
గిన్నిస్ రికార్డునూ దాటేశారు..!
నిర్మాతగా రామానాయుడుకు ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1963 నుంచి చిత్రాలను నిర్మించడం ప్రారంభించిన ఆయన తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో 101 చిత్రాలకు చేరుకునే సరికి ఆయనకు గిన్నిస్ రికార్డ్ స్వాగతం పలికింది.
2012లో గిన్నిస్ వరల్డ్ రికార్ఢ్ సర్టిఫికెట్ను అందించి సత్కరించింది. ఇంత గొప్ప ఖ్యాతిని దక్కించుకున్నా... అంతటితో విశ్రమించకుండా వరుసగా చిత్రాల నిర్మాణ పరంపరను కొనసాగిస్తూ 155 చిత్రాలను ఆయన నిర్మించారు. ఈ క్రమంలోనే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఆయన పేరును తమ పుస్తకంలో నమోదుచేసుకుని తనను తాను గౌరవించుకుంది.