అన్నను ఓదార్చిన బాలయ్య, ప్రముఖుల పరామర్శ | Balakrishna and celebrities consoles Nandamuri Harikrishna | Sakshi
Sakshi News home page

అన్నను ఓదార్చిన బాలయ్య, ప్రముఖుల పరామర్శ

Published Sun, Dec 7 2014 11:36 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

అన్నను ఓదార్చిన బాలయ్య, ప్రముఖుల పరామర్శ - Sakshi

అన్నను ఓదార్చిన బాలయ్య, ప్రముఖుల పరామర్శ

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన హరికృష్ణను ...సోదరుడు బాలకృష్ణ ఓదార్చారు. ఆయన ఆదివారం ఉదయం తన సతీమణి వసుంధరతో కలిసి హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు. జానకిరామ్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అలాగే దగ్గుబాటి పురందేశ్వరి, వెంకటేశ్వరరావు కూడా అక్కడే ఉన్నారు. మరోవైపు జానకిరామ్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు జరగనున్నాయి. మొయినాబాద్లోని ఫాంహౌజ్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మరోవైపు నందమూరి జానకిరామ్‌ హఠాన్మరణంతో హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని నందమూరి హరికృష్ణ నివాసం వద్ద  విషాదఛాయలు అలముకున్నాయి. జానకీరామ్‌ భౌతికకాయానికి  నివాళులర్పించేందుకు... సినీ రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. జానకిరామ్‌ హఠాన్మరణం పట్ల   పలువురు తీవ్ర దిగ్భ్రాంతి  వ్యక్తం చేశారు. పార్థీవదేహాన్ని సందర్శించి హరికృష్ణ కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కొడాలి నాని, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి, సినీనటులు పవన్ కళ్యాణ్, జగపతి బాబు, పరుచూరి గోపాలకృష్ణ,కోట శ్రీనివాసరావు, దగ్గుబాటి సురేష్ బాబు, జయకృష్ణ, నర్సింగ్ యాదవ్, యార్లగడ్డ లక్ష్మీనారాయణ, లక్ష్మీ పార్వతి తదితరులు జానకిరామ్కు నివాళులు అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement