రామానాయుడు మృతి.. తల్లడిల్లిన టాలీవుడ్ | tollywood mourns ramanaidu death | Sakshi
Sakshi News home page

రామానాయుడు మృతి.. తల్లడిల్లిన టాలీవుడ్

Published Wed, Feb 18 2015 3:45 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

tollywood mourns ramanaidu death

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మరణించిన విషయం తెలిసి టాలీవుడ్ తల్లడిల్లిపోయింది. అనేకమంది టాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. రామానాయుడు లేరన్న విషయం ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు అందరూ ఈ విషయం తెలిసి షాకయ్యారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ మాజీ కార్యదర్శి కేపీ రావు తదితరులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.

మరికొందరు ట్విట్టర్ ద్వారా కూడా తమ సంతాపాలు వెల్లడించారు.

రామానాయుడు మరణించిన విషయం తెలిసి చాలా బాధగా ఉంది. ఆయన ఈ వయసులో కూడా నిర్మాతగా చాలా చురుగ్గా వ్యవహరించేవారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా
శ్రద్ధాదాస్

తెలుగు సినిమా అనగానే మనకు గుర్తుకొచ్చే మొట్టమొదటి పేరు దగ్గుబాటి రామానాయుడు. అసలు సిసలు పెద్దమనిషి, లెజెండ్ డాక్టర్ రామానాయుడు.  రామానాయుడు గారు మనల్ని వదిలి వెళ్లిపోయారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి
-నవదీప్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement