Daggubati ramanaidu
-
ఆ పిలుపులో ఆత్మీయత చవిచూశా : చిరు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత, మూవీ మొఘల్, దివంగత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు జయంతి నేడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా రామానాయుడుని గుర్తు చేసుకున్నారు. సినిమా పట్ల ఆయన తపన ఎంతో గొప్పదని, అది ఇతరులను కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామానాయుడుతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ తనతో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. (చదవండి : రాజమౌళిని గుర్తుచేసుకున్న రష్యా ఎంబసీ) ‘రాజా ...!" అంటూ మీరు పిలిచే పిలుపులో ఆత్మీయత చవి చూసాను. కారంచేడు నుంచి ఓ కుర్రాడు, దేశం గర్వించేలా అన్ని భారతీయ భాషల్లో చిత్రాలు నిర్మించటమే కాదు...నిర్మాతగా ప్రపంచ రికార్డు నెలకొల్పటం తెలుగు వారందరికీ గర్వకారణం.సినిమా అంటే మీకున్న ప్రేమ,మీరు చేసిన సేవలు ఈ తరానికి చిరస్మరణీయం’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. (చదవండి : ఏపీ సీఎంతో సినీ పెద్దల భేటీ.. బాలయ్యకు ఆహ్వానం) "రాజా ...!" అంటూ మీరు పిలిచే పిలుపులో ఆత్మీయత చవి చూసాను. కారంచేడు నుంచి ఓ కుర్రాడు, దేశం గర్వించేలా అన్ని భారతీయ భాషల్లో చిత్రాలు నిర్మించటమే కాదు...నిర్మాతగా ప్రపంచ రికార్డు నెలకొల్పటం తెలుగు వారందరికీ గర్వకారణం.సినిమా అంటే మీకున్న ప్రేమ,మీరు చేసిన సేవలు ఈ తరానికి చిరస్మరణీయం pic.twitter.com/HBRvhrVfze — Chiranjeevi Konidela (@KChiruTweets) June 6, 2020 -
రామానాయుడు విగ్రహావిష్కరణ
మూవీ మొఘల్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత రామానాయుడు జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్ ఆవరణలో గురువారం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ నిర్మాత, రామానాయుడు కుమారుడు దగ్గుబాటి సురేశ్‌బాబు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు రామానాయుడు అందించిన సేవలను అతిథులు కొనియాడారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్, ఫిల్మ్‌నగర్ సొసైటీ అధ్యక్షులు జి. ఆదిశేషగిరిరావు, రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, నటులు కైకాల సత్యనారాయణ, గిరిబాబు, కోట శ్రీనివాసరావు, ఆర్.నారాయణమూర్తి, విజయ్‌చందర్, శివకృష్ణ, కేఎల్ నారాయణ, ఎంపీ రఘురామ కృష్ణంరాజు, దర్శకుడు బి.గోపాల్, నిర్మాతలు సి.కల్యాణ్, అశోక్ కుమార్, బోయిన సుబ్బారావు, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ పాల్గొన్నారు. -
డబ్బంతా పోయినా నాన్నగారు భయపడలేదు
‘‘మా నాన్నగారి (ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు) గురించి ఆలోచించిన ప్రతిసారీ నా కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఆయన లేరనే ఆలోచనే చాలా కష్టంగా ఉంటుంది’’ అన్నారు నిర్మాత డి. సురేశ్‌బాబు. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్నో హిట్ సినిమాలు తీసి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు డి. రామానాయుడు. ఇవాళ ఆయన జయంతి. అలాగే సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణరంగంలో 55ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని రామానాయుడు తనయుడు, నిర్మాత డి. సురేశ్‌బాబు చెప్పిన సంగతులు. ► మా సురేశ్ ప్రొడక్షన్స్‌లో తొలి సినిమా (‘రాముడు–భీముడు’) విడుదలై 55ఏళ్లు పూర్తయ్యాయి. 56 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి (రామానాయుడు) మద్రాసు వెళ్లి అనుకున్న బిజినెస్ కుదరక, అక్కడే సినిమాలు తీస్తున్న కంపెనీలో భాగస్వామ్యం తీసుకుని, సైలెంట్ పార్ట్నర్గా ఉండి సినిమాలు తీశారు. అక్కడ పెట్టిన డబ్బంతా పోయింది. భయపడకుండా సినిమాలు చేయడం కంటిన్యూ చేశారు. ఈ క్రమంలో ఫిల్మ్‌మేకింగ్, ప్రొడక్షన్లో ఉన్న లోటుపాట్లను గమనించి, మెరుగుపరచాలనుకున్నారు. ► సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ బాగా ఎస్టాబ్లిష్ కావడానికి దాదాపు 15 ఏళ్లు పట్టింది. 1964 నుంచి 70 ఒక ఫేజ్. ‘రాముడు భీముడు’ బాగా ఆడింది. ఆ తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్. ఇక చావో రేవో అనే టైమ్‌లో 1970లో ‘ప్రేమ్‌నగర్’ తీశారు. 1970–1980లో గుడ్ టైమ్. 81–82 బ్యాడ్ టైమ్. ఆ టైమ్‌లో సినిమాలు కాకుండా వాటికి సంబంధించిన వనరులను డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు నాన్నగారు. 82లో నేను వచ్చాను. స్టూడియో, ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్ వైపు వచ్చాం. వెంకీ (హీరో వెంకటేశ్), నేను ఉండటం వల్ల సంస్థ ముందుకు వెళ్లింది. నాన్నగారు చనిపోయాక ఈ రోజు మేం హ్యాపీగా ఉన్నది ఒక్క విషయంలోనే.. అదేంటంటే ఆయన ఉన్న రంగంలోనే ఫ్యామిలీలో అందరూ ఆల్మోస్ట్ వర్క్ చేస్తున్నాం. ► సినిమాల్లోకి రావొద్దు. బాగా చదువుకోమని నాన్న అనేవారు. కానీ నేను సినిమా కలెక్షన్స్, సినిమా రిపోర్ట్స్ రాస్తూ సినిమాలకే కనెక్ట్ అయ్యాను. మా నాన్నగారు నాతో ‘నిరంతర శత్రువులు ఉండకూడదు. క్షమించాలి, మరచిపోవాలి. బౌండ్స్క్రిప్ట్తో సినిమా మొదలుపెట్టాలి. కుటుంబానికి టైమ్ కేటాయించాలి. రోజూ నిద్రపోయే ముందు అప్పులు, లాభాలను బేరీజు వేసుకోవాలి’.. అంటూ ఇలా చాలా విషయాలను చెప్పారు. ► మా నాన్న మాటిస్తే ఆ మాట మీద ఉండేవారు. ఆ బలహీనతను తీసుకుని కొందరు డైరెక్టర్స్ ఆడని సినిమాలు తీశారు. అయినప్పటికీ ఆయన ఏమీ అనలేదు. మాట ఇవ్వడం మానలేదు. నాన్నగారు చనిపోవడానికి రెండు మూడు రోజుల ముందు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు వచ్చారు. ‘బాలూ.. కథ చూడు. మంచి సినిమా చేద్దాం’ అన్నారు. ఆయనకు తెలిసింది సినిమానే. ► అప్పట్లో మా నాన్నగారు ఫిల్మ్‌మేకింగ్‌లో చూసిన కొన్ని లోపాలు ఇప్పటికీ ఉన్నాయి. అందుకే మా ప్రొడక్షన్ కంపెనీ ఇప్పుడు కంటెంట్, టాలెంట్ మేనేజ్మెంట్, టెక్నాలజీ అంశాలపై కూడా దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాం. ఇందుకోసం రానా, నేను కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఎకో సిస్టమ్‌ను డెవలప్ చేస్తున్నాం. ఈ కంటెంట్‌ను కేవలం సినిమాలకే కాదు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల్లోనూ వినియోగిస్తాం. పార్ట్నర్స్ను చూస్తున్నాం. ఎలా అయితే హాలీవుడ్ వారు మార్వెల్, స్టార్వార్స్కి సినిమాటిక్ యూనీవర్స్ క్రియేట్ చేశారో, మన మైథాలజీ తో ‘అమర చిత్ర కథలు’ను అలానే ప్లాన్ చేస్తున్నాం. ► ఫిల్మ్‌మేకింగ్‌లో కొందరు యంగ్‌స్టర్స్ ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. మొహమాటంతో నేర్చుకోవడం వదిలేస్తున్నారు. ఇండస్ట్రీని తప్పు పట్టడం లేదు. కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నాను. ► ఒకప్పుడు బాలీవుడ్లో ప్రొడక్షన్ పరంగా సరైన విధానాలు ఉండేవి కావు. ఇప్పుడు కార్పొరేట్ విధానాలతో మరింత ముందుకు వెళ్తున్నారు. ‘ఉరి’ లాంటి సినిమాను 45 రోజుల్లో తీశారు. మార్వెల్ అవెంజర్స్ సినిమాను వందరోజుల్లోపు తీశారు. మనం మాత్రం పెద్ద పెద్ద సినిమాలు తీయడానికి 200 రోజులు తీసుకుంటున్నాం. ఎక్కడో మిస్టేక్స్ ఉన్నాయి. అందుకే మేం ‘ప్రొడక్షన్ ప్రాసెస్ స్టాండర్డ్’ను క్రియేట్ చేస్తాం. జామ్ఎయిట్ ప్రాసెస్, థీమ్‌పార్క్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా ఎంటర్టైన్మెంట్ను 360 డిగ్రీస్ యాంగిల్లో కవర్ చేయాలనుకుంటున్నాం. ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ స్టాండర్డ్‌లో కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎవరైనా రావొచ్చు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రైనర్స్‌ను కూడా పెట్టాలనుకుంటున్నాం. ► ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రమ్మని ఫోర్స్ చేయలేం. వాళ్ల చాయిస్‌కి తగ్గట్టు సినిమాలు చూస్తారు. పెద్ద సినిమా బాగాలేకపోయినా వెళ్తారు. చిన్న సినిమాలకు అలా ఉండదు. ‘కంచరపాలెం’తో మేం అసోసియేట్ అవ్వడం వల్ల చిన్న సినిమా అయినా ఆ స్థాయికి వెళ్లగలిగింది. ► ‘వెంకీమామ’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. తరుణ భాస్కర్, త్రినాథరావు దర్శకత్వాల్లో వెంకటేశ్ హీరోగా సినిమాలు ఉన్నాయి. ‘దేదే ప్యార్‌దే’ రీమేక్ రైట్స్ తీసుకున్నాం. రానా ‘విరాటపర్వం’ త్వరలో ప్రారంభం అవుతుంది. ఇవి సురేశ్ ప్రొడక్షన్స్ పార్ట్నర్షిప్లో కావొచ్చు లేదా సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించవచ్చు. సురేశ్ ప్రొడక్షన్స్ ఫండ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు. లవ్‌రంజన్ (బాలీవుడ్ డైరెక్టర్)–సురేశ్ ప్రొడక్షన్స్ జాయింట్ వెంచర్ ఉంది. అతని హిందీ సినిమాలు రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాం. -
రామానాయుడు అంత్యక్రియలు
-
రామానాయుడు అంత్యక్రియలు పూర్తి
-
రామానాయుడు అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు అంత్యక్రియలు గురువారం ప్రభుత్వ లాంఛనలతో నిర్వహించారు. రామానాయుడు స్టుడియోలో నిర్వహించిన ఆయన అంతిమ సంస్కార యాత్రలో వేలాది అభిమానులు పాల్గొని ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. రామానాయుడి చితికి ఆయన పెద్ద కుమారుడు సురేష్ బాబు నిప్పంటించారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న రామానాయుడు బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈరోజు రామానాయుడు భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఆయన సొంత స్టూడియోకు తరలించారు. రామానాయుడి నివాసం నుంచి పార్థివ దేహాన్ని పూలతో అలంకరించిన వాహనంలో స్టూడియోకి తీసుకు వచ్చిన అనంతరం అభిమానుల సందర్శానర్థం మధ్యాహ్నం వరకూ స్టుడియోలోనే ఉంచారు. మూవీ మొగల్ను కడసారి చూసేందుకు అభిమానులు భారీగా సంఖ్యలో హాజరు కావడంతో రామానాయుడి స్టుడియో అంతా జనసంద్రంగా మారింది. రామానాయుడి మృతితో సినీ పరిశ్రమ కన్నీటి సంద్రమైంది. -
రామానాయుడు అంతిమయాత్ర ప్రారంభం
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు అంతిమయాత్ర గురువారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యింది. అంతకుముందు రామానాయుడు భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఆయన సొంత స్టూడియోకు తరలించారు. రామానాయుడు నివాసం నుంచి ఆయన పార్థివ దేహాన్ని పూలతో అలంకరించిన వాహనంలో స్టూడియోకి తీసుకు వచ్చిన అనంతరం మధ్యాహ్నం వరకూ స్టుడియోలో ఉంచారు. మూవీ మొగల్ను కడసారి చూసేందుకు ప్రజలు, అభిమానులు, సినీ ప్రముఖులు తరలివచ్చి ఆయన అంతిమ సంస్కార యాత్రలో పాల్గొంటున్నారు. -
'పెద్ద పెద్దోళ్లంతా హఠాత్తుగా మాయమైపోతున్నారు'
హైదరాబాద్ : తనను సినిమా రంగంలో నిలబెట్టింది ఈవీవీ సత్యనారాయణ అయితే.. ఆయనను నిలబెట్టింది మాత్రం రామానాయుడు అని నటుడు, రచయిత ఎల్బీ శ్రీరామ్ అన్నారు. రామానాయుడు భౌతికకాయానికి ఆయన గురువారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ.. ' కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే కొత్త దర్శకులకు, ఎంతోమందికి రామానాయుడు ఆశయం, ఆశ్రమం, నిర్మాతలకు దారి దీపం, ఎంతో ఎత్తుకు ఎదగాలనుకునేవారికి ఆయన ఎవరెస్ట్ శిఖరం. ఎప్పటికైనా అందరూ పైకి వెళ్లిపోవాల్సిన వాళ్లే అయితే ఇలా పెద్ద పెద్దవాళ్ళు అంతా హఠాత్తుగా మాయం అయిపోతుంటే సినిమా రంగం అనే పాఠశాల.. ఉపాధ్యాయులు లేని విద్యార్థులు అయిపోయింది. రామానాయుడి సినిమాల్లో చాలా మంచి మంచి వేషాలు వేశాను. దాదాపు యూరప్‌లోని అన్ని దేశాలను ఆయన చిత్రాల్లో నటించటం వల్లే చూడగలిగాను. ఆయనకు శ్రద్ధాంజలి' అని అన్నారు. -
'నాన్నను కోల్పోయినప్పుడు ఎంతో అండగా ఉన్నారు'
హైదరాబాద్ : 'మేము నాన్నను కోల్పోయినప్పుడు రామానాయుడు గారు ఎంతో అండగా ఉన్నారు. ఆయన ఓదార్పు మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. అటువంటి వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేరంటే బాధగా ఉంది. రామానాయుడి లాంటి వారి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది' అని ఎంఎస్ నారాయణ తనయుడు విక్రమ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ఓ నిమిషం పాటు మౌనం పాటించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాత ఎవరంటే చిన్నపిల్లాడిని అడిగినా రామానాయుడు అని చెబుతారని దర్శకుడు కోడి రామకృష్ణ అన్నారు. ఆయన మృతి చిత్రరంగానికి తీరని లోటుగా అభివర్ణించారు. రామానాయుడు ఎప్పుడూ.. తన ఆస్తి డబ్బు కాదని.. అనేకమందిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేయటమే తన ఆస్తి అని, అదే తనకు గర్వకారణమనే వారని ఈ సందర్భంగా కోడి రామకృష్ణ గుర్తు చేసుకున్నారు. రామానాయుడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవారని, టెన్షన్ పడేవారు కాదని అన్నారు. -
కొత్త నిర్మాతలెందరికో.. దారిదీపం..
-
రామానాయుడికి సీఎం కేసీఆర్ నివాళి
-
రామానాయుడికి కేసీఆర్ నివాళి
హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత రామానాయుడికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు గురువారం అర్పించారు. రామానాయుడు స్టూడియోలోని ఆయన పార్థివ దేహాన్ని సందర్శంచిన కేసీఆర్ అనంతరం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామానాయుడు పెద్ద కుమారుడు సురేష్ బాబును కేసీఆర్ ఆలింగనం చేసుకుని ఓదార్చారు. కుటుంబసభ్యులందర్ని ఆయన పలకరించారు. కేసీఆర్‌తో పాటు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు కూడా రామానాయుడికి అంజలి ఘటించారు. మరోవైపు రామానాయుడికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. -
ప్రభుత్వ లాంఛనాలతో రామానాయుడి అంత్యక్రియలు
-
సినీ దిగ్గజం.. నేల రాలింది..
-
ప్రభుత్వ లాంఛనాలతో రామానాయుడి అంత్యక్రియలు
హైదరాబాద్ : సినీరంగానికి ఎనలేని కృషి చేసిన ప్రముఖ నిర్మాత రామానాయుడికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఆదేశాలు ఇచ్చారు. రామానాయుడి పార్థివ దేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం స్టూడియోలో ఉంచుతారు. మధ్యాహ్నం మూడు గంటలకు రామానాయుడి అంత్యక్రియలు అక్కడే నిర్వహిస్తారు. మరోవైపు అధికారులు రామానాయుడు స్టూడియో వద్ద అధికారులు అంత్యక్రియల ఏర్పాటు చేస్తున్నారు. -
సొంత స్టూడియోకు రామానాయుడు భౌతికకాయం
హైదరాబాద్ : ప్రజల సందర్శనార్థం రామానాయుడు భౌతికకాయాన్ని ఆయన సొంత స్టూడియోకు తరలించారు. రామానాయుడి నివాసం నుంచి పార్థివ దేహాన్ని పూలతో అలంకరించిన వాహనంలో స్టూడియోకి తీసుకు వచ్చారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున అభిమానులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కాగా గురువారం మధ్యాహ్నం రామానాయుడి అంత్యక్రియలు జరగనున్నాయి. మూవీ మొగల్ను కడసారి చూసేందుకు ప్రజలు, అభిమానులు, సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...రామానాయుడి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించనున్నట్లు సమాచారం. ఆయన మరికొద్దిసేపట్లో రామానాయుడి స్టూడియోకి రానున్నట్లు తెలుస్తోంది. -
స్టూడియోకు రామానాయుడు పార్థివ దేహం
-
ఈ రోజు మద్యాహ్నం రామానాయుడు అంత్యక్రియలు
-
రామానాయుడు మృతిపై ప్రధాని సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘చలనచిత్ర పరిశ్రమలో ప్రసిద్ధనిర్మాత రామానాయుడు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తున్నాను’ అని మోదీ ట్వీటర్లో పేర్కొన్నారు. గవర్నర్ నరసింహన్ సంతాపం ప్రముఖ సినీ నిర్మాత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడి మృతి పట్ల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకే కాకుండా భారతీయ సినీ రంగానికే రామానాయుడి మృతి తీరని లోటని గవర్నర్ పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సినీ పరిశ్రమకు తీరని లోటు: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మూవీ మొఘల్‌గా కీర్తిగడించిన డి.రామానాయుడు మృతి సినీ పరిశ్రమకు తీరనిలోటు అని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఉన్నత విలువలతో సినిమాలు నిర్మించి నిర్మాతలకు స్ఫూర్తిప్రదాతగా నిలిచిన రామానాయుడు మృతి సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. రామానాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అవార్డులు, అభిమానమే అమరుడిగా నిలుపుతాయి: సీఎం కేసీఆర్ రామానాయుడు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. శతాధిక చిత్రాలను నిర్మించి ప్రపంచ రికార్డును నెలకొల్పిన రామానాయుడు తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో స్ధిరపడేందుకు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వాలు అందించిన అవార్డులతోపాటు ప్రజల అభిమానమే ఆయన్ను అమరుడిగా నిలుపుతుందంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామానాయుడు వ్యక్తి కాదు వ్యవస్థ: ఏపీ సీఎం చంద్రబాబు రామానాయుడు పార్థివదేహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం రాత్రి సందర్శించారు. మృతదేహం వద్ద నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రామానాయుడు ఓ వ్యక్తి కాదని, ఒక వ్యవస్థ అన్నారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. మంచి మనసున్న మనిషి: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో అంచెలంచెలుగా ఎదిగిన రామానాయుడు మంచి మనసున్న మనిషని జగన్ అన్నారు. రామానాయుడు మరణవార్త తెలుసుకున్న జగన్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే కొడాలి నానిలతో కలిసి రామానాయుడి నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. రామానాయుడు కుమారులు సురేష్‌బాబు, వెంకటేష్‌లను పరామర్శించి తన సానుభూతిని తెలియజేశారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సహా వివిధ భాషల్లో వందకు పైగా చిత్రాలు నిర్మించి ఎన్నో అవార్డులతో పాటు గిన్నిస్ రికార్డు సాధించిన ఘనత రామానాయుడికే దక్కిందని జగన్ చెప్పారు. రామానాయుడి మృతి తనను వ్యక్తిగతంగా ఎంతో బాధించిందని చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ పొంగులేటి సంతాపం సినీనిర్మాత డి. రామానాయుడు మృతిపట్ల వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు పొంగులేటి తమ సానుభూతిని తెలియజేశారు. తెలుగు సినీ ప్రస్థానంలో ప్రముఖస్థానం: సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా సినీ నిర్మాత డి.రామానాయుడు మృతి పట్ల సీపీఐ,సీపీఎం, లోక్‌సత్తా పార్టీలు సంతాపాన్ని ప్రకటించాయి. రామానాయుడు మరణవార్త బాధ కలిగించిందని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి సంతాపాన్ని ప్రకటించా రు. సినీరంగంలో ఎందరో నటీనటులు, సాంకేతికనిపుణులను పరిచయం చేసిన గొప్ప నిర్మాత అని సీపీఐనేత చాడ వెంకటరెడ్డి నివాళులర్పించారు. పలుభాషా చిత్రాలను నిర్మించి, కొన్ని చిత్రాల్లో నటించిన రామానాయుడిది తెలుగు సినీప్రస్థానంలో ప్రముఖ స్థానమని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. సినీరంగంలో, ప్రజాజీవితంలో మూలస్తంభంలాంటి రామానాయుడిని కోల్పోవడం తెలుగువారికి తీరనిలోటని లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. నివాళులర్పించిన ప్రముఖులు రామానాయుడు పార్థివదేహాన్ని ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, కె.లక్ష్మణ్, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి, రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు సందర్శించి నివాళులర్పించారు. సినీ ప్రముఖుల సంతాపాలు.. వారి మాటల్లోనే రామానాయుడు నిర్మించిన తొలి చిత్రం ‘రాముడు-భీముడు’లో నన్ను కథానాయికగా తీసుకున్నారు. అప్పుడాయనతో, ‘చాలామంది నిర్మాతలు నన్ను తొలి సినిమాకి తీసుకుంటారు.. ఆ తర్వాత మర్చిపోతారు’ అని నేను సరదాగా అంటే, ‘నేనలాంటివాణ్ణి కాదు’ అంటూ తాను నిర్మించిన రెండో చిత్రం ‘శ్రీ కృష్ణ తులాభారం’లో కూడా నన్నే తీసుకున్నారు. ఈతరం దర్శక, నిర్మాతలకు ఆయన ఆదర్శం. ఆయన విధానాన్ని నేటితరం నిర్మాతలు పాటించాలి. - జమున హైదరాబాద్‌లో స్టూడియో కట్టాలనుకున్నప్పుడు ‘బాగా ఖర్చవుతోంది.. మంచి సినిమా తీద్దాం’ అని రామానాయడుగారంటే, ‘బ్రహ్మపుత్రుడు’ తీశాం. ఆ చిత్ర లాభాలతో స్టూడియో పూర్తిచేశారు. ‘సూరిగాడు’ లాభాలను ల్యాబ్ కోసం వినియోగించారు. నిఖార్సయిన నిర్మాత నాయుడుగారు. - దాసరి నారాయణరావు వృత్తి పట్ల అంకితభాతం ఉన్న వ్యక్తి రామానాయుడు. సినిమా తప్ప మరో ధ్యాస ఉండేది కాదు. తాను నిర్మించే చిత్రానికి సంబంధించినవన్నీ క్షుణ్ణంగా తెలుసుకునేవారు. అన్ని శాఖలపై అవగాహన ఉన్న నిర్మాత. - కైకాల సత్యనారాయణ రామానాయుడుకు భారతరత్న ఇచ్చినా తక్కువే. అందుకే ‘సినీ రత్న’ అనే అవార్డు ప్రవేశపెట్టి, ఇస్తే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది. - కృష్ణంరాజు రామానాయుడి సంస్థలో దాదాపు పది చిత్రాల్లో నటించాను. మంచి స్నేహశీలి. ఏ ఆర్టిస్ట్‌కైనా నిర్మాతే దేవుడు. ఓ మంచి నిర్మాత ఎలా ఉండాలి? అనేది ఆయన్ను చూసే నేర్చుకున్నాను. ఆయనతో నాది 35 ఏళ్ల అనుబంధం. - మోహన్‌బాబు రామానాయుడుకు సినిమా తప్ప మరొకటి తెలీదు. ‘సినిమాలు తీయడం ఆపేయమని నాన్నతో చెప్పండి’ అని సురేశ్‌బాబు నాతో అనేవారు. ఆ మాటే ఆయనతో అంటే, ‘సినిమాలు ఆపేస్తే.. నా శ్వాస ఆగిపోయినట్టే’ అనేవారు. - చిరంజీవి ఎంతోమంది నూతన నటీనటులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేయడం మాత్రమే కాదు.. భారతీయ భాషలన్నింటిలోనూ చిత్రాలు నిర్మించిన ఘనత నాయుడుగారిది. ఓ గొప్ప నిర్మాతను కోల్పోయాం. - బాలకృష్ణ మూడు రోజుల క్రితం కలిసినప్పుడు ‘మంచి కథ ఉంటే చెప్పు. సినిమా చేద్దాం’ అన్నారు. సినిమా కోసమే పుట్టిన ఆయన మృతి తీరని లోటు. - ఎస్పీ బాలు చిత్ర పరిశ్రమకు భీష్మాచార్యులవంటివారు. మంచి వ్యక్తిగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. తెలంగాణకు సంబంధించిన ఎంతోమంది నటీనటులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేశారు. - సానా యాదిరెడ్డి, అల్లాణి శ్రీధర్, (తెలంగాణ దర్శక-నిర్మాతల సంఘం అధ్యక్షులు) -
తెలుగు సినిమా ధ్రువతార రామానాయుడు
ప్రముఖ తెలుగు చలన చిత్ర నిర్మాత, మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు మృతితో జిల్లాలోని సినీ అభిమానులు మూగబోయారు. రామానాయుడుకు జిల్లాతో మంచి సంబంధాలు ఉన్నాయి. నెల్లిమర్ల మండలంలోని ఎన్సీఎస్ థియేటర్ ప్రారంభోత్సవానికి ఆయన జిల్లాకు వచ్చారు. ఆయన మృతిపై జిల్లా వ్యాప్తంగా ఉన్న అభిమానులు, వెంకటేష్, సురేష్‌బాబు, రానా అసోసియేన్ సభ్యులు, సినీ ఎగ్జిబిటర్ల సంఘం సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. సినీ రంగానికి తీరని లోటు: మంత్రి మృణాళిని విజయనగరం కంటోన్మెంట్ : దిగ్గజ నిర్మాత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు ఆకస్మికంగా మృతి చెందడం సినీ రంగానికి తీరని లోటని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖా మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు సినీ రంగంలోనే కాకుండా పలు భాషల్లో ఆయన చిత్రాలు నిర్మించి శత చిత్రాల నిర్మాతగా రికార్డు సృష్టించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్లతో పాటు నేటి తరాల తారలతోనూ చిత్రాలు నిర్మించిన ఘనత ఆయనదని తెలిపారు. ఎంపీగా కూడా సేవలందించి రాజకీయాల్లోనూ చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. నిర్మాతల్లో లెజెండ్ సినీ పరిశ్రమకు సంబంధిం చి నిర్మాతల్లో రామానాయుడు ఓ లెజెండ్. ఆయన తీసిన చిత్రం ప్రేమనగర్ మంచి పేరు సంపాదించింది. ఇప్పటి వరకూ అటువంటి మళ్లీ చిత్రం రాలేదు. నెల్లిమర్లలో ఎన్సీఎస్ థియేటర్ ప్రారంభానికి వచ్చినప్పుడు ఆయన ‘కళ్లు’ సినిమా చాలా బాగుందని తప్పకుండా చూడమని చెప్పారు. ఎంతో మందిని సినీ రంగానికి పరిచయం చేశారు. ఆయన మృతి నాటక రంగానికి కూడా తీరని లోటు. - డాక్టర్ ఎ.గోపాలరావు,విజయభావన ప్రధాన కార్యదర్శి ఇండస్ట్రీకి తీరని లోటు తెలుగు సినీ చరిత్రలో బ్రాండ్ అంటూ ఉందంటే అది సురేష్ బ్యానర్ ఒక్కటే. ఇటీవలి కాలంలో దృశ్యం సినిమా షూటింగ్ కోసం వచ్చిన సురేష్ బాబు రామానారాయణంను సందర్శించి తన తండ్రిని ఇక్కడకు తీసుకువస్తానని చెప్పారు. కానీ ఇంతలోనే రామానాయుడు మరణించడం బాధాకరం. గతంలో ఆయన థియేటర్ ప్రారంభానికి వచ్చారు. సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తరఫున ఆయన మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాం. - నారాయణం శ్రీనివాస్,సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కళారంగానికి తీరని లోటు నూతనంగా సినీ రంగానికి పరిచయం కాబోతున్న వర్ధమాన కళాకారులకు ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటు రామానాయుడు మృతి తీరని లోటు. ఎందరో నూతన కళాకారులు ఆయన ద్వారా సినీ రంగానికి పరిచయమయ్యారు. కళా, నాటక, సినిమా రంగానికి ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరు. - మండపాక రవి,ఫ్రెండ్స్ ఫైనార్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి రంగుల ప్రపంచపు రాజు... రామానాయుడి జీవిత విశేషాలపై నేను రాసిన ‘రంగుల ప్రపంచపు రాజు’ అనే పుస్తకాన్ని 2011 డిసెంబరు 7న హైదరాబాద్‌లో ఆయన ఆవిష్కరించారు. కిన్నెర పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తకం ఎంతో బాగుందని రామానాయుడు మెచ్చుకున్నారు. ఆయన మృతి అన్ని రంగాల కళాకారులకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. - సముద్రాల గురుప్రసాద్, ప్రముఖ రచయిత -
మూవీ మొఘల్ ఇకలేరు
ప్రముఖ సినీ నిర్మాత రామానాయుడు కన్నుమూత కేన్సర్‌తో బాధపడుతూ బుధవారం హైదరాబాద్‌లోని స్వగృహంలో మృతి సందర్శనార్థం నేడు ఉదయం 9 నుంచి రామానాయుడు స్టూడియోలో పార్థివ దేహం... మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడే అంత్యక్రియలు నివాళులు అర్పించిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపంగా నేడు సినిమా షూటింగ్‌లు, థియేటర్లలో ప్రదర్శనలు నిలిపివేత 13 భాషల్లో 150 చిత్రాలకుపైగా నిర్మాణం... గిన్నిస్‌కు ఎక్కిన అజాత శత్రువు సినీ రంగంలో కృషికి దాదాసాహెబ్ ఫాల్కే, పద్మ భూషణ్ పురస్కారాలు సాక్షి, హైదరాబాద్: మూవీ మొఘల్.. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు (78) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్లో ఉన్న ఆయన స్వగృహంలో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. కొద్దికాలంగా రామానాయుడు కేన్సర్‌తో బాధపడుతున్నారు. దాదాపు పదమూడేళ్ల కిందే అమెరికాలో శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. కానీ కేన్సర్ మళ్లీ ముదరడంతో ఇటీవల బెంగళూర్‌లోని ఒక ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం తెల్లవారుజామున ఆరోగ్యం విషమించడంతో... ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో వెంటిలేటర్‌పై ఉన్న రామానాయుడును ప్రత్యేక వాహనంలో ఫిలింనగర్ వెంచర్-2లోని స్వగృహానికి తీసుకొచ్చారు. ఇంటికి చేరిన కొద్దిసేపటికే ఆయన కన్నుమూశారు. రామానాయుడు కన్నుమూసిన విషయం తెలిసి తెలుగు చిత్రపరిశ్రమ, అభిమానులు, బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు రామానాయుడు నివాసానికి చేరుకుని, ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్, టి.సుబ్బిరామిరెడ్డి, ప్రముఖ నటులు చిరంజీవి, పవన్‌కల్యాణ్, అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, కైకాల సత్యనారాయణ, రాజశేఖర్, అల్లు అర్జున్, జగపతిబాబు, ఆర్.నారాయణమూర్తి తదితరులు విచ్చేసి రామానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం గురువారం ఉదయం 9 గంటలకు రామానాయుడు స్టూడియోకు తరలించనున్నట్లు ఆయన కుమారుడు, సినీ హీరో వెంకటేష్ తెలిపారు. స్ట్టూడియో ఆవరణలోనే మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రామానాయుడు మృతికి సంతాపంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని షూటింగ్‌లతో పాటు థియేటర్లు సెలవు పాటించనున్నట్లు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు చెప్పారు. నిర్మాతగా, స్టూడియో అధినేతగా, సినీపంపిణీదారుగా, ప్రదర్శకుడిగా, సేవాకార్యక్రమ నిరతుడిగా, రాజకీయ నాయకుడిగా అనేక కోణాలున్న రామానాయుడు బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో కన్నుమూశారు. సినీ రంగానికి ఎంతో సేవ చేసిన ఆయన మృతి చెందడంతో.. సినీలోకం, అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. జీవిత గమనం తొలి నుంచీ చాలా ఆసక్తికరంగా సాగింది. ఆయన పుట్టింది ప్రకాశం జిల్లా కారంచేడులో.. 1936 జూన్ 6న రైతు దగ్గుబాటి వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవమ్మ దంపతులకు జన్మించారు.. నిండా మూడేళ్ళయినా రాకముందే కన్నతల్లిని కోల్పో యి, మారుటి తల్లి ప్రేమలో పెరిగారాయన. ఒంగోలులోని సమీప బంధువు డాక్టర్ బి.వి. ఎల్. సూర్యనారాయణ ఇంట్లో కొన్నాళ్లు ఉండి ఎస్ఎస్ఎల్సీ దాకా చదువుకున్నారు. సూర్యనారాయణలా తానూ డాక్టర్ కావాలని రామానాయుడు అనుకున్నారు. కానీ విధి మరో రకంగా మలుపు తిప్పింది. మద్రాసులోని లయోలా కాలేజ్‌లో చేరినా.. చదువు అంతగా సాగలేదు. మామ కూతురు రాజేశ్వరితో పెళ్ళి తర్వాత సొంతంగా వ్యవసాయంలోకీ దిగారు. కారంచేడులో జరిగిన అక్కినేని ‘నమ్మినబంటు’ చిత్రం షూటింగ్‌తో తొలిసారిగా ఒక సీన్లో కనిపించి, వెండి తెరకెక్కారు. చిత్ర నిర్మాణంలోకి... వ్యవసాయం, రైస్‌మిల్లు వ్యాపారం తరువాత 1960లో మద్రాసుకు వెళ్లి, మిత్రులతో కలసి ఇటుకల వ్యాపారం చేయాలనుకున్నారు. అటు నుంచి రియల్ ఎస్టేట్ వైపు మారారు. మద్రాసులోని ‘ఆంధ్రా క్లబ్’లో సినిమావాళ్ళ పరిచయాలతో గుత్తా రామినీడు దర్శకత్వంలోని ‘అనురాగం’ చిత్రానికి భాగస్వామిగా చిత్ర నిర్మాణంలోకి వచ్చారు. ఆ సినిమా నష్టాలు తెచ్చినా... ఆ చిత్ర నిర్మాణంలో ప్రతి విషయం దగ్గరుండి గమనించడం, తానూ స్వయంగా పనిచేయడం ఆయనకు మంచి అనుభవమైంది. ఆ తరువాత 1963లో సురేశ్ సంస్థను స్థాపించి, డి.వి.నరసరాజు స్క్రిప్టుతో ఎన్టీఆర్ హీరోగా ‘రాముడు - భీముడు’ (1964) చిత్రం ద్వారా సొంతంగా చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నిర్మాత నాగిరెడ్డి గారి ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ ‘విజయా’తో కలసి ‘విజయ-సురేశ్ కంబైన్స్’ పతాకంపై కొన్ని చిత్రాలు తీశారు. కొన్ని విజయాల తరువాత పరాజయాలూ ఎదుర్కొన్నారు. అయితే ‘ప్రేమ్‌నగర్’ చిత్రం నుంచి మళ్ళీ పుంజుకున్న రామానాయుడు.. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. నటనపై ఎంతో మక్కువ తన ప్రస్థానంలో భాగంగా రామానాయుడు హైదరాబాద్‌లో సినీ స్టూడియోను నిర్మించారు. స్క్రిప్టుతో వచ్చి, సినిమా రీళ్ళతో బయటకు వెళ్ళేలా సకల సౌకర్యాలతో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ శివార్లలోని నానక్‌రామ్‌గూడలో ‘రామానాయుడు సినీ విలేజ్’నూ ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలోనూ స్టూడియో కట్టి, విస్తరించారు. ఇక చిత్ర నిర్మాతగా ఉంటూనే... తన నటనాభిరుచిని కొనసాగించారు. తాను నిర్మించిన చిత్రాల్లో ఏదో ఒక సన్నివేశంలో పాత్రధారిగా చటుక్కున కనిపించి, మాయమయ్యేవారు. ‘తానా’ వారి కోసం ప్రత్యేకంగా 1993లో ‘ఆంధ్ర వైభవం’ పేరిట చారిత్రక చిత్రాన్ని నిర్మించి... అందులో శ్రీకృష్ణదేవరాయలు పాత్ర పోషించి, తన మక్కువ తీర్చుకున్నారు. టీనేజర్ల ఆత్మహత్యలపై ఇతర నిర్మాతలు తీసిన జాతీయ అవార్డు చిత్రం ‘హోప్’(2006)లో సైతం కీలక పాత్ర పోషించారు. రూపాయి నోటు మీద ఉన్న భాషలన్నింటా.. ప్రతిభావంతులైన హీరోయిన్లనూ, సంగీత, సినీ దర్శకులనూ పరిచయం చేసిన అరుదైన రికార్డు రామానాయుడుదే. తమిళంలో శివాజీ గణేశన్ (ప్రేమ్‌నగర్‌కు రీమేకైన ‘వసంత మాళిగై’) రజనీకాంత్ (తనికాట్టు రాజా) లాంటి వారితో, హిందీలో రాజేశ్‌ఖన్నా (ప్రేమ్‌నగర్), జితేంద్ర (తోఫా, మక్సద్), అనిల్‌కపూర్ (ఇన్సాఫ్ కీ ఆవాజ్) లాంటి హీరోలతో చిత్రాలు తీశారు. తన కుమారుడు వెంకటేశ్ హీరోగా హిందీలోనూ (తెలుగు చంటి రీమేక్ ‘అనారీ’, ‘తఖ్దీర్వాలా’) సినిమాలు నిర్మించారు. రూపాయి నోటు మీద ఉన్న భాషలన్నిటిలో సినిమాలు తీయాలన్న లక్ష్యాన్ని చేరుకొని... దక్షిణాది, ఉత్తరాది భాషలతో కలిపి మొత్తం 13 భాషల్లో దాదాపు 150 సినిమాలు నిర్మించారు. శతాధిక చిత్రాల నిర్మాతగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లోకి ఎక్కారు. అలాగే జాతీయ అవార్డు అందుకొనే చిత్రాలు తీయాలనే సంకల్పంతో తెలుగులో ‘హరివిల్లు’ (2003), బెంగాలీలో రితుపర్ణ ఘోష్‌తో ‘అసుఖ్’ (1999) చిత్రాల లాంటి ప్రయత్నాలు చేశారు. పెట్టుబడి పోయినా ‘అసుఖ్’ సినిమాతో జాతీయ అవార్డు సాధించారు. మల్టీస్టారర్లతో సంచలనం ఆ రోజుల్లో ప్రసిద్ధ నవలల ఆధారంగా చిత్రాలు తీసి ‘నవలా చిత్రాల’ నిర్మాతగా కూడా రామానాయుడు పేరు తెచ్చుకున్నారు. ‘ప్రేమ్‌నగర్’, ‘జీవన తరంగాలు’, ‘చక్రవాకం’, ‘సెక్రటరీ’ లాంటివి అందుకు ఉదాహరణ. అప్పటి తెలుగు తెర అగ్రహీరోలైన కృష్ణ-శోభన్‌బాబుతో ‘ముందడుగు’, ‘మండే గుండెలు’ లాంటి మల్టీస్టారర్లు నిర్మించి సంచలనం రేపారు. కమలహాసన్‌తో ‘ఇంద్రుడు-చంద్రుడు’, వెంకటేశ్‌తో ‘బొబ్బిలిరాజా’, హరీశ్-మాలాశ్రీతో ‘ప్రేమఖైదీ’, అంధబాలిక జీవితం ఆధారంగా హీరోయిన్ లయ ప్రధాన పాత్రధారిగా నిర్మించిన ‘ప్రేమించు’ లాంటివి విశేష ఆదరణ పొందాయి. వెంకన్నపైనే నమ్మకం.. మెడలో వెంకటేశ్వరస్వామి లాకెట్ ధరించడం, రాహుకాలంలో కీలకమైన పనులేవీ చేయకపోవడం రామానాయుడు అలవాటు. ఈ సినిమాలే.. ఆయన ఉన్నతికి కారణమైన సినిమాలు.. ఎన్టీఆర్‌తో ‘రాముడు - భీముడు’, అక్కినేనితో ‘ప్రేమ్‌నగర్’ వీటితోనే రికార్డులు సృష్టించారు. వినయమే విజయ రహస్యం.. వైఫల్యం ఎదురైతే ధైర్యంగా ఉండాలని, విజయం వస్తే మరింతగా ఒళ్ళు దగ్గరపెట్టుకోవాలని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. ఏ రంగంలో ఉన్నా నంబర్‌వన్‌గా నిలవడం రామానాయుడు లక్ష్యం. ఆ కోరిక తీరనే లేదు సినిమాకు దర్శకత్వం వహించడం, కుటుంబంలోని హీరోలైన వెంకటేశ్, రానా, నాగచైతన్యలతో కలసి తాను కూడా నటించే ఓ చిత్రం నిర్మించడం రామానాయుడు కోరికలు. కానీ అవి తీరకుండానే ఆయన కన్నుమూశారు. అవార్డులు.. రివార్డులు రామానాయుడు 1996లో తిరుపతి వెంకటేశ్వర వర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. 1998లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో, 1999 గిన్నిస్ బుక్‌లో పేరు నమోదైంది. దాదాసాహెబ్ ఫాల్కే (2009), పద్మభూషణ్ (2013) అవార్డ్లు అందుకున్నారు. నిష్కల్మష వ్యక్తిత్వం తండ్రి వ్యవసాయం, పెదనాన్న వ్యాపార దక్షత రెండింటినీ రామానాయుడు పుణికిపుచ్చుకున్నారు. వ్యవసాయం, సిని మాలు ఇలా ఏ రంగంలో ఉన్నా అగ్రస్థానం అందుకోవడమే లక్ష్యంగా కృషి చేసేవారు. రామానాయుడు స్థాపించిన సురేశ్ ప్రొడక్షన్స్‌కు ఇటీవలే ఐదు దశాబ్దాలు (1964 - 2014) పూర్తయ్యాయి. పల్లెటూరి మూలాలున్న ఆయనలో చివరి క్షణం వరకు ఆ పల్లెటూరి భోళాతనం, నిష్కల్మష హృదయం తొణికిసలాడేవి. పేరు ప్రతిష్ఠలు, కోట్ల సం పాదనతో ఎంత ఎత్తుకు ఎదిగినా... దాన్ని తలకెక్కించుకోకుండా, కాళ్ళు నేల మీద పెట్టుకొని నడవడం ఆయనకే సొంతం. సమాజ సేవలోనూ పెద్ద చెయ్యే.. సినిమా పరిశ్రమలోని వ్యక్తులకుకానీ, వ్యవస్థకు కానీ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సహాయం, సేవ, సాంత్వనతో ముందుండడం రామానాయుడుకు ఉన్న ప్రత్యేక లక్షణం. 1991లోనే తన పేరిట చారిటబుల్ ట్రస్ట్ పెట్టి సేవా కార్యక్రమాల్ని నిర్వహించారు. 1997లో వృద్ధాశ్రమం నెలకొల్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి) ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా కూడా పనిచేశారు. నేడు తెలుగు చిత్రపరిశ్రమ, థియేటర్ల బంద్ రామానాయుడు మృతికి సంతాపంగా గురువారం తెలుగు సినీ పరిశ్రమ బంద్ పాటించనున్నట్లు దర్శకుడు దాసరి నారాయణరావు ప్రకటించారు. సినిమాల షూటింగ్‌లతోపాటు అన్ని విభాగాలు తమ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లు కూడా గురువారం మూసి ఉంచనున్నట్లు దాసరి నారాయణ రావు తెలిపారు. ఒంటికి పడని రాజకీయాలు.. జీవితంలో తనకు నచ్చనివి ‘అబద్ధాలు ఆడడం, రాజకీయాలు’ అని తరచూ చెప్పే రామానాయుడు... ఒక దశలో మిత్రుల బలవంతం మీద రాజకీయాల్లోకి వచ్చారు. గుంటూరు జిల్లా బాపట్ల నుంచి టీడీపీ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎంపీగా ప్రజలకు సేవ చేశారు. అయితే రాజకీయ వాతావరణం ఒంటబట్టని ఆయన ఒక పర్యాయమే ఎంపీగా పరిమితమయ్యారు. రెండోసారి ఎన్నిక కాలేకపోయారు. రాజకీయాలతో బిజీగా ఉన్న సమయంలో సినిమా వ్యాపారంలోనూ నష్టాలు చవిచూసినట్లు ఆయన స్వయంగా చెబుతుండేవారు. కృషిని నమ్మిన... కూలీ నెం.1 తళుకు బెళుకుల సినిమా రంగంలోకి ఎందరో వస్తుంటారు.. మరెందరో కనుమరుగైపోతుంటారు. కానీ అతి కొద్దిమందే ఆ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసి, ఆఖరు క్షణం వరకు దాని బాగోగుల కోసం తపిస్తారు. అజాతశత్రువుగా, అందరికీ తలలో నాలుకగా పేరు తెచ్చుకుంటారు. సమకాలీన తెలుగు సినిమా రంగంలో ఆ గౌరవం దక్కించుకున్న వ్యక్తి... దగ్గుబాటి రామానాయుడు. సినిమా రంగంలో సంపాదించిన ప్రతి రూపాయినీ తిరిగి సినిమా రంగానికే వెచ్చించిన కొద్దిమంది సిసలైన సినిమా వ్యక్తుల్లో రామానాయుడు ఒకరు. మామూలు రైతు కుటుంబం నుంచి వచ్చినా వ్యక్తిగత పరిశ్రమ, శ్రద్ధ, పట్టుదల ఉంటే ఎంచుకున్న రంగంలో ఎంత ఎత్తుకు ఎదగవచ్చనేదానికి ఆయనే ఉదాహరణ. జీవనతరంగాలు.. పూర్తి పేరు: దగ్గుబాటి రామానాయుడు తల్లితండ్రులు: దగ్గుబాటి వెంకటేశ్వర్లు,లక్ష్మీదేవమ్మ పుట్టినతేదీ - 1936 జూన్ 6 స్వస్థలం - ప్రకాశం జిల్లా కారంచేడు సతీమణి - రాజేశ్వరి సంతానం - సురేశ్‌బాబు, వెంకటేశ్, లక్ష్మి తొలి చిత్రం - భాగస్వాములతో కలసి తీసిన ‘అనురాగం’ (1963) సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించింది - 1963లో సురేశ్ పతాకంపై తొలి చిత్రం - ఎన్టీఆర్‌తో ‘రాముడు భీముడు’ (1964) నిర్మించిన చిత్రాల సంఖ్య -దాదాపు 150 (తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ, కన్నడం, ఒరియా, అస్సామీ, మలయాళం, పంజాబీ, భోజ్‌పురి, ఇంగ్లీషు భాషా చిత్రాలతో కలిపి). రూపాయి నోటు మీద ఉన్న అన్ని భాషల్లో సినిమాలు తీశారు. కుమారుడు వెంకటేశ్‌ను హీరోను చేసింది ‘కలియుగ పాండవులు’ చిత్రంతో.. 1989లో రామానాయుడు స్టూడియోను స్థాపించారు. 1991లో రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు నానక్‌రామ్‌గూడలో ‘రామానాయుడు సినీ విలేజ్’ ఏర్పాటు - 1994 ‘శాంతినికేతన్’ సీరియల్‌తో 1999లో టీవీ రంగంలోకి అడుగిడారు. బాపట్ల నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక - 1999 -
సినీ పరిశ్రమకు ఎంత చేశాడో..
-
రామానాయుడు భౌతికకాయానికి వైఎస్ జగన్ నివాళి
-
రామానాయుడు స్మృతులు
-
సినిమాయే జీవితంగా బతికిన మనిషి..
-
రాజా అంటూ పలకరించేవారు: చిరు
దివంగత నిర్మాత రామానాయుడితో తన అనుబంధాన్ని రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి మీడియాతో పంచుకున్నారు. తనను ఆయన 'రాజా' అంటూ ఎంతో ప్రేమగా పిలిచేవారని చెప్పారు. చిరంజీవి ఇంకా ఏమన్నారంటే.. ''రామానాయుడు ఎప్పుడూ సినిమాయే తన ప్రపంచమని అనేవారు. సినిమాయే ఆయన జీవితం. సినిమాలు తీయడం మానేయాలని తన తండ్రికి చెప్పాలని సురేష్ ఎప్పుడూ అనేవారు. కానీ అదే విషయాన్ని ఆయన వద్ద నేను ప్రస్తావిస్తే, ''రాజా, సినిమాలు తీయడం నేను మానేస్తే నా జీవితం ఆగిపోయినట్లుంటుంది. చివరి క్షణం వరకు సినిమాలు తీస్తూనే ఉండాలి'' అన్నారు. అన్ని భాషల్లోనూ సినిమాలు తీయడం రేర్ ఫీట్. ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాలేదు. ఒక్క రామానాయుడికే సాధ్యమైంది. అలాంటి రామానాయుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. వాళ్ల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను'' అని చిరంజీవి చెప్పారు. -
క్రీడలతోనూ అనుబంధం
మూవీ మొఘల్ రామానాయుడికి చిత్ర పరిశ్రమతోనే గాక పలు రంగాల్లో అనుబంధముంది. నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు పొందిన రామానాయుడు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎంపీగా పనిచేశారు. ఇక క్రీడా రంగంతో ఆయనకు అనుబంధముంది. ఆంధ్ర కబడ్డీ సంఘం చైర్మన్‌గా రామానాయుడు సేవలు అందించారు. సోగ్గాడు సినిమా సందర్భంగా ఆయన కబడ్డీ పోటీలను నిర్వహించారు. రామానాయుడు సొంతూరు ప్రకాశం జిల్లా కారంచేడులో ఇండోర్ స్టేడియాన్ని నిర్మించారు. రామానాయుడి మృతి పట్ల కబడ్డీ సంఘం సంతాపం ప్రకటించింది. -
నిర్మాతలెందరికో ఆదర్శం..
-
పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది
-
గిన్నిస్ రికార్డునూ దాటేశారు..!
నిర్మాతగా రామానాయుడుకు ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1963 నుంచి చిత్రాలను నిర్మించడం ప్రారంభించిన ఆయన తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో 101 చిత్రాలకు చేరుకునే సరికి ఆయనకు గిన్నిస్ రికార్డ్ స్వాగతం పలికింది. 2012లో గిన్నిస్ వరల్డ్ రికార్ఢ్ సర్టిఫికెట్‌ను అందించి సత్కరించింది. ఇంత గొప్ప ఖ్యాతిని దక్కించుకున్నా... అంతటితో విశ్రమించకుండా వరుసగా చిత్రాల నిర్మాణ పరంపరను కొనసాగిస్తూ 155 చిత్రాలను ఆయన నిర్మించారు. ఈ క్రమంలోనే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఆయన పేరును తమ పుస్తకంలో నమోదుచేసుకుని తనను తాను గౌరవించుకుంది. -
6 గురు హీరోలు.. 12 మంది హీరోయిన్లు
దగ్గుబాటి రామానాయుడు ఎప్పుడూ కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేవాళ్లు. కొత్తవాళ్లతో సినిమా తీయడం ఆయనకు బాగా ఇష్టం. ఒకరు కారు.. ఇద్దరు కాదు.. ఆరుగురు హీరోలు, 12 మంది హీరోయిన్లను ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. మొత్తం 24 మంది దర్శకులకు కూడా ఆయనే తొలిసారి తన బేనర్లో అవకాశం కల్పించారు. ఏడుగురు సంగీత దర్శకులను కూడా ఆయన టాలీవుడ్ రంగ ప్రవేశం చేయించారు. సెక్రటరీ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు, ఇక్కడ సదుపాయాలు ఎక్కువగా లేకపోవడం చూసి హైదరాబాద్ నగరంలోనే ఓ స్టూడియో నిర్మించాలని నిర్ణయించుకున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో రామానాయుడు చారిటబుల్ ట్రస్టు ద్వారా ఆయన అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
మనసున్న మహారాజు.. రామానాయుడు..
-
రేపు అంత్యక్రియలు: వెంకటేశ్
తమ తండ్రి, సీనియర్ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు (79) బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారని, ఆయన అంత్యక్రియలను గురువారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత నిర్వహిస్తామని రామానాయుడు చిన్న కుమారుడు, ప్రముఖ హీరో వెంకటేశ్ తెలిపారు. అంతకుముందు ఫిలిం ఛాంబర్లోను, తర్వాత రామానాయుడు స్టూడియోలోను ఆయన మృతదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచుతామన్నారు. కేవలం రెండు మాటలు మాత్రమే మాట్లాడి, అంతకుమించి మాట్లాడలేక.. ఆయన లోపలకు వెళ్లిపోయారు. -
రేపు అంత్యక్రియలు: వెంకటేశ్
-
ఆయనది ఒదిగి ఉండే తత్వం: వైఎస్ జగన్
ప్రముఖ సీనియర్ సినీ నిర్మాత డి.రామనాయుడు భౌతికకాయానికి వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. రామనాయుడు మనమడు, సురేష్‌బాబు కుమారుడు అభిరాంకు వైఎస్ జగన్ తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం సీనియర్ నిర్మాత రామానాయుడిదని వైఎస్ జగన్ అన్నారు. రామానాయుడు మృతి పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన తెలుగు చిత్ర నిర్మాణ రంగంలోనే అగ్రగణ్యులని, మూవీ మొఘల్‌గా పేరు గడించారని చెప్పారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీతోపాటు వివిధ భాషల్లో దాదాపు వందకు పైగా చిత్రాలను నిర్మించి ఎన్నో అవార్డులతోపాటు గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన ఘనత ఆయనకే దక్కిందని గుర్తుచేశారు. మనసున్న మనిషిగా చిత్ర పరిశ్రమలో ఆయన అందరి అభిమానాలు చూరగొన్నారని, ఎందరికో మార్గదర్శకులయ్యారని చెప్పారు. రామానాయుడు మరణం తనను వ్యక్తిగతంగా ఎంతో బాధకు గురిచేసిందంటూ.. తన కుటుంబ సభ్యులపట్ల వైఎస్ జగన్ ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. -
ఇద్దరు ముఖ్యమంత్రులు, గవర్నర్ సంతాపం
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు (79) మృతిపట్ల రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్, ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కిమిడి మృణాళిని, స్పీకర్ కోడెల శివప్రసాద రావు తదితరులు సంతాపం తెలిపారు. -
నిలబెట్టిన సినిమా రాముడు-భీముడు
1960.. కారంచేడు.. అప్పటికే స్టార్ హీరో, హీరోయిన్లయిన అక్కినేని నాగేశ్వర్రావు, సావిత్రి జంటగా నటించిన 'నమ్మినబంటు' సినిమా షూటింగ్.. ఎండ్ల పందాల దృశ్యం చిత్రీకరిస్తున్నారు. సరదాగా ఆ సీన్లో నటించారు రామానాయుడు. అక్కడ హుషారుగా కనిపించే రామానాయుణ్ణి చూసి 'మీరూ సినిమాల్లోకి ఎందుకు రాకూడదు?' అని అడిగారట ఏఎన్నార్. అయితే తనకు వ్యవసాయం తప్ప వేరే ఆలోచనలేవీ లేవని బదులిచ్చారు నాయుడు. తర్వాత మూడేళ్లకి అంటే 1963 నాటికి రామానాయుడు నిర్మాతగా తన తొలిసినిమా 'అనురాగం' నిర్మించారు. జగ్గయ్య, భానుమతి హీరో, హీరోయిన్లుగా నటించిన ఆ సినిమా తగిన ఫలితాలను ఇవ్వలేదు. డబ్బు వృధా చేయనని తండ్రికిచ్చిన మాటను అనుక్షణం గుర్తుచేసుకుంటూ 1965లో సొంత నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ ప్రారంభించి 'రాముడు-భీముడు' సినిమాను నిర్మించారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ మాసివ్ యాక్షన్, తాపీ చాణక్య దర్శకత్వ ప్రతిభ తోడవ్వడంతో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు. అక్కడి నుంచి మొదలుపెట్టి ఏకంగా 155 సినిమాలు నిర్మించారు. ఆయన నిర్మించిన చివరి చిత్రం 'గోపాలా గోపాలా' -
మూవీ మొఘల్.. ఇకలేరు..
-
రామానాయుడు మృతి.. తల్లడిల్లిన టాలీవుడ్
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మరణించిన విషయం తెలిసి టాలీవుడ్ తల్లడిల్లిపోయింది. అనేకమంది టాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. రామానాయుడు లేరన్న విషయం ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు అందరూ ఈ విషయం తెలిసి షాకయ్యారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ మాజీ కార్యదర్శి కేపీ రావు తదితరులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. మరికొందరు ట్విట్టర్ ద్వారా కూడా తమ సంతాపాలు వెల్లడించారు. రామానాయుడు మరణించిన విషయం తెలిసి చాలా బాధగా ఉంది. ఆయన ఈ వయసులో కూడా నిర్మాతగా చాలా చురుగ్గా వ్యవహరించేవారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా శ్రద్ధాదాస్ తెలుగు సినిమా అనగానే మనకు గుర్తుకొచ్చే మొట్టమొదటి పేరు దగ్గుబాటి రామానాయుడు. అసలు సిసలు పెద్దమనిషి, లెజెండ్ డాక్టర్ రామానాయుడు. రామానాయుడు గారు మనల్ని వదిలి వెళ్లిపోయారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి -నవదీప్ Very very sad to hear about Ramanaidu sirs demise.. The most enthusiastic film maker you could work with at his age!! May his soul Rip!!! — Shraddha Das (@shraddhadas43) February 18, 2015 the first name which we think about when anyone talks about telugu films today! a great man a true legend doctor daggubati (1/3) — Navdeep (@pnavdeep26) February 18, 2015 ramanaidu garu has left us today may his soul rest in peace his dedication n love towards films shall never be forgotten as long (2/3) — Navdeep (@pnavdeep26) February 18, 2015 as this industry is in existence!! (3/3) — Navdeep (@pnavdeep26) February 18, 2015 Dr. D. Ramanaidu, a legend of Telugu Cinema, is no more :( — Mahesh S Koneru (@smkoneru) February 18, 2015 Bad Bad News..the True Legend of Telugu cinema RamaNaidu Garu is no more..shocked..such an amazing Human Being..RIP sir,you are our Pride :( — Sundeep Kishan (@sundeepkishan) February 18, 2015 The gr8 legendary man who created magic in indian cinema Dr Rama Naidu ThaTha garu Rip ... I'm sorry @RanaDaggubati and family .... — Manchu Manoj (@HeroManoj1) February 18, 2015 The Great Man is no more... Telugu Film Industry has lost another LEGEND... Ramanaidu Sir ur such a kind Great Person.. We Will miss u sir. — Nikhil Siddhartha (@actor_Nikhil) February 18, 2015 RIP one of the greatest producer Dr.RamaNaidu Garu, an inspiration to many producers and I have learnt a lot from him. Disheartening news — Mohan Babu M (@themohanbabu) February 18, 2015 Utterly Heartbreaking..?? — vennela kishore (@vennelakishore) February 18, 2015 Rip movie mogul ???????? pic.twitter.com/7RmQIQSxaJ — Manchu Manoj (@HeroManoj1) February 18, 2015 News just coming in about Ramanaidu sir... Terrible loss to all of us. What a legend.. Such a terrific person.. So much positivity. RIP Sir — Rahul Ravindran (@23_rahulr) February 18, 2015 Dr. D Ramanaidu rest in peace sir..the industry will not be same without you.pass over knowing you Will always be loved missed and respected — sneha ullal (@snehaulaalheart) February 18, 2015 Telugu Cinema Mughal Dr D Ramanaidu garu is no more:( May His Soul Rest in Peace — kalyan koduri (@kalyanikoduri) February 18, 2015 Naidu gaaru ika leru....aa lotu ika evaru theerchaleru...:( pic.twitter.com/LHawhDvkZO — Sampoornesh (@sampoornesh) February 18, 2015 -
ప్రముఖ నిర్మాత రామానాయుడు కన్నుమూత
-
ప్రముఖ నిర్మాత రామానాయుడు కన్నుమూత
సీనియర్ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు (79) మరణించారు. కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మరణించారు. అత్యధిక సినిమాలు తీసిన నిర్మాతగా ఆయన గిన్నెస్ బుక్‌లోకి ఎక్కారు. 15 భాషలలో 155కి పైగా సినిమాలు నిర్మించారు. 2012లో పద్మభూషణ్ అవార్డు, 2009లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనను వరించాయి. మూవీమొఘల్‌గా పేరుపొందిన ఆయనకు వివిధ రకాలుగా చికిత్సలు అందించినా ఫలితం లేకపోయింది. ఆయనకు ఇద్దరు కుమారులు నిర్మాత సురేష్ బాబు, నటుడు వెంకటేశ్‌లతో పాటు కుమార్తె లక్ష్మి ఉన్నారు. ఆయన భార్య రాజేశ్వరి. 1936 జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడులో రామానాయుడు జన్మించారు. 1999-2004 మధ్య బాపట్ల ఎంపీగా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే ఎంతో పేరుపొందిన రామానాయుడు మరణించిన విషయం తెలిసి టాలీవుడ్ దిగ్భ్రాంతి చెందింది. ఆయన కేన్సర్‌ను అధిగమించి క్షేమంగా బయటకు వస్తారని అందరూ ఆశించారు గానీ, అది సాధ్యం కాలేదు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. మూవీ మొఘల్ గా పేరుపొందారు. తిరుగులేని నిర్మాతగా, మంచి మనిషిగా ఆయనకు పేరుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పెద్దదిక్కుగా ఉండేవారు. -
ఆ నాలుగు కుటుంబాలే పరిశ్రమను శాసిస్తున్నాయి
వారి వల్లే నటులకు అవకాశాలు రావడంలేదని హెచ్ఆర్సీకి ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమను దగ్గుబాటి, అల్లు అరవింద్, చిరంజీవి, ఎన్టీఆర్ కుటుంబాలే శాసిస్తున్నాయని, రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లను వారి అధీనంలో పెట్టుకొని చిన్న నిర్మాతలకు థియేటర్లను ఇవ్వకుండా పొట్టగొడుతున్నారని ఆరోపిస్తూ న్యాయవాది అరుణ్‌కుమార్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)ను ఆశ్రయించారు. ఈ మేరకు సోవువారం కమిషన్ సభ్యులు కాకుమాను పెద పేరిరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. సినిమా పరిశ్రమలో ఈ కుటుంబాలే గుత్తాధిపత్యం చేస్తున్నాయని, దీంతో కొందరు నటులకు అవకాశాలు లేకుం డా పోతున్నాయని తెలిపారు. సినిమా అవకాశాలు లేకే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. చిత్ర పరిశ్రమలో వీరి ఆధిపత్యంపై విచారణ జరిపించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. అయితే ఆ 4 కుటుంబాల ఆధిపత్యం కారణంగా తమకు అన్యా యం జరిగిందంటూ ఉదయ్ కిరణ్ కుటుంబ సభ్యులెవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తామంటూ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు పేరిరెడ్డి నిరాకరించారు. -
వివరం: రామానాయుడు... ఓ ఫిలిం యూనివర్సిటీ!
టాటా బిర్లాలు... ఏ బిజినెస్ చేసినా నెంబర్వన్నే! చెత్తలో కూడా చరిత్ర లిఖించగల సమర్థులు వాళ్లు. కానీ వాళ్లు చేయలేని పని... సినిమా తీయడం! బోలెడంత కరెన్సీ... ఎంతో పలుకుబడి... మహా తెలివితేటలు... ఇవన్నీ ఉన్నా కూడా ఓ సక్సెస్ఫుల్ సినిమా తీయడం చాలా చాలా కష్టం. మహామహులే వరుసగా సినిమాలు తీయలేక చేతులెత్తేశారు. కానీ రామానాయుడు 50 ఏళ్లుగా నిర్విరామంగా సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఇంకా తీస్తానంటున్నారు కూడా. ఏముంది రామానాయుడిలో మ్యాజిక్? ఈ లాంగ్ ఇన్నింగ్స్ ఆయనకే ఎలా సాధ్యపడింది? ఇంటర్ ఫెయిలైన రామానాయుడు ఫిలిం మేకింగ్ యూనివర్సిటీగా ఎలా మారగలిగారు? అవును. ప్రేక్షకులకే కాదు, గొప్ప గొప్ప బిజినెస్ మేనేజ్మెంట్ స్కూళ్లకు కూడా రామానాయుడి కెరీర్ ఓ గొప్ప పాఠ్యాంశం. కొండల్ని చెక్కి స్టూడియోలు కట్టినట్టుగానే, తనను తాను శిల్పంలా మలుచుకుంటూ మూవీ మొఘల్ అనిపించుకున్నారు. 50 ఏళ్ల క్రితం వ్యక్తిగా మొదలై, వ్యవస్థగా ఎదిగిన రామానాయుడి సినీజీవితంలో కొన్ని కీలకమైన రీళ్లు... బయోగ్రఫీ పుట్టింది: 1936 జూన్ 6న ప్రకాశం జిల్లా కారంచేడులో తల్లిదండ్రులు: దగ్గుబాటి లక్ష్మీదేవమ్మ, వెంకటేశ్వర్లు కుటుంబం: భార్య రాజేశ్వరి, కొడుకులు సురేష్, వెంకటేష్, కూతురు లక్ష్మి ఇప్పటిదాకా తీసిన సినిమాలు: 137 (తెలుగు 78, బెంగాలీ 2, తమిళం 10, మలయాళం 1, కన్నడం 2, ఒరియా 1, అస్సామీ 1, ఆంగ్లం 1, పంజాబీ 1, హిందీ 17. ఇవికాక, కొన్ని అనువాదాలు. అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం.) కె.బాపయ్య, కె.మురళీమోహనరావు, బి.గోపాల్, బోయిన సుబ్బారావు, తిరుపతి స్వామి, జయంత్ సి పరాన్జీ వంటి 22 మంది దర్శకులు; ఖుష్బూ, టాబూ, కరిష్మాకపూర్, దివ్యభారతి, ప్రేమ వంటి 11 మంది హీరోయిన్లు; వెంకటేష్, హరీష్ లాంటి ఆరుగురు హీరోలు, జె.వి.రాఘవులు, మణిశర్మ లాంటి నలుగురు సంగీత దర్శకులు, 1 పాటల రచయిత(చంద్రబోస్) ను పరిచయం చేశారు. పురస్కారాలు: పద్మభూషణ్ (2013), దాదాసాహెబ్ ఫాల్కే (2010), రఘుపతి వెంకయ్య అవార్డు (2006), గౌరవ డాక్టరేట్, ఇంకా ఎన్నో! 1 వరుసగా 9 ఫ్లాపులు ఇచ్చిన దర్శకుడు... ముగ్గురు హీరోలు, చాలామంది నిర్మాతలు రిజెక్ట్ చేస్తే మూలనపడి దుమ్ము పేరుకుపోయిన కథ... ఇలా స్టార్ట్ అయ్యింది రామానాయుడి ప్రయాణం. అన్నీ అపశకునాలే. చుట్టూ అనుమానపు చూపులే. అయినా రామానాయుడు డోంట్ కేర్. కథను నమ్మి ఎన్టీఆర్ డేట్లిచ్చాడు. ఆ కథనే నమ్మి రామానాయుడు మొండిగా సినిమా తీశాడు. అదే ‘రాముడు - భీముడు’. సూపర్ హిట్. ఫస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ. అదీ దమ్మంటే! 2 ‘ద్రోహి’ పెద్ద ఫ్లాప్. ఐదు లక్షలు లాస్. టోటల్‌గా ఆరేళ్లలో 12 లక్షలు గోవిందా. ఇంకొకరైతే మూటాముల్లే సర్దుకుని బ్యాక్ టూ పెవిలియన్. లేకుంటే బాటిల్ ఓపెన్ చేసి, మత్తులో మునిగేవాడు. రామానాయుడు జగమొండి. పోయిన చోటే వెతుక్కోవాలనుకునే మనిషి. లాస్ట్ అండ్ ఫైనల్ ఎటెంప్ట్. ఏమాత్రం అటూ ఇటూ అయినా మనిషి మిగలడు. నుజ్జు నుజ్జయి పోవాల్సిందే. 15 లక్షలతో ‘ప్రేమనగర్’ మొదలెట్టాడు. వామ్మో! ఎంత గుండె ధైర్యం. రిలీజు రోజు గలీజు వర్షం. నీడన ఉన్నవాడు కూడా తడిసిపోయేంత వర్షం. మన తెలుగోడికి సినిమా బాగుంటే ఎండా లేదు, వానా లేదు. అదే జరిగింది. ‘ప్రేమనగర్’పై డబ్బుల వర్షం. రామానాయుడిపై పూల వర్షం. ఇంకేం... రామానాయుడు పాతుకుపోయాడు. ఈసారి ఏ గాలీ వానా అతన్నేం చేయలేదు. 3 ‘సెక్రటరీ’ హండ్రెడ్ డేస్ ఫంక్షన్. అందరూ మంచి జోష్‌మీదున్నారు. ‘‘ఈ సంస్థలో ఎవరు హీరోగా చేసినా హిట్టే. చివరకు నేను కూడా’’అన్నాడు కైకాల సత్యనారాయణ. ఆ ఆనందంలో మాట ఇచ్చేశాడు రామానాయుడు. కమెడియన్ నగేశ్కీ అంతే. డెరైక్షన్ ఛాన్సిస్తానని చిన్న మాట. అయినా మాటంటే మాటే! కైకాల హీరోగా, నగేశ్ డెరైక్షన్‌లో ‘మొరటోడు’ సినిమా. ఈ సంస్థలో అంత ఫ్లాప్ మళ్లీ రాలేదు. డబ్బు పోయినా మాట తప్పలేదనే సంతృప్తి రామానాయుడిది! 4 ఒక చల్లని రాత్రి... అట్టర్ ఫ్లాప్. కక్ష... 8 లక్షలు లాస్. అగ్ని పూలు... 8 లక్షలు పోయింది. ప్రేమ మందిరం... మళ్లీ నష్టం. వరుసగా నాలుగు దెబ్బలు. మనిషి కుదేలైపోయాడు. బండి అదుపు తప్పింది. అర్జెంట్‌గా హిట్ పడాలి. మళ్లీ రిస్క్ చేయాలి. అప్పట్లో కె.రాఘవేంద్రరావంటే హాట్ కేక్. అడవి రాముడు, వేటగాడు, ఊరికి మొనగాడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి... వరుసపెట్టి మాస్ హిట్స్. అలాంటి టైమ్‌లో రామానాయుడు తీసిన సినిమా ఏంటో తెలుసా? ‘దేవత’. పక్కా సెంటిమెంట్. నిజం చెప్పాలంటే ఏడుపుగొట్టు సినిమా. అయినా బోలెడంత క్రేజ్. బయ్యర్లు ఎగబడ్డారు. అమ్మేస్తే అప్పులన్నీ తీరిపోతాయి. ‘‘అమ్మేద్దాం నాన్నా’’ అంటాడు సురేష్‌బాబు. ‘‘లేదు. మనమే ఓన్‌గా రిలీజ్ చేద్దాం’’ అన్నాడు రామానాయుడు. మళ్లీ మళ్లీ రిస్కు. 15 లక్షలతో తీసిన సినిమా 75 లక్షలు వసూలు చేసింది. 60 లక్షల లాభం. అంత డబ్బే! సాహసవంతుడికే కదా లక్ష్మీ కటాక్షం. 5 కె.రాఘవేంద్రరావు దర్శకుడు. సూపర్‌స్టార్ కృష్ణతో సినిమా తీయాలి. ఇక్కడో సడన్ ట్విస్ట్. పార్ట్నర్గా ఇంకో నిర్మాతను పెట్టుకోమంటారు కృష్ణ. రామానాయుడు కుదరదనేశాడు. కృష్ణ కాల్షీట్లు క్యాన్సిల్. ఇప్పుడేం చేయాలి? ఇప్పటికిప్పుడు హీరో కావాలి. అమెరికాకు ఫోన్ కొడితే, చిన్న కొడుకు దిగొచ్చాడు. అతనే హీరోగా ‘కలియుగ పాండవులు’ సినిమా. గొప్ప టర్నింగ్. ఇండస్ట్రీకి నిర్మాతల హీరో దొరికాడు. ‘విక్టరీ’ వెంకటేశ్. 6 రెండు పెద్ద పెద్ద రాళ్ల గుట్టలు. ఆ కొండల్ని పగలగొట్టి స్టూడియో కట్టాలి. స్టూడియో కట్టడానికన్నా, ఆ కొండల్ని పగలగొట్టడానికే ఎక్కువ ఖర్చవుతుంది. అది కూడా హైదరాబాద్‌కి ఆమడ దూరం. అయినా లెక్కచేయలేదు. అప్పటివరకూ సంపాదించిందంతా ఆ కొండల్లో పోశాడు. కట్‌చేస్తే - రామానాయుడు స్టూడియో వెలిసింది. బౌండ్ స్క్రిప్ట్‌తో ఎంటరైతే, ఫస్ట్ కాపీతో ఎగ్జిట్ అయ్యేంత ఎక్విప్మెంట్. 7 వైజాగ్‌కి దూరంగా భీమ్లీ రోడ్లో కొండల మీద స్టూడియో. అక్కడ స్టూడియో ఏంటి? ఈలోగా స్టూడియో కూడా రెడీ. క్వశ్చన్ మార్కు ఫేసుల్లో ఆశ్చర్యార్థకం! ఎదురుగా సముద్రం. చుట్టూ పచ్చటి కొండలు. వావ్! వాట్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్ అన్నారు. ఇలాంటి చోట షూటింగ్ చేస్తే, ఆ కిక్కే వేరబ్బా. రామానాయుడా మజాకానా! 8 రామానాయుడంటే 137 సినిమాలూ సురేష్ ప్రొడక్షన్ బేనరూ ఓ పెద్ద స్టూడియో బోలెడంత మంది వర్కర్లూ... ఇంతేనా! ఇవన్నీ తెరపై కనిపించేవి. తెర వెనుక ఆయనలో లెక్కలేనన్ని పార్శ్వాలున్నాయి. ఈ 50 ఏళ్లలో చాలామంది నిర్మాతలు వచ్చారు, వెళ్లారు. చాలా తక్కువ మందే నిలకడగా ఉండగలిగారు. కానీ రామానాయుడిలాగా ఇంత అలుపూ సొలుపూ లేని సుదీర్ఘ ప్రయాణం ఇంకెవ్వరూ చేయలేకపోయారు. ఇది ఎవ్వరూ బ్రేక్ చేయలేని రికార్డ్ కూడా! ఇంతమంది ఉండగా రామానాయుడే ఎందుకు సక్సెసయ్యారు? ఎలా సక్సెసయ్యారు? ఆయన దగ్గర అల్లావుద్దీన్ అద్భుతదీపం ఏమీ లేదు. కల్పవృక్షాలూ అక్షయ పాత్రలూ అస్సల్లేవు. అమృతం కావాలనుకున్నప్పుడు క్షీర సాగరాన్ని మధించి తీరాల్సిందే. హాలాహలమొచ్చినా తట్టుకుని నిలబడాల్సిందే. ఫైనల్‌గా రామానాయుడికి అమృతం దక్కింది. 9 రెండు మూడు సినిమాలు అసిస్టెంట్‌గా చేస్తే, డెరైక్షన్ చేయొచ్చు. ఫొటోగ్రఫీ చేయొచ్చు. ఎడిటింగ్ చేసేయొచ్చు. ఇంకా ఏమైనా చేసేయొచ్చు. మరి నిర్మాత కావాలంటే? అసిస్టెంట్ ప్రొడ్యూసర్ అనే కేటగిరీ లేదిక్కడ. అందుకే రామానాయుడి అనుభవాలను ఏ నిర్మాతల మండలివారో పూనుకుని వీడియో తీయిస్తే, భావితరాలకు ఓ ‘పెదబాల శిక్ష’ను ప్రసాదించినట్టే. 10 కథను నమ్ముకున్నవాడు - కృషిని నమ్ముకున్నవాడు - చెడిపోయిన దాఖలా సినిమా చరిత్రలోనే లేదు. ఇది నిజం! అందుకు రామానాయుడి జీవితమే 24 కళల... 24 ఫ్రేముల... నిదర్శనం. సరిగ్గా 50 ఏళ్ల క్రితం... 1963 నవంబర్ 16... శనివారం ఉదయం 7 గంటలు... మద్రాసులోని ఓ స్టూడియో. ఎన్టీఆర్ మీద ముహూర్తం షాట్. ‘విజయా’ నాగిరెడ్డి క్లాప్. డి.సురేష్‌బాబు కెమెరా స్విచాన్. ‘రాముడు - భీముడు’ షూటింగ్ ఆరంభమైంది. ఇది రామానాయుడి తొలి ప్రయత్నం. దీనికన్నా ముందు ‘అనురాగం’ సినిమాలో భాగస్వామి. నిర్మాతగా పేరు వేయలేదు కానీ, ప్రొడక్షన్ అంతా ఆయనే చూసుకున్నాడు. తన వాటా పెట్టుబడి 20 వేలు అన్నారు. తీరా అది 50 వేలయ్యింది. సినిమా ఫ్లాప్. రామానాయుడికి ఒక్క రూపాయి రాలేదు. ఆ నష్టం కన్నా, ఆ పరాజయం కన్నా, బంధువుల, స్నేహితుల సూటి పోటి మాటలు గాయపరిచాయి. పోయిన చోటే వెతుక్కోవాలి. తలవంచిన చోటే తలెత్తుకు తిరగాలి. ఒంటరి ప్రయాణం... ఒంటరి పోరాటం... ఎవ్వరూ తోడు రానన్నారు. రీల్ ఎస్టేట్ కన్నా రియల్ ఎస్టేట్ బెస్ట్ అన్నారు దగ్గరి బంధువులు. లేదు. నేను సినిమా ఫీల్డ్‌లో సక్సెస్ సాధించి చూపిస్తా అని ప్రతిన పూనాడు రామానాయుడు. పెద్ద కొడుకు పేరు మీద ‘సురేష్ ప్రొడక్షన్స్’ సంస్థకు శ్రీకారం. భాగస్వాములుగా ఒక్కరూ రారాయె. సొంత అక్క కూడా వాటా వద్దంది. పిల్లనిచ్చిన మావగారు, చెల్లెలు, మరో నలుగురు బంధువులు తలో పదిపైసల వాటా తీసుకున్నారు. వాళ్లందరివీ కలిపి 6 అణాలు. రామానాయుడు ఒక్కడిదీ 10 అణాలు. అలా సంస్థకు విత్తు పడింది. దూరపు బంధువైన ప్రముఖ రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి ద్వారా దర్శకుడు తాపీ చాణక్య, రచయిత డీవీ నరసరాజు పరిచయమయ్యారు. ‘రాముడు - భీముడు’ కథ చెప్పి ఎన్టీఆర్ కాల్షీట్లు తీసుకున్నాడు. జమున, ఎల్.విజయలక్ష్మి, ఎస్వీ రంగారావు, రాజనాల, పద్మనాభం లాంటి హేమాహేమీలు ముఖ్య తారలు. సినిమా చకచకా తయారైపోయింది. ఎన్టీఆర్‌కి వేరే ఏదైనా సినిమా షెడ్యూల్ క్యాన్సిలైతే, రామానాయుడికి ఫోన్ చేసేవారు, ఈయన షూటింగ్ పెట్టేసుకునేవారు. దాంతో చాలా ఎర్లీగా సినిమా పూర్తయిపోయింది. 1963 మే 21న ‘రాముడు - భీముడు’ రిలీజై, సంచలన విజయం సాధించింది. సినిమా పూర్తవడానికి 6 లక్షల 30 వేల రూపాయలు ఖర్చయ్యింది. మొదటి వారంలోనే ఈ డబ్బంతా వచ్చేసింది. రెండో వారం నుంచే ఓవర్‌ఫ్లోస్! ఇక అక్కణ్నుంచి రామానాయుడు సాధించిందంతా చరిత్రే! కొన్ని సూపర్ హిట్లు రాముడు భీముడు ప్రేమనగర్ జీవన తరంగాలు సావాసగాళ్లు సోగ్గాడు కథానాయకుడు ముందడుగు సంఘర్షణ కలియుగ పాండవులు ప్రతిధ్వని అహ నా పెళ్లంట ప్రేమ ఖైదీ ప్రేయసి రావే సర్పయాగం తాజ్‌మహల్ సూరిగాడు బొబ్బిలి రాజా ప్రేమించుకుందాం రా కలిసుందాం రా శివయ్య తోడికోడళ్లు ప్రేమించు ధర్మచక్రం నాయుడుగారి కుటుంబం గణేష్ కలిసుందాం రా జయం మనదేరా వసంతమాళిగై (తమిళం) ప్రేమ్‌నగర్ (హిందీ) ప్రేమ్‌ఖైదీ (హిందీ) అనారి (హిందీ) విజయ రహస్యాలు కథను పసిగట్టే ప్రజ్ఞ పద్ధతి ప్రకారం పని చేయడం పాత్రలకు తగ్గ తారల ఎంపిక పర్ఫెక్ట్ పేమెంట్. కొత్తవాళ్లకు ప్రాధాన్యం ఇవ్వడం ట్రేండ్లు, కాంబినేషన్ల మీద ఆధారపడకపోవడం - పులగం చిన్నారాయణ