ప్రకృతి నుంచి మనం అన్నీ తీసుకుంటున్నామని, కానీ తిరిగి ఏమీ ఇవ్వడంలేదని ప్రముఖ రచయిత భువనచంద్ర అన్నారు. కొత్త (కరోనా) కథలు - 4 కథా సంకలనానికి ఆర్థిక సహకారం అందించిన డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి (డల్లాస్)కి ధన్యవాదాలు తెలిపేందుకు 7 దేశాలకు చెందిన 80 మంది రచయితలు, ఇతర ప్రముఖులు జులై 17న సోషల్ మీడియా వేదికగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా భువనచంద్ర మాట్లాడుతూ రచయితలో మానవత్వంతో పాటు మాతృత్వం ఉండాలన్నారు. 80 మంది రచయితల కథలను ఒకే పుస్తకంలో ముద్రించడం గొప్ప విషయమన్నారు. ఈ పుస్తకాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేసిన శ్రీనివాస్ రెడ్డి, రామరాజులకు భువన చంద్ర ధన్యవాదాలు తెలియచేశారు. ఆరోగ్యం సహకరించకపోయినా యండమూరి వీరేంద్రనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొని రచయితలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కామేశ్వరి, డాక్టర్ కేవీ కృష్ణకుమారి, డాక్టర్ డా తెన్నేటి సుధా దేవి, అత్తలూరి విజయలక్ష్మి, ముక్తేవి భారతి, పొత్తూరి విజయలక్ష్మి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వర్చువల్ సమావేశాన్ని డాక్టర్ వంశీ రామరాజు నిర్వహించారు.
రచయితలో మానవత్వం, మాతృత్వం రెండూ ఉండాలి
Published Mon, Jul 19 2021 1:56 PM | Last Updated on Mon, Jul 19 2021 2:43 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment