హైదరాబాద్ : ప్రజల సందర్శనార్థం రామానాయుడు భౌతికకాయాన్ని ఆయన సొంత స్టూడియోకు తరలించారు. రామానాయుడి నివాసం నుంచి పార్థివ దేహాన్ని పూలతో అలంకరించిన వాహనంలో స్టూడియోకి తీసుకు వచ్చారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున అభిమానులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కాగా గురువారం మధ్యాహ్నం రామానాయుడి అంత్యక్రియలు జరగనున్నాయి. మూవీ మొగల్ను కడసారి చూసేందుకు ప్రజలు, అభిమానులు, సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...రామానాయుడి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించనున్నట్లు సమాచారం. ఆయన మరికొద్దిసేపట్లో రామానాయుడి స్టూడియోకి రానున్నట్లు తెలుస్తోంది.
సొంత స్టూడియోకు రామానాయుడు భౌతికకాయం
Published Thu, Feb 19 2015 10:23 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM
Advertisement
Advertisement