చేనేతను విస్మరించడం సరికాదు
చేనేతను విస్మరించడం సరికాదు
Published Wed, Sep 21 2016 8:13 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
సిరిపురం (రామన్నపేట) : చేనేత పరిశ్రమను, కార్మికులను ఆదుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ చేనేత వ్యతిరేక విధానాలను అవలంబించడం ప్రభుత్వానికి సరికాదని చేనేతసహకారసంఘాల అసోసియేషన్ జిల్లాఅధ్యక్షుడు అప్పం రామేశ్వం కోరారు. చేనేతlపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈనెల 22న నల్లగొండలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాకు సంబంధించిన కరపత్రాను బుధవారం మండలంలోని సిరిపురంలో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. 2014 ఎన్నిక మేనిఫెస్టోలో ప్రభ్వుం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలుచేయలేదని ఆరోపించారు. పనికి తగిన ఆదాయం లభించక ఇప్పటివరకు 46మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతను పరిశ్రమలశాఖలో విలీనంచేసే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు రాపోలు లక్ష్మమ్మ, జెల్ల లక్ష్మినారాయణ, ఏలె నర్సింహ, కొంగరి విఠలయ్య, గుండు బాలరాజు, రాపోలు పాపయ్య, రాపోలు రమేష్, సంగిశెట్టి వెంకటమ్మ, మిర్యాల రామలింగం, రాపోలు విశ్వనాథం, కొంగరి నర్సింహ, జెల్ల శ్రీనాదం, బడుగు రమేష్‌లు ఉన్నారు.
Advertisement
Advertisement