ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు (79) మృతిపట్ల రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్, ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కిమిడి మృణాళిని, స్పీకర్ కోడెల శివప్రసాద రావు తదితరులు సంతాపం తెలిపారు.