
'ఎన్టీఆర్ మనవడినని తెలియనీయలేదు'
హైదరాబాద్: నందమూరి జానకిరామ్ మంచితనం మూర్తీభవించిన కుర్రాడని కేంద్రీయ హిందీ సంస్థాన్ ఉపాధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జానకిరామ్ కు ఆయన ఆదివారం శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జానకిరామ్ ఏడాది పాటు తమ ఇంటిలో ఉండి ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకున్నాడని గుర్తు చేసుకున్నారు. మహానటుడు ఎన్టీఆర్ మనవడినని ఎవరికీ తెలియనీయలేదని చెప్పారు. జానకిరామ్ మరణం హరికృష్ణకు తీరనిలోటని అన్నారు.
పుత్రశోకం అనుభవించిన తనకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసునని సీనియర్ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్ అన్నారు. తన కుమారుడు, కోట శ్రీనివాసరావు కొడుకు రోడ్డు ప్రమదాల్లో మృతి చెందారని ఆయన గుర్తు చేశారు. జానకిరామ్ మృతి పట్ల ఆయన ప్రగాఢ సంపతాం తెలిపారు.