రామానాయుడు అంత్యక్రియలు పూర్తి | ramanaidu final fare well comes to end | Sakshi
Sakshi News home page

రామానాయుడు అంత్యక్రియలు పూర్తి

Published Thu, Feb 19 2015 4:06 PM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM

రామానాయుడు అంత్యక్రియలు పూర్తి

రామానాయుడు అంత్యక్రియలు పూర్తి

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు అంత్యక్రియలు గురువారం ప్రభుత్వ లాంఛనలతో నిర్వహించారు. రామానాయుడు స్టుడియోలో నిర్వహించిన ఆయన అంతిమ సంస్కార యాత్రలో వేలాది అభిమానులు పాల్గొని ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. రామానాయుడి చితికి ఆయన పెద్ద కుమారుడు సురేష్ బాబు నిప్పంటించారు.

 

గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న రామానాయుడు బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈరోజు రామానాయుడు భౌతికకాయాన్ని  ప్రజల సందర్శనార్థం  ఆయన సొంత స్టూడియోకు తరలించారు.  రామానాయుడి నివాసం నుంచి పార్థివ దేహాన్ని పూలతో అలంకరించిన వాహనంలో స్టూడియోకి తీసుకు వచ్చిన అనంతరం అభిమానుల సందర్శానర్థం మధ్యాహ్నం వరకూ స్టుడియోలోనే ఉంచారు. మూవీ మొగల్ను కడసారి చూసేందుకు అభిమానులు భారీగా సంఖ్యలో హాజరు కావడంతో రామానాయుడి స్టుడియో అంతా జనసంద్రంగా మారింది. రామానాయుడి మృతితో సినీ పరిశ్రమ కన్నీటి సంద్రమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement