
సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 18న లోక్‌నాయక్ ఫౌండేషన్ 16వ వార్షిక పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం సిరిపురం వుడా చిల్డ్రన్ థియేటర్‌లో జరుగుతుందని అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. ఆయన శుక్రవారం మీడియా మాట్లాడుతూ.. ఈ ఏడాది లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డుకు దూపాటి విజయ్‌కుమార్ ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, అధ్యక్షులుగా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, అత్మీయ అతిథులుగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఏవి శేషసాయి, ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు హాజరవుతారని లక్ష్మీప్రసాద్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment