న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తాజాగా ట్రైబ్స్ ఇండియా సంస్థతో కలిసి కారీగర్ మేళాను ప్రారంభించింది. ఈ ఒప్పందం ప్రకారం సంప్రదాయ గిరిజన ఉత్పత్తులు, భారతీయ హస్తకళల ఉత్పత్తుల కోసం అమెజాన్ తమ పోర్టల్‌లో ప్రత్యేక విభాగాన్ని కేటాయించింది.
బిద్రి, ఇక్కత్, పటచిత్ర తదితర సుమారు 1.2 లక్షల పైచిలుకు ఉత్పత్తులు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ కార్యక్రమం కింద ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 12 దాకా రెండు వారాల పాటు కారీగర్ విక్రేతలకు సెల్లింగ్ ఆన్ అమెజాన్ (ఎస్‌వోఏ) ఫీజు నుంచి 100 శాతం మినహాయింపు లభిస్తుంది.
దేశీ చేనేతకారులు, చేతి వృత్తుల కళాకారులు ఈ–కామర్స్ ద్వారా మరింత వృద్ధిలోకి వచ్చేందుకు తోడ్పడేలా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో కలిసి పనిచేయడం కొనసాగిస్తామని అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment