Non resident indians
-
10ఎఫ్ దాఖలుకు మార్చి వరకు గడువు
న్యూఢిల్లీ: నాన్ రెసిడెంట్ (భారత్‌లో నివసించని) పన్ను చెల్లింపుదారులు 10ఎఫ్ పత్రాన్ని మాన్యువల్‌గా (భౌతికంగా) దాఖలు చేసేందుకు 2023 మార్చి 31 వరకు కేంద్ర సర్కారు గడువు ఇచ్చింది. దీనివల్ల నిబంధనల అమలు భారం తగ్గుతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. తక్కువ టీడీఎస్ అమలు చేసేందుకు వీలుగా నాన్ రెసిడెంట్ పన్ను చెల్లింపుదారులు ఆన్లైన్లో ఫామ్ 10ఎఫ్ దాఖలు చేయడం తప్పనిసరి అంటూ ఈ ఏడాది జూలైలో సీబీడీటీ ఆదేశాలు తీసుకొచ్చింది. పాన్ నంబర్లు లేని వారు ఫామ్ 10ఎఫ్ దాఖలు చేసేందుకు ఆదాయపన్ను శాఖ ఈఫైలింగ్ పోర్టల్ అనుమతించడం లేదు. దీంతో పన్ను చెల్లింపుదారులు ఫామ్10 ఎఫ్ దాఖలు విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. దీంతో భౌతికంగా దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. -
నాన్–రెసిడెంట్ కార్పొరేట్లకు ఊరట.. దానిపై పన్ను భారం తగ్గింది!
న్యూఢిల్లీ: భారతదేశంలో శాశ్వతంగా ఉంటూ కార్యకలాపాలు నిర్వహించకపోవడం లేదా స్థిర వ్యాపార స్థలం లేని నాన్–రెసిడెంట్ కార్పొరేట్ సంస్థలకు పన్ను భారం తగ్గించే కీలక నిర్ణయాలను ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) తీసుకుంది. రెమిటెన్సులు, టూర్ ప్యాకేజీలపై ఐదు శాతం టీసీఎస్ (మూలం వద్ద వసూలు చేసే పన్ను) చెల్లింపుల నుంచి ఆయా సంస్థలను మినహాయిస్తూ ప్రత్యక్ష పన్నుల (సీబీడీటీ) కేంద్ర బోర్డ్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఐటీ నియమాల్లో మార్పు చేస్తున్నట్లు వెల్లడించింది. ఆదాయపు పన్న చట్టంలోని సెక్షన్ 206 సీ(1జీ) కింద మినహాయింపు పరిధిని (గతంలో నివాసితులు కాని వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉండేది) విస్తరిస్తున్నట్లు తెలిపింది. కాగా, తాజా నిర్ణయ నాన్–రెసిడెంట్లపై పన్ను భారాన్ని తగ్గిస్తుందని, అలాగే విదేశీ సంస్థలకు అనుగుణంగా మార్పులు చోటుచేసుకుంటున్న భారతీయ పన్ను చట్టాలపై మరింత విశ్వాసాన్ని పెంపొందిస్తుందని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ డైరెక్టర్ (కార్పొరేట్ అండ్ ఇంటర్నేషనల్ ట్యాక్స్) ఓమ్ రాజ్‌పురోహిత్ పేర్కొన్నారు. చదవండి: బ్రిటన్ వెళ్లే భారతీయలుకు శుభవార్త.. ఓ సమస్య తీరింది! -
సింగపూర్‌లో తొలిసారిగా శ్రీమద్ భాగవత సప్తాహం
సింగపూర్‌లో ప్రఖ్యాత తెలుగు సంస్థలు శ్రీ సాంస్కృతిక కళాసారథి, తెలంగాణ కల్చరల్ సొసైటీ, తెలుగు భాగవత ప్రచార సమితి, కాకతీయ సాంస్కృతిక పరివారంల సంయుక్తంగా ఉగాది పండగని పురస్కరించుకుని పంచ మహా సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ చేతుల మీదుగా శ్రీమద్ భాగవత సప్తాహాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. 2022 ఏప్రిల్ 2 నుంచి 8 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతీరోజు సాయంత్రం 4:30 గంటలకు (సింగపూర్‌టైం రాత్రి 7 గంటలకు) శని, ఆదివారాల్లో రాత్రి 10:30 గంటలకు (సింగపూర్ టైం మధ్యాహ్నం ఒంటిగంట) వర్చువల్‌గా ఈ వేడుకలు నిర్వహిస్తారు. యూట్యూబ్, ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. -
ఎన్నారైలకు ఓటు హక్కు.. పంజాబ్ ఎన్నికల వేళ తెరపైకి కొత్త నినాదం
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకోవడంతో రాజకీయ పార్టీలు ప్రతీ అంశంపై దృష్టి సారించాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న ఎన్నారైలు, ఇక్కడున్న వారి కుటుంబ సభ్యుల మద్దతు పొందేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నారై సంక్షేమం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తున్నాయి. ఎన్నారై విజన్ పేరిట ఇండియా నుంచి విదేశాలకు వలసలు ఎక్కువగా కొనసాగిన రాష్ట్రాల్లో పంజాబ్, కేరళాలు ముందు వరుసలో ఉంటాయి. పంజాబ్ రాష్టం నుంచి అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు పెద్ద సంఖ్యలో పంజాబీలు ఉపాధి కోసం వలస వెళ్లారు. తర్వాత అక్కడ వ్యాపార రంగాల్లో కూడా రాణించారు. ముఖ్యంగా కెనడా, యుకే, గల్ఫ్ దేశాలలో పంజాబీలు స్థానికంగా ప్రభావం చూపే స్థాయికి చేరుకున్నారను. ఇటీవల ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగించిన ఆందోళనకు మద్దతుగా విదేశాల్లో పలు కార్యక్రమాలు చేపట్టడం, ఆర్థిక అండదండలు అందించడంలో ఎన్నారై పంజాబీలు కీలకంగా వ్యవహారించారు. ఈ ఎన్నికల్లో ప్రవాస పంజాబీలు, వారి కుటుంబ సభ్యుల, బంధువుల ఓట్లు కీలకం కావడంతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నారై పాలసీని ప్రకటించింది. ప్రవాస పంజాబీలు స్థానికంగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా విధానాలు రూపొందిస్తామని హామీ ఇచ్చింది. ఎన్నారైల సమస్యలు పరిష్కరించేందుకు సింగిల్ విండో ఏర్పాటు చేస్తామని కూడా తెలిపింది. అంతేకాదు ప్రవాస పంజాబీలను ఆకర్షించడం ద్వారా టూరిజం సెక్టార్‌ను డెవలప్‌చేస్తామని కూడా తెలిపింది. ఎన్నారై ఓటుహక్కు ఇండియాలో పారిశ్రామికంగా సహాకారం అందించే విషయంలో రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న పాలసీల పట్ల ఎన్నారైలు సానుకూలంగానే స్పందిస్తున్నారు. దీంతో పాటు చిరకాలంగా ఉన్న ఎన్నారైలకు ఓటు హక్కు డిమాండ్‌పై సానుకూలంగా స్పందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన కొన్ని పాశ్చాత్య దేశాల్లో ప్రవాసంలో ఉన్న వారికి కూడా ఓటు హక్కును కల్పించాయి. మన దేశంలో ఇంకా ఈ సౌకర్యం లేదు. ఈ అంశంపై ఇప్పటికే పార్లమెంటు సభ్యుడు, అంతర్జాతీయ వ్యవహరాల్లో నిపుణుడైన శశిథరూర్ ఆన్లైన్ వేదికగా అనేక డిబెట్లు నిర్వహిస్తున్నారు. దీంతో పోలింగ్ తేదీ దగ్గర పడే సమయానికి ఎన్నారై ఓటింగ్ అంశం మరోసారి బలంగా తెర మీదకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఎన్నారైలకు ఓటు హక్కు కల్పించే విషయంలో రాజ్యంగ పరంగా, దేశభద్రత పరంగా అనేక చిక్కుముళ్లు ఉన్నాయని మరికొందరి వాదన. ఎన్నారై సంక్షేమంలో పంజాబ్ భేష్ - మంద భీమ్‌రెడ్డి (వలస వ్యవహారాల విశ్లేషకులు) వివిధ దేశాల్లో ఉన్న పంజాబీల కోసం ... ఎన్నారై డిపార్టుమెంటు పేరిట ఒక శాఖను అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. దీనికి అనుబంధంగా ఒక మంత్రి ఉంటారు. ఒక రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో పంజాబ్ ఎన్నారై కమీషన్ కూడా ఉంది. ఎన్నారైల కష్టసుఖాలను వినిపించేందుకు ఎన్నారై సభ పేరిట ఒక సొసైటీ కూడా పంజాబ్‌లో ఉంది. ఐజీపీ ర్యాంకు అధికారి నేతృత్వంలో ఒక ఎస్పీ స్థాయి అధికారి పలువురు ఇతర అధికారులతో పంజాబ్ పోలీస్ ఎన్నారై వింగ్ పనిచేస్తున్నది. ఆరు ఎన్నారై పోలీసు స్టేషన్లు ఉన్నాయి. విదేశీ జైళ్లలో మగ్గుతున్నవారికి న్యాయ సహాయం చేయడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ఎన్నారై పెళ్లిళ్ల సమస్యలు పరిష్కరించడం తదితర కార్యక్రమాలను ఈ విభాగం చూస్తుంది. ఏజెంట్లను నియంత్రించడానికి పంజాబ్ ట్రావెల్ ప్రొఫెషనల్స్ రెగులేషన్ యాక్టు-2013ను ప్రవేశపెట్టారు. వివిధ దేశాలలో పంజాబ్ ప్రభుత్వం ఎన్నారై కోఆర్డినేటర్లను నియమించింది. -
ఎయిర్‌పోర్టులో కోవిడ్ పరీక్షలు.. రిజల్ట్స్‌కి ఎంత సమయం పడుతుంది?
Rapid PCR Test Cost And Result Time Details at Hyderabad Chennai Airport: ఒమిక్రాన్ వేరియింట్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టులలో కోవిడ్ నిర్థారణ పరీక్షలు తప్పనిసరి చేశారు. బుధవారం నుంచి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఏ రకమైన పరీక్షలు చేస్తున్నారు ? రిపోర్టు రావడానికి ఎంత సమయం పడుతుందనే అంశాల పట్ల ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎదురు చూస్తున్నారు. రోజుకు 5000ల మంది హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ద్వారా దేశంలోని వివిధ నగరాలు, విదేశాల నుంచి నిత్యం 5000ల మంది ప్రయాణికులు రాష్ట్రంలోకి వస్తున్నారు. వీరిలో కేంద్రం పేర్కొన్న అట్ రిస్క్ జాబితాలో ఉన్న 12 దేశాల నుంచి ఇంచుమించు 500ల మంది ప్రయాణికులు నగరానికి వస్తున్నారు. ప్రస్తుతం వీరందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేశారు. ఆ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌కి పంపిస్తున్నారు. రెండు నుంచి ఆరు గంటలు ప్రస్తుతం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆర్టీ పీసీఆర్, ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సాధారణ ఆర్టీ పీసీఆర్ పరీక్షకు సుమారు 6 గంటల సమయం పడుతోందని ఎయిర్‌పోర్టు అథారిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే ర్యాపిడ్ ఆర్టీ పీసీఆర్ పరీక్ష రిజల్ట్ రెండు గంటలలోపు వస్తుంది. ఆర్టీ పీసీఆర్ టెస్ట్ ధర రూ.999 ఉండగా ర్యాపిడ్ కిట్ ధర రూ.4,500లుగా ఉంది. టిమ్స్‌కి ఎయిర్ పోర్టు ప్రాంగణంలో కోవిడ్ టెస్ట్ చేయించుకోవడంతో పాటు రిజల్ట్ వచ్చే వరకు ఎదురు చూసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. సుమారు 400ల మందికి తగ్గట్టుగా ఎయిర్‌పోర్టులో అన్ని సౌకర్యాలు కల్పించినట్టు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన వారిని గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించారు. అక్కడ హోం క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. చెన్నైలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు విదేశీ ప్రయాణాలు, దేశంలోని ఇతర నగరాలకు వెళ్లేందుకు హైదరాబాద్ తర్వాత ఎక్కుగా చెన్నై, బెంగళూరు ఎయిర్‌పోర్టులను ఉపయోగించుకుంటారు. చెన్నై ఎయిర్‌పోర్టులో ఆర్టీపీసీఆర్ టెస్ట్‌కి రూ.700 ఛార్జ్ చేస్తుండగా రిజల్ట్ కోసం ఆరు గంటల సమయం ఎదురు చూడాల్సి వస్తోంది. ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్‌కి రూ.3500 ఛార్జ్ చేస్తుండగా 30 నిమిషాల నుంచి రెండు గంటలలోపు రిజల్ట్ అందిస్తున్నారు. చదవండి: ముంబై మీదుగా వచ్చే ఎన్నారైలకు అలెర్ట్ ! -
ఫ్రిస్కో సిటీ పార్క్స్ బోర్డు మెంబర్‌గా వేణు భాగ్యనగర్
ఫ్రిస్కో (టెక్సాస్) : ఫ్రిస్కో సిటీకి సంబంధించిన పార్క్స్ రిక్రియేషన్ బోర్డు సభ్యుడిగా భారతీయుడైన వేణు భాగ్యనగర్ ఎన్నికయ్యారు. మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన పార్క్స్ రిక్రియేషన్ బోర్డు నగర పరిధిలో ఉన్న పార్కుల సంరక్షణ, అభివృద్ధి బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఫ్రిస్కో సిటీ కౌన్సిల్‌కి అనుబంధంగా ఈ బోర్డు పని చేస్తుంది. వేణు భాగ్యనగర్ స్వగ్రామం కరీంనగర్ జిల్లా చేగుర్తి. ఆ జిల్లాలోనే డిగ్రీ పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా తీసుకున్నారు. ఆ తర్వాత ఎంబీఏ చదివేందుకు అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ అమెరికాలో వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. చదవండి: టెక్సాస్‌లో శ్రీశ్రీకి ఘన నివాళి -
టెక్సాస్‌లో శ్రీశ్రీకి ఘన నివాళి
ఫ్రిస్కో (టెక్సాస్) : ప్రవాస భారతీయులు టెక్సాస్‌లోని ఫ్రిస్కో నగరంలో మహాకవి శ్రీశ్రీకి నివాళులు అర్పించారు. డాక్టర్ ప్రసాద్ తోటకూర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. మహాప్రస్థానంలోని 40 కవితలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా డాక్టర తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ... శ్రీశ్రీ జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనలను, ఆయన కలంనుండి వెలువడ్డ వివిధ రచనలలోని ముఖ్య అంశాలను వివరించారు. ఈ ప్రత్యేక సాహిత్య సమావేశంలో అనంత్ మల్లవరపు, ఎంవీఎల్ ప్రసాద్, అరుణజ్యోతి కోల, రాజశేఖర్ సూరిభొట్ల, రావు కల్వల, విశ్వనాధం పులిగండ్ల, డాక్టర్ నక్త రాజు, రమణ జువ్వాడి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, కిరణ్మయి గుంట, శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, భాస్కర్ రాయవరం, శారద సింగిరెడ్డి, మురళి వెన్నం, నరసింహారెడ్డి ఊరిమిండి, లెనిన్ వేముల, చంద్రహాస్ మద్దుకూరి, చినసత్యం వీర్నపు, రాజేశ్వరి ఉదయగిరి, జగదీశ్వరన్ పుదూర్, దయాకర్ మాడ తదితరులు పాల్గొన్నారు. -
న్యూజెర్సీలో బాలు స్వరాంజలి
ఎడిసన్, న్యూ జెర్సీ: ప్రముఖ కూచిపూడి కళాకారిణి స్వాతి అట్లూరి నెలకొల్పిన కళావేదిక ఆధ్వర్యంలో ఎస్పీ బాలు వర్థంతి వేడుకలు నిర్వహించారు. న్యూజెర్సీలోని దత్తపీఠంలో ఉన్న ఈవెంట్ హాల్లో బాలు స్వరాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయనీ గాయకులు ఉష, సుమంగళి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సెయింట్ లూయీస్ కు చెందిన ప్రముఖ వ్యాఖ్యాత శ్రీమతి వింజమూరి సాహిత్య ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కళావేదిక సంస్థ ఎడ్వైజర్ కమిటీలో ఒకరైన ఫణి డొక్కా అట్లాంటానుంచి ఈ కార్యక్రమానికి వచ్చి, సంధానకర్తగా వ్యవహరిస్తూ బాలు గారితో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్ ఉపేంద్ర చివుకులతో పాటు స్టెరిలీ ఎస్ స్టాన్లీ, శాంతి నర్రా , శాం జోషిలు హాజరయ్యారు. తానా, ఆటా, నాట్స్, టాటా, టిఎల్సీఏ, టీఎఫ్ఏఎస్, ఎన్నారైవీఏ, సిలికాన్ ఆంధ్రా, సాయి దత్త పీఠం శివ విష్ణు టెంపుల్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిథులు పాల్గొన్నారు. చదవండి : ఎస్పీబీకి ‘ఆటా’ స్వర నీరాజనం -
ఎన్నారైలు ఎంతో ప్రత్యేకం: మోదీ
వాషింగ్టన్: అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వాషింగ్టన్ విమానాశ్రయంలో పలువురు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రధాని తాను బస చేసిన హోటల్లో ఎన్నారైలతో ముచ్చటించారు. ప్రపంచవ్యాప్తంగా భారత సంతతికి చెందిన వారు ప్రత్యేకంగా కనిపిస్తారని ప్రధాని ప్రశంసించారు. ప్రపంచ దేశాల్లో ఉన్న ఎన్నారైలే మన దేశ బలమని ఒక ట్వీట్లో పేర్కొన్నారు. వారితో సమావేశమైన ఫొటోలు షేర్ చేశారు. చదవండి: రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. హస్తినలో మూడు రోజులపాటు ప్రధాని మోదీ ఏ దేశం వెళ్లినా ప్రవాస భారతీయులతో కచ్చితంగా సమావేశమవుతారు. ఈసారి కోవిడ్–19 కారణంగా పెద్ద పెద్ద సమావేశాలేవీ పెట్టుకోలేదు. 2014లో ప్రధానమంత్రి అయ్యాక మోదీ అమెరికా పర్యటనకు వెళ్లడం ఇది ఏడోసారి. అమెరికాలోని ఎన్నారైల్లో ప్రధానికి మంచి ఆదరణ ఉంది. దీంతో ఆయనకు ప్రవాస భారతీయుల నుంచి ఘనంగా స్వాగతం లభించింది. -
ఏడు నృత్య రీతుల్లో గురు దక్షిణ
ఆది గురువు పరమ శివుడికి అద్భుతమైన గురు దక్షిణ సమర్పించారు ప్రవాస భారతీయులు. ద్వాదశ జ్యోతిర్లింగాల మహిహను ఏడు సంప్రదాయ నృత్య రీతుల్లో అమోఘంగా ప్రదర్శించారు. గురుపౌర్ణమిని పురస్కరించుకుని సామవేదం షణ్ముఖశర్మ రచించిన శివపద కీర్తనలకు అమెరికా , రష్యా దేశాల్లో నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. జులై 23వ తేదిన రుషిపీఠం వేదికగా ఈ వర్చువల్ నృత్య ప్రదర్శన జరిగింది. మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథుడి ఆవిర్భావఘట్టం నుంచి మొదలు పెట్టి ద్వాదశ జ్యోతిర్లింగాలను వర్ణిస్తూ సామవేదం షణ్ముఖశర్మ రచించిన కీర్తనలకు అనుగుణంగా నృత్య ప్రదర్శన చేశారు. ప్రముఖ నాట్యకారిణి వాణీ గుండ్లపల్లి వన్ నెస్ ఆఫ్ గాడ్ అనే కాన్సెప్ట్‌తో భారత దేశం లోని పన్నెండు జ్యోతిర్లింగాల విశిష్టతను ఏడు శాస్త్రీయ నృత్య రీతులలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అమెరికా, రష్యా దేశాలకు చెందిన 11 నృత్య శిక్షణాలయాలకు చెందిన 58 మంది గురు- శిష్యుల బృందం పాల్గొన్నారు. ఆది గురువు పరమ శివుడి జ్యోతిర్లింగాలతో పాటు పరమేశ్వరుడి మహిమను కళ్లకు కట్టినట్టుగా కూచిపూడి, భరతనాట్యం, మొహినియాట్టం, మణిపురి , ఒడిస్సి , కథక్ , ఆంధ్రనాట్య నృత్య రీతులలో సమ్మోహనకరంగా ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో రాజేష్ శిష్యబృందం (కూచిపూడి), చందన శిష్యబృందం, నైనా శిష్య బృందాలు (భరత నాట్యం), భిధీష, సీమ శిష్యబృందాలు (ఒడిస్సీ) సరస్వతి శిష్యబృందం (మోమినియట్టం), హేమ శిష్యబృందం (ఆంధ్ర నాట్యం), మిత్ర శిష్యబృందం (మణిపురి), ప్రగ్య , దిపన్విత శిష్యబృందాలు (కథక్)లు ప్రదర్శించారు. గురుపౌర్ణమి సందర్భంగా పరమ శివుడి గొప్ప నృత్య రూపకంగా గొప్పగా ప్రదర్శించారంటూ వాణీ గుండ్లపల్లి , రవి గుండ్లపల్లిలను సామవేదం షణ్ముఖ శర్మ అభినందించారు. సామవేదం షణ్ముఖ శర్మ తెలుగు, సంస్కృత భాషలలో 1100 పైగా శివపదం కీర్తనలు రచించారు. వాటిలో దాదాపు 200 పైగా కీర్తనలకు స్వరకల్పన జరిగింది. -
రచయితలో మానవత్వం, మాతృత్వం రెండూ ఉండాలి
ప్రకృతి నుంచి మనం అన్నీ తీసుకుంటున్నామని, కానీ తిరిగి ఏమీ ఇవ్వడంలేదని ప్రముఖ రచయిత భువనచంద్ర అన్నారు. కొత్త (కరోనా) కథలు - 4 కథా సంకలనానికి ఆర్థిక సహకారం అందించిన డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి (డల్లాస్)కి ధన్యవాదాలు తెలిపేందుకు 7 దేశాలకు చెందిన 80 మంది రచయితలు, ఇతర ప్రముఖులు జులై 17న సోషల్ మీడియా వేదికగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భువనచంద్ర మాట్లాడుతూ రచయితలో మానవత్వంతో పాటు మాతృత్వం ఉండాలన్నారు. 80 మంది రచయితల కథలను ఒకే పుస్తకంలో ముద్రించడం గొప్ప విషయమన్నారు. ఈ పుస్తకాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేసిన శ్రీనివాస్ రెడ్డి, రామరాజులకు భువన చంద్ర ధన్యవాదాలు తెలియచేశారు. ఆరోగ్యం సహకరించకపోయినా యండమూరి వీరేంద్రనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొని రచయితలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కామేశ్వరి, డాక్టర్ కేవీ కృష్ణకుమారి, డాక్టర్ డా తెన్నేటి సుధా దేవి, అత్తలూరి విజయలక్ష్మి, ముక్తేవి భారతి, పొత్తూరి విజయలక్ష్మి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వర్చువల్ సమావేశాన్ని డాక్టర్ వంశీ రామరాజు నిర్వహించారు. -
ప్రజల గుండెల్లో నిలిచిన నేత డాక్టర్ వైఎస్సార్
అట్లాంట: ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తోందని అభిప్రాయపడ్డారు ప్రవాస భారతీయులు. సీఎం జగన్ సైతం తండ్రిగారి బాటలోనే నడుస్తున్నారని ప్రశంసించారు. జులై 11 ఆదివారం మధ్యాహ్నం అట్లాంటాలో వైయస్సార్ గారి జయంతి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. సీడీసీ నిబంధనలు పాటిస్తూ రాజన్నకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్సార్ పాలన, ఆయన హయాంలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఏపీలో సీఎం జగన్ పాలనలో జరుగుతున్న ప్రజా సంక్షేమ పథకాలు గురించి చర్చించారు. శ్రీనివాస్‌రెడ్డి కొట్లూరు, నంద గోపినాథ్‌రెడ్డి, వెంకటరామి రెడ్డి చింతంల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అట్లాంటాలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి ఏ సభ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా భారీ ఎత్తున అభిమానులు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి జరిగిన 72వ జయంతి వేడుకలకు భారీగానే ఆయన అభిమానులు వచ్చారు. ఇందులో ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వాళ్లే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన అభిమానులు కూడా ఉండటం విశేషం. జననేత రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన కొంతమంది వక్తలు ప్రసంగిస్తూ.... వైఎస్సార్‌తో తమకున్న సాన్నిహిత్యం, ఆయన ద్వారా చేకూరిన లబ్ది, వారి ప్రాంతంలో అందిన సంక్షేమ ఫలాలు గురించి ప్రసంగించారు. -
అమెరికాలో ‘బాలమురళి’ గానామృతం
కాలిఫోర్నియా: సిలికానాంధ్ర మ్యూజిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ "సంపద" ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలో కర్ణాటక సంగీత సామ్రాట్ తెలుగువారు గర్వించదగిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ 91వ జయంతి ఉత్సవాలు సిలికానాంధ్ర సంపద ఆధ్వర్యంలో కన్నుల పండువగా జరిగాయి. జులై 4న వర్చువల్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంతోమంది కళాకారులు హాజరై బాల మురళి కృష్ణ గారితో తమకున్న అనుబంధాలని పంచుకున్నారు. స్వర నివాళి ఈ కార్యక్రమంలో కేరళ నుంచి మంగళంపల్లి శిష్యులు ప్రిన్స్ రామ వర్మ, హైదరాబాద్ నుంచి డీవీ మోహన కృష్ణ పాల్గొని గురువు గారితో వారికున్న అనుభవాలని పంచుకున్నారు. ప్రముఖ మ్యూజికాలజిస్ట్ డాక్టర్ బి ఎం సుందరం, డాక్టర్ పప్పు వేణుగోపాలరావు, సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు చిత్రవీణ రవి కిరణ్, చిత్రవీణ నరసింహం, ప్రముఖ ఘటం కళాకారులు కార్తీక్, ప్రముఖ మృదంగ విద్వాంసులు పత్రి సతీష్ కుమార్ గారు మరియు సంగీత విద్వాంసులు శ్రీరాం పరశురాం గారు, మోదుమూడి సుధాకర్ గారు, వయోలిన్ కళాకారిణి పద్మ శంకర్ గారు, జీవీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాదు మంగళంపల్లి వారి కుటుంబ సభ్యులు అభిరామ్, డాక్టర్ మంగళంపల్లి వంశీ, కస్తూరి గోపాల రావు తదితరులు ఈ వేడుకల్లో భాగమయ్యారు. బాలమురళి గారి థిల్లానాలకు ప్రముఖ నాట్య గురువు ప్రియదర్శిని గోవింద్ శిష్యురాలు శ్వేత ప్రచండె అద్భుతమైన నాట్య ప్రదర్శన చేసి వీక్షకులను అలరించారు. బాలమురళి గారి శిష్యులు చిట్టమూరి కారుణ్య, చిన్మయిలు బాలమురళి గారి కీర్తనలు పాడి స్వర నివాళినర్పించారు. ఆకట్టుకున్న డాక్యుమెంటరీలు సంపద ఉపాధ్యక్షుడు ఫణి మాధవ్ కస్తూరి నాయకత్వంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జీవన విశేషాల పై ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో రూపొందించిన డాక్యుమెంటరీలు వీక్షకులను మంత్రముగ్ధులను చేసాయి. దీనికి స్క్రిప్ట్ మరియు వాయిస్ ఓవర్ అందించిన డాక్టర్ మాలస్వామి (ఇంగ్లీష్), వాచస్పతి అంబడిపూడి మురళీకృష్ణ(తెలుగు)కు సంపద అధ్యక్షులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖుల ఏమన్నారంటే - ప్రఖ్యాత వాయులీనం విద్వాంసులు అన్నవరపు రామస్వామి గారు మాట్లాడుతూ ‘సంపద’ వారికి ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలని ఆలోచన రావడం చాలా గొప్ప విషయమన్నారు. సంగీతం లోనే కాకుండా లోనే కాకుండా వయోలిన్, వయోలా మరియు మృదంగం, కంజీర వంటి వాద్యాలలో బాలమురళి కృష్ణ చక్కటి ప్రతిభను కనపరిచేవారు అని పేర్కొన్నారు. - ప్రముఖ నాట్యాచార్యులు పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ... భగవంతుడు సంగీత ప్రపంచానికి ఇచ్చిన అతి గొప్ప వరం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ అని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఆయన రచించి స్వరపరిచిన హిందోళ తిల్లానాకు డాన్స్ చేసే అవకాశం తొలిసారిగా తనకు కలిగిందన్నారు. - బాలమురళి కృష్ణ గారి జీవించి ఉన్న సమయంలో తను జీవించడం గొప్ప అదృష్టంగా భావిస్తానని ప్రముఖ సంగీత విద్వాంసురాలు పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ సుధ రఘునాథన్ అన్నారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే సామెతకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ చిరునామ అన్నారు. - బాలమురళి కృష్ణ జయంతి సందర్భంగా సంపద ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ప్రముఖ వాయులీన విద్వాంసులు పద్మశ్రీ పురస్కార గ్రహీత అవసరాల కన్యాకుమారి అన్నారు. ‘సంపద’కు అభినందనలు ఈ కార్యక్రమం మొత్తాన్ని సమన్వయపరిచి దిగ్విజయం చేయడానికి నాయకత్వం వహించిన సంపద అధ్యక్షులు దీనబాబు గారికి మంగళంపల్లి బాలమురళీకృష్ణ వారి శిష్యులు, కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా సిలికానాంధ్ర వాగ్గేయకార విభాగం ఉపాద్యక్షులు వంశీకృష్ణ నాదెళ్ళ, సృజన నాదెళ్ళ మరియు మమత కూచిభొట్ల బాలమురళి గారి అభిమానులందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని youtube.com/sampadatv ద్వారా చూడవచ్చు. -
గల్ఫ్ ఏజెన్సీపై సీబీఐ విచారణకు డిమాండ్
-
గల్ఫ్ ఏజెన్సీపై సీబీఐ విచారణకు డిమాండ్
లైసెన్సు ముసుగులో అమాయకులైన కార్మికులను గల్ఫ్ దేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తూ మానవ అక్రమ రవాణా చేస్తున్న ఏజెన్సీపై తాను చేసిన ఫిర్యాదుపై ఏమి చర్యలు తీసుకున్నారో తెలుపాలని ఒక గల్ఫ్ బాధితుడి భార్య ఈనెల 20న సమాచార హక్కు చట్టం క్రింద జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించిన సంఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాలకు చెందిన తంగెళ్ల గంగారాం, తంగెళ్ల సత్యం అనే ఇద్దరు గల్ఫ్ ఏజెంట్లు కార్తీక్ ఇంటర్నేషనల్ అనే పేరుతో గల్ఫ్ ఉద్యోగాల రిక్రూటింగ్ ఏజెన్సీ లైసెన్సును అడ్డంపెట్టుకొని కార్మికులను విజిట్ వీసాలతో దుబాయికి పంపిస్తూ మోసానికి పాల్పడుతున్నారని జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన కొక్కెరకాని గంగజల సంవత్సర కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతూ పోరాటం చేస్తున్నది. గల్ఫ్ ఉద్యోగ వీసా కోసం తమ వద్ద రూ.68 వేలు తీసుకొని తన భర్త కొక్కెరకాని పోశన్నను విజిట్ వీసాలో దుబాయికి పంపారని, పక్షవాతానికి గురై దుబాయి నుండి వాపస్ వచ్చిన పోశన్నకు ఒక లక్ష రూపాయల విలువైన ఆరోగ్య బీమా అందకపోవడానికి ఏజెంట్ల అక్రమదందా కారణమని గంగజల ఆరోపించారు. ఇసిఆర్ పాస్ పోర్టు కలిగిన పోశన్నకు చట్టబద్దంగా రూ.10 లక్షల విలువైన 'ప్రవాసి భారతీయ బీమా యోజన' అనే ప్రమాద బీమా పాలసీ, ఒక లక్ష రూపాయల ఆరోగ్య బీమా పొందడానికి అర్హత ఉన్నదని ఆమె అన్నారు. ఒప్పుకున్న ప్రకారం బీమా పాలసీ జారీ చేయలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. -
లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ ఆధ్వరంలో ఫుడ్ డ్రైవ్
కరోనా వైరస్ మహమ్మారి ప్రజల జీవితాల్లో ఊహించని మార్పులను తీసుకొచ్చింది. కోవిడ్-19 ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా చిన్నచిన్న వ్యాపారాలు మూతబడ్డాయి. దీంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఎన్నో కుంటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అలాంటివారికి రోజుగడవడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో క్రిస్మస్ పండుగ సందర్బంగా హోమ్‌లెస్, జాబ్ లెస్ వారి కుటుంబాల కోసం లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ Food Drive - 2020ను నిర్వహించారు. ఆస్టిన్, టెక్సాస్, అమెరికాలలో నివసిస్తున్న తెలుగు ప్రవాస భారతీయులు పుల్లారెడ్డి యెదురు, పరమేశ్వరరెడ్డి నంగి, రవి కుమార్ రెడ్డి పులిమి, ప్రదీప్ ఉమ్మారెడ్డిలు తమకు చేతనైనంత సహాయం చేస్తూ హ్యూమన్ ఫౌండేషన్ అనే చారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించారు. తమ సంస్థ సేవలు కేవలం అమెరికాకే పరిమితం అవ్వకుండా, ఇండియా, ఇతర దేశాలలో కూడా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 18, 2020న మూడు లక్షల రూపాయల(3,00,000) విలువ చేసే ఆహార పదార్థాలను "సెంట్రల్ టెక్సాస్ ఫుడ్ బ్యాంకు" వారికి అందజేశారు. ఈ కార్యక్రమానికి ఫౌండర్స్ పుల్లారెడ్డి యెదురు, పరమేశ్వరరెడ్డి నంగి, రవి కుమార్ రెడ్డి పులిమి, ప్రదీప్ ఉమ్మారెడ్డి మరియు అడ్వైసరి కౌన్సిల్ మెంబెర్స్, శ్రీకాంత్ రెడ్డి చేగిరెడ్డి, వినోద్ రెడ్డి దువ్వూరు, సతీష్ యెన్న, దుశ్యంత్ రెడ్డి వంగల, శివ దుర్భకుల తదితరులు హాజరయ్యారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నడిపించడానికి సహాయసహకారాలందించిన దాతలకి, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు రానున్న సంవత్సరంలో ప్రణాళికతో అందరిని కలుపుకొంటూ సేవలందించడమే తమ ముఖ్య ఉద్దేశమని ట్రస్ట్ ఫౌండర్స్ తెలియజేశారు. -
దత్తతతో అద్భుత ఫలితాలు
వాషింగ్టన్: ఢిల్లీ శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అనూహ్య విజయంతో అందులో ప్రవాస భారతీయులు పోషించిన కీలకపాత్ర తెరపైకి వచ్చింది. ‘అడాప్ట్ ఏ కాన్స్టిట్యుయెన్సీ’ (ఏఏసీ) పేరిట ఢిల్లీలోని ఓ నియోజకవర్గాన్ని స్థానిక నాయకులతోపాటు ప్రవాస భారతీయులు కూడా దత్తత తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆప్ గ్లోబల్ సపోర్టర్స్ విభాగం అధికార ప్రతినిధి శాలినీగుప్తా సోమవారం వెల్లడించారు. ఇలా ఎన్ఆర్ఐ బృందాలు ఢిల్లీ శాసనసభ పరి ధిలోని మొత్తం 16 నియోజకవర్గాలను దత్తత తీసుకున్నారు. ఇలా దత్తత తీసుకున్న 12 నియోజకవర్గాల్లో ఆప్ అభ్యర్థులే విజయం సాధించారు. ఇలా విజయం సాధించిన వారిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు మనీష్ సిసోడియా, సోమనాథ్ భారతి, రాఖీ బిర్లా తదితరులు ఉన్నారు. ‘ ఓ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నప్పు డు దాని అభివృద్ధికి అవసరమైన నిధులను సేకరించడమే మా ప్రధాన లక్ష్యం. ఆ తర్వాత లాప్‌టాప్‌లు, కార్యాలయ సామగ్రి తదితరాలను కొనుగోలు చేస్తాం. ఉదాహరణకు ఆప్ ఆస్ట్రేలియా విభాగం న్యూఢిల్లీ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంది. ఆ నియోజకవర్గంనుంచి మా పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేసి గెలుపొందారు. ఇక ఆప్ బే ఏరియా (సిలికాన్ వ్యాలీ) పత్పర్గంజ్ నియోజకవర్గాన్ని ఎంచుకుంది. అక్కడి నుంచి మనీష్ సిసోడియా పోటీ చేసి విజయం సాధించారు. ఆప్ చికాగో విభాగం ఢిల్లీ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని ఎంచుకుంది. అక్కడినుంచి బరిలోకి దిగిన సురేందర్ సింగ్ గెలిచారు. ఆప్ హోస్టన్, ఆప్ అట్లాంటా విభాగాలు మాలవీ యనగర్ను దత్తత తీసుకోగా అక్కడినుంచి సోమ్‌నాథ్ భారతి గెలుపొందారు. ఇక ఆప్ సౌత్ కొరియా విభాగం. ఆప్ యూఏఈలు దత్తత తీసుకున్న మంగోల్‌పురి నుంచి మంత్రి రాఖీ బిర్లా గెలుపొందారు. ఇక ఆప్ జర్మనీ విభాగం బురారిని, ఆప్ మిచిగాన్ విభాగం మెహ్రౌలిని, ఆప్ న్యూజెర్సీ న రేలాను, ఆప్ డల్లాస్ సంగం విహార్‌ను, ఆప్ యూకే సీమాపురిని, ఆప్ దక్షిణ కొరియా షాలిమార్‌బాగ్, ఆప్ సింగపూర్ త్రిలోక్పురిని దత్తత తీసుకున్నాయి. -
సమైక్యం కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్నది జగనే: ఎన్నారైలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చిత్తశుద్ధితో పోరాడుతున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఒక్కరేనని పలువురు ఎన్నారైలు ప్రశంసించారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని ఎన్నారైలు సమైక్యాంధ్రకు మద్దతుగా ఓర్లాండ్ నగరంలో గత ఆదివారం సమావేశమయ్యారు. సమైక్యాంధ్రకోసం జగన్మోహన్రెడ్డి కొనసాగిస్తున్న పోరాట పటిమ ప్రశంసనీయమని, నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు నిరాహారదీక్ష చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డా.ఎన్.వాసుదేవరెడ్డి, వై.సాయిప్రభాకర్, డా.కె.మోహన్‌రెడ్డి, డా.ఆదినారాయణ, డా.విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.