మూవీ మొఘల్ రామానాయుడికి చిత్ర పరిశ్రమతోనే గాక పలు రంగాల్లో అనుబంధముంది.
మూవీ మొఘల్ రామానాయుడికి చిత్ర పరిశ్రమతోనే గాక పలు రంగాల్లో అనుబంధముంది. నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు పొందిన రామానాయుడు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎంపీగా పనిచేశారు. ఇక క్రీడా రంగంతో ఆయనకు అనుబంధముంది.
ఆంధ్ర కబడ్డీ సంఘం చైర్మన్గా రామానాయుడు సేవలు అందించారు. సోగ్గాడు సినిమా సందర్భంగా ఆయన కబడ్డీ పోటీలను నిర్వహించారు. రామానాయుడు సొంతూరు ప్రకాశం జిల్లా కారంచేడులో ఇండోర్ స్టేడియాన్ని నిర్మించారు. రామానాయుడి మృతి పట్ల కబడ్డీ సంఘం సంతాపం ప్రకటించింది.