అమెరికాలోని అట్లాంటాలో వైయస్సార్‌సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోతిరెడ్డి నాగార్జున రెడ్డి హాజరైనారు.
జగన్ అన్న పుట్టినరోజు వేడుకలు దేశవ్యాప్తంగా ఉన్న వైయస్సార్ పార్టీ అభిమానులతోపాటు, ,విదేశాల్లో ఉన్న మన తెలుగు ఎన్నారైలు కూడా అత్యంత ఘనంగా జరుపుకున్నారని నాగార్జునరెడ్డి వెల్లడించారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను, సూపర్.6. ప్రజలు గమనిస్తున్నారని,వారి లోపాలను.. మోసాలను ప్రజలకు సోషల్ మీడియా ద్వారా వివరించాలని అన్నారు. జగనన్న 2019లో 3680 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ఎన్నికల ముందు నవరత్నాలు. . పథకాలను అమలు చేస్తానని వాగ్దానం చేసి అధికారులు వచ్చిన తర్వాత నవరత్నాలు పూర్తిగాఅమలు చేసిన ఘనత జగనన్నదే అన్నారు.
కులం,మతం, ప్రాంతం, పార్టీ లు చూడకుండా..అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అన్నీ అందాయని, టిడిపి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదు అన్నారు. ఇప్పుడు విజన్ 2047.. అని కొత్త రాగం పాడుతున్నారని విమర్శించారు. మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలు.. ఇక్కడి తెలుగు ఎన్నారైలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ,దినకర్, ఉదయ్, ముఖ్య అతిథులుగా వెంకట్రామిరెడ్డి గిరీష్ రెడ్డి , సందీప్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment