
రోడ్డు క్రాస్ చేస్తుండగా ప్రమాదం జరిగింది:లొంగిపోయిన డ్రైవర్
నల్గొండ: నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ మృతి కేసులో ట్రాక్టర్ డ్రైవర్ వెంకన్న పోలీసులకు లొంగిపోయాడు. నల్లగొండ జిల్లా ఆకుపాముల గ్రామ శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో జానకిరామ్ (42) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
మునగాల ఎస్‌ఐ ఎస్.రమేశ్ వెల్లడించిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం కోనాయిగూడానికి చెందిన రైతు వెంకన్న ఆకుపాముల జాతీయ రహదారి పక్కన సాగు చేసిన వరినారును తీసుకెళ్లడానికి సొంత ట్రాక్టర్‌తో వచ్చాడు. వరినారు తీసుకొని స్వగ్రామానికి వెళ్లేందుకు ఆకుపాముల శివారులో రాంగ్‌రూట్‌లో వచ్చి ట్రాక్టర్‌ను యూటర్న్ తీసుకుంటుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న జానకిరామ్ టాటా సఫారీ వాహనం ఢీకొట్టింది.
ప్రమాదం జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ వెంకన్న మునగాల పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. రోడ్డు క్రాస్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు వెంకన్న చెప్పారు.
**