nandamuri janakiram
-
అన్నయ్యను గుర్తుచేసుకున్న కళ్యాణ్‌రామ్
టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ ట్విటర్ వేదికగా తన అన్నయ్య దివంగత జానకిరామ్‌ను గుర్తుచేసుకున్నాడు. బుధవారం జానకిరామ్ జయంతి. ఈ సందర్భంగా కళ్యాణ్‌రామ్ జానకిరామ్‌కు నివాళులర్పించారు. తన అన్నయ్య జయంతి సందర్భంగా ట్విటర్ వేదికగా కళ్యాణ్‌రామ్ స్పందిస్తూ.. ‘మీరు ఎల్లప్పుడూ మా హృదయాలలో, మా ప్రార్థనలలో జీవించే ఉంటారు. హ్యాపీ బర్త్‌డే అన్నయ్య. వి మిస్ యూ’అంటూ ట్వీట్ చేశాడు. సొంతంగా ఎన్టీఆర్ బ్యానర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన జానకిరామ్ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అయితే సక్సెస్ ఫుల్ నిర్మాతగా మరిన్ని విజయాలను అందుకోవాల్సిన జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో అకాల మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఐదేళ్ల కిందట నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాము వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జానకిరామ్ దుర్మరణం చెందారు. 2014 డిసెంబరు 6 న హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పడంతో జానకిరామ్ మృతిచెందారు. ట్రాక్టర్‌ను తప్పించబోయి జానకిరామ్ కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించారు. పెద్దకుమారుడి మాదిరిగానే నందమూరి హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. ఇక 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ప్రచారం చేసిన నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా నల్లగొండ జిల్లా మోతే వద్ద ఆయన ప్రయాణిస్తోన్న వాహనం ప్రమాదానికి గురయ్యింది. ఈ వరుస ప్రమాద కారణాలతోనే ‘అతి వేగం ప్రమాదకరం.. యాక్సిడెంట్ వల్ల మేము ఇప్పటికే మేము ఎంతో కోల్పోయాము. ఆ పరిస్థితి మరేవరికి రావద్దు’ అంటూ నందమూరి వారసుల చిత్రాల ప్రారంభానికి ముందు వాయిస్ ఓవర్ వస్తుంటుంది. చదవండి: లవ్ యూ అమ్మ: రామ్ చరణ్ విలన్‌గా అనసూయ..! -
బాల గోవిందం
జూనియర్ యన్టీఆర్ ‘రామాయణం’ అనే బాలల చిత్రంలో రామునిగా కనిపించి కనువిందు చేశారు. అప్పుడు తారక్ వయసు 13 ఏళ్లు. పదమూడేళ్ల వయసులోపు పిల్లలే నటీనటులుగా గతంలో ‘దాన వీర శూర కర్ణ’ చిత్రాన్ని నందమూరి జానకిరామ్ తనయుడిని బాల నటుడిగా పరిచయం చేస్తూ ‘జగపతి’ వెంకటేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రూపొందించారు. ఇలా అప్పుడప్పుడు చిన్న పిల్లల పౌరాణిక సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ‘బాలగోవిందం’ పేరుతో ఓ పౌరాణిక చిత్రానికి శ్రీకారం జరిగింది. డా. ముళ్లపూడి హరిశ్చంద్ర దర్శకత్వంలో అరుణోదయ ఆర్ట్ క్రియేషన్స్‌పై తోలేటి వెంకట శిరీష నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల గిరులలో ఎందుకు వెలిశాడు? తిరుమలలో వెంకటేశుడు వెలవక ముందు జరిగిన సంఘటనలతో మా చిత్రం రూపుదిద్దుకోనుంది. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిస్తాం’’ అన్నారు. ‘‘వ్యక్తిత్వ వికాస కోణంలో మన పురాణాల్ని స్వీకరించాల్సిన ఆవశ్యకత ఉందని, ఆధ్యాత్మిక సారంతో ఈ సినిమా రూపకల్పన మొదలుపెట్టా’’మని పాటల రచయిత వెనిగళ్ల రాంబాబు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మీర్, మాటలు: యడవల్లి, సంగీతం: సాలూరి వాసూరావు. -
మునగాల మండలంలో జానకీరామ్..
మునగాల (కోదాడ) : 2014డిసెంబర్ 6వ తేదీన 65వ నంబర్ జాతీయ రహదారిపై మునగాల మండలం ఆకుపాముల శివారులో సాయంత్రం 6.45గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ హీరో, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ రెండో కుమారుడు నందమూరి జానకీరామ్(38) దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి తన సొంత కారు (టాటా సఫారీ ఈఎక్స్, ఏపీ 29 బీడీ-2323)లో విజయవాడలో జరిగే ఓ కార్యక్రమానికి వెళ్తుండగా నాలు గేళ్ల క్రితం ఈ ప్రమాదం సంభవించింది. ఆకుపాముల వద్ద వరినారుతో వస్తున్న ఓట్రాక్టర్(ట్రాలీ) రాంగ్రూట్లో రోడ్డును క్రాస్ చేస్తుండగా అదే సమయంలో అతివేగంగా వస్తున్న జానకీరామ్ కారు ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జుకాగా ట్రాలీ ఫల్టీ కొట్టింది. దీంతో కారులో ఉన్న జానకీరామ్ తీవ్రంగా గాయపడ్డారు. జానకీరామ్‌ను ముందుగా ఎవరూ గుర్తించలేదు. ప్రమాద సంఘటన తెలుసుకున్న పలువురు గ్రామస్తులు జానకీరామ్ సెల్‌ఫోన్ ద్వారా డైల్డ్కాల్కు రింగ్ చేయగా అవతల వైపు నుంచి హరికృష్ణ ఫోన్ ఎత్తడంలో ప్రమాదం జరిగిన వ్యక్తి జానకీరామ్గా గ్రహించారు. గాయపడ్డ జానకీరామ్‌ను గ్రామస్తులు 108లో కోదాడలోని తిరుమల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో జానకీరామ్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లుగా ధ్రువీకరించారు. అతివేగమే ప్రమాదానికి కారణం ఈ రోడ్డు ప్రమాదానికి కారణం అతివేగమేనని పోలీసులు నాడు గుర్తించారు. దీనికి తోడు రహదారిపై వరినారుతో ఉన్నట్రాక్టర్, ట్రాలీ రాంగ్రూట్లో రోడ్డును క్రాస్ చేయడం మరొక కారణం. ఈ ప్రాంతంలో ఉన్న క్రాసింగ్ వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో తరచు ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. -
వేగం తీసిన ప్రాణాలెన్నో!
‘వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యాన్ని చేరుకోండి. మా కుటుంబంలో జరిగిన విషాదం మరే కుటుంబంలో జరగొద్దని కోరుకుంటున్నా. వేడుక ముగిసిన వెంటనే క్షేమంగా ఇంటికి చేరుకోండి.. మీ ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోండి’ సోదరుడు జానకిరాం మరణం తర్వాత రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించే క్రమంలో భాగంగా తన సినిమా ప్రారంభంలో, పలు సందర్భాల్లో ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ చేప్పే మాటలివీ. సాక్షి, హైదరాబాద్/మునగాల (నల్లగొండ): దురదృష్టవశాత్తు మళ్లీ అదే ఘోరం జరిగిపోయింది. నందమూరి జానకిరాం చనిపోయిన నల్లగొండ జిల్లాలోనే హీరో హరికృష్ణ కూడా మృత్యువాత పడ్డారు. అవసరం, దానికి తోడు తొందరపాటులో రెట్టించిన వేగంతో నడపడం ప్రమాదాలకు కారణమవుతోంది. సామాన్యులు మొదలుకొని సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు దూకుడుతో ప్రయాణించడంతో ప్రమాదాల బారినపడుతున్నారు. కేంద్ర మాజీమంత్రి ఎర్రన్నాయుడు, మాజీ మంత్రి పి.ఇంద్రారెడ్డి, దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, సినీ నటుడు భరత్, ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ తదితరులు రోడ్డు ప్రమాదాల్లో అర్ధాంతరంగా తనువు చాలించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలు.. గతేడాది జూన్‌లో సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్.. శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని తేలింది. అంతకు ముందు నెలలో బంజారాహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నితీశ్ మృత్యువాతపడ్డాడు. అత్యంత వేగంతో వాహనాన్ని నడుపుతూ పెద్దమ్మగుడి సమీపంలోని మెట్రోపిల్లర్‌కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 2014 ఏప్రిల్‌లో ప్రముఖ రాజకీయ నేత భూమా శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలోనే మృత్యువాత పడ్డారు. 2013 ఆగస్టులో మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత లాల్‌జాన్‌బాషా రోడ్డు ప్రమాదంలోనే మరణించారు. నల్లగొండ–గుంటూరు రోడ్డులో అతివేగంతో వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. అంతకుముందు ఏడాది నవంబర్‌లో కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించారు. ఓ వివాహానికి హాజరై తిరిగి వెళ్తుండగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దండానపేట కూడలి వద్ద రహదారికి అడ్డంగా ఉన్న ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఠి 2011 డిసెంబర్లో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనయుడు ప్రతీక్‌రెడ్డి పటాన్చెరు దగ్గర ఓఆర్ఆర్పై కారు ప్రమాదంలో చనిపోయాడు. అంతకు రెండు నెలల ముందు క్రికెటర్ అజారుద్దీన్ తనయుడు అయాజుద్దీన్ బైకుపై వెళ్తూ అతివేగంతో అదుపుతప్పి తీవ్రగాయాలపాలయ్యాడు. 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోయాడు. 2010 జూన్‌లో సినీనటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్ బైక్‌పై వెళ్తూ ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డాడు. 2003 అక్టోబర్‌లో సినీ నటుడు బాబుమోహన్ కుమారుడు పవన్‌కుమార్ బైక్‌పై వెళ్తూ జూబ్లీహిల్స్‌లో డివైడర్‌ను ఢీ కొట్టి చనిపోయాడు. 2000 ఏప్రిల్‌లో మాజీ హోంమంత్రి పట్లోల్ల ఇంద్రారెడ్డి మహబూబ్‌నగర్‌లో ఓ శుభకార్యానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో వాహనం అదుపుతప్పడంతో అక్కడికక్కడే మరణించారు. నాడు తనయుడు.. నేడు తండ్రి నల్లగొండ జిల్లా మునగాల వద్ద 2014 డిసెంబర్ 6న జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరాం మరణించాడు. అతివేగంతో వెళ్తున్న సఫారీ వాహనానికి ట్రాక్టర్ అడ్డురావడంతో అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ట్రాక్టర్ ట్రాలీని జానకిరాం కారు ఢీకొట్టింది. ముందు సీటులో ఉన్న జానకిరాంకు తీవ్రగాయాలవడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించారు. ఇప్పుడు తండ్రి హరికృష్ణ కూడా నల్లగొండ– అద్దంకి రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కాగా, తొమ్మిదేళ్ల కింద సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. మోతె మండల కేంద్రం సమీపంలోని తిరుపతమ్మగుడి మూలమలుపు వద్ద సూర్యాపేట–ఖమ్మం ప్రధాన రహదారిపై 2009 మార్చి 26 అర్ధరాత్రి జూనియర్ ఎన్టీఆర్ వాహనం బోల్తాపడింది. ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని హైదరాబాద్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగం, అజాగ్రత్తగా నడపడమే ఈ ప్రమాదానికి కారణమని తేలింది. చదవండి: ప్రముఖుల ఇంట విషాదం రేపిన రోడ్డుప్రమాదాలు! -
రోడ్డు క్రాస్ చేస్తుండగా ప్రమాదం జరిగింది:లొంగిపోయిన డ్రైవర్
నల్గొండ: నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ మృతి కేసులో ట్రాక్టర్ డ్రైవర్ వెంకన్న పోలీసులకు లొంగిపోయాడు. నల్లగొండ జిల్లా ఆకుపాముల గ్రామ శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో జానకిరామ్ (42) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. మునగాల ఎస్ఐ ఎస్.రమేశ్ వెల్లడించిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం కోనాయిగూడానికి చెందిన రైతు వెంకన్న ఆకుపాముల జాతీయ రహదారి పక్కన సాగు చేసిన వరినారును తీసుకెళ్లడానికి సొంత ట్రాక్టర్‌తో వచ్చాడు. వరినారు తీసుకొని స్వగ్రామానికి వెళ్లేందుకు ఆకుపాముల శివారులో రాంగ్రూట్లో వచ్చి ట్రాక్టర్‌ను యూటర్న్ తీసుకుంటుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న జానకిరామ్ టాటా సఫారీ వాహనం ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ వెంకన్న మునగాల పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. రోడ్డు క్రాస్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు వెంకన్న చెప్పారు. ** -
నందమూరి జానకీరామ్ కు కన్నీటి వీడ్కోలు
-
'ఎన్టీఆర్ మనవడినని తెలియనీయలేదు'
-
'ఎన్టీఆర్ మనవడినని తెలియనీయలేదు'
హైదరాబాద్: నందమూరి జానకిరామ్ మంచితనం మూర్తీభవించిన కుర్రాడని కేంద్రీయ హిందీ సంస్థాన్ ఉపాధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జానకిరామ్ కు ఆయన ఆదివారం శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జానకిరామ్ ఏడాది పాటు తమ ఇంటిలో ఉండి ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకున్నాడని గుర్తు చేసుకున్నారు. మహానటుడు ఎన్టీఆర్ మనవడినని ఎవరికీ తెలియనీయలేదని చెప్పారు. జానకిరామ్ మరణం హరికృష్ణకు తీరనిలోటని అన్నారు. పుత్రశోకం అనుభవించిన తనకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసునని సీనియర్ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్ అన్నారు. తన కుమారుడు, కోట శ్రీనివాసరావు కొడుకు రోడ్డు ప్రమదాల్లో మృతి చెందారని ఆయన గుర్తు చేశారు. జానకిరామ్ మృతి పట్ల ఆయన ప్రగాఢ సంపతాం తెలిపారు. -
జానకిరామ్ అంత్యక్రియలు పూర్తి
-
జానకిరామ్ అంత్యక్రియలు పూర్తి
మొయినాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి జానకిరామ్ అంత్యక్రియలు ముగిశాయి. మొయినాబాద్ లోని సొంత ఫాంహౌస్ లో ఆదివారం మధ్యాహ్నం జానకిరామ్ అంత్యక్రియలు జరిగాయి. జానకిరామ్ తనయుడు తారక రామారావు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంత్యక్రియలకు నందమూరి కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అంతకుముందు నిర్వహించిన అంతిమయాత్రలో నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, సన్నిహితులు పాల్గొన్నారు. అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. రాజకీయ, సినీ ప్రముఖులు జానకిరామ్ పార్థీవదేహం వద్ద పుష్పాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. జానకిరామ్ తండ్రి హరికృష్ణను పరామర్శించారు. జానకిరామ్ భార్య, పిల్లలను ఓదార్చారు. -
నందమూరి జానకిరామ్‌కు ప్రముఖుల నివాళి
-
ప్రారంభమైన జానకిరామ్ అంతిమ యాత్ర
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి జానకిరామ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. మసబ్ ట్యాంక్ లోని హరికృష్ణ నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రక్రియ ఆరంభమైంది. జానకిరామ్ భౌతికకాయం ఉంచిన వాహనంలో అతని కుమారుడితో పాటు హరికృష్ణ, కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా హరికృష్ణ కన్నీటిపర్యంతమయ్యారు. కాగా జానకిరామ్ అంత్యక్రియలు చేవెళ్ల మండలం మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌లో నిర్వహించనున్నారు. ఈ అంతిమయాత్రలో కుటుంబ సభ్యులతో పాటు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. -
దయచేసి సీటు బెల్ట్ పెట్టుకోండి: చిరంజీవి
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదం జరగటం దురదృష్టకరం.. విధిని ఎవరూ తప్పించుకోలేరని... సీటు బెల్ట్ పెట్టుకోకపోవటం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని మాజీ కేంద్రమంత్రి, సినీనటుడు చిరంజీవి అన్నారు. సామాజిక బాధ్యత గల వ్యక్తులుగా .. సీటు బెల్ట్‌ను పెట్టుకోగలిగితే ...ఇలాంటి ప్రమాదాలను ఎంతోకొంత తప్పించుకునేందుకు అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. చిరంజీవి ఆదివారం ఉదయం జానకిరామ్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. నందమూరి హరికృష్ణను పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసిమెలిసి ఉండే హరికృష్ణకు...ఇది రాకూడని కష్టమని, ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదన్నారు. జానకిరామ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యం చేకూరాలని కోరుకుంటున్నట్లు చిరంజీవి చెప్పారు. ఇటువంటి సంఘటనలు చూసి అయినా సరే కారు నడుపుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ సీటు బెల్ట్ పెట్టుకోవాలని ఆయన సూచించారు. మరోవైపు సినీనటి కవిత...జానకిరామ్ భౌతికకాయాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. కళ్యాణ్‌రామ్, జానకిరామ్ ..రామలక్ష్మణుల్లా ఉండేవారని ఆమె అన్నారు. హరికృష్ణ గారికి ఈ సంఘటన తట్టుకోలేని విషయమేనని అన్నారు. -
అన్నను ఓదార్చిన బాలయ్య, ప్రముఖుల పరామర్శ
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన హరికృష్ణను ...సోదరుడు బాలకృష్ణ ఓదార్చారు. ఆయన ఆదివారం ఉదయం తన సతీమణి వసుంధరతో కలిసి హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు. జానకిరామ్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అలాగే దగ్గుబాటి పురందేశ్వరి, వెంకటేశ్వరరావు కూడా అక్కడే ఉన్నారు. మరోవైపు జానకిరామ్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు జరగనున్నాయి. మొయినాబాద్‌లోని ఫాంహౌజ్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు నందమూరి జానకిరామ్ హఠాన్మరణంతో హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని నందమూరి హరికృష్ణ నివాసం వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. జానకీరామ్ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు... సినీ రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. జానకిరామ్ హఠాన్మరణం పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్థీవదేహాన్ని సందర్శించి హరికృష్ణ కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కొడాలి నాని, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి, సినీనటులు పవన్ కళ్యాణ్, జగపతి బాబు, పరుచూరి గోపాలకృష్ణ,కోట శ్రీనివాసరావు, దగ్గుబాటి సురేష్ బాబు, జయకృష్ణ, నర్సింగ్ యాదవ్, యార్లగడ్డ లక్ష్మీనారాయణ, లక్ష్మీ పార్వతి తదితరులు జానకిరామ్‌కు నివాళులు అర్పించారు. -
ప్రత్యేక చర్చ : తప్పిదాలే ప్రాణాలు తీస్తున్నాయా?
-
జానకిరామ్ భౌతికకాయానికి వైఎస్ జగన్ నివాళి
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి జానకిరామ్ భౌతికకాయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ఆదివారం ఉదయం హరికృష్ణ నివాసానికి వెళ్లారు. నివాళి అనంతరం హరికృష్ణ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. జానకిరామ్ మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు ఎన్టీఆర్ సతీమణి, వైఎస్ఆర్ సీపీ నేత లక్ష్మీపార్వతి కూడా జానకిరామ్ కుటుంబ సభ్యులకు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరికీ రాకూడడని కష్టమని, కన్న తల్లిదండ్రులకు ఈ ఘటన కోలుకోలేనిదన్నారు. హరికృష్ణ, ఆయన సతీమణికి భగవంతుడు మనశ్శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. -
తప్పిదాలే ప్రాణాలు తీస్తున్నాయా?
-
విషాదం నింపుతున్న రోడ్డు ప్రమాదాలు
*వరుస ప్రమాదాల్లో బలవుతున్న ప్రముఖులు *ప్రాణాలు తీస్తున్న అతి వేగం *గమ్యస్థానానికి చేరాలన్న తొందరలో దూకుడు ప్రయాణం *సీటు బెల్ట్ వాడరు *ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన *డ్రైవర్ల పట్ల పర్యవేక్షణా లోపం *చిన్న అశ్రద్ధకు భారీ మూల్యం *రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది బలి త్వరగా వెళ్లాలనే ఆరాటం... ఆ ఆత్రుతే ప్రాణాల మీదకు తెస్తోంది... ఆ తొందర్లోనే చిన్న చిన్న జాగ్రత్తలను గాలికి ఒదిలేయడం ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఎందరో ప్రముఖులు, మరెంతో మంది భవిష్యతారలు ఇలాగే మృత్యువాతపడ్డారు. అతి వేగం ప్రమాదకరం. కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీస్తుంటుంది. కాని భయపడేవారేవరూ. కేర్లెస్గా ఉండటమే తమకు ఇష్టమని ఆధునిక యూత్ ర్యాష్ డ్రైవింగ్‌తో మరీ చెప్తోంది. వేగంగా వాహనాలు నడిపి ప్రాణాలు పొగొట్టుకుంటే... ఎవరికి నష్టం. చెట్టంత ఎదిగిన కొడుకులు కళ్ల ముందు కన్నుమూస్తే ఆ తల్లిదండ్రులు పడే వేదనను ఎవరు తీర్చుతారు? *శోభానాగిరెడ్డి వైఎస్ఆర్ సీపీ నేత *ఎర్రన్నాయుడు టీడీపీ నేత *లాల్‌జాన్ బాషా టీడీపీ నేత *కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి (s/o కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి) *కోటా వెంకట ప్రసాద్ (s/o కోటా శ్రీనివాసరావు) *పి.పవన్ కుమార్ (s/o బాబూమోహన్) *మహ్మద్ అయాజుద్దీన్ (s/o మహ్మద్ అజారుద్దీన్) ఇపుడు.... *నందమూరి జానకిరామ్.. (s/o నందమూరి హరికృష్ణ) వీరంతా రోడ్డుప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన రాజకీయ, సినీప్రముఖులు. *వైఎస్ఆర్ సీపీ నాయకురాలు శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలోనే మృత్యువాత పడ్డారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో జరిగిన ఆ దుర్ఘటన ఇప్పటికీ కళ్లముందు కదులుతూనే ఉంటుంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఎన్నికల ప్రచారం ముగించుకొని కారులో ఇంటికి వెళ్తుండగా రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్పల్ని తప్పించే ప్రయత్నంలో జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. *ఇక రోడ్డు ప్రమాదాలు తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం మిగిల్చాయి. సీనియర్ నేతలు ఎర్రన్నాయుడు, లాల్ జాన్బాషాలు రోడ్డు ప్రమాదాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దండానపేట కూడలి వద్ద ఎర్రన్నాయుడు ప్రయాణిస్తున్న వాహనం పెట్రోల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టడంతో ఆయన కన్నుమూశారు. ఇక టీడీపీ ఉపాధ్యక్షుడు లాల్‌జాన్ బాషా వాహనం ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఘటనా స్థలిలోనే బాషా కన్నుమూశారు. *అలాగే మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డిని రోడ్డు ప్రమాదమే పొట్టనపెట్టుకుంది. 2011లో మెదక్ జిల్లా కొల్లూరు సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో ప్రతీక్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులు ఘటనాస్థలంలోనే చనిపోయారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో కారు నడపడం ఆ ప్రమాదానికి కారణం. *ఇక ఫాదర్స్ డే నాడే.. సినీ నటుడు కోట శ్రీనివాసరావుకు పుత్రశోకం కలిగింది. ఫంక్షన్‌కు అటెండయ్యేందుకు స్పోర్ట్స్ బైక్ మీద వెళ్తున్న కోట వెంకట ప్రసాద్.. నార్సింగి సమీపంలో అప్పా వద్ద డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో మృత్యువాత పడ్డారు. బాబూమోహన్ కుమారుడు పవన్ కుమార్ 2003లో జరిగిన రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పాయాడు. అలాగే వర్ధమాన నటుడు యశోసాగర్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి మృత్యువాత పడిన విషయం తెలిసిందే. *హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ కన్నుమూశాడు. ఔటర్ రింగ్ రోడ్డుపై మితి మీరిన వేగంతో బైక్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని అప్పట్లో వాదనలు వినిపించాయి. *ఇపుడు నందమూరి హరికృష్ణ కుమారుడు నందమూరి జానకిరామ్‌ను బలిగొంది రోడ్డుప్రమాదమే. జానకిరామ్ ప్రయాణిస్తున్న సఫారీ.. నల్లగొండ జిల్లా ఆకుపాముల శివారు వద్ద రాంగ్రూట్లో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. చెప్పుకుంటూ పోతే ఎంతో మంది జీవితాల్లో రోడ్డు ప్రమాదాలు విషాదం నింపాయి. చిన్న అజాగ్రత్తలు ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి. ప్రమాదాలకు కారణాలు ఏంటని ఆరా తీస్తే...అతివేగం ఒకరిదైతే.. నిర్లక్ష్యం ఇంకొకరిది. ప్రొఫెషనల్ డ్రైవర్లు కాకపోవటం.... డ్రైవర్లను పెట్టుకోకపోవటం...ఇలా ఎన్నో ప్రమాదానికి కారణాలవుతున్నాయి. ఇక అన్నిజాగ్రత్తలు తీసుకున్నా...రోడ్డుపై వెళ్లేటపుడు ఎదురుగా వస్తున్న వాహనదారుల తప్పిదాల వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. -
'ఇలాంటి నష్టం భవిష్యత్‌లో ఏ వ్యక్తికి రాకూడదు'
హైదరాబాద్ : జాతీయ రహదారుల విధానంలో మార్పులు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరగనున్న ముఖ్యమంత్రుల సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబు ఆదివారం ఉదయం ఢిల్లీ బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ డివైడర్లు, ఎన్హెచ్లను ఆనుకుని ఉన్న దారులను ప్రక్షాళన చేయాలన్నారు. జాతీయ రహదారుల వ్యవస్థ సరిగా లేకుంటే మరెన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. హరికృష్ణ కుటుంబానికి శాంతి కలగాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇలాంటి నష్టం భవిష్యత్తులో ఏ వ్యక్తికీ రాకూడదని ఆయన అన్నారు. కాగా నల్గొండ జిల్లాలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరామ్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. -
ఫేస్బుక్ నిండా తాత జ్ఞాపకాలే
సిటీబ్యూరో: ప్రమాదవశాత్తూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి హరికృష్ణ తనయుడు జానకీరామ్‌కు తాత స్వర్గీయ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం. అందుకు గుర్తుగా చిన్నతనంలో తాతతో కలిసి దిగిన ఫొటోలు, ఎన్టీఆర్‌కు సంబంధించిన కార్టూన్లు, ఫొటోలను ఫేస్ బుక్‌లో భద్రపరుచుకున్నారు. అంతే కాదు తన కుమారునికి సైతం నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్)అని పేరు పెట్టుకు న్నారు. 1977లో ఎన్టీఆర్ దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన చాణక్యచంద్రగుప్త సినిమా షూటింగ్ సమయంలో అక్కినేని జానకీరామ్‌ను ఎత్తుకుని దిగిన ఫొటోను ఫేస్బుక్లో భద్రంగా దాచుకున్నారు. చిన్నతనంలో ఏఎన్ఆర్, ఎన్టీఆర్‌లతో కలిసి ఫొటో దిగడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఫేస్బుక్లో రాసుకున్నారు. -
నేటి మధ్యాహ్నం జానకిరామ్ అంత్యక్రియలు
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరామ్ అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం జరగనున్నాయి. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో జానకిరామ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయింది. పోస్ట్‌మార్టం ప్రాధమిక నివేదికను వైద్యులు వెల్లడించారు. జానకిరామ్ తల, ఛాతి, కుడిచెయ్యి, కడుపులో గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు. -
జానకీరామ్ దుర్మరణానికి ఇవే కారణాలు
రాంగ్‌రూట్..అతివేగం.. మునగాల మండలం ఆకుపాముల శివారులో ఘటన ట్రాక్టర్ డ్రైవర్ రాంగ్‌రూట్ డ్రైవింగ్..కారు అతి వేగం.. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయని హైవే అధికారులు.. ఇన్ని తప్పుల ఫలితం ఓ నిండుప్రాణం.. ఆ కుటుంబానికి తీరని శోకం.. మునగాల మండల పరిధిలోని ఆకుపాముల శివారులో 65వ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ కుమారుడు, సినీనిర్మాత నందమూరి జానకీరామ్(38) దుర్మరణం పాలయ్యాడు. మునగాల/కోదాడటౌన్ : జాతీయ రహదారిపై మునగాల మండలం ఆకుపాముల శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదానికి అతివేగం, ట్రాక్టర్‌డ్రైవర్ రాంగ్‌రూట్ డ్రైవింగ్ ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో టీడీపీ నేత నందమూరి హరికృష్ణ తనయుడు, సినీ నిర్మాత నందమూరి జానకీరామ్ తీవ్ర గాయాలపాలై మృతిచెందాడు. జాతీయ రహదారిపై ఆకుపాముల శివారులో బైపాస్ రోడ్డులో గ్రామంలోకి వెళ్లేందుకు క్రాసింగ్ ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ఎటువంటి హెచ్చరిక బోర్డులూ ఏర్పాటు చేయలేదు. రహదారికి ఇరువైపులా దాదాపు 100 నుంచి 120కి.మీ వేగంతో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఈ ప్రాంతంలో తరచు వాహనాలు రాంగ్రూట్లో క్రాసింగ్ చేస్తూ జాతీయ రహదారిపైకి వస్తుంటాయి. ఈ తరుణంలో ఆదమరిస్తే ప్రమాదం జరగక మానదు. గతంలో ఇదే ప్రాంతంలో రోడ్డును క్రాసింగ్ చేస్తుండగా పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆరు నెలల కాలంలో ముగ్గురు ద్విచక్ర వాహనదారులు మృతిచెందారు. రెండు నెలల క్రితం రాత్రి వేళ పొలం వద్దకు వెళుతున్న ఓ రైతు రోడ్డు క్రాస్ చేస్తూ లారీ ఢీకొని మృతిచెందాడు. ఇప్పుడు జానకీరామ్ ప్రయాణిస్తున్న టాటా సఫారీ ప్రమాదానికి గురైంది. రోజుకో ప్రమాదం జరుగుతున్నా నేషనల్ హైవే అధికారులు, అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఈ ప్రాంతంలో ప్రమాదాన్ని సూచించే హెచ్చరిక బోర్డులు గానీ, సిగ్నల్ లైట్లు కానీ ఏర్పాటు చేస్తే ప్రమాదాలు కొంతమేరకు నివారించవచ్చు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మున్ముందు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పలువురు వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు. -
జానకిరామ్ మృతదేహం హరికృష్ణ ఇంటికి తరలింపు
హైదరాబాద్: నందమూరి జానకిరామ్ మృతదేహాన్ని మసబ్‌ట్యాంక్ సమీపంలోని నందమూరి హరికృష్ణ ఇంటికి తరలించారు. నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద శనివారం సాయంత్రం జరిగిన కారు ప్రమాదంలో జానకిరామ్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. జానకిరామ్ మృతదేహాన్నిఅతని సోదరుడు కల్యాణరామ్ కోదాడ నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్ జనార్ధన్, డాక్టర్ సత్యవతి ఆధ్వర్యంలో వైద్యుల బృందం పోస్ట్ మార్టం పూర్తి చేశారు. ఉస్మానియా వైద్యుల పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం జానకిరామ్ తలకు, చాతికి, కడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. కుడి చేయి, కుడి కాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పక్కటెముకలు విరిగి రక్త సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు. ** -
జానకిరామ్‌కు కారు ప్రమాదం జరిగింది ఇలా ...
హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షడు ఎన్టీఆర్ కుమారుడు టీడీపీ సీనియర్ నాయకుడు నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకిరామ్ శనివారం ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో హరికృష్ణ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కారు ప్రమాదం జరిగింది ఇలా ... *హైదరాబాద్ నుంచి విజయవాడ నందమూరి జానకిరామ్ టాటా సఫారీ కారు వెళ్తున్నారు. *నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాము వద్ద వరినారుతో ట్రాక్టర్ రాంగ్ రూట్లో వస్తుంది. *అధిక వేగంతో వెళ్తున్న జానకీరామ్ కారు... ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించ బోయారు... ఆ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న కారు మూడు రౌండ్లు గుండ్రంగా తిరిగి.... దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్న గుంతలో పడింది. *ఈ ప్రమాదంలో జానకిరామ్ తలకు, వెన్నుముకకు తీవ్ర గాయాలయ్యాయి. *ఆ రహదారిపై వస్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... జానకిరామ్‌ను కోదాడలోని ఆస్పత్రికి తరలించారు. *మార్గమధ్యంలోనే జానకిరామ్ మరణించారని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. *ప్రయాణ సమయంలో జానకిరామ్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని తెలుస్తుంది. -
హైదరాబాద్ చేరుకున్న జానకిరామ్ మృతదేహం
హైదరాబాద్: నందమూరి హరికృష్ణ పెద్దకుమారుడు జానకిరామ్ మృతదేహం హైదరాబాద్ చేరుకుంది. నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఈ సాయంత్రం జరిగిన కారు ప్రమాదంలో జానకిరామ్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని కోదాడ నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఈ రాత్రి డాక్టర్ జనార్ధన్, డాక్టర్ సత్యవతి ఆధ్వర్యంలో వైద్య బృందం పోస్ట్ మార్టం నిర్వహిస్తారు నందమూరి కుటుంబ సభ్యులతోపాటు పలువురు ఏపీ మంత్రులు, టీడీపి నాయకులు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నారు. కొద్దిసేపట్లో మృతదేహానికి పోస్ట్ మార్టం చేస్తారు. ఆ తరువాత మృతదేహాన్ని హరికృష్ణ నివాసానికి తరలిస్తారు. **