birth anniversay
-
హరనాథ్ మంచి మనసున్న వ్యక్తి
‘‘నేను, హరనాథ్ కలిసి చాలా సినిమాల్లో నటించాం. అతను నిజమైన అందాల నటుడు.. అలాగే మంచి మనసున్న వ్యక్తి. నేను హీరోగా నటించిన ‘మా ఇంటి దేవత’ చిత్రాన్ని కూడా నిర్మించారు హరనాథ్’’ అని సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్నారు హీరో బుద్ధరాజు హరనాథ్ రాజు. 1936లో సెప్టెంబర్ 2న జన్మించిన ఆయన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో 167 సినిమాల్లో నటించారు. 1989, నవంబర్ 1న మరణించారాయన. కాగా హరనాథ్ జీవిత చరిత్రను ‘అందాల నటుడు’ పేరుతో డా.కంపల్లి రవిచంద్రన్ రచించారు. శుక్రవారం హరనాథ్ జయంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని సూపర్ స్టార్ కృష్ణ విడుదల చేశారు. ఈ పుస్తకావిష్కరణలో హరనాథ్ కుమార్తె జి. పద్మజ, అల్లుడు జీవీజీ రాజు (‘తొలి ప్రేమ, గోదావరి’ చిత్రాల నిర్మాత), మనవళ్లు శ్రీనాథ్ రాజు, శ్రీరామ్ రాజు, పుస్తక రచయిత కంపల్లి రవిచంద్రన్ పాల్గొన్నారు. -
సియాటెల్ లో వైఎస్ఆర్ 73వ జయంతి వేడుకలు
-
ఇండియాకు చేగువేరా
నేడు చేగువేరా జయంతి కాదు. ఆయన వర్ధంతి కూడా కాదు. మరి ఈరోజు ప్రత్యేకత ఏమిటి? ఆయన 1959లో ఇదే రోజు (జూన్ 30) తొలిసారి భారతదేశం వచ్చారు! ఆ రాత్రి పొద్దు పోయాక ఢిల్లీ పాలం విమానాశ్రయంలో దిగారు. మర్నాడు నాటి ప్రధాని నెహ్రూ తన అధికార నివాసం తీన్‌మూర్తి భవన్లో చేగువేరాను సాదరంగా ఆహ్వానించారు (కింది ఫొటో). నియంతల గుండెల్లో నిద్రించిన యోధుడు చేగువేరాకు భారతదేశంలో పనేమిటి? అంతకన్నా ముందు, ఆయన ఎవరో సంక్షిప్తంగా గుర్తు చేసుకుందాం. చేగువేరా 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రోజలియాలో జన్మించారు. చే బాల్యంలో ఆస్తమా బాధితుడు. దీంతో పసివాడికి ఏమౌతుందో అని భయపడుతూ అతని తల్లిదండ్రులు నిద్రలేని రాత్రులు గడిపేవారు. అయితే ఆ పసివాడే పెరిగి పెద్దయ్యాక నియంతలకు నిద్ర లేకుండా చేశాడు! వైద్య విద్యార్థిగా వున్నప్పుడే లాటిన్ అమెరికా మొత్తం పర్యటించాలని చే మనసులో కోరిక కలిగింది. ఆ కోరిక బలంగా నాటుకుపోయింది. స్నేహితుడు ఆల్బర్టో గ్రనడోతో కలసి తన పాత మోటారు సైకిలుపై లాటిన్ అమెరికా మొత్తం చుట్టి రావాలనుకున్నాడు. ఆ ప్రయాణమే ఆయన జీవితాన్ని మార్చేస్తుందని చే కూడా ఊహించలేదు. ఆ ప్రయాణం మొదలు పెట్టాక దారి మధ్యలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. వలస సామ్రాజ్యవాదుల పాలనలో మగ్గిపోతూ కనీస అవసరాలైన తిండి, గూడు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు, బానిస బతుకులు, సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న కోట్లాది ప్రజల బాధలను ఆకలిచావులను చే కళ్లారా చూశాడు. అప్పుడే లాటిన్ అమెరికాలోని బానిసల జీవితాలలో వెలుగులు నింపాలని నిర్ణయించుకున్నాడు. డాక్టర్ పట్టా చేతికొచ్చిన చేగువేరాను చూసి తల్లితండ్రులు ఎంతో ఆనందపడ్డారు. అయితే ఆయన ఆలోచనలు వేరుగా వున్నాయని వారికి తెలియదు. దోపిడీ చేస్తున్న నియంతృత్వాన్ని అంతమొందించి.. బానిసత్వం నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని అనుకుంటున్నట్లు చే వారితో అన్నాడు. అనడమే కాదు, ఆ దిశగా అడుగులు వేశాడు. తన విప్లవానికి మొదట బొలీవియాను ఎంచుకున్నాడు. అక్కడ నుంచి అనేక దేశాల మీదుగా ప్రయాణిస్తూ క్యూబా గురించి, క్యాస్ట్రో నాయకత్వంలో అక్కడ జరుగుతున్న పోరాటాల గురించి తెలుసుకున్నాడు. క్యూబా నియంత బాటిస్టాపై చే నడిపిన గెరిల్లా యుద్ధం విప్లవబాటకు కొత్త అడుగులు నేర్పింది. ఆ తర్వాత క్యూబా పునర్నిర్మాణంలో చే పాత్ర మర్చిపోలేనిది. అందుకే క్యూబన్లు క్యాస్ట్రోని ప్రేమించినట్లే చేగువేరాను కూడా ప్రేమిస్తారు. ఇక ఆయన ఇండియా ఎందుకు వచ్చారంటే.. క్యాస్ట్రో పంపించారు. బాండుంగ్ ఒప్పందంలో ఉన్న దేశాలన్నిటినీ చేగువేరాని పర్యటించి రమ్మన్నారు. బాండుంగ్ అనేది ఇండోనేషియాలోని పట్టణం. వలస పాలన నియంతృత్వాన్ని వ్యతిరేకించే ఆఫ్రో–ఏషియన్ దేశాలన్నీ బాండుంగ్‌లో సమావేశమై.. సమైక్యంగా ఉండాలని, ఆర్థికంగా సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందులో ఇండియా కూడా ఉంది. అందుకే చేగువేరా ఇండియా వచ్చారు. ఇక్కడే కొన్ని రోజులు ఉన్నారు. కలకత్తా కూడా సందర్శించారు. 39 ఏళ్ల వయసులో 1967 అక్టోబర్ 9న ఈ విప్లవ వీరుడు, గొరిల్లా యుద్ధంలో ఆరితేరిన యోధుడు మరణించారు. బొలీవియా సైన్యం అతడిని పట్టి బంధించి, చంపేసింది. -
రాజకీయ జీవితంలో రెండు సార్లు వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్
-
ఆత్మవిశ్వాసానికి నిండైన రూపం!
తెలుగు సినీ వినీలాకాశంలో రారాజుగా వెలుగొందుతున్న సమయంలో ‘ఢిల్లీ’ కాళ్లకింద తెలుగువాడి ఆత్మగౌరవం నలిగిపోతుంటే చూసి రగిలిపోయారు ఎన్టీఆర్. అందుకే రాజకీయ రంగప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ‘తెలుగువారి ఆత్మ గౌరవ’ నినాదంతో కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో అధికార పీఠాన్ని అధిరోహించారు. ‘రెండు రూపాయలకు కిలో బియ్యం’ ‘పేదలకు పక్కా ఇళ్ళు’ వంటి పథకాలు, బీసీలకు 29 శాతం అవకాశాలు కల్పించడం ద్వారా ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించారు. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి బీసీలకు 50 శాతం అవకాశాలు కల్పిస్తున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే – ఈ ఇద్దరు వ్యక్తులకూ శత్రువు ఒకరే కావడం! ‘‘నేను అవమానాల పాలైనప్పుడల్లా మీరు గౌరవంతో కిరీటం పెట్టారు నన్ను దుమ్మెత్తి పోస్తున్నప్పుడు నా నిజాయితీ ఆదర్శంపట్ల విశ్వాసం ప్రకటించారు నన్ను నియంతృత్వపు ఉక్కుపాదాల క్రింద నలుపుతున్నప్పుడు మీ నాయకుడిగా గుర్తించారు నన్ను నేను సమర్థించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మీరు నన్ను సమర్థించారు ప్రతి సామాన్యమైన రీతిలో అత్యల్ప మానవునిగా సేవ చేయుటయే గర్వంగా భావిస్తుంటే మీరు నన్ను పైకెత్తి ప్రపంచం ముందు మీ ప్రతినిధిగా నిలబెట్టారు’’ అనీబిసెంట్ ఇంగ్లిష్‌లో రాసిన కవిత అంటూ 1989లో తెలుగు దేశం పార్టీ ఓడిపోయాక గండిపేట ‘తెలుగు విజయం’ ఆఫీసులో జరిగిన పార్టీ మీటింగులో ఎన్టీఆర్ గారు ఈ కవితను వినిపించారు.పార్టీ పట్ల, సభ్యుల పట్ల, ప్రజల పట్ల ఆయనకున్న అపారమైన విశ్వాసాన్ని తనవారే భగ్నం చెయ్యటం ఆయన ఊహించని విషయం. చివరకు తనవారి చేతిలో ఘాతుకానికి బలైపోవటానికి కారణాలు ఆయన మంచితనం, నిష్కాపట్యమే తప్ప మరొకటి కాదు. అటు వంటి నాయకుడిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ వెన్నుపోటుదార్లుగా చరిత్ర ఉన్నంతవరకూ ఉంటారు. ఆయన వ్యక్తిగత జీవితం, సినిమా, రాజకీయ జీవితాలు పరిశీలిస్తే మాట తప్పని మనిషిగా, పేదవర్గాల పట్ల సానుభూతి ఉన్న నాయకుడిగా నమ్మి వచ్చిన స్త్రీకి తాళికట్టి గౌరవాన్ని కాపాడిన మేరు నగ ధీరుడిగా కన్పిస్తారు. ఎన్టీఆర్ నిజంగా చారిత్రక పురుషుడే. ఒక మనిషి జీవితంలో ఎన్ని ఆరోహణా సోపానా లుంటాయో అవన్నీ అధివసించిన వ్యక్తి. 1923 మే 28న కృష్ణా జిల్లా, నిమ్మకూరు గ్రామంలో రైతుబిడ్డగా జన్మించి, ఉన్న ఆస్తులు పోగొట్టుకుని, కన్న ఊరుని విడిచి విజయవాడకు చేరింది ఆయన బాల్యం. తండ్రి చేసిన పాల వ్యాపారంలో తోడుగా నిలిచిన ఉత్తమ పుత్రుడు. నివసిస్తున్న పూరి పాకలో వర్షం వస్తే అది పడిపోకుండా తెల్లవార్లూ తండ్రితోపాటు నిట్టాడి కొయ్యను పట్టుకొని, కుటుంబాన్ని రక్షించుకొన్న కష్టజీవి. బ్రేకుల్లేని పాత హెర్క్యులస్ సైకిల్ మీద 60 కిలోల బరువును పెట్టుకొని పంక్చర్ అయిన సైకిల్‌ను నడిపించుకుంటూ 60 మైళ్ళు అర్ధరాత్రి విజయవాడ దాకా ప్రయాణం చేసిన సాహసి. స్నేహితుని వివాహానికి వెళ్లాల్సిన రైలు తప్పిపోతే ఆ పట్టాల వెంబడే 30 మైళ్ళు నడిచి వెళ్ళిన స్నేహశీలి. అంతేకాదు, తమ్ముడు త్రివిక్రమరావుకు ‘పెదమద్దా’ వాళ్ళ అమ్మాయిని ఇస్తామని చెప్పి తీరా ముహూర్తాలు పెట్టుకునే సమయానికి రాకుండా మొహం చాటేసినప్పుడు... మధ్యవర్తుల ద్వారా త్రివిక్రమరావుకు చదువులేదు, ఆస్తి లేదు, అందువల్ల భార్యను పోషించలేడు కనుక ఈ సంబంధం వదిలేస్తున్నామని వారన్నట్లు తెలియడంతో... ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పెంపుడు తండ్రి ద్వారా తనకు సంక్రమించిన ఆస్తిని అప్పటికప్పుడే తమ్ముడి పేర మార్చి వివాహం జరిపించిన సోదర ప్రేమికుడు. కష్టపడి బీఏ చదివి, సబ్ రిజిస్ట్రార్‌గా ఉద్యోగం సంపాదించి కూడా అక్కడ జరుగుతున్న అవినీతి నచ్చక ఆ ఉద్యోగం వదిలేసి సినీ రంగంలో భవిష్యత్తును వెతుక్కున్న నీతిమంతుడు. సినిమా రంగాన్ని 30 ఏళ్లకు పైగా శాసించిన కళాకారుడు. 1949లో ‘మనదేశం’లో చిన్న ఎస్సై పాత్రతో మొదలైన సినీ జీవితం అప్రతిహతంగా కొనసాగింది. సమయపాలన, అకుంఠిత దీక్ష అగ్రస్థానంలో నిలబెట్టాయి. నిర్మాతను ఎన్నడూ కష్టపెట్టలేదు. 1970 వరకు ఆయన రెమ్యునరేషన్ – వేలల్లోనే ఉండేది. ప్రతి చిత్రంలో తన వేషాన్ని 6 వారాల్లోగా పూర్తి చేసేవారు. 1969 వరకు నెలకొక్క సినిమా చొప్పున చేశారు. 1964 ఒక్క సంవత్సరంలో మాత్రం 15 సినిమాలు చేసి రికార్డు సృష్టించారు. 1949 నుండి 1982 వరకు అంటే 33 సంవత్సరాల్లో సుమారు 300 సినిమాల్లో నటించారు. ఇందులో 140 చిత్రాలు వెయ్యి థియేటర్లలో 100 రోజులు ప్రదర్శితమయ్యాయి. 33 సినిమాలు 108 ప్రదర్శన శాలల్లో 25 వారాలు ప్రదర్శించబడి రజతోత్సవం జరుపుకున్నాయి. కళామతల్లికి ఎనలేని సేవ చేసి తన 60వ యేట రాజకీయాల్లో ప్రవేశించారు. తెలుగుభాష పట్ల మక్కువ కల్గిన ఆయన తన పార్టీకి ‘తెలుగుదేశం’ అని పేరు పెట్టుకుని, ఆత్మ గౌరవ నినాదంతో 1982 మార్చి 29న పార్టీని ప్రకటించి, కేవలం 9 నెలల్లోనే అధికారానికి తీసుకురావటం చారిత్రాత్మకం. 1965లో ఒకసారి, 1978లో రెండవసారి జరిపిన ప్రయోగాలు విఫలమై కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ శక్తి లేదనుకున్న తరుణంలో ఎన్టీఆర్ ఆకర్షణ ఆయన పార్టీకి బలంగా నిలబడి గెలిపించింది. నాడు కాంగ్రెస్‌ను ఎదిరించి నిలబడిన నాయకుడు ఎన్టీఆర్ అయితే... నేడు అదే కాంగ్రెస్‌ను రెండు రాష్ట్రాలలో మట్టి కరిపించిన ప్రజాకర్షణ మళ్లీ జగన్మోహన్రెడ్డి గారిదే. ఇద్దరి ఆశయం ఒక్కటే. సామాజిక న్యాయం, అగ్రకులాధిపత్యంలో ఎన్నో ఏళ్లుగా నలిగి ఓటుకే తప్ప పదవికి దూరంగా ఉంచబడ్డ బడుగు, బలహీన వర్గాలను ఆదరించి అక్కున చేర్చుకుంది ఈ ఇద్దరు నాయకులే. ‘పటేల్–పట్వారీ’ వ్యవస్థను తొలగించి ‘మండల’ వ్యవస్థను తెచ్చి ఎన్టీఆర్ ప్రజల దగ్గరకు ప్రభుత్వాన్ని నడిపించారు. ‘రెండు రూపాయలకు కిలో బియ్యం’ ఇవ్వడం, పక్కా ఇళ్ళు నిర్మించడం, బీసీలకు 29 శాతం అవకాశాలు కల్పించడం ద్వారా ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించారు. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి 50 శాతం అవకాశాలు ఇచ్చి ఆదుకుంటున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే – ఈ మంచి పనులు చేసిన ఇద్దరు వ్యక్తులకూ శత్రువు ఒకరే. రాజకీయం అంటే అడ్డదారులే అని నమ్మినవాడు, అవినీతిని జీవిత లక్ష్యంగా చేసుకుని సొంత మామనే అధికారం కోసం వెన్నుపోటు పొడిచి పదవిలోకి వచ్చినవాడు చంద్రబాబు. తన స్వార్థం కోసం ప్రజాస్వామ్యాన్ని 1995 ఆగస్టు 25న ఘోరంగా పాతిపెట్టిన వ్యక్తి. అతని వలన ఎంతోమంది తమ రాజకీయ జీవితాన్ని వదులుకోవలసి వచ్చింది. నాదెండ్ల దగ్గరనుండి నల్లపరెడ్డి వరకు అందరూ బలి పశువులే. ఉన్నతమైన వ్యక్తిత్వంతో నిస్వార్థంగా ప్రజలకు మేలు చేద్దామనుకొని రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ పదవినీ, పార్టీనీ లాక్కొని చెప్పులేయించాడు. చివరకు బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింపచేసిన ఇటువంటి నీచ మనస్తత్వం మానవ జాతిలో కనిపించదు. అవమాన భారంతో అల్లుడి దుర్మార్గాలను ఎదిరించలేక అలసిపోయిన ఎన్టీఆర్... ఆడియో, వీడియోల రూపంలో చంద్ర బాబు వెన్నుపోటు తెలియజేసి చివరకు ఆక్రోశిస్తూనే 1996 జనవరి 18వ తేదీన ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ‘‘ఆ పశ్చిమాశా విషాదాంత కావ్యమై వ్యాపించు కాల మేఘాళిలో’ అన్న శ్రీశ్రీ మాటలు ఈ విషాద దృశ్యానికి సాక్ష్యంగా నిలుస్తాయి. ఆయన ఆశయాల అడుగు జాడలలో నడుస్తూ, పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని బహుశా ఆయన ఆత్మ ఆశీర్వదిస్తూనే ఉంటుంది. ‘విషం కక్కే భుజంగాలో, మదం పట్టిన మాతంగాలో’ ఎవ్వరు అడ్డుపడినా జగన్మోహన్రెడ్డి తన ఆశయాల బాటలో ముందుకు సాగుతూనే ఉంటారు. ఉండాలి కూడా! వ్యాసకర్త: డా‘‘ నందమూరి లక్ష్మీపార్వతి రచయిత్రి, ఎన్టీఆర్ సతీమణి (నేడు ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరం ప్రారంభం) -
దాసరి జయంతి: పాన్ ఇండియా దర్శకులకు సత్కారం
దర్శకదిగ్గజం దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని పాన్ ఇండియా దర్శకులకు దాసరి కల్చరల్ ఫౌండేషన్ ఆద్వర్యంలో తెలుగు సినిమా వేదిక-ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ సమన్వయంతో ఎఫ్.ఎన్.సి సి క్లబ్ లో అంగరంగ వైభవంగా సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన బాలీవుడ్ దర్శకులు, నటీమణులు మాట్లాడుతూ.. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిని అందుకుందని కితాబునిచ్చారు. దాసరి బయోపిక్ ను ‘దర్శకరత్న’ పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తాడివాక రమేష్ నాయుడు స్థాపించిన దాసరి కల్చరల్ ఫౌండేషన్... తెలుగు సినిమా వేదిక వ్యవస్థాపకులు పాకలపాటి విజయ్ వర్మ, ఎఫ్ టి పి సి అధ్యక్షులు చైతన్య జంగా సంయుక్త సారధ్యంలో దాసరి సంస్మరణ వేడుక హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సంగీత విద్వాంసులు తరుణ్ భట్టాచార్య, ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, ధవళ సత్యం, రేలంగి నరసింహారావు బి.గోపాల్, వీరశంకర్, ముప్పలనేని శివ, ఆర్.నారాయణమూర్తి, చంద్రమహేష్, రాజా వన్నెంరెడ్డి, బి.సి.కమిషన్ చైర్మన్ వకులాభారణం కృష్ణమోహన్ రావు, సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాధ్, మాదాల రవి, మోహన్ గౌడ్, బాబ్జి తదితరులు పాల్గొన్నారు. ఈసందర్బంగా దేశవ్యాప్తంగా 16 భాషలకు చెందిన దర్శకులకు సన్మానం చేశారు. అనంతరం సీనియర్ దర్శకులు ధవళ సత్యం సారధ్యంలో తాడివాక రమేష్ నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బహుభాషా బయోపిక్ "దర్శకరత్న" పోస్టర్ ను ఆవిష్కరించారు. -
గిరిజనుల పాలిట దేవుడు అల్లూరి సీతారామరాజు
బంజారాహిల్స్(హైదరాబాద్): తన వీరోచిత పోరా టాలతో తెల్లదొరల గుండెల్లో వణుకు పుట్టించి గిరిజనుల పాలిట దేవుడిగా, ప్రజల్లో దేశ భక్తిని నింపిన స్వాతంత్య్ర సమరయోధుడిగా అల్లూరి సీతారామరాజు చరిత్ర చిరస్థాయిలో నిలుస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రముఖుల జీవి తాలను ఈ తరానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో కేంద్రం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా తెలుగు ప్రజల ఆరాధ్యదైవం అల్లూరి సీతారామ రాజు 125వ జయంతిని జాతీయ సంబురాలుగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని ఆదివారం ఫిలింనగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లా డుతూ.. ఈ ఏడాది జూలై 4 నుంచి వచ్చే ఏడాది జూలై 4 వరకు అల్లూరి జయంతి ఉత్సవాలను నిర్వహించాలన్నారు. ఏపీలోని లంబసింగిలో అల్లూరి మ్యూజియానికి రూ.35 కోట్లు కేటాయిం చామని, అందులో ఇప్పటికే రూ. 6.93 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ఈ జయంతి ఉత్సవాల్లోనే మ్యూజియం నిర్మాణాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అల్లూరిపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని, దానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నామని చెప్పారు. సూపర్‌స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా ద్వారానే ఆయన చరిత్ర ప్రతి ఒక్కరికీ తెలిసిందని, తాను ఆ సినిమాను 20 సార్లు చూశానని అప్పటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు. పార్లమెంట్లో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేయాలి: ఏపీ మంత్రి అవంతి ఏపీ పర్యాటక శాఖమంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేసే విధంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కృషి చేయాలని కోరారు. ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటైతే ఒక జిల్లాకు అల్లూరి పేరు పెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. అల్లూరి పేరుతో విశ్వవిద్యాలయాల్లో గోల్డ్ మెడల్స్‌ను ప్రవేశ పెట్టాలన్నారు. హీరో కృష్ణ మాట్లాడుతూ.. తన పన్నెండో ఏట నుంచే అల్లూరి అంటే ఇష్టమని.. తన వందో చిత్రం అల్లూరి సీతారామరాజు.. అని గుర్తు చేసుకున్నారు. తాను 365 సినిమాలలో నటించినా ఇప్పటికీ తనకు నంబర్ వన్ చిత్రం అల్లూరి సీతారామరాజు అని పేర్కొన్నారు. ప్రముఖ నటుడు, హీరో మోహన్‌బాబు మాట్లాడుతూ.. రాజులు చాలా గొప్పవారని, వాళ్లల్లో రాజకీయం నరనరాల్లో ప్రవహిస్తూ ఉంటుందని అన్నారు. రాజులంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు, క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు ఎన్.నాగరాజు, ప్రధాన కార్యదర్శి పి.నానిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ హీరో కృష్ణను సత్కరించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆయనకు అల్లూరి చిత్రపటాన్ని బహూకరించారు. -
కాంగ్రెస్‌తోనే దేశానికి పూర్వ వైభవం
సాక్షి, హైదరాబాద్: దేశానికి పూర్వ వైభవం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి కోరారు. మంగళవారం గాంధీభవన్‌లో పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం ఘనం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జెండాను రేవంత్‌రెడ్డి ఆవిష్కరించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి 137 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. స్వాతంత్య్రం కోసం ఎంతో శ్రమించి.. శాంతియుత పోరాటంతో ఏదైనా సాధించవచ్చని ప్రపంచానికి చాటి చెప్పిందని గుర్తు చేశారు. అలీన విధానం, హరిత విప్లవం, పారిశ్రామిక విప్లవం, ఫుడ్ సెక్యురిటీ, ఉపాధి హామీ, సాంకేతిక అభివృద్ధి అంతా కాంగ్రెస్‌తోనే సాధ్యమైందని వివరించారు. ప్రస్తుత పాలకులు కాంగ్రెస్ ప్రతిష్ట దెబ్బ తీయాలని చూస్తున్నారని, ఎందరు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీకి మట్టి అంటదని స్పష్టం చేశారు. కుటుంబం అంటూ లేని ప్రధాని మోదీ ఆడ పిల్లల పెళ్లి వయసు పెంచి దేశంలో అలజడి సృష్టించారన్నారు. కార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీలు వీహెచ్, మధుయాష్కి, మల్లు రవి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. -
గానకోకిల పాటకు పట్టాభిషేకం
పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ పీ సుశీల జన్మదినోత్సవం సందర్భంగా 13 దేశాల నుంచి 50 మంది గాయనీమణులు 100 పాటలు గానం చేశారు. భారతదేశం, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఓమాన్, ఖతార్, బహరేయిన్, మలేషియా మరియు స్వీడన్ దేశాల నుంచి వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమాన్ని వంశీ ఇంటర్నేషనల్ ఇండియా, శుభోదయం గ్రూప్ ఇండియా, శ్రీ సాంస్కృతిక కళా సారథి, సింగపూర్, ది గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. డాక్టర్ వంశీ రామరాజు, డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ కలపటపు, రత్న కుమార్ కవుటూరు, రాధిక మంగిపూడి, అనిల్ కుమార్, డాక్టర్ తెన్నేటి సుధాదేవి, శైలజ సుంకరపల్లి, రాధిక నోరి, లక్ష్మీ శ్రీనివాస రామరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
గ్లోబల్ స్టార్డమ్ దక్కిన తొలి ఇండియన్ హీరో ఎవరో తెలుసా?
Sivaji Ganesan Birth Anniversary Google Doodle: భారీ బడ్జెట్లు, హై టెక్నికల్ వాల్యూస్, క్వాలిటీ మేకింగ్, స్టార్ కాస్టింగ్, పాన్ ఇండియన్ సినిమాలు.. ఇవన్నీ ఇండియన్ సినిమాను గ్లోబల్ లెవల్లో నిలబెతున్నాయి. వెండితెరపై తమ కటౌట్లతో విదేశీ అభిమానం సైతం సంపాదించుకుంటున్నారు మన నటులు ఇప్పుడు. అయితే కొన్ని దశాబ్దాల క్రితమే కేవలం ‘నటన’ ద్వారా తన స్టార్‌డమ్‌ను ఖండాంతరాలు దాటించిన వ్యక్తి శివాజీ గణేషన్. ఈరోజు ఆయన 93వ జయంతి (అక్టోబర్ 1, 2021). ► మెథడ్ యాక్టర్‌గా పేరున్న శివాజీ గణేషన్.. తన నటన ద్వారా కమల్ హాసన్, రజినీకాంత్‌లాంటి వాళ్లెందరిపైనో ప్రభావం చూపించిన వ్యక్తి. ► అసలు పేరు గణేస(ష)మూర్తి.. పుట్టింది తమిళనాడు విల్లుపురంలో అక్టోబర్ 1, 1928న. ► ఏడేళ్ల వయసుకే థియేటర్ ఆర్టిస్ట్ అవతారం.. నాటకాల్లో ఆడ పాత్రలతో మంచి గుర్తింపు ► 1945లో శివాజీ కంద హిందూ రాజ్యం అనే నాటకంలో శివాజీ పాత్రను పోషించాడు. స్టేజీపై ఆయన నటనను చూసి మైమరిచిపోయిన ప్రముఖ సంఘసంస్కర్త ఈవీ రామస్వామి.. గణేసన్ను నటనలో ‘శివాజీ’గా అభివర్ణించాడు. అలా ఆయన పేరు అప్పటి నుంచి శివాజీ గణేసన్ అయ్యింది. ► 1952లో ప్రజాశక్తి సినిమా ద్వారా ఆయన తెరంగగ్రేటం చేశారు. అప్పటి నుంచి 300 సినిమాల్లో నటించారు. ► భావోద్వేగాలు పండించడంలో శివాజీ గణేషన్ దిట్ట. ప్రత్యేకించి కంచు కంఠంతో తమిళ సినిమాలో ఓ చెరగని ముద్ర వేసుకున్నారు ► విశేషం ఏంటంటే.. భారత సినీ రంగం నుంచి అంతర్జాతీయంగా గుర్తింపు దక్కించుకున్న తొలి నటుడు ఈయనే!. ► 1960 ఈజిప్ట్ రాజధాని కైరోలో జరిగిన ఆఫ్రో-ఆసియన్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో బెస్ట్ యాక్టర్(వీరపాండియ కట్టబొమ్మన్కుగానూ) అవార్డును అప్పటి ఈజిప్ట్ అధ్యక్షుడు గమల్ అబ్దెల్ నాసర్ నుంచి అందుకున్నారు. ఈ చిత్ర డైలాగులు నేటికి తమిళ నాట ప్రతిధ్వనిస్తుంటాయి. ► అమెరికా గడ్డపై అడుగుపెట్టిన తొలి భారతీయ నటుడు కూడా ఈయనే!. 1962లో కల్చరల్ ఈవెంట్ కోసం శివాజీ గణేషన్ హాజరయ్యారు. అంతేకాదు అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనెడీ, శివాజీని కల్చరల్ అంబాసిడర్‌గా గుర్తించారు కూడా. ఆ తర్వాత ఎన్నో దేశాల్లో భారతీయ నటుడి హోదాల్లో పర్యటించారు శివాజీ గణేషన్. ► 1961లో ‘పాశమలర్’ కుటుంబ సమేత చిత్రంగా ఓ ట్రెండ్ సృష్టించగా.. 1964లో వచ్చిన ‘నవరాత్రి’ తొమ్మిది గెటప్‌లతో సరికొత్త రికార్డు సృష్టించాడు ► దైవ మగన్, పుదియా పరవై ..ఇలా ఎన్నో సినిమాలు దేశవ్యాప్తంగా నటుడిగా ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ► తేవర్ మగన్(క్షత్రియ పుత్రుడు)లో క్యారెక్టర్‌కి నేషనల్ అవార్డు(స్పెషల్ జ్యూరీ) దక్కింది శివాజీ గణేసన్కి. కానీ, ఎందుకనో ఆయన ఆ అవార్డును సున్నితంగా తిరస్కరించారు. ► 1995లో ఫ్రాన్స్ గౌరవం, 1997లో దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందుకున్నారు శివాజీ గణేషన్. ► తమిళ సీనియర్ నటుడు ప్రభు ఈయన తనయుడే. ఇక మనవడు విక్రమ్ ప్రభు(తెలుగులో వచ్చిన గజరాజు హీరో) కోలీవుడ్‌లో యంగ్ హీరోగా ఉన్నాడు. ► ది లాస్ ఏంజెల్స్ టైమ్స్ శివాజీ గణేషన్‌ను ‘మార్లోన్ బ్రాండో ఆఫ్ సౌత్ఇండియన్’గా అభివర్ణించింది. ► ఓ స్టార్ హీరో సినిమాలో పాటలు లేకపోవడం జరిగింది కూడా శివాజీ గణేసన్ విషయంలోనే. ఆయన నటించిన ‘అంధ నాల్’లో ఒక్క పాట కూడా ఉండదు. ► పరదేశీ(1953), పెంపుడు కొడుకు, మనోహర, బొమ్మల పెళ్లి, పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం, రామదాసు, బంగారు బాబు, భక్త తుకారాం, జీవన తీరాలు, చాణక్య చంద్రగుప్త(అలెగ్జాండర్ పాత్ర), నివురు గప్పిన నిప్పు, బెజవాడ బొబ్బులి, విశ్వనాథ నాయకుడు(నాగమ నాయక పాత్ర), అగ్ని పుత్రుడు లాంటి తెలుగు సినిమాలతోనూ అలరించారు. ► ఆత్మబంధువు లాంటి తమిళ డబ్బింగ్ సినిమా, అందులోని పాటల్ని తెలుగు ప్రేక్షకులు చాలామంది ఇష్టపడుతుంటారు. ► 1999 సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పడయప్ప(నరసింహా) శివాజీ గణేసన్ తెర మీద కనిపించిన చివరి సినిమా. ► శ్వాసకోశ సంబంధిత సమస్యలతో జులై 21, 2001న ఆయన కన్నుమూశారు. ► కలైమామణి, పద్మ శ్రీ, పద్మ భూషణ్, చెవలియర్(ఫ్రాన్స్), దాదా సాహెబ్ పాల్కే అవార్డు, ఎన్టీఆర్ నేషనల్ అవార్డులు అందుకున్నారు శివాజీ గణేషన్. ► శివాజీ గణేషన్ జయంతి సందర్భంగా గూగుల్ ఇవాళ డూడుల్‌తో ఆయన్ని గుర్తు చేసింది. ► బెంగళూరుకు చెందిన నూపూర్ రాజేష్ చోక్సీ.. ఈ డూడుల్‌ను క్రియేట్ చేశాడు. - సాక్షి, వెబ్‌స్పెషల్ -
గురజాడ అప్పారావుకు సీఎం జగన్ ఘన నివాళి
సాక్షి, అమరావతి: మహాకవి సంఘ సంస్కర్త గురజాడ అప్పారావును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్మరించుకున్నారు. గురజాడ జయంతి సందర్భంగా మంగళవారం ఆయనకు సీఎం జగన్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ‘మహాకవి, తెలుగుజాడ గురజాడ వెంకట అప్పారావు జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి. సాహితీ దిగ్గజం, సంస్కరణవాది, మూఢాచారాలను నిర్ద్వందంగా ఖండించిన ఆ మహానీయుడిని మరువదు ఈ తెలుగు నేల’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. చదవండి: యువతకు గుడ్‌న్యూస్.. నిరుద్యోగ భృతి, 80 శాతం ఉద్యోగాలు మీకే.. మహాకవి, తెలుగుజాడ గురజాడ వెంకట అప్పారావు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి. సాహితీ దిగ్గజం, సంస్కరణవాది, మూఢాచారాలను నిర్ద్వందంగా ఖండించిన ఆ మహనీయుని మరువదు ఈ తెలుగునేల. — YS Jagan Mohan Reddy (@ysjagan) September 21, 2021 -
ఆయన మాట విరుపులు చాలు.. నవ్వులే నవ్వులు
Dharmavarapu Subramanyam Birth Anniversary: వెండితెరపై కొందరు పంచిన నవ్వులు ఎల్లకాలం గుర్తిండిపోతాయి. ఆ లిస్ట్‌లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ‘అబ్బా.. అబ్బే.. మాక్కూడా తెలుసు బాబూ.. ఏంది నువ్వు..’ అంటూ చేతులు పిసుక్కుంటూ ఆయన నోటి నుంచి జారే మాటల విరుపులు ప్రేక్షకుల పెదాలపై చిరునవ్వులు పూయిస్తాయి. పాత్ర ఏదైనా పెద్దగా కష్టపడకుండా బాడీ లాంగ్వేజ్, మేనరిజంతో అలరించడం ఆయన ప్రత్యేకత. ముఖ్యంగా లెక్చరర్ పాత్రల్లో ఆయన పంచిన నవ్వుల్ని అంత ఈజీగా మనం మరిచిపోగలమా? ధర్మవరపు సుబ్రహ్మణ్యం జయంతి ఇవాళ.. ►ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. 1954 సెప్టెంబర్ 20న ప్రకాశం జిల్లాలోని బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెంలో జన్మించారు. ఒంగోలులోని సీఎస్ఆర్ కళాశాలలో పీయూసీ వరకు చదివారాయన. ► విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉద్యోగం సైతం చేశారాయన. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లుతో పరిచయం ధర్మవరపు జీవితాన్ని మలుపు తిప్పింది. తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. ► కామెడీ సీరియల్ ఆనందో బ్రహ్మ ఆయన నటన కెరీర్లో ప్రముఖంగా చెప్పుకోదగింది. అందులో నటించడమే కాదు.. కొన్ని ఎపిసోడ్స్‌ను సైతం డైరెక్ట్ చేశారాయన. 80వ దశకంలో దూరదర్శన్‌లో టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ సెన్సేషన్ హిట్‌గా నిలిచింది. ► ఆనందో బ్రహ్మ ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి పేరుతో పాటు సినిమా అవకాశాల్ని తెచ్చిపెట్టింది. జంధ్యాల చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’తో సినిమాల్లోకి అడుగుపెట్టారాయన. అందులో కొడుకు, స్నేహితుడితో వైరం పెట్టుకునే తిక్క లెక్కల మాష్టార్ క్యారెక్టర్లో ధర్మవరపు నటన అలరిస్తుంది. ► బావా బావా పన్నీరు, స్వాతి కిరణం, పరుగో పరుగు, ష్ గప్‌చుప్, ఓహో నా పెళ్లంట, నువ్వే కావాలి, ఆనందం, నువ్వు నేను, ఫ్యామిలీ సర్కస్, నీ స్నేహం, సొంతం, నువ్వే నువ్వే, జయం, మన్మథుడు, ఒక్కడు, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, దొంగోడు, రెఢీ, వసంతం, వర్షం, వెంకీ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, జై చిరంజీవా, డార్లింగ్, బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్, జల్సా, చిరుత, మహేష్ ఖలేజా, లీలా మహల్ సెంటర్.. ఇలా ఎన్నో చిత్రాలతో అలరించారు. ► క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కామెడీ స్కోప్ ఉన్న పాత్రల్లో ఆయన నటనా ప్రస్థానం కొనసాగింది. ఈ క్రమంలో అగ్రహీరోల సరసన సైతం ఆయన నటించారు. ► మణ్ణిన్ మెయింధాన్, చెన్నై కాదల్.. తమిళ చిత్రాల్లోనూ నటించారాయన. ► ‘యజ్ఞం’, ‘ఆలస్యం అమృతం’కు ఉత్తమ కమెడియన్ ఆర్టిస్టుగా నంది అవార్డు అందుకున్నారు. ► జంధ్యాల, తేజ తీసిన సినిమాల్లో ఆయన క్యారెక్టర్లు ప్రత్యేకంగా నిలిచాయి. ► ధర్మవరపు సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ‘తోకలేనిపిట్ట’ ► రాష్ట్ర సాంస్కృతికమండలి చైర్మన్‌గానూ ఈయన పనిచేశారు. ► సాక్షి టీవీలో ఆయన హోస్ట్‌గా వ్యవహరించిన రాజకీయ వ్యంగ్య కార్యక్రమం ‘డింగ్ డాంగ్’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ► 2013 డిసెంబర్ 7న 59 ఏళ్ల వయసులో కాలేయ కేన్సర్‌తో ఆయన కన్నుమూశారు. తెలుగు ఆడియొన్స్‌కు మరిచిపోలేని హస్యానుభూతుల్ని మిగిల్చి వెళ్లిపోయారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. - సాక్షి, వెబ్‌స్పెషల్ -
రియల్ హీరో.. యే దిల్ మాంగే మోర్!
నాయకుడంటే.. ఏదో ముందుండి నడిపిస్తున్నాడనే పేరుంటే సరిపోదు. లక్ష్యసాధనలో తన వెనకున్న వాళ్లకు సరైన దిశానిర్దేశం చేయాలి. విజయం కోసం అహర్నిశలు కృషి చేయాలి. అవసరమైతే తెగువను ప్రదర్శించాలి.. త్యాగానికి సిద్ధపడాలి. ఇది మిగతా వాళ్ల గుండెల్లో ధైర్యం నింపుతుంది. గెలుపు కోసం చివరిదాకా పోరాడాలనే స్ఫూర్తిని కలగజేస్తుంది. కార్గిల్ వార్‌లో అసువులు బాసిన వీరులెందరో. అందులో కెప్టెన్ విక్రమ్ బాత్రా ప్రముఖంగా వినిపిస్తుంటుంది. కారణం.. పైన చెప్పిన లక్షణాలన్నీ ఆయన ప్రతిబింబించారు కాబట్టి. అన్నట్లు ఇవాళ ఈ కార్గిల్ అమరవీరుడి జయంతి. ఈ సందర్భంగా ఆ రియల్ హీరోను స్మరించుకుంటూ... ►హిమాచల్ ప్రదేశ్ పాలంపూర్ జిల్లా ఘుగ్గర్ గ్రామంలో 1974 సెప్టెంబర్ 9న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించారు. ► చదవులోనే కాదు.. ఆటపాటల్లోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించుకున్నారు. ► విక్రమ్ బాత్రా చిన్నప్పటి నుంచే ధైర్యశాలి. కరాటేలో గ్రీన్ బెల్ట్ హోల్డర్. టేబుల్ టెన్నిస్ నేషనల్ లెవల్లో ఆడారు. ► నార్త్ ఇండియా ఎన్సీసీ కాడెట్(ఎయిర్ వింగ్) నుంచి ఉత్తమ ప్రదర్శన అవార్డు సైతం అందుకున్నారు ► డిగ్రీ అయిపోగానే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ల కోసం ప్రిపేర్ అయ్యారు. ► 1996లో ఆయన కల నెరవేరింది. ఇండియన్ మిలిటరీ ఆకాడమీలో చేరారు. ► విక్రమ్ బాత్రా.. మన్నెక్షా బెటాలియన్‌కి చెందిన జెస్సోర్ కంపెనీ(డెహ్రాడూన్)లో చేరి, ఆపై లెఫ్టినెంట్‌గా, అటుపై కెప్టెన్ హోదాలో కార్గిల్ హోదాలో అడుగుపెట్టారు. ► డేరింగ్ అండ్ డాషింగ్ ఆటిట్యూడ్ ఉన్న విక్రమ్‌ను తోటి సభ్యులుగా ముద్దుగా షేర్షా అని పిల్చుకునేవాళ్లు ► గాంభీర్యంగా పైకి కనిపించే బాత్రా చాలా సరదా మనిషి. ఆయన చిరునవ్వే ఆయనకు అందమని చుట్టుపక్కల వాళ్లు చెప్తుంటారు ► ఆయన నోటి నుంచి ఓ ఇంటర్వ్యూలో వచ్చిన ‘యే దిల్ మాంగే మోర్’ డైలాగ్.. తర్వాతి కాలంలో పెద్ద బ్రాండ్‌కి ప్రచార గేయం అయ్యిందని చెప్తుంటారు కొందరు. అందులో నిజమెంతో గానీ.. ఆయన నుంచి మాత్రం ఆ మాట వచ్చిన విషయం వాస్తవం. ► కార్గిల్ వార్‌లో వేల అడుగుల ఎత్తున శత్రువులు సైతం ఊహించని మెరుపుదాడికి సిద్ధమయ్యారు ► దాడిలో తీవ్రంగా గాయపడ్డా కూడా శత్రువులకు వెన్నుచూపెట్టలేదు ఆయన. ముగ్గురు శత్రువుల్ని మట్టుబెట్టిన మరీ 24 ఏళ్లకు దేశం కోసం వీరమరణం పొందారు. ఆ పోరాటం మిగతా వాళ్లలో స్ఫూర్తిని విజయ బావుటా ఎగరేయించింది. ► మరణాంతరం పరమ వీర చక్రతో పాటు రియల్ హీరోల జాబితాలో చోటుసంపాదించుకుని యావత్ దేశం నుంచి గౌరవం అందుకున్నారాయన. ► డిగ్రీ టైంలో డింపుల్ ఛీమాతో నడిచిన ప్రేమ కథ.. విక్రమ్ వీరమరణంతో పెళ్లి పీటలు ఎక్కకుండానే విషాదంగా ముగిసింది. అంతా బలవంతం పెట్టినా విక్రమ్ జ్ఞాపకాలతో ఉండిపోవాలనుకుని ఆమె వివాహం చేసుకోలేదు. ‘రక్త్ సింధూర్’ ప్రేమ కథగా విక్రమ్-డింపుల్ కథ చరిత్రలో నిలిచిపోయింది. విక్రమ్ పుట్టినరోజు, మరణించిన రోజు డింపుల్ తప్పకుండా విక్రమ్ ఇంటికి వెళ్లి.. ఆయన పేరెంట్స్‌తో కాసేపు గడుపుతుంటుంది కూడా. ► రీసెంట్గా సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా వచ్చిన షేర్షా.. ఈయన జీవిత కథ ఆధారంగానే తీసింది. ఇందులో డింపుల్ పాత్రను కియారా అద్వానీ పోషించింది. Heartfelt Tributes to great patriot Param Vir Chakra Captain #VikramBatra on his birth anniversary. He’s an epitome of courage, sacrifice and bravery. His exemplary bravery and valour would always inspire the Nation. #AmritMahotsav pic.twitter.com/2QDQWoYI1n — Ministry of Culture (@MinOfCultureGoI) September 9, 2021 - సాక్షి, స్పెషల్ డెస్క్ -
ధ్యాన్‌చంద్ జయంతి.. ఆసక్తికర విషయాలు
-
‘క్రీడల పట్ల మనం చూపించే అభిమానమే ధ్యాన్‌చంద్‌కు గొప్పనివాళి’
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ నేపథ్యంలో.. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా.. భారత్ దిగ్గజ హకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళులు అర్పించారు. క్రీడల పట్ల మనం చూపించే అభిమానమే ధ్యాన్‌చంద్‌కు గొప్ప నివాళి అని పేర్కొన్నారు. అందరి భాగస్వామ్యంతోనే భారత్ క్రీడల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుందని అన్నారు. కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ క్రీడాకారులు విశేషమైన ప్రతిభ కనబర్చారని అన్నారు. సాధించిన 7 పతకాలలో.. హకీ విభాగంలో ఒక పతకం గెలుచుకున్నామని తెలిపారు. ఇదే స్పూర్తిని భవిష్యత్‌లో కూడా కొనసాగించాలని అన్నారు. చదవండి: త్వరలో సిద్ధూ, అమరీందర్‌లతో రావత్ చర్చలు -
Telugu Language Day: నేడు గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి
సాక్షి, విద్యానగర్(కరీంనగర్): భాషా శాస్త్రవేత్త గిడుగు వెంకట రామ్మూర్తి కృషితో తెలుగుకు కొత్త వెలుగులు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల పాలకుల నిర్వాకం, నిబద్ధత లేని కారణంగా ప్రస్తుతం అమ్మ భాష రోజురోజుకూ ప్రాధాన్యత కోల్పోతూ నిరాదరణకు గురవుతోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పరభాషా వ్యామోహం పెంచుకుంటున్నారు. తెలుగులో రాయడం ఆత్మన్యూనతగా, ఆంగ్ల మాధ్యమంలో చదవడం నాగరికంగా మా రాయి. ఫలితంగా సొంత గడ్డపైనే తెలుగు పరాయిదైపోయింది. రాష్ట్ర ఏర్పాటుకు ఊతమిచ్చిన తెలంగాణ భాష ప్రత్యేకమైనది. ఆ భాషకు న్న శక్తితోనే కవులు, రచయితలు అందించిన సాహిత్యం ఉద్యమానికి చైతన్యం తీసుకువచ్చింది. తెలంగాణ భాష పదజాలం పౌరుషాన్ని, రోషాన్ని నింపి రాష్ట్ర సాధన వరకు వెన్నుదన్నుగా నిలిచిన మన అమ్మ భాషకు పట్టం కట్టాల్సిన అవసరం ఉంది. సదాస్మరణీయుడు.. తెలుగుభాషా వికాసానికి గిడుగు రామ్మూర్తి అందించిన సేవలు సదాస్మరణీయం. తెలుగు భాషలో గ్రాంథిక వాదానికి స్వస్తి చెప్పి, వ్యవహారిక వాదానికి శ్రీకారం చుట్టిన భాషోద్యమకారుడాయన. గిడుగు జయంతినే తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1863 ఆగస్టు 29న ఆయన జన్మించారు. చరిత్ర విభాగంలో అధ్యాపకుడిగా పని చేశారు. సంప్రదాయక విద్య కంటే ఆధునిక విద్యలో విశాల దృష్టి అవరమని చెప్పారు. 1913లో వ్యవహారిక భాషలోనే విద్యాబోధన జరగా లని ఆనాటి మద్రాస్ గవర్నర్‌కు విజ్ఞాపన పత్రం అందజేశారు. తెలుగు–సవర, ఇంగ్లిష్–సవర నిఘంటువులను, గద్య చింతామణి, వ్యాసావళి, నిజమైన సంప్రదాయం మొదలగు గ్రంథాలు ఆయన కీర్తిని ప్రకాశమానం చేశాయి. తెలుగు భాషలోని సొబగులను సామాన్య ప్రజలకు అందించడంలో గిడుగు ప్రయత్నం ప్రశంసనీయం. 1919లోనే మొట్టమొదటి తెలుగు వ్యవహారిక భాషా పత్రికను స్థాపించారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అ ప్పారావు వంటి సాహితీవేత్తలతో కలిసి అదే ఏడాది ఆంధ్రాభాష ప్రవర్తక సమాజాన్ని స్థాపించారు. సామాన్యుల పట్ల మనకు శ్రద్ధ ఉండాలని, పేదవారి ముఖాల్లో వెలుగులు విరజిమ్మాలంటే భాషాసంస్కరణ ఒక్కటే మార్గమని గట్టిగా విశ్వసించిన ఆయన 1940 జనవరి 22న స్వర్గస్తులయ్యారు. తెలుగును పరిరక్షించాలి ఉన్నత తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మాతృ భాషలో బోధన కొనసాగిస్తూ తెలుగు భాషను పరిరక్షించాలి. ప్రాథమిక చదువులు తల్లి భాషలో సాగితేనే జ్ఞానార్జన, ఆలోచనాశక్తిని, ప్రశ్నించేతత్వాన్ని విద్యార్థుల్లో పెంపొందించవచ్చు. ప్రభుత్వం కూడా తెలుగు చదివిన వారికి ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తే తెలుగు నిత్యనూతనమై విరాజిల్లుతుంది. – దాస్యం సేనాధిపతి, కవి, రచయిత, సాహితీ విమర్శకులు మాతృభాష వైపు మళ్లాలి ప్రపంచీకరణ ప్రభావంతో మన భాషా సంస్కృతులను పరిరక్షంచుకునే ఆత్మరక్షణలో పడ్డాం. ఇది ఆత్మగౌరవ సమస్య. ఆంగ్ల భాష వ్యామోహంలో నుంచి మాతృభాష వైపు మళ్లాల్సిన అవసరం ఉంది. అప్పుడే అందరం తెలుగు భాషను కాపాడున్నవారం అవుతాం. ఆ దిశగా ప్రతిఒక్కరూ ఆలోచన చేయాలి. – కేఎస్.అనంతాచార్య, కవి, రచయిత చదవండి: మీ గుండెకు ‘మంచి’ చేసే వంట నూనె -
చీరకట్టులో విమానం నడిపింది.. ఈ గౌరవం అందుకే!
Google Doodle Sarla Thukral: ఆమె చీర కట్టింది. కాక్‌పిట్‌లో కూర్చుంది. ధైర్యంగా ఎయిర్‌క్రాఫ్ట్ నడిపింది. వెయ్యి గంటల ప్రయాణం తర్వాత దేశంలోనే తొలిసారి ‘ఏ’ గ్రేడ్ లైసెన్స్ దక్కించుకుంది. ఆ టైంకి ఆమె వయసు 21 ఏళ్లు మాత్రమే. అందుకే పైలెట్ సరళ పేరు చరిత్రకెక్కింది. సరళ త(తు)క్రల్.. భారత తొలి మహిళా పైలెట్. ఎయిర్‌క్రాఫ్ట్‌ను.. అదీ సంప్రదాయ చీరకట్టులో నడిపిన మొదటి మహిళా పైలెట్ ఈమె. ఇవాళ (ఆగష్టు 8న) ఆమె 107 జయంతి. అందుకే గూగుల్ ఆమె డూడుల్‌తో గుర్తు చేసింది. సాధారణంగా గూగుల్ డూడుల్ రెండుసార్లు రిపీట్ అయిన సందర్భాలు లేవు. నిజానికి కిందటి ఏడాదే సరళ పేరు మీద డూడుల్ రిలీజ్ కావాల్సి ఉంది. ఆ టైంలో కేరళలో విమాన ప్రమాదం జరిగింది. అందుకే ఆ టైంలో సహాయక చర్యలకు గుర్తుగా డూడుల్‌ను నిలిపివేశారు. At the age of 21, Sarla Thukral soared to new heights by taking her first solo flight and becoming India’s first woman pilot 👩✈️ Today's #GoogleDoodle honours this incredible pilot, designer, and entrepreneur, on her 107th birth anniversary. ➡️ https://t.co/5dF5JBxUY2. pic.twitter.com/UBeh7LuJkz — Google India (@GoogleIndia) August 8, 2021 ఈసారి ఆమె మీద గౌరవార్థం 107వ జయంతి సందర్భంగా డూడుల్‌ను ఉంచినట్లు గూగుల్ ప్రకటించింది. ‘వైమానిక రంగంలో మహిళల ప్రవేశానికి స్ఫూర్తినిస్తూ చరిత్రలో ఆమె ఒక చెరగని ముద్ర వేశారు. అందుకే ఆమె కోసం రెండోసారి డూడుల్‌ని సృష్టించాం’ అని ప్రకటించింది గూగుల్. ఎయిర్‌క్రాఫ్ట్‌లో చీరకట్టులో ఉన్న ఈ డూడుల్‌ను వ్రిందా జవేరీ రూపకల్పన చేశారు. 16 ఏళ్ల వయసుకే పెళ్లి.. సరళ.. 1914లో పుట్టారు. 16 ఏళ్ల వయసులో ఆమెకి పెళ్లైంది. ఆమె భర్త పైలెట్. ఆయన స్ఫూర్తితోనే పైలెట్ అవ్వాలనుకుంది. నాలుగేళ్ల పాప ఉండగానే.. 21 ఏళ్ల వయసులో చీర కట్టులో విమానం నడిపి ఏ గ్రేడ్ లైసెన్స్ దక్కించుకుంది. లాహోర్ ఫ్లైయింగ్ క్లబ్ తరపున ఈ ఘనత సాధించాక.. కమర్షియల్ పైలెట్ శిక్షణ కోసం జోధ్‌పూర్ వెళ్లింది. అయితే 1939లో ఆమె భర్త చనిపోవడం, రెండో ప్రపంచ యుద్ధం రావడంతో కమర్షియల్ పైలెట్ కావాలనే కల చెదిరింది. ఆపై లాహోర్‌కు వెళ్లి ఫైన్ ఆర్ట్స్, పెయింటింగ్ కోర్సులు చేసింది. విభజన తర్వాత ఢిల్లీకి వచ్చి ఆర్పీ త(తు)క్రల్ను వివాహం చేసుకుంది. ఆపై ఆభరణాల డిజైనింగ్, బట్టల డిజైనింగ్ వ్యాపారంతో ఎంట్రప్రెన్యూర్‌గా పెద్ద సక్సెస్ అయ్యింది. 2008లో సరళ తక్రల్ అనారోగ్యంతో కన్నుమూసింది. -
తెలంగాణ రణాన్ని, నినాదాన్ని చాటినవాడు
తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన ఉద్యమనేత, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 1934 ఆగస్టు 6న వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం, అక్కంపేట గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అధ్యాపకుడిగా, కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకుల పతిగా సేవలు అందించిన జయ శంకర్ ఎప్పుడూ తెలంగాణ వాదాన్ని వదిలిపెట్ట లేదు. విద్యార్థిదశ నుంచి కూడా మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటు వంటి, నిర్మాణాత్మకమైన, నిక్కచ్చిౖయెన మనస్తత్వం గలవాడు ఆయన. తెలంగాణలో జరుగుతున్న ఆంధ్ర వలసవాదుల, సమైక్యవాదుల దోపిడీ నుండి తెలం గాణ విముక్తి కోసం కంకణం కట్టుకున్న విద్యావేత్త. మా వనరులు మాకున్నాయి, మా వనరులపై మాకు అధికారం కావాలని ప్రశ్నించిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. తెలంగాణ ప్రజలు ఎన్నాళ్లు యాచించా లనే ఒక కసి, పట్టుదలతో 1952లో నాన్ ముల్కీ, ఇడ్లీ, సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి, తనదైన శైలిలో కాకతీయ, ఉస్మానియా విశ్వ విద్యాలయాలలో విద్యార్థులు, ఆచార్యులతో సమా వేశాలు ఏర్పాటుచేసి, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరంగా చెప్పారు. ఆయా విశ్వవిద్యా లయాలలో చదువుతున్న విద్యార్థులను, పరిశోధకు లను కూడగట్టేందుకు ఆయన చేసిన ప్రయత్నం మరు వలేనిది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని విద్యావంతులు, మేధావులు ప్రతిఘటించాలనీ; ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలనీ; విద్యా వంతులమైన మనమే గళం విప్పకపోతే ఎలా? మేధా వులు సామాజిక బాధ్యతను విస్మరించడం క్షంతవ్యం కాదనీ వక్కాణించారు. నాలుగు గోడల మధ్యలో కుర్చొని, కేవలం నినా దాలు చేయడం ద్వారా సమస్యలకు పరిష్కారం ఉండదని బలంగా నమ్మిన వ్యక్తి జయశంకర్. అందుకే సమస్యలకు దారితీసిన కారణాలను సాక్ష్యా ధారాలతో, శాస్త్రీయంగా, గణాంకాలతో సహా నిర్భ యంగా, నిర్మొహమాటంగా విశ్లేషిస్తూ అనేక రచనలు చేశారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తెలం గాణ రణాన్ని, నినాదాన్ని చాటిచెప్పిన ప్రజ్ఞాశాలి. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కల్వ కుంట్ల చంద్రశేఖరరావు తన వాణి, బాణీæ వినిపి స్తున్న క్రమంలోనే ప్రజల మద్దతుతో 2001లో తెలం గాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేశారు. ఒకానొక సంద ర్భంలో జయశంకర్ మాట్లాడుతూ, ‘‘అబ్తో ఏకీ హీ ఖ్వాయిష్ హై, ఓ తెలంగాణ దేఖ్నా మర్ జానా (ఇప్పుడైతే నాకు ఒకే ఒక కోరిక మిగిలింది, అది చని పోయేలోగా తెలంగాణ ఏర్పాటు కళ్ళారా చూడటం); అది కేవలం తెలంగాణ మొనగాడు ‘రావు సాబ్’తోనే సాధ్యం అవుతుంది, తర్వాత నేను చనిపోవాలి’’ అని అన్న సందర్భాలు అనేకం. జయశంకర్ మార్గదర్శ కత్వంలో కేసీఆర్ ఆమరణ నిరాహరదీక్ష చేపట్టి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు గడగడలాడించడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ ప్రకటన చేయక తప్పలేదు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు పేర్కొనడం, ఖంగు తిన్న సమైక్యవాదులు ఆ ప్రకటనను జాతి వ్యతిరే కమైనదిగా, ‘కాగ్నిజబుల్ అఫెన్స్’గా పేర్కొనడం, తదుపరి జరిగిన పరిణామాలతో డిసెంబర్ 23న మరొక ప్రకటన చేసి, శ్రీకృష్ణ కమిటీ రూపంలో తెలం గాణ ప్రజలను గాయపరచడం జరిగింది. తెలంగాణ పోరాటాన్ని ఉధృతం చేసి, నిరవధికంగా ఉద్యమా లను చేస్తూ, కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి తెచ్చిన ఫలితంగా 2014 ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోకసభ ఆమోదం లభిం చింది. సీమాంధ్రకు న్యాయం చేయడానికి వెంకయ్య నాయుడు ప్రతిపాదించిన సవరణలను కొంతవరకు తృప్తిపరచే విధంగా ప్రధాని ఆరుసూత్రాల ప్యాకేజీని ప్రకటించిన పిదప, 2014 పిభ్రవరి 20న రాజ్య సభలో బిల్లుకు య«థాతథంగా మూజువాణీ ఓటుతో ఆమోద ముద్ర పడింది. 2014 జూన్ 2 నాడు దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ‘సారు’ కలల తెలంగాణ ఏర్పడింది. అయితే ప్రత్యేక తెలం గాణ రాష్ట్రాన్ని చూడకుండానే జయశంకర్ అనా రోగ్యంతో 2011 జూన్ 21న తుదిశ్వాస విడిచారు. -డా. సంగని మల్లేశ్వర్ వ్యాసకర్త విభాగాధిపతి, జర్నలిజం శాఖ, కాకతీయ విశ్వవిద్యాలయం ‘ 98662 55355 (నేడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి) -
అవ్యవస్థ ఉన్నన్నాళ్లూ రావిశాస్త్రి సజీవం
తన అపారమైన కృషి ద్వారా ఇరవయ్యో శతాబ్ది రెండో అర్ధ భాగపు తెలుగు సామాజిక, సాహిత్య జీవితం మీద అసాధా రణమైన ప్రభావం వేసిన రాచ కొండ విశ్వనాథశాస్త్రి (30 జూలై 1922–10 నవంబర్ 1993) శత జయంతి సంవత్సరం ఇవాళ మొదలవుతున్నది. ఆయన జీవితం గురించీ రచన గురించీ తలుచు కోగానే గుర్తుకొచ్చే అంశాలు–ధైర్యమైన వస్తువుల ఎంపిక, అపురూపమైన శిల్పం, సునిశితమైన విమర్శా దృక్పథం, సువిశాలమైన, లోతైన దూరదృష్టి, చురుక్కుమనిపించే వ్యంగ్యం, కవితాత్మకమైన వచనం, తీగలు తీగలుగా సాగే వర్ణనా చాతుర్యం, ఎప్పటికీ గుర్తుండిపోయే, కోటబుల్ కోట్స్‌గా పనికొచ్చే పదునైన వ్యాఖ్యలు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి సమీపంలోని తుమ్మ పాల గ్రామానికి చెందిన రావిశాస్త్రి తండ్రి న్యాయవాద వృత్తి వదిలి వ్యవసాయంలోకి దిగారు. ‘‘మా నాన్న ప్లీడరుగా పదేళ్లే ప్రాక్టీసు చేసేరు. ఆ వృత్తిలో ఉండలేక వ్యవసాయం చేసేరాయన. వ్యవసాయం చెయ్యలేక, ఇష్టం ఉన్నా లేకపోయినా ప్లీడరీ వృత్తిలోనే ఉండిపోయేన్నేను’’ అని తానే రాసుకున్నట్టు రావిశాస్త్రి ఇరవై ఏడో ఏట న్యాయవాద జీవితం ప్రారంభించి చివరిదాకా అందులోనే ఉన్నారు. సమాంతరంగా అంతకు అంత సాహిత్య కృషీ చేశారు. 1942లో బీఏ ఆనర్స్ పూర్తి చేసి, మిలిటరీ అకౌంట్స్ శాఖలో పూనా, హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నంలలో పనిచేసి, 1946–48ల్లో మద్రాసులో లా చదివి, 1949లో విశాఖపట్నంలో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. పేదలకు న్యాయం అందించడానికి చేసే కృషిలో ఆయనకు సహజంగానే న్యాయవ్యవస్థ కోరలలో చిక్కుకున్న అమాయకులు, వేశ్యలు, అక్రమ సారావ్యాపార సామ్రాజ్యాలలో అట్టడుగు అంచుల అభాగ్యులు, పెరుగు తున్న నగరంలో విస్తరిస్తున్న నేరమయ అధోజగత్ వాసులు పరిచితులూ, క్లయింట్లూ అయ్యారు. పదమూడో ఏటనుంచే రచనమీద ప్రారంభమైన ఆసక్తి, పదిహేనో ఏట అచ్చయిన తొలి కథ, విస్తారమైన అధ్యయనం వల్ల 1949కి ముందే మొదలైన సాహిత్య జీవితానికి అటు మిలిటరీ అకౌంట్స్ ఉద్యోగంలో దేశ మంతా తిరిగి సంపాదించిన జీవితానుభవం, ఇటు న్యాయవాద వృత్తిలో అట్టడుగు ప్రజల జీవితాలతో సన్ని హిత పరిచయం, మార్క్సిస్టు దృక్పథం, రాజకీయ విశ్వా సాలు పదును పెట్టాయి. సాహిత్య సృజన సాధనలో భాగమైన అంతకు ముందరి కథలు పక్కనపెట్టినా, అల్ప జీవి నవల (1953) నుంచి ఇల్లు నవల (1993) వరకూ నిండా నాలుగు దశాబ్దాలు తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రబలంగా ప్రచండంగా వీచిన గాలి ఆయన. ఈ రెండు నవలల మధ్యలో మరొక ఐదు నవలలు (రాజు–మహిషి 1965, గోవులొస్తున్నాయి జాగ్రత్త 1966, రత్తాలు– రాంబాబు 1976, సొమ్మలు పోనాయండి 1980, మూడు కథల బంగారం 1982), డెబ్బైకి పైగా కథలు, మూడు నాటకాలు, దాదాపు రెండు వందల వ్యాసాలు, వచన రచ నలు, నేరుగా రాసిన కొన్ని కవితలు, అనేక ఉపన్యా సాలు... కనీసం మూడు వేల పేజీల సృజన. పోలీసు వ్యవస్థ అక్రమాలు, న్యాయవ్యవస్థ అన్యా యాలు–ఆయన రాసిన ఐదారు దశాబ్దాల తర్వాత కూడా ఈ సమాజంలో కొన్ని యథాతథంగా ఉన్నాయి. ఆ మాటకొస్తే రూపం మార్చుకున్నట్టు కనబడుతున్నప్పటికీ ఇంకా దుర్మార్గంగా తయారయ్యాయి. అందువల్లనే ఆయన ఇవాళ్టికీ సజీవంగా ఉంటారు. ‘‘...రచయిత ప్రతివాడు తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకి ఉపకారం చేస్తుందో అని ఆలోచించవల్సిన అవసరం ఉందని నేను తలుస్తాను. మంచికి హానీ, చెడ్డకి సహాయమూ చెయ్యగూడదని నేను భావిస్తాను’’ అని ఆయన అలవోకగా చెప్పిన మాటలు రచయితల దృక్పథ ప్రాధాన్యతను, పాఠకుల సాహిత్యా భిరుచినీ నిర్దేశిస్తాయి. రావిశాస్త్రి రచనల్లో ఆరు సారా కథలు మాత్రమే చది వినా ఆయన అద్భుతత్వం పాఠకుల కళ్లకు కడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో తొలి మద్యనిషేధం అమలైన కాలంలో ఆ నిషేధాన్ని అమలు చేయవలసిన వ్యవస్థల పూర్తి సహకారంతో అక్రమ సారావ్యాపారం ఎట్లా సాగిందో, ఆ వ్యాపారంలో చిన్న చేపలను పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఎట్లా పీడించాయో, ఆ వ్యథార్థ జీవన యథార్థ దృశ్యంలో ఎంత కరుణ, బీభత్సం, విషాదం, వ్యంగ్యం, వంచన దాగి ఉన్నాయో ఆ కథలు పాఠకులకు చూపు తాయి. అందుకే ఈ కథలు 1962లో పుస్తకంగా వెలువ డినప్పుడు రాసిన ముందుమాటలో ‘‘ఏకకాలంలో అనేక రసాలను ఉప్పొంగింపజేసే కళాఖండాలను మాత్రమే నేను ఉత్కృష్ట రచనలుగా అంగీకరిస్తాను’’ అంటూ, ఆ రసాను భూతికి ‘రసన’ అనే కొత్త పేరు పెట్టి, అది తాను చార్లీ చాప్లిన్ చిత్రాలలో, పికాసో గుయెర్నికాలో, డికెన్స్ నవ లల్లో, గురజాడ రచనల్లో గుర్తించాననీ, అది రావిశాస్త్రి రచనల్లో కూడా ఉందనీ శ్రీశ్రీ అన్నాడు. ఈ రసన సృష్టికి రావిశాస్త్రికి పునాదిగా నిలిచినది అవ్యవస్థ మీద ఆగ్రహం. ‘‘విప్లవాలూ యుద్ధాలూ లేకుండా లోకంలో న్యాయం జరిగిపోతే, దేముడికి కానీ మనకి కానీ అంతకంటే కావలసిందేముంది?!... నా గుండెల మీద కూర్చున్న పెద్దపులి మనసు మార్చుకొని సన్యాసం పుచ్చుకొని, కమండలం పట్టుకొని తావళం తిప్పుకొని వాయుభక్షణ చేసుకొంటూ హరినామ సంకీ ర్తనలో కాలం గడుపుకుంటే దానికీ నాకూ పేచీనే లేదు. దిక్కపోతేనే పేచీ. ఇది చదివిన నా స్నేహితులు ఒకాయన చిరునవ్వు నవ్వి, మీ గుండెల మీద కూర్చున్నది పెద్దపులి కాబట్టి మారదు; కానీ ఆ కూర్చున్నది మనిషైతే మారొచ్చు కదా అన్నారు. అప్పుడు నావంతు ప్రకారం నేను చిరునవ్వు నవ్వి, వాడే మనిషైతే అలా కూర్చోనే కూర్చోడు కదా అన్నాను’’ (రాముడు, 1970) అని రాసినప్పుడు రావిశాస్త్రి వ్యక్తీకరించినది ఆ ఆగ్రహాన్నే. తన అనుభవంలోకి వచ్చిన అవ్యవస్థకు సాహిత్యంలో అద్దం పట్టిన, దాని మీద తన ఆగ్రహాన్ని వ్యక్తీకరించిన రావిశాస్త్రి ఆ అవ్యవస్థ కొనసాగి నంతకాలమూ సజీవంగానే ఉంటారు, శతజయంతి ఒకా నొక మైలురాయి మాత్రమే. -ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త వీక్షణం సంపాదకుడు మొబైల్ : 98485 77028 (రావిశాస్త్రి శతజయంతి సంవత్సరం ప్రారంభం) -
చాలా మిస్ అవుతున్నానమ్మా.. సోనూసూద్ ఎమోషనల్ ట్వీట్
కరోనా కష్టకాలంలో దేవుడిలా వచ్చి నిరుపేదలను ఆదుకున్న ‘రియల్ హీరో ’సోనూసూద్. కార్మికులు మొదలు.. రైతులు, నిరుద్యోగులు ఇలా ప్రతి ఒక్కరికి అడిగిన సాయం చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫలానా చోట.. ఫలానా సమస్య ఉందన్న విషయం తన దృష్టికి వస్తే చాలు చేతికి ఎముక లేదన్నట్లుగా సాయం చేస్తున్నాడు. తాజాగా ఈ రియల్ హీరో తన తల్లి జయంతి సందర్భంగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ.. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా విష్ చేయాలనుకుంటున్నాను. మీరు నాకు నేర్పించిన జీవిత పాఠాలకు ధన్యవాదాలు. ఈ మెసేజ్‌లు నేను మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నానో.. ఎప్పటికీ వ్యక్తిపరచలేవు. మీరు లేకుండా నా జీవితంలో ఏర్పడిన శూన్యం నేను మిమ్మల్ని మళ్లీ చూసేవరకు ఎప్పుడూ అలాగే ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి. అలాగే మీరు నాకు ఎల్లప్పుడు మార్గనిర్దేశం చేయండి’ అంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు. కాగా, సోనూసూద్ తల్లి సరోజ్ సూద్ 2007లో కన్నుమూశారు. 2016లో సోనూసూద్ తండ్రిని కోల్పోయాడు. Happy birthday Maa❤️ I wish I could wish you personally & thank you for the lessons of life you have taught me. These messages can never express how much I miss you.The vaccum that has been created in my life without you will always remain the same till I see you again. pic.twitter.com/pUEylXOzsQ — sonu sood (@SonuSood) July 21, 2021 -
ప్రజల హృదయాల్లో వైఎస్సార్‌కు శాశ్వత స్థానం
హ్యూస్టన్ (టెక్సాస్) : ప్రజల హృదయాల్లో శాశ్వతంగా జీవించాలి అనే మాటకు నిలువెత్తు నిదర్శనం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అంటూ టెక్సాస్‌కి చెందిన ప్రవాస భారతీయులు అభిప్రాయపడ్డారు. మహానేత ప్రియతమ నాయకుడు డాక్టర్ యెడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి 72వ జయంతి వేడుకలను వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో ఎంతో వైభవంగా హ్యూస్టన్ మహా నగరం లో జరిపారు. ఈ కార్య క్రమానికి వైఎస్సార్ అభిమానులు , డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ మెంబెర్స్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. మహానేత రాజన్న ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు చేసిన గొప్ప సంక్షేమ పథకాలు, ఆరోగ్య శ్రీ , ఫీజు రేయింబర్సుమెంట్ , 108 , ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఉచిత విద్యుత్, పేదలకు ఇల్లు వంటి అనేక కార్యక్రమాల గురించి చర్చించుకున్నారు. మహానేతతో తమకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గిరీష్ రామిరెడ్డి, డాక్టర్ రామి రెడ్డి బూచిపూడి, బ్రహ్మ రెడ్డి, మారుతీ రెడ్డి, వేణు దాసరి, రామ్ చెరువు, పుల్లా రెడ్డి, వీరా రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, హనుమంత రెడ్డి, రామ్, సుధీర్ , సురేష్ పగడాల, రామ్ మోహన్ రెడ్డి, విశ్వనాధ్ రెడ్డి, రాఘవ రెడ్డి కే, సన్నప్పరెడ్డి విశ్వ, అరవింద్ రెడ్డి ,వంశీ అరిమండ, సుధీర్ సూరా, సుబ్బా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఒహియోలో మహానేత రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు
కొలంబస్ (ఒహియో): డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యం లో ఒహాయో రాష్ట్రం లో కొలంబస్ నగరం లో వైయస్సార్ గారి జయంతి వేడుకలు కన్నుల పండుగగా జరుపుకున్నారు. వినోద్ రెడ్డి డేగ, ఉదయ కిరణ్ బసిరెడ్డి గారి నాయకత్వం లో చక్రధర్ కోటి రెడ్డి నరేంద్ర రూక, రాజీవ్ రెడ్డి పెనుబోలు, కిషోర్ కుర్రి తిరు గాయం. రామ్ సోనేపల్లి మరియు గోవర్ధన్ ఎర్రగొండ, సుబ్బా రెడ్డి కోవూరు, ప్రశాంత్ తల్లపురెడ్డి, ప్రహ్లాద రెడ్డి కంభం సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైనది. -
జననాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి
మన్రో,న్యూజెర్సీ: ఆంధ్రప్రదేశ్ చరిత్రను పరిశీలిస్తే రాజశేఖరరెడ్డికి ముందు , రాజశేఖరరెడ్డికి తర్వాత అనే విధంగా ఆయన పరిపాలన చేశారని ప్రవాస భారతీయులు అన్నారు. ఒక రాజకీయ నాయకుడిని ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంత మంది గుర్తు పెట్టుకుంటున్నారంటనే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది అర్థం అవుతుందన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని మన్రోలో వైఎస్ఆర్ 72వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి హాజరైన వారు వైఎస్సార్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని , తమ జీవితంలో వైఎస్ఆర్ చూపిన ప్రభావాన్ని గుర్తు చేసుకున్నారు. డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ బాధ్యుడు ఆళ్ల రామిరెడ్డి మాట్లాడుతూ న్యూజెర్సీలో 2010లో వైఎస్సార్ ఫౌండేషన్ ఏర్పాటు చేశామని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్టు వెల్లడించారు. వైఎస్ఆర్ 72వ జయంతి వేడుకలను అమెరికాలో 16 స్టేట్స్లో 19 నగరాల్లో ఘనంగా నిర్వహించామని తెలిపారు. వైఎస్సార్‌పై ఉన్న అభిమానం, ప్రేమ, భక్తితోనే తాము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామన్నారు. ఆరోగ్య శ్రీని ప్రజలెవరు మర్చిపోలేరని వైఎస్ఆర్ స్నేహితుడు డాక్టర్ కే రాఘవరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చాయన్నారు. 60 ఏళ్లు దాటిన తర్వాత రాజకీయాల్లో కొనసాగడం అనవసరమని తనతో వైఎస్ఆర్ తనతో ఎప్పుడూ అంటుండే వారని అనుకోకుండా 60 ఏళ్ల తర్వాత ఆయన చనిపోయారంటూ ఆనాటి జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటన్నారు. డాక్టర్ వైఎస్సార్ లాంటి నాయకులు మళ్లీ మళ్లీ భారత దేశంలో పుట్టాలని కోరుకుంటున్నట్టు డాక్టర్ రాఘవరెడ్డి అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరికీ, ముఖ్యంగా పేదలకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలను డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టారని తెలిపారు. వైఎస్ఆర్ బతికుంటే అభివృద్ధి, సంక్షేమంలో ఏపీ ఎంతో ముందుకు వెళ్లి ఉండేదని అభిప్రాయపడ్డారు. రైతు బాగుంటే సమాజం బాగుంటుందని నమ్మిన మహానేత రాజశేఖరరెడ్డి అని పి శ్రీకాంత్‌రెడ్డి . జలయజ్ఞం పేరుతో అనేక సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారని తెలిపారు. పోలవరం కూడా త్వరలోనే ప్రారంభం అవుతుందన్నారు. -
ప్రజల గుండెల్లో నిలిచిన నేత డాక్టర్ వైఎస్సార్
అట్లాంట: ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తోందని అభిప్రాయపడ్డారు ప్రవాస భారతీయులు. సీఎం జగన్ సైతం తండ్రిగారి బాటలోనే నడుస్తున్నారని ప్రశంసించారు. జులై 11 ఆదివారం మధ్యాహ్నం అట్లాంటాలో వైయస్సార్ గారి జయంతి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. సీడీసీ నిబంధనలు పాటిస్తూ రాజన్నకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్సార్ పాలన, ఆయన హయాంలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఏపీలో సీఎం జగన్ పాలనలో జరుగుతున్న ప్రజా సంక్షేమ పథకాలు గురించి చర్చించారు. శ్రీనివాస్‌రెడ్డి కొట్లూరు, నంద గోపినాథ్‌రెడ్డి, వెంకటరామి రెడ్డి చింతంల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అట్లాంటాలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి ఏ సభ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా భారీ ఎత్తున అభిమానులు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి జరిగిన 72వ జయంతి వేడుకలకు భారీగానే ఆయన అభిమానులు వచ్చారు. ఇందులో ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వాళ్లే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన అభిమానులు కూడా ఉండటం విశేషం. జననేత రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన కొంతమంది వక్తలు ప్రసంగిస్తూ.... వైఎస్సార్‌తో తమకున్న సాన్నిహిత్యం, ఆయన ద్వారా చేకూరిన లబ్ది, వారి ప్రాంతంలో అందిన సంక్షేమ ఫలాలు గురించి ప్రసంగించారు. -
న్యూజిలాండ్‌లో వైఎస్సార్ జయంతి వేడుకలు
ఆక్లాండ్ (న్యూజిలాండ్) : మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 72 వ పుట్టినరోజు వేడుకలు న్యూజిలాండ్‌లో ఘనంగా జరిగాయి. వైయస్ఆర్సీపీ నాయకుడు బుజ్జే బాబు నెల్లూరి ఆధ్వర్యంలో ఆక్లాండ్‌లో జులై 10న ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ హాజరయ్యారు. వీరితో పాటు న్యూజిల్యాండ్ నుంచి అతిధులుగా పారిశ్రామికవేత్త కృష్ణారెడ్డి, వ్యాపారవేత్త నరేంద్రరెడ్డిలు కూడా హాజరయ్యారు. భారతదేశం నుంచి వైయస్ఆర్ మేధో వేదిక తరఫున ఎన్. శాంతమూర్తి , నెల్లూరి మదన్ మోహన్, తాళ్లూరి లతలు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యూజిలాండ్‌కి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు కిలారి శివ, శామ్యూల్ రెజినాల్డ్, ప్రతాప్ రెడ్డి , డాక్టర్ రవి ముసుగు, ప్రవీణ్, జాన్ బాబు, కృష్ణ చైతన్య, దిలీప్ కుమార్, ఆనంద్ కిరణ్, విపుల్ బాబు, కోడమల దీపక్, శ్రీధర్ బాబులు హాజరయ్యారు.