
వరంగల్: కొత్తవాడలోని చేనేత కార్మికులు నేసే దర్రీస్(కార్పెట్లు)పై సినీ నటి, బుల్లితెర యాంకర్ అనసూయ మనసు పడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను వరంగల్‌కు చెందిన చేనేత కార్మిక సంఘాల నాయకులు చిప్ప వెంకటేశ్వర్లు తదితరులు కలిసి కొత్తవాడ దర్రీస్ చూపించారు. ప్రస్తుతం 3లక్షల కార్పెట్లు పేరుకుపోయినందున కార్మికులకు అండగా నిలబడాలని కోరా రు. కార్మికుల పనితీరు, దర్రీస్ నాణ్యతను మెచ్చుకున్న ఆమె వీటిని కొనుగోలు చేయాలని సినీ నటులు, తన స్నేహితులను కోరతానని తెలిపారు.(అనసూయకు రాచకొండ పోలీసుల అభినందన)
Comments
Please login to add a commentAdd a comment