అట్లాంట: ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తోందని అభిప్రాయపడ్డారు ప్రవాస భారతీయులు. సీఎం జగన్ సైతం తండ్రిగారి బాటలోనే నడుస్తున్నారని ప్రశంసించారు. జులై 11 ఆదివారం మధ్యాహ్నం అట్లాంటాలో వైయస్సార్ గారి జయంతి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. సీడీసీ నిబంధనలు పాటిస్తూ రాజన్నకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్సార్ పాలన, ఆయన హయాంలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఏపీలో సీఎం జగన్ పాలనలో జరుగుతున్న ప్రజా సంక్షేమ పథకాలు గురించి చర్చించారు. శ్రీనివాస్‌రెడ్డి కొట్లూరు, నంద గోపినాథ్‌రెడ్డి, వెంకటరామి రెడ్డి చింతంల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
అట్లాంటాలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి ఏ సభ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా భారీ ఎత్తున అభిమానులు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి జరిగిన 72వ జయంతి వేడుకలకు భారీగానే ఆయన అభిమానులు వచ్చారు. ఇందులో ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వాళ్లే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన అభిమానులు కూడా ఉండటం విశేషం.
జననేత రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన కొంతమంది వక్తలు ప్రసంగిస్తూ.... వైఎస్సార్‌తో తమకున్న సాన్నిహిత్యం, ఆయన ద్వారా చేకూరిన లబ్ది, వారి ప్రాంతంలో అందిన సంక్షేమ ఫలాలు గురించి ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment