సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత, మూవీ మొఘల్, దివంగత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు జయంతి నేడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా రామానాయుడుని గుర్తు చేసుకున్నారు. సినిమా పట్ల ఆయన తపన ఎంతో గొప్పదని, అది ఇతరులను కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామానాయుడుతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ తనతో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు.
(చదవండి : రాజమౌళిని గుర్తుచేసుకున్న రష్యా ఎంబసీ)
‘రాజా ...!" అంటూ మీరు పిలిచే పిలుపులో ఆత్మీయత చవి చూసాను. కారంచేడు నుంచి ఓ కుర్రాడు, దేశం గర్వించేలా అన్ని భారతీయ భాషల్లో చిత్రాలు నిర్మించటమే కాదు...నిర్మాతగా ప్రపంచ రికార్డు నెలకొల్పటం తెలుగు వారందరికీ గర్వకారణం.సినిమా అంటే మీకున్న ప్రేమ,మీరు చేసిన సేవలు ఈ తరానికి చిరస్మరణీయం’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
(చదవండి : ఏపీ సీఎంతో సినీ పెద్దల భేటీ.. బాలయ్యకు ఆహ్వానం)
"రాజా ...!" అంటూ మీరు పిలిచే పిలుపులో ఆత్మీయత చవి చూసాను. కారంచేడు నుంచి ఓ కుర్రాడు, దేశం గర్వించేలా అన్ని భారతీయ భాషల్లో చిత్రాలు నిర్మించటమే కాదు...నిర్మాతగా ప్రపంచ రికార్డు నెలకొల్పటం తెలుగు వారందరికీ గర్వకారణం.సినిమా అంటే మీకున్న ప్రేమ,మీరు చేసిన సేవలు ఈ తరానికి చిరస్మరణీయం pic.twitter.com/HBRvhrVfze
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 6, 2020
Comments
Please login to add a commentAdd a comment