handloom
-
చేనేతను ఫ్యాషైన్ చేద్దాం!
ఇకత్ చీరతో వేడుకలో వెలిగిపోతాం. నారాయణపేట మెటీరియల్‌తో డిజైనర్ బ్లవుజ్ కుట్టించుకుంటాం. మన సంప్రదాయ వస్త్రధారణ మనల్ని ఫ్యాషన్ పెరేడ్లో తళుక్కుమని తారల్లా మెరిపిస్తోంది. ఇవి ఇంత అందంగా ఎలా తయారవుతాయి. ఒక డిజైన్ని విజువలైజ్ చేసి వస్త్రం మీద ఆవిష్కరించే చేనేతకారులు ఏం చదువుతారు... ఈ ప్రశ్నలకు జవాబులు వెతికే ప్రయత్నం చేశారు మిసెస్ ఇండియా (Mrs India) విజేత సుష్మ. ఈ వస్త్రాలను నేసే చేతులను, ఆ వేళ్ల మధ్య జాలువారుతున్న కళాత్మకతను దగ్గరగా చూడాలనిపించింది. పోచంపల్లి బాట పట్టారామె. కళాత్మకత అంతా చేనేతకారుల చేతల్లోనే తప్ప వారి జీవితాల్లో కనిపించలేదు. నూటికి రెండు–మూడు కుటుంబాలు ఆర్థికంగా బాగున్నాయి. మిగిలిన వాళ్లంతా ఈ కళను తమ తరంతో స్వస్తి పలకాలనుకుంటున్న వాళ్లే. మరి... ఇంత అందమైన కళ తర్వాతి తరాలకు కొనసాగకపోతే? ఒక ప్రశ్నార్థకం. దానికి సమాధానంగా ఆమె తనను తాను చేనేతలకు ప్రమోటర్‌గా మార్చుకున్నారు. చేనేతకారుల జీవితాలకు దర్పణంగా నిలిచే డాక్యుమెంటరీలు చిత్రీకరించారు. తాను పాల్గొనే ఫ్యాషన్ పెరేడ్లు, బ్యూటీ కాంటెస్ట్‌లలో మన చేనేతలను ప్రదర్శిస్తున్నారు. ఆ చేనేతలతోనే విజయాలు సొంతం చేసుకుంటున్నారు. స్వతహాగా ఎంటర్ప్రెన్యూర్ అయిన సుష్మా ముప్పిడి (Sushma Muppidi) మన హస్తకళలు, చేనేతలను ప్రపంచవేదిక మీదకు తీసుకెళ్లడానికి మార్గం సుగమం చేశారు.వైఫల్యమూ అర్థవంతమే! చీరాలకు చెందిన సుష్మ ముప్పిడి బీటెక్, ఎంబీఏ చేశారు. కొంతకాలం గుంటూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం, పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంతోపాటు మరో ప్రైవేట్ కాలేజ్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేశారు. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఉద్యోగం... ఈ జర్నీలో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. ఉద్యోగం కోసం తన హండ్రెడ్‌పర్సెంట్ ఇస్తోంది. పిల్లల కోసం గడిపే సమయం తగ్గిపోతోంది. వెనక్కి చూస్తే తనకు మిగిలిందేమిటి? సివిల్ సర్వీసెస్ ప్రయత్నం సఫలం కాలేదు. ఉనికి లేని సాధారణ ఉద్యోగంతో తనకు వచ్చే సంతృప్తి ఏమిటి? సమాజానికి పని చేయడంలో సంతృప్తి ఉంటుంది, తనకో గుర్తింపునిచ్చే పనిలో సంతోషం ఉంటుంది. ఇలా అనుకున్న తర్వాత యూత్‌లో సోషల్ అవేర్నెస్ కోసం కార్యక్రమాలు నిర్వహించారు. ఆ ప్రయాణంలో అనుకోకుండా బ్యూటీ కాంపిటీషన్లో పాల్గొనవడం విజేతగా నిలవడం జరిగింది. సోషల్ ఇనిషియేటివ్, వెల్ స్పోకెన్, బెస్ట్ కల్చరల్ డ్రెస్, మిసెస్ ఫ్యాషనిష్టా వంటి గుర్తింపులతోపాటు ‘యూఎమ్బీ ఎలైట్ మిసెస్ ఇండియా 2024’ విజేతగా నిలిచారు. ఈ ఏడాది మార్చి ఒకటిన ఇటలీలోని మిలన్ నగరంలో, ఎనిమిదవ తేదీన ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో జరిగే ఫ్యాషన్ షోలలో భారత చేనేతలు అసోం సిల్క్, మల్బరీ సిల్క్లను ప్రదర్శించనున్నారు. జూన్‌లో యూఎస్, ఫ్లోరిడాలో జరిగే మిసెస్ యూనివర్సల్ వేదిక మీద మనదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు సుష్మ. ఇవన్నీ ఆత్మసంతృప్తినిచ్చే పనులు. ఇక తనకు రాబడి కోసం ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారారు. హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆఫీస్ నుంచి యూఎస్, దుబాయ్, సింగపూర్లలో డైమండ్ బిజినెస్ (Diamond Business) నిర్వహిస్తున్నారు. ‘‘జీవితంలో గెలవాలి, నా కోసం కొన్ని సంతోషాలను పూస గుచ్చుకోవాలి. నన్ను నేను ప్రశంసించుకోవడానికి సమాజానికి నా వంతు సర్వీస్ ఇవ్వాలి’’ అన్నారు సుష్మ. ‘‘వయసు దేనికీ అడ్డంకి కాదు. అంతా మన అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది. మీ కలలను నిజం చేసుకోవాలంటే ఒక ముందడుగు వేయండి. సక్సెస్ అవుతామా, విఫలమవుతామా అనే సందేహాలు వద్దు. ఏ ప్రయత్నమూ చేయకపోవడం కంటే ప్రయత్నించి విఫలమైనా కూడా అది అర్థవంతమయిన వైఫల్యమే. కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకోకూడదు’’ అని మహిళలకు సందేశమిచ్చారు. ఇది నా చేయూత పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిరిసిల్లలకు వెళ్లి స్వయంగా పరిశీలించాను. మన చేనేత కుటుంబాలు కళకు దూరం కాకుండా ఉండాలన్నా, ఇతరులు ఈ కళాత్మక వృత్తిని చేపట్టాలన్నా ఇది ఉపాధికి సోపానంగా ఉండాలి. అందుకోసం చేనేతలను కార్పొరేట్ స్థాయికి చేరుస్తాను. సమావేశాలకు ఉపయోగించే ఫైల్ ఫోల్డర్స్, ఇంట్లో ఉపయోగించే సోఫా కవర్స్, వేడుకల్లో ధరించే బ్లేజర్స్ వంటి ప్రయోగాలు చేసి మన చేనేతలను ప్రపంచవేదికలకు తీసుకెళ్లాలనేదే నా ప్రయత్నం. నేను ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎల్లలు దాటి విదేశాలకు విస్తరించాను. చదవండి: అన్నదాత మెచ్చిన రైతుబిడ్డకాబట్టి నాకున్న ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకుని మన చేనేతలను ప్రమోట్ చేయగలుగుతున్నాను. కలంకారీ కళ కోసం అయితే ప్రత్యేకంగా వర్క్‌షాప్ నిర్వహించి కలంకారీ కళాకారులకు ఉచితంగా స్టాల్స్ ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేశాను. పారిస్, యూఎస్ కార్యక్రమాల తర్వాత ఆ పని. సివిల్స్ సాధించినా కూడా ప్రత్యేకంగా ఒక అంశం మీద సమగ్రంగా పని చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు నేను ఒక కళాత్మక సమాజానికి ఇస్తున్న సర్వీస్ నాకు అత్యంత సంతృప్తినిస్తోంది. ప్రపంచ ఫ్యాషన్ వేదిక మీద మన భారతీయ చేనేతకు ప్రాతినిధ్యం వహించాలి. మన నేతలకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించాలనేది నా లక్ష్యం. – సుష్మ ముప్పిడి, మిసెస్ ఇండియా– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ప్రతినిధి -
పట్టుకు పెట్టింది పేరు ఎమ్మిగనూరు
∙పి.ఎస్. శ్రీనివాసులు నాయుడు, కర్నూలుభారతీయ మహిళల వస్త్రధారణలో చీరకు ఉన్న ప్రత్యేకత ఎన్నటికీ వన్నె తరగనిది. భారత ఉపఖండానికి మాత్రమే పరిమితమైన చీర ఇప్పుడిప్పుడే పాశ్చాత్యులనూ ఆకట్టుకుంటోంది. కాలం తెచ్చిన మార్పుల్లో చీరకట్టు కొంత వెనుకబడింది. ఆధునిక జీవనశైలి ఆదరాబాదరాగా మారడంతో మగువలు సులువుగా ధరించడానికి వీలయ్యే సల్వార్ కమీజ్‌లు, జీన్స్, టీ షర్ట్స్ వంటి దుస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. అయినప్పటికీ పండుగలు, వేడుకలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాల వేళల్లో మాత్రం పట్టుచీరల రెపరెపలు నిండుగా కనువిందు చేస్తున్నాయి. పట్టుచీరల డిజైన్లలోను, వాటి జరీ అంచుల తీరుల్లోను కొత్త కొత్త ఫ్యాషన్లు పుట్టుకొస్తున్నాయి.దేశంలోని కొన్ని ప్రదేశాలు చేనేతకు చిరునామాలుగా తమ ప్రత్యేకతను ఇంకా నిలుపుకొంటూ వస్తున్నాయి. అలాంటి ప్రదేశాల్లో కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు ఒకటి. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు చేనేతకు పెట్టింది పేరు. విజయనగర సామ్రాజ్యకాలం నుంచే ఇక్కడ నిపుణులైన నేతగాళ్లు ఉండేవాళ్లు. తర్వాతి కాలంలో వనపర్తి సంస్థానాధీశులు, హైదరాబాద్ నవాబులు ఇక్కడి చేనేత వస్త్రాలను బాగా ఆదరించేవారు. స్వాతంత్య్రానికి మునుపే, 1938లో ‘పద్మశ్రీ’ మాచాని సోమప్ప ఇక్కడ ఎమ్మిగనూరు చేనేతకారుల సహకార సంఘాన్ని ప్రారంభించారు. ఇక్కడి చేనేతకారులు మగ్గాల మీద చీరలతో పాటు రుమాళ్లు, తువ్వాళ్లు, పంచెలు, దుప్పట్లు, దోమతెరలు వంటివి కూడా నేస్తున్నారు. తొలినాళ్లలో నూలు వస్త్రాలను నేసే ఇక్కడి చేనేతకారులు, 1985 నుంచి పట్టుచీరల నేత కూడా ప్రారంభించారు. శుభకార్యాల్లో పట్టుచీరలకే ప్రాధాన్యంచీరల్లో రకరకాల ఫ్యాషన్లు వస్తున్నాయి. పండుగలు పబ్బాలు, వేడుకలు, శుభకార్యాలలో సందర్భానికి తగిన చీరలు ధరించడానికి మగువలు ఇష్టపడుతున్నారు. ఇటీవలికాలంలో డిజైనర్ శారీలు, వర్క్ శారీలు ఫ్యాషన్‌గా కొనసాగుతున్నాయి. అయినా, పెళ్లిళ్ల వంటి శుభకార్యాల్లో మాత్రం మహిళలు పట్టుచీరలకే ప్రాధాన్యమిస్తున్నారు. పట్టుచీరల తయారీకి మగ్గాలతో పాటు ఇటీవలి కాలంలో యంత్రాలను కూడా ఉపయోగిస్తున్నారు. అయితే, పూర్తిగా మగ్గంపై నేసిన చేనేత పట్టుచీరలకే గిరాకీ ఎక్కువగా ఉంటోంది. పట్టుచీరలతో పాటు సహజమైన రంగులతో నేసిన చేనేత నూలు చీరలను ధరించడానికి చాలామంది మహిళలు ఇష్టపడుతున్నారు. సాధారణ జరీ నుంచి వెండి జరీ వరకు రకరకాల జరీ అంచుల పట్టుచీరలను నేయడంలో ఎమ్మిగనూరు చేనేతకారులు చక్కని నైపుణ్యం కనబరుస్తున్నారు. తగ్గిన చీర పొడవుఇదివరకటి కాలంలో తొమ్మిది గజాల చీరలు, ఏడు గజాల చీరలు, ఆరు గజాల చీరలు విరివిగా వాడుకలో ఉండేవి. కాలక్రమంలో చీరల పొడవు బాగా తగ్గింది. ఇప్పడు చీరల పొడవు ఐదు మీటర్లకే పరిమితమైపోయింది. ఇక వెడల్పు సుమారు 1.2 నుంచి 1.5 మీటర్ల వరకు ఉంటోంది. మగ్గం మీద పట్టుచీర నేయడానికి ఎంతో ఓపిక, శ్రమ, నైపుణ్యం అవసరం. వీటి నేతకు రెండు రకాల మగ్గాలను వినియోగిస్తుం టారు– చిన్న మగ్గాలు, పెద్ద మగ్గాలు. చిన్న మగ్గం మీద చీర నేయడానికి కనీసం నాలుగు రోజులు పడుతుంది. వెయ్యి రూపాయల కూలి దొరుకుతుంది. పెద్దమగ్గంగా చెప్పుకొనే జాకాట్ మగ్గం మీద చీర నేయడానికి నెల రోజులు పడుతుంది. ఒక చీర నేసినందుకు పన్నెండువేల రూపాయల వరకు ప్రతిఫలం దొరుకుతుంది. ఇక్కడ తయారు చేసిన చీరలను మాస్టర్ వీవర్స్ గద్వాల్ చీరలు, ధర్మవరం పట్టుచీరలుగా బ్రాండింగ్ చేసి విక్రయిస్తున్నారు.⇒ కర్నూలు జిల్లాలో చేనేత కుటుంబాలు 4,000⇒ ఉమ్మడి జిల్లాలో మగ్గాలు 10,000⇒ కర్నూలు నగరంలో వస్త్ర దుకాణాలు 700⇒ పట్టుచీరల రకాలు 10⇒ నగరంలో పట్టుచీరల గరిష్ఠ ధర రూ. 50,000⇒ గద్వాల పట్టుచీరల గరిష్ఠ విలువ రూ.25,000 -
నేతన్న కంట కన్నీళ్లు
చీరాల: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చేనేతలకు పుట్టినిల్లు చీరాల ప్రాంతం. చీరాలతోపాటు పొద్దుటూరు, జమ్మలమడుగు, పెడన, ఐలవరం, బద్వేలు, ఆత్మకూరు, తాటిపర్తి వంటి ప్రాంతాల నుంచి 40 ఏళ్ల కిందట వలసలు వచ్చిన కార్మికులు స్థానికంగా మాస్టర్ వీవర్లకు సంబంధించిన చేనేత షెడ్డుల్లోని మగ్గాలపై పని చేస్తూ జీవనం సాగిస్తుంటారు. జిల్లాలో 33,184 వేల మగ్గాల వరకు ఉండగా 24,000 చేనేత కుటుంబాలు ఉన్నాయి. వీరిలో మొత్తం 50 వేల మంది చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారు. జీఎస్టీ రద్దు హామీ అమలయ్యేనా..? మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న చేనేత పరిశ్రమపై జీఎస్టీ పెనుభారంగా మారింది. చేనేత వృత్తులు చేసే వారికి 29 శాతం జీఎస్టీ మినహాయింపు ఇస్తామని చెప్పినా అమలయ్యేలా లేదు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ మినహాయింపుపై నేటికీ కూటమి సర్కారు ఎలాంటి ప్రకటన చేయలేదు. చేనేతలు కూటమి సర్కారులో మేలు జరగకపోగా చేనేతలు కునారిల్లుతున్నారు. చేనేత వృత్తిలో రాణించలేక చివరకు కారి్మకులు ఇతర వృత్తుల వైపు తరలిపోతున్నారు. కరువైన నేతన్న నేస్తం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం బడ్జెట్లో చేనేతలకు రూ.200 కోట్లు కేటాయింపుతోపాటుగా ఒక్కో చేనేత కుటుంబానికి రూ.24 వేలు అందించారు. చేనేతలకు పూర్వ వైభవం తీసుకువచ్చి నేతన్నల తలరాత మార్చేందుకు చర్యలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ రూ.2.94 లక్షల కోట్లలో చేనేత రంగానికి నామమాత్రంగా 0.066 శాతం కేటాయించారని కారి్మక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కలగానే చేనేత పార్కు.. చేనేతలు అధికంగా ఉన్న చీరాల ప్రాంతంలో 50 ఎకరాలలో చేనేత పార్కు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు చీరాల వచ్చిన సందర్భంగా నమ్మబలికారు. నేటికీ ఆ ఊసే లేకుండా పోయింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాల మండలం జాండ్రపేటలో నిర్వహించిన సదస్సుకు ఆ శాఖ మంత్రి సవిత హాజరై చేనేతల కోసం అనేక పథకాలు రచించామని చెప్పారే తప్ప టెక్స్టైల్స్ పార్కు గురించి ప్రస్తావించలేదు. చేనేత వృత్తి చేసే కార్మికులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ నేటికి కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు లేవు. కనీస వేతన చట్టానికి దిక్కేది? కనీస వేతన చట్టం ప్రకారం ఒక కార్మికుడికి రోజుకు రూ.206 చెల్లించాల్సి ఉంటుంది. కానీ చేనేత కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారంగా కూడా కూలీలు అందడం లేదు. చేనేత మగ్గాలపై పీస్ వర్క్ చేస్తున్నారనే కారణంతో కూలి ధరలు పరిగణించలేమని కార్మికశాఖ చేతులెత్తేసింది. దీంతో హోటల్లో పని చేసే స్వీపర్ల కంటే చేనేత కారి్మకుడికి కూలి తక్కువ. కనీస వేతన చట్టాన్ని అమలు చేసినా కారి్మకులకు ప్రయోజనం ఉంటుంది. నిధులు విడుదలైతే పార్కు పనులు ప్రారంభిస్తాం హ్యాండ్లూమ్ పార్కుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. ప్రభుత్వం నుంచి నిధులు వస్తే పార్కు పనులు ప్రారంభిస్తాం. మగ్గం కార్మికులకు 200 విద్యుత్ యూనిట్లపై మార్గదర్శకాలు అందలేదు. నేతన్న నేస్తం ద్వారా ఒక్కో కార్మికుడికి అందాల్సిన రూ.24 వేలు కూడా ప్రభుత్వం విడుదల చేస్తే కార్మికుడికి అందిస్తాం. ఆప్కో ద్వారా కొంత మేర స్వయం సహకార సంఘాల ద్వారా కొనుగోలు ఇప్పుడే ఇప్పుడే మొదలుపెడుతున్నాం. – నాగమల్లేశ్వరరావు, హ్యాండ్లూమ్, ఏడీ -
పట్టు చీరలకు కేరాఫ్ అడ్రస్ ఆ ఊరు..!
మగువలు మెచ్చే పట్టు చీరలు.. వెడ్డింగ్ శారీలు.. ఫంక్షన్లలో స్పెషల్ లుక్కుతో ఆకట్టుకునే డిజైన్లు చేయడంలో నారాయణవనం నేతన్నలు ఆరితేరిపోయారు. తరతరాలుగా మగ్గాలపైనే తమ నైపుణ్యాన్నంతా రంగరించి రకరకాల పట్టు చీరలు తయారు చేస్తుంటారు. సింగిల్ త్రెడ్, డబుల్ త్రెడ్, వెండి జరీ, బంగారు జరీ చీరలు డ్రాబీ, జాకాడ్ డిజైన్లతో అత్యద్భుతంగా నేసి ఆకట్టుకుంటున్నారు. ఇక్కడ తయారయ్యే చీరలు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోని ప్రముఖ బ్రాండెడ్ షాపులకు ఎగుమతి చేస్తుంటారు. కంచి, ఆరణి, ధర్మవరం పట్టు చీరలను కలగలిపి ఒకే పట్టు.. ఒకే బ్రాండ్ చీరలుగా నేయడం వీరి ప్రత్యేకత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా నారాయణవనం పట్టు చీరలపై ప్రత్యేక కథనం.. పూర్వీకుల కాలం నుంచి నారాయణవనం పట్టువ్రస్తాలకు పెట్టింది పేరు. ఇక్కడ గతంలో 600 కుటుంబాలకుపైగా మగ్గాలు పెట్టుకుని పట్టువ్రస్తాలు నేసేవారు. ప్రస్తుతం వందకుపైగా కుటుంబాల వారు తమ కులవృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వీరు నేసే పట్టు చీరలు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ వస్త్ర దుకాణదారులు కొనుగోలు చేసి వివిధ బ్రాండ్ల పేరుతో విక్రయిస్తుంటారు. మరికొందరు సొంతంగా షాపులు పెట్టుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. సాధారణంగా వెండి, బంగారు జరీ పట్టు చీరలను తమదైన శైలిలో నేసి మగువుల మనసు దోచుకుంటున్నారు. ఒక్కో చీర రూ.5 వేల నుంచి రూ.65 వేల వరకు విక్రయిస్తుంటారు. ఒకే బ్రాండ్.. ఒకే పట్టు పట్టుతో నేసే చీర ఒకటే. కానీ జాకాడ్, డ్రాబీలపై వివిధ డిజైన్లతో తయారయ్యే చీరలు కొత్తకొత్త పేర్లతో మార్కెట్లోకి వస్తుంటాయి. కొత్త రకం చీరకు కొత్తపేరుతో మార్కెట్లోకి తెచ్చి విక్రయిస్తుంటారు. పట్టులో వెండిని, బంగారాన్ని స్వల్పంగా కలిపి జరీ చీరలను నేస్తుంటారు. నారాయణవనంలో సాధారణ, బంగారు జరీ చీరలు పోస్టర్ డిజైన్లతో జాకాడ్, డ్రాబీలతో తయారు చేస్తున్నారు. పేర్లు ఎన్నైనా వాడే పట్టు నాణ్యత, పోగుల సంఖ్య, వెండి, బంగారం, డిజైన్ల ఆధారంగానే బరువు ఉంటుంది. చేయూత కోసం ఎదురుచూపు గతంలో పట్టు కొనుగోలుకు కిలోకు రూ.150 చొప్పున నెలకు గరిష్టంగా రూ.600ను ప్రభుత్వం నేరుగా నేతన్నల బ్యాంక్ ఖాతాకు జమచేసేది. వైఎస్.జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే వైఎస్సార్ నేతన్న నేస్తంతో ఐదేళ్లు వరుసగా ఏడాదికి ఒకేసారి రూ.24 వేలు బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం హామీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అండగా నిలిస్తే పెట్టుబడి భారం తగ్గించుకునే ఆస్కారం ఉంటుందని నేతన్నలు చెబుతున్నారు. చేనేతపైనే మగువులకు మక్కువ చేనేత మగ్గాలపై తయారయ్యే పట్టు చీరల నాణ్య త, డిజైన్, సున్నితత్వంపైనే స్త్రీలు మక్కువ చూపు తున్నారు. ఈ నేపథ్యంలో నారాయణవనంలోని నేతన్నలు వారి మనసుకు నచ్చేవిధంగా డిజైన్లు తయారు చేస్తున్నారు. మాస్టర్ వీవర్లు కంచి, ధర్మ వరం నుంచి ముడిపట్టును తెప్పించుకుని స్థానికంగా రంగులు అద్ది సొంత డిజైన్లతో డ్రాబీ, జాకాడ్పై తయారైన చీరలను చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోని ప్రముఖ వస్త్ర దుకాణాలకు ఎగుమతి చేస్తున్నారు. అక్కడ వీటిని వివిధ బ్రాండ్లుగా విభజించి వ్యాపారులు విక్రయాలు సాగిస్తున్నారు.ధరలో భారీ వ్యత్యాసం బ్రాండెడ్ షాపుల్లో అమ్మే పట్టుచీరల ధరలతో పోల్చుకుంటే ఇక్కడ ఉత్పత్తిదారుల వద్ద దొరికే పట్టుచీరలు 30 శాతం తక్కువకే దొరుకుతాయి. డైలీ వేర్ సింగిల్ త్రెడ్ పట్టు చీర 3000 గ్రాముల బరువుతో రూ.5 వేల నుంచి విక్రయిస్తున్నారు. డబుల్ త్రెడ్ పార్టీ వేర్ చీరలైతే రూ.7 వేల నుంచి రూ.25 వేల వరకు దొరుకుతాయి. రెండు గ్రాముల బంగారంతో అత్యధికంగా 700 గ్రాముల బరువు తో స్పెషల్ వెడ్డింగ్ శారీ రూ.65 వేలకే నేస్తున్నారు. ఆర్డర్లపై నచ్చిన డిజైన్, రంగులతోనూ 20 రోజులకే పట్టుచీరలను నేతన్నలు అందిస్తున్నారు. మాయ చేస్తున్న ఇమిటేట్ పట్టు ఇమిటేట్ పట్టు మార్కెను ఆకట్టుకుంటోంది. బంగారం, వెండి జరీతో పట్టుచీరలకు పోటీగా రాగి జరీతో ఇమిటేట్ పట్టు చీరలు తయారవుతున్నాయి. జరీ, డిజైన్, కొంగు రాగి రంగుతో పట్టుచీరలకు దీటుగా తక్కు వ ధరకే అంటే రూ.500కే మార్కెట్లో దొరు కుతున్నాయి. ఇమిటేట్ పట్టు(కాపర్ పట్టు) చీరను ఉతికితే జరీ ముడతలతో కుంచించుకుపోవడంతో పాటు మెత్తదనం కోల్పోతుంది. నారాయణవనంలో తయారయ్యే వెండి, బంగారంతో కలిసిన నాణ్యమైన పట్టు చీరలను డ్రైక్లీనింగ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఎన్ని సార్లు డ్రైక్లీనింగ్ చేసినా చీరలో జరీ, డిజైన్, కొంగులో నాజూకుతనం అలాగే ఉంటుంది. ఇమిటేట్తో ఇబ్బంది చౌకగా లభించే ఇమిటేట్ కాపర్ జరీ పట్టుచీరలతో ఇబ్బందులెదురవుతున్నాయి. పట్టుచీర తక్కువ బరువుతో సున్నితంగా ఉంటుంది. 300 గ్రాముల నుంచి 700 గ్రాముల వరకు బరువుండే పట్టుచీరల్లో పోస్టర్ డిజైన్ జాకాడ్ స్పెషల్ వెడ్డింగ్ శారీలు అందుబాటులో ఉన్నాయి. 2 గ్రాముల బంగారంతో జరీ చీరలను రూ.40 వేల నుంచి రూ.65 వేల వరకు విక్రయిస్తున్నాం. వెండి జరీ చీరలను స్పెషల్ లుక్‌తో పార్టీ వేర్‌గా అందిస్తున్నాం. ఆర్డర్లపై నచ్చిన రంగులు, డిజైన్లతో 20 రోజుల్లో చీరను తయారు చేస్తాం. – మునస్వామి, మాస్టర్ వీవర్, నారాయణవనం మెచ్చుకుంటే చాలు! పెద్దల నుంచి నేర్చుకున్న వృత్తిని నమ్ముకుని బతుకుతున్నా. నేను తయారు చేసిన చీర బాగుందని మెచ్చుకుంటే చాలు ఆ తృప్తే వేరు. కూలీ గిట్టకపోయినా.. పట్టుచీర తయారీతో కలిగే తృప్తితో పడిన కష్టాన్ని మరిచిపోతున్నాం. రోజుకు ఐదు గంటలు పనిచేస్తే వారానికి ఒక చీర తయారవుతుంది. భారీ చీరకు 20 రోజులు పడుతుంది. తమిళనాడు తరహాలో 200 యూనిట్ల విద్యుత్ రాయితీ, మార్కెటింగ్ సౌకర్యాలను కల్పిస్తే పట్టు పరిశ్రమకు ప్రోత్సహం లభిస్తుంది. – మునీశ్వరయ్య, కార్మికుడు, నారాయణవనం ప్రభుత్వం ఆదుకోవాలి గతంలో నెలకు 4 కిలోల ముడిపట్టు కొనుగోలుకు రూ.600 అందేది. జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే నేతన్న నేస్తం పథకంతో ఐదేళ్ల పాటు రూ.24 వేల చొప్పున అందించి ఆదుకున్నారు. చేనేతకు మరమగ్గాల ఉత్పత్తులు పోటీ రావడంతో చీరలను అమ్ముకోలేని పరిస్థితి ఎదురవుతోంది. మార్కెటింగ్ సదుపాయంతో పాటు విద్యుత్, పట్టుపై సబ్సిడీని ప్రభుత్వం అందించాలి. –పరంధామయ్య, పాలమంగళం నార్త్ (చదవండి: 'డబ్బు చేసే మాయ'..! 34 ఏళ్ల ఎడబాటుని అమాంతం..!) -
చేనేత సొసైటీల్లో ఎన్నికలకు కసరత్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాల (సొసైటీ) ఎన్నికల కసరత్తును ప్రభుత్వం ప్రారంభించింది. అక్టోబర్ 21న షెడ్యూల్ విడుదల చేసి, డిసెంబర్ 6వ తేదీకి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఏ సొసైటీల పరిధిలో ఎంత మంది సభ్యులున్నారన్న వివరాలతో కూడిన జాబితాలను చేనేత జౌళి శాఖ సేకరిస్తోంది. ఆ జాబితాలను పరిశీలించి నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాలను అధికారులు ఖరారు చేస్తారు. అయితే, ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.పదేళ్లుగా సొసైటీలకు ఎన్నికలు జరగకపోవడంతో ఓటర్ల జాబితా ఖరారు, బోగస్ సొసైటీల వ్యవహారం వంటి అనేక సమస్యలు ఎన్నికలకు అవరోధంగా మారాయి. మరోవైపు వ్యవసాయ పరపతి సంఘాల ఎన్నికలు సైతం నిర్వహించాలనే ప్రతిపాదన ఉండటంతో చేనేత సొసైటీ ఎన్నికలు ముందు వెనుక అయ్యే అవకాశం ఉందని చేనేత జౌళి శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఓటరు జాబితాల కసరత్తు పూర్తి చేసి ఎన్నికలను మరో రెండు నెలల తర్వాత నిర్వహించాలనే ప్రతిపాదన కూడా ఉందని, ఇంకా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ఆ అధికారి చెప్పారు.ఎన్నికలు నిర్వహిస్తారనే సంకేతాలతో చేనేత సొసైటీ ఎన్నికల బరిలో దిగి పదవులు దక్కించుకునేందుకు పలువురు సమాయత్తమవుతున్నారు. తమ సొసైటీల పరిధిలో సభ్యుల జాబితాలు, వాటిలో మార్పులు, సభ్యులను చేరి్పంచడం వంటి చర్యలు చేపట్టారు. మరోపక్క కృష్ణా జిల్లా పెడనలో రాష్ట్రంలోనే తొలిసారిగా పూర్తిగా మహిళలతోనే ప్రత్యేకంగా చేనేత సొసైటీ ఏర్పాటుకు సోమవారం శ్రీకారం చుట్టారు. పేరుకే సొసైటీలు.. యాక్టివ్‌గా ఉన్నవి కొన్నే అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 960 చేనేత సొసైటీలు ఉన్నాయి. వాటిలో 200కు పైగా బోగస్‌వే. మిగతా వాటిలో 600కు పైగా సొసైటీలు రికార్డుల్లోనే ఉన్నాయి తప్ప కార్యకలాపాలు ఏమీ లేవు. వాస్తవంగా నిత్యం కార్యకలాపాలు సాగిస్తూ యాక్టివ్‌గా ఉండే సొసైటీలు 100 నుంచి 150 మాత్రమే ఉంటాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ సబ్సిడీలు, ఇతర రాయితీల కోసం మాస్టర్ వీవర్స్, చేనేత రంగంలో బడా వ్యాపారులు వారి వద్ద పనిచేసే వారిని, కుటుంబ సభ్యుల పేర్లను చేర్చి సొసైటీలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరు ఏకంగా పదుల సంఖ్యలో బోగస్ సొసైటీలు ఏర్పాటు చేసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటినీ రద్దు చేస్తారా లేదా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇటువంటి సొసైటీలను తప్పించి, వ్యవస్థను ప్రక్షాళన చేశాకే ఎన్నికలు జరిపాలని అసలైన సొసైటీల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.సొసైటీ నుంచి ఆప్కో వరకు ఎన్నికలు ఇలా.. ప్రతి సొసైటీకి తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. వారిలో ఇద్దరు మహిళా డైరెక్టర్లు కచి్చతంగా ఉండాలి. తొమ్మిది మంది డైరెక్టర్లు వారిలో ఒకరిని అధ్యక్షులుగా, మరొకరిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకుంటారు. ప్రతి జిల్లా పరిధిలోని సొసైటీల అధ్యక్షులందరూ కలిసి ఒక ఆప్కో డైరెక్టర్‌ను ఎన్నుకుంటారు. అన్ని జిల్లాల ఆప్కో డైరెక్టర్లు వారిలో ఒకరిని ఆప్కో చైర్మన్‌గా ఎన్నుకుంటారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎంపికయ్యే ఆప్కో చైర్మన్, డైరెక్టర్లు, సొసైటీ పాలకవర్గాల పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. అదే ప్రభుత్వమే నామినేట్ చేస్తే ప్రతి ఆరు నెలలకు ఒకసారి వారి పదవిని పొడిగించాలి. చేనేత సొసైటీ ఎన్నికల్లో పోటీ చేసే వారి బ్యాంకు రుణాల కిస్తీల చెల్లింపులు మూడు నెలలకు మించి పెండింగ్‌లో ఉండకూడదు. -
Chandana Jayaram: వస్త్రోత్పత్తుల సోయగం! హ్యాండ్ టు హ్యాండ్ చేనేత ప్రదర్శన షురూ..
సాక్షి, సిటీబ్యూరో: మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ చందనా జయరాం సందడి చేశారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన హ్యాండ్ టు హ్యాండ్ చేనేత వస్త్ర ప్రదర్శనను ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ కొలువుదీరిన వ్రస్తోత్పత్తుల గురించి చేనేత కళాకారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అనాదిగా వస్తున్న మన సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూమ్ వ్రస్తోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. వేడుకలు, సంబరాల్లో ఫ్యాషన్ వేర్ కన్నా ఇలాంటి ఉత్పత్తులవైపే యువత ఎక్కువ మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా దాదాపు 14 రాష్ట్రాల నుంచి చేనేతకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తారని నిర్వాహకులు జయేష్ గుప్తా తెలిపారు. ఇందులో భాగంగా75 వేల రకాల వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు వివరించారు.వినూత్నంగా మెటల్ సిరీస్ వాచ్‌లు..సాక్షి, సిటీబ్యూరో: అధునాతన ఫ్యాషన్ హంగులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకునే హైదరాబాద్ నగర వేదికగా బోల్డ్–ఫ్యాషన్–ఫార్వర్డ్ మెటల్ సిరీస్ వాచ్‌లు అందుబాటులోకి వచ్చాయి.ప్రముఖ ‘ఫా్రస్టాక్ స్మార్ట్’ఆధ్వర్యంలో ఆవిష్కరించిన ఈ మెటల్ సిరీస్ యువతను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా టైటాన్ కంపెనీ సేల్స్ హెడ్ ఆదిత్యరాజ్ మాట్లాడుతూ ఫా్రస్టాక్ స్టెయిన్లెస్–స్టీల్ వాచ్‌ల నుంచి ప్రేరణ పొంది ఈ స్మార్ట్‌వాచ్ కలెక్షన్ ప్రీమియం–గ్రేడ్ మెటల్‌తో రూపొందించామని తెలిపారు. అధునాతన ఫ్యాషన్ గాడ్జెట్స్‌ను ఆస్వాదించడంలో నగరం ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. -
విజయవాడ : చేనేత షో అదుర్స్ (ఫొటోలు)
-
సిల్క్ ఆఫ్ ఇండియా హ్యాండ్లూమ్ ఎక్స్పో 2024 ను ప్రారంభించిన అశ్విని శ్రీ (ఫొటోలు)
-
Hyderabad: మెరి'శారీ'లా..! నూతన బ్రాండ్ ‘జీఎస్ శారీస్ షో రూమ్’..
సాక్షి, సిటీబ్యూరో: చేనేత హస్త కళాకారులు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన నూతన బ్రాండ్ ‘జీఎస్ శారీస్ షో రూమ్’ను నిజాంపేట్‌లో ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ’అల్లరే అల్లరి’ చిత్రబృందం కౌశిక్, విశ్వమోహన్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రముఖ మోడల్స్, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు సందడి చేశారు. ఈ సందర్భంగా స్టోర్ ఎండీ శ్రావణి గోపీనాథ్ మాట్లాడుతూ.. తెలుగు సంప్రదాయాలకు చీరకట్టు ప్రాధాన్యం తెలియజేసేలా హ్యాండ్ మేడ్ శారీలను అందిస్తున్నామని తెలిపారు. -
‘ఈ దుస్తులు కొనండి’.. ప్రధాని మోదీ
గ్రామాల్లో తయారుచేస్తున్న ఖాదీ వల్ల దేశవ్యాప్తంగా రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం సాగుతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహిళల్లో పెరుగుతున్న ఆదరణ, ఉద్యోగాల కల్పన కారణంగా 400 శాతం ఖాదీ, చేనేత దుస్తుల అమ్మకాలు పెరిగాయని పేర్కొన్నారు. భారత పౌరులు ఖాదీ దుస్తులు కొనుగోలు చేయాలని మన్ కీ బాత్ ప్రసారంలో భాగంగా మోదీ పౌరులకు సూచించారు.ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో మాట్లాడుతూ..‘దేశవ్యాప్తంగా గ్రామాల్లో తయారుచేస్తున్న ఖాదీ వ్యాపారం తొలిసారిగా రూ.1.5 లక్షల కోట్లకు చేరింది. గతంతో పోలిస్తే వీటి విక్రయాలు 400 శాతం పెరిగాయి. ఖాదీ, చేనేత విక్రయాలు పెరిగి పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఈ పరిశ్రమ పురోగతి వల్ల దీనిపై ఎక్కువగా ఆధారపడిన మహిళలకు ప్రయోజనం చేకూరుతోంది. ఇంతకుముందు ఖాదీ ఉత్పత్తులను ఉపయోగించని చాలా మంది ప్రజలు ఇప్పుడు గర్వంగా వీటిని ధరిస్తున్నారు. ఇప్పటి వరకు ఖాదీ దుస్తులు కొనకపోతే వాటిని కొనడం ప్రారంభించండి’ అని మోదీ చెప్పారు.ఇదీ చదవండి: అప్పు చెల్లించని వైజాగ్ స్టీల్‌ప్లాంట్!ఇదిలాఉండగా, ప్రభుత్వం చేనేత, ఖాదీ ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహకాలు అందించాలని మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి. కేంద్ర బడ్జెట్లో నేషనల్ హ్యాండ్యూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం రూ.200 కోట్లు కేటాయించారు. రానున్న బడ్జెట్లో ఆ నిధులను పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ విధానాలతో గార్మెంట్ ఉత్పత్తులు తయారుచేస్తున్న కార్పొరేట్ కంపెనీలకు వెంటనే నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
చేనేత పట్టుచీరలో ‘బహి -ఖాతా’తో నిర్మలా సీతారామన్ రికార్డు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరానికిగాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం వరుసగా ఏడవ బడ్జెట్‌ను సమర్పిస్తున్నారు. తద్వారా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించారు. గతంలో 68 ఏళ్ల క్రితం సీడీ దేశ్‌ముఖ్ మాత్రమే ఈ ఘనత సాధించారు. అంతేకాదు గత ఏడాది లాగానే బ్రీఫ్ కేసుకు బదులుగా టాబ్లెట్తోనే బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.మరో విశేషం ఏమిటంటే పీఎం నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మంగళవారం తొలి బడ్జెట్‌ను సమర్పించేందుకు సీతారామన్ ఈసారి కూడా చేనేత చీరనే ఎంచుకున్నారు. తనకోసం ప్రత్యేకంగా రూపొందించిన అధికారం, శక్తికి ప్రతీకతోపాటు, భారతీయ హస్తకళాకారులపట్ల గౌరవంతో కాంట్రాస్టింగ్ పర్పుల్, పింక్ కలర్ బ్లౌజ్‌తో కూడిన తెల్లని గీతల హ్యాండ్లూమ్ చీరను ఎంచుకోవడం విశేషం.. ముఖ్యంగా సామరస్యం, భారతీయ సంస్కృతిలో కొత్త ప్రారంబానికి, స్వచ్ఛతకు సూచికగా వైట్ ఎంచుకున్నట్టు సమాచారం. అలాగే ఈ చీరకు పర్పుల్ కలర్, చేనేత చీర లుక్‌ను మరింత ఎలివేట్ చేసింది. పూర్తికాలపు తొలి మహిళా ఆర్థిక మంత్రి సీతారామన్ జూలై 5, 2019న తొలి బడ్జెట్‌ను సమర్పించారు. ఆ తరువాత కరోనా మహమ్మారి కాలంలో 2021లో నిర్మలా సీతారామన్ డిజిటల్ బడ్జెట్‌ను పరిచయం చేశారు. 'మేడ్ ఇన్ ఇండియా'టాబ్లెట్‌ని ఉపయోగించి, పేపర్‌లెస్ ఫార్మాట్లో బడ్జెట్‌ను సమర్పించారు. ఇక 2024-25 బ్రీఫ్‌కేస్‌కు బదులుగా రెడ్ క్లాత్ ఫోల్డర్‌ను ఉపయోగించారు. బడ్జెట్ సమర్పణకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆమె భేటీ అయ్యారు. మంత్రి వర్గం ఆమోదం తరువాత రాష్ట్రపతిని కలవడానికి ముందు, నిర్మలా సీతారామన్ తన కార్యాలయం వెలుపల తన అధికారుల బృందంతో సంప్రదాయ ‘బ్రీఫ్‌కేస్’ ఫోటోకు పోజులిచ్చారు. ఈసారి బడ్జెట్‌కు బహి-ఖాతా అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. -
కళింగలో ‘హ్యాండ్ టూ హ్యాండ్’ ప్రదర్శన
బంజారాహిల్స్: స్థానిక రోడ్ నెం.12లోని కళింగ కల్చరల్ హాల్లో చేనేతలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన హ్యాండ్ టూ హ్యాండ్ చేనేత వస్త్ర ప్రదర్శనను వర్ధమాన సినీ నటి తాక్షి్వ చిత్గోపాకర్ మంగళవారం ప్రారంభించారు. మార్కెట్లోకి ఎన్ని రకాల వస్త్ర ఉత్పత్తులు వస్తున్నా తాను చేనేత వ్రస్తాలనే ఎక్కువగా ఇష్టపడతానని ఆమె తెలిపారు. ఈ నెల 30 వరకూ కొనసాగే ఈ ప్రదర్శనలో దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల నుంచి చేనేత కారి్మకులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని నిర్వాహకులు జయేష్ గుప్తా తెలిపారు. -
సీతమ్మకు త్రీడీ చీర
సిరిసిల్ల: సిరిసిల్ల చేనేత కళావైభవాన్ని మరోసారి ప్రపంచానికి చాటాడు. మూడు రంగుల్లో త్రీడీ చీరను చేనేత మగ్గంపై నేశాడు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి సీతమ్మకు బహూకరించేందుకు మూడు రంగుల చీరను అద్భుతంగా రూపొందించాడు. ఆయనే సిరిసిల్ల నేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్. ఆయన 18 రోజులపాటు చేనేత మగ్గంపై శ్రమించి బంగారు, వెండి, రెడ్ బ్లడ్ రంగుల్లో చీరను నేశారు. ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు, 600 గ్రాముల బరువుతో అద్భుతమైన త్రీడీ చీరను రూపొందించారు. ఈ చీరను తిప్పుతుంటే.. రంగులు మారుతూ కనువిందు చేస్తుంది. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ ఆదివారం మాట్లాడుతూ.. శ్రీరామ నవమికి భద్రాచలం సీతారాములకు ఈ చీరను బహూకరించనున్నట్లు తెలిపారు. గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను, ఉంగరంలో దూరే చీరను కూడా విజయ్‌కుమార్ నేసి అభినందనలు అందుకున్నారు. -
మీరు వచ్చాక చేయూత పథకంతో మేలు జరిగింది: చేనేత కార్మికులు
-
చేనేత కార్మికుల కోసం జగన్ సర్కార్ నేతన్నకు నేస్తం పథకం
-
పట్టుచీర! ఏది అసలు? ఏది నకిలీ?..ఇలా గుర్తించండి!
శుభకార్యం ఏదైనా వధూవరులు, మహిళలు, పురుషులు, పిల్లలు అని తేడా లేకుండా అందరూ పట్టు వస్త్రాలను ధరించడం సాంప్రదాయంగా భావిస్తారు. పట్టు వస్త్రాలు ధరించడం వల్ల హుందాతనం, అందం ఉట్టిపడుతుంది. దీంతో మార్కెట్లో పట్టు వస్త్రాలకు మంచి ధర, డిమాండ్ ఉంది. వస్త్ర దుకాణాల్లో లైట్ల వెలుగులో పట్టు వస్త్రాలు దగదగా మెరుస్తుంటాయి. కానీ, అందులో ఏది అసలు, ఏది నకిలీ పట్టు వస్త్రమనేది వినియోగదారులు కనిపెట్టడం చాలా కష్టం. వస్త్ర దుకాణాదారులు కూడా వినియోగదారుడిని బురిడీ కొట్టించే అవకాశాలు లేకపోలేదు. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ స్వచ్చమైన పట్టు వస్త్రాలకు క్యూఆర్ బార్‌కోడ్‌తో కూడిన సిల్క్ మార్క్, మగ్గంపై నేసిన వస్త్రాలకైతే హ్యాండ్లూమ్ మార్క్‌ను అందజేస్తుంది. సిల్క్ మార్క్, హ్యాండ్లూమ్ మార్క్ లేబుల్ ఉన్నట్లయితే అది స్వచ్చమైనదిగా గుర్తించవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకొన్న వస్త్ర వ్యాపారులకు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి లోగోలను అందజేస్తారు. పట్టులో పలు రకాలు.. పట్టులో అనేక రకాలున్నాయి. అందులో సహజసిద్ధమైన మల్బరీ సిల్క్‌ను ‘క్వీన్ ఆఫ్ టెక్స్టైల్’గా పిలుస్తారు. ఇది మల్బరీ పట్టు పురుగైన బాంబేక్స్ మోరె నుంచి తయారవుతుంది. ఇది చాలా ఖరీదైనది. ప్రపంచ వ్యాప్తంగా దీనిని 90 శాతం వినియోగిస్తున్నారు. పోచంపల్లి ఇక్కత్ పట్టు వస్త్రాలన్నీ మల్బరీ పట్టుతోనే తయారవుతున్నాయి. ‘టస్సార్ సిల్క్’ కాపర్రంగులో ఉంటుంది. అడవుల్లో ఉండే పట్టు పురుగుల నుంచి తయారు చేస్తారు. టస్సార్ పట్టును ఎక్కువగా హోం ఫర్నీషింగ్, ఇంటీరియర్ డెకరేషన్లో వినియోగిస్తారు. ఇందీ పట్టు పరుగుల నుంచి ‘ఈరీ సిల్క్’ తయారవుతుంది. ఈరీ పట్టును కాటన్, ఉన్ని, జనపనారతో కలిపి ఫ్యాషన్, ఇతర అస్సెస్సరీస్, హోం ఫర్నీషింగ్ తయారు చేస్తారు. ‘ముంగా పట్టు’ బంగారు వర్ణంలో ఉంటుంది. దీనిని తయారు చేసే పట్టు పురుగులు అడవుల్లో ఉంటూ సోమ్ అండ్ సోఆలు అనే చెట్ల ఆకులను తింటాయి. అసలైన పట్టును ఇలా గుర్తించవచ్చు.. పట్టు పోగుని వెలిగించినప్పుడు నిరంతరంగా కాలకుండా ఆరిపోతుంది. పట్టు కాలినప్పుడు వెంట్రుకలు, ఈకలు కాలిన వాసన వస్తుంది. పోగు కొనలో చిన్న నల్లపూసలా మారుతుంది. పూసను నలిపినప్పుడు పొడి అయ్యి పోగు గరుకుగా మారుతుంది. పట్టు వస్త్రాలను ఎల్లప్పుడు సిల్క్‌మార్క్ అధీకృత షాపుల్లోనే కొనాలి. పట్టు వస్త్రాలకు ఉన్న సిల్క్‌మార్క్ లేబుల్ 100 శాతం పట్టు ప్రామాణికతను సూచిస్తుంది. పట్టు వస్త్రాలని సిల్క్‌మార్క్ వారిచే ఉచితంగా పరీక్షింప జేసుకోవచ్చు. స్వచ్ఛమైన పట్టు వస్త్రాలకు క్యూఆర్ బార్‌కోడ్‌తో కూడిన సిల్క్ మార్క్ ఉంటుంది. మగ్గంపై నేసిన పట్టుకు హ్యాండ్లూమ్ మార్క్ ఉంటుంది. ఇవి చదవండి: బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి సీతమ్మ స్పెషల్ చీరల్లో.. వాటి ప్రత్యేకత ఇదే! -
‘నేత’ రాత మారేదెలా?
సాక్షి, యాదాద్రి: ఆరేళ్లుగా చేనేత సహకార సంఘాల ఎన్నికల ఊసే లేదు. దీంతో క్షేత్రస్థాయిలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పట్టించుకునేవారే లేకుండా పోయారు. ఎన్నికలు జరగని కారణంగా టెస్కో ఉనికిలో లేకుండాపోయింది. 2018లో సహకార సంఘాల పదవీకాలం ముగిసింది. అయితే గత ప్రభుత్వం కొత్త పాలకమండలిని ఏర్పాటు చేయకుండా పర్సన్ ఇన్‌చార్జ్‌లను నియమించింది. రాష్ట్ర స్థాయి పాలకవర్గం లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో చేనేత వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లడానికి ఇబ్బందిగా మారింది. గత ప్రభుత్వం టెస్కోకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్,పవర్లూమ్ కార్పొరేషన్లు కేవలం చైర్మన్ల నియామకం వరకే పరిమితమయ్యాయి. జియో ట్యాగింగ్, త్రిఫ్ట్ ఫండ్, చేనేత బీమా, నేతన్నకు చేయూత వంటి పథకాలను గత ప్రభుత్వం అమలు చేసినా అవి అందరికీ అందలేదన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 375 సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా 375 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటిల్లో 45మంది కార్మికులు ఉన్నారు. అయితే 2018లో ఓటర్ ఫొటో గుర్తింపు కార్యక్రమం చేపట్టగా, జియో ట్యాగింగ్ విధానం అమల్లోకి తెచ్చి, కేవలం 9వేలమందిని లెక్క చూపిస్తున్నారు. మిగతా కార్మీకులు జియో ట్యాగింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. సహకార సంఘాలకు 2013 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించగా, పదవీకాలం 2018 ఫిబ్రవరి 9తో ముగిసింది. నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి. కానీ ప్రభుత్వం పర్సన్ ఇన్‌చార్జ్‌లను నియమించి, ప్రతి ఆరునెలలకోసారి పాలకవర్గాల పదవీకాలాన్ని పొడిగిస్తూ వచ్చింది. టెస్కో పాలకవర్గం ఎప్పుడు? ఉమ్మడి ఏపీలో చేనేత వృత్తిదారుల కోసం ఆప్కో ఉండగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత టెస్కోగా మారింది. అయితే ప్రస్తుతం టెస్కోకు పాలకవర్గం లేదు. సహకార సంఘాల ఎన్నికలు జరిగితే ప్రతి జిల్లా నుంచి ఒక డైరెక్టర్‌ను ఎన్నుకొని వారిలో నుంచి రాష్ట్రస్థాయి చైర్మన్, వైస్ చైర్మన్‌తోపాటు ప్రతి జిల్లా డైరెక్టర్ పాలకవర్గ సభ్యులుగా ఉండేవారు. ప్రస్తుతం పాలకవర్గాలు లేవు. ఐఏఎస్ అధికారుల చేతిలో పాలన కొనసాగడంతో వృత్తిదారుల సమస్యలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఎన్నికలు నిర్వహించాలని చేనేత వృత్తిదారులు కోరుతున్నారు. మూతపడిన సిరిపురం సొసైటీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రామన్నపేట మండలం సిరిపురం చేనేత సహకార సంఘంలో 1000 మంది సభ్యులు ఉన్నారు. సుమారు 40 ఏళ్లుగా వృత్తిదారులకు పని కల్పిస్తోంది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పర్సన్ ఇన్‌చార్జ్‌ల పాలనలో సొసైటీ రూ.40 లక్షల నష్టాల్లో కూరుకుపోయింది. జియో ట్యాగింగ్ పేరుతో 150 మందినే పనిదారులుగా గుర్తించి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారు. సొసైటీ ఎన్నికలు నిర్వహించాలి – అప్పం రామేశ్వరం, సిరిపురం సొసైటీ మాజీ చైర్మన్ చేనేత సహకార సంఘం ఎన్నికలు నిర్వహించాలి. కొండాలక్ష్మణ్ బాపూజీ సహకార స్ఫూర్తితో ఏర్పడిన సహకార సంఘాల వల్ల చేనేత కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది. పాలకవర్గం లేకపోవడంతో చేనేత సమస్యలను మాట్లాడేవారు లేకుండా పోయారు. వస్త్రాల తయారీకి ఆర్డర్ ఇవ్వాలి ప్రభుత్వం వినియోగిస్తున్న వ్రస్తాల తయారీ ఆర్డర్లను సిరిసిల్ల మాదిరిగా మాకూ ఇవ్వాలి. చేనేత సొసైటీలకు ఇస్తున్నట్టుగానే డీసీసీబీ రుణాలు ఇవ్వాలి. పవర్లూమ్లకు వ్రస్తాలను తయారు చేసే ఆర్డర్లు ఇవ్వాలి. వెంటనే సహకార ఎన్నికలు నిర్వహించాలి. – గాడిపల్లి శ్రవణ్ కుమార్, మాజీ చైర్మన్, శ్రీతారకరామ పవర్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్, ప్రొడక్షన్, అండ్ సేల్స్ సొసైటీ, రఘునాథపురం -
Meenakshi Choudhary: బంజారాహిల్స్‌లో సందడి చేసిన నటి మీనాక్షి చౌదరి (ఫొటోలు)
-
చేనేతకు సర్కారు ఊతం
సాక్షి, అమరావతి: చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా ఊతమిస్తోంది. ఈ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాలకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తోంది. చేనేతలకు రుణ పరపతి, ముడి సరుకులకు పెట్టుబడి, నైపుణ్య శిక్షణ, ఉత్పత్తుల తయారీతోపాటు విక్రయాలకు క్లస్టర్ల ఏర్పాటు, మేలైన మార్కెటింగ్ వ్యవస్థతో అండగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర సంస్థలు, బ్యాంకర్ల సహకారాన్ని సైతం నేతన్నకు అందేలా చూస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ నేతన్న నేస్తం పథకంలో ఒక్కొక్కరికీ రూ.24 వేల చొప్పున ఐదు పర్యాయాలుగా మొత్తం రూ.969.77 కోట్లు అందించిన విషయం తెల్సిందే. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద చేనేత కారి్మకులు ఒక్కొక్కరికి రూ.2,750 చొప్పున 2019 జూన్ నుంచి 2023 జూలై వరకు మొత్తం రూ.1,254.42 కోట్లు అందించారు. రుణాల రూపంలోనూ చేయూత చేనేతలకు ముద్ర రుణాలివ్వడంతోపాటు మగ్గాల ఆధునికీకరణ, మెరుగైన నైపుణ్యం కోసం క్లస్టర్లను ఏర్పాటు చేశారు. మరోవైపు చేనేత రంగంలో కీలకమైన నూలు పోగుల కొనుగోలుకు జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌డీసీ) ద్వారా రాష్ట్రంలో 416 ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలకు రూ.250.01 కోట్లు అందించారు. ఇదికాకుండా చేనేత కార్మికులకు వ్యక్తిగతంగాను, స్వయం సహాయక సంఘాల ద్వారా నాలుగేళ్లలో రూ.122.50 కోట్ల విలువైన నూలును అందించడం విశేషం. -
‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’లో చేనేత హవా
సాక్షి, అమరావతి: దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ఉత్పత్తిని గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన ఒక జిల్లా–ఒక ఉత్పత్తి (ఓడీఓపీ) జాతీయ అవార్డుల ప్రక్రియ తుది దశకు చేరింది. ఓడీఓపీ జాతీయ అవార్డు–2023కు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఇటీవల దరఖాస్తులను స్వీకరించారు. ఈ ఏడాది జూన్ 25నుంచి జూలై 31 మధ్య దేశంలోని 751 జిల్లాల నుంచి 1,102 రకాల స్థానిక ప్రత్యేక నైపుణ్యాన్ని ప్రతిబింబించే హస్తకళా ఉత్పత్తుల ప్రతిపాదనలు వచ్చాయి. వడపోత అనంతరం దేశంలో మొత్తం 63 ఉత్పత్తులను పరిశీలనకు తీసుకున్నారు. వాటిలో ఏపీ నుంచి 14 ఉత్పత్తులకుచోటు లభించింది. వీటిని ఇన్వెస్ట్ ఇండియా బృందం (జాతీయ స్థాయి టీమ్) క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. ఈ నెల 10న మొదలైన ఈ బృందం పర్యటన ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. 14 ఉత్పత్తులు ఇవే.. రాష్ట్రం నుంచి పరిశీలనకు ఎంపికైన ఉత్పత్తులలో పొందూరు ఖద్దరు (శ్రీకాకుళం), బొబ్బిలి వీణ (విజయనగరం), అరకు కాఫీ (ఏఎస్ఆర్), సముద్ర రొయ్యలు (విశాఖ), పులగుర్త చొక్కాలు, చీరలు (తూర్పుగోదావరి), ఉప్పాడ జాందానీ చీరలు (కాకినాడ), కొబ్బరి, కొబ్బరి పీచు (అంబేడ్కర్ కోనసీమ), మంగళగిరి చేనేత చీరలు (గుంటూరు), పెద్ద రొయ్యలు (బాపట్ల), ఉదయగిరి చెక్క కత్తిపీట (నెల్లూరు), చేనేత సిల్క్ చీరలు (కర్నూలు), మదనపల్లె సిల్క్ చీరలు (అన్నమయ్య), సిల్క్ చీరలు (శ్రీ సత్యసాయి), వెంకటగిరి చీరలు (తిరుపతి) ఉన్నాయి. ఇన్వెస్ట్ ఇండియా తరఫున ఆరాధన, హరిప్రీత్‌సింగ్, నమీర అహ్మద్, రాబిన్ ఆర్ చెరియన్, సోనియా, ఆకాంక్ష, జిగిషా తివారీ బృందం వేర్వేరుగా 8 రోజులపాటు వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అవార్డుకు ఎంపికైతే మంచి మార్కెటింగ్ వ్యవసాయ, హస్తకళా ఉత్పత్తుల ప్రతిభను వెలికితీసి వాటికి జాతీయ, అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యం కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఓడీఓపీ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాల వారీగా ప్రత్యేక నైపుణ్య ఉత్పత్తులను గుర్తించి ప్రోత్సహించేలా అవార్డులు ఇస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు 24 జిల్లాల్లో ప్రత్యేకత సంతరించుకున్న 38 రకాల ఉత్పత్తులను ఎంపిక చేసి ఓడీఓపీ జాతీయ అవార్డుకు దరఖాస్తు చేశాం. ఏపీ నుంచి 14 ఉత్పత్తులను తుది పరిశీలనకు ఎంపిక చేయగా.. వాటిలో 8 చేనేత వస్త్రాల ఉత్పత్తులు ఉండటం గొప్ప విషయం. జాతీయ అవార్డుకు ఎంపికైన వాటికి మార్కెటింగ్ రంగంలో మంచి గుర్తింపు లభించి ఆయా జిల్లాల్లో సామాజిక–ఆర్థిక అభివృద్ధికి ఊతం లభిస్తుంది. – కె.సునీత, ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర చేనేత జౌళి శాఖ -
జీ20లో లేపాక్షి స్టాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హస్తకళలు జీ20 విశ్వవేదికపై ఆహూతులను అలరిస్తున్నాయి. జీ20 సదస్సులో భాగంగా భారత మండపం ఇండియన్ క్రాఫ్ట్ బజార్లో ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర హస్తకళ వారసత్వం, సంస్కృతిని ప్రతిబింబిస్తూ లేపాక్షి స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ప్రదర్శనలో భాగంగా హస్తకళలు, చేనేత వ్రస్తాలకు ప్రాధాన్యం ఇచ్చారు. శ్రీకాళహస్తి కలంకారి చీరలు, ఉప్పాడ జమ్దానీ చీరలు, బొబ్బిలి వీణ, తిరుపతి చెక్క»ొమ్మలు సహా పలు ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంచారు. విదేశాల నుంచి ఆహూతులకు లేపాక్షి ఈడీ విశ్వ ఆయా ఉత్పత్తుల ప్రాశస్త్యాన్ని వివరిస్తున్నారు. ఉత్పత్తుల నేపథ్యాన్ని, వాటికున్న వారసత్వం, సంస్కృతిని చెబుతున్నారు. ఈ సందర్భంగా విశ్వ మాట్లాడుతూ.. రాష్ట్రానికి చెందిన హస్తకళలు, చేనేత వ్రస్తాలకు విదేశీ ప్రతినిధుల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. మరోవైపు, గిరిజన ఉత్పత్తుల స్టాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరకు కాఫీని ప్రదర్శనకు ఉంచారు. -
విమానాశ్రయాల్లో చేనేత అమ్మకాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత వస్త్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి బ్రాండింగ్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రముఖ పర్యాటక, పుణ్యక్షేత్రాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రధాన కాంప్లెక్స్‌లలో ఆప్కో స్టాల్స్ ఏర్పాటు చేసింది. తాజాగా విమానాశ్రయాల్లోనూ ప్రత్యేకంగా స్టాల్స్‌ను ఏర్పాటు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో విజయవాడ (గన్నవరం), తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇటీవల విశాఖపట్నం విమానాశ్రయంతోపాటు మెహిదీపట్నం ( హైదరాబాద్), మృగనాయని(భోపాల్), కర్నూలు జిల్లా లేపాక్షి, మంగళగిరిలోనూ ఆప్కో నూతన షోరూంలను ప్రారంభించారు. ప్రైవేటు వస్త్ర వ్యాపార సంస్థలకు దీటుగా అధునాతన వసతులతో ఆప్కో షోరూంలను ప్రారంభించడం విశేషం. చేనేతను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ఒకవైపు దేశవ్యాప్తంగా ఆప్కో స్టాల్స్, షోరూంలను పెంచడంతోపాటు మరోవైపు స్థానికంగా డిస్కౌంట్ సేల్, చేనేత సంఘాల ఎగ్జిబిషన్లు, ఫ్యాషన్ షోలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆకట్టుకునే డిజైన్లతోను, వినూత్నమైన, నాణ్యమైన చేనేత వస్త్రాల తయారీని ప్రోత్సహిస్తున్నారు. ఉద్యోగులు, ప్రజలు వారానికి ఒక్కరోజైనా చేనేత వ్రస్తాలు ధరించేలా పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. చేనేత రంగానికి ఊతమిచ్చేలా సీఎం జగన్ చర్యలు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్, ఆప్కో మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎం నాయక్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చేనేత రంగానికి ఊతమిచ్చేలా సీఎం వైఎస్ జగన్ అనేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. ‘నేతన్న నేస్తం’ తదితర కార్యక్రమాల ద్వారా చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. చేనేత వస్త్రాల విక్రయాలను ప్రోత్సహించి ఆ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన సుమారు 1.75లక్షల కుటుంబాలకు అండగా నిలిచేలా ఆప్కో ద్వారా పలు చర్యలు చేపట్టినట్టు వివరించారు. రాష్ట్రంలోని చేనేత సొసైటీల వద్ద ఉన్న వ్రస్తాల నిల్వలను క్లియర్ చేసి సొసైటీలను ఆదుకునేలా విక్రయాలు పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆప్కో షోరూంల ద్వారా ఈ ఏడాది రూ.50కోట్ల విక్రయాలు జరపాలని నిర్ణయించినట్లు ఎంఎం నాయక్ తెలిపారు. -
పట్టెడ అంచు చీర.. ఈ పేరు విన్నారా?
మనింట్లో ఓ తొంభై ఏళ్ల నానమ్మ కానీ అమ్మమ్మ కానీ ఉందా? ఉంటే ఆమెనడగండి ఓ మాట. వాళ్ల యువతరాన్ని ఆకట్టుకున్న చీరలేమిటి అని. ఎంతో ఉత్సాహంగా ఇప్పుడు మనం వినని ఎన్నో పేర్లు చెబుతారు. ఓ పది రకాల పేర్లు చెప్పి ‘ఇప్పుడా నేత ఎక్కడ వస్తోంది. వచ్చినా ఈ తరంలో ఆ చీరలెవరు కట్టుకుంటారు. నేయడమే మానేసినట్లున్నారు’ అని నిరుత్సాహంగా ముగిస్తారు. సరిగ్గా అలాంటి చీరలకు పూర్వ వైభవం తెస్తున్నారు కర్నాటకకు చెందిన హేమలత. హ్యాండ్లూమ్ లవర్స్ వార్డ్రోబ్లు రెండు వందల ఏళ్ల నాటి చేనేతలతో అలరారుతున్నాయి. ఎటు కట్టినా ఓకే! హేమలత... యూఎస్‌లోని కన్సాస్ యూనివర్సిటీలో ఉన్నతవిద్య పూర్తి చేశారు. ఆమెకు మన చేనేత కళలో దాగిన సమున్నత జ్ఞానం మీద దృష్టి పడింది. ఒకదానికి ఒకటి విభిన్నంగా దేనికది ఒక శాస్త్రబద్ధమైన గ్రంథంలాంటి చేనేతల మీద అధ్యయనం మొదలు పెట్టారామె. నిఫ్ట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ)లో ఇదే అంశం మీద పీహెచ్డీ చేస్తున్నారు. గిరిజనులు నివసించే ప్రదేశాల్లో విస్తృతంగా పర్యటించారు. వారి నేత తీరును పరిశీలించారు. ఈ క్రమంలో హేమలతా జైన్ 85 ఏళ్ల దేవదాసిని కలిశారు. ఆమె దగ్గరున్న పట్టెడ అంచు చీర రెండు వందల ఏళ్ల నాటి చేనేత కళ. ఈ చీరకు రెండు కొంగులుంటాయి. చీరను రెండువైపులా కట్టుకోవచ్చు. రివర్సబుల్ శారీ అన్నమాట. పదవ శతాబ్దంలో గజేంద్రఘర్ జిల్లాలోని గ్రామాల్లోని చేనేతకారులు ఈ చీరలను నేసేవారు. అలాంటి చీరలిప్పుడు మార్కెట్లో లేవు. ఈ తరంలో ఎవరి దగ్గరా లేవు. ఆ చీరను చూపించి మరొక చీర తయారు చేయించాలంటే ఆ రకమైన నేత నేసే చేనేతకారులు కూడా లేరన్న మరో వాస్తవం తెలిసి వచ్చిందామెకు. అలాంటి అంతరించిపోతున్న డిజైన్లు 45 వరకు ఉన్నాయి. (చదవండి: ముఖ సౌందర్యంపై పెరుగుతున్న మోజు) -
బంజారాహిల్స్ ఆధ్యా స్టోర్‌లో సందడి చేసిన డిజైనర్లు (ఫొటోలు)
-
చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్.. పక్కాగా లబ్ధి.. బోగస్‌కు చెక్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత మగ్గాలను జియో ట్యాగింగ్ చేస్తూ.. కార్మికుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత, జౌళిశాఖ అధికారులు సర్వే పనుల్లో నిమగ్నమయ్యారు. కార్మికులకు సంబంధించిన పక్కా సమాచారాన్ని ఆధునిక సాంకేతికత సహకారంతో ఆన్లైన్లో భద్రపరుస్తున్నారు. ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతా, లూమ్ ఫొటోలతో మగ్గం ఉన్న చోటి నుంచే అక్షాంశ, రేఖాంశాలతో సహా జియో ట్యాగింగ్ చేస్తున్నారు. చేనేత మగ్గాలతోపాటు, కండెలు చుట్టే కార్మికుల వివరాలు, ఆ మగ్గాలపై పని చేసే ఇతర అనుబంధ రంగాల కార్మికుల సమాచారాన్ని సైతం క్రోడీకరించి పొందుపరుస్తున్నారు. పక్కాగా లబ్ధి..బోగస్‌కు చెక్ చేనేత మగ్గాలను ఆన్లైన్ చేయడం ద్వారా కార్మికులు, మగ్గాల సమాచారం పక్కాగా ప్రభుత్వం వద్ద ఉంటుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న చేనేత మిత్ర పథకం కింద 40 శాతం యార్న్ (నూలు) సబ్సిడీ అందిస్తున్నారు. ఆన్లైన్ ప్రక్రియతో ఈ సబ్సిడీ నేరుగా ఎలాంటి బిల్లులు లేకుండానే అసలైన లబ్ధిదారులకు చేరే అవకాశం ఉంటుంది. నేతన్నలకు చేయూత పథకం (త్రిఫ్ట్)లో చేనేత కార్మికులు పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. గరిష్టంగా ప్రతి నెలా రూ.1,200 పొదుపు చేస్తే.. అంతే మొత్తం అంటే మరో రూ.1,200 ప్రభుత్వం అందిస్తుంది. ఆ సొమ్ము చేనేత కార్మికుల ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. పొదుపు చేసుకున్న సొమ్ము, దానిపై వడ్డీ కలిపి 36 నెలల తర్వాత కార్మికులు తీసుకోవచ్చు. త్రిఫ్ట్ సొమ్మును నెలనెలా నేరుగా కార్మికుల వేతనాల నుంచి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ముద్ర రుణాలను బ్యాంకుల ద్వారా అందించే అవకాశం ఉంటుంది. ఇలా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పక్కాగా లబి్ధదారుల దరికి చేర్చవచ్చు. మరోవైపు బోగస్ చేనేత సహకార సంఘాలు, బోగస్ సభ్యుల బెడద పూర్తిగా తొలగిపోతుంది. నిజంగా శ్రమించే కార్మికులు, కండిషన్లో ఉన్న మగ్గాల డేటా ఆన్లైన్లో ఉంటుంది. తగ్గిపోయిన చేనేత మగ్గాలు.. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో మరమగ్గాలు ఉన్నాయి. గతంలో ఇవి కేవలం నాలుగు జిల్లాల్లోనే ఉండేవి. రాష్ట్ర వ్యాప్తంగా 36,088 మరమగ్గాలు ఉండగా, చేనేత మగ్గాలు 17,573 మాత్రమే ఉన్నాయి. కాగా మరమగ్గాలకు ఇప్పటికే జియో ట్యాగింగ్ చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 26,494 మరమగ్గాలు ఉన్నాయి. చేనేత మగ్గాలు మాత్రం165 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు జౌళిశాఖ చేపట్టిన ఆన్లైన్ నమోదు పూర్తి అయితే.. సమగ్ర వివరాలు అందుబాటులో ఉంటాయి. అయితే చేనేత మగ్గాలు, చేనేత కార్మికుల సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేసేందుకు క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. మారుమూల గ్రామాల్లో ఫోన్ సిగ్నల్, నెట్వర్క్ సరిగా లేక సమాచారాన్ని నమోదు చేయడం కష్టమవుతోంది. వివరాలు రాసుకున్నారు.. మాది సిరిసిల్ల గణేశ్‌నగర్. కిరాయి ఇంట్లో ఉంటాను. చిన్నప్పటి నుంచి గిదే పని చేస్తున్న. నా భార్య పెంటవ్వకు పక్షవాతం. ఆమెకు పెన్షన్ వస్తుంది. రోజుకు ఐదు మీటర్ల బట్ట నేస్తా. మీటరుకు రూ.28.50 ఇస్తారు. రోజంతా పని చేస్తే రూ.140 వరకు వస్తాయి. మొన్ననే నా వివరాలు రాసుకుని, ఫొటోలు తీసుకున్నారు. – రాపెల్లి హన్మాండ్లు(89), చేనేత కార్మికుడు, సిరిసిల్ల క్షేత్రస్థాయిలో సర్వేలు చేస్తున్నాం క్షేత్రస్థాయిలో చేనేత మగ్గాల, కార్మికుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. చేనేత మగ్గాలున్న ప్రతి పల్లెకు వెళ్లి సర్వే నిర్వహించి వివరాలు నమోదు చేస్తున్నాం. ఇది పూర్తి అయితే సంక్షేమ పథకాలు నేరుగా అందించే వీలుంది. –ఎం.సాగర్, జౌళిశాఖ ఏడీ, సిరిసిల్ల చదవండి: నాకే సంబంధం లేదు .. ఉంటే వెంటనే వచ్చే వాడిని కాదు: చీకోటి -
సిరిసిల్ల నేతన్నలు అదుర్స్: అమెరికా రీసెర్చ్ స్కాలర్ కైరా ప్రశంసలు
సాక్షి, సిరిసిల్ల: అగ్గిపెట్టలో పట్టే చీర నేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి వెలుగెత్తి చాటిన అక్కడి నేతన్నలపై ప్రశంసలు కురిపించారు అమెరికా చేనేత నైపుణ్య నిపుణురాలు, రీసెర్చ్ స్కాలర్ కైరా జాఫ్. నేతన్నల కళానైపుణ్యాలను చూసి అబ్బురపడిపోయారు. అమెరికా ప్రభుత్వ పరిశోధన గ్రాండ్తో ఆసియాలోని వివిధ దేశాల్లో చేనేత పరిస్థితులు, నేతన్నల నైపుణ్యం వంటి రంగాలపై సమగ్రమైన అధ్యయనం చేస్తున్న కైరా.. శనివారం సిరిసిల్లలో పర్యటించారు. సిద్దిపేటలోని సెరికల్చర్ రైతులతో క్షేత్రస్థాయి పర్యటన ముగించుకొని అక్కడి నుంచి సిరిసిల్ల చేరుకున్న ఆమె నేతన్నలతో సమావేశమయ్యారు. చేనేత కార్మికుల మగ్గాలు, వారు నేస్తున్న బట్టలు, చేనేత నైపుణ్యాలకు సంబంధించిన అంశాలపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేనేత కళ నుంచి మరమగ్గాలవైపు సిరిసిల్ల నేతన్నలు మళ్ళిన చారిత్రాత్మక క్రమంపైనా ఆమె వివరాలు తీసుకున్నారు. తన వినూత్నమైన చేనేత ఉత్పత్తులతో దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిన హరిప్రసాద్‌ను కలిశారు కైరా జాఫ్. ఆయన రూపొందించిన వివిధ చేనేత ఉత్పత్తులు, ముఖ్యంగా అగ్గిపెట్టెలో పట్టేలా నేసిన చీరను చూసి ఆమె అబ్బురపడ్డారు. ఇంత అద్భుతమైన ప్రతిభ నైపుణ్యం కలిగిన చేనేత కార్మికులను ఇంతవరకు తాను చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సిరిసిల్ల పట్టణంలో ఉన్న చేనేత కార్మికుల నైపుణ్యంతో పాటు పవర్ లూమ్ క్లస్టర్‌గా మారిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. సంక్షోభం నుంచి స్వయం సమృద్ధి వైపు సాగుతుండడంపైన ఆమె ఆసక్తి చూపారు. కైరా బృందం వెంట తెలంగాణ మర మగ్గాలు, జౌళి అభివృద్థి కార్పొరేషన్ అధ్యక్షులు గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, స్థానిక టెక్స్టైల్ అధికారులతో పాటు చేనేత నేత కార్మిక సంఘాల ప్రతినిధులు ఉన్నారు. ఈ సందర్భంగా ఒకప్పుడు సిరిసిల్ల క్లస్టర్లో నేతన్నల ఇబ్బందులు, పరిశ్రమ సంక్షోభం, దాని నుంచి బయటపడిన విధానం, అందుకు ప్రభుత్వం అందించిన సహకారం, కార్మికులు తమ నైపుణ్యాలను, పవర్లూమ్ యంత్రాలను ఆధునికరించిన విధానం వంటి వివరాలను అందజేశారు. చేనేత కార్మిక క్షేత్రాల్లో పర్యటన.. ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న పరిస్థితులు, అక్కడి చేనేత పరిశ్రమపైన ఆమె తన అధ్యయనాన్ని పూర్తిచేసుకుని భారత్‌కు వచ్చారు. తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తన అధ్యయనాన్ని కొనసాగించనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మిక క్షేత్రాలైన పోచంపల్లి, గద్వాల్ సహా ఇతర నేత కార్మిక క్షేత్రాలు ఎన్ఎస్ సిరిసిల్ల సిద్దిపేట జనగామ వంటి ప్రాంతాలలో పర్యటించనున్నారు. ఇదీ చదవండి: బయోమెట్రిక్ పద్ధతిన పింఛన్లు స్వాహా!..లబోదిబోమంటున్న బాధితులు -
సిరిసిల్ల చేనేత కళాకారుడికి మోదీ ప్రశంసలు
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రానికి చెందిన నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం నిర్వహించిన మన్‌కీ బాత్ (మనసులో మాట)లో ప్రధాని మోదీ సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్ నైపుణ్యాన్ని అభినందించారు. ఇటీవల జరిగిన జీ–20 సదస్సు లోగోను హరిప్రసాద్ మగ్గంపై తయారు చేసి ప్రధాని మోదీకి పంపారు. ఈ విషయాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ నేతకార్మికుల చేతిలోని అరుదైన కళా నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీవీలో కార్యక్రమాన్ని ఆలకించిన ఎంపీ బండి సంజయ్ చేనేత కళాకారుడు హరిప్రసాద్‌ను అభినందించారు. చేనేత కళ విస్తరణకు సహకరిస్తానని హామీ ఇచ్చి సత్కరించారు. అరుదైన కళ హరిప్రసాద్ సొంతం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్‌కు చెందిన వెల్ది హరిప్రసాద్ తన చేనేత కళాప్రతిభను పలుమార్లు ప్రదర్శించారు. ఇప్పటికే అగ్గిపెట్టెలో ఇమిడే చీరతోపాటు ఉంగరంలో దూరే చీరను, సూది రంధ్రంలోంచి దూరే చీరలను నేశారు. సూక్ష్మరూపంలో మరమగ్గాన్ని, కుట్టులేకుండా దుస్తులను తయారుచేశారు. మగ్గంపైనే రాష్ట్ర, జాతీయస్థాయి నాయకుల చిత్రాలను రూపొందించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల కోసం మహాత్ముడి నూలు వడికే చిత్రాన్ని రూపొందించారు. ఆజాద్‌కీ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జాతీయగీతాన్ని, భారతదేశ చిత్రపటాన్ని కుట్టు లేకుండా నేసి అబ్బురపరిచారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటాన్ని వస్త్రంపై నేసి అవార్డు అందుకున్నారు. -
కేంద్రం క్రూరంగా వ్యవహరిస్తోంది
సాక్షి,గన్‌ఫౌండ్రీ/హైదరాబాద్/సనత్‌నగర్: చేనేత కళాకారుల పట్ల కేంద్రం అత్యంత క్రూరంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ ఎల్.రమణ మండిపడ్డారు. చేనేత ఉత్పత్తులపై కేంద్రం విధిస్తున్న 5శాతం జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నేత కళాకారులు రాసిన లక్షలాది ఉత్తరాలతో నిజాం కళాశాల మైదానం నుంచి అబిడ్స్‌లోని జనరల్ పోస్టాఫీసు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్.రమణ మాట్లాడుతూ... చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేసి నేత కార్మికుల జీవితబీమా, సబ్సిడీ, హ్యాండ్లూమ్, పవర్ లూమ్ బోర్డు వంటి సంక్షేమ కార్యక్రమాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ మాట్లాడుతూ చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేసే వరకు పోరు కొనసాగిస్తామన్నారు. పోస్ట్‌కార్డులతో నిరసన తెలుపుతున్నఎల్.రమణ తదితరులు తెలంగాణ వచ్చాకే చేనేతకు పూర్వవైభవం సంక్షోభంలో ఉన్న చేనేత రంగానికి తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పూర్వ వైభవం తెచ్చా రని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. హైదరాబాద్‌లో తనను కలిసిన చేనేత సంఘం ప్రతినిధులతో ఆయన చర్చించారు. చేనేతపై కేంద్రం విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీకి పోస్ట్‌కార్డు రాశారు. -
చేనేతలను మోసం చేస్తున్న టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా టీఆర్ఎస్ సర్కార్ చేనేత కార్మికులను మోసం చేస్తోందని, ఉపఎన్నికలో రాజకీయ ప్రయోజనం పొందేందుకే చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీ పన్ను విధింపు అంశాన్ని తెరపైకి తెచ్చి వారిని మరోసారి మోసం చేస్తుందని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. తమను అన్నివిధాలుగా మోసం చేస్తున్న టీఆర్ఎస్కు చేనేత కార్మికులు మునుగోడులో తగిన గుణపాఠం నేర్పించాలని శనివారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. -
నో ప్లాస్టిక్.. ఓన్లీ క్లాత్! జీవనాదారానికి పట్టాభిషేకం
యాంత్రీకరణ నేపథ్యంలో కుదేలైన నేత పరిశ్రమకు ప్రభుత్వం ఊతమిస్తోంది. కోవిడ్ మహమ్మారి ధాటికి కొడిగట్టిన చేనేత రంగానికి ప్రభుత్వం యూనిఫాం ఆర్డర్లు అందించి ఊపిరి పోసింది. సంక్షేమ పథకాలతో నేత కార్మికుల జీవన ప్రమాణాలు పెంచింది. విద్యుత్ చార్జీల రాయితీలతో మరమగ్గానికి పూర్వ వైభవం తీసుకొచ్చింది. తాజాగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధించి, వస్త్ర ఫ్లెక్సీలు వినియోగించాలన్న నిర్ణయంతో చేనేతకు పట్టాభిషేకం చేసింది. సాక్షి, చిత్తూరు: నేతన్నకు మంచి రోజులు వచ్చా యి. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు రద్దు చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. వాటి స్థానంలో పర్యావరణానికి అనుకూలమైన వస్త్రాలతో తయారు చేసిన ఫ్లెక్సీలు వినియోగించాలని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం నేత కార్మికుల్లో నూతనోత్సాహం నింపింది. అక్టోబరు 1వ తేదీ నుంచి ఈ కొత్త నిర్ణయం అమల్లోకి వచ్చింది. నగరి నేత పరిశ్రమకు వందేళ్ల చరిత్ర వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన నగరి నేత పరిశ్రమలో పదివేలకు పైగా మరమగ్గాలు ఉన్నాయి. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఈ పరిశ్రమపై ఆధారపడి 40 వేల మందికి పైగా జీవనం సాగిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజా నేతన్నల పరిస్థితి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆదుకోవాలని విన్నవించారు. ఫలితంగా నేత కార్మికుల నుంచి 20 లక్షల మీటర్లు ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన యూనిఫామ్ దుస్తుల తయారీ ఆర్డర్ వచ్చింది. దీంతో నగరి నేత కార్మికుల జీవనానికి ఏపీ ప్రభుత్వం ఊతమిచ్చినట్లయింది. కార్మికులు తమకు వచ్చిన ఆర్డర్లను సద్వినియోగం చేసుకుని సకాలంలో దుస్తులు సరఫరా చేయడంలో సఫలీకృతులయ్యారు. విదేశాల్లో మంచి గిరాకీ ఒకప్పుడు పుష్కలమైన విదేశీ ఆర్డర్లతో నగరి నేత పరిశ్రమ వర్ధిల్లింది. జిల్లాలోని నగరి పరిసర ప్రాంతాల్లో తయారు చేసే చొక్కాలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉండేది. ఇటు తమిళనాడు, అటు కర్ణాటక నుంచి టోకు వర్తకులు నగరికి గుంపులు గుంపులుగా వచ్చి కొనుగోలు చేసేవారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో క్రమేణా విదేశీ ఆర్డర్లు తగ్గాయి. ప్రత్యామ్నాయంగా స్వదేశంలో తయారు చేసే వస్త్రాల తయారీపైనే నేత కార్మికులు ఆధారపడాల్సి వస్తోంది. తాజాగా ప్లాస్టిక్ బ్యానర్లను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటి స్థానంలో వస్త్రాలతో తయారు చేసిన బ్యానర్లనే వాడాలని సూచించింది. ప్రభుత్వ నిర్ణయంతో నేత కార్మికుల్లో ఆనందం వెల్లివెరిసింది. పర్యావరణానికి మేలు ప్లాస్టిక్ ఫ్లెక్సీల వాడకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడంతో పర్యావరణ సమతుల్యతకు ఊపిరి వచ్చింది. గ్లోబల్ వార్మింగ్ పెరుగుదలకు ప్లాస్టిక్ కూడా కారణమేనని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన ప్లాస్టిక్ ఫ్లెక్సీల వాడకాన్ని నిషేధించి, పర్యావరణానికి హానిలేని వస్త్రాలతో తయారు చేసే బ్యానర్లు వాడాలని ఆదేశాలివ్వటం శుభ పరిణామమని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేతన్నలకు సర్కారు వెన్నుదన్ను నేత, మరమగ్గం కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోంది. ఇటు సంక్షేమ పథకాలతోపాటు ప్రభుత్వ నిర్ణయాలు కూడా నేతన్న ఉపాధికి ఊతమిస్తున్నాయి. చేనేత కార్మికులకు నేతన్న నేస్తం పథకం కింద ఏడాదికి రూ.24 వేలు, చేనేత పెన్షన్ల కింద 50 ఏళ్లు పైబడిన కార్మికులకు నెలకు రూ.2,500, చేయూత కింద యేడాదికి రూ.18,750 అందజేస్తున్నారు. తాజాగా బ్యానర్లకు వస్త్రాలు వాడాలని ఆదేశించడంతో నేతన్నలకు ఉపాధి మరింత పెరగనుంది. వస్త్ర బ్యానర్లతో ఉపాధి గతంలో ఆర్డర్లు లేకుండా వివాహ విందులో సప్లయర్లుగా వెళ్లేవాళ్లం. ఈ దశలో ప్రభుత్వం అందించిన యూనిఫామ్ ఆర్డర్లు నా కుటుంబంతో పాటు నేత పరిశ్రమను ఆదుకుంటున్నాయి. వస్త్రాలతో బ్యానర్లు వేయడం ప్రారంభిస్తే, నేయాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో నేతన్నకు పని దొరుకుతుంది. – ఎజి.దేవన్, నేత కార్మికుడు, సత్రవాడ రక్షణతో పాటు ఉపాధి నేతపరిశ్రమలో ప్రధానమైన డైయింగ్ యూనిట్ల వారికి శాశ్వత పరిష్కారం చూపే ఎఫ్లూయంట్ ట్రీట్మెంట్ ప్లాంటు నిర్వహణకు వచ్చింది. ప్రస్తుతం ప్లాస్టిక్ బ్యానర్లు బ్యాన్ చేసి వస్త్ర బ్యానర్లు వేయాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పర్యావరణ రక్షణకు ఉపయోగపడటంతో పాటు నేత పరిశ్రమకు ఉపాధి కల్పిస్తుంది. – భూపాళన్, ఏకాంబరకుప్పం మంచి నిర్ణయం ప్లాస్టిక్‌ను నిషే«ధించాలన్న నిర్ణయం మంచిది. ఏటా ప్రతి మనిషి దాదాపు 12 కిలోల ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నట్లు అంచనా. దీనివల్ల దేశవ్యాప్తంగా రోజూ నలుగురు క్యాన్సర్‌తో చనిపోతున్నారు. ఇప్పటికే ప్రతి ఆవు, చేప కడుపులో ప్లాస్టిక్ ఉంది. మనిషి కడుపులో దాదాపు 20 గ్రాముల వరకు ప్లాస్టిక్ ఉన్నట్లు తెలుస్తోంది. – మురళి, పర్యావరణ ప్రేమికుడు -
హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. చింతా ప్రభాకర్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనుండగా, ఆయనకు అవసరమైన కార్యాలయ వసతి, సిబ్బంది, జీతభత్యాలు తదితరాలను పరిశ్రమల శాఖ సమకూరుస్తుంది. 2014లో టీఆర్ఎస్ నుంచి సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన చింతా ప్రభాకర్ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. -
మారిన మగ్గం బతుకులు
దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన చేనేతల బతుకులు గత ప్రభుత్వాల పాలనలో కునారిల్లాయి. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేయగలిగిన నైపుణ్యం ఉన్న చేనేతలు పాలకుల ఆదరణలేక, మెతుకు దొరక్క, పస్తులతో బతుకులీడ్చలేక ప్రాణాలొదలాల్సిన పరిస్థితులను ఎదుర్కొన్నారు. నేత వృత్తినే నమ్ముకుని కుటుంబాలను పోషించుకునే నేతన్నల జీవితాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త వెలుగులు నింపుతున్నారు. ఇప్పటికే మూడేళ్లుగా వైఎస్సార్ నేతన్న నేస్తంతోపాటు నవరత్న పథకాలు చేనేత రంగంపై ఆధారపడిన వారికి జీవం పోశాయి. తాజాగా నాలుగో విడత లబ్ధి చేకూర్చనున్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్: చేనేత కుటుంబాలు స్వర్ణయుగం వైపు పయనిస్తున్నాయి. ఆకలి మరణాల నుంచి అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయి. గతంలో ప్రభుత్వాల ఆదరణ లేక మూలన పడేసిన మగ్గాలు మళ్లీ ఊపందుకున్నాయి. సంప్రదాయ వృత్తినే నమ్ముకున్న చేనేతలు పూర్వవైభవం వైపు పరుగులు తీస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేనేతల బతుకుల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేశారు. ఉమ్మడి కడప జిల్లాలో ప్రదానంగా మాధవరం, ఖాజీపేట, మైలవరం, పుల్లంపేట, బద్వేలు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో దాదాపు 6–7 వేల మందికి పైగా మగ్గాల ద్వారా చేనేత వస్త్రాలను నేస్తున్నారు. అలాగే వీరు కాకుండా అనుబంధ కార్మికులు కూడా ఉన్నారు. మూడేళ్లలో నాల్గవ దఫా నేతన్న నేస్తం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక ఎన్నో ఆర్థిక కష్టాలు ఎదురైనా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం చేనేతలకు వైఎస్సార్నేతన్న నేస్తం అందిస్తున్నారు. ప్రతి కుటుంబానికి యేటా రూ. 24 వేల నగదు సాయం అందుతోంది. తొలి విడతలో ఎవరికైనా సాంకేతిక కారణాలతో సాయం అందకపోతే తిరిగి మళ్లీ అందజేస్తున్నారు. ఈ విధంగా మూడేళ్లలో నాల్గవ విడత నేతన్న నేస్తం నగదును ఈనెల 25న గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా చేనేతల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పటివరకు ఒక్కో కుటుంబానికి రూ. 72 వేల సాయం అందింది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 2019–20లో 11,774 మందికి రూ. 28,25,76,000, 2020–21లో 10774 మందికి రూ. 25 కోట్ల 85 లక్షల,76 వేలు, 2021–22లో 8636 మందికి రూ. 19 కోట్ల,76 లక్షల,64 వేలు అందగా, 2022–23లో 9291 మందికి రూ. 22కోట్ల,29 లక్షల,84 వేలు సాయం అందనుంది. మారిన బతుకులు: ప్రభుత్వం యేటా అందిస్తున్న రూ.24 వేలతో చేనేత కుటుంబాలు ఆర్థికంగా ఎదు గుతున్నాయి. అప్పులు తెచ్చుకుని నేత ముడి సరుకులు కొనుగోలు చేసే పనిలేకుండా ఈ డబ్బులు పెట్టుబడిగా పెట్టుకుని ధీమాగా బతుకుతున్నారు. చేనేతల జీవితాల్లో వెలుగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేనేతల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం చేనేతల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. అతలాకుతలమైన చేనేతల కుటుంబాల్లో ఈ పథకం వల్ల ఎంతో మార్పు చోటుచేసుకుంది. పథకం లబ్ధి చేకూరడంతో కష్టాలు పడుతున్న చేనేత కుటుంబాలు నేడు సంతోషంగా తమ జీవితాలను గడుపుతున్నారు. ఇలాంటి పథకం ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టలేదు. – శ్రీరామదాసు, మాధవరం మగ్గం చేతబట్టాం అనాదిగా చేనేత వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాము. గత ప్రభుత్వాల సహకారం లేక మగ్గాన్ని మూలన పడేసి వేరే వృత్తిలోకి వెళ్లి బతుకులు కొనసాగించాల్సి వచ్చింది. అయితే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేతన్న నేస్తం సాయంతో మగ్గాన్ని నేస్తూ సంతోషంగా జీవిస్తున్నాం. దానితో కావాల్సిన ముడి సరుకులు కొనుగోలు చేసి వృత్తి మీదనే ఆధారపడుతున్నాం. – సామల సుబ్రమణ్యం, మాధవరం–1 ఆర్థికంగా బలోపేతం కావాలి జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద మంజూరైన ఆర్థికసాయాన్ని గురువారం ఖాతాలకు జమ చేయనున్నాం. 9291 మంది లబ్ధిదారులకు నగదును అందించనున్నాం. ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయాన్ని ఉపయోగించుకుని ఆర్థికంగా చేనేతలు బలోపేతం కావాలి. – భీమయ్య, సహాయ సంచాలకులు, జిల్లా చేనేత జౌళిశాఖ, కడప -
మెగా పవర్లూమ్ క్లస్టర్ ఇవ్వండి
సిరిసిల్ల: సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రధాని, కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రిని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో సోమవారం జరిగిన స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో కేటీఆర్ ప్రసంగించారు. టెక్స్టైల్ రంగంపై విధించిన జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. నేత కార్మికులకు బాసటగా నిలిచేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా నేతన్న బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని, చేనేత, పవర్లూమ్ కార్మికులు ఏ కారణంగా మరణించినా వారి కుటుంబాలకు రూ.5 లక్షల సాయం అందుతుందని అన్నారు. రాష్ట్రంలో 80 వేలమంది నేత, పవర్లూమ్ కార్మికులకు బీమాసౌకర్యం లభిస్తుందని తెలిపారు. పవర్లూమ్ కార్మికులకు రూ.2,500 కోట్ల బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్, స్కూల్ యూనిఫారాల వస్త్ర ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చామని వివరించారు. ప్రభుత్వ ఆర్డర్లతో నేత కార్మికులు మెరుగైన ఉపాధి పొందుతున్నారని, వారికి పొదుపు(త్రిఫ్ట్) పథకాన్ని కూడా అమలు చేస్తున్నామని వివరించారు. సిరిసిల్ల శివారుల్లోని 60 ఎకరాల్లో రూ.174 కోట్లతో నిర్మిస్తున్న అపెరల్ పార్క్ పూర్తయితే గార్మెంట్ రంగంలో 8 వేలమంది మహిళలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. మధ్యమానేరు జలాశయంలో రూ.2 వేల కోట్ల పెట్టుబడులతో 10 వేలమందికి ఉపాధినిచ్చేలా 367 ఎకరాల్లో ఆక్వాహబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. 12 రాష్ట్రాలకు సిరిసిల్ల జెండాలు స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ రెండు వేలమంది సిరిసిల్ల నేతన్నలు ఐదువేల మగ్గాలపై కోటి 20 లక్షల జాతీయజెండాలను తయారు చేశారని కేటీఆర్ అన్నారు. రూ.5 కోట్ల విలువైన జాతీయ జెండాలను 12 రాష్ట్రాలకు అందించారని అభినందించారు. మండెపల్లి వద్ద 12 బ్యాచ్‌ల్లోని 332 మందికి అత్యుత్తమ ప్రమాణాలతో శిక్షణ ఇచ్చి 139 మందికి ప్లేస్మెంట్ కల్పించినట్లు తెలిపారు. కాలునొప్పితోనే మంత్రి కేటీఆర్ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. కుర్చిలో కూర్చునే ప్రసంగించారు. మంత్రి ప్రయాణిస్తున్న వ్యాన్ మొరాయించడంతో నిర్ణీత సమయం కంటే 35 నిమిషాలు ఆలస్యంగా సిరిసిల్లకు చేరుకున్నారు. అనంతరం సిరిసిల్ల నేతకార్మికులు మంత్రి కేటీఆర్‌ను నూలుపోగుల దండతో సత్కరించారు. మూడు అంశాలతో ముందుకు... తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరణలకు వేదికైందని, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్టక్చర్, ఇంక్లుజివ్ గ్రోత్ అనే మూడు అంశాలపై ముందుకెళ్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో ఇంటింటా ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్–2022ను కేటీఆర్ ప్రారంభించారు. 33 జిల్లాల ఆవిష్కర్తలతో జరిగిన గూగుల్‌మీట్‌లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోందన్నారు. టీ–హబ్, వీ–హబ్, అగ్రీ–హబ్, కే–హబ్, బీ–హబ్ వంటి అనేక కొత్త ఆవిష్కరణలకు రాష్ట్రం వేదికగా నిలుస్తుందని కేటీఆర్ వివరించారు. -
చీరపైన బాపూ బొమ్మ
బాపు బొమ్మల అందం గురించి ఎంత వర్ణించినా.. మనవైన చేనేతల ఘనత గురించి ఎంత చెప్పినా మాటలు సరిపోవు. ఇక, ఈ రెండింటి కాంబినేషన్లో వచ్చిన కళా సోయగాలను ఎంత చూసినా తనివి తీరవు. ఆ అందమైన కాంబినేషన్‌ను నారాయణపేట చేనేత చీరల మీదకు వచ్చేలా రూపుకట్టారు హైదరాబాద్ వాసి, ఫ్యాషన్ డిజైనర్ హేమంత్‌సిరి. ఈ కొత్త కాంబినేషన్ గురించి, ఆమెకు వచ్చిన ఈ ఆలోచన గురించి ఆమె మాటల్లోనే.. ‘నాలుగేళ్లుగా ప్రతి యేడాది ఆగస్టు నెలలో మన తెలుగురాష్ట్రాల చేనేత కారులతో కలిసి ‘తస్రిక’ పేరుతో ఒక వేడుక నిర్వహిస్తున్నాను. ఇందులో భాగంగా గతంలో హ్యాండ్లూమ్స్ని యువత కోసం ఇండోవెస్ట్రన్ డ్రెస్‌లు రూపొందించాను. ఈ క్రమంలోనే నారాయణ పేట చేనేతకారులను కలిసినప్పుడు, వారి డిజైన్స్ చూసినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నారాయణ పేట చీరలు సాధారణంగా ప్లెయిన్లోనే ఉంటాయి. అయితే అందరినీ ఆకర్షించాలంటే వీటిలో కొన్ని మార్పులు తీసుకురావచ్చు అనిపించింది. దీంతో కిందటేడాది లేపాక్షి డిజైన్స్‌ని నారాయణ పేట్ కాటన్ శారీస్మీదకు తీసుకువచ్చాం. బాపూ స్మరణం ఈ నెలలో బొమ్మల బాపూ వర్ధంతి ఉంది. హ్యాండ్లూమ్ డే కూడా ఈ ఆగస్టు నెలలోనే. బాపూగారిని తలుచుకోగానే మనకు ఆ ముగ్గులు, బొమ్మలు.. మన మదిలో అలా నిలిచిపోతాయి. దీంతో ఈ యేడాది బాపూ బొమ్మలను డిజిటల్ ప్రింట్లుగా నారాయణ పేటæపట్టు చీరల మీదకు తీసుకువచ్చాను. ఆ బొమ్మల రూపును నా డ్రెస్ డిజైన్స్పైకి తీసుకురావాలనే ఆలోచన కొన్నాళ్లుగా ఉంది. కానీ, నారాయణ పేట హ్యాండ్లూమ్స్కైతే మరింత బాగుంటుందని అనుకున్నాను. నారాయణæపేట పట్టు చీరల మీద డిజిటల్ ప్రింట్ల అందం గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనుకున్నది కూడా దీని వెనక ఉన్న ఉద్దేశ్యం. ఈ బాపూ బొమ్మల కాన్సెప్ట్‌ని ఐఎఎస్ హరిచందన, ఇతర అధికారులు చాలా అభినందించారు. చేనేత కారులకు మార్కెటింగ్ ప్లెయిన్‌గా ఉన్న హ్యాండ్లూమ్స్కి మరిన్ని హంగులు అద్దడం వల్ల ప్రజల్లోకి వీరి చేనేతలు మరింత వేగంగా వెళతాయి. చీరలపై డిజిటల్ ప్రింట్లు సులువుగానూ వేయచ్చు. స్థానికంగా బ్లాక్‌ప్రింట్, డిజిటల్ ప్రింట్ యూనిట్స్‌ని ప్రభుత్వం గానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ ఏర్పాటు చేయగలిగితే చేనేత కారులకు మరిన్ని అవకాశాలు మెరుగవుతాయి. నారాయణ పేటæ చీరలు అనగానే పెద్దవాళ్లు కట్టుకునేవి అనే అభిప్రాయం ఉండేది. ఆ ఆలోచన మార్చాలనే టీనేజర్స్ కూడా ఇష్టపడేలా పేస్టల్ కలర్స్, మోటిఫ్స్లోనూ మార్పులు తీసుకురావడంపై కృషి జరుగుతోంది. చేనేతకారులకు అవకాశాలు మెరుగవడానికి చేస్తున్న చిరు ప్రయత్నం ఇది’ అని వివరించారు ఈ ఫ్యాషన్ డిజైనర్. – నిర్మలారెడ్డి -
కేటీఆర్ చేనేత చాలెంజ్ స్వీకరించిన పవన్ కల్యాణ్
సాక్షి, హైదరాబాద్: చేనేత దినోత్సవం సందర్భంగా ఐటీ శాఖ మంత్రి కేటీ రామా రావు విసిరిన చేనేత చాలెంజ్‌ను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్వీకరించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ స్పందిస్తూ ’రామ్ భాయ్ చాలెంజ్‌ను స్వీకరించా. ఎందుకంటే చేనేత వర్గాలంటే నాకు ప్రేమ, అభిమానం’ అంటూ చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. అనంతరం పవన్ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ఏపీ మాజీ మంత్రి బాలి నేని శ్రీనివాసరెడ్డి, తెలంగాణకు చెందిన బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌లను నామినేట్ చేస్తూ చేనేత చాలెంజ్ విసిరారు. చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను షేర్ చేయాలని వారిని కోరారు. కాగా, పవన్ స్పందన పట్ల కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. పవన్‌తో పాటు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌లకు కూడా కేటీఆర్ చేనేత చాలెంజ్ విసిరారు. -
‘చేనేత’కు జీఎస్టీ మరణశాసనమే: కేటీఆర్
ఖైరతాబాద్(హైదరాబాద్): చేనేత ఉత్పత్తుల మీద కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలని మంత్రి కె.తారక రామారావు డిమాండ్ చేశారు. ఆదివారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ఎమ్మెల్సీ ఎల్.రమణ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వీడియో కాన్పరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడుతూ.. ఈ సంవత్సరం టెస్కో ఆధ్వర్యంలో రామప్ప చేనేత చీరలను ఆవిష్కరించడం గొప్ప శుభపరిణామమన్నారు. చేనేత మిత్ర ద్వారా 50శాతం సబ్సిడీతో ముడి సరుకు అందిస్తున్నామన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు జాతిపిత మహాత్మాగాంధీ చరకాతో నూలు వడుకుతూ జాతి మొత్తాన్ని స్వదేశీ ఉద్యమంవైపు మళ్లించారని చెప్పారు. కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన తరుణంలో భారత ప్రభుత్వం చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం దురదృష్టకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కొన ఊపిరితో ఉన్న పరిశ్రమపై మరణశాసనం రాసినట్టేనని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, దేశంలోని చేనేత కార్మికులందరి తరఫున జీఎస్టీని ఎత్తివేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. భారతీయ కళలకు చేనేత ఉత్పత్తులు దోహదపడుతున్నాయన్నారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు చేనేత వస్త్రాలు ధరించేలా చేస్తున్నామని, ప్రతి సోమవారం ఉద్యోగులు నేత వస్త్రాలను ధరించాలని విజ్ఞప్తి చేశారు. -
అధికారంలోకి రాగానే నేతన్నలను ఆదుకుంటాం
భూదాన్‌పోచంపల్లి: ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, మళ్లీ రాజన్న సంక్షేమ పాలన తీసుకువస్తామని, అప్పుడు చేనేతతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని వంకమామిడి, దంతూర్, కనుముకుల, భీమనపల్లి మీదుగా భూదాన్‌పోచంపల్లి వరకు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా భూదాన్‌పోచంపల్లిలో నిర్వహించిన చేనేత సదస్సులో షర్మిల మాట్లాడారు. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేనేత కార్మికులకు రుణమాఫీ చేశారని, నూలుపై సబ్సిడీ, నేతన్నలకు బీమా అందించారని గుర్తు చేశారు. నేడు నూలు ధరలు పెరిగి, గిట్టుబాటు లేక అప్పుల బాధతో 50 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారిని అధికార పార్టీ నాయకులు కనీసం పరామర్శించలేదని, ఎక్స్‌గ్రేషియా చెల్లించిన పాపాన పోలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణను అప్పులు, ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారని దుయ్యబట్టారు. తెలంగాణలో ఏ ఒక్క వర్గాన్ని కూడా ఆదుకోని సీఎం కేసీఆర్ ఇప్పుడు దేశాన్ని ఏలబోతాడంటా అని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి రాగానే చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని, సబ్సిడీ రుణాలు, మగ్గానికి ఉచిత కరెంట్, సబ్సిడీపై నూలు, రంగులు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధులు పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, ప్రోగ్రాం కోర్డినేటర్ రాజగోపాల్, రాష్ట్ర ప్రచార కన్వీనర్ నీలం రమేశ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
చేనేత మృతుల కుటుంబాలను ఆదుకోండి
ఖైరతాబాద్: ఆర్థిక ఇబ్బందులతో మూకుమ్మడిగా ఆత్మ హత్యలకు పాల్పడ్డ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నాపల్లికి చెందిన చేనేత కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జాతీయ చేనేతన్నల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కమిటీ చైర్మన్ దాసు సురేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రవీణ్‌కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్, మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు మాట్లాడారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడినా ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో సీపీఐ నేత పాశికంటి లక్ష్మినర్సయ్య, బీసీ మహిళానేత శారద గౌడ్, సాజిదా సికిందర్, బోనం ఊర్మిళ, వీరస్వామి పాల్గొన్నారు. -
ఆనందంగా పండుగ జరుపుకోవాలని వచ్చి.. అంతలో విషాదం
సాక్షి,ధర్మపురి(కరీంనగర్): సంక్రాంతి పండుగను కుటుంబసభ్యులతో ఆనందంగా జరుపుకోడానికి స్వగ్రామం వచ్చిన ఓ చేనేత కార్మికుడు గుండెపోటుతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ధర్మపురి మండలంలోని తీగల ధర్మారం గ్రామానికి చెందిన ఆడెపు శంకరయ్య(63) చేనేత కార్మికుడు. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో సిరిసిల్లలో ఉంటూ పని చేస్తున్నాడు. సంక్రాంతి నేపథ్యంలో గురువారం పని ముగించుకొని, ఇంటికి వచ్చాడు. రాత్రి కటుంబసభ్యులతో ఆనందంగా గడిపాడు. శుక్రవారం బహిర్భూమికి వెళ్లి, ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలాడు. శంకరయ్య ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యలు వెతకగా బహిర్భూమి ప్రాంతంలో మృతిచెంది కనిపించాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ పెద్ద తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో వారు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. మరో ఘటనలో.. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తంగళ్లపల్లి మండలం అంకుశాపూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన నాగారపు బాలయ్య–రేనవ్వలకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. చిన్నకొడుకు నాగారపు నరేశ్(23) డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటికొచ్చిన నరేశ్ శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నరేశ్ బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదు. తంగళ్లపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సిరిసిల్ల జరీ.. అగ్గిపెట్టెలో చేరి
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ అగ్గిపెట్టెలో ఇమిడేలా చీరను, దబ్బనంలో ఇమిడేలా మరో చీరను నేశాడు. కట్టుకునేందుకు వీలుగా ఉన్న ఈ రెండు చీరలను చేనేత మగ్గంపై బంగారం జరీ పోగులతో నేసి శభాష్ అనిపించుకున్నాడు. గతంలో చేనేత కళా వైభవాన్ని ప్రపంచానికి చాటిన పలువురు చేనేత కళాకారులు అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసినా.. అవి కట్టుకునేందుకు అనువుగా ఉండేవి కావు. అగ్గిపెట్టెలో పట్టే చీరతో నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ఇప్పుడు హరిప్రసాద్ చేనేత మగ్గంపై గ్రాము బంగారం జరీతో నేసిన చీర కట్టుకునేందుకు అనువుగా ఉంది. మరోవైపు దబ్బనంలో దూరే చీరను సైతం హరిప్రసాద్ నేశాడు. ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించాడు. న్యూజిలాండ్‌కు చెందిన సునీత–విజయభాస్కర్‌రెడ్డి దంపతుల కోరిక మేరకు రూ.10 వేల ఖర్చుతో అగ్గిపెట్టెలో ఇమిడే కట్టుకునే చీరను నేశాడు. దబ్బనంలో ఇమిడే చీర ఈ చీర 5.5 మీటర్ల పొడవు, 160 గ్రాముల బరువుతో ఉంది. దబ్బనంలో దూరే చీరను సైతం కట్టుకునేందుకు వీలుగా నేశాడు. గ్రాము గోల్డ్ జరీ పట్టు దారాలతో ఈ చీరను నేశాడు. దీని బరువు 350 గ్రాములు ఉంటుంది. ఇప్పటికే సూక్ష్మ కళలో రాణిస్తున్న హరిప్రసాద్ అగ్గిపెట్టెలో ఇమిడే చీరను, దబ్బనంలో దూరే చీరను నేసి మరోసారి సిరిసిల్ల నేత కళను ప్రపంచానికి చాటి చెప్పాడు. -
చేనేతకు బ్రాండింగ్
సాక్షి, అమరావతి: చేనేత వస్త్రాలకు బ్రాండింగ్ పెంచేందుకు ప్రభుత్వ రంగ సంస్థ.. ఆప్కో, ఆంధ్రప్రదేశ్ క్రాఫ్ట్ కౌన్సిల్ కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు ఆప్కో చైర్మన్ చిల్లపల్లి నాగ వెంకట మోహనరావు, ఎండీ చదలవాడ నాగరాణిలతో కౌన్సిల్ కార్యదర్శి రంజన, కోశాధికారి జయశ్రీలు మంగళవారం సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడుతూ.. భారతదేశంలో వ్యవసాయం తర్వాత చేనేత పరిశ్రమ అతిపెద్ద ఉపాధి రంగంగా ఉందన్నారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం పని కల్పిస్తూ జీవనోపాధికి తోడ్పడుతోందన్నారు. అయితే తగిన ప్రచారం లేక ఇబ్బంది ఎదుర్కొంటోందని తెలిపారు. దీన్ని అధిగమించేందుకు ఆప్కో.. ఆంధ్రప్రదేశ్ క్రాఫ్ట్ కౌన్సిల్‌తో కలిసి ముందడుగు వేయాలని నిర్ణయించుకుందన్నారు. ఆప్కో ఎండీ నాగరాణి మాట్లాడుతూ.. చేనేత వస్త్రాల ప్రాముఖ్యత, వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలపై విద్యా సంస్థలతోపాటు ఇతర సంస్థల్లో అవగాహన సదస్సులు, ప్రదర్శనలు ఏర్పాటు చేసేందుకు కౌన్సిల్ సహకరిస్తుందన్నారు. యువత ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా నూతన డిజైన్లకు రూపకల్పన చేస్తామని తెలిపారు. -
తెలంగాణకు వచ్చేసిన క్వీన్ ఆఫ్ సిల్క్స్..
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర ప్రాంతంలో ప్రాచీన కాలం నాటి చేనేతలుగా పేరొందిన పైథానీ చేనేత కళ తెలంగాణ ప్రాంతానికీ చేరువైంది. అథీకృత చేనేత సిల్క్ ఫ్యాబ్రిక్ చీరలకు ప్రసిద్ధి చెందిన ఓన్లీ పైథానీ బ్రాండ్... తెలంగాణ రాష్ట్రంలో తమ శాఖల విస్తరణ షురూ చేసింది. తాజాగా హైదరాబాద్, బంజారాహిల్స్‌లో తమ ఓన్లీ పైథానీ స్టోర్ ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ పైథానీ విశేషాలను తమ సేవల వివరాలను తెలిపారు. క్వీన్ ఆఫ్ సిల్క్స్.. క్వీన్ ఆఫ్ సిల్క్స్గా దేశవ్యాప్తంగా పేరొందిన పైథానీ నవవధువు దుస్తులకు సంప్రదాయ చిరునామాగా పేరొందింది. సహజమైన, స్వఛ్చమైన ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్‌తో రూపొందిన వస్త్రాలతో వినూత్న డిజైన్లుగా ఇవి ఇటీవలి కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చాయి. గత 11ఏళ్లుగా పైథానీ చేనేత సంప్రదాయానికి పునర్వైభవం తెచ్చేందుకు ఓన్లీ పైథానీ బ్రాండ్ సంకల్పించింది. అలాగే పల్లెలు, గ్రామీణ ప్రాంతంలో స్థానిక చేనేత కళాకారుల జీవన స్థితిగతుల బాగు కోసం కృషి చేస్తోంది. తత్ఫలితంగా పైథానీ అందిస్తున్న ప్రతీ చీరా కళాత్మకంగా తయారవడంతో పాటుగా మహారాష్ట్రకు చెందిన పైథానీ చేనేత కళాకారుల ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇప్పుడీ సంప్రదాయ వస్త్ర శోభ తెలుగు రాష్ట్రాల్లోనూ మహిళల వస్త్రధారణలో భాగం కానుంది. చదవండి: Broken Milk:పాలు విరిగాయా? వర్రీ అవద్దు.. ఇలా ఉపయోగించండి! -
మహాత్ముడు కొల్లాయి గట్టింది ఎందుకు?
గాంధీజీ నిర్ణయం తీసుకున్నారు! అంతే, రాత్రి పది గంటలప్పుడు గుండు గీయించుకున్నారు. మర్నాడు చేనేత కార్మికుల సభలో కొల్లాయి గుడ్డతో ప్రసంగించారు. అది 1921 సెప్టెంబర్ 22. సరిగ్గా వందేళ్ళ క్రితం జరిగిన సంఘటన ఇది. మోకాళ్ళు దాటని గోచీ, పైన తువ్వాలు. ఇంతే ఆహార్యం! చలికాలం అవసరమనుకుంటే నూలు శాలువా. కన్ను మూసే దాకా అలాగే కొనసాగారు. ఖాదీ తనకు ‘ఐడియా’, ‘ఐడియల్’ అని గాంధీజీ పేర్కొంటారు. పలు భాషలు, సంస్కృతుల భారత దేశానికి ఆయన దుస్తులు గొప్ప ‘కమ్యూనికేషన్’గా పనిచేశాయి. 1921 జూలై 31న బొంబాయిలో అధికారికంగా ప్రారంభించిన విదేశీ వస్త్ర బహిష్కరణ కార్యక్రమం సెప్టెంబర్‌కి ముగిసిపోవాలి. అయితే అది తృప్తిగా సాగడం లేదు. తగినంత ఖద్దరు దొరకడం లేదని తెలిసింది. ఖరీదు ఎక్కువ కావడంతో కొనడం కష్టం అని కూడా చెప్పారు. దానికి గాంధీజీ, ‘ఖాదీ చాలి నంత దొరక్కపోతే కొల్లాయితో సరిపుచ్చుకోండి’ అంటూ ఉపన్యసించారు. సరిగ్గా ఈ దశలో గాంధీజీ వ్యక్తిగా వంద రెట్లు, కాదు వెయ్యి రెట్లు ఎదిగారు. బిహార్ చంపారణ్య ప్రాంతంలో నీలిమందు పండించే రైతుల కష్టాల పరిష్కారానికి దోహదపడింది గాంధీజీ నాయకత్వం వహించిన తన తొలి భారత దేశపు ఉద్యమం. అహ్మదాబాద్ జౌళి కార్మికుల కోర్కెలకు మద్దతుగా నిలిచింది రెండో పెద్ద ఉద్యమం. ఈ రెండూ గుడ్డలకు సంబంధించినవే. 1918లో జరిగిన జౌళి కార్మిక ఉద్యమంలో రెండు వారాలు గడిచింది. నిరసన తెలిపే కార్మికుల సంఖ్య తగ్గిపోతోంది. ఓ రోజు గాంధీజీ, అనసూయబెన్ వచ్చారు. సమ్మె కార్మికులెవరూ చెట్టుకింద లేరు. కారణం ఏమిటి అని ఆరా తీశారు. ఓ కార్మికుడు చెప్పాడు: వారికి పోయేదేముంది? కార్లో వస్తారు, ఇంటికెళ్లి భోంచేస్తారు అనే అభిప్రాయముందని! గాంధీజీ మనసు కల్లోలమై, దీర్ఘాలోచనల్లో పడింది. దాని ఫలితమే తన తొలి నిరాహారదీక్ష. 1918 మార్చి 15న ప్రారంభమైంది. ఫలితంగా వారం రోజుల్లో పరిష్కారం లభించింది. ‘త్రికరణ శుద్ధి’ అని అంటామే, దాన్ని సంపూర్తిగా కలిగిన నాయకుడు గాంధీజీ. మోకాళ్లు దాటని గోచీ, లేదా కొల్లాయి కట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? గాంధీజీ మూడవ తరగతి రైలు బండిలో ప్రయాణం చేస్తున్నప్పుడు కిటికీ గుండా రాయలసీమ ప్రాంతపు రైతులను చూశారని, అదే స్ఫూర్తి అని అక్కిరాజు రమాపతిరావు తన ‘దుర్గా బాయి దేశ్‌ముఖ్’ మోనోగ్రాఫ్‌లో పేర్కొన్నారు. మోప్లాల తిరుగుబాటు విషయం తెలిసి మహమ్మ దాలీతో మలబారు ప్రయాణమయ్యారు గాంధీజీ. కానీ వాల్తేరులో మహమ్మదాలీని అరెస్టు చేయడమే కాక, గాంధీజీ మలబారు పర్యటనను కూడా బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. దీనితో గాంధీజీ తన పర్య టనను కుదించుకుని, మదురై వెళ్ళారు. తిరుచురాపల్లి నుంచి మదురైకి రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు – తను కొల్లాయి కట్టుకోనంత వరకు రైతులకు ఆ ప్రబోధం చేయకూడదని నిర్ణయించు కున్నారు. తనతో పాటు ప్రయాణం చేస్తున్న రాజాజీకి చెబితే నచ్చలేదు. కానీ గాంధీజీ స్థిర నిర్ణయానికి వచ్చేశారు. విదేశీ వస్త్ర బహిష్కరణకు ఇది తోడ్పడుతుంది. ఖద్దరు ధరించాలనే నియమానికి ప్రతీక అవుతుంది. ఖద్దరు లోటును కొంత పరిష్కరిస్తుంది. మన దేశపు శీతోష్ణస్థితుల్ని బట్టి కూడా గోచీ ధరించడం ఇబ్బంది కాదు. మన సంస్కృతి కూడా మగవాళ్లను తమ శరీరం పూర్తిగా కప్పుకోమని నిర్దేశిం చదు. ఇన్ని కారణాలతో గాంధీజీ యాభై రెండేళ్ళ వయసులో, స్వాతంత్య్రోద్యమం తొలి రోజుల్లో కొల్లాయి గట్టడం ప్రారంభించారు. దేశంలోని ఎందరో దరిద్ర నారాయణులకు ప్రతీక అయ్యారు. కోటానుకోట్ల భారతీయులకు ఆరాధ్యుడయ్యారు. డా. నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి మొబైల్ : 94407 32392 (నేడు గాంధీజీ కొల్లాయి ధారణ శత వసంతాల వేడుక) -
CM YS Jagan: జరీ అంచుపై సీఎం జగనన్న ఫొటో
సాక్షి, నగరి: నగరి చేనేత పరిశ్రమను ప్రగతి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే రోజా చూపుతున్న శ్రద్ధకు కృతజ్ఞతగా నగరి చేనేత కార్మికులు వారి చిత్రాలను హాఫ్‌సిల్క్ శారీ జరీ బోర్డర్‌పై నేశారు. నేత పరిశ్రమను సాంకేతికత వైపు మళ్లించేందుకు ఎమ్మెల్యే ఆర్కే రోజా, ఆమె భర్త, రాయలసీమ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్కేసెల్వమణి హిందూపూర్ నేత పరిశ్రమ వారితో చర్చించి నగరి మునిసిపాలిటీకి అధునాతన డిజైన్లలో చీరలు నేసే జకార్డ్ యంత్రాలు తెప్పించారు. ఈ ఆధునిక యంత్రాల్లో చీర నేయడాన్ని ఎమ్మెల్యే ఆర్కే రోజా శుక్రవారం ప్రారంభించారు. చదవండి: Disha App: ‘దిశ’ యాప్ కేరాఫ్ మన అన్న.. -
త్వరలో చేనేత, మత్స్య, గౌడబీమా
హుజూరాబాద్/కమలాపూర్: టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని, త్వరలోనే రైతుబీమా తరహాలో చేనేత, మత్స్య, గౌడబీమాను ప్రభుత్వం అమలు చేయబోతోందని రాష్ట్ర ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. సోమవారం హుజూరాబాద్‌లో చేనేత సంఘాలు, పారిశ్రామికుల అభివృద్ధి, సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికులు త్రిఫ్ట్ ఎంత కడితే అంతకు డబుల్ ప్రభుత్వం చెల్లిస్తోందని, అధికారులు వారిని ఇబ్బంది పెట్టొద్దని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి మంత్రి కేటీఆర్ రూ.70 కోట్లు విడుదల చేశారని తెలిపారు. త్వరలో చేనేత కార్మికుల సమస్యలపై సీఎం కేసీఆర్‌తో సమావేశం ఉంటుందని చెప్పారు. హుజూరాబాద్ ప్రజలు అన్నం పెట్టే వాళ్ల దిక్కా? పన్నులు వేసే వాళ్ల దిక్కా? అనేది ఆలోచించాలని కోరారు. చేనేతకు భరోసాగా ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మంత్రి కమలాకర్, మాజీమంత్రులు ఎల్.రమణ, పెద్దిరెడ్డి, నేతలు సమ్మారావు, స్వర్గం రవి తదితరులు పాల్గొన్నారు. నమ్మకానికి పెట్టింది పేరు టీఆర్ఎస్ నమ్మకానికి టీఆర్ఎస్, అమ్మకానికి బీజేపీ కేరాఫ్ అడ్రస్ అని మంత్రి హరీశ్ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం సబ్సిడీలకు కోత లు పెడుతోందని, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెం చేసి వాతలు పెడుతోందని విమర్శించారు. సమావేశంలో సాయిచంద్ పాడిన పాటకు హరీశ్తోసహా ప్రభుత్వ విప్ సుమన్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, మాజీమంత్రి పెద్దిరెడ్డి, కౌశిక్‌రెడ్డిలు స్టెప్పులేసి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. -
అమెజాన్ ఇండియా కారీగర్ మేళా
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తాజాగా ట్రైబ్స్ ఇండియా సంస్థతో కలిసి కారీగర్ మేళాను ప్రారంభించింది. ఈ ఒప్పందం ప్రకారం సంప్రదాయ గిరిజన ఉత్పత్తులు, భారతీయ హస్తకళల ఉత్పత్తుల కోసం అమెజాన్ తమ పోర్టల్‌లో ప్రత్యేక విభాగాన్ని కేటాయించింది. బిద్రి, ఇక్కత్, పటచిత్ర తదితర సుమారు 1.2 లక్షల పైచిలుకు ఉత్పత్తులు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ కార్యక్రమం కింద ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 12 దాకా రెండు వారాల పాటు కారీగర్ విక్రేతలకు సెల్లింగ్ ఆన్ అమెజాన్ (ఎస్వోఏ) ఫీజు నుంచి 100 శాతం మినహాయింపు లభిస్తుంది. దేశీ చేనేతకారులు, చేతి వృత్తుల కళాకారులు ఈ–కామర్స్ ద్వారా మరింత వృద్ధిలోకి వచ్చేందుకు తోడ్పడేలా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో కలిసి పనిచేయడం కొనసాగిస్తామని అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ తెలిపారు. -
చేనేత గురించి చెబుతుంటే నా హృదయం ఉప్పొంగేది
చేనేత ఉత్పత్తులలో నాణ్యతను కాపాడటం.. చేనేతల్లో జనాకర్షణీయ పద్ధతులు తీసుకురావడం.. చేనేత కార్మికుల వారసులను తిరిగి వారి వృత్తి వైపుగా మళ్లించడానికి కృషి చేస్తున్నారు డాక్టర షర్మిలా నాగరాజ్ నందుల. తెలంగాణ రాష్ట్రంలో చేనేత అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వ్యక్తు లలో ‘ప్రముఖ వ్యక్తి’ పురస్కారం ఈ యేడాది డాక్టర్ షర్మిలా నాగరాజ్ అందుకున్నారు. హైదరాబాద్ వాసి అయిన ఈ హ్యాండ్లూమ్ లవర్ హారోస్కోప్ వీవింగ్, వర్డ్స్ వీవింగ్, సహజరంగులు, పాత సాంకేతిక నైపుణ్యాలతో చేనేతల అభివృద్ధికి పాటుపడుతున్నారు. ‘నెలలో ఒక్కరోజు అందరం ఖాదీ ధరిద్దాం. చేనేతల వృద్ధికి పాటుపడదాం’ అంటున్నారు. అమెరికా వాసి బోనీ టెర్సెస్తో కలిసి చేసిన హారోస్కోప్ టెక్నిక్స్ నేత కార్మికుల ప్రాచీన సాంకేతిక వ్యవస్థ, లెక్చరర్‌గా విద్యార్థులకు తన అనుభవాలను పంచడం వంటి అంశాల్లో దాదాపు 30 సంవత్సరాల అనుభవం షర్మిలా నాగరాజ్ సొంతం. పదేళ్లపాటు నిఫ్ట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులను నిర్వర్తించిన షర్మిల తన టీనేజ్ నుంచే చేనేతలపై పెరిగిన మక్కువ గురించి ఈ విధంగా వివరించారు. ‘‘చిన్నతనంలో అమ్మ నుంచి నేర్చుకున్న చేనేతల రీసైక్లింగ్ మెథడ్స్ కూడా నన్ను ఈ వైపుగా నడిపించేలా చేశాయి. ఎమ్మెస్సీ చేసేటప్పుడు మా లెక్చరర్ తన నేత దుస్తులు, అందులో వాడే టెక్నిక్స్ గురించి చెబుతున్నప్పుడు నా హృదయం ఉప్పొంగేది. ఆ ఇష్టమే హ్యాండ్లూమ్స్, నేచరల్ డైస్ మీద పీహెచ్డీ వైపుగా నడిపించిది. పదేళ్ల పాటు అమెరికాలో కోల్డ్‌వాటర్ క్రీక్, కోహ్ల్సి రీటైలర్లతో కలిసి పనిచేసే అనుభవాన్ని తెచ్చిపెట్టింది. పరిశోధనల వైపుగా.. పరిశోధనల్లో భాగంగా చేనేతలు, వాటి సహజరంగులు ఆరోగ్యానికి మేలు చేసేవిధానంపై ఐదేళ్ల పాటు విస్తృత పరిశోధనలు చేశాను. దీంతో మన ప్రాచీన పద్ధతులు, పాత సాంకేతిక నైపుణ్యాల పట్ల చాలా ఇష్టం ఏర్పడింది. చేనేతలను ధరించడం వల్ల వచ్చే శక్తి గురించి తెలిసింది. హారోస్కోప్ వీవింగ్ గ్రహాల పనితీరు మన జీవన విధానంపై ఎలా ఉంటుందో తెలియజేసే శాస్త్రం జ్యోతిష్యం. అమెరికాలో ఉన్నప్పుడు శ్రీమతి బోనీ టెర్సెస్ అనే ఆవిడ పరిచయమయ్యింది. ఆమె సూర్యరాశుల ఆధారంగా తన హ్యాండ్లూమ్స్ను స్వయంగా డిజైన్ చేసేవారు. ప్రతి మనిషికీ నక్షత్రాలు, గ్రహాల స్థితిని అనుసరించి వారికి నప్పే రంగులను కలుపుతూ బట్టలను నేసేవారు. ఆ నైపుణ్యాలను శ్రీమతి బోనీ నుండి నేర్చుకున్నాను. చేనేతల్లో ఫ్యాషన్–ఆస్ట్రాలజీ తీసుకురావాలనే ఆలోచనతో హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత నా డిజైన్స్‌లో ఆ టెక్నిక్స్ ప్రవేశపెట్టాను. అలాగే, థెరప్యూటిక్ వీవింగ్ కూడా. అంటే చేనేతలను ధరిస్తే మనకు వచ్చే పాజిటివ్ శక్తి, మనలో సంతోషం ఎంత పెరుగుతుందో అనే అంశాల్లో కూడా పరిశోధనలు చేశాను. పదాలను ఉపయోగిస్తూ చేసే వర్డ్ వీవింగ్‌కు సంబంధించిన టెక్నిక్స్ కూడా ఇందులో తీసుకుచ్చి, నేత కారులచే వర్క్‌షాప్‌లను ఏర్పాటు చేశాను. ‘గిరిజనుల కాస్ట్యూమ్స్‌లో మారుతున్న ట్రెండ్స్’పై మాస్టర్ థీసిస్ చేశాను. కౌముది స్టూడియో.. త్రిబుల్ ఆర్ ప్రాతిపదికన నడుస్తుంది కౌముది. రిస్టోర్, రిట్రివ్, రిసాల్వ్.. జాతీయ హస్తకళలను పునరుద్ధరించడం, చేనేత కార్మికులను పునరుజ్జీవింపచేయడం, చేనేత దుస్తుల కళను నిలుపుకోవడం.. ఈ మూడింటివైపుగా అభివృద్ధి చేయడానికి కౌముది స్టూడియోను ఆరేళ్ల క్రితం ఏర్పాటు చేశాను. బలమైన కారణం చేనేత కార్మికుల పరిస్థితులే నేనీ రంగంలో రావడానికి ప్రధాన కారణం. ప్రతి రంగంలోనూ మనం చాలా అభివృద్ధి సాధిస్తున్నాం. కానీ, చేనేత కార్మికుల విషయం వచ్చేసరికి ఇంకా వెనుకంజలోనే ఉన్నాం. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, డిజైనర్లు చేనేతలను తీసుకుంటున్నారు. కానీ, వారి జీవితాల్లో సరైన వృద్ధి లేదు. నెల వారి వేతనం ఎంత అనేది ఇప్పటికీ నిర్ధారణ లేకపోవడం కూడా ఒక కారణం. మన దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఆయా ప్రాంతానికి తగ్గ కళ ఉంది. కలంకారీ, బాతిక్, గుజరాతీ ప్రింటర్లు ఉన్నారు. వారిని బృందాలుగా ముందుకు తీసుకెళ్లాలనేది నా ఆలోచన. అల్మరాలో 25 శాతం.. నా బట్టల అల్మరాలో పూర్తిగా హ్యాండ్లూమ్స్ మాత్రమే ఉంటాయి. మనం చెప్పేది ఆచరణలో పెడితేనే దానిలో వృద్ధి కనపడుతుందని నా నమ్మకం. అలాగే, ఎక్కడ వర్క్‌షాప్స్ పెట్టినా అందరికీ ఒకటే మాట చెబుతుంటాను. ‘మీ బీరువాల్లో 25 శాతం చేనేతలకు స్థానం ఇవ్వండి’ అని. విద్యార్థిగా ఉన్నప్పుడు టెక్స్టైల్స్ ఆఫ్ ఇండియా మొత్తం తిరిగాను. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గుజరాత్ నుండి వెస్ట్ బెంగాల్ వరకు అన్ని చోట్లా హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. వీరంతా వృద్ధిలోకి రావాలంటే మన చేనేతలను మనం ధరించాలి. దీంతో పాటు విదేశాలకూ మన కళలను విస్తరింపజేయాలన్నది నా కల. చేనేతల నుంచి దూరమైన పిల్లలను తిరిగి చేనేతలకు దగ్గర చేయాలన్నదే నా ఆలోచన’’ అని వివరించారు డాక్టర్ షర్మిలా నాగరాజ్ నందుల. చేనేతల్లో వాడే రంగులు సహజసిద్ధమైనవి. ఆకులు, విత్తనాలు, పువ్వులు, బెరడు, వేళ్ల నుంచి వాటిని తీస్తారు. వీటి వల్ల చేనేతకారుడే కాదు రైతు కూడా బాగుపడతాడు. ఫలితంగా పర్యావరణమూ బాగుంటుంది అనే ఆలోచనను మన ముందుంచారు ఈ చేనేత ప్రేమిక. – నిర్మలారెడ్డి -
గొల్లభామ చీరలు.. ఇంటి నుంచే కొనేయచ్చు
సాక్షి, హైదరాబాద్: చేనేత వస్త్రాల్లో సిద్దిపేట గొల్లభామ చీరలది ప్రత్యేకమైన స్థానం. ఇకపై ఆ చీరలు కొనాలంటే సిద్దిపేటకు వెళ్లక్కర్లేదు. మరేషాప్కి పోనక్కర్లేదు. ఇంట్లో ఉండే ఏంచక్కా ఆ చీరలను పొందవచ్చు. పోస్టల్ శాఖకు చెందిన ఈ షాప్ పోర్టల్ ద్వారా దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఈ చీరలను బుక్ చేసుకుని హోం డెలివరీ పొందవచ్చు. ఈ షాప్ జియోగ్రాఫికల్ ఇండికేషన్(జీఐ) ట్యాగ్కలిగిన తెలంగాణ ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి తపాలా శాఖ తెలంగాణ సర్కిల్ రూపొందించిన ప్రత్యేక పోస్టల్ కవర్లతోపాటు ఆ శాఖ ఈ కామర్స్ వెబ్‌పోర్టల్ ‘ఈ–షాప్’ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం రాజ్‌భవన్‌లో ఆవిష్కరించారు. తెలంగాణలోని హస్తకళల ఉత్పత్తులు, జీఐ ట్యాగ్ ఉత్పత్తుల విక్రయాల కోసం పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ఏచ్పాటు చేసిన ప్రత్యేక ఈ కామర్స్ పోర్టల్ (www.eshop.tsposts.in) ను గవర్నర్ తమిళసై ప్రారంభించారు. ఈ సేవలను ప్రవేశపెట్టడంలో తెలంగాణ పోస్టల్ సర్కిల్ చేసిన కృషిని గవర్నర్ అభినందించారు. నిర్మల్ కొయ్యబొమ్మలు, వరంగల్ రగ్గులు, నారాయణపేట చేనేత చీరలు, హైదరాబాద్ హలీమ్, సిద్దిపేట గొల్లభామ చీరలపై రూపొందించిన పోస్టల్ కవర్లను గవర్నర్ తాజాగా ఆవిష్కరించారు. ప్రస్తుతం జీఐ ట్యాగ్‌కి సంబంధించి గొల్లభామ చీరలు ఈ షాప్‌లో అందుబాటులో ఉన్నాయి. పోస్టల్ కవర్లు భౌగోళికంగా ఒక ప్రాంతానికి ప్రత్యేకమైన ఉత్పత్తులకు సంబంధించిన మేధోపరహక్కుల పరిరక్షణ కోసం వాటికి జీఐ ట్యాగ్ హోదాను కల్పిస్తున్నారు. తెలంగాణకే ప్రత్యేకమైన 13 ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ హోదా లభించగా, ఇందులో ఐదు ఉత్పత్తులపై ప్రత్యేక పోస్టర్ కవర్లను పోస్టల్ శాఖ తీసుకొచ్చింది. -
ఈ కామర్స్‌తో చేనేతకు చేదోడు
ఖైరతాబాద్: ఈ కామర్స్ ద్వారా చేనేత ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించనున్నట్లు పరిశ్రమలు, ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. టెస్కో ఆధ్వర్యంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసి చేనేత ఉత్పత్తులకు కొత్తదనం తీసుకువస్తున్నామని చెప్పారు. శనివారం చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని పీపుల్స్‌ప్లాజా వేదికగా వారంపాటు ఏర్పాటు చేసిన చేనేత ఎగ్జిబిషన్‌ను కేటీఆర్ ప్రారంభించారు. స్టాళ్లలోని వివిధ రకాల ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీతాంబరం, ఆర్మూర్ చీరల పునరుద్ధరణ, చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఈ గోల్కొండ వెబ్‌సైట్‌తోపాటు చేనేత ఫ్యాషన్ షోను మంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. 31 మంది చేనేత కళాకారులను సత్కరించి కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులను అందజేశారు. కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత చేనేత, జౌళి శాఖ బడ్జెట్‌ను రూ.70 కోట్ల నుంచి రూ.1,200 కోట్లకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. తెలంగాణ నేతన్నలు భారతీయ సాంస్కృతిక వారసత్వానికి, కళలలకు వైభవాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ కాటన్, సిల్క్ చీరలు, నారాయణపేట కాటన్, వరంగల్ జరీలు, కరీంనగర్ బెడ్షీట్లు తెలంగాణ కళాకారుల అత్యున్నత నైపుణ్యానికి ప్రతీకలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అద్భుత చేనేత కళాకారులను గుర్తించి సత్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాతీయస్థాయి చేనేత ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తోందని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన చేనేత కళాకారులు కూడా తమ ఉత్పత్తులను ఇక్కడ విక్రయించుకునే వెసులుబాటు కల్పించిందని చెప్పారు. 25,319 మందికి చేనేతమిత్ర చేనేతమిత్ర పథకం ద్వారా 25,319 మంది చేనేత, అనుబంధ కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో ఇప్పటివరకు రూ.13 కోట్ల 34 లక్షలు జమ చేసినట్లు కేటీఆర్ తెలిపారు. చేనేత కార్మికుల రుణమాఫీ పథకం ద్వారా 2010 నుంచి 2017 వరకు తీసుకున్న రుణాలపై రూ.28 కోట్ల 96 లక్షల మేర మాఫీ చేశామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని పిలుపునిచ్చామన్నారు. అందరం బాధ్యతగా ముందుకొచ్చి చేనేత రంగాన్ని బతికించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో చేనేత జౌళిశాఖ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
చేనేత మహిళ.. కలల నేతకు అద్దిన కళ
‘‘ఎన్నో చీరలు మగ్గం మీద నేస్తుంటాం. కానీ, ఒక్క చీర కూడా మేం కట్టుకోలేం. బయట దొరికే వందా, రెండు వందల రూపాయల సిల్క్ చీరలు కొనుక్కుంటాం. మా చేతుల్లో రూపుదిద్దుకున్న చీరల డిజైన్లు ఎంత అందంగా ఉన్నాయో కదా, అని ఒకటికి పదిసార్లు చూసుకుంటాం. కానీ, మేం కట్టుకునే చీరల అందం గురించి ఎన్నడూ పట్టించుకోం. అలాంటిది సిరి మేడమ్ మా చీర మాకే కొనిచ్చారు, మేం కట్టుకునేదాకా ఊరుకోలేదు’’ అంటూ విప్పారిన ముఖాలతో తెలిపారు నారాయణపేట్ చేనేత మహిళలు. ‘‘నెల రోజుల క్రితం తెలంగాణలోని నారాయణ్‌పేట్ చేనేత మహిళలను కలిసి, వారి చీరలు వారే కట్టుకున్నప్పుడు ఆ ఆనందాన్ని ఫొటోలుగా తీయాలనిపించింది. అలా తీసుకున్నాను కూడా. వీరికే ఇంకాస్త కట్టూ బొట్టూ మార్చితే మోడల్స్‌కి ఏ మాత్రం తీసిపోరు అనిపించింది. దాంతో ఈ ఆలోచనను సినిమాటోగ్రాఫర్ రఘు మందాటిని కలిసి, ఈ షూట్ ప్లాన్ చేశాను’’ అని వివరించారు ఫ్యాషన్ డిజైనర్ హేమంత్ సిరి. హ్యాండ్లూమ్ డే సందర్భంగా నిన్న హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘తాశ్రిక’ పేరుతో చేనేత మహిళల ఫొటో ప్రదర్శన, డాక్యుమెంటరీ ప్రదర్శించారు. ఈ సందర్భంగా చేనేతల పట్ల తనకున్న మక్కువను ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘పుట్టి పెరిగింది అనంతపూర్ జిల్లాలోని హిందూపూర్‌లో. కళల లేపాక్షి మాకు దగ్గరే. హైదరాబాద్ నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. పదహారు ఏళ్లుగా హ్యాండ్లూమ్స్‌తో డిజైన్స్ చేస్తున్నాను. చేనేతలతో యువతరం మెచ్చేలా మోడ్రన్ డ్రెస్సులను రూపొందించి, షోస్ కూడా ఏర్పాటు చేశాను. ఎప్పుడూ చేనేతలతో మమేకమై ఉంటాను కాబట్టి, వారి జీవితాలు నాకు బాగా పరిచయమే. ఆనందమే ముఖ్యం రోజుల తరబడి దారం పోగులను పేర్చుతూ ఒక్కో చీరను మగ్గం మీద నేస్తారు. ఒక్కో చీర 1200 రూపాయల నుంచి ధర ఉంటుంది. కానీ, అవి అంత సులువుగా అమ్ముడుపోవు. కుటుంబ పోషణ, పిల్లల చదువులకు వారి చేతి వృత్తే ఆధారం. చీర ఖరీదైనదని, వారెన్నడూ వాటిని కలలో కూడా కట్టుకోవాలనుకోరు. సాధారణ రోజుల్లోనే వారి కుటుంబ పరిస్థితులు ఎంత గడ్డుగా ఉంటాయో కళ్లారా చూశాను. అలాంటిది కరోనా సమయంలో చేనేత కుటుంబాల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఉపాధి లేక వారంతా ఎలా ఉన్నారో, వారి నేత చీరలన్నీ అలాగే మిగిలిపోయి ఉంటాయనుకొని ఒకసారి కలిసి వద్దామని వెళ్లాను. అక్కడి వారి పరిస్థితులన్నీ స్వయంగా చూశాక, ఆ మహిళల ముఖాల్లో కొంచెమైనా ఆనందం చూడాలనిపించింది. అలాగే, నాదైన కంటితో వారిని ఇంకాస్త కళగా చూపాలనుకున్నాను. నా స్నేహితుల్లో ఉన్న మేకప్, హెయిర్ స్టైలిస్ట్‌లతో మాట్లాడాను. ఈ క్రమంలో వారానికి ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్లడం, అక్కడి మహిళలతో మాట్లాడటం, వాళ్ల కుటుంబ సభ్యుల్లో నేనూ ఒకదాన్నయిపోయాను. ఫొటో షూట్‌కి అనువైన ప్లేస్ కోసం ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించాం. ఒక ప్రాచీన దేవాలయం కనిపించింది. అక్కడే ఫొటో షూట్‌కి ప్లాన్ చేసుకున్నాం. పదిమంది చేనేత మహిళలను తీసుకొని ఉదయం 5 గంటలకే ఆ దేవాలయానికి చేరుకున్నాం. ముందే అనుకున్నట్టు డిజైనర్ బ్లౌజులు, ఆభరణాలు, మేకప్ సామగ్రి అంతా సిద్ధం చేసుకున్నాం. రెండు కళ్లూ సరిపోలేదు ముస్తాబు పూర్తయ్యాక ఆ చేనేత మహిళల ‘కళ’ చూస్తుంటే నాకే రెండు కళ్లు సరిపోలేదు. వారు చూపించిన ఎక్స్ప్రెషన్స్ అద్భుతం అనిపించింది. జాతీయస్థాయి మోడల్స్‌కి వీరేమాత్రం తీసిపోరు అనిపించారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫొటో, వీడియో షూట్ చేశాం. వారి అనుభవాలతో కలిపి డాక్యుమెంటరీ రూపొందించాం. ఈ గ్యాలరీలో ప్రదర్శించిన ఈ మహిళల ఫొటోలతో ఉన్న ఫ్రేమ్‌లు వారి వారి ఇళ్లలో ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఈ ఫొటోషూట్, డాక్యుమెంటరీ అంతా స్వచ్ఛందంగా పూర్తిచేశాం. నా స్నేహితులు కూడా ఈ పనిలో ఆనందంగా పాలుపంచుకున్నారు. ఈ రంగంలో ఉన్నందుకు చేనేతకు నా వంతుగా ఏదైనా సాయం చేయాలనిపించింది. ఈ మహిళల ముఖాల్లో కనిపించిన కళ వీరి జీవితాల్లోనూ కనిపించాలి. చేనేతలను ఈ తరం మరింతగా తమ జీవనంలో భాగం చేసుకోవాలన్నదే నా ప్రయ త్నం’’ అని వివరించారు డిజైనర్ హేమంత్ సిరి. గ్యాలరీకి వచ్చినవారంతా అబ్బురంగా చేనేత మహిళల ఫొటోలు, డాక్యుమెంటరీని తిలకించడం, అక్కడే ఉన్న చేనేత మహిళలను ఆప్యాయంగా పలకరించడం, కొందరు చీరలు కొనుక్కోవడం, మరికొందరు మీ నుంచి మేమూ చీరల ఆర్డర్స్ తీసుకుంటాం అంటూ ఫోన్ నెంబర్లు అడిగి తీసుకొని వెళ్లడం.. అక్కడ ఉన్నంతసేపూ కళ్లకు కట్టింది. లేపాక్షి దేవాలయ కళను నారాయణ్‌పేట్ కాటన్ చీరల మీద డిజిటల్ ప్రింట్ చేయించి, డిజైన్ చేసిన ప్రత్యేకమైన చీరలు ఇవి. వీటితోనే డాక్యుమెంటరీ, ఫొటో షూట్ చేశాం. ఇందులో 30 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలు పాల్గొన్నారు. వచ్చిన ఆలోచనలను వెంటనే అమల్లో పెట్టడం, అందుకు తగినట్టుగా నారాయణ్‌పేట్ మహిళలు ఆనందంగా సహకరించిన విధానం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సిరిసిల్ల నేత కళాకారుడి నైపుణ్యం: అగ్గిపెట్టెలో ఇమిడే షర్ట్, లుంగీ
సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరోసారి తన నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. చేనేత మగ్గంపై ఆయన అగ్గిపెట్టెలో ఇమిడే షర్ట్, లుంగీని నేశాడు. తన సాంచాల షెడ్డులో పట్టుపోగులతో రెండున్నర మీటర్ల షర్ట్ బట్ట, రెండు మీటర్ల పొడవైన లుంగీని నేశాడు. తర్వాత రెండున్నర మీటర్ల వస్త్రంతో షర్ట్‌ను కుట్టించాడు. లుంగీ, షర్ట్.. రెండూ అగ్గిపెట్టెలో ఇమిడి పోవడం విశేషం. లుంగీ 140 గ్రాములు, షర్ట్ 100 గ్రాముల బరువు ఉన్నాయి. హరిప్రసాద్ వారం పాటు శ్రమించి వీటిని తయారు చేశాడు. శనివారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని.. శుక్రవారం వీటిని సిరిసిల్లలో ప్రదర్శించారు. గతంలో కూడా హరిప్రసాద్ సూక్ష్మ మరమగ్గం, మరమగ్గంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రాలను నేశాడు. -
Fashion: చేనేతలతో సీజన్ వేర్
విధుల్లో వినూత్నం సౌకర్యంలో సమున్నతం సింప్లీ సూపర్బ్ అనిపించే చేనేతలదే ఈ సీజన్ అంతా! కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది. తప్పనిసరి అనుకున్న సంస్థల్లో ఉద్యోగులు తమ విధులను నిర్వరిస్తున్నారు. ఇది వేసవి కాలం కూడా. సీజన్‌కి తగ్గట్టు చికాకు కలిగించని క్లాత్‌తో డిజైన్ చేసిన డ్రెస్ ధరిస్తే మేనికి హాయిగా ఉంటుంది. అలాగే, మాస్క్, శానిటైజర్ వంటివి వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటప్పుడు డ్రెస్సుల మీదకు దుపట్టా లాంటివి ధరించాలన్నా కొంత ఇబ్బందే. వీటన్నింటికి పరిష్కారంగానే ఫ్యాషన్ డిజైనర్ హేమంత్ సిరీ ఆంధ్ర చేనేత బొబ్బిలి, తెలంగాణ చేనేత నారాయణ్‌పేట్ చీరలతో చేసిన డ్రెస్ డిజైన్స్ ఇవి. సింపుల్‌గా, ప్రత్యేకంగా కనిపించాలనుకునేవారు ఇలా బ్లేజర్ స్టైల్ లాంగ్ కుర్తా డిజైన్ని రెడీ చేసుకోవచ్చు. నారాయణ్‌పేట్ శారీస్‌కి బార్డర్ ఉంటుంది. దీనిని కూడా డిజైన్‌లో భాగం చేసుకోవచ్చు. చేతుల చుట్టూ అలాగే ఒక వైపు కుర్తా లెంగ్త్ బార్డర్‌ను జత చేసుకుంటే డ్రెస్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. డ్రెస్ ప్రత్యేకతలు ►బ్లేజర్ స్టైల్ లాంగ్ కుర్తా. ►మాస్క్, చిన్న శానిటైజర్ బాటిల్, ఫోన్ వంటివి క్యారీ చేయడానికి పాకెట్స్. ►మోచేతుల భాగంలో హ్యాండ్ స్లిట్స్ ►స్ట్రెయిట్ కట్ పాయింట్ ఉద్యోగినులకు, టీనేజర్స్‌కి ఈ స్టైల్ సూట్స్ ప్రత్యేకమైన అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. -హేమంత్ సిరీ, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ -
Sita Vasuniya: చేనేత సీతమ్మ
ఫ్యాషన్ ప్రపంచం ప్యారిస్ అంటారు కానీ, ఫ్యాషన్‌కి ఇప్పుడు ఇటలీ కూడా. ‘వోగ్’ మాస పత్రిక పేరు వినే ఉంటారు. ఆ అమెరికన్ పత్రికకు ఇటలీలో ఒక ఎడిషన్ ఉంది. ‘వోగ్ ఇటాలియా’. ఫ్యాషన్, లైఫ్ స్టయిల్ రెండూ ఉంటాయి అందులో. ఒక్క ఇటలీవే కాదు. ఫ్యాషనబుల్‌గా ఉన్న ఏ దేశంలోని మహిళ అయినా, ఆఖరికి ఆమె ఆదిమవాసీ మహిళ అయినా.. ఆమె ధారణలో అత్యాధునికత కనిపిస్తూ ఉంటే ఆమె అందులో ప్రత్యక్షం అవుతుంది! వోగ్ ఇటాలియా తాజా సంచికలో సీతా వసూనియా కనిపించింది కూడా అందుకే. ఆమె ధరించిన చీర ఆమె నేసిందే. పైకి సాదాసీదాగా ఉన్న ఆ చీర ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త షో కేస్ డిజైన్ అయింది! సీత మధ్యప్రదేశ్‌లోని ఓ గిరిజన గూడెం యువతి. తను, తన చేనేత, స్వయం సహాయ బృందంలోని తన తోటివారు... ఇదే ఆమె ప్రపంచం. ఆ ప్రపంచంలో జీవనం, జీవితం తప్ప ఫ్యాషన్ అనే మాట ఉండదు. జీవనం అంటే బతుకు తెరువు. జీవితం అంటే లైఫ్ స్టైల్. అంటే.. కష్టపడం, ఇంటికి చేదోడు అవడం. పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని వీలాంచల్ ప్రాంతంలోని ఆదివాసీ మహిళలు ఎలా ఉంటారో సీత కూడా వేరే మాట లేకుండా అలాగే ఉంటుంది కానీ.. ఇప్పుడు మాత్రం ఆ ప్రాంతంలో ఆమె ఒక విశేషం అయింది. ఆ ప్రాంతంలోనే కాదు. ఇండియాలో, ఇటలీలో, అమెరికాలో.. ఇంకా అనేక ఆధునిక దేశాలలో ఆమె ధరించిన చీర ఫ్యాషన్‌కు సరికొత్త ప్రతీక అయింది. తను కట్టుకోడానికి నేసుకున్న చీర తనకొక గుర్తింపును కట్టబెట్టింది! ఇంతలా గుర్తింపు రావడానికి కారణం.. ఆమె జీవితంలో ఎలాంటి ప్రాముఖ్యమూ లేని ఒకానొక రోజు. ఆ రోజు జరిగిన ఒక ఘటనే.. రెండేళ్ల కొడుకున్న ఈ యువ మాతృమూర్తిని ‘ఎంపవరింగ్ సెలబ్రిటీ’గా మార్చేశాయి. వోగ్ ఇటాలియా పత్రికలో వచ్చిన ఫొటోలో ఆమె మహేశ్వరం చేనేత అద్దకం చీర ధరించి ఉన్నారు. ఆ ఫొటోను తీసింది ఢిల్లీలో పేరున్న ఓ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. ధార్ జిల్లాలోని పర్యాటక స్థలం ‘మండు’లో ఆ ఫొటోగ్రాఫర్ కెమెరా పట్టుకుని తిరుగుతున్నప్పుడు అదే చోట స్వయం సహాయ బృందంలో సీత కనిపించింది. కనిపించడం కాదు. సీత ఉండేదే అక్కడ. ధార్ జిల్లాలోని పనల గ్రామ్ సీతది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆత్మ నిర్భర్ మిషన్ ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రారంభించిన ‘ఏక్ జిల్లా ఏక్ ఉత్పాద్’ పథకంలో భాగంగా పదిమందిలో ఒకరిగా సీత ఆ రోజు ‘మండు’లో ఉంది. ఆ అదివాసీ యువతి చీరకట్టులోని అత్యాధునికతను ఆమె అనుమతితో తన కెమెరాలోకి షూట్ చేసుకున్నారు ఆ ఫొటోగ్రాఫర్. మండులోని రాణి రూపమతి మహల్ మ్యూజియం ఫొటో షూట్ జరిగింది. అది ఫిబ్రవరి నెల. ఆ వెంటనే మార్చి సంచికలో సీత ఫొటో వచ్చింది! ‘‘మండు కు మేమంతా శిక్షణ కోసం వచ్చాం. అప్పుడే ఆ ఫొటోగ్రాఫర్ నా ఫొటో తీసుకున్నారు. కానీ ఇలా నా ఫొటో ప్రపంచంలో అందరూ చూసే పుస్తకంలో వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. మా ఊళ్లోకొచ్చే వార్తా పత్రికల్లోని గ్రూప్ ఫొటోల్లో కూడా నేను ఏ రోజూ రాలేదు’’ అని సంభ్రమంగా అంటోంది సీత. మండులో వారికి లభించిన శిక్షణ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఆర్ట్, బాగ్ ప్రింట్, ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన ధారానేత.. మొదలైన వాటి మీద. వాటిని ధ్యాసగా నేర్చుకుంటున్న సీతలో ఆ రోజు ఆమె కట్టుకున్న చీర ఫొటోగ్రాఫర్‌కి నచ్చింది. చివరికి సీతకు పేరు తెచ్చింది. సీత ఒక్కరే కాదు. ఇక ముందు ప్రాంతంలోని చేనేతలన్నిటికీ ప్రాచుర్యం తేచ్చే ప్రయత్నాలు మొదలు పెడతాం. ఇందుకు ప్రేరణ మాత్రం మాకు ‘వోగ్ ఇటాలియా’ లో వచ్చిన సీత ఫొటోనే’’ అంటున్నారు ధార్ జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సలోనీ సిదానా. -
చేనేత కార్మికుడి నుంచి ప్రముఖ డిజైనర్‌గా..
ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక కళ దాగి ఉంటుంది. అయితే అది వెలుగులోకి రావాలంటే పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలే ధర్మవరానికి చెందిన చేనేత కార్మికుడు జూజారు నాగరాజును ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపు వచ్చేలా చేసింది. సాధారణ చీరలు నేసే స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ అద్భుతమైన డిజైనర్ పట్టు చీరల సృష్టికర్తగా ఎదిగారు. రొటీన్‌కు భిన్నంగా చీరలపై డిజైన్ చేయడం, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రత్యేక డిజైన్లు రూపకల్పన చేసి తన శక్తి ఏమిటో నిరూపించుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకుంటూ వచ్చిన నాగరాజు విజయ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... సాక్షి, ధర్మవరం టౌన్: పట్టణానికి చెందిన జూజారు నాగరాజు మగ్గం నేసుకుంటూ డిగ్రీ చదివారు. డిజైనింగ్ మీద మక్కువతో బెంగుళూరు, హైదరాబాద్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి, ధర్మవరానికి చేరుకున్నారు. అప్పటి నుంచి సరికొత్త డిజైన్లతో పట్టుచీరలు నేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. పేదరికాన్ని సవాల్ చేస్తూ.. నాగరాజు తండ్రి జూజారు లక్ష్మణరావు సాధారణ చేనేత కార్మికుడు. నిరుపపేద కుటుంబం కావడంతో ఇంటిల్లిపాది మగ్గం నేస్తేనే జీవనం సాగేది. తండ్రి పడుతున్న కష్టం నాగరాజును కదిలించింది. అందరిలా కాకుండా కొత్తదనాన్ని చూపినప్పుడే తమ ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ నెలకొంటుందని భావించిన అతను.. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేశారు. అప్పట్లో పట్టుచీరలంటే తమిళనాడులోని కాంచీపురం ప్రసిద్ధి. కంచి పట్టు చీర అంటే అంత గొప్పగా భావించేవారు. అదే స్థాయిలో ధర్మవరానికి పేరు తీసుకురావాలని భావించిన నాగరాజు... రేయింబవళ్లూ కొత్త డిజైన్ల రూపకల్పనపైనే దృష్టి సారించేవారు. నెమలి పళ్లూ, బ్రోకెట్, కళాంజలి వంటి డిజైన్లను ఆధునీకరించి కంచి కంటే విభిన్నమైన 240 డిజైన్లతో జాకార్డులను సిద్ధం చేశారు. ఒక్కో డిజైన్ రూపకల్పనకు రూ.10 వేల నుంచి రూ.15వేల వరకు ఖర్చు పెట్టారు. క్రమేణ ఈ డిజైన్లతో వచ్చిన పట్టుచీరలు ప్రతి ఒక్కరి దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటూ వచ్చాయి. దీంతో కొంతమంది పట్టు చీరల వ్యాపారులు నాగరాజుకు ఖర్చులు పోనూ అదనంగా రూ.3 వేలు చెల్లించి కొత్త డిజైన్లను కొనుగోలు చేస్తూవచ్చారు. 2009లో ఔట్సోర్సింగ్ ద్వారా హ్యాండ్లూమ్లో డిజైనర్ ఉద్యోగాలను భర్తీ చేయడంతో ధర్మవరం హ్యాడ్లూమ్ క్లస్టర్ డిజైనర్‌గా నాగరాజుకు ఉద్యోగం దక్కింది. విధుల నిర్వహణలో భాగంగా ధర్మవరంతో పాటు ముదిరెడ్డిపల్లి, మంగళగిరి తదితర ప్రాంతాల్లో చేనేతకార్మికులకు డిజైనింగ్ రంగంలో శిక్షణ ఇచ్చారు. నాగరాజు చేసిన వెరైటీ డిజైన్లు ► సాంబ చిత్రంలోని శంఖు, చక్రం, నామాలు కలిగిన డిజైన్‌తో 2004లో నాగరాజు ఓ పట్టు వస్త్రం సిద్ధం చేశారు. ఈ శ్రమకు ఫలితంగా సినిమా నిర్మాతలు నాగరాజును అభినందిస్తూ రూ.లక్ష పారితోషకాన్ని అందజేశారు. ► ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎగ్జిబిషన్లో పట్టు వస్త్రాలపై నేసిన తాజ్‌మహల్ చిత్రాలను ప్రదర్శించి, అందరినీ ఆకట్టుకున్నారు. ► 2016లో లేపాక్షి ఆలయంలోని శిల్పకళా నమూనాలతో పట్టు వస్త్రాన్ని చేనేత మగ్గంపై నేసి అబ్బురపరిచారు. ► 2017 ఫిబ్రవరిలో ఇస్రో రాకెట్ ప్రయోగాల విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇస్రో శాటిలైట్లు, రాకెట్ చిత్రాలతో పట్టు వస్త్రం తయారు చేసి విజయవాడలో ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ► గుంటూరులో ప్రముఖ పుణ్యక్షేత్రం పానకాల లక్ష్మీనరసింహస్వామి ముఖచిత్రం, గాలిగోపురం తెలుగు అక్షరాలతో కూడిన డిజైన్‌ను తయారు చేసి ఆలయానికి బహూకరించారు. ► మహాత్ముని దండియాత్రను పట్టు వస్త్రంపై రూపొందించి 2019లో గాంధీ జయంతి రోజున ఢిల్లీలో జరిగిన నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ► సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని 2019 డిసెంబర్లో పట్టు వస్త్రంపై సీఎం జగన్ చిత్రపటాన్ని రూపొందించి హ్యాండ్లూమ్ కార్యాలయం తరఫున నేతన్న నేస్తం పథకం ప్రారంభంలో ధర్మవరంలో జగనన్నకు బహూకరించారు. ► ఆరీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ సతీమణి అన్నే ఫెర్రర్ చిత్రాన్ని పట్టు వస్త్రంపై నేసి అందజేశారు. అందుకున్న అవార్డులు.. ► 2006లో ఉమ్మడి రాష్ట్రంలో డిజైన్ డెవలప్మెంట్కు గాను రాష్ట్ర స్థాయి అవార్డును ప్రభుత్వం అందజేసింది. ► 2020 మార్చి నెలలో ఢిల్లీలో నేషనల్ హ్యాండ్లూమ్ డెవల్మెంట్ కార్పొరేషన్ వారు నాగరాజుకు జాతీయ అవార్డును అందజేశారు. దండియాత్రను గుర్తుకు చేస్తూ పట్టువస్త్రం నేసినందుకు ఈ పురస్కారం దక్కింది. వైఎస్సార్ హయాంలోనే ప్రతిభకు గుర్తింపు దక్కింది మగ్గం నేస్తూ డిగ్రీ వరకు చదువుకున్నా. సాంబ సినిమాలో నేను వేసిన డిజైన్ ప్రాచుర్యం పొందింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నాలో ప్రతిభను గుర్తించి, డిజైనర్‌గా హ్యాండ్లూమ్ కార్యాలయంలో ఉద్యోగ అవకాశం ఇచ్చారు. ఆ మహానేత గుర్తింపు వల్లనే ఎన్నో డిజైన్లను చేయగలిగాను. ఎందరో కార్మికులకు డిజైనింగ్‌లో శిక్షణ ఇస్తున్నా. – జూజారు నాగరాజు, చేనేత కార్మికుడు, ధర్మవరం -
చేనేత వస్త్రాలకు ఎంతో ప్రత్యేకత: బృంద, శీతల్
-
చేనేత, హస్తకళలకు మరింత ప్రోత్సాహం
కరోనా కారణంగా కష్టాలున్నాయి. మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి లేదు. మార్కెట్లు పూర్తిగా ఓపెన్ కాలేదు. సరుకుల రవాణా లేదు. కొత్త కొత్త సమస్యలతో యుద్ధం చేస్తున్నాం. అందువల్లే నిజంగా చేనేతలకు మంచి జరగాలన్న తలంపుతో ఈ రోజు ఈ పథకం అమలు చేస్తున్నాం. సాక్షి, అమరావతి: చేనేత, హస్తకళల ఉత్పత్తుల మార్కెటింగ్‌కు మరింత ప్రోత్సాహం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా అక్టోబర్ 2వ తేదీన ఈ–మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో మూడు బ్రిడ్జిలు దాటాల్సి ఉందని, ఇందులో ఒకటి సరుకులు, ఉత్పత్తుల నాణ్యత కాగా.. రెండోది లాజిస్టిక్స్ (కొనుగోలు విధానం, రవాణా), మూడోది ఉత్పత్తులకు ఆర్డర్స్ ఇస్తే సకాలంలో సరఫరా చేయడం, పేమెంట్స్ కచ్చితంగా ఉండేలా చూసుకోవడం అన్నారు. ఇందుకోసం అధికారులు చర్యలు చేపడుతున్నారని చెప్పారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద రూ.196.46 కోట్లను శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి రాష్ట్రంలోని అర్హులైన సుమారు 80 వేల చేనేత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు పాత బకాయిల కింద జమ చేసుకోకుండా అన్ ఇన్‌కమ్‌బర్డ్ ఖాతాల్లో వేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని కలెక్టర్లు, లబ్ధిదారులు, ప్రజా ప్రతినిధులనుద్దేశించి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మీ కష్టాన్ని స్వయంగా చూశాను ► నా సుదీర్ఘ 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో దాదాపు అన్ని జిల్లాల్లో చేనేతన్నల కష్టాలు స్వయంగా చూశాను.. విన్నాను. వస్త్రాలు బాగా తయారు చేసినా, మార్కెటింగ్ లేకపోవడం.. మరోవైపు ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల వస్త్రాలను అమ్ముకోలేక ఇబ్బందులు పడటం చూశాను. ► అందుకే మగ్గం ఉన్న ప్రతి అక్క, చెల్లెమ్మకు ఏటా రూ.24 వేలు ఇస్తానని హామీ ఇచ్చాను. ఆ మేరకు గత ఏడాది డిసెంబరు 21న నా పుట్టినరోజున వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రారంభించాం. ప్రస్తుతం కరోనా కష్టాలు చూశాక, అన్ని రోజులు ఆగితే మీ కష్టాలు ఇంకా పెరుగుతాయని భావించి.. మళ్లీ ఆరు నెలలకే ఇవాళ ఈ పథకం కింద సాయం చేస్తున్నాం. వైఎస్సార్ నేతన్న నేస్తం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 13 నెలల్లో దాదాపు రూ.600 కోట్లు ► గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల హయాంలో చేనేత కుటుంబాలకు కనీసం రూ.200 కోట్లు కూడా ఇవ్వలేదు. అలాంటిది మనం కేవలం 13 నెలల్లోనే.. నిరుడు రూ.200 కోట్లు, ఇవాళ దాదాపు రూ.400 కోట్లు.. ఇచ్చాం. ఆ విధంగా కేవలం 13 నెలల్లోనే దాదాపు రూ.600 కోట్లు ఇచ్చామంటే దేవుడి దయ. ► గత ప్రభుత్వం ఆప్కోకు బకాయి పెట్టిన రూ.103 కోట్లతో పాటు మాస్కుల తయారీ కోసం ఆప్కో నుంచి తీసుకువచ్చిన వస్త్రాలకు రూ.109 కోట్లు ఇవాళే విడుదల చేస్తున్నాం. ప్రతి పేదవాడికి మంచి జరగాలని ఆరాటపడ్డాం. ఇంకా మంచి చేయాలన్న తపన ఉంది ► అన్ని వర్గాల ప్రజల కోసం పలు పథకాలు అమలు చేస్తున్నాం. రైతు భరోసా, అమ్మ ఒడి, పెన్షన్ రూ.2,250కి పెంపు.. గతంలో 44 లక్షల పెన్షన్లు ఇస్తే ఇవాళ దాదాపు 60 లక్షల మంది అవ్వాతాతలకు పెన్షన్ ఇస్తున్నాం. 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు వచ్చే నెల 8న ఇవ్వబోతున్నాం. ► పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం, నామినేషన్ విధానంలో ఇచ్చే పనులు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించాం. ఆయా పథకాల ద్వారా 3.89 కోట్ల కుటుంబాలకు దాదాపు రూ.43 వేల కోట్లు నేరుగా వారి వారి ఖాతాలకు నగదు బదిలీ చేశాం. ఇందులో రూ.600 కోట్లు నేతన్నలకే ఇచ్చాం. ► 13 నెలల వ్యవధిలోనే పేదలందరికీ మంచి చేయగలిగినందుకు సంతృప్తికరంగా ఉంది. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేశాం. దేవుడి దయ, మీ అందరి దీవెనలతో ఇంకా మంచి చేయాలన్న తపన ఉంది. 1902కు ఫోన్ చేయండి ► ఎవరికి ఏ సమస్య వచ్చినా 1902కు ఫోన్ చేయండి. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ప్రతి చేనేత కుటుంబానికి, చేనేతన్నకి భరోసా ఇస్తున్నాను. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఎం.శంకరనారాయణ, బొత్స సత్యనారాయణతో పాటు, పలువురు అధికారులు, నేతన్నల ప్రతినిధులు పాల్గొన్నారు. పథకం అందకపోతే కంగారు పడొద్దు ► గ్రామ స్థాయి నుంచి గొప్ప మార్పులు చేశాం. వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ ఇందుకు దోహదపడింది. వ్యవస్థలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అవినీతి లేదు. లంచాలు లేవు. వివక్ష లేదు. అర్హత ఉంటే చాలు.. నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేశాం. ► అందుకే 13 నెలల్లో ఇన్ని చేయగలిగాం. ఇప్పుడు దాదాపు 80 వేల మంది నేతన్నల కుటుంబాలకు మేలు జరుగుతోంది. మగ్గం ఉన్న ప్రతి ఇంటిని వలంటీర్లు పరిశీలించి, వారి పేర్లు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించారు. ► అర్హులు మిగిలిపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు అర్హత ఉంటే వెంటనే గ్రామ సచివాలయానికి వెళ్లి, మా ఇంట్లో మగ్గం ఉంది కాబట్టి ఆర్థిక సాయం చేయాలని, చేనేత పెన్షన్ కావాలని దరఖాస్తు చేయండి. మీకు అర్హత ఉంటే వచ్చే నెల ఇదే తేదీన సహాయం చేస్తాం. మంచి చేయాలి అన్నదే తప్ప, ఎలా ఎగ్గొట్టాలని ఆలోచన అసలు చేయం. మా ఆదాయం పెంచుకున్నాం 15 సంవత్సరాలుగా మగ్గం నేస్తున్నాం. గతంలో చాలా మంది చేనేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్నారు. మా కష్టాలు ఆలకించి ధర్మవరంలో చేనేత కార్మికుల దీక్ష సందర్భంగా నేనున్నానని ఆనాడు మీరు మాకు ధైర్యాన్నిచ్చారు. మీరు ఇచ్చిన ధైర్యంతో, చేసిన సాయంతో ముందుకు సాగుతున్నాం. మొదట్లో మేం గద్వాల్ చీరలు నేసేవారం, ఇప్పుడు పెద్ద చీరలు నేస్తున్నాం. గతంలో నెలకు రూ.8 వేలు సంపాదిస్తే.. ఇప్పుడు నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్నాం. మరో 30 ఏళ్లు మీరే సీఎంగా ఉండాలన్నా. – బాలం లక్ష్మి, సిండికేట్ నగర్, రాప్తాడు నియోజకవర్గం, అనంతపురం జిల్లా చేనేత కుటుంబాల్లో వెలుగు నింపారు ఏడాదికి రూ.24 వేలు అందించడం ద్వారా చేనేత కుటుంబాల్లో వెలుగు నింపిన దేవుడు మీరు. మీరు అందించిన సాయంతో మగ్గాలకు కావాల్సిన సామాన్లు కొనుక్కొని, మా ఆదాయాన్ని పెంచుకున్నాం. కరోనా కష్టకాలంలో మా ఇబ్బందులను గమనించి ఆరు నెలలు ముందుగానే రెండో సారి నేతన్న నేస్తం కింద మీరు రూ.24 వేలు ఇవ్వడం మాకు ఎంతో భరోసాను కల్పించింది. మీరు మాత్రమే మా కష్టాలు గుర్తించి మాకు అండగా నిలిచారు. – వాసా సత్యవతి, వంగర గ్రామం, తూర్పు గోదావరి జిల్లా ఇప్పుడు డిజైన్ చీరలు నేస్తున్నాం గతంలో మాకు చాలీచాలని బతుకు దెరువుగా చేనేత వుండేది. మా స్తోమతను బట్టి ముతక రకాలను నేసే వాళ్లం. దానివల్ల మాకు ఆదాయం కూడా తక్కువగానే వచ్చేది. ఇప్పుడు మీరు నేతన్న నేస్తం ద్వారా అందిస్తున్న రూ.24 వేల సాయంతో సామన్లు కొనుగోలు చేసి డిజైన్ చీరెలు నేస్తున్నాం. గతం కంటే మా ఆదాయం కూడా పెరిగింది. మీరే కలకాలం సీఎంగా వుండాలి. – కె.మల్లిబాబు, రాజుల గ్రామం, శ్రీకాకుళం జిల్లా వదిలేసిన వారు మళ్లీ వృత్తిలోకి వస్తున్నారు ఒకప్పుడు వ్యవసాయం తర్వాత చేనేత ప్రధాన రంగంగా వుండేది. కానీ ఆర్థిక ఇబ్బందులకు తాళలేక చాలా మంది ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోయారు. ఏడాదిగా మీరిస్తున్న భరోసాతో తిరిగి వారంతా మగ్గాలను ఏర్పాటు చేసుకుని ఈ వృత్తిలోకి వస్తున్నారు. మా గ్రామంలోనే కొత్తగా 70–80 మగ్గాలు వచ్చాయి. కరోనా వల్ల వస్త్రాల ఎగుమతులు ఆగిపోయాయి. కొనుగోలు చేసే వారు లేక, మాకు ఆదాయం లేకుండా పోయింది. ఈ సమయంలో ఆరు నెలల ముందే మీరిస్తున్న సొమ్ము మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. – లక్ష్మీనారాయణ, ఈతముక్కల గ్రామం, ప్రకాశం జిల్లా ఈ ఏడాదే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టండి నేతన్న నేస్తం రెండో ఏడాది ఆర్థిక సాయం విడుదల కార్యక్రమం అనంతరం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను పలువురు లబ్ధిదారులు కలిశారు. ఈ ఏడాది నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను కచ్చితంగా ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇంగ్లిష్ మీడియం విద్యతో తమ పిల్లలకు భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని.. అందుకే మీరు తీసుకున్న నిర్ణయానికి తామంతా మద్దతిస్తున్నామని చెప్పారు. -
కొత్తవాడ కార్పెట్లపై మనసుపడ్డ రంగమ్మత్త!
వరంగల్: కొత్తవాడలోని చేనేత కార్మికులు నేసే దర్రీస్(కార్పెట్లు)పై సినీ నటి, బుల్లితెర యాంకర్ అనసూయ మనసు పడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను వరంగల్‌కు చెందిన చేనేత కార్మిక సంఘాల నాయకులు చిప్ప వెంకటేశ్వర్లు తదితరులు కలిసి కొత్తవాడ దర్రీస్ చూపించారు. ప్రస్తుతం 3లక్షల కార్పెట్లు పేరుకుపోయినందున కార్మికులకు అండగా నిలబడాలని కోరా రు. కార్మికుల పనితీరు, దర్రీస్ నాణ్యతను మెచ్చుకున్న ఆమె వీటిని కొనుగోలు చేయాలని సినీ నటులు, తన స్నేహితులను కోరతానని తెలిపారు.(అనసూయకు రాచకొండ పోలీసుల అభినందన) -
చిక్కిపోతున్న చేనేత
-
చేనేత వెలుగులు
సాక్షి, అమరావతి: అంతర్జాతీయంగా వస్త్ర పరిశ్రమ నేల చూపులు చూస్తున్న తరుణంలో భారతదేశంలో సంప్రదాయ చేనేత ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. పదేళ్లలో దేశంలో చేనేత ఉత్పత్తులు 2 శాతం పెరిగినట్లు ఎగ్జిమ్ బ్యాంక్ (ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఇటీవల విడుదల చేసిన అధ్యయన పత్రంలో పేర్కొంది. పవర్లూమ్, యంత్రాలతో వస్త్రాలు తయారు చేసే ఆధునిక మిల్లులు, సరికొత్త గార్మెంట్ పరిశ్రమలు ఎన్ని వచ్చినా చేనేత పరిశ్రమకు ఎలాంటి ముప్పు లేదని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. 2017లో దేశంలో 4,594 కోట్ల చదరపు మీటర్ల వస్త్రాలు ఉత్పత్తి కాగా, అందులో 3,567 కోట్ల చదరపు మీటర్లు (77.4 శాతం) పవర్‌లూమ్‌లపై, 801 కోట్ల చదరపు మీటర్లు (17.4 శాతం) హ్యాండ్లూమ్లపై (చేనేత), 226 కోట్ల చదరపు మీటర్లు (4.9 శాతం) మిల్లులపైనా జరిగాయి. 2009లో 3,700 కోట్ల చదరపు మీటర్ల వస్త్రాల ఉత్పత్తి పవర్‌లూమ్‌లపై జరగ్గా, 2017 నాటికి అది 3,567 కోట్ల చదరపు మీటర్లకు తగ్గిపోయింది. అదే సమయంలో 2006లో 654 కోట్ల చదరపు మీటర్ల వస్త్రాల ఉత్పత్తి చేనేత మగ్గాలపై జరగ్గా, 2017 నాటికి అది 801 కోట్ల చదరపు మీటర్లకు పెరిగింది. ఏపీలో 5.59 లక్షల మందికి ఉపాధి దేశంలోని చేనేత వస్త్రాల్లో 46.8 శాతం అసోంలో ఉత్పత్తి అవుతుండగా, పశ్చిమబెంగాల్లో 12.9, మణిపూర్‌లో 8, తమిళనాడులో 6.5, త్రిపురలో 5.8, ఆంధ్రప్రదేశ్‌లో 5 శాతం ఉత్పత్తి జరుగుతోంది. దేశవ్యాప్తంగా 43.41 లక్షల మంది చేనేత మగ్గాలపై పనిచేస్తున్నారు. ఏపీలో 3,59,212 మంది మగ్గాలపై వస్త్రాలు నేస్తున్నారు. రాష్ట్రంలోని మంగళగిరి, వెంకటగిరి జరీ, చీరాల, మచిలీపట్నం, కడప, ఉప్పాడ, ధర్మవరం, పెద్దాపురం, కుప్పడం, శ్రీకాకుళం, పొందూరు తదితర ప్రాంతాల్లో తయారయ్యే చేనేత వస్త్రాలకు మంచి క్రేజ్ ఉందని ఎగ్జిమ్ బ్యాంక్ పేర్కొంది. చేనేత వస్త్రాల తయారీకి ఎక్కువగా కాటన్ ఉపయోగిస్తారు. దేశంలో కాటన్ ఉత్పత్తి క్రమేపీ తగ్గుతుండటం చేనేత పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. నేతన్నలకు రుణ సహాయం అందకపోవడం, సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల చేనేత పరిశ్రమ ఒడిదుడుకులకు లోనవుతోంది. అయినా దేశంలో చేనేత వస్త్రాలకు ఏమాత్రం ఆదరణ తగ్గకపోవడం గమనార్హం. హ్యాండ్లూమ్ ఎక్స్పోలకు మంచి ఆదరణ రాష్ట్రంలో పలుచోట్ల నిర్వహిస్తున్న హ్యాండ్లూమ్ ఎక్స్పోలకు మంచి ఆదరణ లభిస్తోంది. విశాఖపట్నం, విజయవాడలో ఎక్స్‌పోలు విజయవంతమయ్యాయి. చాలామంది ఎగ్జిబిషన్ల సమయంలో చేనేత వస్త్రాలను అధికంగా కొనుగోలు చేస్తున్నారు. – డి.పార్థసారథి, హ్యాండీక్రాఫ్ట్స్ ప్రమోషన్ ఆఫీసర్, శిల్పారామం -
ఉగాది నేత
ఇది పూత కాలంకాదు కాదు నేత కాలంసిసలైన చే నేత కాలంఅచ్చ తెలుగు ఉగాది నాడుఅటు సంప్రదాయాన్ని ఇటు ఆధునికతను మేళవించిలంగా జాకెట్టు... దానిపై రంగు రంగుల దుపట్టా ధరించినేతల్లా ఏలండి ఫ్యాషన్ ప్రపంచాన్ని. ‘‘పండగకు కంచిపట్టు, బెనారస్ లెహంగాల ఎంపిక సహజమే. కొంత వెరైటీ కావాలనుకునేవారు ఈ మిక్సింగ్ ప్యాటర్న్‌ని ట్రై చేయవచ్చు. కలర్ కాంబినేషన్స్, హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్‌తో సరైన విధంగా మిక్స్ చేసి బ్యాలెన్స్ చేయడంలోనే మన ప్రత్యేకత కనిపిస్తుంది. ఏ కలర్‌కి ఏది బాగుంటుంది అని చెక్ చేసి, ఈ డిజైన్స్ తయారు చేశాం. మీరూ ఈ కాంబినేషన్‌ని ట్రై చేయవచ్చు. ఎంబ్రాయిడరీ చేసిన ఆర్గంజా ఫ్యాబ్రిక్‌ను, క్రష్ చేసి, అంచులు జత చేసి లెహంగాలు డిజైన్ చేశాం. ఆర్గంజా, పుట్టపాక చేనేత చీరల ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్. కళ్లకు, మేనికి హాయిగొలుపుతాయి. ఈ లెహంగాల మీదకు ఏ హ్యాండ్లూమ్ దుపట్టాలయినా సూపర్బ్ అనిపిస్తాయి. కలంకారీ, బెనారస్, టస్సర్, నేచరల్ డై చేసిన హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ దుపట్టాలు ఈ లెహంగాల మీదకు వాడాం. పండగ సందర్భాల్లోనూ ఇలా ప్రత్యేకంగా తయారు అవచ్చు అని చూపడానికి వీటిని డిజైన్ చేశాం. మీరు ట్రై చేసి చూడండి మరి. -
వైఎస్ఆర్సీపీ కార్యలయంలో పార్టీ చేనేత రాష్ట్ర కార్యవర్గ సమావేశం
-
వెండి పండగ
దసరా నవరాత్రులంటేనే దాండియా డ్యాన్సుల హంగామా!ఈ సంబరంలో ధరించే దుస్తులతో వెండి ఆభరణాల అందమూ పోటీపడుతుంది. వెన్నెలంతా ‘వెండి’గా మారిపండగ వేళ తనూ పాదం కలిపి మెరిసిపోతుంది. చీరకట్టుకు సింగారమై మురిసిపోతుంది... సిల్వర్ టిప్స్ ∙దేశీ స్టైల్లో ఒక తెల్లటి కుర్తా, కలర్‌ఫుల్ స్టోల్ వేసుకుని.. నలుపు, తెలుపులో ఉన్న వెండివి పెద్ద పెద్ద జూకాలు, గాజులు ధరిస్తే చాలు డ్రెస్కే అందం వస్తుంది. లేదంటే పొడవాటి లాకెట్ హారం వేసుకున్నా చాలు. ఫ్యామిలీ ఈవెంట్స్‌కి సరైన ఎంపిక ∙సిల్వర్ ఆభరణాలు యంగ్ ఎనర్జీని తీసుకువస్తాయి. వేడుకలో ఉల్లాసాన్ని పెంచుతాయి ∙చేతులకు పెద్ద పెద్ద వెండి కంకణాలు లేదంటే వేలికి పెద్ద ఉంగరం ధరించినా చాలు మీ స్టైల్లో గొప్ప మార్పు వచ్చేస్తుంది ∙కాళ్లకు వెండి పట్టీలు, మెట్టెల అందం సంప్రదాయ అతివలకు ఎన్నో ఏళ్లుగా పరిచయమే. ఈ లోహపు చల్లదనం అతివ చర్మానికి వెన్నెల చల్లదనాన్ని çపంచుతుంది. అందుకే మహిళలు వెండిని ధరించడానికి మక్కువ చూపుతారు. మిగతా లోహపు ఆభరణాలతో పోల్చితే వెండి ఆభరణం ధర దాదాపుగా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆర్టిఫిషయల్ జువెల్రీలా చర్మసమస్యలు లేకపోవడం కూడా ఈ లోహపు ఆభరణానికి ప్లస్ అవుతోంది ∙బాగున్నాయి కదా అని మరీ అతిగా అలంక రించుకుంటే వెండి ఎబ్బెట్టుగా ఉండచ్చు. స్ట్రీట్ స్టైల్ కాలేజీకి వెళ్లే అమ్మాయిలు ధరించే ఇండో–వెస్ట్రన్ స్టైల్ డ్రెస్సులకు బాగా నప్పే ఆక్సిడైజ్డ్ సిల్వర్ జువెల్రీ బాగా నప్పుతుంది. అలాగే ప్రయాణాలకూ ఇవి అనువైనవనే పేరు వచ్చింది. టూర్లకు వెళ్లినప్పుడు ఈ తరహా ఆభరణాలనూ కొనుగోలు చేస్తుంటారు. హ్యాండ్లూమ్స్ – సిల్వర్ మన దేశీయ చేనేతలకు వెస్ట్రన్ టచ్ ఇస్తే మోడ్రన్ స్టైల్‌తో వెలిగిపోవచ్చు అనేది నేటి మగువ ఆలోచన. ఆ థీమ్‌తోనే పెద్ద పెద్ద లాకెట్స్‌తో ఉన్న పొడవాటి హారాలు, మెడను అంటిపెట్టుకునే చోకర్స్, టెంపుల్ జువెల్రీ డిజైన్ చేస్తున్నారు. వెస్ట్రన్ డ్రెస్‌లకే కాదు సంప్రదాయ కుర్తీ, గాగ్రా–ఛోలీ, చీరల మీదకూ అందంగా నప్పుతున్నాయి. ఈ వెండి ఆభరణాలు డిజైన్‌ను బట్టి రూ.400/– నుంచి లభిస్తున్నాయి. వెండా, బంగారమా! అని పోటీ పడే రోజులు వచ్చేశాయి. ముదురు పసుపు చాయలో ఉండే బంగారానికి పూర్తి కాంట్రాస్ట్ కలర్ తెలుపులో వెండి ఆభరణాలు పాశ్చాత్య దుస్తుల మీదకే కాదు సంప్రదాయ చీరకట్టుకూ వైవిధ్యమైన కళను తెస్తున్నాయి. పండగల్లో బంగారంతో పోటీపడుతున్నాయి. కంచిపట్టు – సిల్వర్ కంచిపట్టు చీరల మీదకు బంగారు ఆభరణమే వాడాలనే కచ్చితమైన నిర్ణయం ఇప్పుడేమీ లేదు. ఎందుకంటే, ఫ్యాషన్ జువెల్రీ వరసన చేరినప్పటికీ సంప్రదాయ ఆభరణ డిజైన్లు వెండి లోహంతోనూ తయారుచేస్తున్నారు నిపుణులు. వీటిలో మామిడిపిందెలు, కాసుల హారాలు, గుట్టపూసలు, కెంపులు–పచ్చలు పొదిగిన పొడవాటి, పొట్టి నెక్లెస్‌ల అందం అబ్బురపరుస్తున్నాయి. ఇవి పట్టు చీరల మీదకు అందంగా నప్పుతున్నాయి. పండగలో ప్రత్యేక కళను నింపుతున్నాయి. తక్కువ ధరతో ఎక్కువ అందంగా వెలిగిపోవచ్చు. హ్యాండ్లూమ్ చీరల మీదకు వెండితో తయారుచేసిన బొహెమియన్ స్టైల్ డిజైనర్ హారాలు -
వైఎస్ జగన్‌ను కలిసిన చేనేత మహిళలు
-
పోచంపల్లిలో రంగమ్మత్త
-
సుందర్రావు కూతుర్ని: అనసూయ
భూదాన్‌పోచంపల్లి(భువనగిరి) : పోచంపల్లిలో సినీనటి, ప్రముఖ యాంకర్ అనసూయ(రంగమ్మత్త) సందడి చేశారు. చేనేత ప్రోత్సాహక మండలి అధ్యక్షుడు, చేనేత దినోత్సవ రూపకర్త ఎర్రమాద వెంకన్న ఆధ్వర్యంలో శుక్రవారం ఆమె పోచంపల్లిలోని మహామ్మాయి కాలనీలోని పలు చేనేత కార్మికుల గృహాలను సందర్శించారు. అక్కడ నూలు, చిటికి, రంగులద్దకం, మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలను పరిశీలించారు. కార్మికులతో ముచ్చటిస్తూ ఎన్నాళ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతున్నారు.. ఎంత గిట్టుబాటు అవుతుందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. మగ్గం నేసి, కండెలు చుట్టి కార్మికులను ఉత్సాహపరిచారు. అనంతరం కళాత్మకంగా చేనేత వస్త్రాలు రూపొందిస్తున్న ఆరుగురి కార్మిక కుటుంబాలను పూలమాలతో సన్మానించారు. చిన్ననాటి జ్ఞాపకాలనుగుర్తుచేసుకున్న అనసూయ తాను కూడా పోచంపల్లి ఆడపడుచునని, తనకు పోచంపల్లితో ఎంతో అనుబంధం ఉందని అనసూయ గుర్తుచేశారు. చేనేత కార్మికులతో ముచ్చటిస్తూ తాను పోచంపల్లి సుందర్రావు కూతురునని పరిచయం చేసుకున్నారు. 8వ తరగతిలో ఉండగా పోచంపల్లికి వచ్చానని ఇల్లు, చెరువు ఒక్కటే గుర్తుకున్నాన్నారు. 20 ఏళ్ల తర్వాత పోచంపల్లికి వచ్చానని, సొంతూరి ప్రజలు చూపిస్తున్న ఆదరణ మరువలేనిదని ఆనందభాష్పాలు రాల్చారు. ఇకపై వీలైనపుడల్లా పోచంపల్లికి వస్తానని హామీ ఇచ్చారు. ఇక్కత్ వస్త్రాలు ఎంతో నిండుదనంతో ఉంటాయన్నారు. ఈమె వెంట చేనేత రంగ నిపుణులు తడక యాదగిరి, చేనేత వర్గాల చైతన్యవేదిక జాతీయ అధ్యక్షుడు చిక్క దేవదాసు, సర్పంచ్ తడక లతావెంకటేశం, టీపీసీసీ కార్యదర్శి తడక కల్ప నాకుమారి, పట్నం కృష్ణకుమార్, టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు తడక రమేశ్, భారత లవకుమార్, చేనేత నాయకులు చింతకింది రమేశ్, పాలాది యాదగిరి, అంకం యాదగిరి, అంకం మురళి, ముసునూరి యాదగిరి, చిల్వేరు గోవర్థన్, కర్నాటి పురుషోత్తం, ఏర్వ నీలమ్మ, గోశిక అన్నపూర్ణ, శశిరేఖ, జోగు శ్రీనివాస్, గుద్దేటి నర్సింహ తదితరులు పాల్గొన్నారు. ఇక్కత్ వస్త్రాలు అద్భుతం ఇక్కత్ వస్త్రాలు అద్భుతంగా ఉన్నాయని, వాటిని చూసినా, ధరించినా అమ్మకు దగ్గర ఉన్నట్లుగా ఉంటుందని అనసూయ అభిప్రాయం వ్యక్తం చేశారు. పోచంపల్లి టూరిజం పార్క్‌లో ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘చేనేత పండుగ చేద్దాం.. చేనేత కళాకారులను ఘనంగా సన్మానిద్దాం’ అనే పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పోచంపల్లి నా జన్మభూమి అని, తాను చిన్నపుడు పోచంపల్లి చేనేత వస్త్రాలు వేసుకుని స్కూల్‌కు వెళ్తే బెడ్‌షీట్ ధరించి వచ్చిందని తోటి స్నేహితులు హేళన చేశారని చెప్పారు. కానీ నేడు వాళ్లు ముఖం చాటేసుకుంటున్నారని తెలిపారు. ఎంతో కష్టమైన చేనేత పనిని స్వయంగా చూడడం వల్ల ఈ వృత్తిపై మరింత గౌరవం పెరిగిందన్నారు. చేనేత కళను ప్రోత్సహించే ఏ కార్యక్రమానికైనా తాను రెడీ అని అన్నారు. చేనేత వస్త్రాలంటే కేవలం చీరలు అని అపోహ ఉంటుంది. కానీ నేటితరం యువత ధరంచే విధంగా అన్ని రకాల ఇక్కత్ వస్త్రాలు ఎంతో స్టైలిష్‌గా ఉన్నాయని చెప్పారు. అనంతరం అనసూయను పలువురు శాలువా కప్పి సన్మానించారు. అంతకుముందు చేనేత డిజిటల్ సాధికారిత సెంటర్‌ను సందర్శించి, ఇక్కత్ డిజైన్లను పరిశీలించారు. -
స్మృతి ఇరానీతో కేటీఆర్ భేటి
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు, కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సమస్యల గురించి మంత్రి స్మృతి ఇరానీతో చర్చించనట్లు తెలిపారు. హ్యాండ్లూమ్, పవర్ లూం రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్మృతి ఇరానీకి వివరించానన్నారు. నేతన్నకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం దాదాపు 12 వందల కోట్ల రూపాయలతో ప్రారంభించిన పథకాల గురించి వివరించానన్నారు. అంతేకాక 8 వేల మగ్గాలను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. చేనేత రంగం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకారంతో కొన్ని కొత్త హ్యాండ్లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో కొత్త క్లస్టర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇవేకాక మరో 10 క్లస్టర్లను మంజూరు చేయాల్సిందిగా మంత్రి స్మృతి ఇరానీని కోరానని తెలిపారు. చేనేత కార్మికులను ఆదుకునేవిధంగా ఈ క్లస్టర్స్ ఉంటాయన్నారు. క్లస్టర్ల ఏర్పాటు కోసం కొన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. కానీ నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళానన్నారు. అందుకు స్మృతి ఇరానీ సానుకులంగా స్పందించినట్లు తెలిపారు. -
చే'నేత'
మల్కా దారాల అల్లిక, చేనేత మగ్గాల విప్లవం. ఈ విప్లవానికి నాంది పలికింది ఉజ్రమ్మ. పత్తి రైతు, స్పిన్నింగ్ మిల్లు, చేనేతకారుడు... పరస్పర ఆధారితమై మనుగడ సాగించాలి. ఎవరూ ఎవరి మీదా పెత్తనం చేయరాదు... ఎవరూ ఎవరి ముందూ చేతులు కట్టుకోరాదు. నేతకారులను సంఘటితం చేస్తోందీ ఉక్కుమహిళ చేనేతను ప్రగతిబాట పట్టిస్తోందీ నేత. మీరు హైదరాబాదీనా? నార్త్ ఇండియనా? పుట్టింది హైదరాబాద్‌లోనే. పెరిగింది నార్త్‌లో. నాన్న రైల్వే ఆఫీసర్ కావడంతో నార్త్‌లో చాలా నగరాల్లో పెరిగాను. స్కూలు, కాలేజ్ కూడా నార్త్‌లోనే. మీరేం చదివారు? ఇంగ్లిష్ లిటరేచర్ మీ తరంలో అమ్మాయిల చదువుకి పెద్ద ఆంక్షలే ఉండేవేమో! ముఖ్యంగా ఇస్లాం సంప్రదాయ కుటుంబాల్లో...! మాది అభ్యుదయ కుటుంబం, మా నానమ్మ ఆ రోజుల్లోనే బురఖాకు వ్యతిరేకంగా పోరాడింది. అలాంటి నేపథ్యంలో ఆడపిల్లల చదువు మీద ఆంక్షలు ఎందుకుంటాయి? మీ చదువుకీ, మీరు చేస్తున్న సామాజిక ఉద్యమానికి సంబంధమే కనిపించడం లేదు? మా చిన్నాన్న సజ్జద్ జహీర్ ప్రముఖ కమ్యూనిస్ట్ లీడర్. ఆయన ప్రభావం నా మీద చాలా ఉంది. పర్సన్‌గా నా వికాసంలో చిన్నాన్నదే మెయిన్ రోల్. ఆయన నాకు రోల్‌మోడల్ కూడా. ఇంగ్లిష్ లిటరేచర్‌లో కెరీర్ ప్లాన్ చేయనేలేదా? నాలాగ సోషల్ ఇష్యూస్ మీద స్పందించే వ్యక్తికి లిటరేచర్ ప్రొఫెషన్‌గా ఉపయోగపడదనిపించింది. పత్తి మీద, చేనేత మీద నేను చేసిన పనిని అక్షరీకరించడానికి ఆ చదువు ఉపయోగపడింది. చేనేత రంగం మీద ప్రత్యేక ఆసక్తి ఎందుకు? బ్రిటిష్ పాలన కాలంలో మనదేశపు పత్తి బ్రిటన్‌కు ఎగుమతి కావడం మొదలైంది. ఎగుమతికి అవకాశాలు పెరిగాయి సంతోషమే. అక్కడ మన ఉనికిని మనమే పణంగా పెట్టాల్సిన కుట్ర ఎవరికీ తెలియకుండా జరిగిపోయింది. బ్రిటన్‌లోని స్పిన్నింగ్ మిల్లులకు అనువుగా ఉండే పత్తి రకాలను పండించడానికి మన రైతుల్ని సిద్ధం చేసేశారు. దాంతో మనదేశంలో ఉన్న వైవిధ్యతను కోల్పోయాం. దానికి తోడు మన చేనేతకారులకు దారం అవసరమైనంతగా అందడం లేదు. ఇటు పత్తి రైతు, అటు వస్త్రాన్ని నేసే నేతకారుడు ఇద్దరూ స్పిన్నింగ్ మిల్లు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఇద్దరినీ నియంత్రించే స్థాయికి, నిర్దేశించే స్థాయికి చేరిపోయింది స్పిన్నింగ్ పరిశ్రమ. ఈ ఉద్యమంలో మీ లక్ష్యం ఏమిటి? సమన్యాయం. రైతు, చేనేత కారుడు, స్పిన్నింగ్ మిల్లు యజమాని... ముగ్గురూ సమాజంలో ఒకే రకమైన గౌరవాలను అందుకోగలగాలి. స్పిన్నింగ్ పరిశ్రమ ఉక్కు కౌగిలి నుంచి పత్తి రైతులు, చేనేత కారులు బయటపడాలి. ఇంతకీ మల్కా అంటే ఏమిటి? ఇది ఒకరకమైన ఫ్యాబ్రిక్. ఖాదీ వంటిదే. దారం నునుపుగా, మృదువుగా ఉంటుంది. మన్నిక కూడా ఎక్కువే. ఈ దారంతో చేసిన వస్త్రం చేతికి కొంచెం గరుకుగా తగులుతూ ఒంటికి హాయినిస్తూంటుంది. మన భారతీయ సంప్రదాయ నేత విధానానికి ఆధునిక టెక్నాలజీని మేళవించి రూపొందుతున్న వస్త్రం. మల్కా చీర కడితే కుచ్చిళ్లు చక్కగా అమరుతాయి. నార్మల్ కాటన్కీ దీనికీ తేడా ఉంటుందా? పాశ్చాత్య కంపెనీలు మన పత్తిని వాళ్ల దేశాలకు రవాణా చేయడానికి బేలింగ్ విధానం పాటిస్తాయి. పత్తిని గట్టిగా ఒత్తిడికి గురిచేసి నలుచదరంగా డబ్బాలాగ ప్యాక్ చేస్తారు. వాటినే మనం పత్తి బేళ్లు అంటాం. బేలింగ్లో కంప్రెస్ చేసినప్పుడు, తిరిగి స్పిన్నింగ్ మిల్లులో ఏకినప్పుడు పత్తి పోగుల్లో సహజంగా ఉండే సున్నితత్వం, మెరుపు తగ్గుతుంది. మల్కా నేత కోసం పత్తిని బేల్ చేయరు. వదులుగా ప్యాక్ చేసి రవాణా చేస్తారు. చిన్న చిన్న నూలు మిల్లులు ఏర్పాటు చేసి, పత్తి రైతులు, చేనేత కారులకు అందుబాటులోకి ఉండేట్టు చూస్తున్నాం. వాటిని చేనేతకారులే సహకార సంఘాలుగా ఏర్పడి నడిపించుకుంటున్నారు. సిరిసిల్లలో 70 చేనేత కుటుంబాలు మల్కా ప్రోత్సాహక, పరిరక్షణ ఉద్యమంలో పని చేస్తున్నాయి. వాళ్లు పత్తిని రైతుల నుంచి కొని దారం తీస్తారు, వారే దుస్తులు నేస్తారు. మన పత్తి పాశ్చాత్య కంపెనీల్లో దారంగా మారడం తప్పంటారా? తప్పా ఒప్పా అనేది కాదిక్కడ. నాలుగు వేల ఏళ్ల మన వస్త్ర పరిశ్రమ మనది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన పత్తి పండేది. వాటి నుంచి వచ్చే దారంలోనూ తేడా ఉంటుంది. దానిని బట్టి అక్కడ తయారయ్యే వస్త్రాల్లో వైవిధ్యత ఉండేది. పాశ్చాత్య కంపెనీలు... వాళ్ల మిషన్లకు అనువుగా ఉండే పత్తినే ప్రమోట్ చేస్తున్నాయి. దాంతో ఒకే రకమైన దారంతో ఒకటే రకం కాటన్ తయారవుతోంది. మనకు పెద్ద ఆస్తిలాంటి వైవిధ్యత పోతోంది. అలాగే వాళ్లు సూచించే పత్తి వంగడాలకు మన వాతావరణంలో తెగుళ్లు ఎక్కువ. దాంతో మందులు ఎక్కువ చల్లాలి, రైతుకి ఖర్చు పెరుగుతుంది. ఈ నేలలో జీవం పోసుకున్న పత్తి వంగడం ఇక్కడి వాతావరణంలో తెగుళ్లను కూడా ఎదుర్కోగలుగుతుంది. దేశీయ పత్తి, చేనేత గురించి ఇన్ని విషయాలు చెబుతున్నారు, చాలా స్టడీ చేసినట్లున్నారు! స్టడీ కాదు, రీసెర్చ్ చేశాను. ‘పేట్రియాటిక్ అండ్ పీపుల్ ఓరియెంటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(పిపిఎస్టి)’లో పరిశోధన చేశాను. యూరప్, అమెరికాలు... అవి పాటిస్తున్న సైన్స్‌కి మోడరన్ సైన్స్ అనే పేరు పెట్టి మూడవ ప్రపంచదేశాల మీద ఆధిపత్యం చెలాయించడం, ఆయా దేశాల్లో అప్పటికే అభివృద్ధి చెంది ఉన్న సైన్స్‌ను తుడిచిపెట్టే ప్రయత్నం చేయడం మీద మనదేశంలోని యువశాస్త్రవేత్తలు కొంతమంది డెబ్బైలలో ఒక ఫౌండేషన్‌గా ఏర్పడ్డారు. ఇండియాలో విస్తరించిన సైన్స్‌ను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం అది. మల్కా ఉద్యమాన్ని ఎప్పుడు మొదలుపెట్టారు? పదేళ్ల కిందట, 2008లో. అంతకు ముందు ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో చేనేతకారుల కోసం పనిచేశాను. దస్తకార్ ఆంధ్రా మార్కెటింగ్ అసోసియేషన్ స్థాపన కోసం పని చేశాను. రాష్ట్రంలోని చేనేతకారులు సంఘటితంగా స్వయంగా మార్కెట్ చేసుకోవడానికి వేదిక అది. మల్కా మార్కెటింగ్ ట్రస్ట్ కూడా అలాంటిదే. తెలంగాణలో ఒకప్పుడు ఉండి ఇప్పుడు కనుమరుగవుతున్న డిజైన్లతో మల్కానేతలో ప్రయోగాలు చేస్తున్నాం. వస్త్రాన్ని మచిలీపట్నం పంపించి వాటి మీద సహజరంగులతో కలంకారీ అద్దకం చేయిస్తున్నాం. మన దేశీయ పత్తి, చేనేతకు మన అద్దకం మేళవింపు అన్నమాట. మల్కాను ప్రమోట్ చేయడానికి సెలబ్రిటీ అంబాసిడర్లున్నారా? మల్కా చీరను ధరించిన ప్రతి మహిళా మల్కాకు బ్రాండ్ అంబాసిడరే. ఒకసారి వీటిలో సౌకర్యాన్ని ఆస్వాదిస్తే ఇక వదిలిపెట్టరు. మల్కా దుస్తుల ధర చాలా ఎక్కువ కదా? కొంత వరకు నిజమే, కానీ ఆరోగ్యం అంతకంటే ముఖ్యం. చెమటను పీల్చుకునే వస్త్రం ఒంటికి చేసే మేలు గురించి ఒకరు చెప్పాల్సి రావడం బాధాకరమే. «ధరే కాదు, మన్నిక కూడా ఎక్కువే. మీ ప్రయత్నంలో విజయం సాధించారా? ఇది ముందు తరాలకు కొనసాగే అవకాశముందా? ఇది విస్త్రృతమైన ప్రపంచం. నేను వేసిన అడుగులు కొన్నే. నేను చైతన్యపరిచిన చేనేతకారుల కుటుంబాల్లో ఈ వృత్తి జీవితాన్ని నిలబెడుతుందనే నమ్మకమైతే కుదిరింది. ఈ జర్నీ కొనసాగాలంటే ప్రభుత్వాలు పూనుకోవాలి. ప్రభుత్వాలు చేనేత రంగాన్ని సన్‌సెట్ ఇండస్ట్రీగా చూస్తున్నాయి. ప్రభుత్వాలిచ్చే ప్రోత్సాహకాలు ఉన్న కళను పరిరక్షించడానికే అరకొర అవుతున్నాయి. భవిష్యత్తు నిర్మాణానికి సరిపోవడం లేదు. నిజానికి ఇది భవిష్యత్తు ఉన్న గ్రీన్ ఇండస్ట్రీ. ప్రపంచంలో అత్యధికంగా చేనేతకారులున్న దేశం మనది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే చైనాను మించిపోతుంది ఇండియా. మన పత్తి నుంచి దాని నాణ్యత కోల్పోకుండా దారం తీయడానికి అనువైన యంత్రాల కోసం రీసెర్చ్ జరగాలి. మనకోసం మనమే యంత్రాలను తయారు చేసుకోవాలి. చేనేత ఉద్యమంతోపాటు మీ హాబీలేంటి? హాబీ కాదు కానీ, నా మరో ప్రొఫెషన్ జువెలరీ మేకింగ్. ఆభరణాల తయారీ కోర్సు చేశాను. ఇంట్లో వర్క్‌షాప్ ఉంది. బ్రాస్లెట్, నెక్లెస్, చెవిరింగులు, ఉంగరాల వంటివి కొత్త డిజైన్లు చేస్తుంటాను. మరి... రోజుకు ఎన్ని గంటలు పనిచేస్తారు? నాకిప్పుడు 75 ఏళ్లు. ఈ వయసులో ఎన్ని గంటలు చేయగలను. మల్కా కోసం నాలుగు గంటలు, ఆభరణాల వర్క్‌షాప్‌లో రెండు గంటలు. టూర్లను ఇష్టపడతారా? ఇండియాలో, విదేశాల్లో ప్రదేశాలకు వెళ్లాను. కానీ నేను టూరిస్ట్‌ను కాదు. అక్కడి మనుషులను కలవడానికే వెళ్లాను తప్ప ప్రదేశాలను చూడడానికి కాదు. రాష్ట్రీయ చేనేత జనసమాఖ్యను కలవడానికి చీరాలకు వెళ్లాను. ఒరిస్సా, కర్ణాటక, కేరళలోని హ్యాండ్లూమ్ వీవర్స్‌ను కలిశాను. లూమింగ్ రివల్యూషన్లో భాగంగా విస్తృతంగా పర్యటించాను. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి పత్తి చరిత్ర మట్టి నుంచి పత్తిని పండించే రైతు, పత్తి నుంచి దారం తీసే యంత్రం, దారంతో వస్త్రాన్ని రూపొందించే హస్తకళా నైపుణ్యం... ఈ మూడూ తోడుగా ఉండడమే ఆధునిక మానవుడి ఆహార్య రహస్యం. ఈ మూడింటిలో మొదటి అడుగే తప్పటడుగు అవుతుంటే... మిగిలినవి తప్పుటడుగులే అవుతాయి. ఇప్పటికే కొన్ని దశాబ్దాలుగా పడిన తప్పటడుగులను సరిచేయడమే మల్కా ఉద్యమం ఉద్దేశం. దేశమంతటా పర్యటించి పరిశోధించిన సమాచారాన్ని ‘ఏ ఫ్రేడ్ హిస్టరీ : ద జర్నీ ఆఫ్ కాటన్ ఇన్ ఇండియా’ పేరుతో పుస్తకం రాశాను. ఈ పుస్తకంలో పత్తి చరిత్ర, పత్తిలో రకాలు, సాగు పద్ధతులు, దారం తీసే నైపుణ్యాలు, వస్త్రాన్ని నేయడంలో వివిధ ప్రాంతాల్లో అవలంబించే పద్ధతుల గురించి సమగ్రంగా చర్చించాను. నా తర్వాత ఈ ఉద్యమాన్ని నడిపించడానికి ముందుకు వచ్చే వాళ్లకి ఇది పనికొస్తుంది. నేను చేసిన పనినే మళ్లీ వాళ్లు కూడా మొదటి నుంచి చేయాల్సిన అవసరం లేకుండా ఈ పుస్తకం మార్గదర్శనం చేస్తుంది. – ఉజ్రమ్మ, మల్కా ఉద్యమకారిణి -
గొల్లభామ సునంద
కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు.. వెళ్లే దారికి ఎప్పుడూ అడ్డం పడుతూనే ఉంటాయి. అయినప్పటికీ పట్టువీడకుండా ప్రయత్నిస్తే కాలం కార్పెట్ పరిచి మరీ గులామ్ అయిపోతుంది. అందుకు ఉదాహరణ సునంద సాధించిన విజయం. చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకుని కుటుంబం కోసం గృహిణిగా ఉండిపోయిన సునందను ఆ కాలమే ‘గొల్లభామ సునంద’గా మార్చేసింది. దాదాపు నలభై ఏళ్ల క్రితమే అంతరించిపోయిన నూరేళ్ల నాటి ‘గొల్లభామ’ చేనేత కళకు మళ్లీ ఊపిరిపోసినందుకు సునందకు ఈ గుర్తింపు, గౌరవం దక్కాయి. సునంద.. కర్ణాటకలో స్త్రీ శిశుసంక్షేమ శాఖలో ప్రభుత్వ ఉద్యోగి. భర్త, ఇద్దరు పిల్లలు. సాఫీగా గడిచిపోతున్నాయి రోజులు. భర్త రవీంద్రకు హైదరాబాద్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చింది. భర్త హైదరాబాద్‌లో, తను కర్ణాటకలో. ‘కుటుంబం కావాలా, ఉద్యోగం కావాలా!’ అనే డోలాయమాన పరిస్థితి. తుదకు కుటుంబమే కావాలని.. చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి పిల్లలిద్దరినీ తీసుకొని అలా పద్నాలుగేళ్ల కిందట భర్తతో పాటు హైదరాబాద్ వచ్చేశారు సునంద. ‘వచ్చేశాక ఏమీ అర్థం కాలేదు. ప్రాంతం వేరు, ఇక్కడి భాష తెలియదు. పిల్లలు స్కూల్‌కి వెళ్లిపోయాక నాకేం చేయాలో తోచేది కాదు. ఏడాది పాటు ఖాళీగానే ఉన్నాను. అప్పటికే టెక్స్టైల్ టెక్నాలజీలో చేసిన ఎమ్మెస్సీ చదువు ఉంది నాకు. దీంతో టెక్స్టైల్స్ వైపు పార్ట్‌టైమ్ ఉద్యోగాల కోసం వెతికాను. ఆ క్రమంలో హ్యామ్స్టెక్ వంటి ఫ్యాషన్ డిజైనర్ ఇన్స్టిట్యూట్లలో హెచ్ఓడీగా చేశాను. 2009లో ఆప్కోలో హ్యాండ్లూమ్ డిజైనింగ్‌లో క్యాడ్ ట్రెయినింగ్ తీసుకున్నాను. ఆ తరువాత ఏడాది మెదక్‌లోని దుబ్బాక క్లస్టర్‌కి డిజైనర్ పోస్ట్ వచ్చింది. అప్పుడు హ్యాండ్లూమ్లో నాకో ప్లాట్ ఫామ్ దొరికింది..’ అంటూ, తన కెరీర్ ప్రస్థానాన్ని వివరించారు సునంద. ముగిసిన కథ మళ్లీ మొదలైంది! ‘‘దుబ్బాక క్లస్టర్ డిజైనర్‌గా ఉన్నప్పుడు సిద్ధిపేట ప్రాంతంలో ‘గొల్లభామ’ చేనేత చీరల గురించి తెలిసింది. వందేళ్ల క్రితం ఓ చేనేతకారుడు అందమైన పడతి తన తలమీద పాలు, పెరుగు కుండలు పెట్టుకొని అమ్మడం చూసి బొమ్మగా గీసుకున్నారట. ఆ బొమ్మను నేతలో డిజైన్‌గా తీసుకొచ్చారట. అలా వచ్చిన గొల్లభామ చీరలకు అప్పట్లో మంచి డిమాండ్ ఉండేది. తర్వాత.. దాదాపు 40 ఏళ్లు.. అంటే ఒక తరానికి తరం గొల్లభామను మర్చిపోయింది. ఆ డిజైన్ని సేకరించి 2015లో సిద్ధిపేటకు వెళ్లి చేనేతకారులను కలిసి ‘గొల్లభామ’ డిజైన్ కాటన్ ఫ్యాబ్రిక్ మీద కావాలని అడిగాను. ‘మేడమ్, ఆ కథ అక్కడితోనే అయిపోయింది. వదిలేయండి. ఒక్క బొమ్మ తేవాలంటే రోజంతా పట్టుద్ది. దీన్నే నమ్ముకుంటే మాకు రోజు గడవదు’ అన్నారు. మా పైఅధికారులను కలిశాను. ‘సార్, ఆ నేతకారుల దగ్గర కళ ఉంది, నైపుణ్యాలు ఉన్నాయి. కావల్సినన్ని వనరులు కల్పిస్తే మూలనపడేసిన ‘గొల్లభామ’ వర్క్‌కు జీవం పోసిన వాళ్లం అవుతాం’ అన్నాను. అందుకు ‘సరే’ అనే అంగీకారం లభించింది. కొత్త సొబగులతో గొల్లభామ గొల్లభామ బొమ్మ డిజైన్‌లో కొన్ని మార్పులు చేశాను. సిద్ధిపేట వీవర్స్‌ను మళ్లీ కలిసి ఈ డిజైన్ని ఎలాగైనా సరే బట్ట మీద నేసి ఇవ్వాలని చెప్పాను. డిజైన్ బాగుందన్నవారే కానీ, ఎవ్వరూ ముందుకు రాలేదు. రోజులు నెలలు అవుతున్నాయి. ఆ టైమ్‌లోనే మోడిఫై చేసిన డిజైన్‌కి జిఐ (జాగ్రఫీ ఇండికేషన్) వచ్చింది. అంటే, గొల్లభామ డిజైన్ సిద్ధిపేట చేనేతకారులు తప్ప మరెవ్వరూ తయారుచేయడానికి లేదన్నమాట. ఇది తెలిసిన వెంటనే మళ్లీ వీవర్స్‌ని కలిశాను. మీటింగ్ పెట్టాను. ఈ డిజైన్ దేశంలోనే కాదు ప్రపంచంలో మరెక్కడా నేయరు. ఇది ఈ ప్రాంతం ప్రత్యేకత. దీనిని బతికించాలి. ఒక్కసారి చేసి చూపించండి’ అని రిక్వెస్ట్ చేశాను. చివరకు ఇద్దరు వీవర్స్ ముందుకు వచ్చారు. వాళ్లకా డిజైన్ ఇచ్చి, ఎప్పుడు పూర్తయితే అప్పుడే చెప్పమని నా పనిలో పడిపోయాను. మార్కెటింగ్ ప్లస్‌లూ మైనస్సులు హ్యాండ్లూమ్కి సంబంధించిన నాలెడ్జ్ నాకు ఇంకా అవసరం అనిపించింది. అందుకే హ్యాండ్లూమ్, పవర్లూమ్లలో నానోటెక్నాలజీపై పీహెచ్‌డి చేశాను. హ్యాండ్లూమ్ మార్కెటింగ్‌లోని ప్లస్ అండ్ మైనస్‌లు తెలుసుకోవడానికి ఒక ఆర్గనైజేషన్‌లో ఎగ్జిక్యూటివ్‌గా చేరాను. కొన్ని నెలలు అక్కడే ఉండి మార్కెట్లో నైపుణ్యాలు నేర్చుకున్నాను. తర్వాత మళ్లీ సిద్ధిపేట వెళ్లి వీవర్స్‌ని కలిసి ‘మీకు గొల్లభామ రివైవల్ డిజైన్ ఇచ్చాను కదా ఏమైంది’ అని అడిగాను. ‘మేడమ్, ఈ గొల్లభామ బొమ్మ చాలా పెద్దగా ఉంది. అంత చేయలేం. కొన్ని ఇంచులు తగ్గిస్తే చేసిస్తాం అన్నారు. వాళ్లు చెప్పిన విధంగా డిజైన్ని తగ్గించి ఇచ్చాను. అలా మొత్తానికి 2016 నవంబర్ 15 న డిజైన్ నా చేతికి వచ్చింది. చూసిన ప్రతీ ఒక్కరూ ఈ డిజైన్ బ్రహ్మాండంగా వచ్చింది అన్నారు. ఆ ప్రశంసలు నాలో పట్టుదలను మరింత పెంచాయి. బతుకుకు కొత్త దారి ట్రెడిషనల్ గొల్లభామ నుంచి రివైవ్డ్ గొల్లభామ డిజైన్ని అంచు మీద, చీరలో అక్కడక్కడా బుటాగా అంతా సెట్ చేసుకుని ఒక చీర నేసివ్వాలని కోరాను. ముందు దుపట్టా చేసిచ్చారు. అది సక్సెస్ అయ్యింది. ‘వీటి ఉత్పత్తి పెంచాలంటే జాల మగ్గాలు సరిపోవు. జకార్డ్ మిషనరీ కావాలి’ అన్నారు. జకార్డ్ ఎక్కడ దొరుకుతుంది? మళ్లీ వెతుకులాట. అన్ని చేనేత యూనిట్స్ వద్ద సర్వే చేయించాను. మొత్తానికి 120 జకార్డ్ని తెచ్చి సెట్ చేయించాను. పని మొదలయ్యింది. 14 ఇంచుల గొల్లభామ హ్యాండ్లూమ్ మీద వన్నెలు పోయింది. తర్వాత ఒక పెద్ద గొల్లభామ, రెండు చిన్న గొల్లభామలు, దుపట్టా గొల్లభామ, ప్లెయిన్ ఫ్యాబ్రిక్.. ఇలా దశలవారీగా తీసుకున్నాం. దుబ్బాకలో పనిచేసినప్పుడు అక్కడ రెండు జకార్డ్ మగ్గాలను చూశాను. అక్కడ వాటిని ఎవరూ ఉపయోగించడంలేదు. దీంతో వాటిని అక్కడ నుంచి సిద్ధిపేటకు తీసుకొచ్చాను. కర్ణాటక నుంచి మిషనరీ ఫిట్‌చేసే ఇద్దరిని తీసుకొచ్చి మిషనరీ సెట్ చేయించాను. జకార్డ్ మీద ‘గొల్లభామ’ డిజైన్ పని వేగం పుంజుకుంది. ‘జకార్డ్ వల్ల పని సౌకర్యంగా ఉంది. కాళ్ల నొప్పులు తగ్గాయి’ అన్నారు వీవర్స్. ఈ చేనేతకారుల్లో టాలెంట్ ఉంది. కానీ, బతుకుదెరువు లేదు. నెలంతా కష్టపడితే 4–5 వేలు సంపాదన. వీళ్లకి మంచి బతుకుదెరువు లభిస్తే నా పనికి సార్థకత అనుకున్నాను. మరో 4 జకార్డ్స్ పెట్టించడంతో చేనేతకారులు పెరిగారు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయడానికి వచ్చినట్టు చేనేతకారులు పోటీ పడటంతో నాకు చాలా ఆనందమేసింది. కిందటేడాది ఆగష్టు 17న మొదటిసారి ‘గొల్లభామ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్’ ద్వారా ఈ కళ మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడా చేనేతకారుల ఒక్కొక్కరి నెలసరి ఆదాయం 10 నుంచి 15వేల పైనే ఉంటుంది. ప్రోత్సహిస్తే ఫలితాలు సిద్ధిపేటకు గొల్లభామ ఎలా స్పెషల్ అయ్యిందో మిగతా ప్రాంతాలలోని చేనేత పట్ల కూడా అలా శ్రద్ధ వహిస్తే ఆ ప్రాంతాలూ అలా స్పెషల్ అవుతాయి. ఒక కార్పోరేట్ కంపెనీకి దీటుగా చేనేత ఎదగాలన్నదే నా ఆకాంక్ష’’ అంటున్నారు సునంద. ప్రస్తుతం అగ్రికల్చర్ యూనివర్శిటీలో పోస్ట్ ప్రాజెక్టర్గా వర్క్ చేస్తున్న సునంద.. ‘చేసే పని పట్ల నిబద్ధత, పట్టుదల ఉంటే మన చుట్టూ ఉన్నవారి సహకారం తప్పక ఉంటుంద’న్నారు. మేడమ్ మార్పులు చేశారు మొదట జాల మీద నేసినప్పుడు గొల్లభామ డిజైన్ చిన్నగా వచ్చింది. టైమ్ కూడా ఎక్కువ పట్టింది, సునంద మేడమ్ డిజైన్‌లో మార్పులు చేశారు. ఈ డిజైన్ వల్ల పని సులువు అయ్యింది. డిజైన్ అందంగా వచ్చింది. ఇప్పుడు 17 ఇంచుల గొల్లభామ డిజైన్ని కూడా నేస్తున్నాం. పల్లూ వేరేగా తీయాలి. చిన్న చిన్న బుటా ఒకలా తీసుకోవాలి. ఒక్క చీర నేయాలంటే మూడున్నర రోజులు పడుతుంది. – కైలాస్, చేనేతకారుడు, సిద్ధిపేట సమంత కూడా వచ్చారు మేడమ్ గొల్లభామ డిజైన్ని అందంగా మార్పులు చేశారు. డిజైన్ బాగా వచ్చింది. ముందు దుపట్టా చేశాం. తర్వాత చీరలు. సినీ నటి సమంత కూడా మా దగ్గరికి గొల్లభామ డిజైన్ చీరల కోసం వచ్చారు. ఫ్యాషన్ డిజైనర్లు వచ్చారు. దీంతో గొల్లభామ చీరలకు మంచి ప్రాచుర్యం వచ్చింది. ప్రస్తుతానికి కాటన్ ఫ్యాబ్రిక్ మీద గొల్లభామ డిజైన్ని నేస్తున్నాం. పట్టు మీద నేసే అవకాశం ఉంటే అలాగే నేస్తాం. – సత్యం, చేనేతకారుడు, సిద్ధిపేట – నిర్మలారెడ్డి -
చేనేత కార్మికుడి అద్బుత నైపుణ్యం
-
అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి
భూదాన్ పోచంపల్లి/ సంస్థాన్ నారాయణపురం: పోచంపల్లి ఇక్కత్ బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు చేనేత కార్మికులంతా కృషి చేయాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచించారు. బుధవారం యాదా ద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి, కనుముక్కుల పరిధిలోని హ్యాండ్లూమ్ పార్క్‌ను నరసింహన్ దంపతులు సందర్శించారు. మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలు, కార్మికుల జీవన స్థితిగతులు, గిట్టుబాటు ధర గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక టూరిజం పార్క్‌లో కార్మికులు, మాస్టర్ వీవర్స్, బ్యాంకర్స్‌తో సమీక్ష నిర్వహించి, ప్రభుత్వ పరంగా ఏమి చేయాలని అడిగారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, పోచంపల్లి ఇక్కత్ కళ ఎంతో అద్భుతంగా ఉందని, ఎంతో కష్టమైన పని అని పేర్కొన్నారు. స్కిల్ వర్క్ అంటే చేనేత అని కొనియాడారు. చేనేత కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా కావాల్సిన సహాయాన్ని అందజేసేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. మార్కెట్‌కు అనుగుణంగా నూతన డిజైన్లను రూపొందించాలని, తద్వారా అమ్మకాలు పెరగడంతోపాటు ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయన్నారు. చేనేత వస్త్రాలను హైదరాబాద్ నగరానికి విస్తరిస్తే అందరూ ధరించే వీలు కలుగుతుందని చెప్పారు. అనంతరం చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. జలాల్పురంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థను సందర్శించి యువతకు అందిస్తున్న స్వయం ఉపాధి కోర్సులను పరిశీలించారు. నైపుణ్యాలను పెంపొందించుకొని స్వయం ఉపాధి రంగంలో రాణించాలని సూచించారు. గవర్నర్ వెంట రాష్ట్ర చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్, కలెక్టర్ అనితా రామచంద్రన్, జాయింట్ కలెక్టర్ రవినాయక్ ఉన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... ప్రభుత్వ విద్య బలోపేతానికి కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచించారు. చౌటుప్పల్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, చౌటుప్పల్ మండలంలోని మల్కాపురంలోని మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. విద్యార్థులు మేధాశక్తిని పెంపొందించుకోవాలన్నారు. తల్లిదండ్రులు, గురువు దైవంతో సమానమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రం నిర్వహణపై ఆరా తీశారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాలల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్, జాయింట్ కలెక్టర్ రవినాయక్, ఆర్డీవో సూరజ్‌కుమార్, డీఈవో రోహిణీ, డీఆర్డీవో పీడీ వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు. -
మగ్గాలపై..ఆఖరితరం!
సిరిసిల్ల నుంచి వూరడి మల్లికార్జున్: చిన్న చేపను పెద్ద చేప మింగినట్లు.. చేనేత మగ్గాలను మరమగ్గాలు (పవర్‌లూమ్స్) మింగేశాయి. కాలంతో పోటీ పడలేక.. జిగిసచ్చిన వృద్ధ కార్మికు లు మరో పని చేతకాక.. వయసు మీద పడినా.. కళ్లు కనిపించకున్నా.. ఒళ్లు సహకరించకున్నా.. కాళ్లు, చేతులు ఆడిస్తూ.. జానెడు పొట్టకోసం బట్ట నేస్తు న్నారు. ఎంత పనిచేసినా.. తక్కువ కూలీ వస్తుంది. మీటరు వస్త్రం నేస్తే రూ.17. దీంతో రోజంతా పని చేసినా.. రూ.100 రావడం కష్టం. మరో పని చేత కాని చేనేతను నమ్ముకున్న ఆఖరి తరం ఈ పనిలోనే కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికు లంతా 60ఏళ్ల పైబడిన వారే కావడం విశేషం. సిరిసిల్ల జిల్లాలో 175 మంది కార్మికులున్నారు. ఒంట్లో సత్తువ లేకున్నా.. చేనేత మగ్గంపై బట్టనేస్తున్న ఇతని పేరు మామిడాల చంద్రయ్య(92). సిరిసిల్ల విద్యానగర్‌లో ఉండే చంద్రయ్య చిన్ననాటి నుంచే చేనేత మగ్గంపై బట్టనేస్తున్నాడు. ఒకప్పుడు చేనేత వస్త్రాలు తయారుచేస్తూ బాగానే బతికాడు. ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు చేతగాని పానం.. ఎముకలు తేలిన ఒళ్లు.. మగ్గంపై జోటను ఆడియ్యాలంటే రెక్కల్లో సత్తువ లేదు. దీంతో ఆయన పని మానేశారు. ఇప్పుడు చేనేత మగ్గాలపై బట్ట నేస్తున్న కార్మికులు పని మానేస్తే.. ఇక కొత్తగా చేనేత మగ్గాలను నడిపే వారు ఉండరు. చేనేత మగ్గాలకు ముసలితనం వచ్చింది. నేటి యువ ‘తరం’ చేనేత మగ్గాలను నడిపేందుకు ఆసక్తి చూపడం లేదు. మగ్గం మరణశయ్యపై నిలిచింది. 1990లో సిరిసిల్లలో చేనేత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నైపుణ్యం కలిగిన శిక్షకులతో యువ కార్మికులకు ఆరునెలల శిక్షణ ఇచ్చేవారు. రూ.1200 ఉపకార వేతనం ఇస్తూ ప్రోత్సహించారు. చేనేత రంగంలో ఉపాధి అవకాశాలు లేక శిక్షణ పొందేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో సిరిసిల్లలోని శిక్షణ కేంద్రాన్ని కరీంనగర్‌కు తరలించారు. అక్కడా ఇదే పరిస్థితి. తిరిగి 2015లో సిరిసిల్ల శివారులోని టెక్స్టైల్ పార్క్‌లోకి శిక్షణ కేంద్రాన్ని తరలించారు. మగ్గాల పరికరాలను ఓ అద్దె ఇంట్లో మూలన పడేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన వారికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కేంద్రం మూలనపడింది. 17 చేనేత మగ్గాలు పనికి రాకుండా పోయాయి. -
నేతన్నకు చేయూతనిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని పరిశ్రమల మంత్రి కేటీఆర్ చెప్పారు. బడ్జెట్లో తగినన్ని కేటాయింపులు జరుపుతున్నామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2017– 18లో రూ.1,270 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో చేనేత రంగంపై కేటీఆర్ ప్రకటన చేశారు. ‘రాష్ట్రంలో 16,879 చేనేత మగ్గాలు, 49,112 మరమగ్గాలు ఉన్నాయి. నేతన్నల సామాజిక, ఆర్థిక భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చే థ్రిఫ్ట్ పథకానికి రూ.60 కోట్లు విడుదల చేశాం. ఈ పథకంతో ఇప్పటివరకు 6,445 మంది నేతన్నలు లబ్ధి పొందారు’అని వివరించారు. ‘చేనేత సహకార సంఘంలోని సొసైటీలు, కార్మికులు కొనుగోలు చేసే నూలు, సిల్క్, ఉన్ని, డై, రసాయనాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 20 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఈ సబ్సిడీని 40 శాతానికి పెంచాం. దీనికి కేంద్ర ప్రభుత్వ 10 శాతం సబ్సిడీ అదనం. ఈ పథకం కోసం రూ.100 కోట్లు కేటాయించాం’అని కేటీఆర్ వివరించారు. రూ.14.98 కోట్లతో గద్వాలలో హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. -
చేనేతలకు రుణాలందించేందుకు చర్యలు
చేనేత, జౌళి శాఖ ఏడీ పవన్‌కుమార్ అనంతపురం సప్తగిరి సర్కిల్: జిల్లాలోని చేనేతలకు ముద్ర పథకం ద్వారా రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చేనేత, జౌళి శాఖ ఏడీ పవన్‌కుమార్ తెలిపారు. రుణాల ముంజూరుకు పెద్ద ఎత్తున దరఖాస్తులందాయన్నారు. ఫీల్డ్ ఆఫీసర్ల ద్వారా క్షేత్రస్థాయిలో ఆయా దరఖాస్తులను పరిశీలిస్తామన్నారు. చేనేతల ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా, మగ్గం తదితర వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత అర్హత కలిగిన వారందరికీ రుణాలను మంజూరు చేసేందుకు బ్యాంకులకు వివరాలను అందిస్తామన్నారు. -
మహిళలపట్ల ఉత్తరాంధ్ర మంత్రి అసభ్య ప్రవర్తన: రోజా
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె సోమవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ పాలనలో మహిళలు అభద్రతాభావంతో ఉన్నారన్నారు. ఒకపక్క రాష్ట్రంలో మహిళలను వేధిస్తూ.. మరోవైపు మహిళా సాధికారత అంటూ చంద్రబాబు వల్లమాలిన ప్రేమ నటిస్తున్నారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. మహిళను రక్షించడంలో ఘోరంగా విఫలమైన చేతకాని ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు ఏం మొహం పెట్టుకుని మహిళలకు రాఖీ శుభాకాంక్షలు చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో సూదిగాళ్ల పాలన నడుస్తుందని విమర్శించారు. చంద్రబాబు పాలనలో మహిళలు అర్ధరాత్రి కాదు.. పట్ట పగలు కూడా నడవలేయపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాలకేయుల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయని ఆమె ధ్వజమెత్తారు. కంత్రీ కేబినెట్ మంత్రులు ఉన్నారు ‘దేశంలోనే నలుగురు మంత్రులపై లైంగిక ఆరోపణలున్నాయని తేలితే అందులో ఇద్దరు మన రాష్ట్రానికి చెందిన మంత్రులుండటం సిగ్గు చేటు. ఒక మహిళా కేంద్ర మంత్రిని కూడా వేధించిన చరిత్ర ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులుండటం దౌర్భాగ్యం. ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి నిత్యం మహిళా ఉద్యోగులను వేధిస్తున్నా చంద్రబాబుకు చీమ కుట్టినట్టు కూడా లేదు. మహిళలను హింసించేవారిని టీడీపీ పెద్దలు వెనకేసుకు వస్తున్నారు. చంద్రబాబు మంత్రులంతా కంత్రీలు, ఎమ్మెల్యేలంతా కాలకేయుళ్లు. ఎస్టీ, ఎస్టీ, బీసీ విద్యార్థినులు మెస్ చార్జీలు పెంచమని విశాఖలో పోరాడితే జుట్టు పట్టి లాగారు. తుందురులో ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినదించిన మహిళలను బట్టలు చించి కొట్టారు. అంగన్వాడీ మహిళలను బ్లౌజులు చినిగిపోయేలా కొట్టారు. విజయవాడ కాల్‌మనీ సెక్స్రాకెట్తో బెదిరించి ఎంతో మంది అమాయక మహిళలను వ్యభిచారంలోకి దించేశారు. దానికి కారణమైన బోండా ఉమ,బుద్ధా వెంకన్న వంటి వారిని వెనకకేసుకు రావడమేనా మహిళా సాధికారత. కార్యకర్తల స్థాయి నుంచి మంత్రుల వరకు నిత్యం మహిళలను హింసిస్తున్నారు. దీనికి టీడీపీ మహిళా నాయకులు కూడా మినహాయింపు కాదు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోనూ టీడీపీ మహిళా నాయకులపై దాడులు చేసినా చంద్రబాబులో చలనం లేదు. జానీమూన్ వంటి వారు మీడియా ముందుకొచ్చి తమపై జరుగుతున్న వేధింపులపై చెప్పినా ఫలితం లేదు. ఇక నారాయణ కాలేజీలో 25 మంది అమ్మాయిలు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క కేసు నమోదు చేయలేదు. మంత్రి నారాయణను కూడా భర్తరఫ్ చేయకుండా కొనసాగించడం దారుణం. ఆయనిచ్చే డబ్బుతో రాజకీయం చేస్తున్నాడు. ఇలాంటి ప్రభుత్వాన్ని దించే దిశగా మహిళలు కంకణ బద్దులు కావాలి. నరకాసురుడిని వధకు కాళికామాతలుగా రావాలి.’ అని పిలుపునిచ్చారు. కాటన్‌రాయుడు మాట్లాడేంటి? ‘ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చి చంద్రబాబు అధికారంలోకి రాగానే గజినిలా మరిచిపోయారు. ఎంతమందికి రుణమాఫీ చేశారు. ఇళ్లు కట్టించారు. ఏ జిల్లాలో చేనేత పార్కులు ఏర్పాటు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. ముడి సరుకులతో పాటు ఉత్పత్తులను అమ్ముకోవడానికి అవకాశం లేకుండా పోయింది. విదేశాల నుంచి 18మందిని తీసుకు వచ్చి వాళ్ల భోజనానికి రూ.18 లక్షలు ఖర్చు చేసిన చంద్రబాబు ఇక్కడ చేనేతలు పడుతున్న కష్టం కనపడలేదు. చేనేతలకు నేనే బ్రాండ్ అంబాసిడర్ అంటున్న పవన్ కళ్యాణ్ చేనేతల సమస్యలపై ఎందుకు స్పందించడంలేదు. కాటమరాయుడు సినిమా రిలీజ్ సందర్భంలో తాను కాటన్‌రాయుడునని పవన్ పబ్లిసిటీ చేసుకున్నారు. వైఎస్ జగన్ మాటిస్తే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాటిచ్చినట్లే. మాట తప్పరు, మడం తిప్పరు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే చేనేత సమస్యలను పరిష్కరిస్తారు.’ అని హామీ ఇచ్చారు -
‘చేనేత’ను జీఎస్టీ నుంచి మినహాయించండి
ప్రధానిని కోరిన ఎంపీ బుట్టా రేణుక సాక్షి, న్యూఢిల్లీ: చేనేత, దాని అనుబంధ రంగాలను జీఎస్టీ నుంచి మినహాయించాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం పార్లమెంటులో ప్రధానిని కలసిన రేణుక, పన్ను విధించడం వల్ల చేనేత రంగంపై పడుతున్న భారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చేనేత రంగంపై ఆధారపడి ప్రత్యక్షంగా నాలుగున్నర కోట్ల మంది, పరోక్షంగా 6 కోట్ల మంది జీవిస్తున్నారని వివరించారు. గతంలో ఎలాంటి పన్ను లేని ఈ రంగంపై పన్ను విధించడం వల్ల చేనేతకారుల జీవనోపాధికి గడ్డు పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారు. -
చేనేతపై జీఎస్టీకి నిరసనగా ఢిల్లీలో దీక్ష
న్యూఢిల్లీ: చేనేతపై వస్తు సేవల పన్ను(జీఎస్టీ) విధించడాన్ని నిరసిస్తూ ఏపీ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో చేనేత సంఘం ప్రతినిధులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మంగళవారం దీక్ష వహించారు. జీఎస్టీ అమలులో కేంద్ర ప్రభుత్వం చేనేతకు మినహాయింపు ఇవ్వాలని వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తూతిక విశ్వనాథ్ కోరారు. చేనేతపై పన్ను విధించాలన్న నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చేనేతపై పన్ను వల్ల ఏపీలో ఈ రంగంపై రూ.40 కోట్ల ఆర్థిక భారం పడుతుందన్నారు. దీనివల్ల ప్రత్యక్షంగా 3 లక్షలు, పరోక్షంగా 8 లక్షల మంది కార్మికుల జీవితాలపై ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదరణ లేక చేనేత కార్మికులు వృత్తి వదిలి అసంఘటిత రంగానికి వలస వెళ్తున్నారన్నారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు కెకె.సంజీవరావు, నక్కలమిట్ట శ్రీనివాసులు, రాజాపంతుల నాగేశ్వరరావు, బుట్టా రంగయ్య, వెంకట సాయినా«థ్ తదితరులు పాల్గొన్నారు. -
హర్షవర్థన్ రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. గండికోట ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రిని నిర్లక్ష్యం చేశారని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ శుక్రవారం వీరపునాయునిపల్లె మండలం పాయసంపల్లెలో ఆత్మహత్య చేసుకున్న హర్షవర్థన్ రెడ్డి కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. హర్షవర్థన్ రెడ్డి కుటుంబసభ్యులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గండికోట ప్రాజెక్ట్ పూర్తయి ఉంటే హర్షవర్థన్ రెడ్డి ఆత్మహత్య జరిగి ఉండేది కాదన్నారు. రైతులకు 2014 నుంచి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదని, ఇన్సురెన్స్ బకాయిలు కూడా అలాగే ఉన్నాయన్నారు. ఇప్పుడు ఇన్సురెన్స్ ఉంటే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వొద్దని చంద్రబాబు ఆదేశించారని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. త్వరలోనే వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, రైతుల కష్టాలు తీరుతాయని వైఎస్ జగన్ అన్నారు. కాగా అప్పుల బాధతో హర్షవర్థన్ రెడ్డి ఈ నెల 4వ తేదీని పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులలో ఉన్న వైఎస్ జగన్‌ను అంతకు ముందు చేనేత రంగ కార్మికులు కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో తమ గోడు వెల్లబోసుకున్నారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ... చేనేత రంగంపై జీఎస్టీతో ఆ రంగం మరింత కుదేలయ్యే ప్రమాదముందని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల ఇబ్బందుల దృష్ట్యా...జీఎస్టీ నుంచి చేనేత రంగాన్ని మినహాయించాలని కేంద్రాన్ని కోరారు. ఇదే విషయమై తక్షణమే లేఖ రాయబోతున్నామని తెలిపారు. చేనేత రంగం సంక్షేమం దృష్ట్యా...... కనీసం దీనిపై సీఎం చంద్రబాబు మాట్లాడకపోవడం దారుణమన్నారు. జీఎస్టీ కౌన్సిల్లో మంత్రి యనమల రామకృష్ణుడు మెంబర్‌గా ఉండి కూడా.... వారి సమస్యలను ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. -
చేనేతలను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం
చేనేత సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ కమిటీ చైర్మన్ కోదండరాం అనంతపురం సప్తగిరి సర్కిల్: చేనేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని చేనేత సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ కమిటీ చైర్మన్ కోదండరాం ఆరోపించారు. స్థానిక చేనేత కార్యాలయం ఎదుట బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చేనేతలను ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకుంటున్నారన్నారు. చేనేతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టలేదన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారానే చేనేతలు లబ్ధిపొందుతున్నారన్నారు. చేనేతలకు భరోసా కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామన్నారు. సిండికేట్ నగర్, ధర్మవరం, చిగిచెర్ల గ్రామస్థులు, నాగేంద్ర, సుధాకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకే దారం వంద ప్రశ్నలు
-
నేతన్నకు ఆరోగ్య బీమా!
న్యూఢిల్లీ: కార్మిక రాజ్య బీమా కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) పథకం కింద నేత కార్మికులకు(హ్యాండ్లూమ్, పవర్లూమ్) ఆరోగ్య బీమా పథకంపై ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని ద్వారా 8 కోట్ల మంది చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఈఎస్ఐసీ కింద మేలు జరగనుందని మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. నేత కార్మికులకు ఈఎస్ఐ పథకం కిందకు చేర్చాలన్న కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ రాసిన లేఖపై మంత్రి స్పందించారు.