సమైక్యం కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్నది జగనే: ఎన్నారైలు | ys jagan mohan reddy only fights with Integrity for united andhra: NRIs | Sakshi
Sakshi News home page

సమైక్యం కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్నది జగనే: ఎన్నారైలు

Published Thu, Oct 17 2013 2:39 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ys jagan mohan reddy only fights with Integrity for united andhra: NRIs

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చిత్తశుద్ధితో పోరాడుతున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనని పలువురు ఎన్నారైలు ప్రశంసించారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని ఎన్నారైలు సమైక్యాంధ్రకు మద్దతుగా ఓర్లాండ్ నగరంలో గత ఆదివారం సమావేశమయ్యారు. సమైక్యాంధ్రకోసం జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగిస్తున్న పోరాట పటిమ ప్రశంసనీయమని, నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు నిరాహారదీక్ష చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డా.ఎన్.వాసుదేవరెడ్డి, వై.సాయిప్రభాకర్, డా.కె.మోహన్‌రెడ్డి, డా.ఆదినారాయణ, డా.విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement