
6 గురు హీరోలు.. 12 మంది హీరోయిన్లు
దగ్గుబాటి రామానాయుడు ఎప్పుడూ కొత్త టాలెంట్ను ప్రోత్సహించేవాళ్లు.
దగ్గుబాటి రామానాయుడు ఎప్పుడూ కొత్త టాలెంట్ను ప్రోత్సహించేవాళ్లు. కొత్తవాళ్లతో సినిమా తీయడం ఆయనకు బాగా ఇష్టం. ఒకరు కారు.. ఇద్దరు కాదు.. ఆరుగురు హీరోలు, 12 మంది హీరోయిన్లను ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. మొత్తం 24 మంది దర్శకులకు కూడా ఆయనే తొలిసారి తన బేనర్లో అవకాశం కల్పించారు. ఏడుగురు సంగీత దర్శకులను కూడా ఆయన టాలీవుడ్ రంగ ప్రవేశం చేయించారు.
సెక్రటరీ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు, ఇక్కడ సదుపాయాలు ఎక్కువగా లేకపోవడం చూసి హైదరాబాద్ నగరంలోనే ఓ స్టూడియో నిర్మించాలని నిర్ణయించుకున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో రామానాయుడు చారిటబుల్ ట్రస్టు ద్వారా ఆయన అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.