Yarlagadda Lakshmi Prasad
-
యండమూరి చేతుల్లో మెగాస్టార్ జీవిత చరిత్ర
మెగాస్టార్ చిరంజీవి జీవిత చరిత్రను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్కు అప్పగించారు చిరంజీవి. ఈ విషయాన్ని వైజాగ్‌లోని లోకనాయక్ ఫౌండేషన్ నిర్వహించిన ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఎఎన్ఆర్ శత జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న చిరంజీవి ఈ ప్రకటన చేశారు. లోకనాయక్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో యండమూరితో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులకు అవార్డులు అందించారు ఫౌండేషన్ ప్రతినిధి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఎన్టీఆర్, ఎఎన్ఆర్ల గురించి ప్రశంసాపూర్వక ప్రసంగం చేసిన చిరంజీవి తన బయోగ్రఫీ గురించి మాట్లాడుతూ.. తన బయోగ్రఫీ రాసేంత సమయం తనకు లేదని.. నా బయోగ్రఫీ రాసే సామర్ధ్యం ఒక్క యండమూరికి మాత్రమే ఉందని.. అందుకే ఆ బాద్యతను యండమూరికి అప్పగిస్తున్నాను అని అన్నారు. సమకాలీన రచయితల్లో యండమూరికి సాటి మరెవరూ లేరు. తెలుగులో ఉన్న ఏకైక స్టార్ రచయిత ఎవరన్నా ఉన్నారా అంటే అది యండమూరి మాత్రమే. అలాంటి గొప్ప రచయిత ఈ రోజు నా బయోగ్రఫీ రాస్తాను అనడం నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఆయన రాసిన అభిలాష చిత్రంతోనే సినీ పరిశ్రమలో నా స్థానం పధిలమని అప్పుడే నిర్ణయించుకున్నాను అంటూ యండమూరిపై ప్రశంసల వర్షం కురిపించారు చిరంజీవి. -
ఆ ఇద్దరూ నాకు దైవసమానులు: చిరంజీవి
నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు నాకు దైవసమానులు, వారితో కలిసి పని చేయడం అదృష్టం అంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్నార్ శతజయంతి సందర్భంగా విశాపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య పురస్కారం, జీవన సాఫల్య పురస్కారాల అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి చిరంజీవి, సీనియర్ హైకోర్టు న్యాయమూర్తి ఆకుల శేష సాయి, వైఎస్సార్సీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎన్నో మంచి సలహాలిచ్చారు ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తనకు చిరకాల మిత్రుడని, అందరినీ ఆకట్టుకునే తత్వం తనదని తెలిపారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనడం ఒక మంచి అవకాశమన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ సినీపరిశ్రమకు రెండు కళ్లువంటి వారని వీరిద్దరూ తనకు జీవితంలో ఎన్నో మంచి సలహాలు ఇచ్చారని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి శేషసాయి మాట్లాడుతూ.. 'యండమూరి వీరేంద్రనాథ్ నవలల వల్ల యువతకు ఆలోచన, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. ఈ సాహిత్య సభకు పెద్ద ఎత్తున ప్రజలు రావడం సంతోషం. సాహిత్య కారులతో పులకించిన నేల ఉత్తరాంధ్ర.. తెలుగు జాతికి నిలువెత్తు నిదర్శనం ఎన్టీఆర్, ఏఎన్నార్' అని చెప్పుకొచ్చారు. నిజమైన వారసుడు చిరంజీవి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. 'లోక్ నాయక్ ఫౌండేషన్ కార్యక్రమంలో చిరంజీవితో కలిసి పాల్గొనడం సంతోషంగా ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్‌కు నిజమైన వారసుడు చిరంజీవి. చిరంజీవి తెలుగు సినిమాకు ఎంతో పేరు ప్రఖ్యతలు తెచ్చారు. చిరంజీవి కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకున్నారు' అని వ్యాఖ్యానించారు. చదవండి: ప్రియుడితో ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్.. ఫిబ్రవరిలోనే పెళ్లి! -
లోకేష్ బ్రాహ్మణి పెళ్ళికి ముందు చంద్రబాబు చేసిన కామెంట్స్
-
ఆరోజు బ్రాహ్మణి గురించి అడిగితే చంద్రబాబు ఛీఛీ అన్నాడు..
-
ANR 100th Birthday Celebrations: నాగేశ్వరరావుగారు నట విశ్వవిద్యాలయం
‘‘తెలుగు సినీ రంగానికి ఎన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్లు అని ఎప్పుడూ చెబుతుంటాను. తన జీవితాన్ని ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకోవడం నాగేశ్వరరావుగారిలోని గొప్పతనం. అమరశిల్పి జక్కన్న, విప్రనారాయణ, తెనాలి రామకృష్ణ, మహా కవి కాళిదాసు.. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎలాంటి సినిమాలో అయినా ఒదిగి΄ోయేవారు. నాగేశ్వరరావుగారు ఒక పెద్ద నటనా విశ్వ విద్యాలయం. ఈ రోజు పరిశ్రమలోకి వచ్చిన ప్రతిఒక్కరూ ఆ విశ్వ విద్యాలయంలో విద్యార్థిననుకుని, ఆ గుణగణాలను అందిపుచ్చుకుంటే భవిష్యత్‌కు మంచి ప్రణాళికలు వేసుకున్నట్లవుతుంది’’ అన్నారు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. బుధవారం (సెప్టెంబరు 20) ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరావుగారు మహానటులు.. మహా మనిషి. సినిమా రంగంలో విలువలు పాటించిన వ్యక్తి నాగేశ్వరరావుగారు. అవతలివాళ్లు నేర్చుకోదగ్గ కొన్ని మంచి సంప్రదాయాలు, విలువల్లో ఆయన జీవించి, నటించి మనకు చూపించారు. ఆ మార్గంలో ప్రయాణిస్తే అదే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి. నాగేశ్వరరావుగారు పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి, జీవిత చరమాంకంలోనూ నటిస్తూనే ఉన్నారు. కొంతమంది జీవిత కాలంలో జీవిస్తారు. జీవిత కాలం పూర్తయిన తర్వాత కూడా జీవించే మహానుభావులు కొందరు. వారిలో అక్కినేని నాగేశ్వరరావుగారు అగ్రగణ్యులు. ఆయన మంచి నటులే కాదు.. పరిణతి చెందిన గొప్ప ఆశావాది కూడా. ఆయన నాస్తికుడు. గొప్ప తాత్త్వికుడు. ఆయన పెద్దగా చదువుకోలేదని అంటారు. కానీ జీవితాలను చదివారు. జీవితంలో ఆయన ΄ోరాటం చేశారు.. జీవితాన్ని ప్రేమించారు.. ఆస్వాదించారు. జీవితంలో నేర్చుకున్నదాన్ని ఆచరణలో పెట్టి చూపించారు’’ అని అన్నారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘1950 సమయంలో నాగేశ్వరరావుగారు సినిమాల్లో నటించడంప్రారంభించాక, సొంతిల్లు కట్టుకోవడానికి ముందే మద్రాస్ విశ్వ విద్యాలయానికి పాతికవేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పాతిక వేలు ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయానికి కూడా పాతిక వేలు విరాళం ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తైతే.. 1959లోలక్ష రూపాయల విరాళం ఇచ్చి గుడివాడ కళాశాలను నిలబెట్టారు. నాలాంటివారు ఎందరో చదువుకోగలిగారు. ఆ విధంగా ఆప్రాంతంలో సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఓ విప్లవానికి ఆయన నాంది పలికారు’’ అన్నారు. డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ – ‘‘అక్కినేని నాగేశ్వరరావుగారి కష్టం, కళల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ ఆయన్ను ఓ లెజెండ్‌ని చేశాయి. యువ నటీనటులకు నాగార్జునగారు స్ఫూర్తి అని నా ఫ్రెండ్స్ సర్కిల్స్‌లో చెబుతుంటారు. నాగార్జునగారేమో తన తండ్రి చూపించిన మార్గంలో నడిచానని చెబుతుంటారు’’ అన్నారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఎవరి విగ్రహాన్ని అయినా చూస్తే.. ఆయన ఓ మహానుభావుడు... ఆయన మనతో లేరనే భావన నా మనసులో చిన్నతనం నుంచే ముద్రపడింది. ఏ విగ్రహం చూసినా నాకు అదే అనిపించేది. అందుకే వెంకయ్యనాయుడుగారు ఆవిష్కరించేంతవరకూ నేను నాన్నగారి విగ్రహాన్ని చూడలేదు. చూడబుద్ధి కాలేదు. ఎందుకంటే నాన్నగారు మాతో లేరనే విషయాన్ని అంగీకరించాల్సి వస్తుందేమోనని... శిల్పి వినీత్ ఈ విగ్రహాన్ని అద్భుతంగా చెక్కాడు. నాన్నగారు అద్భుతమైన జీవితాన్ని జీవించారు. తరతరాలుగా గుర్తుపెట్టుకునే పాత్రలు చేసిన నటుడు. కోట్లమంది తెలుగు ప్రజలు, అభిమానులు ప్రేమించిన వ్యక్తి.. ఇలా వివిధ రకాలుగా నాన్నగారు అందరికీ తెలుసు. మాకు మాత్రం నాన్నగారు మా గుండెలను ప్రేమతో నింపిన వ్యక్తి. నన్ను, నా తోబుట్టువులను, మా పిల్లలను.. అందర్నీ చల్లగా చూసిన వ్యక్తి. మాకు మనసు బాగున్నా, బాగోలేకున్నా నాన్నగారి దగ్గరికి వెళ్లి కూర్చుంటే చాలు అన్నీ సర్దుకునేవి. అన్నపూర్ణ స్టూడియోస్ నాన్నగారికి నచ్చిన స్థలం. నచ్చిన చోట విగ్రహం పెడితేప్రాణ ప్రతిష్ఠ చేసినట్లు అంటారు. సో.. ఆయన ప్రాణంతో మా దగ్గరే ఉన్నారని,ప్రాణంతో మా మధ్యనే నడుస్తున్నారని అనుకుంటున్నాము. నా ఆలోచనల్లోనే కాదు.. ప్రతి ఒక్కరి ఆలోచనల్లో నాన్నగారు ఎప్పటికీ జీవించే ఉంటారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినవారికి, ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన నాన్నగారి అభిమానులకు ధన్యవాదాలు’’ అన్నారు. ఏయన్నార్ పెద్ద కుమారుడు వెంకట్ అక్కినేని మాట్లాడుతూ– ‘‘మనిషి ఎంత కీర్తి సంపాదించినా, ఎంత ధనం గడించినా తలగడ మీద తల పెట్టగానే నిద్ర΄ోవడం అనే ఆస్తి, సౌకర్యం ఏ ధనం ఇవ్వలేదు. ఏయన్నార్‌గారు తలగడ మీద తల పెట్టగానే హాయిగా నిద్ర΄ోయేవారు. 1974లో బైపాస్ సర్జరీ జరిగింది. సర్జరీ ముందు రోజు నర్సు నిద్రకోసం మాత్ర ఇస్తే తీసుకోలేదు. ఏ మాత్ర వేసుకోకుండానే హాయిగా నిద్ర΄ోయారు. ఆ తర్వాత ఆయన జీవితం అందరికీ తెలిసిందే. నాకు మరుజన్మ అంటూ ఉంటే ఆయన సన్నిధిలోనే ఉండాలనుకుంటున్నాను. అన్నపూర్ణ సంస్థ, ఏయన్నార్ ఫిల్మ్ స్కూల్, కాలేజీ, ఆయన చిత్రాలు, ఫ్యాన్స్ తీపి గుర్తులు’’ అన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరావు గారు ఒక గ్రంథం. ఆయన ‘మరపురాని మనుషులు’ సినిమాకు అసోసియేట్‌గా చేశాను. అన్నపూర్ణ సంస్థలో ఎన్నో సినిమాల్లో నటించాను’’ అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘రైతు కుటుంబంలో పుట్టి అద్భుతమైన స్థితికి చేరుకున్న వ్యక్తి నాగేశ్వరరావుగారు. మహానట వృక్షం. కళాకారులకు గొప్ప వరం. స్వయంశిల్పి. స్నేహశీలి. అద్భుతమైన క్రమశిక్షణ కలిగిన వ్యక్తి’’ అన్నారు. ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘ఓ వేడుకలో నాగేశ్వరరావుగారితో మాట్లాడే అవకాశం లభించింది. స్టార్ అయిన మీరు ‘మిస్సమ్మ’ సినిమాలో కమెడియన్‌గా ఎందుకు చేశారు? అని ఆయన్ను అడిగాను. ‘దేవదాసు’ తర్వాత అన్నీ తాగుబోతు పాత్రలే వస్తున్నాయని, ఇమేజ్ మార్చుకోక΄ోతే ఇబ్బందవుతుందేమోనని, ఆ పాత్రను తానే అడిగి మరీ చేశానని చె΄్పారు. నాగేశ్వరరావుగారికి ఆయనపై ఆయనకు ఉన్న నమ్మకానికి నమస్కారం చేయాలనిపించింది’’ అన్నారు. జయసుధ మాట్లాడుతూ– ‘‘నాగేశ్వరరావుగారితో ఎక్కువ సినిమాలు చేయడం నా అదృష్టం. క్రమశిక్షణతో పాటు ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు. ఏయన్నార్ కుమార్తె నాగ సుశీల మాట్లాడుతూ– ‘‘అందరికీ పండగలు ఉంటాయి. కానీ మా అక్కినేని అభిమానులకు నాన్నగారి జయంతే పండగ. అభిమానుల ్ర΄ోత్సాహం వల్లే ఈ కార్యక్రమం సాధ్యమైంది. అమ్మానాన్నలు మేం ఎప్పుడూ కలిసే ఉండాలని కోరుకునేవారు. అలా మేమందరం కలిసే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేశాం’’ అన్నారు. సుశాంత్ మాట్లాడుతూ– ‘‘తాతగారు తన జీవితంలో కృతజ్ఞతకు విలువ ఇచ్చేవారు. ఇండస్ట్రీలో తారా స్థాయికి ఎదిగిన ఆయనకు కళామతల్లికి తిరిగి ఇవ్వాలని ఉండేది. అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్, ఏయన్నార్ నేషనల్ అవార్డు, అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా.. ఇలా ఎన్నో ఆయన కృతజ్ఞతలోంచి వచ్చిన ఆలోచనలే’’ అన్నారు. ‘‘నాగేశ్వరరావుగారి విగ్రహం పనులను నాకు అప్పగించిన అక్కినేని కుటుంబ సభ్యులకు ధన్య వాదాలు. దాదాపు ఐదున్నర నెలలు వర్క్ చేశాం’’ అన్నారు విగ్రహ రూపకర్త వినేష్ విజయన్. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఏయన్నార్గారంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ పెద్ద, ఓ గొప్ప నటుడు, క్లాసిక్ ఐకాన్‌గా పరిచయం. ఆయన చిత్రాలు, ఆయన చేసిన ప్రయోగాలు ప్రేరణ కలిగించే కేస్ స్టడీగా చాలా మంది ఫిల్మ్ స్కూల్స్‌లో చదువుతుంటారు. ఈ జాబితాలో నేనూ ఉన్నాను. తాతగారితో నేను కలిసి నటించడం నా అదృష్టం. మన పుట్టుక మన చేతిలో ఉండదు. అలాంటిది అక్కినేని నాగేశ్వరరావుగారి మనవడిగా పుట్టడం నా అదృష్టం’’ అని అన్నారు. తాత ఏయన్నార్‌కు అఖిల్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అమల, సుప్రియ, సుమంత్.. ఇలా అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, శ్రీకాంత్, మంచు విష్ణు, నాని, నాజర్, అనుపమ్ ఖేర్, అల్లు అరవింద్, అశ్వినీదత్, సి. కల్యాణ్, కేఎల్ నారాయణ, ‘దిల్’ రాజు, చినబాబు, నాగవంశీ, బి. గోపాల్, వైవీఎస్ చౌదరి, పి. కిరణ్, గుణ్ణం గంగరాజు, విజయ చాముండేశ్వరి తదితరులు పాల్గొని, అక్కినేని నాగేశ్వరరావుకి నివాళులు అర్పించారు. -
సీఎం జగన్ హీరో : యార్లగడ్డ
-
సీఎం జగన్ నా దృష్టిలో హీరో: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నా దృష్టిలో హీరో అని మాజీ రాజ్యసభ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. దివంగత రాజశేఖర్‌రెడ్డి సంస్కారవంతుడు కాబట్టే తెలుగు గంగ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టారని తెలిపారు. సోనియా గాంధీ కేంద్ర మంత్రిని చేస్తానన్నప్పటికీ జగన్ ఓదార్పు యాత్ర చేసి ఎన్నికలకు వెళ్లారని గుర్తు చేశారు. 'నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ 151 సీట్లు సాధించిన జగన్‌ను నేను ఎందుకు తిట్టాలి?. జగన్‌ను తిట్టి వేరే పార్టీ వాళ్లను పొగడాలా?. ఆయన సీఎం అయ్యాక నన్ను గౌరవించారు. అడగకుండానే చైర్మన్‌ను చేశారు. జగన్ కచ్చితంగా హీరోనే. ఆనాడు ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే, అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. బాబు హయాంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు ఎన్టీఆర్ పేరేందుకు పెట్టలేదు?' అని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రశ్నించారు. 'నా రాజీనామా విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. నేను స్వరం మార్చలేదు. నాపై విమర్శలు చేసే వారికి ఫోన్ల ద్వారా వివరణ ఇస్తున్నా. యూనివర్శిటీ పేరు మార్పుపై లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు తన సొంత అభిప్రాయం' అని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. చదవండి: (విభజన చట్టం అమలుపై కేంద్ర హోం శాఖ సమావేశం) -
Telugu Language Day: భాషా భేషజాలపై పిడుగు!
మహనీయులు ఈ లోకంలో గొప్ప కార్యాన్ని సాధించడం కోసమే పుడతారు. అలాంటి వారినే ‘కారణ జన్ములు’ అంటారు. గిడుగు ఆ కోవలోకే వస్తారు. తన జీవితాన్ని భాషా ఉద్యమాల కోసం వెచ్చించిన కార్యశూరుడు గిడుగు. ఆయన తొలి తెలుగు ఆధునిక భాషావేత్త, అంతర్జాతీయ భాషా శాస్త్రవేత్త కూడా. 1863 ఆగస్టు 29వ తేదీన శ్రీముఖలింగం సమీపాన పర్వతాలపేట గ్రామంలో గిడుగు జన్మించారు. విజయనగరం మహారాజా వారి కళాశాలలో లోయర్ ఫోర్తు ఫారంలో చేరారు. అదే తరగతిలో గురజాడ అప్పారావుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే జీవితాంతం మంచి స్నేహితులుగా ఇద్దరూ కలసి మెలిగారు. ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1889లో సవరజాతి వారితో గిడుగుకు పరిచయం ఏర్పడింది. సవరుల చరిత్ర, సంస్కృతి, భాష మీద గిడుగుకు అమితమైన ఆసక్తి కలిగింది. అందువల్ల సవరల భాషపై ప్రత్యేకంగా విశేషమైన కృషి చేశారు. 1893 జనవరి 15వ తేదీన గిడుగు శ్రీముఖలింగ క్షేత్రానికి వెళ్ళారు. 22 శాసనాల్ని నిశితంగా పరిశోధించారు. ప్రభుత్వం కూడా గిడుగు శాసన పరిశోధనలను గుర్తించింది. 1894లో గిడుగు ‘వయోజన విద్య’ను ప్రారంభించారు. ఉద్యోగ విరమణ తర్వాత ఎక్కువగా భాషా సాహిత్యాల పరిశోధన వైపు మళ్లారు. గిడుగు పెద్ద కొడుకు సీతాపతి ఆయనకు సహాయ సహకారాలు అందించారు. గిడుగు వారికి ఎంతోమంది శిష్యులు ఉన్నారు. తాపీ ధర్మారావు, చిలుకూరి నారాయణరావు లాంటివారు ఆయన శిష్యులే. 1910 తర్వాత గిడుగు పూర్తిగా భాషాపరిశోధనలో నిమగ్నమయ్యారు. 1911లో సవర భాషపై అనితర సాధ్యమైన, విశేషమైన కృషిచేసినందుకుగాను ఆయనకు ప్రభుత్వం ‘మెరిట్ సర్టిఫికెట్’ బహూకరించింది. వ్యావహారిక భాషోద్యమానికి గిడుగు సారథ్యం వహించారు. ఊరూరా సభలు, సమావేశాలు జరిపించి ప్రజల్లో చైతన్యం కలుగజేశారు. అందరి తోనూ చర్చలు జరిపారు. 1916లో కొవ్వూరులో గిడుగు ఉపన్యాసాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు విని ప్రభావితులయ్యారు. గిడుగు ఆ విషయం తెలుసుకొని కందు కూరిని కలిశారు. ఇద్దరూ 1919లో ‘తెలుగు’ పేరుతో పత్రికను స్థాపించారు. తన భావాలను, ఆలోచనలను, ఈ పత్రికలో ముద్రిం చారు గిడుగు. గ్రాంథిక వాదుల ఆక్షేపణలన్నింటినీ, ఈ పత్రిక తూర్పారబట్టింది. ‘ఆంధ్ర పండిత, భిషక్కుల భాషా భేషజం’, ‘బాలకవి శరణ్యం’ వంటి గ్రంథాలను మొదటిసారిగా ఈ పత్రిక ద్వారానే వెలువరించారు. గిడుగు మొత్తం పరిశోధన అంతా భాషాతత్త్వంపైనే జరిగింది. ప్రతి అంశాన్ని శాస్త్రీయ దృక్పథంతో లోతుగా చర్చించారు. గిడుగు చేసిన భాషాసేవకు గుర్తింపుగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైందిగా భావించిన ‘‘కైజర్–ఇ– హింద్’’ అనే బంగారు పతకాన్ని 1933 జనవరిలో ప్రభుత్వం బహూకరించింది. గిడుగు వ్యావహారిక భాషోద్యమం ఫలితంగా 1933లో ‘నవ్య సాహిత్య పరిషత్తు’ ఏర్పడింది. వ్యావహారిక భాషలో అన్ని రకాల రచనలూ రావాలని ఈ పరిషత్తు అభిప్రాయపడింది. 1935 మే 6వ తేదీన గిడుగుకు ఐదవ జార్జి చక్రవర్తి రజతోత్సవ సువర్ణ పతకాన్ని ప్రభుత్వం ప్రదానం చేసింది. గద్య చింతామణి, వ్యాసావళి వంటి గ్రంథాల్ని గిడుగు రాశారు. పీఠికా విమర్శ, గ్రంథ పరిష్కార విమర్శ, లక్ష్మణ గ్రంథ విమర్శ, నిఘంటు విమర్శ వంటి అంశాల్లో కూడా ఎవ్వరూ చెయ్యని, చెయ్యలేని లోతైన పరిశోధన చేశారు. గ్రాంధిక భాషావాదుల డాంబి కాల్ని గిడుగు బట్టబయలు చేశారు. కొమ్ములు తిరిగిన మహామహా పండితులకే సంస్కృతం సరిగా రాదని ఉదాహరణ పూర్వకంగా విడమర్చి మరీ తెలియజేశారు. ఆయన వ్యాకరణాల్లోనూ నిఘంటువుల్లోనూ సమాన ప్రతిభ కలిగినవారు. సవర–తెలుగు, తెలుగు – సవర, ఇంగ్లిష్ – సవర, సవర – ఇంగ్లిష్ నిఘం టువుల్ని తయారుచేశారు. నిఘంటువుల నిర్మాణానికి పండిత ప్రతిభతో పాటు, భాషాశాస్త్ర జ్ఞానం, శాస్త్రీయ దృక్పథం కూడా తప్పనిసరిగా ఉండాలని వారి అభిప్రాయం. భాష ఎప్పుడూ పరిణామం చెందుతుందని గిడుగు వారి వాదన. అదే చివరకు విజయం సాధించింది. 1938 డిసెంబర్ 1వ తేదీన ఆంధ్ర విశ్వకళా పరిషత్ గిడుగుకు ‘కళాప్రపూర్ణ’ బిరుదునిచ్చి ఘనంగా సన్మానించింది. సవరభాష కోసం, వ్యావహారిక భాష కోసం, గిడుగు చేసిన కృషి అనన్య సామాన్యమైంది. అనితర సాధ్యమైంది. అక్షర జ్ఞానం లేని సవరలకు జ్ఞానం కలుగ చేయడం కోసం ‘సవర భాషోద్యమం’ చేపట్టారు. మహా మహా పండి తులను, మేధావులను వ్యావహారిక భాషావాదాన్ని ఒప్పించడం కోసం ‘వ్యావహారిక భాషోద్యమం’ చేపట్టారు. అజ్ఞానంతో ఉన్నవారికి జ్ఞానభిక్ష పెట్టేది ‘సవర భాషోద్యమం’. జ్ఞానం ఉన్నవారిలోని అజ్ఞానాన్ని తొలగించేది ‘వ్యావహారిక భాషోద్యమం’. రెండూ గొప్ప ఉద్యమాలే. రెండూ మంచి పనులే. అసలు విషయం ఏమంటే – ఈ రెండు ఉద్యమాలూ నూటికి నూరుపాళ్లు ప్రజలకు సంబంధించినవే. ఈ ఉద్యమాల్లో రవ్వంతయినా స్వార్థం లేదు. ఆయన గూర్చి ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక భాషా విజ్ఞాన సర్వస్వం గిడుగు. వీరు 1940 జనవరి 22వ తేదీన మద్రాసులో తుదిశ్వాస విడిచారు. గిడుగును ‘తెలుగు సరస్వతి నోముల పంట’ అని విశ్వనాథ సత్యనారాయణ కీర్తించారు. ‘తెలుగుదేశంలో అవతరించి తెలుగు భాషను ఉద్ధరించిన పుంభావ సరస్వతి గిడుగు వెంకట రామమూర్తి పంతులు’ అని చింతా దీక్షితులు కీర్తించారు. ఇటువంటి ఉద్దండుల మన్ననలను పొందగలిగిన గిడుగు ‘పిడుగు’గా ప్రసిద్ధి పొందారు. (క్లిక్: ఈ తెలుగు మాట్లాడుతున్నామా?) - ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వ్యాసకర్త ఏపీ అధికార భాషా సంఘ అధ్యక్షులు (ఆగస్టు 29న గిడుగు జయంతిని ‘తెలుగు భాషా దినోత్సవం’గా ఏపీ ప్రభుత్వం జరుపుతున్న సందర్భంగా) -
అసమానతలపై ఎక్కుపెట్టిన బాణం!
‘‘ఆమె పతివ్రత, పవిత్రమైనది. ఆమె చెడిపోయింది... ఇలా చెప్పే శాస్త్రాలు పవిత్రులైన, అపవిత్రులైన పురుషుల గురించి ఎందుకు మాట్లాడవు? పురుషుల మనసులు బంగారంతో తయారయ్యాయా? పాపం వారిని తాకదా? శాస్త్రాలు స్త్రీల పాపాల్నే చిత్రించాయా?’’ అని మహాభారతంలో ద్రౌపది ప్రశ్నించినట్లు రచించిన ప్రతిభా రాయ్ తన ప్రశ్న ద్వారా ఆధునిక సమాజంలో కూడా స్త్రీ, పురుషులు అవలంబించాల్సిన విలువలపై కొనసాగుతున్న ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నించారు. ఒడియాలో ఆధునిక సాహిత్యానికి రూపురేఖలు దిద్దిన ప్రతిభా రాయ్ రచనల్లో ‘యాజ్ఞసేని’ పురుషాధిక్య సమాజం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసిన గొప్ప నవల. ఈ నవలలో ద్రౌపది శ్రీకృష్ణుడికి రాసిన లేఖల్లో తన బాధలు, వేదనలు, పడిన హింస, త్యాగాలు, విశ్వాసాలు, ఆకాంక్షలు, నిస్పృహలను పంచుకుంటుంది. 1944 జనవరి 15న జగత్ సింగ్ పూర్ జిల్లాలోని అలబేలా కుగ్రామంలో జన్మించిన ప్రతిభా రాయ్ ఉన్నత విద్యాధికురాలు. ఒడిషాలోని బోండో జాతిపై పోస్ట్ డాక్టొరల్ పరిశోధన చేశారు. ఒక స్కూలు టీచర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఒడిషాలోని వివిధ ప్రభుత్వ కళా శాలల్లో 30 ఏళ్ల పాటు బోధన చేశారు. తన రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ, మూర్తి దేవి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు పొందారు. సాహిత్యంలో అత్యుత్తమమైన జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకున్న ఘనత అమెది. ఆధునికానంతర ఒడియా సాహిత్యంలో కథా కథన శిల్పంలో చేయితిరిగిన రచయిత్రి ఆమె. సమానత్వం, ప్రేమ, శాంతి, సమైక్యత అడుగడుగునా ఆమె రచనల్లో గోచరిస్తాయి. కుల, మత, లింగ వివక్షలు ఎక్కడా కన పడవు. సామాజిక న్యాయం కోసం పోరాడుతూ సమ కాలీన సామాజిక సమస్యలపై ఆమె చేసిన రచనలు అనేక సామాజిక సంస్కరణలకు దారితీశాయి. బర్సా బసంత బైశాఖ, పరిచయ, పుణ్యతోయ, అసబరి, నీలా తృష్ణ, శిలాపద్మ, ఉత్తర మార్గ, ఆదిభూమి, మహా మోహ, మగ్నమతి, మహారాణి పుత్ర వంటి నవలలతో ఆమె జన హృదయాల చేరువలోకి వెళ్లారు. అంతేగాక ఆమె దాదాపు 260 కథల్ని రచించారు. అవి 20 సంకలనాలుగా వెలువడ్డాయి. మధ్యతరగతి జీవితాలు, దాని సమస్యలు, వ్యక్తుల మనస్తత్వాలు, సామాజిక, రాజకీయ వ్యవస్థల స్థితిగతులు ఆమె కథల్లో ప్రతిబింబిస్తాయి. ప్రజల నమ్మకాలు, ఆచారాలు, వారి యాసలు, భాషలు, ప్రేమలు, పరిణయాలు, గ్రామీణ జీవన సౌందర్యం ఆమె రచనల్లో మనకు గోచరిస్తాయి. వీటన్నిటి మధ్యా ప్రతిభా రాయ్ తాత్విక దృక్పథం, బలమైన స్త్రీవాద చిత్తశుద్ధి, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సానుభూతితో అర్థం చేసుకోవడం కనిపిస్తుంది. ‘బర్సా బసంత బైశాఖ’ ఆమె తొలి నవల. శృంగా రాన్ని, ప్రేమను మార్కెట్లో వాణిజ్య వస్తువులుగా చూసే సమాజం పట్ల నిరసన వ్యక్తం చేసిన కళాత్మక రచన ఇది. రెండో నవల ‘పరిచయ’లో గ్రామీణ, పట్టణ జీవన శైలుల మధ్య సంఘర్షణను చిత్రించారు. యాజ్ఞసేని, శిలా పద్మ, ఉత్తర మార్గ, ఆదిభూమి నవలల్లో మానవ జాతి పరిణామం; స్త్రీలు, వారి సామాజిక అంశాలను స్పృశిం చారు. పురుష పాత్రల కంటే మహిళా పాత్రలు ఈ నవల్లో ఆధిపత్య పాత్రలుగా వ్యవహరిస్తాయి. ‘ఉత్తర మార్గ’ ఒక జాతీయవాద చారిత్రక నవల. ఆదిభూమి, మహామోహ, మగ్నమతి, మహారాణి పుత్ర అన్న నాలుగు నవలలను ఒడియా సాహిత్యంలో మహా నవలలుగా పరిగణిస్తారు. వచనంలో కావ్యాలు రాయడంలో ఆమెను మించిన వారు లేరని రాయ్ ఈ నవలల ద్వారా నిరూపించుకున్నారు. చారిత్రక వాస్తవాలను ఈ నవలలు మనముందుంచుతాయి. ‘ఆది భూమి’ కొద్దిగా భిన్నమైన నవల. ఆదిమ జాతి గిరిజనులైన బోండా జీవన శైలిని, కర్మకాండను ఈ నవలలో చిత్రించారు. ‘మహామోహ’ భారతీయ సాహిత్యంలోనే ఒక చెప్పు కోదగ్గ తాత్విక, కళాత్మక నవల. ఆధునికానంతర స్త్రీవాద ధోరణికి ఈ నవల అద్దంపడుతుంది. ఒక స్త్రీమూర్తి పూర్తి రూపాన్ని ఈ నవల బహిర్గతం చేస్తుంది. ‘మహారాణి పుత్ర’ ఒక ఆసక్తికరమైన చారిత్రక నవల. చరిత్రలోని ఘటనలను ఆమె నాటకీయంగా, మానవ సంఘర్షణలో భాగంగా చిత్రించారు. కియోంజార్ వలసవాద చరిత్రలో ప్రజా విప్లవం ఈ నవలలో మనకు ఆవిష్కృతమవుతుంది. 1979లో ఒడిషాలో బీభత్సం సృష్టించిన తుఫానుపై ఆమె ‘మగ్నమతి’ రాశారు. ఒక ప్రకృతి వైపరీత్యం బీభత్సం మాత్రమే కాదు, భూమాత ఆవేదన, సర్వ మానవ సౌభ్రాతృత్వం ఈ నవల ద్వారా చిత్రించారు. స్వతంత్ర భారతంలో జరిగిన పరిణామాలు, ప్రపంచీ కరణ ఫలితాలు కళాత్మకంగా ప్రదర్శించారు. సామాజిక, రాజకీయ అంశాలపై రచించిన ‘ఉత్తర మార్గ’ కూడా ఒక జాతీయవాద నవలే. సి. నారాయణ రెడ్డి ఆధునిక తెలుగు కవిత్వాన్ని కొన్ని దశాబ్దాల పాటు నిర్దేశించారు. సినారె, ప్రతిభా రాయ్ ఇద్దరూ అధ్యాపక రంగం నుంచి వచ్చిన వారే. ఇద్దరి సాహిత్య ప్రక్రియలు వేరైనా, తమ రచనల ద్వారా సమాజంలో చైతన్యాన్ని తెచ్చేందుకు ప్రయత్నించిన వారే. సినారెకు పద్మశ్రీ పురస్కారం 1972లోనూ, పద్మభూషణ్ 1992లోను లభించగా, ప్రతిభా రాయ్‌కి పద్మశ్రీ 2007 లోనూ, పద్మభూషణ్ 2022లోనూ లభించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, అటువంటి రచయిత్రికి మహా రచయితా, కవీ, విద్యాధికుడూ, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతా అయిన డాక్టర్ సి. నారాయణరెడ్డి (సినారె) జన్మదినం నాడు... ఆయన పేర నెలకొల్పిన జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేయడం తెలుగు జాతికి గర్వకారణం. - ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు (జూలై 29న ఒడియా రచయిత్రి ప్రతిభా రాయ్‌కు సినారె జాతీయ పురస్కార ప్రదానం) -
సామాజిక న్యాయం దిశలో మైలు రాళ్లు!
న్యాయవ్యవస్థలో ఆణిముత్యం జస్టిస్ లావు నాగేశ్వరరావు. ‘‘ఈ దేశంలో రాజకీయ స్వాతంత్య్రం వచ్చినా ఆర్థిక, సాంఘిక స్వాతంత్య్రం రాలేదు. కులం, మతం పేరుతో విభజన ఉంటే స్వాతంత్య్రం రానట్లే...’’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు. జూన్ 7న పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ లావు నాగేశ్వరరావు. సామాజిక న్యాయం దిశగా ఎన్నో కీలకమైన తీర్పులు వెలువరించారు. మూడు దశాబ్దాల పాటు న్యాయవాదిగా సేవలందిం చిన ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా పని చేయకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవిని అందుకున్న అతికొద్ది మందిలో ఒకరు. ఇది ఆయన ప్రతిభా విశేషాలకు తార్కాణం. ఇలా సుప్రీం న్యాయమూర్తిగా మారే గౌరవం అందుకున్న తొలి తొలుగువాడు కూడా ఆయనే. గుంటూరు జిల్లా, పెద నందిపాడు ఆయన స్వగ్రామం. ఒక సామాన్య రైతు కుటుం బంలో జన్మించారు. గుంటూరు ‘ఏసీ కాలేజీ ఆఫ్ లా’లో న్యాయవాద పట్టా అందుకున్నారు. పలు హిందీ సినిమాల్లో నటించారు. క్రికెట్, గోల్ఫ్ క్రీడల్లో ప్రావీణ్యముంది. 1982లో గుంటూరు జిల్లా కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభిం చారు. తర్వాత తన ప్రాక్టీస్‌ను ఏపీ హైకోర్టుకు మార్చారు. అనంతరం సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేయడం మొదలు పెట్టారు. అన్ని దశల్లోనూ ఆయన తన ప్రతిభను నిరూపించు కున్నారు. 2000వ సంవత్సరంలో ఆయన సీనియర్ అడ్వకేట్‌గా గుర్తింపు పొందారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయ లలిత తరఫున వాదించి ఆమెపై కోర్టు అన్ని ఆరోపణలను కొట్టేసేలా చేశారు. బీసీసీఐలో అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను విచారించేందుకు సుప్రీం నియమించిన ‘ముద్గల్ కమిటీ’లో ఆయన సభ్యులు. రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసే విషయంలో ఎన్నికల కమిషన్ అధికార పరిధికి సంబంధిం చిన కేసును వాదించారు. ఆయన ప్రతిభను గుర్తించి యూపీఏ ప్రభుత్వం 2003–2004లోనూ, ఎన్డీఏ ప్రభుత్వం 2013–14లోనూ ‘అదనపు సొలిసిటర్ జనరల్’గా నియమించుకొని ఆయన సేవలు పొందాయి. 34 ఏళ్లపాటు లా ప్రాక్టీసు చేసిన ఆయన దేశంలో అత్య ధికంగా ఆర్జించే న్యాయవాదిగా పేరు పొందారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాల్సిందిగా వచ్చిన అభ్యర్థనను ఆయన ఒకసారి నిరాకరించారు. రెండో సారి ఆ ప్రతిపాదనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ చేస్తే కాదనలేకపోయారు. గత ఆరేళ్లలో ఆయన ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ న్యాయపరిధికి సంబంధించి అనేక కీలకమైన తీర్పులను వెలువరించారు. ‘బలవంతపు వాక్సినేషన్’ ప్రైవసీ హక్కుకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్షపడ్డ ఏజీ పేరరివాళన్‌ను విడుదల చేయమని ఆదేశిస్తూ సంచలన తీర్పునిచ్చారు. న్యాయమూర్తిగా ఆయన 552 బెంచ్‌లలో విచారణలో పాల్గొని 163 కీలక తీర్పులు వెలువరించారు. మద్రాస్ బార్ అసోసి యషన్ కేసులో తీర్పునివ్వడం ద్వారా దేశంలో ‘ట్రిబ్యునల్’ వ్యవస్థను పునర్నిర్మించిన ఘనత కూడా ఆయనకే దక్కు తుంది. ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన రాజద్రోహం కాదని ఆయన ‘సోలీ సోరాబ్జీ స్మారకో పన్యాసం’లో స్పష్టం చేశారు. విద్వేష ప్రసంగాలకు అడ్డుకట్ట వేయడానికి ఐపీసీలో సంబంధిత సెక్షన్లను సవరించాలన్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ జోక్యం సరైంది కాదని పేర్కొన్నారు. (క్లిక్: వ్యవస్థ తప్పులకు క్షమాపణలుండవా?) జస్టిస్ నాగేశ్వరరావు తన గ్రామాన్ని దత్తత తీసుకుని ఎంతో అభివృద్ధి చేశారు. తెలుగు భాష అంటే ఆయనకు చాలా ప్రేమ. కన్నతల్లి వంటి మాతృభాషను బతికించుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదని విశాఖపట్టణంలో ‘లోక్‌నాయక్ ఫౌండేషన్’ 14వ వార్షిక పురస్కార సభలో అన్నారు. ఎన్నో ఉన్నత భావాలు కలిగిన జస్టిస్ లావు నాగేశ్వరరావు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేయడం న్యాయవ్యవస్థకు తీరని లోటు. అదే సమయంలో ఆయన హైదరాబాద్‌లోని ‘అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రా’నికి ఆధిపత్యం వహించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆయన ఆధ్వర్యంలో ఈ కేంద్రం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు. (క్లిక్: పాలనలో టెక్నాలజీ కొత్తేమీ కాదు!) - ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు (జూన్ 7న జస్టిస్ లావు నాగేశ్వరరావు పదవీ విరమణ సందర్భంగా...) -
అందరివాడు ప్రథమ పౌరుడు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఒడిశాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. 1962లో ఒడిశా హైకోర్టులో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించారు. 1975లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జేపీ చేపట్టిన ఉద్యమంలో భాగస్వామి అయ్యారు. ఐదుసార్లు ఒడిశా శాసనసభకు ఎన్నికై, నాలుగుసార్లు మంత్రిగా పనిచేశారు. 2000లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తన ప్రత్యర్థిపై 96 వేల ఓట్ల తేడాతో విజయం సాధించి ఒడిశాలో మునుపటి రికార్డులు అన్నింటినీ తిరగరాశారు. రాష్ట్ర మంత్రిగా ఎమర్జెన్సీ అనంతరం నిత్యావసర వస్తువుల ధరలు మండిపోకుండా బ్లాక్ మార్కెట్ విక్రేతలపై కఠిన చర్యలు తీసుకున్నారు. రెవెన్యూ మంత్రిగా భూరికార్డుల కంప్యూటరీకరణ, రెవెన్యూ చట్టాల సరళీకరణ–క్రోడీకరణకు ప్రాధాన్యతనిచ్చారు. 1956 రెగ్యులేషన్–2ను సవరించడం ద్వారా అనధికార ఆక్రమణలో ఉన్న ఆదివాసీల భూమిని పునరుద్ధరించేలా చర్యలు తీసుకున్నారు. సహాయ, పునరావాస విధాన సృష్టికర్త హరిచందన్. కేబినెట్ సబ్‌కమిటీ చైర్మన్‌గా ఈ విధానానికి ఒక ఆకృతిని తెచ్చారు. అప్పటికి దేశంలో ఇదే అత్యుత్తమ సహాయ, పునరావాస పాలసీగా నిలిచింది. మిగులు భూములను విక్రయించాలన్న ప్రతిపాదనకు అప్పటి ఒడిశా రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలుపగా, దానిని తీవ్రంగా వ్యతిరేకించి ఆ నిర్ణయం నుంచి ప్రభుత్వం వెనకడుగు వేసేలా చేయడంలో హరిచందన్ విజయం సాధించారు. భూ యజమానిలా కాకుండా, ధర్మకర్తలా వ్యవహరించేలా ఆలోచనా విధానాన్ని మార్చగలిగారు. రాజకీయాల్లో క్షణం తీరిక లేకపోయినా తనకు ఇష్టమైన రచనా వ్యాసాంగాన్ని ఎప్పుడూ విడిచి పెట్టలేదు. 1817 పైక్ విప్లవ సారథి బుక్సీ జగ బంధుపై ఆయన రాసిన నాటకం ‘మహా సంగ్రామర్ మహానాయక్’ అత్యంత ప్రశంసలు పొందింది. మరుభతాష్, రానా ప్రతాప్, శేష్ ఝలక్, మేబార్ మహారాణి పద్మిని, అస్తా సిఖా రాశారు. ‘సంగ్రామ్ సరి నహిన్’ హరిచందన్ ఆత్మ కథ. ప్రజా జీవితంలో ఆయన చేసిన పోరాటాన్ని ఇది వివరిస్తుంది. రాష్ట్ర విభజన అనంతరం జూలై 24, 2019న ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ రెండేళ్లు రాష్ట్రమంతటా పర్యటించారు. షెడ్యూల్డ్ ప్రాంతాల పాలనాధికారిగా విజయనగరం, కర్నూలు జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలను సందర్శించి అక్కడి ఆదివాసీ సమూహాలతో సంభాషించారు. సామాన్యులు సైతం గవర్నర్‌ను కలుసుకునేందుకు వీలుగా రాజ్‌భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయి. కోవిడ్–19 మహమ్మారి మొదటిదశలో వలస కార్మికులు పడుతున్న వెతలకు చలించి ప్రభుత్వం నుండి పలు చర్యలు తీసుకునేలా చేశారు. అలహాబాద్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులు, పంజాబ్‌లో చిక్కుకున్న విద్యార్థులు సురక్షితంగా స్వస్థలాలకు చేరుకునేలా చేయడంలో గవర్నర్ అధికారులను సమన్వయ పరిచారు. పర్యావరణ పరిరక్షణ, రక్తదానం అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ సందేశ వ్యాప్తికి విద్యా సంస్థలను సందర్శించినప్పుడు మొక్కలను నాటడం, స్వచ్ఛంద రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు తప్పనిసరిగా నిర్వ హించేలా చూస్తుంటారు. చిన్నారుల మధ్య చిన్నారిలా కలిసిపోయి వారితో సమయాన్ని గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. తన క్షేత్రస్థాయి పర్యటనలకు అధికారులు భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేయడం, పెద్దఎత్తున పుష్పగుచ్ఛాలు అందించడం, రెడ్ కార్పెట్ వేయడం వంటివి గమనించి అతిగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కోవిడ్–19 కారణంగా క్షేత్ర సందర్శనలను చాలా వరకు తగ్గించినప్పటికి, ఎప్పటికప్పుడు రాష్ట్రంలోనూ, రాష్ట్రం వెలుపల వివిధ సంస్థలు నిర్వహించిన కార్యక్రమాలకు, విశ్వవిద్యాలయ సమావేశాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన సందేశాన్ని వినిపిస్తున్నారు. హరిచందన్ నిరాడంబర జీవితాన్ని కోరుకుంటారు. రాజ్‌భవన్ పచ్చిక బయళ్ళలో నడక, యోగా సాధనతో ఆయన దినచర్య మొదలవుతుంది. పుస్తకాలను చదివేందుకు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. నియమబద్ధమైన జీవనాన్ని గడిపే గవర్నర్ హరిచందన్ ఎందరికో ఆదర్శంగా, భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. – ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ (ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా బిశ్వ భూషణ్ హరిచందన్ నేటితో రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకోనున్నారు) -
టీడీపీ పాలనలో ‘అకాడమీ’కి అస్థిత్వమే లేదు
దొండపర్తి (విశాఖ దక్షిణ): తెలుగు భాషపై చంద్రబాబు మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఎద్దేవా చేశారు. తెలుగు అకాడమీకి సంస్కృతాన్ని కలిపి ‘తెలుగు–సంస్కృత అకాడమీ’ అని మారిస్తే తెలుగు భాషకు జరిగిన నష్టమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీచ్ రోడ్డులోని లోక్‌నాయక్ ఫౌండేషన్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014–19 మధ్య టీడీపీ హయాంలో తెలుగు అకాడమీ, అధికార భాషా సంఘం అస్థిత్వమే లేకుండా చేశారని గుర్తుచేశారు. రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తానంటూ ఇచ్చిన హామీని చంద్రబాబు గోదావరిలో కలిపేశారన్నారు. తెలుగు భాషాభివృద్ధికి సీఎం కృషి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చొరవతోనే తెలుగుకు ప్రాచీన హోదా లభించిందని యార్లగడ్డ గుర్తుచేశారు. టీడీపీ హయాంలో తెలుగు భాషను, అకాడమీని పట్టించుకోని సమయంలో అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వాటిని పునరుద్ధరించారని తెలిపారు. అలాగే సీఎం జగన్ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రాచీన అధ్యయన కేంద్రాన్ని మైసూరు నుంచి నెల్లూరుకు తీసుకువచ్చారని చెప్పారు. నిజానికి తెలుగు అకాడమీకి కేంద్రం నుంచి నిధులు రావని.. సంస్కృత భాషకు ఎక్కువ వస్తాయని తెలిపారు. తెలుగు వికాసానికి ఎవరు కృషి చేస్తున్నారన్న విషయంపై ఎక్కడైనా, ఎవరితోనైనా చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని యార్లగడ్డ సవాలు విసిరారు. -
సీఎం జగన్ ప్రకటన ముదావహం: సీపీఎం
సాక్షి, అమరావతి: కరోనాపై మతం ముద్ర వేయొద్దని, భారతీయులుగా ఐక్యంగా పోరాడదామంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపును ఆహ్వానిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశం అనంతరం కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయని, డాక్టర్లు కుల, మతాలకతీతంగా రోగులందరికీ వైద్యం చేస్తున్నారన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ యంత్రాంగంతోపాటు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల సహకారం కూడా తీసుకొని కరోనాను సమర్ధవంతంగా అరికట్టాలని మధు కోరారు. కరోనా నివారణలో ముఖ్యపాత్ర పోషిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి పూర్తి వేతనాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ముదావహం అని పేర్కొన్నారు. సీఎం సంయమనం అనుసరణీయం: అధికార భాషా సంఘం కరోనాకు మతం లేదని, జరిగిన దురదృష్టకరమైన సంఘటనకు మతపరమైన రంగు ఆపాదించవద్దంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటనను రాష్ట్ర అధికార భాషా సంఘం స్వాగతించింది. ఈ విషయంలో సీఎం వైఎస్ సంయమనం అనుసరణీయమని ఆ సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, సభ్యుడు చందు సుబ్బారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా బాధితుల పట్ల మనమంతా ఆప్యాయంగా వ్యవహరించాలని వారిని మనం వేరుగా చూడరాదన్న సీఎం అభిలాష ఆయన వాస్తవిక దృక్పధానికి అద్దం పడుతోందన్నారు. (ఏపీలో కరోనా పాజిటివ్‌లు 252) -
97 శాతం ఆంగ్లమాధ్యమమే కావాలంటున్నారు
సాక్షి, విశాఖపట్నం: ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకువచ్చి తెలుగును తీసేశారనడం సరికాదని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో 48వేల పాఠశాలల పేరెంట్స్ కమిటీలు 97 శాతం ఆంగ్ల మాధ్యమమే కావాలని తీర్మానించిన విషయాన్ని గుర్తు చేశారు. చివరకు నారావారిపల్లెలోని పాఠశాల పేరెంట్స్ కమిటీ కూడా ఆంగ్ల మాధ్యమమే కావాలని తీర్మానించిందన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార భాష వినియోగానికి ప్రభుత్వం రెండు నెలల కాలానికిగానూ రూ.2 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. తెలుగును మూసేశారన్నవారి నోళ్లు మూయించడానికి ప్రభుత్వం మండలానికో తెలుగు మీడియం పాఠశాలను ఏర్పాటు చేయనుందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని అభినందిస్తున్నామన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం తెలుగు మీడియం స్కూల్ దూరమైతే విద్యార్థులకు రవాణా సౌకర్యం కూడా కల్పించనుందని ఆయన తెలిపారు. (అమ్మ భాషకు పునరుజ్జీవం) -
సీఎం వైఎస్ జగన్‌ని కలిసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్
సాక్షి,అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం తాడేపల్లిలోని సీఎం నివాసం ఇందుకు వేదికైంది. ఈ సందర్భంగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌ను సీఎం వైఎస్ జగన్ శాలువాతో సత్కరించారు. ఆయనతో పాటు ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా ఉన్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన జస్టిస్ చలమేశ్వర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చలమేశ్వర్‌ను శాలువా, జ్ఞాపికతో సాదరంగా సీఎం జగన్ సత్కరించారు. చలమేశ్వర్ వెంట అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఉన్నారు. కాగా, గతేడాది జూన్ 11న విజయవాడలో ‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ పుస్తకావిష్కరణ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు చలమేశ్వర్ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. (చదవండి: మాట నిలబెట్టుకున్న సీఎం జగన్) జస్టిస్ చలమేశ్వర్‌ను సత్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ -
18న లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కార ప్రదానోత్సవం
సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 18న లోక్‌నాయక్ ఫౌండేషన్ 16వ వార్షిక పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం సిరిపురం వుడా చిల్డ్రన్ థియేటర్లో జరుగుతుందని అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. ఆయన శుక్రవారం మీడియా మాట్లాడుతూ.. ఈ ఏడాది లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డుకు దూపాటి విజయ్‌కుమార్ ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, అధ్యక్షులుగా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, అత్మీయ అతిథులుగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఏవి శేషసాయి, ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు హాజరవుతారని లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. -
జనరంజకంగా వైఎస్ జగన్ పాలన
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు, ఏపీ హిందీ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సోమవారం సాయంత్రం డాలస్ ఎన్నారై వైఎస్సార్సీపీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన జనరంజకంగా సాగుతోందని, అన్ని వర్గాల ప్రజలు తమ జీవన స్థితిగతులు మెరుగుపడుతున్నాయని ఆనందం వెలిబుచ్చుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా రూపొందించిన ‘‘నవరత్నాల’’ పథకాలను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలనే ధృఢసంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనిచేస్తున్నారని యార్లగడ్డ పేర్కొన్నారు. ఎన్నారై వైఎస్సాసీపీ శ్రేణులు ఈ పథకాలకు సామాజిక మాధ్యమాల ద్వారా, వారి వారి సాంకేతిక విజ్ఞానం ద్వారా విస్తృత ప్రాచుర్యం కల్పించాలని కోరారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆమోదించిన ఆంగ్ల మాధ్యమ జీవోను యార్లగడ్డ విశ్లేషించారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ పాఠశాలల్లో తెలుగు కనపడి, వినపడి, నేర్పబడి, నేర్చుకోబడుతుందని అన్నారు. ఈర్ష్యా అసూయలకు పోకుండా, అసభ్యత అశ్లీలతలకు తావులేకుండా హుందాగా వ్యవహరిస్తూ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందించాలని ఈ సందర్భంగా యార్లగడ్డ విజ్ఞప్తి చేశారు. అనంతరం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను డాలస్ ఎన్నారై వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా సత్కరించాయి. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మాజీ ఎంపీ డాక్టర్ ఆత్మచరణ్‌రెడ్డి, కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి, వై.శ్రీనివాసరెడ్డి, క్రిస్టపాటి రమణ్‌రెడ్డి, పుట్లూర్ రమణ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ భాషకు పునరుజ్జీవం
సాక్షి, అమరావతి/ఒంగోలు మెట్రో: తెలుగు భాషకు మంచిరోజులొస్తున్నాయి. మాతృభాష అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమించింది. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నిర్మాణాత్మక చర్యలు చేపట్టింది. అధికార భాషా సంఘం, తెలుగు అకాడమీలను ఏర్పాటు చేసింది. పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి భాషగా చేసింది. భాష, సంస్కృతుల వికాసానికి ప్రణాళి కాబద్ధంగా చర్యలు చేపట్టడంపై భాషాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో తెలుగు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ విషయాన్ని చంద్రబాబు పట్టించుకోలేదు. దీనిపై యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, తెలుగు భాషాభిమానులు ఆందోళనలు చేసినా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక అధికార భాషా సంఘాన్ని నియమించలేదు. తెలుగు అకాడమీ ఏర్పా టును అసలు పట్టించుకోలేదు. తెలుగు భాషాభివృద్ధికి భాషావేత్తల సూచనలు, డిమాండ్లను చంద్రబాబు బేఖాతరు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1నుంచి పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలని ఎన్నో వినతులిచ్చినా పెడచెవిన పెట్టారు. ‘తెలుగుదేశం పార్టీ పేరులో తెలుగు ఉంది తప్ప.. చంద్రబాబు మనసులో తెలుగుకు స్థానం లేదు’ అని భాషాభిమానులు తీవ్రంగా విమర్శించారు. తెలుగుకు మళ్లీ వెలుగులు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత తెలుగు భాషా వికాసానికి గట్టి చర్యలు చేపట్టారు. పరిపాలనలో తెలుగు వినియోగం, భాషాభివృద్ధికి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అధికార భాషా సంఘాన్ని నియమించారు. దానికి తెలుగు, హిందీ భాషల్లో పండితుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ను అధ్యక్షుడిగా నియమించారు. ప్రముఖ సాహితీవేత్తలు మోదుగుల పాపిరెడ్డి, షేక్ మస్తాన్, ఆచార్య చందు సుబ్బారావు, ఆచార్య శరత్ జ్యోత్సా్నరాణిలను అధికార భాషా సంఘం సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. తెలుగు అకాడమిని పునరుద్ధరించారు. ప్రముఖ రచయిత్రి, ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీ పార్వతిని ఆ అకాడమి అధ్యక్షురాలిగా నియమించారు. తద్వారా తెలుగు భాష, సాహిత్యాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకువెళ్తున్నారు. అదే విధంగా 1 నుంచి పదో తరగతి వరకు ఓ సబ్జెక్టుగా తెలుగు గానీ ఉర్దూగానీ తప్పనిసరి చేసి అమ్మభాష తప్పనిసరిగా నేర్చుకునేట్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఉర్దూ అకాడమీని కూడా పునరుద్ధరించనుంది. భాషాభివృద్ధికి ప్రభు త్వం చేపడుతున్న చర్యల పట్ల సాహిత్యాభిమానులు, విద్యా వేత్తలు, సాహితీవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భాష పురోగతికి బాటలు ‘ఆధునిక మహిళ చరిత్రని పునర్లిఖిస్తుంది’ అని గురజాడ చెప్పినట్టు ప్రభుత్వం ఒక మహిళ అయిన నందమూరి లక్ష్మీపార్వతికి తెలుగు అకాడమీ బాధ్యతలు అప్పగించింది. తద్వారా తెలుగు భాష పురోగతికి బాటలు వేసింది. – సింహాద్రి జ్యోతిర్మయి, ఉపాధ్యక్షురాలు, నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం సంతోషం కలిగిస్తోంది సీఎం వైఎస్ జగన్.. మదర్సాల ఉన్నతికి చర్యలు చేపట్టడమే కాకుండా ఉర్దూ అకాడమీని పునరుద్ధరించాలని చేస్తున్న ప్రయత్నం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. వీటిని గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా వదిలేస్తే అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే వైఎస్ జగన్ చర్యలు తీసుకోవడం ముదావహం. – డాక్టర్ షాకీర్, విద్యావేత్త తెలుగు అభివృద్ధికి నిర్మాణాత్మక చర్యలు తెలుగు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు చేపట్టింది. భాషావేత్తలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న విధంగా పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేసింది. దాంతో భావితరాలకు కూడా తెలుగును మరింత చేరువ చేసింది. ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకొనేందుకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అదే సమయంలో తెలుగు భాషను ఏమాత్రం విస్మరించ లేదు. – యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడింది తెలుగు భాషాభివృద్ధికి, వికాసానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే అధికార భాషా సంఘాన్ని నియమించింది. తెలుగు అకాడమీని పునరుద్ధరించింది. పోటీ ప్రపంచంలో మన విద్యార్థులు వెనుకబడిపోకూడదనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నారు. అంతమాత్రాన తెలుగును తీసేయడం లేదు. తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేశారు. – నందమూరి లక్ష్మీపార్వతి, తెలుగు అకాడమి అధ్యక్షురాలు -
జీవితం వడగాడ్పు, కవిత్వం వెన్నెల
మనిషిని మనిషి కించపరిచి, అసహ్యించుకుని, ఊడిగింపు చేయించుకుని అధఃపాతాళానికి తొక్కే సమాజ పరిస్థితులున్నంతవరకూ దేశంలో ఎన్ని ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పటికీ ఆ సమాజం అభివృద్ధి చెందనట్లే భావించాలి. ఈ పరిస్థితి మారాలంటే కొన్ని దశాబ్దాల క్రితం మహాకవి గుర్రం జాషువా అనుభవించిన వేదనను మనం అర్థం చేసుకోవాలి. ఆయన వేదన కొన్ని వేల ఏళ్ల దళిత ఆక్రందనల ప్రతిఫలన. అది పీడితుల బాధలతో, గాథలతో అప్పుడూ ఇప్పుడూ మమేకమవుతున్న హృదయ స్పందన. స్వాతంత్య్రోద్యమంతో పాటు అనేక సామాజిక ఉద్యమాలు జరుగుతున్న కాలంలో అడుగడుగునా వివక్షకు గురవుతూనే ఆయన పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఉపాధ్యాయ శిక్షణను పొంది తెలుగు అధ్యాపకుడిగా ఉద్యోగం చేశారు. మహా మహా పండితులతో సమానంగా తెలుగు పద్యాలు రాయగల శక్తిని సంపాదించారు. వినుకొండలో జరిగిన ఒక సభలో జాషువా తన ఆశుకవితా నైపుణ్యంతో సభికులను మెప్పించారు. అయితే ఈ సభలో ఒక నిమ్నజాతికి చెందిన కవికి ఎలా ప్రవేశం కలిగిందని కొందరు ఆగ్రహించడంతో జాషువా నీరుకారి పోకుండా మరింత పట్టుదలతో అద్భుతమైన సాహిత్యాన్ని సృజించారు. ఒక సారి రైలులో ఒక రాజావారు తనతో ప్రయాణిస్తున్న జాషువా కవి అని తెలుసుకుని ఆయన కవితలు విని మెచ్చుకున్నారు. చివరిలో జాషువా కులం గురించి తెలుసుకుని చివాలున లేచిపోయారు. దీంతో ‘తన కవితా వధూటిని చూసి భళి భళి అన్నవారే కులం తెలుసుకుని చివాలున లేచిపోతే బాకుతో కుమ్మినట్లుంటుంద’ని పద్యం రాశారు. పండితుల సాహచర్యం సంపాదించి పద్యాలు రాయడం నేర్చుకున్నారు. మేఘ సందేశం, రఘువంశం, కుమార సంభవం వంటి సంస్కృత కావ్యాలను చదివి భాషపై పట్టు సంపాదించారు.. సరళ గ్రాంథికాన్నీ, ప్రాచీన పద్య ఛందస్సును స్వీకరించి పద్యానికి కూడా జవజీవాలు కల్పించి ప్రజల్లోకి తీసుకువెళ్లగలమని నిరూపించిన కవి జాషువా. జాషువా రచనల్లో గబ్బిలం పద్యకావ్యం ప్రతిఘటనా కావ్యంగా చరిత్రలో నిలిచిపోయింది. గుడిలో గబ్బిలానికి ప్రవేశం ఉన్నది కాని దళితుడికి మాత్రం లేదని ఆయన వ్యక్తపరిచిన ఆవేదన చదివిన ప్రతి ఒక్కరి హృదయాలను కరిగిస్తుంది. ‘ఎన్ని దేశాలు తిరిగిన నేమి నీవు నా వలె పుట్టు బానిసవు కావు..’ అని ఆయన అంటారు. ఫిరదౌసి అనే మరో పద్యకావ్యంలో ఒక కవికి అక్షరలక్షలు ఇస్తానని చెప్పిన చక్రవర్తి మాట తప్పడంతో ఆ కవి ఆత్మహత్య చేసుకున్న తీరును అద్భుతమైన శైలిలో అనన్యసామాన్యమైన కవితా ప్రతిభతో వర్ణిస్తారు. ‘రాజు మరణించెనొక తార రాలిపోయె, సుకవి మరణించెనొక తార గగనమెక్కె, రాజు జీవించు రాతివిగ్రహములయందు, సుకవి జీవించు ప్రజల నాల్క లయందు‘. అని రాశారు. జాషువా రచించిన సత్యహరిశ్చంద్ర నాటకంలోని çశ్మశాన వాటికలోని పద్యాలు చదివిన వారి గుండెలు ఆర్ద్రతతో స్పందించక మానవు. పేద రైతు కుటుంబంలో జన్మించిన జాషువా రైతన్నల బాధలను తన కవిత్వంలో పండించినంతగా మరెవరూ పండించలేదనే చెప్పాలి. ‘వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు’ అన్నాడు. తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి జాషువా కాలికి గండపెండేరం తొడిగి ‘ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యమైంది’ అన్నారు. ‘తన జీవితంలో అన్నిటికన్నా ఇది అత్యున్నత పురస్కారం’ అని జాషువా అన్నారు. చెళ్లపిళ్ళ వేంకటశాస్త్రి శిషు్యడైన విశ్వనాథ సత్యనారాయణ కూడా శారదాదేవీ అనుగ్రహం వల్ల జాషువా కవిత్వంలో మాధుర్యం ధ్వని స్తుందని, ఆయన మధుర కవి అని ప్రశంసించారు. జాషువా రాసిన శిశువు అనే ఖండికను కమనీయంగా గానం చేసిన ఘంటసాల ఇంటిలోకి వెళ్లడానికి తాను తటపటాయిస్తుంటే ఆ గాయకుడు ఎంతో బాధపడ్డారట. ‘నాకు అటువంటి పట్టింపులు లేవు, మీరు స్వేచ్ఛగా లోపలికి రావచ్చు. పైగా మీరు సరస్వతీ పుత్రులు. మీరు అంటరాని వారైతే, సరస్వతీ దేవి కూడా అంటరానిదనే కదా అర్థం!’’ అని ఘంటసాల అన్నారట. ‘వడగాడ్పు–నా జీవితమైతే, వెన్నెల–నా కవిత్వం’ అని జాషువా అన్నారు. ఆయన జీవితమంతా వడగాడ్పులా సాగితే వెన్నెల లాంటి ఆయన కవిత్వం నేటికీ మన హృదయాలను రసప్లావితం చేస్తోంది. (సీఎం క్యాంప్ ఆఫీస్‌లో సభ సందర్భంగా) వ్యాసకర్త : ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు -
‘సినారె’ పుస్తకాన్ని ఆవిష్కరించడం నా అదృష్టం
సాక్షి, అమరావతి : జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, రాజ్యసభ మాజీ సభ్యుడు దివంగత డాక్టర్ సి. నారాయణరెడ్డి రాజ్యసభలో చేసిన ప్రసంగాల సంకలనాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సేకరించి సంకలనం చేసిన ‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించిన అనంతరం క్లుప్తంగా మాట్లాడారు. సినారె గురించి తాను ఇంతకంటే ఎక్కువగా చెప్పాల్సింది ఏమీలేదని, ఆయన రచనలు, ఆయన ప్రసంగాల గురించి ఇంతమంది పెద్దలు మాట్లాడిన తరువాత తానింక చెప్పజాలనని జగన్ వినమ్రంగా అన్నారు. ఆచార్య సినారె రాజ్యసభ సభ్యుడిగా ఉన్నపుడు ఆయన చేసిన ప్రసంగాలు ఈ పుస్తకంలో పొందుపర్చారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఘనంగా జరిగిన ఈ ఆవిష్కరణ సభలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సభకు అధ్యక్షత వహించిన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ.. తనది డాక్టర్ సి.నారాయణరెడ్డితో 45 ఏళ్ల పరిచయమని అన్నారు. ఆయనతో ఇందిరా పార్కులో మార్నింగ్ వాక్ చేసే రోజుల్లో ఆయన కవితల ప్రథమ శ్రోతను తానేనన్నారు. జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తెలుగు వారిలో మొదటి వారు విశ్వనాథ సత్యనారాయణ, రెండోవారు సినారె అని చెప్పారు. యువకులైన సీఎం వైఎస్ జగన్ పది కాలాల పాటు రాజ్యం చేయాలని.. జనరంజకంగా పాలించాలని జస్టిస్ చలమేశ్వర్ ఆకాంక్షించారు. రైతులను వేధించకుండా చూడాలి ఒకచోట నుంచి మరోచోటికి రైతులు నల్లబంక మట్టిని, ఎర్రమట్టిని తవ్వుకుని ట్రాక్టర్లలో తీసుకువెళ్తూ ఉంటారని.. అలాంటి వారిని పోలీసులు అనవసరంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని సమావేశంలో చలమేశ్వర్ సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు. ఇది శిక్షార్హమని ఎక్కడాలేదని.. రైతుల అనుకూల ప్రభుత్వం కనుక వారి సంక్షేమం కోరి ఇలాంటి వేధింపులు వారిపై లేకుండా ముఖ్యమంత్రి ఆదేశాలివ్వాలని, ఇది రాష్ట్రంలో ఉండే రైతులందరి సమస్య అని ఆయనన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ జ్యుడిషియల్ అకాడమి డైరెక్టర్ జస్టిస్ గోడ రఘురాం మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు గొప్ప విజయాన్ని ఇచ్చారన్నారు. అందుకు తగ్గ సవాళ్లు కూడా ఉంటాయని తెలిపారు. వాటిని అధిగమించే శక్తి వైఎస్ జగన్‌కి ఉందని భావిస్తున్నానన్నారు. ప్రజాసేవ చేయటానికి రాజకీయాల్లోకి వస్తారని, ప్రజాసేవ చేసే క్రమంలో చట్టసభల్లో అనవసరంగా బలప్రదర్శనలు జరుగుతూ ఉంటాయన్నారు. ప్రజాసేవను ఇలా చేయాలా? ఇంత వేడి అవసరమా అని అన్నారు. సినారె అనేక విషయాలను చక్కగా చెప్పారన్నారు. జగన్ ఆత్మవిశ్వాసం గొప్పది : యార్లగడ్డ పార్లమెంట్లో అనేక అనుభవాలను, దృశ్యాలను.. సంఘటనలను చెప్పిన డాక్టర్ సి.నా.రే ప్రసంగాలను సంకలనం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని రాజ్యసభ పూర్వ సభ్యుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఈ పుస్తకావిష్కరణ సీఎం చేతుల మీదుగా జరగడం ఆనందంగా ఉందన్నారు. పోలింగ్, ఫలితాలకు మధ్య సమయంలో తాను జగన్‌ను కలిసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరినపుడు, ఫలితాలు రావడానికి ముందే.. తాను 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని అదే హోదాలో ఆవిష్కరిస్తానని చెప్పారని, ఆయన ఆత్మవిశ్వాసం అంత గొప్పదని లక్ష్మీప్రసాద్ ప్రశంసించారు. రైతు నేస్తం పబ్లికేషన్స్‌కి చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించారు. సినారె కుటుంబ సభ్యులు ఎ. భాస్కర్‌రెడ్డి, ఎస్ సురేందర్‌రెడ్డి, ఎస్. వెంకటేశ్వర్‌రెడ్డి, గాదె సుధాకర్‌రెడ్డి, చైతన్యదేవ్, ప్రముఖులు డాక్టర్ రమణమూర్తి, డాక్టర్ సతీష్, డాక్టర్ నాగేష్, కోనేరు ప్రసాద్, అడుసుమిల్లి జయప్రకాష్, గోళ్ల నారాయణరావు, వంశీ రామరాజు, కేవీ సుబ్బారావు, ఏఎస్ దాస్, విజయసాయిరెడ్డి, కనుమూరి రఘురామ కృష్ణంరాజు సహా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
దాసరి, హరికృష్ణ విగ్రహాల తొలగింపు వెనుక..
ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాల తొలగింపు వెనుక సీఎం చంద్రబాబు కుట్ర ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆరోపించారు. ఆయన మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్లు బీచ్ రోడ్‌లోని విగ్రహాలను సోమవారం అర్ధరాత్రి సమయంలో తొలగించారన్నారు. కోర్టులో కేసు విచారణలో ఉన్నా కూడా ఈ విధంగా చేయడం దారుణమన్నారు. అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున, దాసరి నారాయణరావు కుమారుడు అరుణ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను ఎన్నికల సమయంలో కలవడం, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వైఎస్సార్సీపీలో చేరడాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు ఈ కుట్రకు పూనుకొన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా కొడుకుల మీద కోపంతో వారి తండ్రుల విగ్రహాలను తొలగించారని ఆరోపించారు. అలాగే రాజన్న రాజ్యం రాబోతోందని, వైఎస్సార్ ఉన్నప్పుడు తెలుగు భాషకు ప్రాధాన్యం పెరిగిందని.. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అయితే తెలుగు భాషకు విలువ పెరుగుతుందని గతంలో తాను చెప్పానన్నారు. దీంతో చంద్రబాబు తనపైనా కోపం పెట్టుకొన్నాడని.. అందుకే తాను ఏర్పాటు చేసిన విగ్రహాలను కూల్చివేయించాడని మండిపడ్డారు. బీచ్ రోడ్లో సినారే, అల్లు రామలింగయ్య, జాలాది, నేదునూరి కృష్ణమూర్తి, తిరుపతి వేంకట కవులు, గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణ తదితర విగ్రహాలు ఉన్నాయన్నారు. వాటికి కూడా ఎలాంటి అనుమతుల్లేవన్నారు. వాటిలో ఐదు విగ్రహాలను తానే ఏర్పాటు చేశానని చెప్పారు. వాటిన్నిటినీ వదిలేసి ఈ మూడు విగ్రహాలపైనే జనసేన నేత ఎం.సత్యనారాయణ ఎందుకు కోర్టులో కేసు వేయాల్సి వచ్చిందో చెప్పాలని యార్లగడ్డ ప్రశ్నించారు. కోర్టులో కేసు విచారణలో ఉన్నా కూడా పట్టించుకోకుండా చంద్రబాబు వాటిని తొలగించడానికి ఎందుకు ఆదేశించారో చెప్పాలన్నారు. కాగా, విగ్రహాల ఏర్పాటుపై న్యాయస్థానం ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చినట్లు యార్లగడ్డ తెలిపారు. -
తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించినా.. వైఎస్సార్ సాధించాడు
సాక్షి, తిరుమల : తెలుగు భాషకు ప్రాచీన హాదా కల్పించడాన్ని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేంద్రం ప్రభుత్వంతో కొట్లాడి మరీ సాధించారని మాజీ ఎంపీ, ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఆదివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరంమీడియాతో మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్సార్ తెలుగు భాషకు ప్రాచీన హోదా తెస్తే.. చంద్రబాబు నాయుడు ఉన్న భాషను చంపేస్తున్నాడని ఆరోపించారు. అంగన్వాడీల్లో సైతం ఇంగ్లీష్ భాషను పెట్టి తెలుగు భాషకు మనుగడ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. తెలుగు యూనివర్సిటీని సైతం ముయించేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్‌తోనే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. జగన్ ప్రభుత్వంలో తెలుగు భాష పరిమడిల్లాలని, గౌరవం పెరగాలని స్వామి వారిని కోరుకున్నానని తెలిపారు. -
మాటలకే చంద్రబాబు పరిమితం: యార్లగడ్డ
సాక్షి, తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్‌లు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. తెలుగు బాషను ఓ సబ్జెక్టుగా పెడతామని చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాటలకే పరిమితం అయ్యారని విమర్శించారు. చంద్రబాబు తెలుగు భాషాభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఇచ్చిన మాటపై నిలబడి తెలుగు భాషకు ప్రాణం పోశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తెలుగు భాష వ్యతిరేకి అని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవారిని మొక్కుకున్నట్లు యార్లగడ్డ తెలిపారు. -
యార్లగడ్డకు ఆటా, టాటా జీవిత సాఫల్య పురస్కారం
న్యూఢిల్లీ: కేంద్రీయ హిందీ సమితీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కు అమెరికన్ తెలుగు సంఘం(ఆటా), తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టాటా)లు కలిసి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించాయి. మే 31, జూన్1, జూన్ 2లలో డల్లాస్‌లో రెండు సంస్థలు ఏర్పాటు చేసిన సదస్సులో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కి ఈ పురస్కారం అందజేయనున్నట్టు ఆటా అధ్యక్షుడు డా. కరుణాకర్ రెడ్డి, టాటా అధ్యక్షుడు డా. హరినాథ్ పొలిచెర్ల ప్రకటించారు. 1990లో ఏర్పడిన ఆటా, 2015లో ఏర్పడిన టాటాలు మొట్టమొదటిసారిగా సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహించడం ఇదే మొదటిసారి. అమెరికా వ్యాప్తంగా దాదాపు 4500 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖ రచయితలు, కవులు, మేధావులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, డాక్టర్లు, కళాకారులు, యువకులు ఈ సదస్సులో పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు. కాగా, ఉభయ భాషల్లో పీహెచ్డీ చేసి, పద్మభూషణ్, పద్మశ్రీ, కేంద్ర సాహిత్య అకాడమీతో పాటు అనేక పురస్కారాలు పొంది, 60కి పైగా పుస్తకాలు రచించిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కు ఈ సందర్భంగా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయాలని నిర్ణయించినట్లు రెండు సంఘాలు తెలిపాయి. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండింటి సాంస్కృతిక వారధిగా, ఆదర్శంగా భావిస్తున్నట్లు ప్రకటించాయి. డల్లాస్‌లో ఉభయ సంఘాలు కలిసి నిర్వహిస్తున్న ఈ సదస్సుకు చారిత్రక ప్రాధాన్యత ఉన్నదని నిర్వాహకులు పేర్కొన్నారు. -
నరిశెట్టి రాజుకు ‘ఎన్ఆర్ చందూర్’ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయి మీడియా సంస్థల్లో ఉన్నతస్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెలుగుతేజం, ప్రముఖ జర్నలిస్టు, అమెరికాకు చెందిన గిజ్మోడో మీడియా గ్రూప్ సీఈవో నరిశెట్టి రాజు ఈ ఏడాదికిగానూ ఎన్ఆర్ చందూర్ జగతి పురస్కారాన్ని అందుకున్నారు. బుధవారం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడి చేతుల మీదుగా నరిశెట్టి రాజు పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ జర్నలిస్టు ఎన్ఆర్ చందూర్ జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు, అమరజీవి శ్రీపొట్టిశ్రీరాములు స్మారక సమితి ఏటా ఉత్తమ జర్నలిస్టులకు పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. తెనాలి పాత తాలూకాలోని చేబ్రోలుకు చెందిన నరిశెట్టి రాజు జర్నలిజంలో చేరిన కొత్తలో తెలుగు, ఆంగ్ల పత్రికల్లో పని చేశారు. అనంతరం అమెరికాలోని డేటన్ డైలీ న్యూస్, వాల్ స్ట్రీట్ జర్నల్, వాషింగ్టన్ పోస్ట్‌ల్లో రిపోర్టర్ స్థాయి నుంచి మేనేజింగ్ ఎడిటర్ స్థాయికి ఎదిగారు. అనంతరం స్వదేశానికి వచ్చి మింట్ పత్రికను స్థాపించిన రాజు ప్రస్తుతం గిజ్మోడో మీడియా గ్రూప్‌కు సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తుండడంతోపాటు వికీమీడియా ఫౌండేషన్ బోర్డులో ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, సత్యానికి దగ్గరగా సంచలనాలకు దూరంగా విలువలతో కూడిన జర్నలిజం సమాజాభివృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. జర్నలిజంలో నరిశెట్టి రాజు రారాజుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారని, ఆయనను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పారు. ఫోర్త్ ఎస్టేట్‌గా పరిగణించే మీడియా విలువలు పాటించే విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోని ముందుకెళ్లాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు సూచించారు. ‘జగతి’ మాసపత్రికను స్థాపించి 55 ఏళ్లపాటు ఎన్ని సవాళ్లు ఎదురైనా మొక్కవోని దీక్షతో నడిపి జర్నలిజానికి వన్నె తెచ్చిన వ్యక్తి ఎన్ఆర్ చందూర్ అని నరిశెట్టి రాజు పేర్కొన్నారు. ఆయన జ్ఞాపకార్థం ప్రదానం చేసిన ఈ అవార్డును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి చేతుల మీదుగా అందుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వెంకయ్యనాయుడు సతీమణి ఉష, కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
బాబూ.. కేసీఆర్‌ను చూసి నేర్చుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: ఇంటర్ వరకు తెలుగు భాష తప్పనిసరి విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును చూసి నేర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హితవు పలికారు. ఆదివారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై తెలుగు వ్యక్తిగా ఎంతో గర్విస్తున్నానన్నారు. ఈ విషయంలో ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారు. ఇంటర్ వరకు తెలుగును తప్పనిసరి చేస్తామని మూడేళ్లుగా చెబుతున్న బాబు.. ఇప్పటి వరకు హామీని అమలు చేయలేదని విమర్శించారు. ఏటా గిడుగు రామ్మూర్తి పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చే ఉపన్యాసంలో తెలుగు భాషను తప్పనిసరి చేస్తామని బాబు చెబుతున్నా ఆచరణలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. ప్రభుత్వ కార్యక్రమాలు, శిలాఫలకాలను తెలుగులోనే ముద్రించాలని జీవో జారీ చేసినా అమలు చేయడం లేదని మండిపడ్డారు. గోదావరి పుష్కరాల చివరి రోజున చంద్రబాబు ప్రసంగిస్తూ.. రాజమండ్రిలో తెలుగు విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. -
అమెరికా రాజకీయాల్లోనూ రాణించాలి
- ప్రవాసాంధ్రులకు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పిలుపు - తానా–కాకర్ల సుబ్బారావు పురస్కారం అందుకున్న యార్లగడ్డ సాక్షి, న్యూఢిల్లీ: ఐటీ, వైద్యం, న్యాయవాద, వ్యాపార రంగాల్లో చెరగని ముద్ర వేసుకొని అమెరికా ఆర్థిక, సామాజిక, పౌర వ్యవస్థలో మమేకమైన ప్రవాస తెలుగు వారు ఆ దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించాలని పద్మభూషణ్ పురస్కార గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కోరారు. ఆదివారం సెయింట్ లూయీలో తానా 21వ ద్వైవార్షిక మహాసభల ముగింపు వేడుకల్లో భాగంగా తానా–కాకర్ల సుబ్బారావు జీవన సాఫల్య పురస్కారాన్ని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అందుకున్నారు. ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, సినీ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు, ఎంపీ మురళీమోహన్ ఈ పురస్కారాన్ని యార్లగడ్డకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభూమి రుణం తీర్చుకోమంటూ ప్రభుత్వాలు ప్రవాసులకు చేస్తున్న విజ్ఞప్తులు సబబే అయినప్పటికీ, తమ సంపద, సమయాలను పూర్తిగా మాతృదేశంలోనే కాకుండా అమెరికా రాజకీయ వ్యవస్థలోకి అడుగిడేందుకు వినియోగించాలని సూచించారు.ఎన్టీ రామారావు జన్మదినం నాడు తాను జీవన సాఫల్య పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. -
అమెరికాలో యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్‌కు సన్మానం
న్యూయార్క్: డెట్రాయిట్ యూఎస్ఏ స్థానిక ఐలాండ్ లేక్స్ అఫ్ నోవి సమావేశమందిరంలో తెలుగు సాహితీవేత్తలు, అభిమానులు, తెలుగు సంస్థల నాయకుల సమక్షంలో లయోల కళాశాల పూర్వ విద్యార్థులు డా. యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ని సన్మానించారు. పద్మభూషణ్ డా. యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ పూర్వ విద్యార్థి, నాట్స్ నాయకులు శ్రీని కొడాలి నిర్వహించిన ఈ కార్యక్రమంలో లక్ష్మి ప్రసాద్ ని ప్రముఖ వైద్యులు, గుంటూరు ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల అధ్యక్షులు డా. ముక్కామల అప్పారావు సత్కరించారు. పురప్రముఖులు కాట్రగడ్డ నరసింహారావు చేతుల మీదుగా లక్ష్మి ప్రసాద్ కి జ్ఞాపికని అందచేశారు. డా. ముక్కామల అప్పారావు ప్రసంగిస్తూ.. లక్ష్మి ప్రసాద్ తో తనకున్న మూడు దశాబ్దాల పరిచయం, ఆయన ఒక మామూలు వ్యక్తిగా జీవితం ప్రారంభించి, అకుంఠిత దీక్షతో సాహితీ సేవద్వారా పద్మభూషణుడైన ప్రస్థానాన్ని సభికులకు వివరించారు. నాట్స్ డైరెక్టర్ డా. కొడాలి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. లక్ష్మి ప్రసాద్ గారి విజయానికి ఆయన సాధించిన అవార్డులు గీటురాయి అన్నారు. తానా మాజీ అధ్యక్షులు డా. బండ్ల హనుమయ్య చౌదరి తన ప్రసంగంలో, లక్ష్మి ప్రసాద్ చేసిన హిందీ, తెలుగు బాషలలో రచనలు వివరిస్తూ వివిధ భాషలపైనా ఆయనకి ఉన్నపట్టుని వివరించారు, బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు . తానా మాజీ బోర్డు అఫ్ డైరెక్టర్ డా. యడ్ల హేమ ప్రసాద్ జై ఆంధ్ర ఉద్యమంలో తాను చూసిన ఒక యువకుడు నేడు పద్మభూషణుడిగా మన ముందు నిలబడటం కృషితో మనిషి సాధించలేనిది ఏమీ లేదు అన్నది మరొకమారు నిరూపితమైనది అన్నారు. డా. లక్ష్మి ప్రసాద్ తన ప్రసంగంలో తన శిష్యులు ప్రపంచంలో అన్ని దేశాలలో వున్నారు, వారి ప్రగతి ని చూస్తుంటే తనకి చాలా సంతోషంగా ఉంటుంది, జీవితం సార్ధకం అనిపిస్తూ ఉంటుంది అన్నారు. తెలుగులో ఎంతో మంది కవులు, గొప్ప రచయితలు వున్నారు, తనకి దక్కిన ఈ గౌరవం భగవంతుడి వరంలా భావిస్తూ వుంటాను, చివరివరకు తెలుగు భాషకి సేవ చేయాలన్నదే తన అభిమతమని తెలిపారు. నాట్స్ చేస్తున్న ఈ కార్యక్రమాలు వారి 'భాషే రమ్యం, సేవే గమ్యం' ఆశయానికి నిదర్శనం అని కొనియాడారు. డా. రాఘవేంద్ర చౌదరి, నాట్స్ నేషనల్ సర్వీసెస్ కోఆర్డినేటర్ కృష్ణ కొత్తపల్లి, డీటీఏ అధ్యక్షులు హర్ష, వేణు సురపరాజు, వినోద్ కుకునూర్ తదితరులు ప్రసంగించారు. డా. సాయి రమేష్ బిక్కిన, డా. సురేష్ అన్నే, డా. సుధ, డా. ఉష , డా. అరుణ బావినేని, డా. సునీల్ కోనేరు, డా. శ్రీదేవి, డా. విజయ, ప్రముఖ నిర్మాత మైత్రి మూవీస్ అధినేత నవీన్ యెర్నేని, ద్వారకా ప్రసాద్ బొప్పన, ప్రసాద్ గొంది, వెంకట్ కొండోజు, సురేష్ పుట్టగుంట, వెంకట్ ఎక్కా, నాని గోనుగుంట్ల, మహీధర్ రెడ్డి , సుధాకర్ కాట్రగడ్డ, శ్రీనివాస్ నిమ్మగడ్డ, సాగర్ మారంరెడ్డి, తానా ఆర్వీపీ శివ యార్లగడ్డ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమ వ్యాఖ్యాత గా శివ అడుసుమిల్లి వ్యవహరించారు. నాట్స్ వైస్ ప్రెసిడెంట్ బసవేంద్ర సూరపనేని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన డిట్రాయిట్ నాట్స్ ప్రెసిడెంట్ కిషోర్ తమ్మినీడి, ఆర్వీపీ విష్ణు వీరపనేని, వెంకట్ కొడాలి, గౌతమ్ మర్నేని, శ్రీధర్ అట్లూరి, మోహన్ సూరపనేని, రాంప్రసాద్ చిలుకూరి, శ్రీనివాస్ వేమూరిలను అభినందించారు. -
బడ్జెట్ తెలుగులోనే ప్రవేశ పెట్టాలి
-
ప్రపంచం కీర్తించే ఐదుగురిలో ముగ్గురు భారతీయులే
గుడివాడ: ప్రపంచం కీర్తించే ఐదుగురు మహానుభావుల్లో ముగ్గురు మన భారతదేశంలో పుట్టిన వారు కావడం ఎంతో గర్వకారణమని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. ఏపీలోని గుడివాడలో ఉన్న విశ్వభారతి ఇంగ్లిష్ మీడియం స్కూల్లో గురువారం జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చే నాటికి చిన్నచిన్న రాజ్యాలుగా ఉన్న ప్రాంతాలను సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో విలీనం చేశారని, భారతదేశాన్ని గణతంత్ర దేశంగా తీర్చిదిద్దుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రూపొందించారని వివరించారు. ప్రపంచం కీర్తించే మహానుభావులు శ్రీకృష్ణుడు, జీసెస్, మహ్మద్ ప్రవక్త, బుద్ధుడు, మహాత్మాగాంధీ అని, వారిలో ముగ్గురు భారత గడ్డపై పుట్టినవారు కావడం మనం గర్వించదగ్గ విషయమన్నారు. భారతదేశ విశిష్టతను విద్యార్థులకు తెలిపారు. కార్యక్రమం అనంతరం 3,214 మీటర్ల పొడవైన జాతీయ పతాక ప్రదర్శన ర్యాలీని యార్లగడ్డ ప్రారంభించారు. నాలుగు గంటలపాటు 3,500 మంది విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ డీఎస్పీ అంకినీడు ప్రసాద్, టూటౌన్ సీఐ శివాజీ, పాఠశాల వ్యవస్థాపకుడు పొట్లూరి శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. -
'జస్టిస్ జాస్తి చలమేశ్వర్ డే'గా అక్టోబర్ 14
ఇల్లినాయిస్: భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌కు అరుదైన గౌరవం లభించింది. సంయుక్త ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, గౌహతీ, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా చారిత్రాత్మకమైన తీర్పులు అందించినందుకు గానూ అమెరికాలోని ఇల్లినాయిస్లోని నేపర్విల్ నగర మేయర్ స్టీవ్ చిరికో అక్టోబర్ 14వ తేదీని 'జస్టిస్ జాస్తి చలమేశ్వర్ డే'గా ప్రకటించారు. సమాచార సాంకేతిక చట్టంలోని 66ఏ అధికరణను జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కొట్టివేయడం ద్వారా సామాజిక మాధ్యమాల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వెసులుబాటు కల్పించారని స్టీవ్ కొనియాడారు. భారత ప్రధాన న్యాయమూర్తుల నియామకాల్లో కొలిజీయం విధానాల లొసుగులను, లోటుపాట్లను నిష్కర్షగా విమర్శించడం, ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించేందుకు ఆధార్ కార్డు ఒక్కటే ప్రామాణికమని అది లేని వారికి సేవలను నిరాకరించే చట్టానికి స్వస్తి పలకడం వంటి చారిత్రాత్మకమైన తీర్పులను వెలువరించి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ న్యాయవ్యవస్థకు మరింత వన్నె తెచ్చారని స్టీవ్ ప్రశంసించారు. ఈ అరుదైన గౌరవాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా భారత న్యాయవ్యవస్థ గొప్పతనాన్ని ఆయన వివరించారు. మానవ హక్కులకు సంబంధించిన తీర్పులు వెలువరించే సమయంలో తాను అమెరికా సుప్రీం కోర్టు గతంలో నిర్దేశించిన తీర్పులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటి ఆధారంగా తన తీర్పులను తీర్చిదిద్దుకుంటానని జస్టిస్ జాస్తి వెల్లడించారు. యార్లగడ్డకు రెండు పురస్కారాలు పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు సాహిత్య భారతి పురస్కారాన్ని చికాగో కేంద్రంగా పనిచేస్తున్న భారతీ తీర్థ సంస్థ చికాగోలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అందించింది. భారతీ తీర్థ-సప్నా సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ తాతా ప్రకాశం చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందించారు. యార్లగడ్డకు జ్ఞాపికను అందిస్తున్న నేపర్విల్ రోటరీ క్లబ్ ప్రతినిధురాలు నీనా మెనిస్, తాతా ప్రకాశం, శారదాపూర్ణ. చిత్రంలో జస్టిస్ జాస్తి. హిందీ, తెలుగు భాషల్లో రెండు పీహెచ్డీ పట్టాలు అందుకుని ఆయా భాషల అభివృద్ధికి, వ్యాప్తికి నిరంతరం కృషి చేస్తూ 64 పుస్తకలు రచించిన అరుదైన ఘనత సొంతం చేసుకున్నందుకుగానూ యార్లగడ్డను నేపర్విల్ నగర రోటరీ క్లబ్ ప్రతినిధి నీన మెనిస్ "పాల్ హ్యారిస్" పురస్కారంతో సత్కరించారు. అనంతరం ప్రసంగించిన యార్లగడ్డ తెలుగు భాషా, సంస్కృతి, సంగీత, సాహిత్యాల వైశిష్ట్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శొంఠి శారదపూర్ణ, చికాగో తెలుగు సంఘం, గ్రేటర్ చికాగో తెలుగు సంఘం, అమెరికా తెలుగు సంఘం, ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), మనబడి, చికాగో హిందూ దేవాలయం, నేపర్విల్ రోటరీ క్లబ్, నేపర్విల్ నగర కౌన్సిల్ సభ్యులు, ప్రతినిధులు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
శిలాఫలకాలపై ఇంగ్లిష్ సిగ్గుచేటు: యార్లగడ్డ
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాష పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం యార్లగడ్డ ఆధ్వర్యంలో తెలుగు ఆవేదన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగు భాషకు ప్రభుత్వం ద్రోహం చేస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు. అమరావతిలో శిలాఫలకాలపై ఇంగ్లీష్ అక్షరాలు ఉండటం సిగ్గుచేటని అన్నారు. అక్టోబర్ 2 నాటికి శిలాఫలకాలను మార్చాలని, లేకపోతే ఉద్యమం తప్పదని యార్లగడ్డ హెచ్చరించారు. -
సింగపూర్‌లో ప్రపంచ తెలుగు సాహితీవేత్తల సదస్సు
విశాఖపట్నం : ఐదవ ప్రపంచ తెలుగు సాహితీవేత్తల సదస్సు నవంబర్ 5,6 తేదీల్లో సింగపూర్‌లో నిర్వహించనున్నట్లు లోక్‌నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. బుధవారం విశాఖపట్నంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.... ఈ సదస్సుకు ఆగ్నేయ ఆసియా ఖండంలోని దేశాలకు చెందిన రచయితలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. -
'తెలుగుపై ప్రభుత్వానికి చిన్నచూపు'
విశాఖపట్నం : భవిష్యత్తులో తెలుగు భాషను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవల్సిన దుస్థితి రానుందని లోక్‌నాయక్ ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తెలుగు భాష పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. మంగళవారం విశాఖపట్నంలో పోలవరపు కోటేశ్వరరావు రచించిన కృష్ణవేణి నృత్య రూపకానికి సంబంధించి ఏర్పాటులో భాగంగా లక్ష్మీప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...రానున్న రోజుల్లో తెలుగు సంస్కృతి గూర్చి తెలుసుకునేందుకు విదేశాలపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంటుందన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగును సబ్జెక్ట్‌గా బోధించాలని ప్రభుత్వానికి చెబితే... తప్పనిసరి చేస్తామని చెప్పిన ప్రభుత్వం తర్వాత ఆ విషయాన్ని విస్మరించిందని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు నాలుగు వేల తెలుగు మీడియం పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని విమర్శించారు. తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. దీనిపై ప్రభుత్వంతో చర్చించేందుకు తాను సిద్ధమని యార్లగడ్డ ఈ సందర్భంగా ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. కార్మిక దినోత్సవం మేడే నాడు మహాకవి శ్రీశ్రీ గృహాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చినా ఆ దిశగా పనిచేయకపోవడం శోచనీయమన్నారు. ఈ నెల 24న కూచిపూడి అకాడమీ ఆఫ్ సెయింట్ లూయిస్ (అమెరికా) కు చెందిన వింజమూరి సుజాత బృందంచే విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో కృష్ణవేణి 'నృత్యరూపకం' ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వెల్లడించారు. ఈ బృందంలో అమెరికాకు చెందిన నలుగురు కళాకారులు ఉన్నారని పేర్కొన్నారు. తెలుగు సంస్కృతిని పరిరక్షించే క్రమంలో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో కళాకారులు వింజమూరి సుజాత, మానస, శైలజ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ మానసపుత్రిక పై ఇంత నిర్లక్ష్యమా!
తెలుగు విశ్వ విద్యాలయాపట్టించుకోని చంద్రబాబు సర్కారు సాహితీవేత్త, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మండిపాటు రాజమహేంద్రవరం రూరల్: ‘తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు మానస పుత్రికైన తెలుగు విశ్వ విద్యాలయంపై ఇంత నిర్లక్ష్యమా’ అంటూ రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వంపై ప్రముఖ సాహితీవేత్త, మాజీ ఎంపీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరులోని తెలుగు విశ్వ విద్యాలయం సాహిత్య పీఠాన్ని శనివారం ఆయన పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాహిత్య పీఠంలో కేవలం తొమ్మిది మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని, వారం రోజులుగా కరెంటు లేకపోయినా పాములు, తేళ్ల మధ్యే వారు జీవించాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి వంట కూడా వారే చేసుకోవాల్సి వస్తోందన్నారు. గతేడాది గోదావరి పుష్కరాల ముగింపు సందర్భంగా రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ఇచ్చిన అనేక హామీల్లో ‘రాజమహేంద్రవరం’ పేరు మార్పు తప్ప మిగిలిన వేవీ అమలుకు నోచుకోలేదన్నారు. ఇటీవల మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగు వర్సిటీని త్వరలోనే రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారని, ఆ హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం స్థానిక ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు కృషి చేయాలన్నారు. ఆదికవి నన్నయ వర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలలు ఇంకా ఏయూలో ఉండటం దుర్మార్గమని మండిపడ్డారు. -
తెలుగు ప్రజలకు ఇది శుభదినం
-‘ప్రాచీన హోదా’పై పిటిషన్‌ను కొట్టివేయడంపై యార్లగడ్డ సాక్షి, న్యూఢిల్లీ తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను చెన్నై హైకోర్టు కొట్టివేయడం సంతోషకరమని పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఇది తెలుగు ప్రజలకు శుభదినం అని పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో యార్లగడ్డ విలేకరులతో మాట్లాడారు. మాతృభాషపై ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలుగును ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది ప్రపంచ భాషగా మార్చేందుకు కృషి చేయాలని కోరారు. తెలుగు భాష అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తిచేశారు. కేసును మద్రాసు కోర్టు కొట్టివేయడంతో కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప, సీపీఐ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎంపీలకు యార్లగడ్డ మిఠాయిలు ఇచ్చి ఆనందాన్ని పంచుకున్నారు. -
'ప్రతి ప్రవాసుడు నడుం బిగించాలి'
► తెలుగు భాష వైతాళికులను మరవకండి ► బే-ఏరియా సభలో యార్లగడ్డ విజ్ఞప్తి శాన్ ఫ్రాన్సిస్కొ: తెలుగు భాష అభ్యున్నతికి బాటలు వేసి, తెలుగు వెలుగులను విశ్వవ్యాప్తం చేసిన వైతాళికులను మరిచిపోకుండా గుర్తుంచుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. శుక్రవారం బే-ఏరియాలోని రాయల్ ప్యాలెస్ సమావేశ మందిరంలో తానా, బాటా, మన-పాఠశాల సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు తమ మాతృభాషకు సేవ చేసిన వారి గృహాలు, వాడిన వస్తువులను పదిలపరిచి వాటిని ప్రపంచస్థాయి పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దాయని.. కానీ మనదేశంలో ఇలా జరగకపోవటం దారుణమని యార్లగడ్డ ఆవేదన చెందారు. భాషాభివృద్ధికి తమ జీవితాన్ని ధారపోసిన ఎందరో త్యాగధనులను సరైన రీతిలో గౌరవించుకొవడానికి ప్రతి ప్రవాసుడు నడుం బిగించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా 1875 నుండి 2000 కాలం మధ్య తెలుగు భాష ప్రేమికులుగా, వైతాళికులుగా వెలుగొందిన 40మంది తెలుగువారి జాబితాను సభకు విడుదల చేశారు. ప్రతి ప్రవాసుడు తమ జేబులో నుంచి కేవలం 10డాలర్లు విరాళంగా అందిస్తే అటు మహానుభావులకు గౌరవమే కాకుండా భావితరాలకు ఓ అమూల్యమైన బహుమానం అందించిన వారిగా చరిత్రలో మిగిలిపోతామని యార్లగడ్డ తెలిపారు. ఈ విధంగా పర్యాటక ప్రదేశాలుగా మారిన ఆయా గృహాలను సందర్శించే పర్యాటకులతో గ్రామాల అభివృద్ధికి నూతన ద్వారాలు తెరుచుకుంటాయని ఆయన వెల్లడించారు. ఈ పిలుపుకు స్పందించిన ప్రవాసాంధ్ర ప్రముఖుడు డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి.. కృష్ణా జిల్లా బెజవాడలోని "కవిసామ్రాట్" విశ్వనాథ సత్యానరాయణ నివాస గృహ పరిరక్షణకు రూ.10లక్షలు ప్రకటించారు. ఈ సొమ్మును ఖర్చు చేసే బాధ్యతను అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం పర్యవేక్షిస్తారని లకిరెడ్డి వెల్లడించారు. శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక రంగాల్లో డాక్టరేట్లు, గ్రాడ్యుయేట్లు అందుకున్న తెలుగువారు ఇక్కడ అమెరికన్ల ఆదరాభిమానాలు చూరగొనటమే గాక భారతదేశంలో కూడా కథానాయకులుగా గౌరవం పొందడం సంతోషించదగ్గ విషయమన్నారు. 10వతరగతి కూడా పూర్తి చేయని సినీహీరోల కోసం కులాలు, ప్రాంతాల పేరిట దెబ్బలాడుకోవడం హాస్యాస్పదంగా ఉందని యార్లగడ్డ తెలిపారు. అనంతరం యార్లగడ్డను నిర్వాహకుల బృందం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో కోమటి జయరాం, వేమూరు సతీష్, తోట రాం, నందిపాటి హేమారావు, ఆసూరి విజయ, కుదరవల్లి యశ్వంత్, కోగంటి వెంకట్, తానా, బాటా, మనపాఠశాల సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
మాతృభాషకు ఆదరణ తగ్గుతోంది
ఆవేదన వ్యక్తం చేసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో మాతృభాషకు ఆదరణ తగ్గుతోందని పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కూడా భాషా పరిరక్షణకు తగిన చర్యలు చేపట్టడంలేదని ఆయన మండిపడ్డారు. అమెరికాలో మాత్రం తెలుగు భాష వెలుగొందుతోందని పేర్కొన్నారు. శనివారం ఫిలడెల్ఫియాలో ఏర్పాటైన ‘పాఠశాల’ వార్షికోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రవాసాంధ్రులు తమ పిల్లలకు భాషా, సంస్కృతులను నేర్పించడంలో ముందంజలో ఉన్నారని, అమెరికాలో ‘పాఠశాల’ వంటి ప్రత్యేక శిక్షణా సంస్థలను దీని కోసం ఏర్పాటు చేయడం సంతోషకరమని చెప్పారు. మాతృ భాష పట్ల ప్రవాసాంధ్రులు చూపుతున్న శ్రద్ధ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రముఖ పాత్రికేయులు నరిసెట్టి ఇన్నయ్య మాట్లాడుతూ అమెరికాలో తెలుగువారు నిర్వహించే ఉత్సవాలకు అక్కడి స్థానికులను కూడా ఆహ్వానించాలని కోరారు. యార్లగడ్డ దంపతులను స్థానిక ప్రవాసాంధ్రులు, పాఠశాల సిబ్బంది సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని తానా ప్రాంతీయ ఉపాధ్యక్షుడు పొట్లూరి రవి నిర్వహించారు. -
త్రిభాషా సూత్రాన్ని పాటించండి: యార్లగడ్డ
బ్రాంప్టన్(కెనడా): హిందీ ప్రాంతీయులు విశాల దృక్పథాన్ని అలవర్చుకొని, త్రిభాషా సూత్రాన్ని పాటించాలని ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సూచించారు. కెనడాలో విశ్వహిందీ సంస్థాన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ హిందీ కవిసమ్మేళనం ' కావ్యసాగర్' జరిగింది. బ్రాంప్టన్‌లోని ద గోర్-మీడేజ్ కమ్యూనిటీ సెంటర్లో జరిగిన ఈ కవి సమ్మేళనంలో కెనడా, భారత దేశాలకు చెందిన పలువురు హిందీ కవులు పాల్గొని తమ కవితలు, గజళ్లు, గీతాలతో వీక్షకులను ఆకట్టుకున్నారు. యార్లగడ్డ మాట్లాడుతూ హిందీ ప్రాంతీయులు ఏదో ఒక ఇతర భాషను కూడా నేర్చుకోవాలని, అప్పుడే జాతీయ సమైక్యత సాధించగలమని అన్నారు. విదేశాల్లో హిందీ భాషపై అభిమానం రోజురోజుకు పెరుగుతుందనడానికి కవి సమ్మేళనానికి హాజరైన వారిని చూస్తేనే అర్థం అవుతుందన్నారు. రానా, యూపికా, నారాయణ్ సేవా సంస్థాన్ అనే సంస్థల సహకారంతో నిర్వహించిన ఈ కవి సమ్మేళనంలో రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ కవయిత్రి దీపికా ద్వివేదీ'దీప్', ఉత్తర్ ప్రదేశ్ కవయిత్రి మమతా వాష్ణేయ్, టోరంటో భారత రాయభార ప్రతినిధి, ఇంకా పలువురు హిందీ భాషాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టొరంటో నారయణ సేవాసమితి అధ్యక్షుడు కైలాష్ చంద్రభట్నాగర్ను నిర్వాహకులు జీవన సాఫల్యపురస్కారంతో సత్కరించారు. ఇటీవల పద్మభూషణ్ అవార్డు అందుకున్న యార్లగడ్డను విశ్వహిందీ సంస్థాన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. -
హిందీ-తెలుగు భాషల స్వర్ణసేతువు
సందర్భం తెలుగువారికి చెందిన ఏ విషయమైనా హిందీలోకి అనువదిస్తే తప్ప మన విశిష్టత హిందీ వారికి తెలియదని, అట్లే హిందీ సాహిత్యం, సంస్కృతి తెలియకపోతే మన విజ్ఞానం పరిమి తమే అవుతుందని భావించిన యార్లగడ్డ రెండుభాషల్లో 64 గ్రంథాలను వెలువరించారు. నిత్య అధ్యయన శీలి, నిరంతర కార్యశీలి, నిబద్ధత గల భాషా సేవ కుడు, లక్ష్య సాధకుడు, తెలుగు భాషా సంస్కృతుల ఉద్దీపనకు చైతన్య దీప్తి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్. తెలుగు-హిందీ భాషలు ఆయనకు ఉఛ్వాస నిశ్వాసలు. అందుకే హిందీ- తెలుగు భాషల స్వర్ణసేతువు యార్లగడ్డ అని జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా. సి. నారాయణరెడ్డి 20 ఏళ్లక్రితమే అన్నారు. పార్లమెంటులో స్వచ్ఛమైన హిందీలో యార్లగడ్డ అనర్గళంగా ప్రసంగిస్తూంటే హిందీ ప్రాంతీయులైన పార్లమెంటు సభ్యులు ఆశ్చర్యంతో ఆలకిస్తూ ఉండేవారు. 30 మంది ఎంపీలతో కూడిన పార్లమెంటరీ అధికార భాషా సంఘంలో ఆ కమిటీకి యార్ల గడ్డ నాయకత్వం వహించటమే కాకుండా నాలుగేళ్లపాటు దేశవ్యాప్తంగా పర్యటించి వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాల యాల్లో రాజభాష హిందీ వినియోగాన్ని సమీక్షించడం దగ్గరగా చూసిన సి.నా.రె. ‘మన తెలుగువాడు హిందీ మీద పెత్తనం వహిస్తున్నాడ’ని ఆనందపడేవారు. దేశంలోని అధికారభాషా చట్టాలు, వాటికి సంబంధిం చిన నియమ నిబంధనలపై యార్లగడ్డకు గల పరిజ్ఞానం, అవగాహన అధికం. అందుకే ప్రధానమంత్రి అధ్యక్షులుగా, హోంమంత్రి ఉపాధ్యక్షులుగా, 6గురు సీనియర్ కేంద్ర మంత్రులు, 6గురు వివిధ రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్న కేంద్రీయ హిందీ సమితిలో యార్లగడ్డ ఒక్కరే 25 ఏళ్లుగా అప్రతిహతంగా సభ్యులుగా కొనసాగుతున్నారు. కేంద్రంలోని కీలకమైన మంత్రిత్వ శాఖలకు హిందీ సలహా సంఘ సభ్యులుగా యార్లగడ్డ నేటికీ సలహాలు ఇస్తున్నారు. హిందీ-తెలుగు భాషల మధ్య ఆదాన ప్రదానాల్లో స్పెషలిస్టు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. తెలుగువారికి చెందిన ఏ విషయమైనా హిందీలోకి అనువదిస్తే తప్ప మన జాతి వైశిష్ట్యం హిందీవారికి తెలియదని, అలాగే హిందీ సాహి త్యం, సంస్కృతి మన తెలుగువారికి తెలియకపోతే మన విజ్ఞానం పరిమితమే అవుతుందని భావించిన యార్లగడ్డ హిందీలోంచి తెలుగులోకి, తెలుగునుంచి హిందీలోకి 64 గ్రంథాలను వెలువరించారు. ఎందరో సహచరుల్ని, విద్యా ర్థుల్ని ఈ ఆదాన్-ప్రదాన్ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేశారు. ఆయన సంకల్ప శుద్ధితోనే గత రెండు- మూడు దశాబ్దాలుగా వందలాది విలువైన గ్రంథాలు రెండు భాషల్లోకి పరస్పరం అనువాదమయ్యాయి. ఆదాన ప్రదానాలు ధ్యేయంగా ఆయన చేసిన రచనల్లో ముఖ్యంగా చెప్పుకోదగినది తెలుగులో ‘హిందీ సాహిత్య చరిత్ర’ రచన. 12 ఏళ్లు శ్రమించి హిందీ సాహిత్య చరిత్రను తెలుగువారికి అందించారు. ఈ రచనకు బహుభాషావేత్త, మన పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు 29 పేజీల ముం దుమాట రాయటమే కాకుండా ఆ గ్రంథ ఆవిష్కరణ సభకు స్వయంగా విశాఖపట్నం వచ్చి స్వహస్తాలతో గ్రంథాన్ని ఆవిష్కరించడమే కాక, యార్లగడ్డ చేసిన అద్వితీయ కృషిని పదే పదే అభినందించారు. తను చేసిన మరొక అపురూప మైన అనువాద రచన.. ప్రసిద్ధ హిందీకవి హరివంశరాయ్ బచ్చన్ ఆత్మకథను తెనుగించడం. బచ్చన్ హిందీలో 4 భాగాలుగా రాసుకున్న బృహత్ ఆత్మకథను యార్లగడ్డ ఒకే పెద్ద గ్రంథంగా ప్రచురించారు. హైదరాబాద్‌లోని వైశ్రాయ్ హోటల్లో జరిగిన ఈ గ్రంథ ఆవిష్కరణకు హరివంశరాయ్ బచ్చన్ కుమారుడు, ప్రముఖ హిందీ సినీ నటుడు అమి తాబ్ బచ్చన్ కుటుంబ సమేతంగా హాజరై తన తండ్రి ఆత్మకథను తెలుగుప్రజలకు అందించడంలో మహత్తరకృషి చేసిన యార్లగడ్డను అభినందనలతో ముంచెత్తారు. మహనీయులు, దేశనేతలు, ఉద్యమనేతల జీవిత చరిత్రలను, ఆత్మకథలను రచించడం, అనువదించడం, తమస్ వంటి సంచలన రచనలను సత్వరమే అనువదించి ప్రచురించడం, హిందీ-తెలుగు భాషల్లో ఉత్తమోత్తమ రచన ల్ని అనువదించడంతోపాటు యార్లగడ్డ సాహిత్య ప్రయా ణం ‘ద్రౌపది’, ‘సత్యభామ’ వంటి సృజనాత్మక రచనల దిశ గా కూడా సాగి ఇరుభాషల పాఠకుల మన్ననలు అందుకుం ది. పలు దేశాల్లో పర్యటించి అంతర్జాతీయ అవగాహనను పెంచుకున్నారు. కెనడాలో భారత సాంస్కృతిక రాయబారి గా నియమితులయ్యారు. ఈక్రమంలోనే మాస్కోలోని ‘భారత్ మిత్ర సమాజ్’ ప్రసిద్ధ రష్యన్ కవి పుష్కిన్ పేరుతో భారతీయ హిందీ కవి లేదా రచయితకు ఇచ్చే వార్షిక పురస్కారం 2007లో యార్లగడ్డను వరించింది. నాగపూ ర్లో 1975లో జరిగిన మొదటి సమ్మేళనం మినహా, ఇప్పటి వరకు జరిగిన ఇతర 9 విశ్వ హిందీ సమ్మేళనాల్లో పాల్గొని ప్రముఖ భూమికను నిర్వహించిన ఏకైక వ్యక్తి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. దక్షిణాఫ్రికాలో జరిగిన 9వ సమ్మేళనంలో ‘విశ్వ హిందీ సమ్మాన్’ పురస్కారం అందు కున్నారు. ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ అధ్యక్షులుగా యార్లగడ్డ హిందీ-తెలుగు సాహిత్యాలకు చేసిన సేవ అపారం. నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనను హిందీ అకాడమీ సభ్యునిగా చేస్తే, తదనంతరం 2006లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హిందీ అకాడమీని పునఃప్రారంభించి ఆయనను అధ్యక్షుణ్ని చేశారు. ఏపీలో వందేళ్లుగా సాగుతున్న హిందీ ప్రచారం ఉద్యమ చరిత్రను శోధింపజేసి ఆ పత్రాలను ఆంధ్రప్రదేశ్‌లో హిందీ ప్రచారోద్యమ చరిత్ర అనే గ్రంథంగా హిందీలో ప్రచురించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో హిందీ సాహిత్య వికాస చరిత్ర గ్రంథాన్ని కూడా ప్రచురించి రాష్ట్రంలో హిందీ భాషాభివృద్ధి, సాహిత్య రచనకు సంబంధించిన సమగ్ర చరిత్రను అందుబాటులోకి తెచ్చే మహత్తర కృషి చేశారు. హిందీ అకాడమీ అధ్యక్షులుగా ఉన్న ఆరేళ్ల కాలంలో తెలుగు భాషాసాహిత్య, సంస్కృతు లను ప్రతిబింబించే వంద గ్రంథాలను హిందీలోకి అనువదించి తెలుగుకు దేశవ్యాప్త గౌరవం కలిగించారు. యార్లగడ్డ కృషి ఫలితంగా భారత ప్రభుత్వ నిధులతో అద్భుతమైన రాజభాషా భవన్ నిర్మితమైంది. విశాఖలోని ఈ భవన్ దేశంలోనే మొట్టమొదటిది చివరిది కూడా. హిందీ-తెలుగు భాషలు రెండింటిలో పరిశోధన చేసి పిహెచ్.డి పట్టాలు పొందారు. తెలుగు నాట హిందీ ప్రచారం, సాహిత్య రచనలో కృషికి గాను రాష్ట్రపతి చేతులమీదుగా గంగాశరణ్ సింహ్ పురస్కారం అందుకున్నారు. 2003లో తన 50వ ఏట నాటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు భారత ప్రభుత్వం ‘హిందీ’ మనిషిగా ఆయనకు పద్మభూషణ్ పురస్కారం ప్రదానం చేయడం తెలుగువారందరికీ గర్వకారణం. హిందీ భాషా సేవలో జీవితాన్ని సార్థకం చేసుకుంటున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కి అభినందనలు, శుభాకాంక్షలు. (నేడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పద్మభూషణ్ అవార్డు అందుకోబోతున్న సందర్భంగా) డాక్టర్ వెన్నా వల్లభరావు వ్యాసకర్త విశ్రాంత హిందీ అధ్యాపకులు, ఆంధ్ర లయోల కళాశాల, విజయవాడ. మొబైల్ః 9490337978 -
తెలుగుకు అన్యాయంపై ‘ఆవేదన దీక్ష’
రాజమహేంద్రవరం : ‘తెలుగు ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవలసిన ఉగాది కాదు. ఇది తెలుగు భాషా సంస్కృతులకు జరుగుతున్న దగాది’ అని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయన శుక్రవారం మండుటెండలో ‘ఆవేదన దీక్ష’ చేశారు. తాము కొత్తగా ఏదీ కోరడం లేదని, తెలుగుదేశం ప్రభుత్వం తెలుగు భాష విషయంలో ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు, గద్దెనెక్కాక చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని కోరుతున్నామన్నారు. 'తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దంగా చెబుతున్న అమరావతి నిర్మాణ శిలాఫలకం, తాత్కాలిక రాజధాని శిలాఫలకాలు ఇంగ్లిషులోనే ఉన్నాయి. ఆంగ్ల శిలాఫలకాలకు నేను వ్యతిరేకం కాదు. అధికార భాషా చట్టం ప్రకారం ప్రభుత్వ శిలాఫలకాలు, రాతకోతలలో తెలుగు తప్పనిసరి. నేను తెలుగులో శిలాఫలకం తయారు చేయించి, గత నెల 26న విజయవాడలో ఆ శిలాఫలకాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లి సీఆర్డీఏ కార్యాలయంలో అందజేశాను. గత నెల 29న ముఖ్యమంత్రి చంద్రబాబును స్వయంగా కలుసుకుని ఉగాదిలోగా తెలుగు భాషలో శిలాఫలకాలు ఏర్పాటు చేయాలని కోరాను. తప్పక చేస్తానని ఆయన ఇచ్చిన హామీ అలాగే మిగిలిపోయింది. పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం తెలుగులో బడ్జెట్ ప్రవేశపెట్టింది. మన అసెంబ్లీలో బడ్జెట్‌ను ఇంగ్లిషులో ప్రవేశపెట్టారు. ఇది సిగ్గుచేటు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి రాజమహేంద్రవరాన్ని ప్రధాన కేంద్రంగా చేస్తామని గోదావరి పుష్కరాల సమాపనోత్సవంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ దిశగా అడుగు పడలేదు. ప్రభుత్వం తనకు తానే తెలుగు భాషకు వ్యతిరేకమని నిరూపించుకుంటోంది. ఇది ఎవరికీ వ్యతిరేక దీక్ష కాదు. నిరసన దీక్ష కాదు. మా ఆవేదనను వ్యక్తం చేయడానికి చేస్తున్న దీక్ష మాత్రమే. తెలుగు భాషా సాంసృ్కతిక రంగాలకు జరుగుతున్న అన్యాయాలను సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి’ అని యార్లగడ్డ డిమాండ్ చేశారు. దీక్షలో రొటేరియన్ పట్టపగలు వెంకటరావు, బ్రౌను మందిర నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి పాల్గొన్నారు. -
'ఇది ఉగాది కాదు... దగాది'
రాజమహేంద్రవరం (రాజమండ్రి) : తెలుగు భాష అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చూస్తుంటే... ఇది ఉగాది కాదు, దగాది అని.. మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలేవి అమలుకు నోచుకోలేదని ఆయన ఆరోపించారు. శ్రీదుర్ముఖి నామ సంవత్సరం ఉగాది నేపథ్యంలో శుక్రవారం రాజమహేంద్రవరంలో మండుటెండలో తెలుగు భాష కోసం రెండు గంటలపాటు ఆయన ఆవేదన దీక్ష చేశారు. అనంతరం యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ... అమరావతి రాజధాని సందర్భంగా శిలాఫలకాన్ని ఇంగ్లీషులో ఏర్పాటు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్‌ను సైతం ఇంగ్లీషులోనే ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. పక్కనే ఉన్న తెలంగాణలో మాత్రం బడ్జెట్‌ను తెలుగులో ప్రవేశపెట్టారని తెలిపారు. ఇది నిరసన కాదని... ఆవేదన మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. గతేడాది తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాష అమలు కోసం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయడానికి అడుగు కూడా ముందుకు పడలేదన్న అన్నారు. కాగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మద్దతు తెలిపారు. -
తెలుగు లో పరీక్షలు రాసుకోండి: మద్రాస్ హైకోర్టు
మాతృభాషలో పరీక్షలు రాసుకునేందుకు వీలు కల్పిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని సాహితీ వేత్త, కేంద్రీయ హిందీ సమితి సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమిళనాడులోని తెలుగు సంఘాల అవిశ్రాంత పోరాట ఫలితంగా, తమిళనాడు బయట ఉన్న తెలుగు వారి సంఘీభావంతో ఎట్టకేలకు హైకోర్టు ఈ ఏడాదికి తమిళనాడులోని భాషా అల్పసంఖ్యాక వర్గాలైన తెలుగు, కన్నడ, మళయాళ, ఉర్దూ మాతృభాష కలిగిన విద్యార్థులకు వారి మాతృభాషలోనే పరీక్షలు రాసుకునేలా తీర్పుఇచ్చిందని అన్నారు. ఈ తీర్పు లక్షలాది విద్యార్థుల భవిష్యత్తును కాపాడిందని చెప్పారు. అయితే ఇది కేవలం వెసులు బాటు మాత్రమే అని... శాశ్వత పరిష్కారం కోసం తమిళనాడులోని భాషా అల్పసంఖ్యాక వర్గాలు 2006 తమిళ భాషా చట్టాన్ని రద్దు చేస్తామన్న పార్టీకే ఓట్లు వేయాలని కోరుతున్నట్లు వివరించారు. ఈ రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని సమూలంగా రద్దు చేయించడానికి సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించనున్నట్లు తెలియజేశారు. భారత ప్రభుత్వ హోం శాఖ కూడా రాజ్యాంగంలోని 351 ఏ అధికరణను ఉపయోగించి ఈ రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని రద్దు చేసి తమిళనాడు భాషా అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. -
తమిళనాడు ప్రభుత్వంపై యార్లగడ్డ ఫైర్
న్యూఢిల్లీ : తమిళనాడు ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని హిందీ భాష సంఘం సభ్యుడు, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆరోపించారు. గురువారం న్యూఢిల్లీలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ... 2006 తమిళ భాషా చట్టాన్ని రద్దు చేస్తామన్న పార్టీలకే ఓటేయ్యాలని తమిళ ఓటర్లకు ఆయన సూచించారు. తమిళ భాషా చట్టం రద్దుపై త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఈ ఏడాది మాతృ భాషలోనే పరీక్ష రాసుకునే అవకాశం కల్పిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించడంపై లక్ష్మీ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. -
'ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది'
విశాఖపట్నం: శ్రీపొట్టిశ్రీరాములు తెలుగు వర్శిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ సిబ్బందికి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మండిపడ్డారు. శుక్రవారం విశాఖపట్నంలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ... ఈ రెండు యూనివర్శిటీల సిబ్బందికి గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదన్నారు. 15 రోజుల్లో జీతాలు చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెంటనే స్పందించాలని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ డిమాండ్ చేశారు. -
విదేశీ వర్సిటీలు సరే, తెలుగు వర్సిటీ మాటేంటి?
తెలుగు విశ్వవిద్యాలయాన్ని పట్టించుకోక ఎన్ని చేసినా వ్యర్థం సిబ్బంది పరిస్థితి దయనీయంగా మారింది కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్తో ‘సాక్షి’ ముఖాముఖి విజయవాడ : రాష్ట్రంలోని రెండు ప్రధాన యూనివర్సిటీల్లో పనిచేసే సుమారు 500 మంది అధ్యాపక సిబ్బంది ఏడు నెలలుగా జీతాలు లేక చెంబులు, బిందెలు తాకట్టుపెట్టుకుని కాల్‌మనీ కోరల్లో చిక్కుతున్నారంటూ రాజ్యసభ మాజీ సభ్యుడు, కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు, లోక్‌నాయక్ ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు యూనివర్సిటీ కోసం తన అంతరంగంలోని తపనను యార్లగడ్డ ‘సాక్షి’ ముఖాముఖిలో ఇలా ఆవిష్కరించారు. సాక్షి: తెలుగు వర్సిటీ ఏర్పాటుకు మీ పోరాటం ఎలా ఉంటుంది? యార్లగడ్డ: పోరాటం అనే పెద్ద మాటలు నేను మాట్లాడలేను. అయితే రాష్ట్ర విభజన జరిగి దాదాపు సంవత్సరంన్నర గడిచిపోయింది. తెలుగు వర్సిటీ ఏర్పాటులో ఒక్క అడుగు ముందుకు పడలేదు. అదే నా ఆవేదన. సాక్షి: తెలుగుకు ప్రాధాన్యం దక్కడంలేదంటారా? యార్లగడ్డ: కనీసం రాజధాని శంకుస్థాపన బోర్డులోనే తెలుగుకు చోటులేదు. అధికార భాష అమలులో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది శూన్యం. సాక్షి: తెలుగు యూనివర్సిటీ ఏర్పాటులో జాప్యం ఎందుకు? యార్లగడ్డ: పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయాన్ని తెలంగాణకు పరిమితం చేసుకుని దానికి సురవరం ప్రతాపరెడ్డిగారి పేరు పెట్టుకుంటామని టీఆర్ఎస్ ఎంపీ కవిత ప్రకటన చేశారు. వెంటనే ఈ విషయాన్ని మన విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లాను. సీఎం చంద్రబాబునాయుడు రాజమండ్రి కేంద్రంగా తెలుగు వర్సిటీని ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశారు. సాక్షి: సీఎం వాగ్దానం చేసి నెలలు గడిచింది కదా? యార్లగడ్డ: తెలంగాణ వాళ్లు అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి కూడా ఏపీలో ఉన్న 90 సెంటర్లకు సర్వీసులు నిలిపేశారు. జూలైలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వాళ్లు కూడా ఆంధ్రప్రదేశ్‌లోని మూడు పీఠాలకు సంబంధం లేదని ప్రకటించారు. జూలై నుంచి ఏపీలో ఈ వర్సిటీల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది 500 మందికిపైగా జీతాలు లేవు. వాళ్లు కుటుంబ పోషణ కోసం వడ్డీలకు అప్పులు తెచ్చుకుని కాల్‌మనీ బారిన పడుతున్నారు. అం బేడ్కర్ వర్సిటీకి సంబంధించి హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించింది. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సాక్షి: ప్రభుత్వంపై మీరు చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి? యార్లగడ్డ: నాది ఆగ్రహం కాదు. ఆవేదన. సెప్టెంబర్ 4న హైకోర్టు ఉత్తర్వులు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాధికారులు నవంబర్ 12 వరకు స్పందించకపోవడంతో హైకోర్టు అక్షింతలు వేసింది. ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు కోసం తహతహలాడిపోతున్నారు. వాటిని విద్యాసేవ కోసం స్థాపిస్తారా? రాష్ట్రంలో సొంత యూనివర్సిటీలను పట్టించుకోకుండా ప్రైవేటు విశ్వవిద్యాలయాలను పట్టుకొస్తానంటావ్. సాక్షి: డిప్లొమా ఇన్ జపాన్ భాష పెడతానంటావ్. డిప్లొమా ఇన్ ఫ్రెంచి భాష పెడతానంటారు. వంద భాషలు పెట్టండి. ముందు అమ్మభాష ఏది? యార్లగడ్డ: వర్సిటీల సిబ్బందికి జీతాలు అర్జెంటుగా ఇప్పించకపోతే మీరు ఎన్ని చేసినా వ్యర్థం. మీరు సమర్థులు అనిపించుకుంటారో లేక అసమర్థులుగా మిగిలిపోతారో తేల్చుకోవాలని చెప్పడానికి నాకు ఎటువంటి మోహమాటం లేదు. వింటే సంతోషం. వినకపోతే ఎన్నికలొస్తాయ్ ప్రజలు చూసుకుంటారు. ఇది నా గొడవ కాదు. సాక్షి: మాతృభాష అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు? యార్లగడ్డ: అధికార భాషా సంఘానికి హరికృష్ణను అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు ప్రకటన చేశారు. కానీ ఇంతవరకు అధికార భాషా సంఘం లేదు. దాని కార్యాలయం లేదు. అంచేత నేను ముఖ్యమంత్రిని కోరేదేమంటే అయ్యా తెలుగు భాషకు సంబంధించి మీ స్పీచ్ బాగుంది. కానీ ఆచరణ బాగాలేదు. దీనిపై దృష్టి పెట్టండి. -
వ్యతిరేక ఉద్యమం వచ్చే ప్రమాదం ఉంది
న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితిలో అధికార భాషగా హిందీని చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ ఛైర్మన్, పద్మశ్రీ ప్రొ. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వెల్లడించారు. బుధవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో కాళోజీ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలకు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, తెలంగాణ సర్కార్ ప్రతినిధి తేజావత్ రామచంద్రు నాయక్‌తోపాటు రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయెల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ... దేశంలో హిందీని అధికార భాషగా మార్చేందుకు యత్నించాలని కేంద్రానికి సూచించారు. ఉత్తర ప్రత్యుత్తర వ్యవహారాలన్నీ హిందీలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన మోదీ సర్కార్‌కు విజ్ఞప్తి చేశారు. హిందీ అకాడమీలలో కేవలం ఉత్తరాది వారినే నియమిస్తున్నారని ఆయన ఆరోపించారు. హిందీ నేర్చుకున్న దక్షిణాది వారిని కూడా అకాడమీలలో నియమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే హిందీ వ్యతిరేక ఉద్యమం వచ్చే ప్రమాదం ఉందని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. రేపటి విశ్వహిందీ మహాసభలు భోపాల్‌లో జరుగనున్నాయని లక్ష్మీప్రసాద్ తెలిపారు. -
ఏపీ సమస్యలపై యార్లగడ్డ దీక్ష
రాజమండ్రి: తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్రా ప్రాంత సమస్యలపై మాజీ పార్లమెంట్ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఒక రోజు దీక్ష చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలోని సీపీ బ్రౌన్ మందిరంలో గురువారం ఆయన ఒక్క రోజు దీక్ష చేస్తున్నారు. రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజమండ్రిలో ప్రస్తుతం ఉన్న తెలుగు యూనివర్సిటీ అనుబంధ కాలేజ్ నిరాధరణకు గురైందన్నారు. ప్రభుత్వం విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. -
'తెలుగు యూనివర్సిటీని రాజమండ్రిలో నెలకోల్పాలి'
-
జస్టిస్ రమణకు డెట్రాయిట్లో ఆత్మీయ స్వాగతం
డెట్రాయిట్ : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణకు అమెరికాలోని డెట్రాయిట్లో ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. జులై 2,3,4 తేదీల్లో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 20వ మహాసభల్లో పాల్గొనేందుకు జస్టిస్ వెంకటరమణ మంగళవారం డెట్రాయిట్ చేరుకున్నారు. స్ధానిక విమానాశ్రయంలో ఆయనకు తానా ప్రాంతీయ ప్రతినిధి యార్లగడ్డ శివరాం నేతృత్వంలో ప్రవాస తెలుగువారు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీగా రమణను ఆయన నివాసానికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు, ఢిల్లీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రమణ 2021లో భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టవచ్చునని తెలుగువారు ఆకాంక్షిస్తున్నారు. జస్టిస్ రమణ వెంట మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా ఉన్నారు. స్వాగత కార్యక్రమంలో తానా అధ్యక్షుడు నన్నపనేని మోహన్, తానా తదుపరి అధ్యక్షుడు వేమన సతీష్, విడిది ఏర్పాట్ల కమిటీ అధ్యక్షుడు చల్లా దంతేశ్వరరావు, డెట్రాయిట్ తెలుగు సంఘం అధ్యక్షుడు శ్రీనివాసన్ గోనుగుంట్లలు పాల్గొని మహాసభలకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్ధానిక ప్రవాసులు మారుపూడి విజయ్, కారుమంచి వంశీ, దుగ్గిరాల కిరణ్, సురేష్ కకుమాను తదితరులను డెట్రాయిట్ ప్రాంతంలో చేస్తున్న సేవలకుగానూ జస్టిస్ రమణ అభినందించారు. -
'ఎన్టీఆర్ మనవడినని తెలియనీయలేదు'
-
'ఎన్టీఆర్ మనవడినని తెలియనీయలేదు'
హైదరాబాద్: నందమూరి జానకిరామ్ మంచితనం మూర్తీభవించిన కుర్రాడని కేంద్రీయ హిందీ సంస్థాన్ ఉపాధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జానకిరామ్ కు ఆయన ఆదివారం శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జానకిరామ్ ఏడాది పాటు తమ ఇంటిలో ఉండి ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకున్నాడని గుర్తు చేసుకున్నారు. మహానటుడు ఎన్టీఆర్ మనవడినని ఎవరికీ తెలియనీయలేదని చెప్పారు. జానకిరామ్ మరణం హరికృష్ణకు తీరనిలోటని అన్నారు. పుత్రశోకం అనుభవించిన తనకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసునని సీనియర్ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్ అన్నారు. తన కుమారుడు, కోట శ్రీనివాసరావు కొడుకు రోడ్డు ప్రమదాల్లో మృతి చెందారని ఆయన గుర్తు చేశారు. జానకిరామ్ మృతి పట్ల ఆయన ప్రగాఢ సంపతాం తెలిపారు. -
జాషువా జాతీయకవి
ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ కవి గుర్రం జాషువా కేవలం ఒక జాతికి చెందిన కవి కాదని, జాతీయ కవి అని కేంద్రీయ హిందీ సంస్థాన్ ఉపాధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. జాతీయ మహాకవి గుర్రం జాషువా 119వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్ భవనంలో ఆదివారం విశిష్ట సాహిత్యగోష్టి ఏర్పాటు చేశారు. తెలుగు సాహితి, గుర్రం జాషువా పరిశోధనా కేంద్రం, తెలుగు అకాడమీ(హైదరాబాద్), తెలుగు సాహితి ఢిల్లీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యార్లగడ్డ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజల నాల్కల మీద నిలిచేవాడే సుకవి అని జాషువా అన్నారని, అంతటి సుకవి అయినందునే ఆయన్ను అంతా గుర్తు చేసుకుంటున్నారన్నారు. తెలుగులో గొప్ప సాహిత్యం ఉన్నా, అది హిందీలోకి అనువాదం అయితేనే దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుందన్నారు. కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ, కులం, మతం, సమాజం, బంధువులతో సంఘర్షణే జాషువాను కవిని చేశాయన్నారు. కులాలకతీతమైన సమసమాజమే జాషువాకు అసలైన నివాళి అన్నారు. దేశంలో కులపరమైన రిజర్వేషన్లు కాకుండా ఆర్థికపరమైన వెనకబాటుతనం ఆధారంగా ప్రజలను అభివృద్ధి చేసే రాజ కీయం రావాలని అభిప్రాయపడ్డారు. సభకు ఢిల్లీ విశ్వవిద్యాలయ ఆచార్యులు ఏల్చూరి మురళీధర్‌రావు, ప్రముఖ రచయిత కాలువ మల్లయ్య, ఎంవీ లక్ష్మి, సురేఖ, సాహితీప్రియులు పాల్గొన్నారు. -
గొల్లపూడికి లోక్‌నాయక్ పురస్కారం
విశాఖపట్నం: ఈ ఏడాది లోక్‌నాయక్ పురస్కారాన్ని ప్రముఖ సినీ నటుడు, సాహిత్యవేత్త గొల్లపూడి మారుతీరావుకు అందజేయనున్నట్టు లోక్‌నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. విశాఖపట్నంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరి 18న విశాఖపట్నంలోని కళాభారతిలో ఈ అవార్డు అందజేస్తామని తెలిపారు. అవార్డు కింద రూ.1.25 లక్షల నగదును, ప్రశంసా పత్రాన్ని అందిస్తామన్నారు. 2005 నుంచి ఈ అవార్డులను అందిస్తున్నామన్నారు. తెలుగు సాహితీ రంగానికి జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు లభించడం లేదన్న అవేదనను యార్లగడ్డ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. విశాఖలో శ్రీశ్రీ, రావిశాస్త్రి నివసించిన గృహాలను స్మారక మందిరాలుగా గుర్తించి పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. -
తెలుగును ప్రపంచ భాషగా మార్చాలి
తిరుపతి తుడా: తెలుగును ప్రపంచ భాషగా, ఆధునిక భాషగా మార్చితేనే మాతృభాషకు న్యాయం జరుగుతుందని కేంద్ర హిందీ అకాడమీ చైర్మన్ పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అభిప్రాయపడ్డారు. దీనికోసం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో హైదరాబాద్ ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం, ఎస్వీయూ తెలుగు అధ్యయనశాఖ ఆధ్వర్యంలో ‘తెలుగులో లక్షణ గ్రంథాలు-సమీక్ష’ అనే అంశంపై రెండు రోజులు జాతీయ సదస్సు నిర్వహించారు. మంగళవారం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత సంస్కృతం నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు తప్ప తెలుగు నేర్చుకునేందుకు ముందుకు రావడం లేదన్నారు. సంస్కృతం చదివితే నూటికి నూరు మార్కులు సాధించవచ్చు అనే ఉద్దేశంతో ఉండడం సరికాదన్నారు. ఏ భాషలకూ మనం వ్యతిరేకం కాదన్నారు. అయితే ఆంగ్ల భాష వ్యామోహంలో తెలుగును విస్మరించకూడదన్నారు. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిదన్నారు. తెలుగును విస్మరిస్తే భవిష్యత్ తరాలు క్షమించవన్నారు. ధార్మిక, ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో మాతృభాష దాడికి గురవుతోందన్నారు. పవిత్ర పదాలతో భక్తి భావంగా పిలిచే అభిషేక అనంత దర్శనం, అర్చనానంత దర్శనం, సహస్ర దీపాలంకరణ సేవ, సర్వదర్శనం వంటి పదాలను మరుగున పడేసి ఏఏడీ, ఏడీ, ఎస్డీఎస్, టీఎంఎస్ వంటి పదాలతో పిలిచే దుస్థితిలో టీటీడీ ఉన్నతాధికారులు ఉండటం తెలుగు భాష దౌర్భాగ్యమన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, విలువలున్న మాతృభాషకు ధార్మిక సంస్థలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు అకాడమి మాజీ అధ్యక్షులు, ఎస్వీయూ మాజీ రిజిస్ట్రార్ ఆచార్య ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో 1672 భాషలు ఉన్నాయన్నారు. సాహిత్య పరంగా తెలుగు భాష అగ్రస్థానంలో ఉందన్నారు. ఎస్వీయూ రిజిస్ట్రార్ ఆచార్య మేడసాని దేవరాజులు నాయుడు మాట్లాడుతూ వర్సిటీ పరంగా తెలుగు అభివృద్ధికి సహకారం అందించేందుకు ముందుంటామన్నారు. 29 మంది విద్యర్థులు సెమినార్‌పై పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు శరత్‌జ్యోత్స్న, మునిరత్నమ్మ, విజయలక్ష్మి, పేటశ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. -
యార్లగడ్డ సమయస్ఫూర్తి!
హైదరాబాద్: ప్రముఖ రచయిత, కేంద్రీయ హిందీ సమితి సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ బ్రిటన్ పార్లమెంటులో సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. లండన్‌లో ఈ నెల 4న జరిగిన ప్రపంచ తెలుగు సదస్సుకు హాజరైన యార్లగడ్డతో కూడిన భారత ప్రతినిధి బృందం తమ పర్యటనలో భాగంగా బ్రిటన్ పార్లమెంటులో హౌస్ ఆఫ్ లార్డ్స్ (ఎగువ సభ) సభ్యుడు లార్డ్ లూంబ, హౌస్ ఆఫ్ కామన్స్ (దిగువ సభ)లో నార్త్ వార్విక్షైర్ ఎంపీ డాన్ బైల్స్‌తో సమావేశమైంది. సమావేశంలో లూంబా మాట్లాడుతూ గతంలో పంజాబ్ యువతిని వివాహం చేసుకున్న తమ దేశ ఎంపీకి లండన్‌లోని పంజాబీలు కత్తి బహూకరించారని...మరి తెలుగువారు.. వారి అల్లుడైన (వరంగల్‌కు చెందిన యువతిని బైల్స్ పెళ్లాడారు) డాన్ బైల్స్‌కు ఏం ఇస్తారని చమత్కరించారు. దీంతో వెంటనే స్పందించిన యార్లగడ్డ తెలుగువారికి కత్తికన్నా కలం గొప్పదంటూ రూ. 35 వేల ఖరీదైన మాల్ట్ బ్లాంక్ పెన్ను బహూకరించారు. సమావేశంలో పాల్గొన్న మండలి బుద్ధ ప్రసాద్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, తనికెళ్ల భరణి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సుద్దాల అశోక్ తేజ తదితరులు యార్లగడ్డ సమయస్ఫూర్తిని కొనియాడారు. -
కేంద్రీయ హిందీ సంస్థాన్ ఉపాధ్యక్షునిగా యార్లగడ్డ
సాక్షి, న్యూఢిల్లీ: కెనడాలో భారత సాంస్కృతిక రాయబారిగా పనిచేస్తున్న ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆగ్రాలోని కేంద్రీయ హిందీ సంస్థాన్ ఉపాధ్యక్షునిగా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి తొలివారంలో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించి మూడేళ్లపాటు ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. హిందీ భాషాభివృద్ధి, హిందీ భాష బోధన నాణ్యత మెరుగుదలకు అవసరమైన చర్యలు, హిందీ ఉపాధ్యాయులకు శిక్షణ, హిందీ భాషపై పరిశోధనలతోపాటు పలు భారతీయ భాషలకు సంబంధించిన అనేక అధ్యయనాలను సంస్థ నిర్వహిస్తోంది. 1960లో తెలుగువారైన పద్మభూషణ్ డాక్టర్ మోటూరు సత్యనారాయణ ప్రారంభించిన ఈ సంస్థకు ఉపాధ్యక్షునిగా నియమితులైన తొలి తెలుగు వ్యక్తి యార్లగడ్డ కావడం విశేషం. ఈ సందర్భంగా యార్లగడ్డ.. ప్రధాని మన్మోహన్సింగ్, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పళ్లంరాజులకు కృతజ్ఞతలు తెలియజేశారు.