'పెద్ద పెద్దోళ్లంతా హఠాత్తుగా మాయమైపోతున్నారు' | LB sriram on ramanaidu's death | Sakshi
Sakshi News home page

'పెద్ద పెద్దోళ్లంతా హఠాత్తుగా మాయమైపోతున్నారు'

Published Thu, Feb 19 2015 1:36 PM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM

'పెద్ద పెద్దోళ్లంతా హఠాత్తుగా మాయమైపోతున్నారు'

'పెద్ద పెద్దోళ్లంతా హఠాత్తుగా మాయమైపోతున్నారు'

హైదరాబాద్ : తనను సినిమా రంగంలో నిలబెట్టింది ఈవీవీ సత్యనారాయణ అయితే.. ఆయనను నిలబెట్టింది మాత్రం రామానాయుడు అని నటుడు, రచయిత ఎల్బీ శ్రీరామ్ అన్నారు. రామానాయుడు భౌతికకాయానికి ఆయన గురువారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ.. ' కొత్తగా ఇండస్ట్రీకి  వచ్చే కొత్త దర్శకులకు, ఎంతోమందికి రామానాయుడు ఆశయం, ఆశ్రమం, నిర్మాతలకు దారి దీపం, ఎంతో ఎత్తుకు ఎదగాలనుకునేవారికి ఆయన ఎవరెస్ట్ శిఖరం.  

ఎప్పటికైనా అందరూ పైకి వెళ్లిపోవాల్సిన వాళ్లే అయితే ఇలా పెద్ద పెద్దవాళ్ళు అంతా హఠాత్తుగా మాయం అయిపోతుంటే సినిమా రంగం అనే పాఠశాల.. ఉపాధ్యాయులు లేని విద్యార్థులు అయిపోయింది. రామానాయుడి సినిమాల్లో చాలా మంచి మంచి వేషాలు వేశాను.  దాదాపు యూరప్లోని అన్ని దేశాలను ఆయన చిత్రాల్లో నటించటం వల్లే చూడగలిగాను. ఆయనకు శ్రద్ధాంజలి' అని అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement