టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ ట్విటర్ వేదికగా తన అన్నయ్య దివంగత జానకిరామ్‌ను గుర్తుచేసుకున్నాడు. బుధవారం జానకిరామ్ జయంతి. ఈ సందర్భంగా కళ్యాణ్‌రామ్ జానకిరామ్‌కు నివాళులర్పించారు. తన అన్నయ్య జయంతి సందర్భంగా ట్విటర్ వేదికగా కళ్యాణ్‌రామ్ స్పందిస్తూ.. ‘మీరు ఎల్లప్పుడూ మా హృదయాలలో, మా ప్రార్థనలలో జీవించే ఉంటారు. హ్యాపీ బర్త్‌డే అన్నయ్య. వి మిస్ యూ’అంటూ ట్వీట్ చేశాడు. సొంతంగా ఎన్టీఆర్ బ్యానర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన జానకిరామ్ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అయితే సక్సెస్ ఫుల్ నిర్మాతగా మరిన్ని విజయాలను అందుకోవాల్సిన జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో అకాల మృత్యువాత పడిన విషయం తెలిసిందే.
ఐదేళ్ల కిందట నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాము వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జానకిరామ్ దుర్మరణం చెందారు. 2014 డిసెంబరు 6 న హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పడంతో జానకిరామ్ మృతిచెందారు. ట్రాక్టర్‌ను తప్పించబోయి జానకిరామ్ కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించారు. పెద్దకుమారుడి మాదిరిగానే నందమూరి హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. ఇక 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ప్రచారం చేసిన నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా నల్లగొండ జిల్లా మోతే వద్ద ఆయన ప్రయాణిస్తోన్న వాహనం ప్రమాదానికి గురయ్యింది. ఈ వరుస ప్రమాద కారణాలతోనే ‘అతి వేగం ప్రమాదకరం.. యాక్సిడెంట్ వల్ల మేము ఇప్పటికే మేము ఎంతో కోల్పోయాము. ఆ పరిస్థితి మరేవరికి రావద్దు’ అంటూ నందమూరి వారసుల చిత్రాల ప్రారంభానికి ముందు వాయిస్ ఓవర్ వస్తుంటుంది.
చదవండి:
లవ్ యూ అమ్మ: రామ్ చరణ్
విలన్‌గా అనసూయ..!
Comments
Please login to add a commentAdd a comment