Siripuram
-
స్వామి భూములు స్వాహా!
గంట్యాడ: దేవుడికే టీడీపీ నాయకులు శఠగోపం పెట్టేశారు. దేవుడి భూములను ఆక్రమించి ఫలసాయం పొందడంతో పాటు వాటి విక్రయాలకు తెగబడుతున్నారు. ఈ విషయం దేవదాయశాఖ అధికారులకు తెలిసినా ప్రేక్షకపాత్రకే పరిమితమవడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీమన్నార్ రాజగోపాలస్వామి ఆలయానికి అదే జిల్లా గంట్యాడ మండలం సిరిపురం గ్రామంలో 48 ఎకరాల భూమి ఉంది.విజయనగరంలోని హుకుంపేటకు చెందిన అనసపురపు జగన్నాథరావు తండ్రి రామమూర్తి పంతులు, అనసపురపు జగన్నాథ రాజగోపాలరావు తండ్రి శ్రీనివాస పంతులు శ్రీమన్నార్ రాజగోపాలస్వామివారి ధూప, దీప నైవేద్యాలు, జాతర నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం 1929లో 48 ఎకరాల భూమిని రిజిస్టర్ చేశారు.డాక్యుమెంటేషన్ 1815 పేరిట 32 ఎకరాల పల్లపు భూమి, 16 ఎకరాల మెట్ట భూమిని అప్పగించారు. ఈ భూమి సర్వే నెంబర్ 95/15, 16, 17, 19, 21, 96/1, 3, 4, 97/20, 21, 23, 99/9, 10, 11, 12, 14, 15, 100/4, 5, 8, 9, 10, 140/3, 4, 9, 11, 12, 14 తదితర నంబర్లలో విస్తరించి ఉంది. దీని విలువ రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు ఉంటుందన్నది స్థానికుల మాట. దీనిపై టీడీపీ నేతల కన్నుపడింది. అంతే.. మొత్తం భూమిని తమ గుప్పెట్లోకి లాక్కున్నారు. ఏళ్ల తరబడి అనుభవించడంతో పాటు ఇప్పుడు అధికార బలంతో విక్రయాలకు సిద్ధపడ్డారు. కొందరైతే అందులో అక్రమ కట్టడాలు సైతం తలపెట్టారు. ఇంత జరుగుతున్నా దేవదాయ శాఖాధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. ఆ రిజిస్ట్రేషన్లు చెల్లవు.. శ్రీమన్నార్ రాజగోపాలస్వామి ఆలయానికి చెందిన 48 ఎకరాల భూమి సిరిపురం గ్రామ పరిసరాల్లో ఉంది. ఈ భూములన్నీ ఆలయానికి చెందినవే. పక్కా డాక్యుమెంట్లు ఉన్నాయి. శ్రీమన్నార్ రాజగోపాలస్వామి దేవస్థానానికి చెందిన భూములన్నీ మ్యానిíసిప్ట్ డయాగ్లేట్ రిజిస్టర్ (ఎండీఆర్)లో దేవస్థానం భూములుగా నమోదై ఉన్నాయి. ఈ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు నిలిపివేశాం. అక్రమ రిజి్రస్టేషన్లు చెల్లవు. కొనుగోలు చేసేవారే బాధ్యులవుతారు. – శ్రీనివాస్, వీఆర్వో, సిరిపురం -
హంగేరీ క్రికెట్ జట్టులో రాణిస్తున్న సిరిపురం కుర్రోడు
రాజాం(విజయనగరం జిల్లా): ఆ యువకుడు చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం. రాణిస్తున్నది క్రికెట్లో. చిన్పప్పుడు నుంచి చదువులో ముందుండే కుర్రాడు.. తల్లిదండ్రులు అనుకున్నట్టే చిన్న వయస్సులోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించాడు. అక్కడితో ఆగకుండా ఊర్లోని పొలాలు, కల్లాల్లో ఆడిన క్రికెట్ ఆటపై మక్కువతో సాధన చేశాడు. శిక్షణలో రాటుదేలి హంగేరీ దేశ క్రికెట్ జట్టులో ప్రధాన ఆటగాడిగా ఎదిగాడు. యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ఆయనే.. సంతకవిటి మండలం సిరిపురం గ్రామానికి చెందిన భవానీ ప్రసాద్. చదువులో దిట్ట.. భవానీ ప్రసాద్‌ది రైతు కుటుంబం. తల్లిదండ్రులు లక్ష్మి, రాంబాబులు వ్యవసాయదారులు. భవానీప్రసాద్ 1 నుంచి 7వ తరగతి వరకూ సిరిపురంలోని శివానంద హైస్కూల్లోను, 8 నుంచి 10 తరగతులను సింహాచలం ఏపీ రెసిడెన్సియల్ స్కూల్లో పూర్తిచేశాడు. పదోతరగతిలో 490 మార్కులు సాధించాడు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని గురులకు కళాశాలలో ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసి వెయ్యికు 929 మార్కులు సాధించాడు. ఎచ్చెర్ల శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్‌ను ఐటీ విభాగంలో పూర్తిచేశాడు. చివరి సంవత్సరంలో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో కొలువు దక్కించుకున్నాడు. అక్కడ మూడేళ్లు పనిచేసిన అనంతరం టీసీఎస్‌లో టీమ్ లీడర్‌గా ఉన్నత ఉద్యోగం రావడంతో షిఫ్ట్ అయ్యాడు. కంపెనీ తరఫున హంగేరీ వెళ్లి స్థిరపడ్డాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో రాణిస్తూనే క్రికెట్‌పై దృష్టిసారించిన 30 ఏళ్ల భవానీ ప్రసాద్ ఆ దేశ జట్టులో చోటు సంపాదించాడు. బౌలర్‌గా రాణింపు.. చిన్నప్పుడు గ్రామంలో సరదాగా ఆడిన క్రికెట్.. భవానీ ప్రసాద్‌కు హంగేరీ దేశంలో విపరీతమైన క్రేజీ తెచ్చిపెట్టింది. ఉద్యోగరీత్యా హంగేరీ వెళ్లిన ఆయన అక్కడ బెంగుళూరుకు చెందిన సత్యదీప్అశ్వద్నారాయణ ఏర్పాటుచేసిన హంగేరీ కోబ్రా క్రికెట్ క్లబ్లో చేరాడు. ఆ దేశ క్రికెటర్లతో పాటు వివిధ దేశాలనుంచి వచ్చి హంగేరీలో స్థిరపడినవారంతా ఆ క్లబ్లో చేరి ప్రతిభను చాటేవారు. ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్‌ల తరహాలో కోబ్రాక్లబ్ అక్కడ జాతీయ స్థాయిలో జరిగే వివిధ క్లబ్‌లతో పోటీపడేది. ఆ పోటీల్లో 2018 నుంచి భవానీప్రసాద్ ఆడుతూ వచ్చాడు. చివరకు ఆ దేశ క్రికెట్ సెలక్షన్ కమిటీ భవానీ ప్రసాద్‌ను దేశ జట్టులోకి తీసుకుంది. 2021 నుంచి ఏడాది వ్యవధిలో హంగేరీ 11దేశాలతో ఆడిన క్రికెట్ పోటీల్లో పాల్గొన్నాడు. బల్గేరియాతో జరిగిన మ్యాచ్‌లో రెండు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ఓడిపోవాల్సిన తమ జట్టును గెలిపించాడు. దీంతో హంగేరీ టీంలో ఉత్తమ బౌలర్‌గా స్థానం దక్కించుకున్నాడు. జెర్సీ నంబర్–78తో ఆడుతున్న భవానీప్రసాద్ ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తించడంలో దిట్ట. కుటుంబ నేపథ్యం.. భవానీ ప్రసాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగికాగా, సోదరి స్వప్న, సోదరుడు అనీల్‌లు బ్యాంకు ఉద్యోగులుగా స్థిరపడ్డారు. తల్లిదండ్రులు లక్ష్మి, రాంబాబులు ఏడాది వ్యవధిలో మరణించడం వీరిలో విషాదం నింపింది. హంగేరీకి అండగా... క్రికెట్‌ను ఇష్టపడనివారు, ప్రేమించనివారు ఉండరు. అందులో నేను కూడా ఒకడ్ని. చిన్నప్పుడు పిచ్చాపాటిగా క్రికెట్ ఆడేవాడిని. హంగేరీ వచ్చిన తరువాత కోచ్ సత్యదీప్అశ్వద్నారాయణ వద్ద శిక్షణ పొందాను. ప్రతిభను గుర్తించి క్లబ్ పెట్టారు. మాకు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హంగేరీ ఐసీసీ ర్యాంకులో 54వ స్థానంలో ఉంది. ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లాలన్నది మా లక్ష్యం. మా తల్లిదండ్రులు ఆశయాలు మేరకు ఇతరులకు సాయం చేయడమే ముందున్న కర్తవ్యం. – అదపాక భవానీ ప్రసాద్, క్రీడాకారుడు -
18న లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కార ప్రదానోత్సవం
సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 18న లోక్‌నాయక్ ఫౌండేషన్ 16వ వార్షిక పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం సిరిపురం వుడా చిల్డ్రన్ థియేటర్లో జరుగుతుందని అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. ఆయన శుక్రవారం మీడియా మాట్లాడుతూ.. ఈ ఏడాది లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డుకు దూపాటి విజయ్‌కుమార్ ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, అధ్యక్షులుగా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, అత్మీయ అతిథులుగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఏవి శేషసాయి, ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు హాజరవుతారని లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. -
అండర్‌పాస్‌లతో తీరనున్న అవస్థలు
సాక్షి, రామన్నపేట: మండల పరిధిలోని పలు గ్రామాలకు వెళ్లే మార్గంలో రైల్వేలైన్ కింద నిర్మిస్తున్న అండర్‌పాస్ బ్రిడ్జిలతో ప్రయాణికుల అవస్థలు తీరనున్నాయి. ఇప్పటికే బోగారం, సిరిపురం, ఇంద్రపాలనగరం గ్రామాలకు వెళ్లేదారిలో అండర్‌పాస్‌ల నిర్మాణం పూర్తయింది. రామన్నపేట శివారులో చేపట్టిన అండర్‌పాస్ పనులు ముగింపు దశలో ఉన్నాయి. తప్పనున్న నిరీక్షణ రామన్నపేట మండలం మీదుగా సికింద్రాబాద్–నడికుడి రైలుమార్గం ఉంది. మండలంలో రామన్నపేట–సిరిపురం, బోగారం–సిరిపురం, ఇంద్రపాలనగరం–సిరిపురం, ఇంద్రపాలనగరం–వెల్లంకి, రామన్నపేట–కొమ్మాయిగూడెం గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గంలో రైల్వే ట్రాక్ ఉంది. ఈ మార్గంలో సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు పదుల సంఖ్యలో నడుస్తుంటాయి. అయితే ఈ క్రమంలో పగటిపూట పదిహేను సార్లకుపైగా గేట్ వేయవలసి వస్తోంది. ఈ మార్గంలో ద్విచ్రక వాహనదారులతో పాటు బస్సులో ప్రయాణించే ప్రయాణికులు గేట్ పడినప్పుడల్లా పది నిమిషాలకుపైగా నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో అత్యవసర పనిమీద వెళ్లేవారు, స్కూలు విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తొలగనున్న ఇబ్బందులు రైల్వే శాఖ వారు గత ఆర్థిక సంవత్సరంలో మండల పరిధిలోని ఇంద్రపాలనగరం–వెల్లంకి గ్రామాల మధ్య అండర్‌పాస్ నిర్మించి వినియోగంలోకి తీసుకువచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బోగారం–సిరిపురం, రామన్నపేట–సిరిపురం గ్రామాల మధ్య అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టారు. బోగారం–సిరిపురం గ్రామాల మధ్య బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. సిరిపురం–రామన్నపేట మధ్య పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఈ అండర్‌పాస్‌లు వినియోగంలోకి వస్తే వాహనదారులు నిరీక్షించే బాధ తప్పుతుంది. రైల్వే శాఖ వారు అండర్‌పాస్ బ్రిడ్జిల నిర్మాణంతో తమ కష్టాలు తప్పనున్నాయని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో నీరు నిల్వకుండా చూడాలి అండర్‌పాస్ నిర్మాణం వల్ల నిరీక్షించే బాధ తప్పింది. ముఖ్యంగా రైతులకు సౌకర్యవంతంగా ఉంది. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చేయాలి. రాత్రిపూట ప్రమాదాలు జరుగకుండా లైట్లు ఏర్పాటు చేయాలి. కార్నర్ వద్ద రెడ్‌లైట్లు ఏర్పాటు చేయాలి. – గోగు హరిప్రసాద్ -
ఒకే దారం వంద ప్రశ్నలు
-
తాడిచెట్టు పడి వ్యక్తి దుర్మరణం
బాధ్యులు, బాధితుల మధ్య వాగ్వాదం పరిస్థితి ఉద్రిక్తం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు డిమాండ్ పోలీసుల హామీతో పరిస్థితి ప్రశాంతం సిరిపురం(కరప) : కరప మండలంలోని సిరిపురం సమీపంలో ఒకరైతు పొలంలో కొడుతున్న తాడిచెట్టు అటుగా రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని బంధువులు, వేళంగి, సిరిపురం గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో పరిíస్థితి ఉద్రిక్తతగా మారి పోలీసుల జోక్యంతో సమస్య సమసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండలం వేళంగి గ్రామానికి చెందిన మెర్ల రాజేంద్రప్రసాద్ పొలంలో బుధవారం రోడ్డుపక్క ఉండే తాడిచెట్లు కొట్టిస్తున్నారు. అదే సమయంలో సిరిపురంలోని అత్తవారింటికి వెళ్తున్న వేళంగికి చెందిన చెరువు దుర్గాప్రసాద్(26)పై చెట్టు పడి అతడు దుర్మరణం పాలయ్యాడు. దుర్గాప్రసాద్ తండ్రి సత్యనారాయణ, బాబాయ్ బదిరెడ్డి వెంకన్న తదితర బంధువులు, వేళంగి, సిరిపురం గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో రైతు, చెట్లు కొడుతున్న కూలీలతో వాగ్వాదం జరిగి అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. కరప ఎస్సై మెల్లం జానకీరాం కాకినాడరూరల్ సీఐ పవన్ కిశోర్‌కు సమాచారం అందించారు. అనుమతిలేకుండా ప్రభుత్వ స్ధలంలోని చెట్లుకొట్టడమేకాకుండా, ఒకమనిషి ప్రాణం పోగొడతారా అంటూ గొడవకు దిగారు. ఒకసమయంలో రైతు రాజేంద్రప్రసాద్‌పై ప్రజలు తిరగబడటంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. కాకినాడ రూరల్, కాకినాడటౌన్ సీఐలు పవన్ కిశోర్, ఎ.సన్యాసిరావు నలుగురు ఎస్సైలు, పదిమంది పోలీసులు బందోబస్తుగా ఉండటంతో గొడవ సద్దుమణిగింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి : కురసాల కాగా ఈ కేసును తారుమారుచేసే ప్రయత్నం జరుగుతోందని పార్టీకార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా్లఅధ్యక్షుడు, మాజీఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు సమాచారం అందించారు. కన్నబాబు స్పందించి హుటాహుటిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకుని బాధ్యతారాహిత్యంగా చెట్లు నరికించడం వల్లే ఒకనిండుప్రాణం బలితీసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దుర్గాప్రసాద్‌కు ఆరునెలల క్రితం వివాహం కావడం, భార్య చాముండేశ్వరి మూడు నెలల గర్భిణి కావడం బాధాకరమైన విషయమన్నారు. కాకినాడ రూరల్ సీఐ పవన్ కిశోర్, స్థానిక నాయకులతో కన్నబాబు చర్చించి, బాధిత కుటుంబానికి న్యాయంజరిగేలా చూడాలన్నారు. పోలీసులు ఆ మేరకు హామీ ఇవ్వడంతో పరిస్థితి ప్రశాంతంగా మారింది. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రోడ్డువద్ద ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంవల్లే ప్రమాదం జరిగినట్టు సీఐ పవన్ కిశోర్ తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశామన్నారు. కరప ఎస్సై జానకిరాం కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సిరిపురంలో షూటింగ్ సందడి
సిరిపురం(కరప) : ఈస్ట్‌వెస్ట్ ఎంటర్టైనర్స్ పతాకంపై నిర్మిస్తున్న ’మామా..ఓ చందమామా’ సినిమా షూటింగ్ గురువారం సిరిపురంలో జరిగింది. షూటింగ్‌ను చూసేందుకు సిరిపురం పరిసర గ్రామాల ప్రజలు తరలిరావడంతో ఆ ప్రాంతం సందడిగా కనిపించింది. ‘దృశ్య కావ్యం, షో టైం, ఇద్దరి మధ్య’ తో పా టు 18 సినిమాల్లో హీరోగా న టించిన సాయిరామ్ కార్తీక్, ‘దిక్కులు చూడకు రామయ్యా’లో హీరోయి¯ŒSగా నటిం చిన సనా మక్బుల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ సి రిపురంలో చిక్కాల దొరబాబు చెరువులవద్ద కొన్ని దృశ్యాలు చిత్రీకరిస్తున్నామన్నారు. ఇంతవరకూ 30 శాతం పూర్తయిందని, ఫిబ్రవరిలో విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. న్ -
నలుగురు జలసమాధి
ఆ తల్లిదండ్రులు బిడ్డలను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. తమ సర్వస్వం వారే అన్నట్లు బతికారు. ఇద్దరు ఆడపిల్లలు.. ఒక కుమారుడు. పీర్ల పండుగకు సంతోషంగా గడిపేందుకు నల్గొండ జిల్లా నడిగూడెం మండలం సిరిపురంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. విధి విషం చిమ్మినవేళ అక్కడ ముగ్గురు ప్రమాదవశాత్తూ కాలువలో పడి జలసమాధి అయ్యారు. వారితో పాటు మరో చిన్నారి మృత్యుఒడికి చేరాడు. ఈ ఘటన వత్సవాయి మండలం దేచుపాలెం గ్రామానికి చెందిన షేక్ చిన్నసైదులు కుటుంబంలో తీరని వేదన మిగిల్చింది. దేచుపాలెం (వత్సవాయి) : ముగ్గురు బిడ్డలూ మృత్యుఒడికి చేరడంతో తమకు దిక్కెవరంటూ దేచుపాలెం గ్రామానికి చెందిన షేక్ చిన్నసైదులు, ఫకీరాబీ దంపతులు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె సిద్దాబీ (20), అస్నాబీ (14), ముస్తఫా (10). ఈ ఏడాది మే నెలలో పెద్ద కుమార్తె సిద్దాబీకి వివాహం చేశారు. చిన్న కుమార్తె అస్నాబీ మంగ్లొలులోని జెడ్పీ పాఠశాలలో తొమ్మిదో తరగతి, కుమారుడు ముస్తఫా గ్రామంలోనే మూడో తరగతి చదువుతున్నారు. చిన్నసైదులు గొర్రెల కాపరిగా పనిచేస్తుండగా, ఫకీరాబీ కూలి పనులకు వెళుతుంది. పీర్ల పండుగకని అమ్మమ్మ గ్రామమైన నల్గొండ జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి ఆదివారం వీరు ముగ్గురు వెళ్లారు. మంగళవారం ఉదయాన్నే బట్టలు ఉతికేందుకు గ్రామ సమీపంలోనే ఉన్న నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్దకు సిద్దాబీ బయలుదేరగా, ఆమెతో పాటు అస్నాబీ, ముస్తపా, వాళ్లకు తమ్ముడు వరసయ్యే ఖమ్మం అర్బన్ మండలం శ్రీనివాసనగర్‌కు చెందిన షేక్ రియాజ్ కూడా వెళ్లాడు. సిద్దాబీ బట్టలు ఉతుకుతుండగా ముస్తపా, రియాజ్ కాలకృత్యాలు తీర్చుకుని వచ్చి, కలిసి కాలువ ఒడ్డు వద్ద దిగారు. అక్కడ పాచిపట్టి ఉండడంతో ఇద్దరికీ కాలు జారి కాలువలో లోతుకు వెళ్లిపోయారు. గమనించిన అస్నాబీ తమ్ముళ్లను కాపాడే ప్రయత్నంలో కాలువలో పడింది. ముగ్గురూ కాలువలో పడి కొట్టుకుపోవడాన్ని చూసిన సిద్దాబీ వారిని కాపాడే ప్రయత్నంలో కాలువలో పడి మునిగిపోయింది. దీంతో నలుగురూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. స్థానికులు మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం కోసం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన తరువాత మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మృతుల కుటుంబ సభ్యులకు ఉదయభాను, రాజగోపాల్ పరామర్శ.. మృతుల కుటుంబ సభ్యులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు మంగళవారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును బంధువులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. -
సిరిపురంలో విషాదం
నల్గొండ : నల్గొండ జిల్లా నడిగూడ మండలం సిరిపురంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఉతికేందుకు నలుగురు చెరువులోకి దిగారు. అయితే వారు దిగిన ప్రాంతం లోతుగా ఉండటంతో నీట మునిగి మరణించారు. ఆ విషయాన్ని గ్రామస్తులు గుర్తించి... వారి మృతదేహాలను చెరువు నుంచి బయటకు తీశారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులతోపాటు ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దరాప్తు చేస్తున్నారు. -
చేనేతను విస్మరించడం సరికాదు
సిరిపురం (రామన్నపేట) : చేనేత పరిశ్రమను, కార్మికులను ఆదుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ చేనేత వ్యతిరేక విధానాలను అవలంబించడం ప్రభుత్వానికి సరికాదని చేనేతసహకారసంఘాల అసోసియేషన్ జిల్లాఅధ్యక్షుడు అప్పం రామేశ్వం కోరారు. చేనేతlపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈనెల 22న నల్లగొండలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాకు సంబంధించిన కరపత్రాను బుధవారం మండలంలోని సిరిపురంలో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. 2014 ఎన్నిక మేనిఫెస్టోలో ప్రభ్వుం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలుచేయలేదని ఆరోపించారు. పనికి తగిన ఆదాయం లభించక ఇప్పటివరకు 46మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతను పరిశ్రమలశాఖలో విలీనంచేసే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు రాపోలు లక్ష్మమ్మ, జెల్ల లక్ష్మినారాయణ, ఏలె నర్సింహ, కొంగరి విఠలయ్య, గుండు బాలరాజు, రాపోలు పాపయ్య, రాపోలు రమేష్, సంగిశెట్టి వెంకటమ్మ, మిర్యాల రామలింగం, రాపోలు విశ్వనాథం, కొంగరి నర్సింహ, జెల్ల శ్రీనాదం, బడుగు రమేష్‌లు ఉన్నారు. -
సిరిపురంలో విషజ్వరాలు
సిరిపురం (నడిగూడెం) : మండలంలోని సిరిపురం బుడిగజంగాల కాలనీకి చెందిన ప్రజలు 10 రోజులుగా విషజ్వరాలతో బాధపడుతున్నారు. ఆ కాలనీలోని పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో చిన్నారులు, పెద్దలు దాదాపు 15 మందికిపై విషజ్వరాల బారిన పడినా పట్టించుకునే నాథులే లేకుండా పోయారు. దీంతో ఆ కాలనీ వాసులు గ్రామీణ వైద్యులను సంప్రదిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబందిత అధికారులు స్పందించి కాలనీలో వైద్యశిబిరం నిర్వహించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. -
విశాఖలో గోడ కూలి నలుగురి దుర్మరణం
-
విశాఖలో గోడ కూలి నలుగురి దుర్మరణం
విశాఖ: భారీ వర్షంతో పాటు, చిన్నపాటి నిర్లక్ష్యం నలుగురి ప్రాణాలు బలిగొన్నాయి. విశాఖ సిరిపురం టైకూన్ హోటల్ సమీపంలో గురువారం ఉదయం ప్రహరీ గోడ కూలి నలుగురు మృతి చెందారు. శిథిలాల కింద మరొకరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. గతరాత్రి భారీ వర్షం కురవటంతో గోడ కుప్పకూలినట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు ఉదయం పది గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అపార్ట్మెంట్ నిర్మాణ పనుల్లో భాగంగా ప్రహరి గోడకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేపడటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పది అడుగుల లోతు ఉన్న...గుంతలో అయిదుగురు కార్మికులు పని చేస్తుండగా...ఒక్కసారిగా ప్రహరీ గోడ కూలింది. ఇప్పటివరకూ నాలుగు మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు. మృతులను కృష్ణ, రాము, పరదేష్, సోమేష్ గా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు ఒడిశా వాసులు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
సిరిపురపు రాము కుటుంబంతో...
దత్తిరాజేరు మండలం కె.కృష్ణాపురానికి చెందిన సిరిపురపు రాము చెన్నై ఘటనలో మృతి చెందారు. ఆయన భార్యాపిల్లలు అనాథలయ్యారు. ఆ కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించి ఓదార్చారు. వివరాలు అడిగితెలుసుకున్నారు. ఆ సంభాషణ ఇలా సాగింది. జగన్: తల్లీ నీ పేరేంటి? బాధితురాలు: నా పేరు లక్ష్మి అండి. జగన్:ఎంతమంది పిల్లలమ్మా నీకు? బాధితురాలు: ఇద్దరు పిల్లలు. జగన్: అక్కడ ఎంత కూలి ఇచ్చేవారు? బాధితురాలు: నాకు తెలీదండి. అంతా ఆయనే చూసుకొనేవారు. జగన్: తమిళనాడు ప్రభుత్వం మీకు ఏమైనా సాయం చేసిందా? బాధితురాలు: నాకు తెలీదండి. జగన్: తమిళనాడు బిల్డర్ మీతో ఏమైనా మాట్లాడారా? బాధితురాలు:మాతో ఎవరూ మాట్లాడలేదండి. జగన్: కోర్టులో కేసు వేయండి వాళ్లే రాజీకి వస్తారు. మీకు డబ్బులు ఇస్తారుగా. బాధితురాలు:నాకు ఏటీ తెలీదు సారూ. జగన్: అక్కడ మన తెలుగు ఎంపీలు ఉన్నారు. వారి ద్వారా మీకు న్యాయం జరిగే విధంగా చూస్తాను. బాధితురాలు: అంతా మీ దయండి. జగన్: పిల్లలను బాగా చదివించు తల్లి. (అంటూ పిల్లలు వేదశ్రీ, ఐశ్వర్యలను పలకరించారు). బాధితురాలు: అలాగేనండి. బాగా చదివించుకుంటానండి.