఓటరు జాబితాల కసరత్తు పూర్తి చేసి ఎన్నికలను మరో రెండు నెలల తర్వాత నిర్వహించాలనే ప్రతిపాదన కూడా ఉందని, ఇంకా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ఆ అధికారి చెప్పారు.ఎన్నికలు నిర్వహిస్తారనే సంకేతాలతో చేనేత సొసైటీ ఎన్నికల బరిలో దిగి పదవులు దక్కించుకునేందుకు పలువురు సమాయత్తమవుతున్నారు. తమ సొసైటీల పరిధిలో సభ్యుల జాబితాలు, వాటిలో మార్పులు, సభ్యులను చేరి్పంచడం వంటి చర్యలు చేపట్టారు. మరోపక్క కృష్ణా జిల్లా పెడనలో రాష్ట్రంలోనే తొలిసారిగా పూర్తిగా మహిళలతోనే ప్రత్యేకంగా చేనేత సొసైటీ ఏర్పాటుకు సోమవారం శ్రీకారం చుట్టారు. పేరుకే సొసైటీలు.. యాక్టివ్‌గా ఉన్నవి కొన్నే అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 960 చేనేత సొసైటీలు ఉన్నాయి. వాటిలో 200కు పైగా బోగస్‌వే. మిగతా వాటిలో 600కు పైగా సొసైటీలు రికార్డుల్లోనే ఉన్నాయి తప్ప కార్యకలాపాలు ఏమీ లేవు. వాస్తవంగా నిత్యం కార్యకలాపాలు సాగిస్తూ యాక్టివ్‌గా ఉండే సొసైటీలు 100 నుంచి 150 మాత్రమే ఉంటాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ సబ్సిడీలు, ఇతర రాయితీల కోసం మాస్టర్ వీవర్స్, చేనేత రంగంలో బడా వ్యాపారులు వారి వద్ద పనిచేసే వారిని, కుటుంబ సభ్యుల పేర్లను చేర్చి సొసైటీలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరు ఏకంగా పదుల సంఖ్యలో బోగస్ సొసైటీలు ఏర్పాటు చేసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటినీ రద్దు చేస్తారా లేదా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇటువంటి సొసైటీలను తప్పించి, వ్యవస్థను ప్రక్షాళన చేశాకే ఎన్నికలు జరిపాలని అసలైన సొసైటీల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.సొసైటీ నుంచి ఆప్కో వరకు ఎన్నికలు ఇలా.. ప్రతి సొసైటీకి తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. వారిలో ఇద్దరు మహిళా డైరెక్టర్లు కచి్చతంగా ఉండాలి. తొమ్మిది మంది డైరెక్టర్లు వారిలో ఒకరిని అధ్యక్షులుగా, మరొకరిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకుంటారు. ప్రతి జిల్లా పరిధిలోని సొసైటీల అధ్యక్షులందరూ కలిసి ఒక ఆప్కో డైరెక్టర్‌ను ఎన్నుకుంటారు. అన్ని జిల్లాల ఆప్కో డైరెక్టర్లు వారిలో ఒకరిని ఆప్కో చైర్మన్‌గా ఎన్నుకుంటారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎంపికయ్యే ఆప్కో చైర్మన్, డైరెక్టర్లు, సొసైటీ పాలకవర్గాల పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. అదే ప్రభుత్వమే నామినేట్ చేస్తే ప్రతి ఆరు నెలలకు ఒకసారి వారి పదవిని పొడిగించాలి. చేనేత సొసైటీ ఎన్నికల్లో పోటీ చేసే వారి బ్యాంకు రుణాల కిస్తీల చెల్లింపులు మూడు నెలలకు మించి పెండింగ్‌లో ఉండకూడదు. -
పసిడి కోక.. కట్టుకుంటే కేక
సిరిసిల్ల: అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల పరంధాములు తనయుడు నల్ల విజయ్‌కుమార్.. పది రోజులపాటు శ్రమించి పసిడి కోకను నేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి తన కూతురు పెళ్లి కోసం 200 గ్రాముల బంగారంతో చీర తయారీకి ఆర్డర్ ఇచ్చారు. ఆ మేరకు విజయకుమార్ బంగారంతో నిలువు, అడ్డం పోగులను చేనేత మగ్గంపై నేశారు. 800 నుంచి 900 గ్రాముల బరువు.. 49 అంగుళాల వెడల్పు, ఐదున్నర మీటర్ల పొడవుతో చీరను రూపొందించారు.కట్టుకునేందుకు వీలుగా కొత్త డిజైన్లతో పసిడి కోకను సిద్ధం చేశాడు. ఈ చీర తయారీకి బంగారంతో కలిపి మొత్తం రూ.18 లక్షలు ఖర్చయినట్టు విజయ్‌కుమార్ తెలిపారు. అక్టోబరు 17న సదరు వ్యాపారి కూతురు పెళ్లి ఉండడంతో.. ఆరు నెలల కిందటే ఆర్డర్ తీసుకున్నట్లు తెలిపారు. గతంలో ఉంగరం, దబ్బనంలో దూరే చీరలు, సువాసన వచ్చే చీర, కుట్టులేని జాతీయ జెండాను చేనేత మగ్గంపై నేసిన విజయ్‌కుమార్.. తాజాగా బంగారు చీరను నేయడం విశేషం. -
నాపై కోపంతో కార్మికుల పొట్టకొట్టొద్దు
-
నేడు సీఎం చేతులమీదుగా ఐఐహెచ్‌టీ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: చేనేత రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త కోర్సుల్లో శిక్ష ణ ఇచ్చేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)ని సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించనున్నా రు. అలాగే నేతన్నకు చేయూత పథకం కింద 36,133 మంది లబ్ధిదారులకు రూ. 290 కోట్లు విడుదల చేయనున్నారు.ఈ విషయాన్ని వ్యవ సాయ, మార్కెటింగ్, సహకార, జౌళిశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐఐహెచ్‌టీలో ఏటా 60 మంది విద్యార్థులు చేనేత, జౌళి సాంకేతికతలో మూడేళ్ల డిప్లొమా కోర్సును అభ్యసించడానికి అవకాశం లభిస్తుందన్నారు. ఈ డిప్లొమాతో ప్రభుత్వరంగ జౌళి సంస్థలతోపాటు ప్రైవేటు టెక్స్టైల్, అపెరల్ ఇండస్ట్రీస్, ఫ్యాషన్ సెక్టార్లలో ఉత్పత్తి, క్వాలిటీ కంట్రోల్, మార్కెటింగ్ విభాగాలలో విద్యార్థులకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. -
విజయవాడ : చేనేత షో అదుర్స్ (ఫొటోలు)
-
హాయ్.. 'హ్యాండ్'లూమ్! చేనేత కళాకారుల కలల సాకారం కోసం..
సాక్షి, సిటీబ్యూరో: జీవితాన్ని కాచివడబోసి మరెందరి జీవితాలనో తీర్చిదిద్దుతున్న లైఫ్ కోచ్ ఒకరు.. పల్లెటూరు నుంచి వచ్చినా ప్రముఖులకు సైతం డ్రెస్సింగ్ నేర్పుతున్న సెలబ్రిటీ డిజైనర్ మరొకరు... జెండర్ మార్చుకున్న వండర్ ఉమెన్ ఒకరైతే... ఆర్గానిక్ ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు మరొకరు... క్యాట్‌వాక్ చేసేవారిని మోడల్స్ అంటారు. కానీ, క్వీన్ వాక్ చేసేవారిని విజేతలు అంటారు.. చేనేత కళాకారుల కలల సాకారం కోసం ఇలా కాంతలంతా... విజయకాంతులై కళకళలాడారు.. వీరి విజయాలెంత ఉన్నతమైనవో.. వీరి నడక వెనుక చేనేతలకు చేయూతనివ్వాలనే లక్ష్యం అంతే సమున్నతమైనది. ‘హ్యాండ్లూమ్ సోయిరీ’ ఈవెంట్ నగర శివార్లలోని కోకాపేట్లో ఉన్న కేసీయార్ కన్వెన్షన్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకుల తరపున శాంతికృష్ణ తదితరులు ‘సాక్షి’తో తమ ఆలోచనలను పంచుకున్నారు. అవి వారి మాటల్లో...చేనేత.. చేయూత.. గతంలో దేశవ్యాప్తంగా ఉన్న ఒక శారీ లవర్స్ గ్రూప్‌లో మేం సభ్యులుగా ఉండేవాళ్లం. ఆన్ లైన్ వేదికగా నడిచే ఆ సంస్థ ద్వారా వైవిధ్యభరితమైన చీరకట్టుతో పాటు ఆలోచనలు కూడా పంచుకునేవాళ్లం. ఆ క్రమంలోనే నగరానికి చెందిన కొందరం కలిసి, చేనేత, హస్త కళాకారుల పరిస్థితులపై చర్చించాం. వారికి ఏదో విధంగా అండగా ఉండాలని, దీన్ని ఒక సొసైటీగా మార్చాలని అనుకున్నాం. 16 మంది కమిటీ మెంబర్స్, ముగ్గురు అపెక్స్ మెంబర్స్‌తో హ్యాండ్లూమ్కి సాయం అందించే సొసైటీగా ఏర్పడాలని భావించాం. ఈ కార్యక్రమాలను ప్రకటించడం కోసమే ఈ ఈవెంట్ నిర్వహించాం.ఈ సొసైటీలోని సభ్యులు అంతా తలా కొంతడబ్బు వేసుకోవడంతో పాటు విభిన్న రకాల ఈవెంట్ల నిర్వహణ ద్వారా నిధి సేకరించాలని నిర్ణయించుకున్నాం. ఆ నిధితో చేనేత హస్తకళాకారుల మరమగ్గాలు, ఇతర పరికరాల మరమ్మతుకు చేయూత అందించడం, స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా కోర్సులు తయారు చేయించడం, కార్పొరేట్ కంపెనీల సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)తో నిర్వహించే కార్యక్రమాలకు వీటిని అనుసంధానించడం, చేనేత కళాకారుల పిల్లలు ఎవరైనా తమ కళలో శిక్షణ పొందాలంటే స్కాలర్íÙప్లు అందించడం వంటివి చేపట్టాలని నిర్ణయించుకున్నాం.నిధి.. సేవకు పెన్నిధి..తరచూ మెంబర్స్ మీట్స్, గెట్ టు గెదర్స్ నిర్వహించడం కూడా ఈ సొసైటీ కార్యక్రమాల్లో భాగమే. అందులో పాల్గొన్నవారు చేనేత చీరలు ధరించి ర్యాంప్ వాక్ చేయడంతో పాటు రోజంతా ఆటపాటలు, నృత్యాలతో సందడి చేస్తారు. ఇది విభిన్న వృత్తులు, వ్యాపకాల్లో బిజీబిజీగా గడిపే మహిళలకు ఆటవిడుపుగా ఉండటంతోపాటు దీని ద్వారా సేకరించిన నిధులను ఓ మంచి సేవా కార్యక్రమానికి వినియోగించాలనేదే మా ఆలోచన.కళ.. కళకళలాడాలనే... మా జీవితాలతో చేనేత చీరలు, దుస్తులది విడదీయలేని అనుబంధం. ఆయా రంగాల్లో మేం ముందడుగు వేసే క్రమంలో అవి హుందాతనాన్ని అందిస్తూ, సంప్రదాయ వైభవాన్ని పెంచాయి. అలాంటి చేనేత కళ భావితరాలకు సైతం అందాలనే ఆలోచనతోనే ఈ సొసైటీకి రూపకల్పన చేశాం. ఈ ఫస్ట్ ఈవెంట్ సక్సెస్ అవడం మాకు సంతోషాన్ని ఇచి్చంది. ఇకపై కూడా వీలున్నన్ని ఈవెంట్స్ నిర్వహించి చేనేత కళాకారులకు చేయూత అందిస్తాం. మాతో చేతులు కలపాలని అనుకునేవారిని ఆహా్వనిస్తున్నాం. – శాంతికృష్ణ, నిర్వాహకురాలు -
డియర్ సార్.. ప్లీజ్ ‘వీ ఆర్ హ్యాండ్లూమ్’ అంటూ..
డియర్ సార్.. ప్లీజ్ ‘వీ ఆర్ హ్యాండ్లూమ్’ అంటూ పలకరించే తమ స్నేహితుడి కోసం చేనేత వ్రస్తాలను ధరించే వారు కొందరైతే, వీఆర్ హ్యాండ్లూమ్.. బీ హ్యాండ్సమ్ అని చెబితే గానీ, చేనేత వస్త్ర ధారణ పై తమకు మక్కువ కలగలేదనే వారు మరి కొందరు. చేనేత వస్త్ర ప్రియుడిగా, ప్రోత్సాహకుడిగా తన ఉనికిని చాటుకునే మాచన రఘునందన వృత్తిరీత్యా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పౌర సరఫరాల శాఖలో ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్. చేనేత పట్ల ఆయనకున్న కమిట్మెంట్పై పలు విశేషాలు.. – సాక్షి,సిటీబ్యూరోమూడు దశాబ్దాలుగా చేనేత వస్త్రాలు మాత్రమే ధరిస్తూ చేనేత వ్రస్తాలపై విస్తత ప్రచారం చేస్తున్నారు. ‘చేనేత వస్త్రాలను ధరించండి.. నేతన్నను ఆదరించండి’. అంటూ తన మిత్రులు, సహచర ఉద్యోగులు హ్యాండ్లూమ్ బట్టలు ధరించేలా ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ పద్మశాలి అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్‌లో కీలకపాత్ర పోషిస్తూ చేనేత వ్రస్తాలకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగా ప్రచారం కలి్పస్తున్నారు. హ్యాండ్లూమ్కు తన దైనందిన జీవితంలో అత్యంత ప్రాధాన్యతనివ్వడంతో ఆదర్శ ప్రాయంగా మారారు.చదువుకునే రోజుల నుంచే..మాచన రఘునందన చదువుకునే రోజులనుంచే చేనేత వ్రస్తాలు ధరించడం ఆరంభించారు. తన వివాహ సమయంలో కూడా చేనేత వ్రస్తాలను మాత్రమే విధిగా ఉండేలా నిబంధన పెట్టి సఫలీకృతమయ్యారు. చేనేత ఉపయోగాలను జనబాహుళ్యానికి తెలిసేలా తన దైనందిన జీవితంలో అనుదినం చేనేత వ్రస్తాలనే ధరిస్తూ వస్తున్నారు. చేతిరుమాలు, తువ్వాలు, లుంగీలు, ఇలా ప్రతిదీ చేనేతనే ఉపయోగిస్తారు. తాను చేనేత వ్రస్తాలను ధరించడమే కాకుండా కుటుంబ సభ్యులను, తోటివారిని, ఇరుగు పొరుగు వారిని సైతం చేనేతనే వినియోగించేలా అవగాహన కల్పిస్తున్నారు.ఇంట్లోని దుప్పట్లు, మొదలు వివిధ రకాల అలంకరణ వ్రస్తాలను సైతం చేనేతవే వినియోగిస్తుంటారు. ఇక పుట్టినరోజు, వివాహాది శుభకార్యాలకు కానుకలుగా చేనేత ఉత్పత్తులనే అలంకార వస్తువులుగా తయారు చేయించి ఇస్తుండడం ఆయన ప్రత్యేకత. ఏటా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉన్నతాధికారులను చేనేత తువ్వా ళ్లతో సత్కరించడం ఆయన ఆనవాయితీ. మిత్రుల వివాహాది శుభకార్యాలకు హ్యాండ్లూమ్ షోరూంను సందర్శించేలా చేసి, నచ్చిన వస్త్రాలు తక్కువ ధరలకు లభ్యమయ్యేలా ప్రోత్సహిస్తున్న తీరును ప్రత్యక్షంగా వివరిస్తున్నారు. హ్యాండ్లూమ్ను ఆదరిస్తే.. ఒక నేత కార్మికుడి కుటుంబాన్ని ఆదుకున్నట్లేనని ఆయన అభిప్రాయం. మిత్రులు కలిసిన సందర్భంగా డియర్ ఫ్రెండ్.. వీఆర్ హ్యాండ్లూమ్ అంటూ కరచాలనం చేయడం ఆయన ప్రత్యేకత. -
అందుకే మంగళగిరిలో చేనేత మహిళకు టికెట్.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: మంగళగిరిలో చేనేతలు ఎక్కువ.. అందుకే ఆర్కేతో మాట్లాడి చేనేత కుటుంబానికి చెందిన నా చెల్లెమ్మ మురుగుడు లావణ్యకి టికెట్ ఇచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘మరో వైపు చంద్రబాబు ఆయన కొడుకు ఏం చేస్తున్నారు. బీసీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో వాళ్లే నిలబడి కోట్లకి కోట్లు డబ్బు ఖర్చు చేస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘కుప్పంలోనూ బీసీలు ఎక్కువగా ఉన్నా అక్కడ కూడా ఇదే పరిస్థితి. తేడా గమనించమని కోరుతున్నాను’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర మంగళగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ చేనేత కార్మికులతో ముఖాముఖి అయ్యారు. ‘‘చేనేత కార్మికులను కూడా చంద్రబాబు మోసం చేశాడు. 2014లో కూటమిగా వచ్చి చంద్రబాబు ఏం చేప్పారో గుర్తు చేసుకోండి. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతాం. గతంలో 98 శాతం హామీలను ఎగ్గొట్టారు. 2 శాతం హామీలను మాత్రమే నెరవేర్చారు. గత పాలనకు, మన పాలనకు తేడాను మీరే గమనించారు. చంద్రబాబు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు. సూపర్ సిక్స్, సెవెన్ అంటూ వస్తున్నారు. గతంలో కూడా ముగ్గురు కలిసే వచ్చారు. ఒక్కరికైనా సెంట్ స్థలం ఇచ్చారా?. మనం స్థలం ఇస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. ఒక్క ఇళ్లైనా ఇచ్చారా?. చేనేత కార్మికులకు ఇల్లు, మగ్గం అని చంద్రబాబు మోసం చేశారు. నేతన్న నేస్తం పథకం కింద రూ.970కోట్లు చేనేత కార్మికులకు అందించాం. మగ్గం ఉన్న ప్రతీ కుటుంబానికి చేయూతనిచ్చిన ప్రభుత్వం మనది. కుల, మత, రాజకీయాలకు అతీతంగా లబ్ధి జరిగింది. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకం అములు చేసిన సందర్భం ఉందా?. నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3706 కోట్లు ఖర్చు చేశాం. 1.06లక్షల మందికి లబ్ధి జరిగింది’’ అని సీఎం జగన్ వివరించారు. మంగళగిరిలో చేనేతలు ఎక్కువ. అందుకే ఆర్కేతో మాట్లాడి చేనేత కుటుంబానికి చెందిన నా చెల్లెమ్మ మురుగుడు లావణ్యకి టికెట్ ఇచ్చాం. మరోవైపు చంద్రబాబు ఆయన కొడుకు ఏం చేస్తున్నారు? బీసీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో వాళ్లే నిలబడి కోట్లకి కోట్లు డబ్బు ఖర్చు చేస్తున్నారు. కుప్పంలోనూ బీసీలు… pic.twitter.com/kB1XDL6mOQ — YS Jagan Mohan Reddy (@ysjagan) April 13, 2024 -
అన్నిరంగాల్లో సిరిసిల్ల అభివృద్ధి చెందుతోంది
-
వెండితో సీతమ్మ వారికి సిరిసిల్ల చీర
-
సిల్క్ ఇండియా ప్రదర్శన ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: విభిన్న ప్రాంతాలకు చెందిన చేనేత కళాకారులు రూపొందించిన దుస్తులతో సిల్క్ ఇండియా వస్త్ర ప్రదర్శన మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో ఏర్పాటైంది. వివాహ ప్రత్యేక దుస్తుల శ్రేణిని నేపథ్యంగా తీసుకుని నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన బుధవారం ప్రారంభమైంది. ప్రదర్శనలో ఉప్పాడ, బనారస్ సిల్క్స్, గద్వాల, ధర్మవరం తదితర ప్రసిద్ధి వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. చేనేత కళాకారులు, సామాజిక కార్యకర్తలు, పర్యావరణ వేత్తలు, డిజైనర్లు తదితరుల బృందంతో ఏర్పాటైన ఒడిస్సా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో ప్రదర్శన ఈ నెల 9 వరకు కొనసాగుతుందని వివరించారు. -
మారిన మగ్గం బతుకులు
దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన చేనేతల బతుకులు గత ప్రభుత్వాల పాలనలో కునారిల్లాయి. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేయగలిగిన నైపుణ్యం ఉన్న చేనేతలు పాలకుల ఆదరణలేక, మెతుకు దొరక్క, పస్తులతో బతుకులీడ్చలేక ప్రాణాలొదలాల్సిన పరిస్థితులను ఎదుర్కొన్నారు. నేత వృత్తినే నమ్ముకుని కుటుంబాలను పోషించుకునే నేతన్నల జీవితాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త వెలుగులు నింపుతున్నారు. ఇప్పటికే మూడేళ్లుగా వైఎస్సార్ నేతన్న నేస్తంతోపాటు నవరత్న పథకాలు చేనేత రంగంపై ఆధారపడిన వారికి జీవం పోశాయి. తాజాగా నాలుగో విడత లబ్ధి చేకూర్చనున్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్: చేనేత కుటుంబాలు స్వర్ణయుగం వైపు పయనిస్తున్నాయి. ఆకలి మరణాల నుంచి అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయి. గతంలో ప్రభుత్వాల ఆదరణ లేక మూలన పడేసిన మగ్గాలు మళ్లీ ఊపందుకున్నాయి. సంప్రదాయ వృత్తినే నమ్ముకున్న చేనేతలు పూర్వవైభవం వైపు పరుగులు తీస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేనేతల బతుకుల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేశారు. ఉమ్మడి కడప జిల్లాలో ప్రదానంగా మాధవరం, ఖాజీపేట, మైలవరం, పుల్లంపేట, బద్వేలు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో దాదాపు 6–7 వేల మందికి పైగా మగ్గాల ద్వారా చేనేత వస్త్రాలను నేస్తున్నారు. అలాగే వీరు కాకుండా అనుబంధ కార్మికులు కూడా ఉన్నారు. మూడేళ్లలో నాల్గవ దఫా నేతన్న నేస్తం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక ఎన్నో ఆర్థిక కష్టాలు ఎదురైనా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం చేనేతలకు వైఎస్సార్నేతన్న నేస్తం అందిస్తున్నారు. ప్రతి కుటుంబానికి యేటా రూ. 24 వేల నగదు సాయం అందుతోంది. తొలి విడతలో ఎవరికైనా సాంకేతిక కారణాలతో సాయం అందకపోతే తిరిగి మళ్లీ అందజేస్తున్నారు. ఈ విధంగా మూడేళ్లలో నాల్గవ విడత నేతన్న నేస్తం నగదును ఈనెల 25న గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా చేనేతల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పటివరకు ఒక్కో కుటుంబానికి రూ. 72 వేల సాయం అందింది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 2019–20లో 11,774 మందికి రూ. 28,25,76,000, 2020–21లో 10774 మందికి రూ. 25 కోట్ల 85 లక్షల,76 వేలు, 2021–22లో 8636 మందికి రూ. 19 కోట్ల,76 లక్షల,64 వేలు అందగా, 2022–23లో 9291 మందికి రూ. 22కోట్ల,29 లక్షల,84 వేలు సాయం అందనుంది. మారిన బతుకులు: ప్రభుత్వం యేటా అందిస్తున్న రూ.24 వేలతో చేనేత కుటుంబాలు ఆర్థికంగా ఎదు గుతున్నాయి. అప్పులు తెచ్చుకుని నేత ముడి సరుకులు కొనుగోలు చేసే పనిలేకుండా ఈ డబ్బులు పెట్టుబడిగా పెట్టుకుని ధీమాగా బతుకుతున్నారు. చేనేతల జీవితాల్లో వెలుగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేనేతల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం చేనేతల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. అతలాకుతలమైన చేనేతల కుటుంబాల్లో ఈ పథకం వల్ల ఎంతో మార్పు చోటుచేసుకుంది. పథకం లబ్ధి చేకూరడంతో కష్టాలు పడుతున్న చేనేత కుటుంబాలు నేడు సంతోషంగా తమ జీవితాలను గడుపుతున్నారు. ఇలాంటి పథకం ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టలేదు. – శ్రీరామదాసు, మాధవరం మగ్గం చేతబట్టాం అనాదిగా చేనేత వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాము. గత ప్రభుత్వాల సహకారం లేక మగ్గాన్ని మూలన పడేసి వేరే వృత్తిలోకి వెళ్లి బతుకులు కొనసాగించాల్సి వచ్చింది. అయితే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేతన్న నేస్తం సాయంతో మగ్గాన్ని నేస్తూ సంతోషంగా జీవిస్తున్నాం. దానితో కావాల్సిన ముడి సరుకులు కొనుగోలు చేసి వృత్తి మీదనే ఆధారపడుతున్నాం. – సామల సుబ్రమణ్యం, మాధవరం–1 ఆర్థికంగా బలోపేతం కావాలి జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద మంజూరైన ఆర్థికసాయాన్ని గురువారం ఖాతాలకు జమ చేయనున్నాం. 9291 మంది లబ్ధిదారులకు నగదును అందించనున్నాం. ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయాన్ని ఉపయోగించుకుని ఆర్థికంగా చేనేతలు బలోపేతం కావాలి. – భీమయ్య, సహాయ సంచాలకులు, జిల్లా చేనేత జౌళిశాఖ, కడప -
చేనేతల కళత: ఇక్కత్ ఇక్కట్లు.. గొల్లభామ గొల్లు
శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, సాక్షి, ప్రత్యేక ప్రతినిధి తరతరాల వృత్తిపై మమకారం.. వదులుకోలేని, కొనసాగించలేని దైన్యం. మూరెడు బట్ట నేసినా.. జానెడు పొట్ట నిండని దౌర్భాగ్యం. అరకొర సాయం మినహా ప్రఖ్యాతిగాంచిన కళలు బతికి ‘బట్ట’ కట్టేలా కొరవడిన ప్రోత్సాహం..వెరసి చేనేత మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆరు తరాలుగా వస్తోన్న అరుదైన చేనేత రంగుల కళ, కళ్ల ముందే చెదిరిపోతోంది. తెలంగాణాలో రెండు దశాబ్దాల క్రితం లక్ష మగ్గాలపై పడుగూ, పేకలతో అద్భుతాలు సృష్టించి అబ్బుర పరిచిన నేతన్నల సంఖ్య ఇప్పుడు ఇరవై రెండువేలకు పడిపోయిందంటేనే పరిస్థితి అర్ధమవుతోంది. మార్కెట్‌తో పోటీ పడే స్థితి లేక, నేసిన బట్టకు ధర గిట్టుబాటు కాక ఇతర ఉపాధి అవకాశాలను చూసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకరు, ఇద్దరు తప్ప కొత్త తరం ఈ వృత్తి వైపే కన్నెత్తి చూడటం లేదు. దీంతో చేనేతకు సంబంధించి ఇదే చివరి తరం అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నైపుణ్యం ఉన్నా.. చేయూత సరిపోక యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, నారాయణపేట, గద్వాల, జనగామ జిల్లాల్లో చేనేత కళాకారులు తమ నైపుణ్యంతో గుప్పిట్లో పట్టే చీరలను సైతం నేసి ఔరా అనిపించారు. నూలు దారాలకు రబ్బర్ ట్యూబ్‌ను బిగించి (టై), సహజ రంగులద్ది (డై) మగ్గాలపై 3,384 పోగుల పడుగు (పొడవు), 17,000 పోగుల పేక (వెడల్పు)తో నేసిన ‘పోచంపల్లి ఇక్కత్’ పట్టుచీర ఇప్పటికీ ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. తలపై పాలకుండతో వయ్యారి నడకలకు తమ పోగులతో ప్రాణం పోసి గొల్లభామ బ్రాండ్‌తో మార్కెట్లో మగువలను ఆకట్టుకుంది సిద్దిపేట నేతన్న కళ. దశాబ్దాల క్రితమే అంతరించిన పీతాంబరి పట్టుకు సైతం సిద్దిపేట కళాకారులు మళ్లీ ప్రాణం పోశారు. జకాడ మగ్గంపై వెండి జరీ ఉపయోగించి నేయటం పీతాంబరం ప్రత్యేకత. చీర అంచులు, డిజైన్లకు ప్రత్యేక పోగులను వాడుతారు. ఈ చీర ధర రూ.30 నుండి రూ.40 వేల వరకు ఉంటుంది. చేనేత కళాకారులు తమ మేథోసంపత్తితో రూపొందిస్తున్న ఇలాంటి చీరల డిజైన్లకు.. చేనేత రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయలేని వైఫల్యంతో, కొందరు వారం వ్యవధిలో నకళ్లు తయారు చేస్తున్నారు. పవర్‌లూమ్స్‌పై ప్రింట్ చేసి చేనేత బ్రాండ్‌గా తక్కువ ధరలతో మార్కెట్లోకి వదులుతున్నారు. ఈ ప్రింటెడ్ చీరలతో పోటీ పడలేక నేత చీర చతికిల పడుతోంది. దీనికి తోడు పోటీ ప్రపంచంలో మారుతున్న అభిరుచులకు అనుగుణంగా డిజైన్లు రూపొందించే శక్తి, సామర్థ్యాలు సహకార సంఘాలు, మాస్టర్ వీవర్లకు ఉండటం లేదు. మరోవైపు తమదైన శైలిలో రూపొందించిన వస్త్రాలను మార్కెట్ చేసుకోవటంలో వారు విఫలమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొద్దిమేర వస్త్ర ఉత్పత్తులు కొనుగోలు చేయడంతో పాటు కార్మికులకు పొదుపు, భద్రతా పథకం అమలు చేస్తూ రసాయనాలపై సబ్సిడీలు ఇస్తున్నా అవి ఏ మూలకు సరిపోవడం లేదు. పోటీని తట్టుకునేలా పాతవారితో పాటు కొత్త తరం వారికి తగిన శిక్షణ ఇవ్వడంతో పాటు, అంతరించే పోయే పరిస్థితుల్లో ఉన్న కళలను కాపాడేలా అనేక రూపాల్లో మరిన్ని ప్రోత్సాహకాలు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కింకర్తవ్యం ఏమిటి? ►ఐదేళ్లుగా ఎన్నికలు లేని, ఐదు మాసాలుగా కొనుగోళ్లు చేయని చేనేత సహకార సంఘాలన్నింటిలో కార్యాచరణ ప్రారంభించి రాజకీయాలకు సంబంధం లేకుండా మగ్గం నేసే వారికి సభ్యత్వం ఇవ్వాలి. సహకార సంఘాలకు కార్పొరేట్ హంగులద్ది ప్రతి నెలా తప్పనిసరిగా వస్త్రాలను కొనుగోలు చేయాలి ►మాస్టర్ వీవర్లకు ఆర్థిక పరిపుష్టినిచ్చేలా ప్యాకేజీలు ప్రకటించాలి. పరిశోధన, అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలి. ►నూలు, రంగులు, రసాయనాలపై ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీని పెంచాలి. మాల్స్, షాపింగ్ కాంప్లెక్సుల్లో చేనేత షోరూమ్‌లను తప్పనిసరి చేయాలి. ►ఇళ్లల్లో మగ్గం నేసే కార్మికులకు గృహ విద్యుత్ వినియోగంలో సబ్సిడీ ఇవ్వాలి. చేనేత బీమా వయో పరిమితి పెంచాలి. ►చేనేత వస్త్ర ఉత్పత్తులన్నింటిపై నకిలీకి తావులేకుండా ప్రత్యేక హోలోగ్రామ్ ముద్రించాలి. 1985 చేనేత రిజర్వేషన్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. ►ప్రస్తుతం చేష్టలుడిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎన్ఫోర్స్మెంట్ను పటిష్టం చేసి నకిలీ ఉత్పత్తులు అమ్ముతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ►అన్ని రకాల చేనేత వస్త్రాలపై జీఎస్టీని తొలగించాలి. చేనేత వస్త్రాలు ఆరోగ్యానికి మంచిదని, తెలంగాణ ఖ్యాతికి నిదర్శనమనే ప్రచారాన్ని విస్తృతంగా చేయాలి. ►ప్రభుత్వం ఇస్తున్న కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కానుకల్లో చేనేత పట్టుచీర, ధోవతిని చేర్చాలి. బతుకమ్మ చీరల్లోనూ కొంత వాటా చేనేతకు కేటాయించాలి. రిజర్వేషన్ చట్టం ఏం చెబుతోంది చేనేత రిజర్వేన్ చట్టం 1985 ప్రకారం.. 11 రకాల ఉత్పత్తులు..అంటే కాటన్.. పట్టు చీరలు, ధోతి, టవల్స్, లుంగీలు, బెడ్‌షీట్స్, జంపఖానాలు, డ్రెస్ మెటీరియల్, బ్యారక్ బ్లాంకెట్స్, ఉన్ని శాలువలు, మఫ్లర్లు, చద్దర్లు పూర్తిగా చేనేత (కొన్ని మినహాయింపులతో) ద్వారానే ఉత్పత్తి చేయాలి. పవర్‌లూమ్స్ నిబంధనలు ఉల్లంఘించి ఉత్పత్తి, విక్రయాలు చేస్తే.. క్రిమినల్ చర్యలు చేపట్టి జరిమానాతో పాటు జైలుశిక్ష సైతం విధించవచ్చు. సంఘం సామగ్రి, పని ఇవ్వడం లేదు నేను చేనేత సహకార సంఘంలో ఎప్పటి నుండో సభ్యుడిని. కానీ సంఘం.. సామగ్రి, పని ఇవ్వడం లేదు. నాకు నేత తప్ప మరో పని రాదు. అందుకే ఓ మాస్టర్ వీవర్ వద్ద కూలీ పని చేస్తున్న. పోచంపల్లి నేత ఖ్యాతి క్రమంగా మసకబారుతోంది. కొత్తతరం రావడం లేదు. కళ్ల ముందే అరుదైన కళ కనుమరుగవుతుంటే బాధగా ఉంది. –చిట్టి ఐలయ్య, నేత కార్మికుడు, పోచంపల్లి తక్షణ కార్యాచరణ అవసరం చేనేత ఒక వృత్తి కాదు నాగరికత. అందులో పోచంపల్లి చేనేత కళ దేశంలోనే మరీ ప్రత్యేకమైనది. ప్రస్తుత పరిస్థితిలో మార్పు రాకుంటే అతి త్వరలో చేనేత కళ కనుమరుగు కావడం ఖాయం. ముందు తరాలకు అందించడం, మన ప్రత్యేకతను ప్రపంచవ్యాప్తం చేయాలంటే తక్షణ కార్యాచరణ అవసరం. కొత్త టెక్నాలజీ, డిజైన్లు, మార్కెటింగ్ అంశాలపై శిక్షణ ఇవ్వాలి. మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాలి. – చింతకింది మల్లేశం, ఆసు యంత్రం రూపకర్త ఇదే చివరి తరం అనుకుంటున్న చేనేత మాతోనే అంతం అయ్యేలా ఉంది. కొత్త తరం రాకపోతే గొప్ప కళను సమాజం కోల్పోతుంది. పొద్దంతా చీర నేస్తే రోజుకు రూ.200 నుంచి రూ.220 కూలీయే లభిస్తోంది. ఏదైనా షాప్‌లో పనికి వెళ్తే కనీసం రోజుకు రూ 300 ఇస్తున్నారు. నేను 53 ఏళ్లుగా మగ్గం నేస్తున్నా. వేరే పనికి వెళ్లలేక ఈ వృత్తిలో కొనసాగుతున్న. నాకు ఇప్పుడు 65 ఏళ్లు.. ప్రభుత్వం అమలు చేస్తున్న చేనేత బీమా వర్తించడం లేదు. చేనేత బీమాకు వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ అమలు చేయాలి. – గంజి లింగం, లింగారెడ్డిపల్లి, సిద్దిపేట పీతాంబరానికి ‘ప్రాణం’ పోశారు తుమ్మ గాలయ్య సిద్దిపేటకు చెందిన చేనేత కార్మికుడు. అధికారులు చెప్పారని కనుమరుగైన పీతాంబరం పట్టు చీరకు పునర్వైభవం తెచ్చే దిశగా కృషి చేశాడు. ఇతర నేత కార్మికులతో కలిసి అనేక వ్యయ ప్రయాసలతో 270 వరకు పీతాంబరం పట్టు చీరలు నేశాడు. ప్రభుత్వం, టీఎస్సీఓ 60 చీరలను కొనుగోలు చేయగా మరో 60 వరకు చీరలు ప్రైవేటులో విక్రయించాడు. అయితే తగిన ప్రచారం లేకపోవడంతో పూర్తిస్థాయిలో చీరలు అమ్మలేకపోయాడు. ఇంకా 150 చీరల వరకు స్టాక్ ఉంది. భారీ పెట్టుబడితో నేసిన వస్త్రాల నిల్వ చూస్తుంటే నిద్ర పట్టడం లేదని, ప్రభుత్వం స్పందించి త్వరగా కొనుగోలు చేయకపోతే, భవిష్యత్తులో పీతాంబరం వెరైటీని తీసుకురాలేమని అంటున్నాడు. – తుమ్మ గాలయ్య, చేనేత కార్మికుడు, సిద్దిపేట పోచంపల్లికి.. కొత్త హంగులద్దాలని ఉంది ప్రపంచ ఖ్యాతి ఉన్న పోచంపల్లి చేనేతకు కొత్తహంగులు అద్దాలని ఉంది. అనేక ఉన్నత ఉద్యోగాలను వదులుకుని చేనేత పనినే ఎంచుకున్నా. సొంత ఖర్చులతో అనేక ప్రయోగాలు, కొత్త డిజైన్లు రూపొందించి మార్కెట్ చేస్తున్నా. అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రభుత్వానికి చేనేతను బతికించే ప్రతిపాదన ఇచ్చా.. ఏమవుతుందో చూడాలి. –సాయిని భరత్, పీహెచ్డీ స్కాలర్, పోచంపల్లి నావంతుగా.. నా నియోజకవర్గంలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కానుకలతో పాటు నా వంతుగా వధూవరులకు పోచంపల్లి చేనేత పట్టుచీర, జాకెట్, పంచె, టవల్ సొంత ఖర్చులతో ఇస్తున్నా. నేతన్నను ప్రోత్సహించే దిశగా నా వంతు ప్రయత్నం ఇది. – పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి -
చేనేత రంగానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి
న్యూఢిల్లీ: చేనేత రంగానికి వెంటనే ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటించి సంక్షోభం నుంచి గట్టెక్కించాలని ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ రాజ్యజభ సభ్యులు విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో శుక్రవారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. దేశంలో దాదాపు 31 లక్షల కుటుంబాలు చేనేత రంగం ద్వారా జీవనోపాధిని పొందుతున్నాయి. చేనేత రంగంపై ఆధారపడిన కుటుంబాల్లో 87 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ రంగంలో పని చేస్తున్న వారిలో 72 శాతం మహిలే. చేనేత కార్మికులలో 68 శాతం వెనుకబడిన కులాలు, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వారున్నారని విజయసాయి రెడ్డి తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా చేనేత రంగం తీవ్ర ఇక్కట్లకు గురైంది. చేనేత వస్త్రాలకు డిమాండ్ పడిపోయింది. అమ్మకాలు జరగకపోవడంతో చేనేత వస్త్రాల నిల్వలు పేరుకుపోయాయి. ఫలితంగా ఉత్పత్తి నిలిచిపోయింది. చేనేత కార్మికులపై దీని ప్రభావం తీవ్రంగా పడింది. చేసేందుకు పనిలేక చేనేత కార్మికులు కుటుంబాలను పోషించలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నారని విజయసాయి రెడ్డి వివరించారు. చదవండి: (కాంగ్రెస్ వల్లే నేను రాజ్యసభకు రాగలిగాను: విజయసాయిరెడ్డి ఛలోక్తి) చేనేత రంగం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని ఆయన చెప్పారు. మొదటిది మార్చి 2020 నుంచి జనవరి 2022 మధ్యలో పత్తి, పట్టు నూలు ధరలు 69 శాతం పెరిగిపోయాయి. నూలు అందుబాటు ధరలకు లభ్యం కానందున చేనేత రంగం ఆర్థికంగా గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది. రెండోది.. కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసిన రెండేళ్ల వ్యవధిలో పేద, బడుగు వర్గాలకు చెందిన చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం ఎలాంటి సామాజిక భద్రత ప్రయోజనాలను అందించలేదని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో చేనేత రంగం పునరుజ్జీవనం కోసం తక్షణం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పత్తి, నూలు వంటి ముడి సరుకులను సబ్సిడీపై అందించడంతోపాటు చేనేత పరిశ్రమ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.25 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించాలి. చేనేత కార్మికులకు సామాజిక భద్రత కల్పించే చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
ఇక్కత్ రుమాలుపై ఇండియా మ్యాప్
భూదాన్‌పోచంపల్లి: ఇక్కత్ వ్రస్తాల తయారీలో వినూత్న ప్రయోగాలు చేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లికి చెందిన చేనేత కళాకారుడు భోగ బాలయ్య తాజాగా మగ్గంపై డబుల్ ఇక్కత్ విధానంలో రుమాలు (స్కార్ప్)పై ఇండియా మ్యాప్ నేసి ఔరా అనిపించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకొని తన దేశభక్తి చాటేందుకు ఆయన ఇండియా మ్యాప్, మధ్యన రాట్నం వచ్చేటట్టుగా స్కార్ప్ నేశారు. ఇందుకోసం మృదువుగా ఉండే ప్రత్యేకమైన నూలును కోయంబత్తూర్ నుంచి తెప్పించారు. అలాగే పర్యావరణ హితమైన ఎకో ఫ్రెండ్లీ వ్యాట్ రంగులను వినియోగించారు. భోగ బాలయ్య తాను నేసిన ఇక్కత్ ఇండియా మ్యాప్ రుమాలు ఫొటోలను పీఎంఓకు, మంత్రి కేటీఆర్‌తో పాటు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. బాలయ్య ఇప్పటికే వినూత్న డిజైన్‌తో ఇక్కత్ చీరను నేసి గత ఏడాది ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ పురస్కారాన్ని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అందుకున్నారు. -
జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్న నేతన్నలు
-
నేతన్న ల కోసం కొత్త టెక్నాలజీని ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా
-
అమెజాన్ ఇండియా కారీగర్ మేళా
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తాజాగా ట్రైబ్స్ ఇండియా సంస్థతో కలిసి కారీగర్ మేళాను ప్రారంభించింది. ఈ ఒప్పందం ప్రకారం సంప్రదాయ గిరిజన ఉత్పత్తులు, భారతీయ హస్తకళల ఉత్పత్తుల కోసం అమెజాన్ తమ పోర్టల్‌లో ప్రత్యేక విభాగాన్ని కేటాయించింది. బిద్రి, ఇక్కత్, పటచిత్ర తదితర సుమారు 1.2 లక్షల పైచిలుకు ఉత్పత్తులు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ కార్యక్రమం కింద ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 12 దాకా రెండు వారాల పాటు కారీగర్ విక్రేతలకు సెల్లింగ్ ఆన్ అమెజాన్ (ఎస్వోఏ) ఫీజు నుంచి 100 శాతం మినహాయింపు లభిస్తుంది. దేశీ చేనేతకారులు, చేతి వృత్తుల కళాకారులు ఈ–కామర్స్ ద్వారా మరింత వృద్ధిలోకి వచ్చేందుకు తోడ్పడేలా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో కలిసి పనిచేయడం కొనసాగిస్తామని అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ తెలిపారు. -
'వైఎస్సార్ నేతన్న నేస్తం' మూడో విడత ఆర్ధిక సాయం
-
నేడు చేనేతలకు ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’
సాక్షి, అమరావతి: కరోనా వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మాటకు కట్టుబడుతూ చేనేత కార్మికులను ఆదుకునేందుకు ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వరుసగా మూడో ఏడాది నేతన్నకు ఆపన్న హస్తం అందించేలా వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం అమలుకు సీఎం జగన్ ఆదేశించారు. ఈ ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం కింద అర్హులైన 80,032 మంది నేతన్నలకు రూ.192.08 కోట్లను సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో కంప్యూటర్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఐదేళ్లలో ప్రతి లబ్ధిదారుడికి రూ.1,20,000 మగ్గం కలిగిన, అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఐదేళ్లలో ప్రతి లబ్ధిదారుడికి రూ.1,20,000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది. ఇప్పటికే 2 విడతల్లో సాయం అందగా తాజాగా మూడో విడత సాయాన్ని అందచేయడం ద్వారా అర్హులైన ప్రతి నేతన్నకు రూ.72,000 చొప్పున ప్రయోజనం చేకూరనుంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నేతన్నలకు ప్రభుత్వం రూ.383.99 కోట్లు అందచేసింది. మంగళవారం మూడో విడత కింద ఇచ్చే రూ.192.08 కోట్లతో కలిపితే నేతన్నలకు రూ.576.07 కోట్ల సాయం అందించినట్లయింది. పారదర్శకంగా అర్హులందరికీ.. దేశ చరిత్రలోనే తొలిసారిగా చేనేత కుటుంబాలకు పారదర్శకంగా లబ్ధి చేకూర్చేలా వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న వెంటనే వలంటీర్ల సహకారంతో నిర్దిష్ట కాలపరిమితితో తనిఖీ పూర్తి చేసి అర్హుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించడం ద్వారా సోషల్ ఆడిట్ చేపట్టింది. ఎక్కడైనా అర్హులకు ప్రభుత్వ పథకాలు ఏ కారణం చేతనైనా అందకపోతే వారికి ఒక నెల రోజుల పాటు గడువిచ్చి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. వెంటనే ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హులైతే సాయం అందేలా చర్యలు చేపట్టింది. ఏ ఒక్క అర్హుడికీ అన్యాయం జరగకూడదనే తపనతో ఆర్థిక సాయం అందించేలా ఏర్పాట్లు చేసింది. ఈ ఆర్థిక సాయాన్ని బ్యాంకులు పాత అప్పుల కింద జమ చేసుకోరాదని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసి నేతన్నలు గౌరవప్రదంగా జీవించేలా ఆపన్న హస్తం అందిస్తోంది. -
గ్రేట్ జర్నీ..పత్తి రైతుల కాగడా..
ఆమె ఓ ఉద్యమజ్యోతి. తాను వెలుగుతూ... పదిమందికి వెలుగులు పంచే కాగడా. ‘ఏ ఫ్రేడ్ హిస్టరీ – ద జర్నీ ఆఫ్ కాటన్ ఇన్ ఇండియా’లో వత్తిలా కాలిపోతున్న పత్తి రైతు జీవితాన్ని రాశారు. ఇంగ్లిష్ లిటరేచర్ చదివిన ఓ యువతి సామాజిక కార్యకర్తగా, మల్కా పరిరక్షకురాలిగా రూపాంతరం చెందడానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తుందా పుస్తకం. డెబ్బై ఐదేళ్లు దాటిన ఉజ్రమ్మ లైఫ్ జర్నీతోపాటు పెట్టుబడిదారుల గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా ఆమె తన ఉద్యమాన్ని మౌనంగా విస్తరింపచేస్తున్న వైనం కనిపిస్తుంది. అభ్యుదయ హైదరాబాదీ ఉజ్రమ్మ హైదరాబాద్‌లో అభ్యుదయ కుటుంబంలో పుట్టారు. నానమ్మ ఉద్యమస్ఫూర్తి వల్ల తమ కుటుంబంలో ఆడపిల్లల చదువుకు మార్గం సుగమమైందని చెప్పారామె. చిన్నాన్న సజ్జత్ జహీర్ కమ్యూనిస్ట్ భావాల ప్రభావం తన మీద ఉందంటారామె. సామాజికాంశాల మీద స్పందించే తత్వం చిన్నాన్న నుంచే వచ్చిందని చెప్పే వజ్రమ్మ ఉద్యమపోరు బ్రిటిష్ కాలంలోనే మొదలైంది. విదేశాల స్పిన్నింగ్ మిల్లులు సూచించిన పత్తి వంగడంతో మనదేశంలో పంట పండించడం మొదలైననాడే ఆమె పత్తి రైతుల ఆత్మహత్యలను ఊహించగలిగారు. ఆ దోపిడీ పత్తితో ఆగదని, దానికి అనుబంధ రంగమైన చేనేతకు కూడా ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. కష్టం మనది... లాభం వాళ్లది ‘‘మనదేశంలో రకరకాల వాతావరణం, భౌగోళిక వైవిధ్యతల కారణంగా ప్రాంతానికి ఒక రకం పత్తి పండుతుంది. ఆ పత్తి నుంచి వచ్చే దారం, ఆ దారంతో నేసే దుస్తులలోనూ భిన్నత్వం ఉంటుంది. ఇంతటి వైవిధ్యతను కాలరాసింది ఒక్క స్పిన్నింగ్ యంత్రం. విదేశాల్లో ఏర్పాటైన వస్త్ర పరిశ్రమలకు ముడిసరుకు కావాలి. ఆ ముడిసరుకు వాళ్లు తయారు చేసుకున్న యంత్రాలకు అనుగుణంగా ఉండాలి. అందుకోసం మన రైతులకు పత్తి గింజలనిచ్చి... ‘పంట పండించండి, ఉత్పత్తిని మేమే కొంటాం’ అని చెప్పారు. అలా పత్తి గింజ వాళ్లదైంది, దారం వాళ్లదే అయింది. దారం ధరను నిర్ణయించే అధికారమూ వాళ్లదే అయింది. దాంతో చేనేత రంగం ముడిసరుకు సమస్యలో పడిపోయింది. మనది కాని వంగడం తో తెగుళ్లు ఎక్కువ. దాంతో పత్తిని పండించే రైతు బతుకుకు లాభాలు వస్తాయనే భరోసా లేదు. దారం ధర నిర్ణయించేది వాళ్లే... దాంతో చేనేత మగ్గం అంధకారంలో మగ్గిపోయింది. లాభాలు మాత్రం స్పిన్నింగ్ మిల్లులవి. లాభాలను బట్టే సమాజంలో గౌరవాల స్థాయిలో కూడా ఎంతో తేడా. పత్తి రైతు, చేనేతకారుడు ఈ విషవలయం నుంచి బయటపడి ఆర్థికంగా బలపడాలి. దేశంలో అనేక ప్రాంతాల్లో పత్తి రైతులను, చేనేత పరిశ్రమలను స్వయంగా చూశాను. చేనేతకారులు తమ ఉత్పత్తులు మార్కెట్ చేసుకోవడానికి ‘దస్తకార్ ఆంధ్ర’ రూపకల్పనలో పనిచేశాను. పదమూడేళ్లు గా మల్కా పరిరక్షణ మీద దృష్టి పెట్టాను. మల్కా అంటే ఖాదీ వంటి ఒక వస్త్ర విశేషం. ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా ఉండదు. సిరిసిల్లలో డెబ్బై కుటుంబాలు మల్కా పరిరక్షణలో పని చేస్తున్నాయి. యూరప్, యూఎస్‌లు తాము అనుసరిస్తున్న సైన్స్‌కి మోడరన్ సైన్స్ అని ఒక ముద్ర వేసుకుని, థర్డ్ వరల్డ్ కంట్రీస్‌ని తమ గుత్తాధిపత్యంలోకి తెచ్చుకోవడానికి కుట్ర పన్నాయి. మన యువతకు చెప్పేది ఒక్కటే. విదేశాల మీద ఆధారపడే పరిస్థితి నుంచి మనం బయట పడాలి. మన పత్తి నుంచి దారం తీయడానికి అధునాతన యంత్రాలను కనిపెట్టండి. మన పత్తి, మన దారం, మన నేత... వీటన్నింటికీ మనమే ధర నిర్ణయించగలిగిన వాళ్లమవుతాం’’ అంటారామె. సెలబ్రిటీల సెలబ్రిటీ ఉజ్రమ్మ నిరాడంబరంగా ఉంటారు. సెలబ్రిటీలు ఆమెతో ఫొటో తీసుకోవాలని ముచ్చటపడతారు. చేనేత అనగానే ముఖం చిట్లించే వారి చేత ‘ఐ లైక్ హ్యాండ్ వీవెన్ ఇండియన్ కాటన్’ అని స్టైలిష్‌గా పలికిస్తున్నారామె. పత్తి రైతు బతుకుకు కొరివి పెడుతున్న కంపెనీల బారి నుంచి రైతు జీవితానికి కాగడా పట్టే ప్రయత్నం చేస్తున్నారు. తన ఉద్యమానికి వారసులుగా కొత్తతరం చేనేతకారులను తయారు చేస్తున్నారు. వారి కోసం మెహిదీపట్నంలో మల్కా మార్కెటింగ్ ట్రస్ట్ ద్వారా మార్కెటింగ్ మెళకువలు నేర్పిస్తున్నారు ఉజ్రమ్మ. – వాకా మంజులారెడ్డి -
28 ఏళ్ల శ్రమ: ఇది ఆడవాళ్ల ప్రపంచం
‘ఇది మగవాళ్ల సామ్రాజ్యం’ అనే కనిపించని సరిహద్దు రేఖ ఒకటి ఉంటూనే ఉంటుంది. ఆ సరిహద్దు రేఖను చెరిపి వేయడానికి ఆడవాళ్లు నిత్యం శ్రమిస్తూనే ఉన్నారు. ఇప్పుడు... చేనేత మహిళలు మగ్గం సాక్షిగా ఇది ఆడవాళ్ల ప్రపంచం కూడా అని నిరూపిస్తున్నారు. అయితే... వాళ్లు చేస్తున్నది రికార్డు కోసం కాదు... పురస్కారాల కోసమూ కాదు. దారం మెడకు ఉరితాడవుతున్న మగవాళ్లు ఇతర రంగాలను వెతుక్కుంటున్నారు. ఆ... కష్టకాలంలో మహిళలు మగ్గాన్ని అందుకున్నారు.. దారంతో జీవితాలను అల్లుకుంటున్నారు. అది హైదరాబాద్ నగరం బంజారాహిల్స్‌లోని సీసీటీ (క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ) భవనం. అందులో ఒక మహిళ మగ్గం మీద జామ్దానీ చీరను నేస్తోంది. ఆమె పేరు జనగం కృష్ణవేణి. శ్రీకాకుళం జిల్లా, రాజాం మండలంలోని బొద్దాం గ్రామం నుంచి వచ్చిందామె. ఆమె నేస్తున్న మగ్గం మీద నిలువుదారాల కింద ఒక పేపర్ ఉంది. అందులో ఉన్న డిజైన్ని చూస్తూ రంగుల దారాలను కలుపుతోందామె. మధ్యలో కండెతో అటు నుంచి ఇటు తీస్తూ అడ్డం దారాన్ని జత చేస్తోంది. క్రమంగా డిజైన్ ఒక్కో వరుసనూ పూర్తి చేసుకుంటూ పూర్తి రూపం సంతరించుకుంటోంది. నేత మీద డిజైన్ ఒక లైన్ కూడా పక్కకు పోవడం లేదు. పూల రెక్కలు, ఆకులు, తీగలు అన్నీ... పేపర్ మీద గీసినంత నైపుణ్యంగా నేత లో ఒదిగిపోతూ చీర మీద ప్రత్యక్షమవుతున్నాయి. కృష్ణవేణికి ఈ పనిలో పదిహేనేళ్ల అనుభవం ఉంది. గ్రామాల్లో ఇలాంటి ఎందరో చేనేతకారులున్నారు. ఒకప్పుడు మగ్గం మీద మగవాళ్లు మాత్రమే పని చేసేవాళ్లు. ఇప్పుడిది ఆడవాళ్ల రంగమైంది. తెలంగాణ హస్తకళా ప్రదర్శనల కుడ్యం, ప్రఖ్యాత హ్యాండ్లూమ్ డ్రెస్ డిజైనర్ గౌరంగ్ షా రూపొందించిన ఫ్యూజన్ చీరల ప్రదర్శన ఈ మార్పు వెనుక అనేక ఒడిదొడుకులున్నాయి. అష్టకష్టాలున్నాయి. ఆకలి మరణాలున్నాయి. వాటన్నింటికీ ఎదురీది చేనేత ను నిలబెట్టుకుంటున్నారు మహిళలు. చేనేతరంగం కుదేలవుతూ ఉపాధికి భరోసా కలిగించని పరిస్థితుల్లో కుటుంబాలను పోషించుకోవడానికి మగవాళ్లు ఇతర రంగాలకు మళ్లుతున్నారు. అలాంటి తరుణంలో మహిళలు మగ్గాన్ని చేతబూనారు. ఒకప్పుడు చేనేత సామాజిక వర్గానికే పరిమితమైన నేత పనిలో అందరూ భాగస్వాములవుతున్నారు. కూరగాయలమ్ముకునే వాళ్లు, ఇతర వ్యవసాయ పనులు చేసుకునే మహిళలు కూడా చేనేతలో శిక్షణ తీసుకుని పూర్తిస్థాయి నేతకారులుగా మారినట్లు చెప్పారు కృష్ణవేణి. ఇంటిపట్టున ఉండి ఈ పని చేసుకుంటూ నెలకు పది వేల వరకు సంపాదించుకోగలుగుతున్నట్లు చెప్పారామె. ‘‘ఇద్దరు మహిళలు మూడు నెలలపాటు మగ్గం మీద కష్టపడితే ఇక్కడ మీరు చూస్తున్న ఒక చీర తయారవుతుంది. చీర డిజైనింగ్, రంగుల తయారీ వంటివేవీ కాకుండా మగ్గం మీద పనికి పట్టే సమయం అది. కొన్ని ఇళ్లలో మగవాళ్లు కూడా ఈ పని చేస్తున్నారు. కానీ తక్కువ. మాలాంటి ఎందరో నేసిన అందమైన చీరలను మధ్య దళారులు, హోల్‌సేల్ వ్యాపారులు తీసుకెళ్లి నగరాల్లో అమ్ముకునే వాళ్లు. ఇప్పుడు మాలాంటి వాళ్లకు కూడా ఈ మహా నగరంలో మా ఉత్పత్తులను ప్రదర్శించుకునే వెసులుబాటు వచ్చింది. మా దగ్గర ఉన్న మెటీరియల్‌ను బట్టి రోజుల లెక్కన ఎన్ని రోజులు కావాలంటే అంతవరకే ఇక్కడ స్థలాన్ని అద్దెకు తీసుకోవచ్చు. మా చేనేతలే కాదు, హస్తకళాకృతుల తయారీదారులందరూ దీనిని ఉపయోగించుకోవచ్చు. మనదగ్గర కళలకు కొదవేముంది నిర్మల్ బొమ్మలు, చేర్యాల పెయింటింగులు, పెంబర్తి లోహపు విగ్రహాలు, శిల్పకళాకృతులకు నెలవు. మాలాగ వీటి తయారీలో కష్టపడిన వాళ్లందరూ మా వస్తువులను కొనేవాళ్లను నేరుగా చూస్తాం. వీటిని తయారు చేసింది మేమేనని గర్వంగా చెప్పుకుంటాం’’ అని కృష్ణవేణి సంతోషంగా చెప్పింది. 28 ఏళ్ల శ్రమ ఈ నెల ఎనిమిద తేదీన ప్రారంభమైన సీసీటీ భవనం వెనుక కూడా మహిళల శ్రమ దాగి ఉంది. ఒక కళ కలకాలం మనుగడ సాగించాలంటే... ప్రజాదరణ ఉండాలి. మన దగ్గర కూచిపూడి, భరత నాట్యం, నాటకం, సంగీత కచేరీలకు మంచి వేదికలున్నాయి. కానీ హస్తకళాకృతుల ప్రదర్శనకు మాత్రం ప్రభుత్వం తరఫున వేదికలు లేవు. ఉన్న వేదికలు కూడా ఏ ఆరు నెలలకో ఒక ఎగ్జిబిషన్ నిర్వహించి సరిపెడుతుంటాయి. ఈ లోటును భర్తీ చేయడమే తమ ఉద్దేశమని తెలియచేశారు సీసీటీ నిర్వహకులు ఉషా సర్వారాయలు, మీనా అప్నేందర్. ‘ఇది కేవలం క్రాఫ్ట్‌మెన్ సంక్షేమం కోసమేనని, ‘సీసీటీ స్పేసెస్’ పేరుతో సీసీటీలో స్థలానికి రోజుల చొప్పున నామమాత్రపు అద్దె చెల్లించి తమ ఉత్పత్తులను ప్రదర్శించుకోవచ్చని చెప్పారు మీనా. ‘‘కళ కాలంతో పాటు మరిన్ని మెరుగులు దిద్దుకుంటూ ఒక తరం నుంచి మరొక తరానికి కొనసాగుతూ ఉండాలి. కళకు, కళాకృతులకు ఆదరణ తగ్గే కొద్దీ కళాకారులు ఇతర ఉపాధి మార్గాల్లోకి మారిపోతుంటారు. ఇదే కొనసాగితే కళ అంతరించిపోతుంది. ఆ ప్రమాదం నుంచి హస్తకళాకృతులను రక్షించడం కోసం ఇరవై ఎనిమిదేళ్లుగా శ్రమించి ఈ భవనాన్ని నిర్మించగలిగాం. ఇది మన సంప్రదాయ కళలను సంరక్షించుకోవడం కోసం స్వచ్ఛందం గా ఏర్పాటు చేసుకున్న సంస్థ. జాతీయ స్థాయిలో ‘క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (సీసీఐ)’ ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సీసీఐ రూపొందించిన నియమావళికి అనుగుణంగా హైదరాబాద్‌లో ‘క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ’ స్వతంత్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది’’అని చెప్పారు ఉష, మీనా. సీసీటీ లో తొలి ప్రదర్శన ప్రఖ్యాత డ్రెస్ డిజైనర్ గౌరంగ్‌షా ఏర్పాటు చేశారు. ఈ నెల 13 వరకు కొనసాగే గౌరంగ్ వీవింగ్ మ్యూజియమ్‌లో శ్రీకాకుళం జామ్దానీ, ఔరంగాబాద్ పైథానీ, ఒరిస్సా ఇకత్, కోట నెట్, ధకాయ్ త్రీ హండ్రెడ్ కౌంట్, కశ్మీరీ తాపెస్ట్రీ వస్త్ర విశేషాలున్నాయి. రవివర్మ చిత్రాలను జామ్దాని నేతలో చేసిన ప్రయోగాలున్నాయి. వీటితోపాటు రెండు –మూడు రాష్ట్రాల చేనేత ప్రత్యేకతలను ఒక చీరలో తీసుకురావడం వంటి అనేక ప్రయోగాలకు ప్రతీక ఈ వీవింగ్ మ్యూజియమ్. –వాకా మంజులారెడ్డి -
‘జగనన్న సారథ్యంలో చేనేతకు పునరుజ్జీవం’
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో చేనేతకు పునరుజ్జీవం వచ్చిందని వైఎస్సార్సీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులు చిల్లపల్లి మోహనరావు స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా ప్రాభవం కోల్పోయిన చేనేతకు సీఎం జగన్ ఎంతో చేయూతను అందించారన్నారు. ఈరోజు(ఆగస్టు7) చేనేత దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘ఎన్నికల ముందు చేనేత వర్గాలకు ఇచ్చిన హామీలన్నింటిని సీఎం జగన్ అమలు చేశారు.మగ్గం వున్న ప్రతి చేనేత కార్మికుడికి వైఎస్ఆర్ నేతన్న నేస్తం పేరిట ఏటా రూ.24 వేలు ఇస్తున్నారు. గత డిసెంబరులో తొలి విడత నేతన్న నేస్తం పంపిణీ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆర్నెల్లు ముందుగానే రెండో విడత నేతన్న నేస్తం పంపిణీ చేశారు. ఆప్కోకు పెండింగ్ బకాయిలను విడుదల చేసి చేనేత రంగంపై చిత్తశుద్ధిని సీఎం జగన్ చాటుకున్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికీ మాస్కుల పంపిణీ ద్వారా ఆప్కోకు నేతన్నలకు ఎంతగానో ప్రయోజనం చేకూరింది’ అని తెలిపారు. -
సిరిసిల్ల నేతన్న ఔదార్యం.. సామాజిక రుగ్మతలపై పోరాటం
సిరిసిల్లటౌన్: ‘మాయమై పోతున్నడమ్మా మనిషన్న వాడు..మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్న వాడు..అనే పాటను మరిపించేలా చిలుక నారాయణ అందిస్తున్న సేవ దు:ఖంలో ఉన్న అద్దె ఇంటివాసులకు ఎంతో ఊరట కలిగిస్తోంది. మానేరు తీరాన సామాజిక ‘విడిది’ భవనం ఏర్పాటు చేసి మానవత్వానికి ఊపిరిపోస్తున్నారు. అద్దె ఇంట్లో ఉంటున్న వారిలో ఎవరైనా చనిపోతే రోడ్డుపై శవజాగరణకు ఎలాంటి అవకాశం లేకుండా ఉండేందుకు ఏడు గదులు నిర్మించి దిక్కులేని వారికి ఆశ్రయం కల్పించేందుకు మానవాతావాది చూపిన మార్గం మనసు లేని కర్కోటకులకు సైతం కనువిప్పు కలిగించిక మానదు. సాక్షి, కరీంనగర్: సామాజిక రుగ్మతపై స్పందన.. కార్మికక్షేత్రం సిరిసిల్లలో నిరుపేద నేతకార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. పట్టణ జనాభాలో సుమారు 80శాతం పద్మశాలి సామాజిక వర్గానిదే ఉంటుంది. మిగతా కులాల్లో కూడా బీసీలదే అధిక జనాభా. అందుకే ఇక్కడ ఆర్థికలేమితో ఉండేవారి సంఖ్య అధికం. చాలా మంది ఇరుకు గదుల్లో అద్దెకు ఉంటూ..కుటుంబాలను నెట్టుకొచ్చేవారే. అయితే పట్టణంలో సామాజిక మూఢాచారాలు ఎక్కువ. ఎవరైనా అద్దె ఇంట్లో ఉండేవారు చనిపోతే..శవాన్ని ఇంటికి తీసుకు రానివ్వరు. పైగా..నెలపాటు శూదకం పేరుతో ఇంట్లోకి రావొద్దనే కట్టుబాటు నడుస్తోంది. భక్తి ప్రపత్తులు పెరుగుతున్న ఈ రోజుల్లో ఇటువంటి సామాజిక మూఢాచారం ఎక్కువైంది. గడిచిన మూడేళ్లుగా ఒక్క సిరిసిల్ల పట్టణంలోనే 100 మందికిపైగా అద్దె జీవులు చనిపోతే రోడ్డుపై శవజాగరణ చేసిన సంఘటనలున్నాయి. వీటిపై ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోతోంది. కొంతమంది మానవతావాదులు ఈ దురాచారానికి స్వస్తి పలకాలని కోరుకుంటున్నా..ఆచరణలో ముందుకుసాగడం లేదు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ కౌన్సిలర్ చిలుక నారాయణ మాత్రం సామాజిక దురాచారంపై యుద్ధాన్ని ప్రకటించారు. మానేరు శివారులో రూ.5 లక్షలు వెచ్చించి 7 గదులతో ఒక ఇంటిని నిర్మించారు. అద్దె ఇంట్లో ఉంటూ ఎవరైనా చనిపోతే ఇంట్లోకి రానివ్వని వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. మానవత్వానికి నిలయం.. సిరిసిల్ల నెహ్రూనగర్ మానేరు నది తీరాన ఉన్న సామాజిక నివాసం మానవత్వానికి నిలయంగా నిలుస్తోంది. మున్సిపల్ వారు కట్టించిన ఆధునిక వైకుంఠథామం(శ్మశాన వాటిక)కు కొద్ది దూరంలోనే ఇది ఉండడంతో ఆప్తులను కోల్పోయి దు:ఖంలో ఉంటూ..అద్దె ఇంట్లోకి వెళ్లలేని వారు ఆశ్రయం పొందుతున్నారు. ఆరునెలలక్రితం దీనిని స్థానిక అంబాభవాని ఆలయం చైర్మన్ చిలుక నారాయణ సొంత ఖర్చులతో నిర్మించి అందులో ఏడు కుటుంబాలు ఆశ్రయం పొందేలా వసతులు కల్పించారు. ఇప్పటికీ శవ జాగరణ చేసిన సుమారు 30 కుటుంబాలు ఇందులో ఆశ్రయం పొంది చనిపోయిన తమ పెద్దలకు అంత్యక్రియలు జరిపించుకున్నారు. వస్త్రోత్పత్తి ఖిల్లాగా పేరొందిన సిరిసిల్లలో అత్యవసర పరిస్థితుల్లో ఆశ్రయం ఇచ్చేవారు కొలువైన తరుణంలో ఈ విడిదిని ఏర్పాటు చేయడం మానవత్వాన్ని ప్రతిబింబిస్తోంది. అయిన వారిని పోగొట్టుకుని అద్దె ఇళ్లలో అవస్థలు పడుతున్న నిరుపేదలు ఆశ్రయం పొందుతుండగా, దూరప్రాంతాల నుంచి వచ్చి రోకడ (రోజువారి) నేత కార్మికులకు కూడా రాత్రి పూట ఉచితంగా బసను కల్పించడం విశేషం. మాలాంటి వారికి తోడ్పాటు మనిషిని మనిషి ఈసడించుకుంటున్న ఈరోజుల్లో ఐనవారిని తలపించేలా..ఇక్కడ సోషల్ హోం నడిపించడం మాలాంటోళ్లకు కలిసొస్తుంది. మా తండ్రి వడ్నాల మల్లేశం(85) నేతకార్మికుడు. అమ్మ కళావతి 30 ఏళ్ల క్రితమే పక్షవాతంతో చనిపోయింది. నాన్న సిరిసిల్లలో ఉండి సాంచాలు నడిపేవాడు. నేను టీవీ రిపేరర్గా వేములవాడలో భార్య మంజుల, కూతురు లాస్యతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నా. పదిహేనురోజులక్రితం మా నాన్న అనారోగ్యానికి గురైండు. బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టింది. ఆపరేషన్ చేయించాలంటే..రూ.5లక్షలు కావాలన్నారు. ఖరీదైన వైద్యం చేయించలేక సిరిసిల్ల జిల్లాసుపత్రిలో చేర్పించా..ఈనెల 8న చనిపోయిండు. అద్దె ఇంటికి తీసుకెళ్లడం కుదరకపోవడంతో ఆస్పత్రి నుంచి నేరుగా శ్మశానానికి తీసుకొచ్చి అంత్యక్రియలు జరిపిన. తెలిసినవారు చెబితే కుటుంబంతోపాటు ఇక్కడే ఆశ్రయం పొందుతూ..నాన్నకు ఖర్మకాండలు జరిపిస్తున్న. వడ్నాల సదానందం కుటుంబ సభ్యులు కార్మికుల కష్టాలు చూసే.. నేను సాంచాలు నడిపిన. బీడీ టేకేదారుగా పని చేస్తా. అందుకే నాకు నేతకార్మికులు, బీడీ కార్మికుల కష్టాలు పూర్తిగా తెలుసు. సిరిసిల్ల పట్టణంలో అద్దె ఇళ్లలో ఉండేవారు చనిపోతే జరుగుతున్న సంగతులు ఇటీవలే ’పేపర్లో’ చూసి మనసుకు బాధనిపించింది. అందుకే నా సొంత డబ్బుతో ఏడు గదులతో ఇక్కడ ఇల్లు కట్టించిన. రెండు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు, అంబాభవాని ఆలయం నుంచి బోరు కనెక్షన్ కల్పించిన. విద్యుత్ కనెక్షన్ ఇతర వసతులు కల్పించిన. రోకడ కార్మికులు కూడా ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. సొంతిల్లు ఉంటే..బాధలుండవు.. సొంతిల్లు ఉంటే..మాలాగా అయిన వారిని పోగొట్టుకున్న సమయాల్లో శవాలతో రోడ్డుపై, శ్మశానంలో జాగారం చేసే బాధలుండవు. మాది సిరిసిల్ల శివారులోని ముష్టిపల్లి. నా భార్య భాగ్య, పిల్లలు సిద్దార్థ, లవన్తో కలిసి ఉంటున్న. ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న నాకు చిన్నప్పుడే అమ్మానాన్నలు చనిపోయారు. అప్పట్నుంచి నానమ్మ కుసుమ రుక్కవ్వ (62) సాకి పెద్ద చేసింది. 15రోజులక్రితం పక్షవాతం వచ్చింది. ఇంటోళ్లు చనిపోతదని వేరు ఇల్లు చూసుకోమన్నరు. దీంతో ఖరీదైన వైద్యం చేయించలేని స్థితిలో ఈనెల 16న జిల్లాసుపత్రిలో చేర్పించగా..తెల్లారి చనిపోయింది. అమ్మానాన్నలు కూడా ఆర్థిక ఇబ్బందులతోనే చనిపోయారు. నేనే చదువుకోలేక చిన్నప్పట్నుంచి పనులు చేసుకుంటూ..చెల్లి పెళ్లి చేసిన. ఇప్పుడు పెద్దదిక్కు నానమ్మ చనిపోయింది. ఆమె ఆత్మశాంతి కలిగేలా అంత్యక్రియలు కూడా చేయలేని స్థితిలో ఉన్న మాకు ఇక్కడున్న సోషల్ హోం ఆశ్రయం కల్పించినందుకు కృతజ్ఞతలు. కుసుమ వెంకటేశ్ కొడుకున్నా..ఏకాకి జీవితం.. మేము దత్తోజిపల్లె నుంచి యాభై ఏళ్ల కింద సిరిసిల్లకు బతుకొచ్చినం. మా ఆయన ఇస్తారి(65) చేనేత కార్మికుడు. నేను బీడీలు చేస్తూ..కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాళ్లం. ఇంట్లో ఆయనకు ఎప్పుడూ..అనారోగ్యంతో ఉండేవాడు. మాకున్న ఆస్తులు, నగలు అన్నీ అమ్మిన. కొడుకు జితేందర్ 25 ఏండ్లు ఉంటాడు. మాకున్న ఆస్తులు పోవడంతో మమ్మల్ని వదిలి ఎక్కడికో వెళ్లిపోయిండు. వాడిజాడకై వెతికినా..ఫలితం లేదు. ఈయనకేమో ఆర్నెల్ల నుంచి మంచంమీదే అన్ని సేవలు చేసిన. కొడుకు వస్తడని దేవున్ని మొక్కినా..దయతల్చలేదు. చాలా రోజులుగా ఇద్దరికీ పని లేకుండా ఉంటున్నాం. నాకు బీడీ పెన్షన్, ఆయనకు వృధ్యాప్య పింఛన్ ఇవ్వాల్సి ఉన్నా..అధికారులు ఎవ్వరూ..ఇవ్వడం లేదు. ఇప్పుడు నేను ఏకాకినైన. ఏం పని చేసుకుంటూ..బతకాలి. నిలువ నీడలేని ఆడబతుకు ఇది. సర్కారు దయచూపాలి. ఇక మాఆయన చనిపోయినప్పుడు జాయింట్ కలెక్టరమ్మకు మొరపెట్టుకున్న. రూ.5వేలు ఇచ్చింది. కొందరు మనసున్నోల్లు కలిసొచ్చి అంత్యక్రియలు చేయించిండ్రు. ఇప్పుడు నేనొక్కదాన్నే ఇక్కడ తలదాచుకుంటున్న. చిలుక నారాయణ మాలాంటోళ్లకు మంచి సౌలతి కలిపించిండు. వేముల మణెవ్వ -
నేతన్ననేస్తంతో ఎంతో ప్రయోజనం
ప్రొద్దుటూరు : ‘నియోజకవర్గంలో చేనేత కార్మికుల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి? వారి పరిస్థితి ఏమిటి? వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా ఏడాదికి రూ.24 వేలు చొప్పున ఇవ్వబోతున్నాం.. ఈ ఏడాది డిసెంబర్ 21 నుంచి పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డితో అన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం సాయంత్రం 6 గంటలకు ఎమ్మెల్యే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా చర్చించిన అంశాలను ఎమ్మెల్యే ‘సాక్షి’కి వివరించారు. నియోజకవర్గంలో ఎక్కువ మంది చేనేత కార్మికులు ఉండటంతో ప్రత్యేకంగా వారి సంక్షేమం గురించి చర్చించానన్నారు. ప్రొద్దుటూరు పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజి కాలువను మంజూరు చేస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ ఆధునికీకరణకు అడిగిన మేరకు రూ.2 కోట్లు మంజూరు చేయిస్తానని సీఎం చెప్పారన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సంబంధించి రోడ్ల విస్తరణకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించే విషయాన్ని సీఎంకు వివరించానన్నారు. అలాగే రైతు భరోసా పథకం, గ్రామ సచివాలయాల పనితీరు గురించి సీఎం అడిగి తెలుసుకున్నారని తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి పనులతోపాటు తన కుటుంబ యోగక్షేమాల గురించి సీఎం అడిగి తెలుసుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని వివరించారు. ఎమ్మెల్యే రాచమల్లు వెంట వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి, వైఎస్సార్సీపీ నాయకుడు పోతిరెడ్డి మురళీనాథరెడ్డి, పీఈటి కోనేటి సుధాకర్‌రెడ్డి ఉన్నారు. -
జావా నుంచి హైదరాబాద్‌కి...
జీవితంలో ఎన్ని షేడ్స్ ఉంటాయో చేనేతలోనూ అన్ని షేడ్స్ ఉంటాయి. అయితే వాటిని ఒడిసిపట్టే వేళ్లుండాలి. జీవకళను వడకట్టే నేర్పు ఉండాలి. ఆ పట్టు... ఆ నేర్పు చేనేతకారులందరికీ సహజంగా ఉండేదే. కానీ.. బాలమణి సృజనలో ఏదో మంత్రం ఉందనిపిస్తోంది.అది ఆమె నేతలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. ‘‘చేనేతకారుని చేతిలో పని ఉంటుంది. పని మాత్రమే ఉంటే సరిపోదు. సృజనాత్మకత ఉండాలి. సమాజాన్ని అధ్యయనం చేయాలి. తన అవసరం ఎక్కడ ఉందో తెలుసుకుని అక్కడ తన సేవలను అందించగలిగిన సునిశితత్వం కూడా ఉండాలి. ఒక్కమాటలో చెప్పాలంటే... చేతికి అలవడిన పనిని యాంత్రికంగా చేసుకుంటూ పోవడం కాదు. సమాజంలో చేనేత కళను బతికించుకోవాలి. అందుకు చేనేతకారులు తమను తాము మార్చుకుంటూ ఎదగాలి’’ అన్నారు కందగట్ల బాలమణి. ఒకప్పుడు చేనేత వస్త్రాలంటే ముతక వస్త్రాలనే దురభిప్రాయం ఉండేది. అందుకు కారణం అప్పట్లో చేనేత రంగంలో మార్పులు రావాల్సినంత వేగంగా రాకపోవడమే. కొత్త రంగులతో ప్రయోగాలు చేయకుండా సంప్రదాయంగా వస్తున్న కొద్ది రంగులనే వాడడం కూడా. అంతేకాకుండా అది మిల్లులో తయారయ్యే రంగురంగుల వస్త్రాల మీద క్రేజ్ ఉన్న కాలం కూడా. సింథటిక్ వస్త్రాలు సృష్టించిన సునామీని తట్టుకోలేక చేనేత కుటుంబాలు దాదాపుగా రెండు – మూడు తరాలు గడ్డు కాలాన్ని చూశాయి. అలాంటి కష్టకాలంలో కూడా మగ్గాన్ని వదలకుండా ఉన్న వాళ్లు ఇప్పుడు చేనేతలో అద్భుతాలు సృష్టించగలుగుతున్నారు. ఇప్పుడు నూలులో కూడా ఒక్కో రంగులో ఎన్నో షేడ్లు లభిస్తున్నాయి. చేనేత మగ్గం మీద కొత్త కొత్త కలర్ కాంబినేషన్లను ఆవిష్కరిస్తున్నారు. దాంతో మార్కెట్ చక్రం ఇప్పుడు చేనేత చుట్టూ పరిభ్రమిస్తోంది. అందుకు నిదర్శనమే హైదరాబాద్, కార్వాన్‌లోని కందగట్ల బాలమణి విజయప్రస్థానం. కష్టం లేనిదెక్కడ? ‘‘మా నాన్న పుట్టపాక నుంచి హైదరాబాద్‌కి వచ్చి బొగ్గుతో నడిచే లారీకి డ్రైవర్‌గా పనిచేశారు. చేనేత కుటుంబం నుంచి బయటకు వచ్చిన ఆయన డ్రైవింగ్‌ని తన ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు. మమ్మల్ని పెంచడానికి ఆయన పడిన కష్టం చిన్నది కాదు. మా అత్తగారిల్లు మాత్రం మగ్గాన్ని వదిలిపెట్టలేదు. మా మామగారి నాన్నగారు కందగట్ల సాంబయ్య నిజాం పాలన కాలంలో వరంగల్ నుంచి హైదరాబాద్‌కొచ్చి చార్మినార్ దగ్గర సుల్తాన్ షాహిలో ఉండేవారు. సంప్రదాయ చీరలు, పంచెలకే పరిమితం కాకుండా పోలీసులకు పటకా టర్బన్లు నేసేవారాయన. కేడర్‌ను బట్టి తల పాగాలు మారుతుంటాయి. అలాగే పోలీసులు కాళ్లకు మేజోళ్లుగా నూలు వస్త్రాన్ని చుట్టుకునేవాళ్లు. ఆయుధాలను అమర్చుకోవడానికి నడుముకు ఓ వస్త్రాన్ని చుట్టుకునేవారు. మా కుటుంబం వాటిని నేసేది. అప్పటి పోలీస్ పటకా నమూనా శిల్పారామం ఆర్ట్ గ్యాలరీలో ఉందిప్పుడు. జావా నుంచి హైదరాబాద్‌కి అప్పట్లో నిజాంకు వచ్చిన ఓ కొత్త ఆలోచన ఇప్పటికీ హైదరాబాద్‌లో చేనేత రంగానికి పని కల్పిస్తూనే ఉంది. ఇండోనేసియా లోని జావా దీవుల్లో ధరించే లుంగీల మీద హైదరాబాద్ ముస్లింలకు క్రేజ్ ఉండేది. అక్కడ తయారైన లుంగీలు హైదరాబాద్‌కి దిగుమతి అయ్యి సామాన్యుడికి చేరడానికి చాలా ఖర్చయ్యేది. స్థానిక చేనేతకారుల చేత ఆ లుంగీలను నేయించడం అనే ప్రయోగం విజయవంతమైంది. వాళ్లు ఇష్టపడే రంగులు, డిజైన్లను మాకు చేయి తిరిగిన ఇకత్లో తెచ్చారు తాతగారు(మామగారి నాన్న). మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొన్నాళ్లకు నిజాం పాలన రద్దయింది. అప్పుడు హైదరాబాద్‌లో పోలీస్ యూనిఫామ్ కూడా మారిపోయింది. మా కుటుంబానికి కష్టకాలం అది. అప్పటి వరకు పాడి ఆవులాగ ఉపాధినిచ్చిన మగ్గానికి పనులు తగ్గిపోయాయి. అది మా మామగారి తరం. ఆ క్లిష్ట సమయంలో కూడా ఆయన మగ్గాన్ని వదలకపోవడం వల్లనే ఇప్పుడు మా కుటుంబం ఇంతటి గౌరవాలను అందుకోగలుగుతోంది. ఆయన తన జీవితాన్ని మగ్గం మీదనే.. ఏడాదికోసారి రంజాన్ మాసంలో కొనుగోలు చేసే జావా లుంగీలను నేయడంలోనే గడిపారు. కష్టకాలంలో మా అత్తగారు కూలి పనులకు వెళ్లి కుటుంబ భారాన్ని పంచుకున్నారు. సవాళ్లు ఒక్క చేనేతలోనే కాదు, అన్ని వృత్తుల్లోనూ ఉంటాయి. మనం ఎంచుకున్న ఏ పనికైనా మనవంతు సేవను పూర్తిగా అందివ్వాల్సిందే. అందరమూ పనిచేస్తాం నేను, నా భర్త, ఇద్దరు మరుదులు, ఇద్దరు తోడికోడళ్లు, ఆడపడుచు పని చేస్తాం. రోజుకు ఆరు లుంగీలు తయారవుతాయి. ఒక్కో లుంగీకి మాకు 750 రూపాయలు వస్తాయి. షాపుల వాళ్లు వెయ్యికి అమ్ముకుంటారు. వీటితోపాటు డ్రెస్ మెటీరియల్స్... కలంకారీ అద్దకం, బ్లాక్ ప్రింటింగ్ కూడా చేస్తాం. గ్రాడ్యుయేషన్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసి ఒకరి దగ్గర ఉద్యోగం చేస్తే వాళ్లకంటే మంచిగా సంపాదించుకుంటున్నాం. అయితే ఇంట్లో అందరం సమష్టిగా పనులు చేసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. మా ఇంట్లో నడుస్తున్న యూనిట్‌తోపాటు నల్గొండలోని ఒలిగొండలో నాలుగు మగ్గాలకు మెటీరియల్, డిజైన్లు ఇచ్చి పని తీసుకుంటున్నాం. లంగర్‌హౌస్‌లో మహిళల కోసం ట్రైనింగ్ యూనిట్ ప్రారంభించాను. పెద్దగా చదువులు లేక, బయటి పనులకు పోలేక ఇంటికే పరిమితమైన మహిళలు ఎనిమిది మంది నా దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. కులాల గిరిగీతలు వద్దు చేనేత కళ పద్మశాలి కుటుంబాలకే పరిమితం అన్నట్లు ఉండేది. ఆ కులాల గిరిగీతలను చెరిపేయాలనేది నా ఉద్దేశం. ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ నేర్చుకోగలగాలి. మా పిల్లలకు చేనేత నేర్పించాం. ఏ చదువులకు, ఉద్యోగాలకు వెళ్లినా సరే ఇంటిపని వచ్చి ఉండాలని చెప్పి మరీ నేర్పించాం. మా అమ్మాయి అమెరికాలో ఎంబిఏ చేస్తోంది. తోడికోడళ్ల పిల్లల్లో ఒకరు మెడిసిన్, ఒకరు ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారు. వాళ్లకు పని నేర్పించగలిగాం కానీ వాళ్లను మగ్గానికి కట్టేయలేం కదా! అలాంటప్పుడు ఈ కళ అంతరించి పోకుండా ముందు తరాలకు చేరాలంటే ఆసక్తి ఉన్న వాళ్లకు నేర్పించాలనే ఆలోచనతోనే ‘వన విజారద హ్యాండ్లూమ్ యూనిట్’ పేరుతో ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశాను. వన విజారద అంటే ప్రకృతి సిద్ధమైన అందమైన అల్లిక అని అర్థం. కూతురికి నేర్పించరక్కడ ఇకత్లో మనది ఒక శైలి. పోచంపల్లి చేనేతకారులు చేసే చేనేత అది. చీర రెండు వైపులా ఒకటే నునుపుదనం ఉంటుంది. ఉల్టా పల్టా అర్థం కానంత నైపుణ్యంగా ఉంటుంది. ఒరిస్సాలోని సంబల్పూర్ది ఒక శైలి. చీర వెనుకవైపు డిజైన్‌లో ఉపయోగించిన దారాల చివర్లు కనిపిస్తుంటాయి. గుజరాత్ పటోలా చేనేత కూడా ఇకత్లో ఒక వైవిధ్యమైన శైలి. గుజరాత్ ఇకత్ పటోలా పట్టు చీర నేయడానికి రెండేళ్లు పడుతుంది. ధర రెండు లక్షల వరకు ఉంటుంది. సంపన్న కుటుంబాల వాళ్లకు కూతురికి పదేళ్లు ఉండగానే చీర ఆర్డర్ చేస్తారు. అంత గిరాకీ ఉంటుంది. అక్కడ మనం ఊహించని మరో సంగతి ఏమిటంటే.. ఆ చేనేత కుటుంబాల్లో కూతురికి డిజైన్‌లో మెళకువలు నేర్పించరు. ప్రతి కుటుంబమూ ఎన్నో ప్రయోగాలు చేస్తూ తమకంటూ కొన్ని వైవిధ్యమైన డిజైన్లను రూపొందించుకుంటుంది. ఆ డిజైన్లను ఆ కుటుంబపు ఆస్తిగా భావిస్తారు. కూతురికి నేర్పిస్తే ఆ డిజైన్ ఇల్లు దాటి బయటకు వెళ్లిపోతుందని కూతురికి నేర్పించరు. తమ ఇంటికి వచ్చిన కోడళ్లకు మాత్రమే నేర్పిస్తారు. ఆడపిల్లను పుట్టింట్లో పరాయి మనిషిగా చూడడమనే ఆలోచనే మనకు బాధ కలిగిస్తుంది. వాళ్లకది అలవాటైపోయింది. అవార్డు చీరను అమ్మను నేర్చుకోవాలనే సంకల్పం బలంగా ఉంటే ఏదీ అసాధ్యం కాదు. పదో తరగతి పూర్తవుతూనే పెళ్లి చేశారు నాకు. అత్తగారింటికి వచ్చిన తర్వాత నా భర్త, మామగారు నేత పని నేర్పించారు. 35 ఏళ్ల కిందట సాదా లుంగీ నా తొలి నేత. అలాంటిది ఇప్పుడు ఇప్పుడు స్టడీ టూర్‌కు వచ్చే స్కూలు పిల్లలకు చేనేత పాఠాలు చెప్తున్నాను. చేనేతలో ఎన్నో ప్రయోగాలు చేశాను. ‘డబుల్ ఇకత్ డబుల్ డోరియా కోటా చీర’ను నేసి రాష్ట్రపతి అవార్డు అందుకోగలిగాను. ఆ చీర నా ప్రయోగాల్లో అత్యున్నతమైన ప్రయోగం. దానిని అమ్మే ఉద్దేశం లేదు. చీర నేతలో ప్రతి దశనూ నోట్స్ రాసి పెట్టాను. ఆ చీరను, నోట్స్నీ మా పిల్లలకు వారసత్వ ఆస్తిగా ఇస్తాను. నేను అక్టోబర్ రెండున పుట్టాను. గాంధీ పుట్టిన రోజు పుట్టడం వల్లనే చేనేతకు ఇంతగా అంకితమైపోతున్నావంటారు మా పిల్లలు సరదాగా.– కందగట్ల బాలమణి,రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఇప్పటి సవాల్ నకిలీలతోనే ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే మగ్గాన్ని ప్రేమిస్తూ... చేనేతను కాపాడుకోగలుగుతున్నాం. కానీ ఇప్పుడు నకిలీల బెడద పెద్ద సవాల్ అవుతోంది. నార్మల్ డిజైన్‌తో ఒక చీర నేయడానికి మూడు నెలలు పడుతుంది. ప్రయోగాత్మకంగా కొత్త డిజైన్‌ను రూపొందించడానికి ఆరు నెలలు పడుతుంది. ఆరు నెలలు కష్టపడి కొత్త డిజైన్‌ను బయటకు తెచ్చిన వారం రోజుల్లో అదే డిజైన్‌ను స్క్రీన్ ప్రింటింగ్ చేస్తున్నారు. అవి తక్కువ ధరకు దొరుకుతాయి. టెక్నాలజీ మాకు ఒక రకంగా చేయూత అవుతోంటే మరో రకంగా సమస్య అవుతోంది. ఇకత్ డిజైన్‌కి పేటెంట్ రైట్స్ వచ్చాయి, కానీ వాటి మీద విజిలెన్స్ సరిగా ఉండడం లేదు. నిఘా పెంచాలి, ఇకత్ ప్రింట్ చేసిన వస్త్రాల మీద ‘ఇది ఇకత్ ప్రింట్’ అని ముద్రించే నిబంధన అయినా రావాలి. అలా చేయకపోతే ఒకటే ఎగ్జిబిషన్లో అసలైన చేనేత స్టాల్ ఉంటుంది, ఆ పక్కనే ప్రింట్ల స్టాల్ ఉంటుంది. ‘ఏది నేతో, ఏది ప్రింటో తెలియని వాళ్లు మేము ఎక్కువ ధర పెట్టాం’ అనుకుంటూ మా స్టాల్ దాటి వెళ్లి పోతారు. కొత్త డిజైన్ల రూపకల్పనతో మమ్మల్ని మేము నిరూపించుకుంటూ మన గలుగుతున్నాం. ఈ నకిలీ దాడి నుంచి చేనేత బతికి బట్టకట్టాలంటే నిబంధనలు ఇంకా పటిష్టంగా ఉండాలి’’.ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -ఫొటోలు – మోర్ల అనిల్ కుమార్ -
పస్తులతో పోరాటం..
తరాల తరబడి ఆకలి పోరాటం వారిది. చేతి వృత్తినే నమ్ముకొని ఎంతో కళాత్మకంగా నేసే బట్టలు వారికి పూట కూడా కడుపు నింపడం లేదు. అందరికీ అందమైన వస్త్రాలను తయారు చేస్తుంటే వారికి మాత్రం రోజంతా పని చేసినా పూట గడవని దుర్భిక్షం. నమ్మిన వారే కష్టానికి కూలీ కట్టకపోవడంతో చేనేత కార్మికులు అర్ధాకలితో జీవనం సాగిస్తున్నారు. కుటుంబమంతా కలిసి ఒక రోజంతా పనిచేస్తే కనీసం రూ.300 కూడా సంపాదించలేని పరిస్థితి. ఈ రూ.300తోనే కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఇతర ఖర్చులు అన్ని సర్దుకుపోవాల్సిన పరిస్థితిల్లో కార్మికులు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సాక్షి, చీరాల (ప్రకాశం): చేనేత కార్మికులు అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మాస్టర్‌వీవర్లు (పెట్టుబడిదారులు) మాత్రం కోటీశ్వరులుగా మారుతుంటే వస్త్రాలను తయారు చేసే చేనేత కార్మికులు మాత్రం అర్ధాకలితోనే అలమటిస్తున్నారు. ఇప్పటికీ 2016లో ఉన్న మజూరీ(కూలీ)లే అమలవుతున్నాయి. ఇదేమని గొంతెత్తి అడిగితే అలాంటి వారికి పని కల్పించకుండా మాస్టర్ వీవర్లందరూ ఒకే విధంగా వ్యవహరించడంతో కనీసం పని కూడా లేక అవస్థలు పడుతున్నారు. అందుకే అవస్థలన్నీ మౌనంగానే ఎదుర్కొంటున్నారు నేత కార్మికులు. కొద్ది నెలల పాటు ఆందోళన చేస్తే కార్మికశాఖ, చేనేత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కుదిరిన ఒప్పందం రేట్లను కూడా అమలు చేయకుండా మాస్టర్‌వీవర్లు మోసానికి ఒడిగడుతున్నారు. చీరాల ప్రాంతంలో 17 వేల మగ్గాలకు పైగా ఉండగా, 50 వేల మంది కార్మికులు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. మాస్టర్‌వీవర్ల వద్ద కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఇంటి వద్దే మగ్గం పెట్టుకొని మాస్టర్‌వీవర్ ఇచ్చే ముడిసరుకుతో వస్త్రాలను తయారు చేసి ఇస్తుంటారు. ఇందుకు గాను వస్త్రాల రకాలను బట్టి కూలీ రేట్లను నిర్ణయిస్తారు. ప్రస్తుతం సాదా చీరకు రూ.1700 వరకు చెల్లిస్తున్నారు. ఈ చీర నేయాలంటే కనీసం ఐదు నుంచి ఆరు రోజులు పడుతుంది. కుప్పడం చీరకు రూ.8500 నుంచి రూ.9వేల వరకు చెల్లిస్తారు. ఈ చీర నేయాలంటే కనీసం 10 రోజులు పడుతుంది. కంచి బోర్డర్‌కు రూ.7000 వరకు ప్రస్తుతం చెల్లిస్తున్నారు. ఇందులో కార్మికుడు కూడా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అల్లు కట్టినందుకు, అంచులు అతికినందుకు, కడ్డీలు చుట్టినందుకు, గమ్ము పెట్టింనందుకు, ఇతర పనులకుగాను ఒక్కో బారుకు రూ.1000ల వరకు కార్మికుడే ఖర్చు భరాయించాలి. ఉదాహరణకు కంచి బోర్డర్ చీరలు నేస్తే మాస్టర్ వీవర్ రూ.7000 ఇస్తే అందులో రూ.1000లు అదనంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంది. అంతే సరాసరిన రోజంతా భార్యభర్తలు కలిసి పని చేస్తే రూ.300 పడుతుంది. దీంతో కుటుంబమంతా జీవించడం అసాధ్యంగా మారింది. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలు కొనుగోలు చేయలేని పరిస్థితి దాపురించింది. పిల్లలను చదివించలేని పరిస్థితి ఎదురుకావడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో వారు కూడా మగ్గంలోనే మగ్గిపోవాల్సి వస్తుంది. ఇంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నా మాస్టర్‌వీవర్లు మానవత్వంగా వ్యవహరించడం లేదు. మజూరీలను పెంచాలని కార్మికులు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా పట్టించుకున్న దిక్కేలేదు. గత రెండు నెలలుగా మజూరీలను పెంచాలని చేనేత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదు. కనీస వేతన చట్టానికీ కరువే కనీస వేతన చట్టం ప్రకారం ఒక కార్మికుడికి రోజుకు రూ.206 చెల్లించాల్సి ఉంటుంది. కానీ చేనేత కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారంగా కూడా కూలీలు అందడం లేదు. చేనేత మగ్గాలపై పీస్ వర్క్ చేస్తున్నారనే కారణంతో కూలీ ధరలు పరిగణించలేమని కార్మికశాఖ చేతులెత్తేసింది. దీంతో హోటల్లో పని చేసే స్వీపర్ల కంటే చేనేత కార్మికుడికి కూలీ తక్కువ. కనీస వేతన చట్టాన్ని అమలు చేసినా కార్మికులకు ప్రయోజనం ఉంటుంది. 2016 నుంచి పెంచని మజూరీలు చేనేత కార్మికులు, మాస్టర్‌వీవర్లు ఒప్పందం మేరకు కార్మికశాఖ ఆద్వర్యంలో రెండేళ్లకు ఒకసారి కూలీలు పెంచేవిధంగా ఒప్పందం చేసుకుంటారు. కానీ 2016 నుంచి ఇప్పటి వరకు మాస్టర్ వీవర్లు కార్మికుల కూలీలు పెంచేందుకు ముందుకురావడం లేదు. గత కొన్ని నెలలుగా కార్మికులు మజూరీలు పెంచేందుకు ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలు, కార్మికశాఖ కార్యాలయాల ముట్టడిలను చేపట్టారు. ఇప్పటికీ కార్మికులు, మాస్టర్ వీవర్ల మద్య మజూరీల ఒప్పందంపై 9 సార్లు చర్చలు జరిగినా ఫలితం శూన్యంగా మారింది. బుధవారం జరిగిన చర్చలకు మాస్టర్ వీవర్లు ఎవ్వరూ హాజరుకాలేదు. పైపెచ్చు తమవద్ద పనిచేసే కార్మికులతో తమకు కూలీలు పెంచాల్సిన అవసరం లేదంటూ కార్మికశాఖ అధికారులకు లిఖిత పూర్వకంగా బలవంతంగా సంతకాలు చేయించి అందిస్తున్నారు. తమతో మాస్టర్ వీవర్లు బలవంతంగా సంతకాలు చేయించారని, నిజంగా వారికి కూలీలు పెంచాల్సిన అవసరం లేదని కార్మికశాఖ అధికారుల ముందే కార్మికులు చెప్పాలని కార్మికసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం మాస్టర్ వీవర్లను బెదిరించిన కార్మికులనే భయాందోళనలకు గురిచేస్తున్నారని వారి ఆరోపణ. నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఉన్న కూలీలకు అదనంగా 20 శాతం కూలీ పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫిర్యాదు చేస్తే పని బంద్ అర్ధాకలితో అవస్థలు పడుతున్న చేనేత కార్మికులు తమ దుర్భర పరిస్థితులపై కార్మిక శాఖాధికారులకు ఫిర్యాదు చేస్తే అంతే సంగతులు... ఆ రోజు నుంచి సదరు మాస్టర్‌వీవర్ ఆ కార్మికుడికి పని చూపించడు. మిగతా మాస్టర్వీవర్లూ అతనికి పని కల్పించరు. ఒకవేళ కల్పించినా నాసిరకపు రకాలను నేయించడంతో పాటు నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తారు. అందుకే కార్మిక శాఖ అధికారులకు చేసిన ఫిర్యాదులు కూడా కార్మికులు వెనక్కి తీసుకోవడం తప్పితే వారిపై ఉద్యమం చేసేందుకు నిలబడలేని పరిస్థితి. -
చేనేత సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: ఆర్కే
సాక్షి, అమరావతి: చేనేతల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. గతంలో చేనేతల కోసం వైఎస్ జగన్ దీక్ష చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. చేనేతల అంశంపై ఆయన సోమవారం అసెంబ్లీలో మాట్లాడారు. వ్యవసాయ రంగం తర్వాత అధిక ప్రాధాన్యం తమ ప్రభుత్వం చేనేత రంగానికి ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం మెగా క్లస్టర్లను ఏర్పాటుచేస్తామని ప్రకటించగా.. టీడీపీ హయాంలో వాటిని బ్లాక్‌స్థాయి క్లస్టర్లుగా మార్చారని, దీనివల్ల ప్రయోజనం లేదని, బ్లాక్‌స్థాయి క్లస్టర్ల వల్ల చాలా తక్కువమందికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మెగా క్లస్టర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. చేనేతరంగానికి రూ. వెయ్యికోట్ల స్థీరికరణ నిధిని ఏర్పాటు చేస్తానని.. ప్రతి ఏడాది వెయ్యి కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు తన హయాంలో కేవలం సుమారుగా రూ. 875.3 కోట్లను మాత్రమే కేటాయించి.. రూ. 473 కోట్లు మాత్రమే నేతన్నల కోసం ఖర్చు చేశారని, మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మొదటి బడ్జెట్లోనే చేనేత రంగానికి రూ. రెండువందల కోట్లు కేటాయింపులు చేశారని, చేనేత రంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. ఇక, చంద్రాబు హయాంలో ఆప్కో పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, దీనిని ఆదుకోవాల్సిన అవసరముందని కోరారు. దీనికి మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సమాధానమిస్తూ.. మెగా క్లస్టర్లు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని, వీటిని కేంద్రం రద్దు చేసి.. బ్లాక్‌స్థాయి క్లస్టర్లను తీసుకొచ్చిందని తెలిపారు. ఇక, ఆప్కో రంగంలో గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టినవిధంగా చర్యలు తీసుకొని.. దీనికి పునర్వైభవాన్ని తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ నిశ్చయించారని తెలిపారు. -
చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికాడు..?!
తంగళ్లపల్లి(సిరిసిల్ల) : విద్యుత్‌షాక్‌కు గురైన వ్యక్తిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.అప్పటికే చనిపోయాడని వైద్యులు మార్చురీకి తరలించారు. బంధువుల్లో ఒకరు చూసేందుకు వెళ్లి మృతదేహానికి చెమటలు వస్తున్నాయని కుటుంబసభ్యులుకు తెలిపాడు. వెంటనే కరీంనగర్ తరలించగా.. ఎప్పుడో చనిపోయాడని ధ్రువీకరించడంతో నిరాశతో వెనుదిరిగారు. వివరాల్లోకెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మనగర్‌కు చెందిన సిరిసిల్ల చంద్రమౌళి (42) నేతకార్మికుడు.బుధవారం ఉదయం 5.30 గంటలకు కార్ఖానాకు వెళ్లిన చంద్రమౌళి సాంచాల మరమతుకు పూనుకున్నాడు. ఈక్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుటుంబసభ్యులు జిల్లాకేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చంద్రమౌళి చనిపోయినట్లు నిర్ధారించి మృతదేహన్ని మార్చరీకి తరలించారు. ఉదయం 9.30గంటలకు బంధువు ఒకరు వచ్చి మార్చరీలోని చంద్రమౌళి మృతదేహాన్ని చూశాడు. శరీరంలో నుంచి చమటలు వస్తున్నాయని, అతడు బతికే ఉన్నాడని సందేహం వెలిబుచ్చాడు.మృతి చెందాడని వైద్యులు చెబుతున్నా వినకుండా వెంటనే కరీంనగర్ తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు చంద్రమౌళి శరీరాన్ని పరీక్షించి చాలాసేపటి క్రితమే చనిపోయాడని నిర్ధారించారు. దీంతో కుటుంబసభ్యులు ఆ శవంతో వెనుదిరిగారు. అయితే, చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికాడంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. -
మార్పు కావాలి...రావాలి!
సాక్షి, అమరావతి: మార్పు కావాలి. మార్పు తేవాలి. మార్పుతోనే ముందడుగేయాలి... ఇది జనాభిమతం. ఐదేళ్లుగా వెంటాడిన అనుభవాలు కళ్లముందు కదలాడుతుండగా.. గుండె లోతుల్లోంచి తన్నుకొస్తున్న భావావేశంలో ఎవరిని కదిపినా వినిపిస్తున్న భావోద్వేగమిది. ఎన్నికల వేడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజా నాడిని పసిగట్టేందుకు రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ‘సాక్షి’ ‘రోడ్ షో’ చేపట్టింది. దారి పొడవునా సాగిన ఈ రాజకీయ చర్చలో రాష్ట్రంలో మార్పు చారిత్రక అవసరమన్న అభిప్రాయం వ్యక్తమైంది. అధికార పార్టీ అక్రమాలపై ఉక్కుపాదం మోపి, ఐదేళ్లు న్యాయ పోరాటం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి ఓవైపు... ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ మరోవైపు ఇక్కడ బరిలో ఉన్నారు. స్థానిక అభ్యర్థులే కాదు... రాష్ట్రంలో ఏ పార్టీని గెలిపిస్తే బాగుంటుందనే వాద ప్రతివాదాలూ స్థానికంగా జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా జనం మనసులో మాటేంటో నిర్మొహమాటంగా బయటపడుతోంది. నేతన్నను ఆదుకునేదెవరు? పాత మంగళగిరిలోని పద్మశాలి నగర్ సెంటర్లో ఓ సెలూన్ షాప్ దగ్గర జనం మాట్లాడుకుంటున్నారు. ఆ పక్కనే టిఫిన్ సెంటర్ నుంచి, అటుగా వెళ్తున్న మరికొందరితో అక్కడ క్షణాల్లో గుంపు పెరిగింది. ‘ఐదేళ్లవుతోంది. అప్పుల పాలయ్యామని ఈ ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పలేదు. విన్నారా? కాలనీ సమస్యలు ఎన్ని చెప్పినా పట్టించుకున్నదెవరు? మళ్లీ ఈ ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించాలి?’ నాగరాజు మాటల ఆవేశంతో తోకల బాలరాజు, కారంపూడి శ్రీనివాసరావు జోడీ కట్టారు. ‘ఈ గ్రాఫిక్స్ మాయాజాలం ఇంకా నమ్మొద్దు పెద్దయ్యా. నేను ఎంటెక్ చదివాను. ఏదీ ఉద్యోగం...?’ జీరబోయిన స్వరంతో కారంపూడి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలి. చేనేత సమస్యలు తీరుస్తానంటున్నాడు జగన్. ఉద్యోగాలిచ్చి తీరుతానంటున్నాడు. ఒక్క అవకాశం ఇద్దాం..’ అని తోకల బాలాజీ, దాసరి వినయ్‌తో పాటు పలువురు అభిప్రాయం వెలిబుచ్చారు. ఐటీ బాబొస్తే... అంతా పోతుందేమో! లక్ష్మీనర్సింహ స్వామి కాలనీలో అంతా పేదలే. ‘ఐదేళ్లు ఏం చేసిందయ్యా ఈ ప్రభుత్వం. చూడండి మా కాలనీ. ఏమాత్రమైనా బాగు చేశారా? పైగా అదిగో ఆ పక్క ఐటీ పార్క్ పెడతారట. ఎప్పుడో ప్రభుత్వం ఇచ్చిన మా భూములూ లాక్కుంటారట. మేం కట్టుకున్న ఇళ్లూ కూల్చేస్తారట...’ రాజేశ్వరి, మంగతాయారు, సూర్యలక్ష్మి భయంతో అన్న మాటలివి. ఇక్కడ లోకేష్ పోటీ చేస్తున్నాడంటేనే తమకు భయమేస్తోందని వారు చెప్పారు. ‘వైసీపీ అభ్యర్థి ఆర్కేను గెలిపించుకున్నాం. ఎప్పుడైనా సమస్య చెప్పుకునే వీలుంది. లోకేష్ దగ్గరకు మేం వెళ్లగలమా?’ అని ప్రశ్నించాడు నీలి శ్రీకాంత్. ‘మేమీ కాలనీలో ఈ మాత్రం ఉన్నామంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యమే. మళ్లీ అలాంటి మంచి రోజులు జగన్ వల్లే సాధ్యం’ అని పేరం నాగమణి చెప్పింది. పేదల ఆవాసాలున్న రత్నాల చెరువు, లక్ష్మీనర్సింహ కాలనీపై ప్రభుత్వం కన్ను పడిందట అని అక్కడి జనం నమ్ముతున్నారు. ఒక్క అవకాశమిద్దాం పెదవడ్లపూడి చౌరస్తాలో వృద్ధులు, యువకులు తాజా రాజకీయాలపై జోరుగా చర్చించుకోవడం కన్పించింది. రైతులే ఎక్కువగా ఉన్న ఆ గ్రామంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ అక్కడ చర్చను నిశితంగా పరిశీలిస్తే వాళ్లలో ఏదో తెలియని అసంతృప్తి. ‘పెద్ద దిక్కు అవుతాడని ఓట్లేశాం. ఏమైంది. ఏం పంటకు గిట్టుబాటు ధరొచ్చింది. మన పిల్లల్లో ఎవరికి ఉద్యోగాలొచ్చాయి. చంద్రబాబు అనుభవం ఏమైనట్టు?’ కోటా ప్రసాద్ నోటివెంట వచ్చిన మాటిది. ‘మార్పు తెస్తానంటున్న జగన్‌కు ఒక్క అవకాశం ఇస్తే బాగుంటుంది’ అని పరిమినేని మహేష్ అన్నారు. రైతు కూలీ పిచ్చయ్య కూడా ‘ఈసారి మార్పు రావాల్సిందే’ అన్నాడు. ప్రజల గురించి పట్టించుకునే పార్టీ గెలవాలని వారు కోరుకుంటున్నారు. ఆ సత్తా జగన్‌కు ఉందనేది ప్రజాభిమతం అని వారు తెలిపారు. అందుబాటులోఉండాలి గెలిచిన ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఏ సమస్యయినా నేరుగా ఆయనకు చెప్పుకొనే పరిస్థితి ఉండాలి. మేం గెలిపించుకున్న నేత కోసం మేమే నిరీక్షించే దుస్థితిని కోరుకోవడం లేదు. –తోకల బాలాజీ, చిరు వ్యాపారి (మంగళగిరి) రాజన్న రాజ్యం వస్తుందనే ఆశ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అంటే ఎంతో అభిమానం. లక్ష్మీనర్సింహ కాలనీలో ఆయన హయాంలోనే పట్టాలొచ్చాయి. దీనికి కృతజ్ఞతగానే ఇక్కడ ప్రతిఒక్కరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పని చేశారు. దురదృష్టం కొద్దీ 2014లో జగన్‌ను గెలిపించుకోలేకపోయాం. ఈసారి మాత్రం జనానికి మంచి జరిగే ప్రభుత్వం వస్తుందని, రావాలని కోరుకుంటున్నాం. జనం కోరుకునే మార్పు సాధ్యమనే భావిస్తున్నాం. – పేరం నాగమణి, లక్ష్మీనర్సింహ కాలనీ ఉద్యోగం... ఉపాధి ఇచ్చే సర్కారు కావాలి ఎంటెక్ చదివా. కాళ్లరిగేలా తిరిగినా ఐదేళ్లుగా ఉద్యోగం రాలేదు. చూస్తుంటే ఆశలన్నీ అడియాశలవుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలు మమ్మల్ని బతికిస్తున్నాయి. అధికారంలోకి వస్తుందని, మాలాంటి నిరుద్యోగులకు న్యాయం చేస్తుందనే నమ్మకం ఉంది. ఆ మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాం. – దాసరి వినయ్, ఎంటెక్ విద్యార్థి -
సమంతను ఫాలో అవుతున్న ప్రియాంక
చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు సినీ స్టార్స్ క్యాంపెయిన్ చేస్తున్న విషయం విదితమే. సినీనటీ సమంత తెలంగాణ చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా సోషల్ మీడియాలోచురుకైన పాత్ర పోషిస్తోంది. ఆ కోవలోనేచేనేతకు వన్నె తెచ్చేందుకు, దాని గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు పాటుపడుతోంది ప్రియాంక దారపు. తనకిష్టమైన ఈ రంగంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో ముందుకెళుతోంది. ఏపీ ప్రభుత్వం నిర్వహించే ర్యాంప్ షోలలోహొయలొలికిస్తూ చేనేత వృత్తిదారుల్లోనూతనోత్సాహాన్ని నింపుతోందీసిటీ యువతి. హిమాయత్‌నగర్ : నగరంలోని మాదాపూర్‌నకు చెందిన ప్రియాంక దారపు ఫ్యాషన్ కోర్సులో బీఎస్సీ చేసింది. ప్రస్తుతం ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్‌ను రన్ చేస్తూ, చేనేత రంగాన్ని బలపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ‘మిస్ తెలంగాణ 2017’ టైటిల్‌ని సాధించిన ప్రియాంక ఫ్యాషన్ రంగంలో తనదైన ముద్రతో ముందుకు సాగుతోంది. రెండేళ్లుగా ఫ్యాషన్ షోలు.. చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రెండేళ్ల క్రితం ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ఫ్యాషన్ షోలకు కొంతమంది మోడల్స్‌ను ఎంపిక చేశారు. వీరిలో నగరం నుంచి ప్రియాంక ఎంపికైంది. దీంతో ఆమె ఫ్యాషన్ షోలలో చేనేత కార్మికులు రూపొందించిన దుస్తులను ధరించి ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేస్తూ ఆ రంగానికి వన్నె తెస్తోంది. ఏపీ ప్రభుత్వం నిర్వహించే చేనేత ఫ్యాషన్ షోలలో తెలంగాణ నుంచి తాను పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని చెబుతోంది ప్రియాంక. సోషల్ మీడియాద్వారాప్రమోషన్ కేవలం ర్యాంప్ షోలతో సరిపుచ్చుకోక తన వంతు బాధ్యతగా చేనేత రంగాన్ని ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని, ఆ దిశగా నేటి యువత ఓ అడుగు ముందుకు వేయాలంటూ ప్రియాంక పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ర్యాంప్ షో నుంచి సిటీకి వచ్చాక ‘ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్’ వంటి సోషల్ మీడియా వేదికగా లైవ్‌లు చేస్తోంది. ప్రస్తుతం చేనేతలో అనేక ఆకర్షణీయమైన డిజైన్లలో దుస్తులను కార్మికులు రూపొందిస్తున్నారని, వాటిని ధరించాల్సిన ఆవశ్యకత మనందరిపై ఉందంటూ లైవ్‌లో చెబుతోంది. ఖాదీ ఫ్యాబ్రిక్‌పై కోచింగ్ కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లో ప్రియాంక ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించింది. ఈ ఇనిస్టిట్యూట్ వేదికగా ఫ్యాషన్ రంగంలో వస్తున్న యువతీ యువకులకు ఖాదీ ఫ్యాబ్రిక్‌పై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. ఫ్యాబ్రిక్‌లో లేటెస్ట్గా వచ్చే డిజైన్స్‌ని వాళ్లకి వివరిస్తూ.. కొత్తదనాన్ని పరిచయం చేస్తోంది. బ్రాండ్ అంబాసిడర్ నా లక్ష్యం చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు నిర్వహించే ర్యాంప్ షోలలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. విజయవాడ, కాకినాడ, నెల్లూరు వంటి ప్రాంతాల్లో ప్రజల నుంచి చాలా రెస్పాన్స్ వచ్చింది. ఏపీతో తెలంగాణ ప్రభుత్వం తలపెట్టే కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని ఉంది. రానున్న రోజుల్లో తెలంగాణ, ఏపీలకు ‘చేనేత రంగం’ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలనేది నా అభిమతం. – ప్రియాంక దారపు -
జీఎస్టీతో చేనేతపై భారీ దెబ్బ
దశాబ్దాలుగా అస్తవ్యస్థ విధానాల వల్ల కునారిల్లిపోతూ వస్తున్న చేనేతరంగం తాజాగా జీఎస్టీ పన్నుల భారంతో కుదేలవుతోంది. ఒకవైపు మిల్లు రంగం ఉత్పత్తి ఖర్చు తగ్గి, వస్త్రా ల ధరలు తగ్గి చేనేత వస్త్రాల కొనుగోలు పడిపోతున్నది. మరోవైపు ఇన్ని ఏండ్లుగా చేనేత మీద లేని పన్ను భారం ఇప్పుడు జీఎస్టీ రూపంలో పడుతోంది. కత్తిమ నూలు ఉత్పత్తికి, పాలియెస్టర్ వస్త్ర పరిశ్రమకు జీఎస్టీ వల్ల పూర్తిగా ప్రయోజనం సాధ్యపడుతుండగా, సహజ నూలు మీద మాత్రం పన్నులు కట్టాల్సి వస్తుంది. క్లుప్తంగా, జీఎస్టీ వల్ల చేనేత మీద భారం పెరుగు తుంది. జీఎస్టీలో సహజ నూలుకు, చేనేత వస్త్రాలకు మినహాయింపు ఇవ్వకపోతే, చేనేత ఉపాధి పూర్తిగా తగ్గుతుంది. వస్త్ర దిగుమతులు పెరుగుతాయి. పర్యావరణ విధ్వంసం పెరుగుతుంది. దేశీయ జౌళి పరిశ్రమ ప్రమా దంలో పడుతుంది. జీఎస్టీ పైన విస్తత చర్చలు చెయ్యా ల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న, సన్నకారు రైతులు మరియు చేనేత కార్మిక కుటుంబాల సమస్యలు మరియు పరిష్కారాలు ఇందులో మిళితంచేసి ఒక సమగ్ర విధానం రూపకల్పన చెయ్యాలి. దేశీయ జౌళి రంగంలోని అన్ని ఉప రంగాల ప్రయోజనాలు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీఎస్టీ వలన భారత జౌళి రంగం స్వరూపం మారిపోతున్నది. చిన్న ఉత్పత్తిదారులు కనుమరుగు అవుతున్నారు. రెండవ దశలో దిగుమతులు మరియు విదేశీ ఉత్పత్తులు పెరిగిపోతాయి. ఈ రెండు దశల క్రమంలో సహజ నూలు ఉత్పత్తులు 60 శాతం దేశ ప్రజలకు అందుబాటులో ఉండవు. ఒక చేనేత కుటుంబం నెలకు ఒక వార్పూ లేదా రెండు వార్పులు నేస్తారు. వీరు జీఎస్టీలో ప్రధానమైన ఇన్‌ఫుట్ ట్యాక్స్ క్రెడిట్ పరిధిలోకి రారు. వీరు ముడి సరుకులకు (నూలు, రంగులు, రసాయనాలు తదితర) పన్ను కడతారు. వీరి దగ్గర నేసిన వస్త్రాలు తీసుకునే షావు కారు, కాని కమీషన్ ఏజెంట్ కాని, కూడా ఈ పరిధిలోకి రారు. అతి పెద్ద షావుకారు రావచ్చు. సాలీనా, రూ.20 లక్షల వ్యాపారం చేసేవాళ్ళే జీఎస్టీలో నమోదు చేసు కోవాలి. చేనేత కుటుంబాలు, చేనేత ఉత్పత్తిలో అనేక రకా ల ఇతర పనులు చేసేవాళ్ళు జీఎస్టీలోకి రారు. కానీ, పన్ను ల పరిధిలోకి వస్తారు. షావుకారు నమోదు కాని వారి దగ్గ ర కొంటున్నాడు కనుక తానే పన్ను ప్రభుత్వానికి కట్టాలి. వే బిల్లులు లేకుండా సరుకుల రవాణా జరుగకూడదు. వస్త్ర ప్రదర్శనకు తెచ్చిన అన్ని వస్త్రాలకు ‘జీఎస్టీ’ నిబంధనలు వర్తిస్తాయి. వీటన్నింటి వలన నమోదు కాలేని చేనేత కుటుంబాల ఉత్పత్తి తీసుకోవటానికి షావుకారు ఇబ్బంది పడుతున్నారు. ఒక చేనేత కుటుంబం 1 చీరె షావుకారు దగ్గరకు తీసుకుపోతే, దాని విలువ ఒక్కటి రూ.2,500 అనుకుంటే, షావుకారు మొత్తం రూ.2,500 మీద 5 శాతం పన్ను కట్టవలసిందే– ముడి సరుకుల మీద కట్టిన పన్ను తీసివేయలేదు కనుక. షావుకారు దగ్గర కొనుక్కునే హోల్ సేల్ వ్యాపారి సాధారణంగా ఉద్దరకు తీసుకుపోతారు. దీని వలన షావుకారు కట్టే పన్ను తిరిగి రావాలంటే కనీసం 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. అప్పటివరకు, షావుకారు పెట్టుబడి ధనం ఆగిపోతుంది. ఆ విధంగా రెండు వైపులా పెట్టుబడి అవసరం పెరుగుతుంది. దీని వలన తన వ్యాపార సామర్థ్యం తగ్గిపోతుంది. పని ఇవ్వలేడు. ఇక జీఎస్టీ అధికారుల ఒత్తిడి ఉండనే ఉం టుంది. ఈ తల నొప్పి ఎందుకు అని, నమోదు కాని చేనేత కుటుంబం దగ్గర వస్త్రాలు తీసుకోకపోవటమే ఉత్తమమైన మార్గంగా కనిపిస్తున్నది. జీఎస్టీ (వస్తు సేవల పన్ను) వలన చేనేత మీద తీవ్ర ప్రభావం కనపడుతున్నది. చేనేత ఉత్పత్తికి అత్యంత ఆవశ్యకమైన చిలపల నూలు ఒక కిలోకు 2016–17లో రూ.240.90 ఉండగా, 2017–18లో రూ.245.92కు పెరి గి, నవంబర్ 2018 నాటికి రూ.270.76 కు చేరుకుంది. ముడి ఉన్ని నూలు ఒక కిలోకు 2016–17లో రూ.750.40 ఉండగా, 2017–18లో రూ.807.72కు పెరిగి, నవంబర్ 2018 నాటికి రూ.1,165.09కు చేరుకుంది. చేనేత ఎగుమతుల మీద కూడా ఈ దుష్ప్రభావం కనపడు తున్నది. 2018–19లో గత ఏడాది తో పోలిస్తే చేనేత ఉత్ప త్తుల ఎగుమతులు 7 శాతం తగ్గాయి. ప్రత్యేకంగా.. ముడి సరుకుల ధరల పెరుగుదల కనిపిస్తున్నది. సహజ నూలు ధరలలో పెరుగుదల కనిపిస్తున్నది. ఉద్దర/అప్పుల మీద ఉత్పత్తి జరుగుతున్నది. జీఎస్టీ వలన 25 శాతం పెట్టుబడి ఆగిపోతుంది. పన్ను ‘అలవాటు’ లేకపోవటంతో కూడా తీవ్ర ఇబ్బందులూ ఏర్పడుతున్నాయి. చేనేత వస్త్రాల ధరల పెరుగుదల 7.7 నుంచి 100 శాతం పెరగడంతో కొనే వారు తగ్గిపోతున్నారు. మార్కెట్ డిమాండ్‌లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. డిమాండులో 2.5 నుంచి 15 శాతం వరకు తగ్గుదల కనిపిస్తున్నది. సామాన్యులకు అందని స్థాయిలో నూలు, చేనేత వస్త్రాల ధరలు అయి నాయి. కొనుగోళ్ళు తగ్గిపోతున్నాయి. చేనేత రిజర్వేషన్ చట్టం అమలు పూర్తిగా ఆగి పోయింది. వస్త్ర ప్రదర్శనలో పాల్గొనడం కష్టంగా మా రింది. ఉత్పత్తి ఖర్చు పెరుగుతున్నది. జీఎస్టీలో ఉన్న సమ స్యల వల్ల పెట్టుబడి ధనం తగ్గిపోతున్నది. బ్యాంకులు ఎప్పటినుంచో అప్పులు ఇవ్వడం లేదు. జీఎస్టీ అమలుకోసం ఖర్చుల భారం పడుతోంది. ప్రతి నెల పన్ను కట్టడం, దానికోసం కంప్యూ టర్ రిటర్న్ చేయడం, దాని కోసం ఒక వ్యక్తిని నియ మించటం. ఇవన్నీ వెరసి ఖర్చులు పెరుగుతున్నాయి. రవాణాలో వే బిల్లులకు, నమోదు అయిన వాహనం మాత్రమే వాడవలసి రావటం కూడా సమస్యలను పెంచు తున్నాయి. వస్త్ర ప్రదర్శనలలో తీసుకు వచ్చిన మొత్తం సరుకుకు కూడా జీఎస్టీ ప్రామాణికంగా ఉండవలసి రావటం ఒక సమస్య. స్థూలంగా, వస్త్ర ఉత్పత్తిని, వినియోగాన్ని పూర్తి స్థాయిలో, సంపూర్ణంగా మార్చే నూతన ట్యాక్స్ పద్ధతి వల్ల ఉన్న ఉపాధి కోల్పోయి, వినియోగంలో స్వావలంబన కోల్పోయి, స్వతంత్ర జౌళి రంగం ఉనికి కోల్పోయి, విదేశీ ఉత్పత్తుల మీద ఆధారపడే దిశగా భారత వస్త్ర పరిశ్రమ పయనిస్తున్నది. అందుకే, చేనేతపై జీఎస్టి పన్ను గురించి ప్రభుత్వం పునరాలోచించి, విస్తృత చర్చలు జరిపి, అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక ఆమోదయోగ్యమైన విధానం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాసకర్త: డి.నరసింహారెడ్డి, ఆర్థిక రంగ నిపుణులు 90102 05742 -
చేనేత ఎదుర్కొంటున్న సవాళ్ళు
మిరుమిట్లు గొలుపుతూ ప్రపంచానికి వెలుగులు అందించిన చేనేత.. జౌళిమిల్లుల విస్తరణతో గుడ్డికాయ పట్టింది. మసిబారుతూ వచ్చింది. చేనేత నిపుణులే వృత్తి వదిలి బట్టల మిల్లు కార్మికులుగా వలసపోవలసి వచ్చింది. వ్యవసాయం తర్వాత అతి ఎక్కువ ఉపాధి కల్పించిన రంగంగా చేనేత శతాబ్దాల తరబడి కొనసాగుతూ వచ్చింది. ఇదంతా గత చరిత్ర. ప్రస్తుతం చేనేత వృత్తి సామాజిక వర్గాలు ఆ వృత్తినుంచి వైదొలగి ఇతర వృత్తుల్లో చేరిపోయారు. చేనేత వృత్తి కులాల జనాభాలో ఐదు, ఆరు శాతం మాత్రమే చేనేత వృత్తిపై ఆధారపడి బతుకుతున్నారు. చేనేత ఎదుర్కొంటున్న సవాళ్ళు ఎన్నో ఉన్నాయి. మొట్టమొదటిది ప్రజల మనస్సుల్లో చేనేతపట్ల ఆదరణ పెరగడం. ఎంత ధర అయినా పట్టు బట్టలు, గార్మెంట్స్, రెడీమేడ్, సూటింగ్స్ కొంటున్నట్లుగా చేనేతను ప్రతిష్టాత్మకంగా కొనే స్థితి పెరగాలి. స్వయం పోషకంగా ఎదగడానికి ప్రభుత్వం నుండి అనేక సదుపాయాలు శాశ్వత ప్రాతిపదికగా అందించడం అవసరం. చేనేత కోసం కొన్ని రకాలను ప్రత్యేకంగా కేటాయిం చడం, దాన్ని పవర్‌లూమ్‌లు, బట్టలమిల్లులు ఉత్పత్తి చేయకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవడం మరొక కార్యక్రమం. చాలాకాలం నుండి బట్టలపై ప్రభుత్వం రిబేటు ఇవ్వడం ద్వారా సహకరించే కార్యక్రమం కొనసాగుతూ వచ్చింది. దీని ద్వారా దొంగ లెక్కలు రాసి, ఉత్పత్తి, మార్కెట్, అమ్మకాలు లేకుండానే కాగితాలపై వాటన్నిటిని సృష్టించి భోంచేసే యంత్రాంగం పెరుగుతూ వచ్చింది. పైగా సహకార రంగంలో ఉన్న మగ్గాలు నాలుగింట ఒకటవ వంతు మాత్రమే. మిగతా మూడు వంతుల నేత కార్మికులకు ఆ సౌకర్యం కూడా అందేది కాదు. అందువల్ల ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, ప్రావిడెంట్ ఫండ్, జియో ట్యాగింగ్ వంటి వాటిని అనుసంధానించి పక్కాగా ప్రత్యక్షంగా చేనేత వృత్తివారికి లాభం కలిగించడం అవసరం. తిరిగి చేనేత అభివృద్ధికి కొత్త దృక్పథం అవసరమవుతున్నది. చిరిగిన బట్టలను, చింపుకుని బట్టలను వేసుకోవడం ఫ్యాషన్‌గా మారింది. ఎంత చినిగితే అంత ఫ్యాషన్. అలా జీన్స్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చారు. అదేవిధంగా ఒక ఫ్యాషన్‌గా చేనేతను అందరికీ ఆకర్షణీయంగా మార్చినపుడే దాని మార్కెట్, ప్రాచుర్యం పెరుగుతుంది. పట్టుచీర కట్టుకోవడం ఒక సామాజిక గౌరవం. ఖాదీ బట్టలు వేసుకోవడం ఒక సామాజిక గౌరవం. అలాగే సూటు వేసుకోవడం సామాజిక గౌరవాన్ని తెలుపుతుంది. ఈ విధంగా ఆలోచించి చేనేతను ఒక ఫ్యాషన్‌గా, ఒక సామాజిక గౌరవానికి ప్రతిష్టగా మార్చే కృషి చేయడం అవసరం. చేనేతలో కాళ్ళతో తొక్కడంగానీ, చేతులతో షట్టర్ కొట్టడంగానీ ప్రతిసారీ 25 కిలోల బరువును మోయడం, నెట్టడం జరుగుతున్నది. ఎని మిది, పది గంటలు ప్రతిసారీ 25 కిలోల బరువు నెట్టడం అనే పరిశ్రమ చేనేత కార్మికులను, వారి ఆయుష్షును, ఆరోగ్యాన్ని, దేహదారుఢ్యాన్ని దెబ్బతీస్తున్నది. చీరలకు అంచులు, డిజైన్లు, కొంగులు ప్రత్యేకంగా రూపొందించడానికి పింజర అవసరం పడుతుంది. ఈ పింజర తిరగడానికి 25 కిలోలకు తోడుగా మరో పది కిలోల బరువు చేతులు, కాళ్ళపై పడుతున్నది. అందువల్ల ఈ బరువును కుట్టుమిషన్ మోటార్వలె హాఫ్ హెచ్‌పీ మోటారు బిగించి చేనేత కార్మికులకు బరువు, భారం తగ్గించడం చేయవచ్చు. దీనికి తోడు ప్రభుత్వం పత్తిని సేకరించి నూలు వడికించి, ఆ నూలును చేనేత కార్మికులకు అందించే ఒక సమగ్ర కార్యక్రమ రూపకల్పన కలిగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు ఆత్మహత్యలను నివారించవచ్చు. సబ్సిడీ ఇవ్వడంలో భాగంగా గతంలో అనేక పర్యాయాలు ప్రతిపాదించిన ప్రతిపాదనను ఇప్పటికైనా ఆచరణలో తీసుకోవడం అవసరం. చేనేత రంగానికి సబ్సిడీతోపాటు చేనేత వృత్తివారికి వంద రోజుల పనికల్పనతో పని కల్పించి ఆ ఉత్పత్తులను సేకరించి ఆయా పండుగల్లో ప్రజలకు ఉచి తంగా గానీ, గురుకుల పాఠశాలల్లో, కళాశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధినీ విద్యార్ధులకు అందించడం ద్వారా ఒకేసారి అనేక ప్రయోజనాలు చేకూరతాయి. ఇలా ప్రభుత్వం ఏటా ఇవ్వదలచుకున్న గ్రాంట్లు, సబ్సిడీలు తిరిగి చేనేత కార్మికులకే కాకుండా ప్రత్యక్షంగా ప్రజలకు కూడా దాని ప్రయోజనం అందే విధంగా పథకాలను రూపొందించడం ద్వారా జాతీయ చేనేత దినోత్సవం నిజంగానే నూతన చరిత్ర సృష్టించడానికి మార్గం వేస్తుంది. (నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా) బి.ఎస్.రాములు వ్యాసకర్త ఛైర్మన్, తెలంగాణ బి.సి. కమిషన్ ‘ 83319 66987 -
చేనేత రుణాలు మాఫీ చేశాం : మంత్రి
సాక్షి, అమరావతి : చేనేత రుణాలను మాఫీ చేశామని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన 13జిల్లాల చేనేత సంఘాల నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులకు 50ఏళ్లకు పెన్షన్లు ఇచ్చామని, అదనంగా మరో 25 వేల పెన్షన్లను ఇస్తామని చెప్పారు. ఆప్కో బకాయిలను వెంటనే చెల్లిస్తామని, వర్షా కాలంటో మగ్గాలు పనిచేయని సమయంలో రెండు నెలలు డబ్బు చెల్లించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. జనతా వస్త్రాలను పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నామని, కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ తిరిగి అమలు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న 24లక్షల మంది చేనేత కార్మికలకు ప్రభుత్వ పథకాలు అందడానికి కార్పొరేషన్, లేదా లేబర్ వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటును పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పారు. చేనేత కులంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామన్నారు. గత ప్రభుత్వాలు బలహీన వర్గాలను పూర్తిగా విస్మరించాయని అన్నారు. సీఎం మీద కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇందులో భాగంగానే మత్స్యకారులు, నాయి బ్రాహ్మణల అంశాన్ని రాద్ధాంతం చేశారని మండిపడ్డారు. బీసీ సంక్షేమంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. రజకులు, మత్స్యకారులకు రిజర్వేషన్లపై అధ్యయనం చేస్తున్నామని వెల్లడించారు. -
చేనేతల కష్టాలు స్వయంగా తెలుసుకున్న వైఎస్ జగన్
-
చేనేత ఆత్మగౌరవం నిలబెడదాం
కోరుట్ల: చేనేత కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడే దిశలో పోరాటం ఉధృతం చేయాలని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. కోరుట్ల పద్మశాలీ సంఘం ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత ఉత్పత్తులకు బహుళ ప్రాచుర్యం కల్పించి కార్మికుల సంక్షేమానికి పాటుపడాలన్నారు. వర్తక, వాణిజ్య రంగాల్లో మార్గదర్శకులుగా ఉన్న పద్మశాలీలు సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కోరుట్ల పద్మశాలీ సంఘం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని కోరారు. వ్యక్తిగత వైషమ్యాలకు తావివ్వకుండా పద్మశాలీల సంక్షేమానికి పూర్తి సమయం ఇవ్వాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. చేనేత కార్మికుల హక్కుల పరిరక్షణకు అలుపెరగకుండా ఉద్యమించాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ మాట్లాడుతూ పద్మశాలీలు ఐక్యతకు ప్రతీ ఒక్కరు నిరంతరం పాటుపడాలన్నారు. ఐక్యంగా ముందుకు సాగితేనే సామాజికంగా, రాజకీయంగా తగిన గుర్తింపు వస్తుందన్నారు. నూతన అధ్యక్షుడు గుంటుక శ్రీనివాస్ మాట్లాడుతూ, పద్మశాలీల సేవలో నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. వారి శ్రేయస్సుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొసికె యాదగిరి, ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జ రాజేశ్వరి, పోపా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌రాజ్, ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు మార్త రమేశ్, నాయకులు వాసం భూమానందం, సదుబత్తుల హరిప్రసాద్, చెన్న విశ్వనాథం, గుంటుక ప్రసాద్, జక్కుల ప్రసాద్, అల్లె సంగయ్య, జిల్లా ధనుంజయ్, వాసాల గణేష్‌లు పాల్గొన్నారు. కొత్త పాలకవర్గ ప్రమాణస్వీకారం పద్మశాలీ సంఘం నూతన అధ్యక్షుడిగా గుంటుక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా రుద్ర సుధాకర్, ఉపాధ్యక్షులుగా మచ్చ రమేష్, సహాయ కార్యదర్శిగా జిందం లక్ష్మీనారాయణ, కోశాధికారిగా ఆడెపు నరేష్కుమార్, యువత అధ్యక్షుడిగా అందె రమేష్, ఉపాధ్యక్షుడిగా కటుకం వినయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా జక్కుల ప్రవీన్‌కుమార్, సహాయ కార్యదర్శిగా బండి సురేష్, కోశాధికారిగా చింతకింది ప్రేమ్‌కుమార్‌తో ఎన్నికల అధికారులు కాచర్ల శంకరయ్య, మార్గం రాజేంద్రప్రసాద్, కడకుంట్ల సదాశివ్‌లు ప్రమాణ స్వీకారం చేయించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఆవిష్కరణ కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని రాజ్యసభ సభ్యులు రాపోల్ ఆనంద భాస్కర్ ఆవిష్కరించారు. -
కష్టాల కడలిలో చేనేత
కర్నూలు, కోవెలకుంట్ల: చేనేతల సంక్షేమంపై సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంలో కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. వంశపారంపర్యంగా నమ్ముకున్న వృత్తి నట్టేట ముంచడంతో వ్యవసాయ పనులు చేయలేక, ఇతర ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వారి జీవనం ఆగమ్యగోచరంగా మారింది. ఆదుకోవాల్సిన సొసైటీలు చూయూతనివ్వడం లేదు. కోవెలకుంట్ల, సంజామల, అవుకు మండలాల్లో సుమారు వెయ్యి కుటుంబాలు చేనేత వృత్తి నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. కోవెలకుంట్ల డివిజన్లోని బిజనవేముల, వెలగటూరు, సంజామల, నొస్సం, ముక్కమల్ల, కానాల, సంగపట్నం, కాశీపురం గ్రామాల్లో చేనేతలు నూలు, పట్టు చీరెలు, ఖద్దరు వస్త్రాలు నేయడం ద్వారా వచ్చే కూలితో కుటుంబాలను పోషించుకుంటున్నారు. బతుకులు చిద్రం.. ఏళ్ల తరబడి వృత్తినే నమ్ముకుని కాలం వెల్లదీస్తున్నారు. సొసైటీల ద్వారా వస్త్రాలు, చీరెలు నేసేందుకు కావాల్సిన దారం, మెటీరియల్ సరఫరా చేయడంతో పాటు స్వతహాగా ఉపాధి పొందేందుకు రుణాలు అందజేయాల్సి ఉండగా సొసైటీలు నిర్వీర్యమవడంతో వారి బతుకులు దయనీయంగా మారాయి. కడప జిల్లా జమ్మలమడుగు, ఎమ్మిగనూరు, ప్రొద్దుటూరు పట్టణాలకు చెందిన వ్యాపారులు పట్టు, నూలు చీరెలు, ఖద్దరు వస్త్రాలు నేసేందుకు కావలసిన రేషం, జరీ, దారం, నూలు, రంగులు, తదితర మెటీరియల్‌ను సరఫరా చేస్తుండగా ఆయా గ్రామాలకు చెందిన చేనేతలు వస్త్రాలు నేసి వ్యాపారులకు అందజేస్తుండగా వారిచ్చే కూలితో జీవనం సాగిస్తున్నారు. ఆదాయం అంతంతే.. వస్త్రాలు నేయడం ద్వారా వచ్చే కూలి అంతంత మాత్రంగానే ఉండగా వీటిని నేసేందుకు ఎక్కువ సమయం పడుతోందని చేనేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ మగ్గం ద్వారా పట్టుచీర తయారు చేసేందుకు 3 రోజులు, నూలు చీర, ఏడు మీటర్ల ఖద్దరు వస్త్రం నేసేందుకు ఒక రోజు సమయం పడుతుంది. అలాగే విద్యుత్ మగ్గాల ద్వారా పట్టుచీరకు ఆరుగంటలు, నూలు చీరకు 4 గంటల సమయం పడుతుందని వారు చెబుతున్నారు. మూడు రోజులు కష్టపడి చీర నేస్తే రూ.300, మీటరు ఖద్దరుకు రూ.14 కూలి ఇస్తున్నారని వాపోతున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు పెరిగిపోవడంతో వచ్చే కూలితో కుటుంబాన్ని పోషించడం కష్టమారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూట గడవటమే కష్టంగా మారటంతో కొన్ని కుటుంబాలు వృత్తికి స్వస్తి చెప్పి ఇతర పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మిగిలిన కుటుంబాలు వృత్తిని వదలుకోలేక, ఇతర పనులు చేయలేకపోతున్నారు. ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడంతో వారి జీవనం కష్టంగా మారింది. ఇప్పటికైనా ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
మగ్గాలపై..ఆఖరితరం!
సిరిసిల్ల నుంచి వూరడి మల్లికార్జున్: చిన్న చేపను పెద్ద చేప మింగినట్లు.. చేనేత మగ్గాలను మరమగ్గాలు (పవర్‌లూమ్స్) మింగేశాయి. కాలంతో పోటీ పడలేక.. జిగిసచ్చిన వృద్ధ కార్మికు లు మరో పని చేతకాక.. వయసు మీద పడినా.. కళ్లు కనిపించకున్నా.. ఒళ్లు సహకరించకున్నా.. కాళ్లు, చేతులు ఆడిస్తూ.. జానెడు పొట్టకోసం బట్ట నేస్తు న్నారు. ఎంత పనిచేసినా.. తక్కువ కూలీ వస్తుంది. మీటరు వస్త్రం నేస్తే రూ.17. దీంతో రోజంతా పని చేసినా.. రూ.100 రావడం కష్టం. మరో పని చేత కాని చేనేతను నమ్ముకున్న ఆఖరి తరం ఈ పనిలోనే కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికు లంతా 60ఏళ్ల పైబడిన వారే కావడం విశేషం. సిరిసిల్ల జిల్లాలో 175 మంది కార్మికులున్నారు. ఒంట్లో సత్తువ లేకున్నా.. చేనేత మగ్గంపై బట్టనేస్తున్న ఇతని పేరు మామిడాల చంద్రయ్య(92). సిరిసిల్ల విద్యానగర్‌లో ఉండే చంద్రయ్య చిన్ననాటి నుంచే చేనేత మగ్గంపై బట్టనేస్తున్నాడు. ఒకప్పుడు చేనేత వస్త్రాలు తయారుచేస్తూ బాగానే బతికాడు. ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు చేతగాని పానం.. ఎముకలు తేలిన ఒళ్లు.. మగ్గంపై జోటను ఆడియ్యాలంటే రెక్కల్లో సత్తువ లేదు. దీంతో ఆయన పని మానేశారు. ఇప్పుడు చేనేత మగ్గాలపై బట్ట నేస్తున్న కార్మికులు పని మానేస్తే.. ఇక కొత్తగా చేనేత మగ్గాలను నడిపే వారు ఉండరు. చేనేత మగ్గాలకు ముసలితనం వచ్చింది. నేటి యువ ‘తరం’ చేనేత మగ్గాలను నడిపేందుకు ఆసక్తి చూపడం లేదు. మగ్గం మరణశయ్యపై నిలిచింది. 1990లో సిరిసిల్లలో చేనేత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నైపుణ్యం కలిగిన శిక్షకులతో యువ కార్మికులకు ఆరునెలల శిక్షణ ఇచ్చేవారు. రూ.1200 ఉపకార వేతనం ఇస్తూ ప్రోత్సహించారు. చేనేత రంగంలో ఉపాధి అవకాశాలు లేక శిక్షణ పొందేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో సిరిసిల్లలోని శిక్షణ కేంద్రాన్ని కరీంనగర్‌కు తరలించారు. అక్కడా ఇదే పరిస్థితి. తిరిగి 2015లో సిరిసిల్ల శివారులోని టెక్స్టైల్ పార్క్‌లోకి శిక్షణ కేంద్రాన్ని తరలించారు. మగ్గాల పరికరాలను ఓ అద్దె ఇంట్లో మూలన పడేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన వారికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కేంద్రం మూలనపడింది. 17 చేనేత మగ్గాలు పనికి రాకుండా పోయాయి. -
ఎట్టకేలకు చేనేతలకు పింఛన్
ప్రొద్దుటూరు టౌన్ : ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి గాంధీ మార్గం ద్వారానే సమస్యను పరిష్కరించగలిగారు. 31 రోజుల ఆందోళన అనంతరం 77 మంది చేనేతలకు అధికారపార్టీ నేతల చేతుల మీదుగాప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్లు ఇప్పించి వారి మన్ననలు పొందారు. ప్రభుత్వం చేనేత ఐడీ కార్డులు కలిగిన వారి నుంచి పింఛన్ల కోసం దరఖాస్తులను గత ఏడాది ఆహ్వానించింది. పట్టణంలోని 13 వార్డుల్లో ఉన్న 436 మంది దరఖాస్తు చేసుకున్నారు. జౌళిశాఖ ఏడీఓ విజయానంద్ ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరించి ప్రభుత్వానికి పంపారు. వీరిలో ఐడీ కార్డులు ఉన్న 77 మందిని పింఛన్లకు అర్హులుగా తేల్చి నవంబర్‌లో మున్సిపాలిటీకి జాబితా పంపింది. డీఆర్డీ అధికారుల ఆదేశాల మేరకు 77 మంది వివరాలను జన్మభూమి కమిటీ సభ్యులు ఆయా వార్డుల కౌన్సిలర్ల సంతకాలు చేయించి క్లర్క్ మనోహర్ ఆన్లైన్లో పొందుపరిచారు. అప్పటికంటే ముందు వచ్చిన వారి వివరాలను కమిషనర్‌కు తెలియజేశారు. ప్రభుత్వం 77 మందికి పింఛన్లు మంజూరు చేసి మొత్తాన్ని మున్సిపల్ ఖాతాలో జమ చేసింది. సిబ్బంది రెండు వార్డుల్లో నలుగురు చేనేతలకు పింఛన్ డబ్బు పంపిణీ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి తన సంతకం లేకుండా ఎలా పింఛన్లు ఆన్లైన్లో పొందుపరిచారంటూ క్లర్క్ మనోహర్‌పై ఫిర్యాదు చేసి సస్పెండ్ చేయించారు. అనంతరం డీఆర్డీఏ అధికారులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి పింఛన్లను నిలిపివేశారు. దీంతో నవంబర్ నెల పింఛన్ ఆగిపోయింది. డిసెంబర్లో సొమ్ము మున్సిపల్ ఖాతాలో జమ కావడం, చేనేతలకు పింఛన్ ఇవ్వని విషయాన్ని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలుసుకుని కమిషనర్‌ను ప్రశ్నించారు. సరైన సమాధానం రాకపోవడంతో చేనేతలతో కలసి ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయంలో... డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో ఎమ్మెల్యే, చేనేత లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయంలో ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. అధికారులు ఎవ్వరూ çస్పందించకపోవడంతో డిసెంబర్ 8న ప్రొద్దుటూరుకు వస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దృష్టికి సమస్యను తీసుకెళుతామని ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకటించారు. దీంతో కలెక్టర్ బాబురావు నాయుడు స్పందించి రామచంద్రారెడ్డి చేత దీక్ష విరమింపచేయాలని డీఆర్డీఏ పీడీని పంపించారు. ఉపరాష్ట్రపతి వెళ్లిన మరుసటి రోజు 9వ తేదీ మున్సిపాలిటీకి చైర్మన్ ఫిర్యాదుపై విచారించి పింఛన్ పంపిణీ చేస్తామని పీడీ హామీ ఇచ్చారు. అదే రోజు విచారణ చేసిన పీడీ 77 మంది పింఛన్లకు అర్హులని తేల్చి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. అయినా వరదరాజులరెడ్డి పింఛన్ ఇవ్వొద్దని చెప్పడంతో అధికారులు ఇవ్వలేదు. గత ఏడాది డిసెంబర్ 22న పుట్టపర్తి సర్కిల్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ఎమ్మెల్యే శాంతియుత మార్గంలో చేనేతలతో కలసి భిక్షాటన చేశారు. అయినా అధికారులు స్పందించలేదు. దీంతో డిసెంబర్ 28వ తేదీ నుంచి మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేనేతలతో కలసి ఎమ్మెల్యే చేశారు. ఐదో తేదీ ఇవ్వకపోతే ఆరో తేదీ ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఆరు నెలల పింఛన్ ఇస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. 7న అమరావతిలో సీఎం వెళ్లే రహదారిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జనవరి 4న 77 మంది చేనేతలకు మంత్రి ఆదినారాయణరెడ్డి, పింఛన్లను అడ్డుకున్న వరదరాజులరెడ్డి చేతుల మీదుగా పింఛన్లను ఇప్పించారు. శాంతి మార్గంలో ఎంతటి కష్టమైన సమస్యకైనా పరిష్కారం లభిస్తుందనేది ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. -
ఫేస్బుక్లో..చేనేత
భూదాన్‌పోచంపల్లి : రెండేళ్ల క్రితం ఎమిరేట్స్ ఆఫ్ జేడబ్ల్యూటీ హైదరాబాద్ చైర్మన్ అయిన సంతాజాన్ ఫేస్ బుక్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఇందులో అడిషనల్ డీజీపీ(స్పోర్ట్స్) తేజ్‌దీప్ కౌర్ మీనన్‌తోపాటు మరో ఇద్దరు అడ్మిన్‌గా ఉన్నారు. రెండేళ్లలో దేశవ్యాప్తంగా 12,796 మంది సభ్యులుగా చేరారు. గ్రూప్‌లో ఉన్న ప్రతి మహిళ ఏడాదిలో 100 వెరైటీ చీరలు కొనుగోలు చేసి ధరించాలన్నది దీని ముఖ్య ఉద్దేశం. ఇలా ఆయా రాష్ట్రాల్లో పేరొందిన చీరలను ధరించి ఫేస్బుక్లో పోస్ట్ చేయాలి. అంతేకాక వేసుకున్న బ్లౌజ్ డిజైన్ విశేషాలను కూడా తోటి మహిళలతో పంచుకోవాలి. చేనేతకు ఉపాధి ఆయా రాష్ట్రాల్లో పెరెన్నికగన్న పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేగ, సిద్ధిపేట గొల్లబామ చీరలు, బెనారస్, చదారీ, సంబల్పురి, కాంచివరం, పైతాని, డకాయ్, జామ్దానీ, ఒడిషా, గుజరాతి ఇక్కత్ ఇలా అనేక వెరైటీ చీరలను ఎగ్జిబిషన్లలో కొనుగోలు చేస్తుంటారు. ప్రతి మహిళ ఏడాదిలో 100 చీరలను కొనుగోలు చేసి ధరించాల్సి ఉంటుంది. ఇలా చీరలను కొనుగోలు చేస్తూ చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు. అంతేకాదు నేటి యువతకు చీర గొప్పదనాన్ని చాటిచెబుతున్నారు. మొదటిసారిగా పోచంపల్లి సందర్శన గ్రూప్ అడ్మిన్ అడిషనల్ డీజీపీ (స్పోర్ట్స్) తేజ్‌దీప్ కౌర్ మీనన్ ఆధ్వర్యంలో ది గ్లోబల్ 100 సారీస్ పాక్ట్ గ్రూప్‌సభ్యులు మొదటిసారిగా పోచంపల్లి క్షేత్ర పర్యటన నిమిత్తం ఇక్కడికి వచ్చారు. ఇక్కడ తయారవుతున్న చీరలను ప్రత్యక్ష చూశారు. చీరల తయారీలో కార్మికుల శ్రమ విలువను తెలుసుకున్నారు. కార్మికుల కళానైపుణ్యాలకు కొనియాడారు. అంతర్జాతీయ మార్కెట్లో పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు ఉన్న గుర్తింపును అడిగి తెలుసుకున్నారు. చీరలు బాగున్నాయి పోచంపల్లి ఇక్కత్ చీరలంటే నాకు చాలా ఇష్టం. ఎన్నో వెరైటీలను కొనుగోలు చేసి ధరించా. ఇప్పటివరకు 98 చీరలు కొనుగోలు చేశా. నెలాఖరులోగా 100 చీరల టార్గెట్ పూర్తి చేయాల్సి ఉండగా, పోచంపల్లిలో 2 చీరలు కొనుగోలు చేసి టార్గెట్ పూర్తి చేస్తా. –హిమబిందు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంప్రదాయానికి ప్రతీక.. చీరలు సం స్కృతి, సం ప్రదాయానికి ప్రతీక. ఇప్పటివరకు ఆయా రాష్ట్రాలలోని అనేక చీరలను కొనుగోలు చేశాను. చీరల కొనుగోలు చేసి కార్మికులకు ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నాం. మొదటిసారి పోచంపల్లి సందర్శనకు వచ్చాం. చీరలు ఎంతో నచ్చాయి. – సుమ, గృహిణి, హైదరాబాద్ 350 చీరలు సేకరించా.. రెండేళ్లలో 350 వెరైటీ చీరెలు కలెక్షన్ చేశారు. నేను కొనుగోలు చేసిన ప్రతిచీరకు ఒక ప్రత్యేకత ఉంటుంది. పోచంపల్లి ఇక్కత్ చీరలు నిండుదనంగా ఉంటా యి. పశ్చిమబెంగాల్లో డకాయ్, జామ్దానీ చీరలు ప్రసిద్ధి. వీటివిలు వ రూ.30వేల వరకు ఉంటాయి. – మంజుశ్రీ బసు,పశ్చిమబెంగాల్ నేటితరానికి పరిచయం చేయాలని.. చీర గొప్పదనాన్ని నేటితరానికి పరిచ డం చేయడానికి ఫేస్బుక్ గ్రూప్ దోహదపడుతుంది. గ్రూప్‌లో మహిళలతోపాటు యవతకు కూడా చేరుతున్నారు. వందల మంది గ్రూప్ ఫాలో అవుతున్నారు. రోజూ వేల డిజైన్లు పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. –ప్రజ్ఞ, ఉద్యోగి -
‘చేనేత’ పాలసీ తీసుకొస్తాం
జాతీయ చేనేత దినోత్సవంలో కేటీఆర్ హైదరాబాద్: చేనేత కార్మికులను ప్రోత్సహించి వారికి తోడ్పాటునందిస్తామని, త్వరలోనే నూతన చేనేత పాలసీ తీసుకొస్తామని మంత్రి కె.తారకరామారావు చెప్పారు. రవీంద్రభారతిలో ఆదివారం జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో కేటీఆర్ మాట్లాడుతూ... త్వరలోనే చేనేత ప్రాంతాల్లో పర్యటిస్తామన్నారు. చిత్తశుద్ధితో చేనేత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తామని, ఈ రంగం అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో తోడ్పాటు అందిస్తామని చెప్పారు. అనంతరం చేనేత లక్ష్మి పథకం క్రెడిట్, డెబిట్ కార్డుల బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ పథకానికి హెచ్డీఎఫ్సీ బ్యాంకు అందిస్తున్న చేయూతను అభినందించారు. చేనేత రంగానికి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించి కార్మికుల ఆత్మహత్యలను నివారించాలని తెలంగాణ పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రాజ్ భైరి మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. హెచ్డీఎఫ్సీ హైదర్‌గూడ బ్రాంచ్ మేనేజర్ చిన్నయ్య బోధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత ఉత్పత్తులతో యువతులు చేసిన ఫ్యాషన్ షో అలరించింది.