United Andhra
-
రెండు రాష్ట్రాలను మళ్లీ కలుపుతాం
మా పార్టీ పేరు ‘జై సమైక్యాంధ్ర’ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటన రాష్ట్రం ఇంకా విడిపోలేదు.. సుప్రీంకోర్టుపై మాకు ఆశ ఉంది తూర్పు, పశ్చిమ జర్మనీల మధ్య గోడను ప్రజలే కూల్చేశారు తెలంగాణ నుంచే ఇలాంటి ఉద్యమం ఆరంభమవుతుంది రాష్ట్ర విభజనకు చంద్రబాబునాయుడే కారకుడు గవర్నర్ నరసింహన్ సూపర్‌మేన్ అంటూ వ్యంగ్యాస్త్రాలు కిరణ్ అధ్యక్షుడిగా 16 మందితో కొత్త పార్టీ కార్యవర్గం రేపు రాజమండ్రి సభలో పార్టీ గుర్తు ప్రకటన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఇంకా విడిపోలేదని.. సుప్రీం కోర్టుపై తమకింకా ఆశ ఉందని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ రాష్ట్రం విడివడినా తూర్పు, పశ్చిమ జర్మనీలు కలసిపోయిన మాదిరిగానే ప్రజల పోరాటంతో రెంటినీ తిరిగి కలుపుతామని చెప్పారు. ‘‘తూర్పు, పశ్చిమ జర్మనీల మధ్య 1961లో అడ్డుగోడ కట్టారు.. 1991 నాటికి ప్రజలే దాన్ని కూల్చి ఒకటి చేశారు. ఇక్కడ కూడా అలాగే అవుతుంది.. తెలంగాణ నుంచే ఇలాంటి ఉద్యమం ఆరంభమవుతుంది’’ అని కిరణ్ అభిప్రాయపడ్డారు. బెర్లిన్ గోడ కూల్చినప్పటి ఆ గోడ ముక్కను తన మిత్రుడొకరు తెచ్చారని, ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక దాన్ని తెప్పించానంటూ ఒక చిన్న సంచిలోంచి రాయిముక్కను తీసి చూపించారు. తాను ఏర్పాటు చేస్తున్న కొత్త పార్టీ పేరు ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ అని.. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలపటమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని కిరణ్ ప్రకటించారు. ఆయన సోమవారం హైదరాబాద్‌లోని తన ప్రైవేటు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొత్త పార్టీ పేరుతో పాటు 16 మందితో పార్టీ కార్యవర్గాన్నీ ప్రకటించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షుడు కాగా.. వ్యవస్థాపక అధ్యక్షుడిగా చుండ్రు శ్రీహరిరావు, ఉపాధ్యక్షులుగా ఎ.సాయిప్రతాప్, ఉండవల్లి అరుణ్‌కుమార్, సబ్బంహరి, జి.వి.హర్షకుమార్, సాకే శైలజానాథ్, పితాని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులుగా ఎన్.తులసిరెడ్డి, కేశిరాజు శ్రీనివాస్ (గజల్ శ్రీనివాస్), టి.దొరస్వామి, ఎం.వి.రత్నబిందు, జి.గంగాధర్, కోశాధికారిగా భమిడిపాటి రామమూర్తి, సభ్యులుగా మహ్మద్ అబ్దుల్‌ఖాదిర్, బండి సుధాకర్‌లను నియమించారు. ఈ నెల 12వ తేదీన రాజమండ్రి సభలో పార్టీ గుర్తు తదితర అంశాలను ప్రకటిస్తామని కిరణ్ తెలిపారు. తమ పార్టీలోకి అన్ని వర్గాల ప్రజలు రావాలని, ఉద్యోగ సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరారు. తెలంగాణ నుంచే విలీన పోరాటం ప్రారంభమవుతుందని పేర్కొన్న కిర ణ్ ప్రకటించిన పార్టీ కార్యవర్గంలో ఆ ప్రాంతం నుంచి ఒక్క కీలక నేత కూడా లేకపోవటం గమనార్హం. పార్టీ టికెట్ల కోసం దరఖాస్తులు అందాయి... రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించినందున లగడపాటి రాజగోపాల్‌ను తమ పార్టీ కార్యవర్గంలోకి తీసుకోలేదని, అయితే ఆయన సలహాలు సూచనల ప్రకారం పార్టీ నడుస్తుందని కిరణ్ పేర్కొన్నారు. ఎంపీ రాయపాటి సాంబశివరావు గురించి మీడియా అడగగా.. ‘‘ఇష్టమున్నదీ, లేనిదీ తెలుసుకున్నాకే ఈ కార్యవర్గాన్ని ఏర్పాటుచేశాం. ఇంకా ఏమైనా ఉంటే తరువాత ప్రకటిస్తాం’’ అని బదులిచ్చారు. తమ పార్టీ తరఫున పోటీచేయడానికి అనేక మంది నుంచి దరఖాస్తులు అందాయన్నారు. అయితే తాము టికెట్లను అమ్మబోమని, ప్రజల కోసం పనిచేసేవారికే ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ను వీడిన తాను ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ సలహాలు వినాల్సిన పనిలేదన్నారు. టీడీపీకి మద్దతు ఇవ్వాలంటున్న చంద్రబాబు.. రాష్ట్ర విభజనపై తన వైఖరేమిటో ఇప్పటికీ చెప్పలేకపోవటం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర విభజనకు ఆయనే ప్రధాన కారణమన్నారు. విలేకరుల సమావేశంలో లగడపాటి రాజగోపాల్, సబ్బంహరి, చుండ్రు శ్రీహరిరావు, తులసిరెడ్డి, నీరజారెడ్డి, వాసిరెడ్డి వరదరామారావు, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. ఆ ‘సూపర్‌మేన్’ ఉండగా ఎన్నికలు ఎందుకు? రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌పై కిరణ్‌కుమార్‌రెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘‘తెలంగాణలో అన్నీ చేయడానికి ఉన్నారు కదా.. ఇక్కడ ఎన్నికలు ఎందుకు పెడుతున్నారు? గవర్నర్ అన్నీ తానే చేసేస్తానంటున్నారు కదా? ఆ సూపర్‌మేన్ ఉండగా మళ్లీ ఎన్నికలు ఎందుకు? ఆయనకే అన్నీ వదిలేస్తే సరిపోతుంది’’ అని వ్యాఖ్యానించారు. -
సమైక్యమే ఊపిరిగా...జగన్
-
నేడు సీఎం కిరణ్ రాజీనామా?
-
నేడు సీఎం కిరణ్ రాజీనామా?
నేడు రాజీనామా? బిల్లును సాకుగా చూపి తప్పుకోవాలని సీఎం నిర్ణయం పార్లమెంటులో ఓటింగ్‌కు ముందే రాజీనామా! కొత్త పార్టీ ఏర్పాటుపై మంత్రులు, సన్నిహితులతో సమాలోచనలు రాజీనామా, కొత్త పార్టీపై ఆరు నెలలుగా లీకులిస్తున్న కిరణ్ ఇంత ప్రచారం చేసుకున్నాక ఇప్పుడు తప్పుకోక తప్పదంటున్న మంత్రులు పార్టీపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్న సీఎం, ఎన్జీవో నేత, లగడపాటి సాక్షి, హైదరాబాద్: మరో వారం, పది రోజుల్లో సాధారణ ఎన్నికలకు షెడ్యూలు ప్రకటించే అవకాశం ఉండటం, కొద్ది రోజులుగా ఒక్కొక్కటిగా పనులు చక్కబెట్టుకుంటూ వస్తున్న నేపథ్యంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం తన పదవికి రాజీనామా చేయనున్నట్లు బలంగా ప్రచారం జరుగుతోంది. సీఎంకు సన్నిహితంగా ఉండే కొందరు మంత్రులు కూడా ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. సీఎం వ్యతిరేకవర్గం కూడా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇంట్లో సమావేశమై, కిరణ్‌పై ఎదురుదాడికి వ్యూహరచన చేయడమూ దీనికి బలాన్ని చేకూరుస్తోంది. తెలంగాణ బిల్లు మంగళవారం లోక్‌సభలో చర్చకు వస్తుండటంతో, దాన్ని కారణంగా చూపి పదవి నుంచి తప్పుకోవాలన్న యోచనలో సీఎం ఉన్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. కొత్త పార్టీ పెడితే ఎంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మద్దతుగా నిలుస్తారని కిరణ్ అంచనా వేసుకుంటున్నారు. దీనిపై కొందరు మంత్రులు, సన్నిహితులతో సమాలోచనలు సాగిస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించాలని ఆరు నెలల క్రితం సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన రోజు నుంచే తన పదవికి రాజీనామా, కొత్త పార్టీ ఏర్పాటుపై కాంగ్రెస్ నేతలకు సీఎం లీకులిస్తూ గడిపారు. సమైక్య రాష్ట్రం కోసం పోరాటం పేరుతో రాజీనామాను వాయిదా వేస్తూ వచ్చారు. విభజన బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన సమయంలో రాజీనామాపై ప్రచారం బలంగా సాగింది. అయితే, లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టలేదన్న బీజేపీ వాదనను సాకుగా చూపించి, ఆయన రాజీనామాను చివరి వరకు సాగదీస్తూ వచ్చారు. ఈలోగా చకచకా ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారు. ఈనెల 21న పార్లమెంట్ సమావేశాలు ముగిసేవరకు వేచి చూడాలని ఓ దశలో భావించారు. అయితే, రాజీనామాపై ఇప్పటికే విస్తృతస్థాయిలో ప్రచారం కల్పించుకున్న నేపథ్యంలో ఇక తప్పుకోకపోతే పరువు పోతుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు మంత్రులు చెబుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం లోక్‌సభలో తెలంగాణ బిల్లుపై చర్చ ముగిసి ఓటింగ్ జరగడానికి ముందు రాజీనామా చేసే అవకాశముందని, గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇస్తారని సీఎం సన్నిహిత నేతలు చెబుతున్నారు. ఏ కారణం చేతనైనా విభజన బిల్లు లోక్‌సభలో ముందుకు వెళ్లని పరిస్థితి ఉంటే రాజీనామా చేయకూడదన్న అభిప్రాయంతో సీఎం ఉన్నట్టు మంత్రులు అంటున్నారు. మరోపక్క, కొత్త పార్టీ ఏర్పాటుపై సీఎం కిరణ్, ఎన్టీవో నేత, కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ లగడపాటి తదితరులు పలు దఫాలుగా చర్చలు జరిపారు. అయినప్పటికీ, ఇప్పటికీ వారొక నిర్ణయానికి రాలేకపోయారని మంత్రులు చెప్పారు. సీఎం ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో సీమాంధ్రకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో రాజీనామాపై సమాలోచనలు జరిపారు. అయితే, సోమవారం అలాంటి హడావిడి ఏమీ కనిపించలేదు. ఆయన తన నివాసానికే పరిమితమయ్యారు. మంత్రులు పితాని సత్యనారాయణ, మహీధర్‌రెడ్డి, పార్థసారథి, ఇతర నేతలు మాత్రమే కిరణ్‌తో భేటీ అయ్యారు. చర్చ మొదలైన వెంటనే సీఎం రాజీనామా : పితాని పార్లమెంటులో బిల్లుపై చర్చ మొదలుకాగానే సీఎం రాజీనామా చేయనున్నారని మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. సోమవారం సీఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కొత్త పార్టీ పెడితే ఆయన వెంటే ఉంటామని చెప్పారు. అసలు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టనప్పుడు చర్చ ఎలా అన్న ప్రశ్న పార్లమెంటులో తలెత్తక మానదని అన్నారు. ఇప్పటికే బిల్లు ప్రవేశపెట్టడంపై బీజేపీ, ఇతర పక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున అవి ఈ అంశాన్ని లేవనెత్తవచ్చని అన్నారు. బొత్స తెరవెనుక మంత్రాంగమంతా విభజన కోసమే : మంత్రి ఏరాసు ధ్వజం రాష్ట్ర విభజనపై బిల్లును ఆమోదించేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తున్న సమయంలో వద్దని చెప్పే ప్రయత్నాల చేయని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, చివరి నిమిషంలో ఢిల్లీ వెళ్దామని నేతలకు లేఖలు రాయడంలోని ఆంతర్యమేమిటని మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి ప్రశ్నించారు. ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారని ధ్వజమెత్తారు. సోమవారం ఆయన తనను కలసిన విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ నుంచి 30 మంది వెళ్లిపోతారని చెప్పిన బొత్స ఏనాడైనా వారిని పిలిచి మాట్లాడారా అని ప్రశ్నించారు. బొత్స ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ సమైక్యమని ప్రకటించారన, అయితే ఆయన తెరవెనుక నెరపిన మంత్రాంగం పూర్తిగా విభజన, పదవుల కోసమేనని ప్రజలందరికీ తెలుసునన్నారు. సీఎం మొదటినుంచీ సమైక్యానికే కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఇప్పుడు కొత్త పార్టీ కూడా పెడతారన్నారు. కార్యకర్తలతో చర్చించాక తమ భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు. -
రాబోయే మూడు రోజులు రాష్ట్రానికి కీలకం
-
రాష్ట్ర విభజనను అడ్డుకుంటే మోడీకి కూడా మద్దతిస్తాం
-
సమైక్య నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్
న్యూఢిల్లీ : సీమాంధ్ర ఎంపీల ఆందోళనలతో పార్లమెంట్ బుధవారం కూడా దద్దరిల్లింది. సమైక్య ఆందోళనలు మిన్నంటిన నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభల్లోనూ వాయిదాల పర్వం కొనసాగింది. బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర ఎంపీలు స్పీకర్ వెల్‌లోకి దూసుకుపోయారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ మీరాకుమార్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. సీమాంధ్ర సభ్యులు జై సమైక్యాంధ్ర అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. నినాదాలు కూడా చేశారు. సభలో పరిస్థితులు సద్దుమణగకపోవడంతో ఛైర్మన్ హమీద్ అన్సారీ రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం ఇరు సభలు ప్రారంభమైన సీమాంధ్ర సభ్యులు తమ పట్టు వీడలేదు. లోక్ సభలో సభ్యుల నిరసనల మధ్యే రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే ... మధ్యంతర రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ సమయంలోనూ సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రుల ఆందోళనలు కొనసాగాయి. వైఎస్ఆర్ సీపీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజనను ఆపాలంటూ ప్లకార్డుతో స్పీకర్ పోడియం వైపునకు దూసుకెళ్లారు. వైఎస్సార్సీపీ ఎంపీలు ఎస్పీవై రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆయనను అనుసరించారు. కేంద్ర మంత్రులు చిరంజీవి, పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తదితరులు ఆందోళన చేపట్టారు. వెల్‌లోకి దూసుకుపోయారు. కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ ఆందోళనకు దూరంగా ఉన్నారు. దాంతో బడ్జెట్ ప్రసంగాన్ని రైల్వే మంత్రి మల్లిఖార్జున ఖర్గే మధ్యలోనే ఆపేశారు. తాను చదవినట్టుగానే భావించాలంటూ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో లోక్‌సభను రేపటికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. సీమాంధ్ర సభ్యులు జై సమైక్యాంధ్ర అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు కూడా చేశారు. అయినా ఫలితం లేకపోవటంతో సభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది. -
'సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయి'
-
నేటి నుంచి సమైక్య ఉద్యమాలు
సాక్షి, విజయవాడ : సమైక్య రాష్ట్రం కోసం, విభజన బిల్లును అడ్డుకునేందుకు బుధవారం నుంచి వచ్చేనెల 25వ తేదీ వరకు ఉద్యమాలు నిర్వహించనున్నట్లు సమైక్యాంధ్ర జేఏసీ జిల్లా కన్వీనర్ ఎ.విద్యాసాగర్, విద్యార్థి జేఏసీ నేత దేవినేని అవినాష్ వెల్లడించారు. వివిధ ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. విద్యాసాగర్ మాట్లాడుతూ బుధవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు బెంజిసర్కిల్ నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు ర్యాలీ, 30వ తేదీన బెంజిసర్కిల్ నుంచి పిల్లలు, విద్యార్థులు, మహిళలతో ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. 31 ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే దీక్షలు చేపడతామన్నారు. దీనికి రాష్ట్ర జేఏసీ నేతలు హాజరవుతారన్నారు. వచ్చేనెల రెండో తేదీన జాగరణ కార్యక్రమం ఉంటుందని, 9న పీడబ్ల్యూడీ గ్రౌండ్ నుంచి సమైక్య పరుగు నిర్వహిస్తామన్నారు. 11, 12, 13 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం జరుగుతుందని, జిల్లా నుంచి ఐదు వేల మంది ఢిల్లీ వెళతారని చెప్పారు. ఇందుకోసం రెండు రైళ్లను బుక్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలూ పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మూడో తేదీన సమావేశమై తదుపరి కార్యక్రమాన్ని నిర్ణయిస్తామని చెప్పారు. సీమాంధ్రకు న్యాయం జరిగే వరకు విభజనకు మద్దతు ఇవ్వబోమని బీజేపీ చెబుతోందని, పార్లమెంట్లో ఇదే వైఖరి చూపాలని హితవు పలికారు. -
సమైక్య తీర్మానంపై స్పందించలేదేం?
కిరణ్, బాబులకు రాఘవులు ప్రశ్న ఆదోని, న్యూస్‌లైన్: రాష్ట్ర సమైక్యత పట్ల చిత్తశుద్ధి ఉంటే విభజనను వ్యతిరేకిస్తూ సమైక్య తీర్మానం చేయాలని ఓ ప్రధాన రాజకీయ పక్షం చేసిన డిమాండ్‌కు ఎందుకు సానుకూలంగా స్పందించలేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ప్రశ్నించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శాసనసభలో సమైక్య తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదన్నారు. చంద్రబాబు తన వైఖరి స్పష్టం చేయకుండా కిరణ్‌ను అనుసరిస్తున్నారని దుయ్యబట్టారు. పునర్విభజనపై కాంగ్రెస్, టీడీపీ మొదటి నుంచీ దొంగాట ఆడుతూ చివరల్లో బిల్లును తిరస్కరిస్తూ తీర్మానం చేయాలని కొత్త నాటకానికి తెర తీశాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పసలేని ప్రసంగంతో విలువైన సభా సమయాన్ని వృథా చేశారన్నారు. ఫిబ్రవరిలో పొత్తుల విషయాన్ని వెల్లడిస్తామన్నారు. వైఎస్ఆర్సీపీతో పొత్తు ఉంటుందా అని ప్రశ్నించగా ప్రజలు కోరుకుంటే అలాగే చేస్తామన్నారు. -
సిట్టింగ్‌లకే అవకాశం!
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ టికెట్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ కాంగ్రెస్‌కు తలనొప్పి వ్యవహారంగా మారింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ఎమ్మెల్యేలు పార్టీ ఎంపిక చేసే అభ్యర్థులను ఓడిస్తామని చెబుతుండటం, సమైక్యవాదాన్ని విన్పిస్తున్న నేతలను స్వతంత్రులుగా బరిలో దింపేందుకు ప్రయత్నిస్తుండటంతో అధిష్టానం పెద్దలకు అభ్యర్థుల ఎంపిక చిక్కుముడిగా మారింది. ఇలాంటప్పుడు కొత్తవారిని ఎంపిక చేయడం లేనిపోని ఇబ్బందులకు దారి తీయొచ్చన్న ఆందోళన కూడా నేతల్లో ఉన్నట్టు తెలుస్తోంది. సిట్టింగులనే మళ్లీ బరిలో దించితేనే మేలన్న ఆలోచన అధిష్టానంలో ఉందం టున్నారు. మూడు సామాజికవర్గాలకు సీట్లు! రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న ఆరు రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్ ఎంపీలు ఐదుగురున్నారు. కాంగ్రెస్‌కు అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం రీత్యా మూడు స్థానాలే దక్కే అవకాశాలున్నాయి. దాంతో ఒకవేళ సిట్టింగులకే మళ్లీ అవకాశమివ్వదలిస్తే ఐదుగురిలో ఎవరిని ఎంచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. పదవీ విరమణ చేస్తున్న కాంగ్రెస్ ఎంపీల్లో ఎస్సీ (నంది ఎల్లయ్య), ఎస్టీ (రత్నాబాయి), మైనారిటీ (ఎంఏ ఖాన్), రెడ్డి(సుబ్బరామిరెడ్డి), వెలమ (కేవీపీ రామచంద్రరావు) సామాజికవరాల్గ వారున్నారు. సిట్టింగులకే టికెటివ్వాలని నిర్ణయిస్తే ఎల్లయ్య, రత్నాబాయి, ఖాన్లకు ఢోకా లేదన్న ప్రచారముంది. కొత్తవారికి అవకాశమివ్వాలకుంటే మాత్రం ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు, ట్రైఫెడ్ చైర్మన్ సూర్యానాయక్ ముందు వరుసలో ఉన్నారు. రాహుల్ టీమ్ సభ్యుడైన కొప్పుల రాజు పట్టుబడితే మాత్రం ఆయనకు టికెట్ ఖాయమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సూర్యానాయక్ పేరును కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ ప్రతిపాదిస్తున్నారు. ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి, పీసీసీ మైనారిటీ విభాగం చైర్మన్ సిరాజుద్దీన్, మాజీ మంత్రి రెడ్యానాయక్‌తో పాటు సీమాంధ్రకు చెందిన పలువురు నేతలు కూడా పెద్దలకు దరఖాస్తు పెట్టుకున్నట్టు తెలిసింది. నామినేషన్ల గడువు 28వ తేదీతో ముగుస్తోంది. కాబట్టి సోమవారం సాయంత్రానికి జాబితా విడుదల కావచ్చని పీసీసీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నాలుగో అభ్యర్థిని రంగంలోకి దించుతుందా లేదా అనే విషయంలోనూ సస్పెన్స్ కొనసాగుతోంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికను పూర్తిగా అధిష్టానం పెద్దలే చూసుకోవడం ఆనవాయితీ. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తనకందిన దాదాపు 25 మంది ఆశావాహుల జాబితాను పెద్దలకు అందజేశారు. అయితే, బొత్స కూడా రాజ్యసభ సీటు ఆశిస్తున్న నేపథ్యంలో పీటముడి మరింతగా బిగుసుకుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ నుంచి ఒకరిని, సీమాంధ్ర నుంచి ఇద్దరిని బరిలో దించుతారని పీసీసీ వర్గాలంటున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయంపై గుర్రుగా ఉన్న సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ తెలంగాణ అభ్యర్థికి ఓటేసే అవకాశాల్లేవంటున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం అధిష్టానం చెప్పిన వారికి ఓటేయాలని నిర్ణయించారని సమాచారం. ఇతరులకు మద్దతివ్వం: బొత్స రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని బొత్స స్పష్టం చేశారు. ఇతర పార్టీల అభ్యర్థులకు మద్దతిచ్చే ప్రసక్తేలేదన్నారు. తమ అభ్యర్థుల గెలుపు కోసం ఇతర పార్టీల మద్దతు కూడా కోరబోమని ఆదివారం గాంధీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠి సందర్భంగా చెప్పారు -
విభజన వేడిలో సాదరణ ఎన్నికలకు ఇసి
-
ముసుగొకటి.. ముఖమొకటి!
బట్టబయలవుతున్న ముఖ్యమంత్రి వ్యూహం ‘సమైక్యం’ ఉత్తిమాటే.. అధిష్టానం మాటే అసలు ఎజెండా సాక్షి ప్రత్యేక ప్రతినిధి చెప్పేదొకటి చేసేదొకటి అన్న తరహాలో సాగుతున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కుయుక్తి.. విభజన బిల్లు ముసాయిదా విషయంలోనూ బట్టబయలైంది. సమైక్యవాదం ముసుగు కప్పుకొని లోలోపల విభజనకు పూర్తి సహకారం అందించడమే కాకుండా ప్రతిదశలో ప్రత్యర్థి రాజకీయ పార్టీపై బురదజల్లే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో అంట కాగుతోందని తీవ్ర విమర్శలెదుర్కొంటున్న పాలకపక్షం కాంగ్రెస్.. తాజాగా విభజన బిల్లు విషయంలోనూ అదే కుమ్మక్కు రాజకీయం నడుపుతోంది. బిల్లును సభలో ప్రవేశపెట్టడం, చర్చను ప్రారంభింపజేయడం.. ఈ సందర్భాల్లో ఉపయోగించిన ఎత్తుగడలనే ముసాయిదా అంశాల సవరణల విషయంలోనూ అమలు చేసింది. ఇకపై కూడా అదే పంథా కొనసాగించే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మొదట్నుంచీ విభజన ప్రక్రియను అడ్డుకోగలిగే అన్ని అవకాశాలను చేజేతులా వదిలేస్తూ.... తదుపరి దశపై ఆశలు కల్పిస్తూ వస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చివరి అంకంలోనూ అదే చేస్తున్నారు. ముసుగొకటి-ముఖమొకటి అన్న తరహాలోనే మరో రెండస్త్రాలు ఆయన అమ్ముల పొదిలోంచి బయటపడొచ్చంటున్నారు. ముసాయిదా బిల్లుపై చర్చకు మరికొంత గడువు కావాలని రాష్ట్రపతిని కోరడం వాటిలో ఒకటైతే, ‘రాజీ’నామా అస్త్రం మరొకటి. ప్రభుత్వ పరంగా జరగాల్సిన అన్ని ప్రక్రియల్ని అధిష్టానం కనుసన్నల్లో సజావుగా జరిపించి, ఆనక తీరిగ్గా రాజీనామా చేసి కొత్త కీర్తి మూట కట్టుకోవాలని ఆయన తాజా ఎత్తుగడగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి వ్యవహారంలో మొదట్నుంచీ మాటలకు-చేతలకు పొంతనలేని తనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ‘ముందు ముందు చూడండి ఏం చేస్తానో’ అంటూ చెప్పిన ఎన్నో మాటలు, తీరా ఆ దశ వచ్చే సరికి నీటి మూటలై కనిపించాయి. ముసాయిదా బిల్లులోని ప్రతి క్లాజ్కూ ప్రతిపాదించే సవరణలపై ఓటింగ్ ఉంటుందని చెబుతూ వచ్చి.. చివరకు తుస్సుమనిపించారు. సవరణలు తాను ప్రతిపాదించకపోవడం వల్ల సభానాయకుడై ఉండి కూడా రేపు ఓటింగ్ కోరే నైతికతను సీఎం కోల్పోయారని ఆ పార్టీ నేతలే సనుక్కుంటున్నారు. నిజానికి, బిల్లును సాధికారికంగా సభలో ప్రవేశపెట్టే దశలోనే, కావాలని బిఏసీకి రాకుండా పక్కకు తప్పుకొని తెరవెనుక వ్యవహారానికి ముఖ్యమంత్రి ప్రాధాన్యతనిచ్చారని వారు గుర్తుచేస్తున్నారు. ఆది నుంచీ ఆయన అమలు పరుస్తున్న ‘రహస్య ఎజెండా’ దాదాపు అందరికీ తెలిసిపోయినా ప్రతి దశలోనూ కొత్త మలుపులు రాజకీయ పరిశీలకులను కూడా విస్మయానికి గురిచేస్తున్నాయి. చర్చను అడ్డుకోవడమంటేనే విభజనకు సహకరించడమనే విచిత్ర వాదనను తెరపైకి తెచ్చి ప్రత్యర్థి పార్టీపై బురదజల్లే యత్నం చేశారు. సానుకూలంగా ఉండే ఓ వర్గం మీడియాతో పాటు అవసరాల కోసం అంటకాగే భాగస్వామ్యపక్షం నేత చంద్రబాబు సహకారం తీసుకొని ఆ అంచెను కూడా జయప్రదంగా దాటుకురాగలిగారు. సభలో బిల్లు ముసాయిదాపై సజావుగా చర్చను ప్రారంభింపజేయడం, సవరణలే ప్రతిపాదించకపోవడం ద్వారా తెలంగాణ వాదుల హర్షామోదాలు పొందారు. ఇక సమైక్యవాదపు ముసుగులో ఇన్నాళ్లూ ఊరిస్తూ వస్తున్న ఆయుధం ‘ఓటింగ్’ పై కూడా దీంతో భ్రమలు తొలగుతున్నాయి. అసలు ఓటింగ్ లేకుండానే బిల్లుపై అభిప్రాయాలనూ ‘మమ’ అనిపించి, ముసాయిదా ప్రతిని ఢిల్లీకి పంపించడం ఖాయమని కాంగ్రెస్ నాయకుల తాజా మాటల్ని బట్టి స్పష్టమౌతోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ శాసనసభలో ముందుగా ఒక తీర్మానం చేయాలని మొదట్నుంచీ వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్‌ను ఏ దశలోనూ సీఎం పట్టించుకోలేదు. బిల్లు ముసాయిదా ఇక్కడికి రావడానికన్నా ముందే సభలో సమైక్య తీర్మానం చేసి ఉంటే.. సమైక్యవాదం బలంగా ఉండటమే కాకుండా విభజనను అడ్డుకోవడానికి ఎంతో సానుకూల పరిస్థితి ఉండేదనేది సమైక్యవాదుల అభిప్రాయం. ఆ రాజమార్గాన్ని చేజేతులా వదిలేశారు. పైగా బిల్లు ముసాయిదా రాష్ట్ర శాసనసభకు రెండు మార్లు వస్తుందనే ఒక పచ్చి అబద్దాన్ని ప్రచారంలో పెట్టారు. అలా రావటం లేదని, ఒకే మారు.. అదీ కేవలం అభిప్రాయం కోసం వస్తుందని స్పష్టమైన తర్వాత కూడా సభలో దాన్ని ఓడించి పంపవచ్చనీ ప్రచారం చేశారు. అవన్నీ ఉత్తుత్తి మాటలేనని తదుపరి ప్రతిదశలోనూ రూఢీ అవుతూ వచ్చింది. ద్విముఖ వ్యూహం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ విషయంలో ఆది నుంచీ వ్యూహాత్మకంగా సాగటం వెనుక స్వామికార్యంతోపాటు స్వకార్యం అనే యోచన ఉందని చెబుతున్నారు. తానొక ప్రణాళిక రచించి, దాన్ని అమలు పరుస్తూ ‘మీరు నిర్ణయించింది సాఫీగా జరిపిస్తాను, అయితే నేను కాస్తా అధిష్టానాన్ని ధిక్కరించినట్టున్నా మీరు చూసీ చూడనట్లుండాల’నే ప్రతిపాదనపై అధిష్టానం పూచీతో ఇదంతా చేసినట్టు స్పష్టమౌతోంది. ఈ లోపాయికారి ఒప్పందం లేకుండా నిజమైన సమైక్యవాదంతో, ఆనాడే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని ధిక్కరించి ముఖ్యమంత్రి ముందుకు సాగి ఉంటే పరిణామాలు భిన్నంగా ఉండేవని పరిశీలకులు అభిప్రాయపడ్తున్నారు. మూకుమ్మడి రాజీనామాలు, ఎడతెగని ఆందోళనలు, ఉద్యోగుల నిరవధిక సమ్మె.. తదితర పరిణామాలతో రాజకీయ సంక్షోభం తలెత్తి ప్రభుత్వం కూలిపోయేది. అలా కాకుండా, వ్యూహాత్మకంగా కడవరకూ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటూనే అధిష్ఠానపు రహస్య ఎజెండాను సాఫీగా అమలుపరిచారు. ఫలితంగా తన ప్రభుత్వం నిలబడింది. మరోవైపు బిల్లు పార్లమెంటుకు వెళ్లే మార్గం సుగమమైంది. ద్విముఖ వ్యూహం విజయవంతంగా అమలు పరుస్తున్న సీఎం, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌తో దాదాపు రోజూ టెలిఫోన్ సంప్రదింపుల్లో ఉంటున్నట్టు సమాచారం. ‘పార్టీకి వీర విధేయుడు’ అని గులామ్ నబీ ఆజాద్, దిగ్విజయ్‌సింగ్‌తో మెప్పు పొందుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఈ విధేయతకు రాష్ర్ట విభజన అనంతరం పార్టీ అధిష్టానం కానుకగా ఇచ్చేదేదైనా ‘బోనస్’గా భావించనున్నారు. తరువాత ఏమిటి? కొత్త పార్టీ ఉంటుందా? అని అడుగుతూ ఒత్తిడి పెంచుతున్న సీమాంధ్ర నాయకులతో మాట్లాడుతున్నపుడు ముఖ్యమంత్రి ఇటువంటి భావనలనే వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ‘నాదేముంది, అసాధారణంగా ముఖ్యమంత్రినయ్యాను, అనూహ్యంగా ఇంతకాలం కొనసాగాను, ఇంకేదో కావాలని నాకేమి లేదు, ఏం ప్రధానమంత్రినవుతానా? మీరందరూ కలిసి ఏదైనా గట్టి నిర్ణయం తీసుకొని ముందుకెళదామంటే, నాకేమీ అభ్యంతరం లేదు అలాగే చేద్దామ’న్నట్లు మాట్లాడుతున్నారని ఆయన్ని కలిసివచ్చిన కొందరు నాయకులు చెబుతున్నారు. కొత్త పార్టీ సంగతెలా ఉన్నా, శాసనసభ బిల్లు ముసాయిదాను తిప్పిపంపాల్సిన ఈ నెల 23వ తేదీ గడువు ముగిసిన తర్వాత మరేదో ఆయుధం పేలుస్తానని ముఖ్యమంత్రి కల్పిస్తున్నదీ మరో ‘ఎత్తుగడా?’ అన్న సందేహం ఆయన అనుచరగణంలోనే వ్యక్తమౌతోంది. అన్నీ చక్కదిద్దుకొని తాపీగా... ఈ నెల 27 నుంచి రెండు మూడు రోజుల పాటు శాసనసభ జరిపించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదింపజేసుకోవాలని ముఖ్యమంత్రికి ఓ ఆలోచన ఉంది. ఈ లోపు, రాష్ట్రపతికి ఓ లేఖ రాసి, విభజన బిల్లు ముసాయిదాపై చర్చ ఆలస్యంగా మొదలైనందున మరికొంత సమయం కావాలని కోరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి స్పందన ఎలా ఉన్నా, విభజన వ్యవహారాలన్నీ చక్కదిద్దుకొని, ప్రభుత్వపరమైన కార్యక్రమాలన్నీ కానిచ్చి ఆ పైన తాపీగా రాజీనామా చేసే ఆలోచనతో ఉన్నట్టు ఆదివారం మంత్రి పితాని సత్యనారాయణ చెప్పిన మాటల్ని బట్టి తెలుస్తోంది. ముఖ్యమంత్రి, తాను రాజీనామా చేయనున్నట్టు పితాని వెల్లడించారు. అదే జరిగి సీఎం ఓ కొత్తపార్టీ ఏర్పాటుచేసినా, అది సమైక్యం కోరే వారి నిందల నుంచి తప్పుకొని రాజకీయాల్లో కొనసాగే కొత్త ఎత్తుగడ అవుతుందే తప్ప నిజాయితీ ఎలా అవుతుందనే ప్రశ్న కాంగ్రెస్ వర్గాలే లేవనెత్తుతున్నాయి. నిజంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న చిత్తశుద్ధే ఉంటే, కీలక సమయంలో ముఖ్యమంత్రి పదవిని త్యజించి, విభజనను ఎందుకు అడ్డుకోలేదని వారు ప్రశ్నిస్తున్నారు. ‘నినాదం’ కాకపోయినా, ఇదంతా వ్యూహంలో భాగమైన ‘విధానం’ తప్ప రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ‘సమాధానం’ కాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. -
సమైక్యానికి సస్పెన్షన్
15 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలపై వేటు చర్చను అడ్డుకుంటున్నారనే సాకుతో ఒక రోజు సస్పెన్షన్ తర్వాత విభజన బిల్లుపై చర్చ కొనసాగించిన కాంగ్రెస్, టీడీపీ విభజనపై ముందడుగు పడిందంటూ వ్యక్తమైన ఆనందం ఎమ్మెల్యేలపై ఆద్యంతం దమనకాండ.. అరెస్టు, నిర్బంధం మీడియాతోనూ మాట్లాడనివ్వకుండా గొంతు నొక్కిన ఖాకీలు లాగి వాహనాల్లో పడేసి గోషామహల్ స్టేడియానికి తరలింపు ఓటింగ్ పెట్టాలని అడిగితే అరెస్టు చేస్తారా: విజయమ్మ ధ్వజం అంతకుముందు బిల్లుపై ఓటింగ్‌కు పట్టుబట్టిన గౌరవాధ్యక్షురాలు ఓటింగ్ కోరుతూ పోడియాన్ని చుట్టుముట్టిన పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ ఆదేశాలతో వారందరినీ సభ నుంచి ఈడ్చుకెళ్లిన మార్షల్స్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై ఓటింగ్ పెట్టాలని, లేదా దానిపై చర్చ చేపట్టడానికి ముందే సమైక్య రాష్ట్రం కోసం తీర్మానం చేయాలని పట్టుబట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను ఉభయ సభల నుంచి సస్పెండ్ చేశారు. ‘‘సమైక్యాంధ్రే మా లక్ష్యం. ఓటింగ్ జరగకుండా చర్చను కొనసాగిస్తే విభజనను అంగీకరించినట్టే. ముందు ఓటింగ్ జరపాల్సిందే. పూర్తి సమాచారం లేని అసమగ్ర బిల్లుపై చర్చ అర్థరహితం’’ అంటూ నిరసన వ్యక్తం చేసినందుకు గెంటేశారు. విభజన బిల్లుపై చర్చను ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలని పట్టుదలతో ఉన్న ప్రభుత్వం.. సమైక్య నినాదాలతో ఉభయ సభల్లో పోడియాలను చుట్టుముట్టిన వైఎస్సార్సీపీ సభ్యులపై ఒక్క రోజు పాటు సస్పెన్షన్ వేటు వేసింది. మార్షల్స్‌ను పెట్టి మరీ వారిని సభల నుంచి బయటికి గెంటించింది. అలా ఐదుగురు ఎమ్మెల్సీలు, 15 మంది ఎమ్మెల్యేలపై వేటు వేసిన అనంతరం అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ విభజన బిల్లుపై సభల్లో చర్చను కొనసాగించాయి. పల్లె రఘునాథరెడ్డి (టీడీపీ), గండ్ర వెంకటరమణారెడ్డి (కాంగ్రెస్) అసెంబ్లీలో చర్చను కొనసాగించారు. వైఎస్సార్సీపీ సభ్యులను సస్పెండ్ చేసి చర్చను ముందుకు తీసుకెళ్లడం పట్ల తెలంగాణ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. పెద్దల సభ సంప్రదాయాలను తోసిరాజంటూ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి! దీన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మండలి అవరణలో ధర్నా చేశారు. నిన్నటిదాకా సమైక్య తీర్మానం కోసం పట్టుబట్టి, బిల్లుపై చర్చ వద్దని డిమాండ్ చేసిన టీడీపీ ఇప్పుడు రాత్రికి రాత్రే వైఖరి మార్చి కాంగ్రెస్‌తో కుమ్మక్కై రాష్ట్ర విభజనకు సహకరిస్తోందంటూ ధ్వజమెత్తారు. రాత్రికి రాత్రే టీడీపీకి ఏం న్యాయం జరిగిందంటూ నిలదీశారు. తమ సభ్యుల సస్పెన్షన్‌ను వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తీవ్రంగా నిరసించారు. సమైక్యం కోసం గళమెత్తితే సభ నుంచి గెంటేయడం ఏమిటంటూ నిలదీశారు. తమ డిమాండ్‌ను పట్టించుకోకపోగా సస్పెండ్ చేసినందుకు నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. మరోవైపు సస్పెన్షన్‌తో ఆగకుండా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం కనీవినీ ఎరగని రీతిలో అణచివేత చర్యలకు దిగింది. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో సహా 21 మంది ఎమ్మెల్యేలను ఖాకీలు అమానుష రీతిలో అరెస్టు చేశారు. దాదాపు ఈడ్చుకెళ్లి మరీ బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. కనీసం మీడియాతో మాట్లాడేందుకు కూడా వారికి అవకాశమివ్వలేదు. ఈ ఉదంతాన్ని కవర్ చేసేందుకు ప్రయత్నించిన మీడియా సిబ్బందిని కూడా దురుసుగా అడ్డుకున్నారు. చేతికి అందిన వారినల్లా విసురుగా లాగిపడేశారు. వారెవరూ ఎమ్మెల్యేల సమీపానికి కూడా వెళ్లకుండా నిరోధించారు. అనంతరం ఎమ్మెల్యేలను గోషా మహల్ స్టేడియానికి తరలించారు. అసెంబ్లీ వాయిదా పడేదాకా వారిని గంటల తరబడి నిర్బంధంలోనే ఉంచారు. తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. మధ్యాహ్నం సభ నుంచి సస్పెండైన అనంతరం అసెంబ్లీ ఇన్నర్ లాబీల వద్ద మొదలైన పోలీసుల అణచివేత, రవీంద్రభారతి చౌరాస్తా సమీపంలో ఎమ్మెల్యేలను అరెస్టు చేసేదాకా పకడ్బందీగా కొనసాగింది. అంతేగాక వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలకు ఎలాంటి కవరేజీ రాకుండా చూడటమే తమ ఉద్దేశమన్నట్టుగా పోలీసులు ఆద్యంతం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రభుత్వ దమనకాండను విజయమ్మ సహా ఎమ్మెల్యేలంతా తీవ్రంగా నిరసించారు. స్టేడియంలో ధర్నా చేశారు. అరెస్టు అమానుషమని, తమ ప్రజాస్వామిక హక్కులను హరిస్తున్నారని మండిపడ్డారు. -
పార్టీలకతీతంగా మద్దతివ్వండి: జగన్
-
పార్టీలకతీతంగా సమైక్యానికి మద్దతివ్వండి: వైఎస్ జగన్
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ..తాను, మరో ఇద్దరు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్సీలు, 23 ఎమ్మెల్యేలందరూ, డిస్ క్వాలిఫై అయిన 13 మంది తాజా మాజీ ఎమ్మెల్యేలమందరం కలిసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అఫిడవిట్ ను అందచేశామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కేంద్రకార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. సమైక్యానికి తోడుగా నిలబడుతారనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేలపై ఆలస్యంగా వేటు వేశారని జగన్ అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినపుడు అనర్హత వేటు వేయకుండా.. ఒక సంవత్సరంలోపూ అయితే ఉప ఎన్నికలు జరుగవు అనే విషయం తెలుసుకున్న తర్వాతే ఆలస్యంగా అనర్హత వేటు వేశారని జగన్ తెలిపారు. అలా డిస్ క్వాలిఫై అయిన ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రపతిని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరినట్టు జగన్ తెలిపారు. సకాలంలో అనర్హత వేటు వేస్తే.. సకాలం ఎన్నికలు జరిగితే ఎమ్మెల్యేలుగా గెలిచి. సమైక్యానికి మద్దతు తెలుపుతారనే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారన్నారు. తాజా ఎమ్మెల్యేలు కూడా అఫిడవిట్లు దాఖలు చేశారు. తాము సమర్పించిన విధంగానే ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పార్టీల కతీతంగా వెళ్లి అఫిడవిట్లు దాఖలు చేయాలని జగన్ సూచించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను అఫిడవిట్లు ఇవ్వకుండా చంద్రబాబు ఆపుతున్నారన్నారు. చంద్రబాబు, కిరణ్ మాట వినకుండా ఎమ్మెల్యేలు తమ ఆత్మసాక్షిగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ప్రార్ధిస్తున్నానని జగన్ అన్నారు. చంద్రబాబు సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని జగన్ సూచించారు. రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని చెబుతూనే ఇటీవల సచివాలయంలోని 56 డిపార్ట్ మెంట్లకు ముఖ్యమంత్రి నోట్ పంపించారు. విభజనకు సంబంధించిన అంశాలను సేకరించడానికి ఉద్యోగులందరూ నివేదిక అందించాలని నోట్ పంపించారు. ఎలాంటి చర్చ జరగకుండానే విభజన చేయాలని కిరణ్ కోరుకుంటున్నారు. విభజనపై స్పీకర్ నాదెండ్ల మనోహర్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు ఎందుకు తొందరపడుతున్నారని వైఎస్ జగన్ నిలదీశారు. గతంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన విభజన గురించి స్పీకర్, ముఖ్యమంత్రిలకు అవగాహన ఉందా అని ప్రశ్నించారు రాష్ట్రాన్ని విడిగొట్టిన పరిస్థితులు కిరణ్, స్పీకర నాదెండ్ల మనోహర్ లను తెలుసా అని ప్రశ్నించారు. లక్నో పర్యటనకు వెళ్లిన స్పీకర్‌ను ఒక విషయం అడగదలుచుకున్నాను అని అన్నారు. ఉత్తరాఖండ్ ఏర్పడినప్పుడు ఏం జరిగిందో ఆమేరకు అవగాహన స్పీకర్‌కు ఉందా? అని అడగదలుచుకున్నా అని జగన్ అన్నారు. ఆమేరకు స్పీకర్, సీఎంలకు బుద్ధి, జ్ఞానం వీరికి ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నా అని: వైఎస్ జగన్ మండిపడ్డారు. ఉత్తరాఖండ్‌ను విడగొట్టడానికి అభ్యంతరం లేదని యూపీ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతనే రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇవాళ తీర్మానం అనే పదానికి అర్థంలేకుండా చేశారు జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడకు, ఇక్కడకు తేడా తెలియదా? అని అడగదలుచుకున్నా అన్నారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయకుంటే సీఎం కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు వైఎస్ జగన్ అన్నారు. సభలో ఆమోదం తెలిపిన తర్వాత విభజన కోసం డ్రాఫ్ట్ బిల్లు రూపొందాలని .. ఎలాంటి తీర్మానం లేకుండా రాష్ట్రాన్ని అడ్డగోలు విభజన చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేస్తే దానిని కోర్టు ముందు ఉంచుతాం అని అన్నారు. అసెంబ్లీలో తీర్మానం లేకుండానే చర్చ చేపడుతారా అని అన్నారు. కిరణ్, చంద్రబాబుల మాటలు వినకుండా అందరూ ఎమ్మెల్యేలు సమైక్యం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సమైక్య తీర్మానం చేస్తే పార్లమెంట్ లో మన బలం పెరుగుతుంది. రాష్ట్రాన్ని విభజన చేయకుండా ఆపే శక్తి మనకు వస్తుంది అన్నారు. రాష్ట్రం విడిపోతే మనం సర్వనాశనం అవుతామని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మన రాష్ట్రానిది అతిపెద్ద మూడవ బడ్జెట్ అని తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తామ చేసిన విజ్క్షప్తికి రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి దేవుడ్ని ప్రార్ధిస్తున్నాం అని అన్నారు. ప్రధాని పీఠంపై కూర్చోడవడానికి సహకరించిన రాష్ట్రంతోనే కాంగ్రెస్ హైకమాండ్ ఆడుకుంటుందని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. -
అవిశ్వాస తీర్మానం వల్ల ఒరిగిందేమిటి: కావూరి
పశ్చిమ గోదావరి: రాష్ట్ర సమైక్యతకు అవసరమైనప్పుడే రాజీనామా చేస్తాను అని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. సమైక్యవాదినని నాకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పనిలేదు అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఎంపీల అవిశ్వాస తీర్మానం వల్ల ఒరిగిందేమి లేదు అని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో ఉంటూ అధిష్టానానికి వ్యతిరేకంగా ఉండకూడదనే కారణంతోనే అవిశ్వాసంకు మద్దతు పలకలేదు కావూరి తెలిపారు. రాజకీయ నేతలు, అధికారులపై కావూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు, అవినీతికి పాల్పడటం వల్లే కిందిస్థాయి ప్రజలకు అన్యాయం జరుగుతోంది అని కావూరి అన్నారు. ప్రభుత్వాలు నిధుల విడుదల చేస్తున్నా, నేతలు, అధికారులు అవినీతికి పాల్పడం వల్లే సంక్షేమం కుంటుపడుతోంది అని ఆయన విమర్శించారు. -
బాబు బౌలింగ్ చేయరు.. కిరణ్ బ్యాటింగ్ చేయరు!
వైఎస్ విజయమ్మ విమర్శ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి తుదికంటా పోరాడతామని ఉద్ఘాటన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అసలు బౌలింగే చేయరని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బ్యాటింగ్ చేయరని, అయినప్పటికీ ఇద్దరూ క్రీజ్‌లో ఉంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన అంశాన్ని సీఎం క్రికెట్ ఆటతో పోల్చుతున్నారని విలేకరులు ప్రస్తావించినప్పుడు విజయమ్మ పైవిధంగా స్పందించారు. అసెంబ్లీలోని వైఎస్సార్ సీఎల్పీ కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో ముచ్చటించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే సమైక్యంగా ఉండాలని, అందుకే తమ పార్టీ సమైక్యంగా ఉంచాలని బలంగా కోరుకుంటోందని చెప్పారు. సమైక్యంగా ఉంచే విషయంలో చివరి వరకు పోరాటం చేస్తామన్నారు. అసెంబ్లీని సమావేశపరచి సమైక్య తీర్మానం చేయాలని తమ పార్టీ తొలి నుంచీ కోరుతోందని, అయినా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పెడచెవిన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇపుడు విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన తరుణంలో కూడా తీర్మానం పెట్టడం లేదన్నారు. కృష్ణా జలాల పంపిణీలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరగడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే ప్రధాన కారణమని, ఆయన చరిత్రహీనుడిగా మిగిలిపోతారని ఆనాడే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హెచ్చరించారని గుర్తుచేశారు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను విలేకరులు ప్రస్తావించగా ‘చంద్రబాబు పరిస్థితులను బట్టి తన సిద్ధాంతాలను మార్చుకుంటూ ఉంటారు. గతంలో.. బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశానని అనేకసార్లు చెప్పిన బాబు ఇపుడు అదే బీజేపీతో పొత్తు కోసం వెంట పడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌పై ఢిల్లీకి వెళుతున్న అఖిలపక్షంలో తమ పార్టీ తరఫున పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎం.వి.ఎస్.నాగిరెడ్డి (రైతు విభాగం కన్వీనర్) ఉంటారని విజయమ్మ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాకే బిల్లుపై చర్చ చేపట్టాలి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిని తిరిగి ఎప్పుడు సమావేశపరిచినా.. ముందు సమైక్య తీర్మానం ప్రవేశపెట్టిన తరువాతనే విభజన బిల్లుపై చర్చ చేపట్టాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, ఆదిరెడ్డి అప్పారావు డిమాండ్ చేశారు. వారు గురువారమిక్కడ మాట్లాడుతూ.. సమైక్య తీర్మానం ప్రవేశపెట్టే వరకూ.. సభను అడ్డుకుంటూనే ఉంటామని స్పష్టం చేశారు. -
బంతి పడకుండానే... బ్యాటొదిలారు
అడ్డుకుంటానంటూనే విభజనకు కిరణ్ పూలబాట సీమాంధ్ర నేతల మూకుమ్మడి ఆవేదన అంతా చేసి ఇప్పుడు రిటైర్డ్ హర్ట్ అయ్యారు పరిణామాలన్నింటి పరమార్థమదే కాంగ్రెస్ నేతల్లోనూ అంతర్మథనం సాక్షి, హైదరాబాద్: ‘స్టార్ బ్యాట్స్‌మన్’ చేతులెత్తేశారా? బంతి పడకముందే బ్యాట్‌ను కింద పడేశారా? అడుగడుగునా ‘ఫిక్సింగ్’ నాటకాన్ని రంజుగా రక్తి కట్టిస్తూ వస్తున్నారా? చేయాల్సిందంతా చేసి, చివరికి తనకు తానే రిటైర్డ్ హర్ట్‌గా ప్రకటించుకుని పెవిలియన్ బాట పడుతున్నారా? ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుపై సీమాంధ్ర నేతల్లో ఇప్పుడు ఇదే అంశంపై జోరుగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజనను అడ్డుకుంటానని కొంతకాలంగా ప్రతి వేదికపైనా పదేపదే చెబుతూ వస్తున్న కిరణ్, వాస్తవానికి మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పెదవి విరుస్తున్నారు. అంతేగాక ఈ విషయమై సోషల్ మీడియాలోనూ కిరణ్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కిరణ్ మాటలకు, జరుగుతున్న పరిణామాలకు పొంతన లేకుండా పోతుండటంతో ఆయన చుట్టూ తిరుగుతున్న నేతలు కూడా తీవ్ర అయోమయంలో పడ్డారు. విభజనపై పరిస్థితిని సాగదీస్తున్నట్టు పైకి కనబడుతూనే, చివరికి కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా పరిస్థితులను కిరణ్ సానుకూలపరుస్తూవస్తున్నారన్న భావన వారిలో ఏర్పడింది. ముఖ్యంగా... ఏవైతే జరగవని ఆయన చెబుతూ వస్తున్నారో సరిగ్గా వరుసగా అవే జరుగుతున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇందుకు పలు ఉదాహరణలను కూడా చూపుతున్నారు. జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విభజన నిర్ణయం తీసుకున్నప్పటి నుంచీ, ‘విభజన జరగదు’ అంటూ ఒక్కో సందర్భంలో ఒక్కో అంశాన్ని తెరపైకి తెస్తూ కిరణ్ ఇప్పటికి నాలుగున్నర నెలలు గడిపారు. మూకుమ్మడిగా రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టిద్దామని, తద్వారా విభజన ప్రక్రియ ఆగిపోతుందని సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న రోజే నేతలంతా ప్రతిపాదించినా, ‘దాన్నివల్ల ప్రయోజనం ఉండద’ంటూ కిరణ్ దాటవేశారు. పైగా అసెంబ్లీలో తీర్మానం చేయకుండా విభజనకు ముందుకు వెళ్లలేరని నమ్మబలుకుతూ వచ్చారు. ఆ తీర్మానాన్ని ఓడించడానికైనా అందరూ పదవుల్లో ఉండాలంటూ నేతలకు నచ్చజెప్పారు. సీడబ్ల్యూసీ తీర్మానం చేసినా కేబినెట్ నోట్ తయారీ అంత సులభం కాదని, పైగా అది కేంద్ర మంత్రివర్గం ముందుకు అంత తొందరగా రాదని పేర్కొన్నారు. చివరికి విభజన నోట్ టేబుల్ ఐటంగా కేబినెట్ ముందుకు వచ్చేదాకా సీమాంధ్ర మంత్రులను, ఎమ్మెల్యేలను రోజుకో రకంగా మభ్యపెడుతూ వచ్చారు. నోట్‌ను కేంద్ర కేబినెట్ యథాతథంగా ఆమోదించడమే గాక, బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం ఉండబోదని కూడా తేల్చేసింది. దాంతో, ‘తీర్మానముంటుంది.. ఓటింగ్ ఉంటుంది... బిల్లును ఓడిస్తాం’ అని అప్పటిదాకా చెబుతూ వచ్చిన కిరణ్ వాటన్నిటినీ పక్కనపెట్టి 371డి వంటి అంశాలను తెరపైకి తెచ్చి మరికొంత కాలం కథ నడిపారు. కాదు కాదంటూనే... ఒకవైపు విభజనకు అవసరమైన సమాచారమంతటినీ కేంద్ర మంత్రుల బృందానికి ఎప్పటికప్పుడు చేరవేస్తూనే పైకి మాత్రం అదంత సులభం కాదని, సమస్యలన్నీ పరిష్కరించకుండా ముందుకు పోలేరని కూడా కిరణ్ బుకాయిస్తూ వచ్చారు. కానీ కేంద్ర మంత్రివర్గం విభజన బిల్లుకు ఆమోదముద్ర వేయడమే గాక ఆ మర్నాడే దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి కూడా పంపింది. దాంతో అప్పటిదాకా కిరణ్ కేవలం అధిష్టానం ఆదేశానుసారమే తమతో నాటకీయంగా వ్యవహరిస్తూ వచ్చారన్న భానవ సీమాంధ్ర నేతల్లో బలంగా నాటుకుంది. అంతేగాక సరిగ్గా విభజన బిల్లు రాష్ట్రానికి వచ్చే సమయానికి శాసనసభ సమావేశాలు జరిగేలా కూడా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహించారని సీమాంధ్ర నేతలంటున్నారు. రెండు అసెంబ్లీ సమావేశాల మధ్య వ్యవధి ఆర్నెల్లకు మించకూడదు. సాధారణంగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నవంబర్లోనే పూర్తి చేయొచ్చు. కానీ కిరణ్ మాత్రం విభజన బిల్లు ఢిల్లీలో ఓ కొలిక్కి వచ్చేదాకా అసెంబ్లీ సమావేశాల పట్ల ఆసక్తి చూపలేదు. సరిగ్గా బిల్లు అసెంబ్లీకి వస్తుందన్న సమాచారం అందాక, డిసంబర్ 12 నుంచి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. 13న విభజన బిల్లు రాష్ట్రపతి నుంచి రాష్ట్రానికి చేరింది. నిజానికి ఎప్పట్లా నవంబర్లోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలను ముగించి ఉంటే టీ బిల్లుపై చర్చ తదితరాలకు ఆస్కారమే ఉండేది కాదని సీమాంధ్ర నేతలంటున్నారు. రాష్ట్రపతి ఇచ్చిన గడువును పొడగించాలని కోరడమూ వీలయ్యేదని చెబుతున్నారు. ఇవేమీ చేయకపోగా, అసెంబ్లీ నిర్వహణ విధివిధానాల ఖరారుకు 11న జరిగిన బీఏసీ సమావేశానికి కూడా కిరణ్ హాజరు కాలేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా హాజరు కాలేదు. విభజన బిల్లు సభలో ప్రవేశపెట్టాలని ఆ భేటీలో తీర్మానించారు. వారిద్దరు గనుక బీఏసీకి హాజరై ఉంటే, వారు ముందుగా అనుకున్నట్టే అసెంబ్లీసమావేశాలు డిసెంబర్ 14తో నిరవధికంగా వాయిదా పడేవి. వారు రాని కారణంగా డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తదితర తెలంగాణ నేతలు సమావేశాలను ఏడు రోజుల పాటు నిర్వహించాలని గట్టిగా పట్టుబట్టడం, అందుకు ఆమోదముద్ర పడటం జరిగిపోయాయని సీమాంధ్ర నేతలు వాపోతున్నారు. విభజన బిల్లుపై చర్చ ఈ సమావేశాల్లోనే మొదలవాలని అధిష్టానం ఆదేశించిన కారణంగానే కిరణ్ వ్యూహాత్మకంగా బీఏసీకి డుమ్మా కొట్టారని భావిస్తున్నారు. తీరా విభజన బిల్లుపై చర్చకు తేదీని ఖారారు చేసేందుకు మరోసారి నిర్వహించిన బీఏసీలో పాల్గొన్న కిరణ్, ‘బిల్లుపై చర్చ జరగాలి. దీనిపై మీ మీ అభిప్రాయాలు చెప్పండి’ అని ఆయా పార్టీలకు సూచించడం సీమాంధ్ర నేతలను విస్మయపరిచింది! పైగా విభజన బిల్లుపై చర్చను మూడు విడతలుగా చేపట్టాలన్న సీఎం సూచనపైనా సీమాంధ్ర నేతల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రపతి ఇచ్చిన గడువును పూర్తిగా ఉపయోగించుకుంటామన్న కారణం చూపి మొత్తం మీద బిల్లుపై విస్తృత స్థాయి చర్చ జరిగినట్టు చూపేందుకే ఈ ప్రతిపాదన తెచ్చారంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాయకత్వానికి వ్యతిరేకంగా చిన్న మాటన్నా షోకాజులు, సస్పెన్షన్లకు దిగడం కాంగ్రెస్ అధిష్టానానికి రివాజు. అలాంటిది, నేరుగా అధిష్టానాన్నే ధిక్కరిస్తున్నట్టుగా కిరణ్ పైకి ఎన్ని వ్యాఖ్యలు, ప్రకటనలు చేసినా పెద్దలు చూసీ చూడనట్టు పోయిందంటే, అంతా హస్తిన స్క్రిప్టు ప్రకారమే జరిగిందని చెప్పకనే చెప్పినట్టేనన్న వ్యాఖ్యలు కాంగ్రెస్ శిబిరం నుంచే విన్పిస్తున్నాయి. క బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగే కీలక సమయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ హైదరాబాద్ వచ్చి, బిల్లుపై చర్చకు ఏ రోజున బీఏసీ భేటీ జరగాలి మొదలుకుని పలు అంశాలపై ‘దిశానిర్దేశం’ చేయడాన్ని అంతా గమనించారని సీమాంధ్రకు చెందిన మంత్రి ఒకరు నిర్వేదంగా వ్యాఖ్యానించారు. -
సమైక్యతీర్మానానికి నో అన్న సర్కార్
-
బిఏసి నుంచి వైఎస్ఆర్సిపి వాకౌట్
హైదరాబాద్: శాసనసభలో సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలన్న తమ ప్రతిపాదనకు ప్రభుత్యం వ్యతిరేకత తెలపడంతో శాసనసభా వ్యవహారాలకమిటీ(బిఏసి) సమావేశంను తాము వాకౌట్ చేసినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చెప్పారు. సమావేశం ముగిసిన తరువాత విజయమ్మ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలన్న తీర్మానం శాసనసభలో ప్రవేశపెట్టాలని తాము డిమాండ్ చేశామని చెప్పారు. తమ డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించడంతో తాము బయటకు వచ్చినట్లు తెలిపారు. విలేకరులు అడిగి ఒక ప్రశ్నకు తాము సమైక్య తీర్మానం ప్రవేశపెడతామని, ఎవరు మద్దతు తెలిపినా తాము స్వీకరిస్తామని విజయమ్మ చెప్పారు. అన్ని సమస్యలకంటే విభజనే అతిపెద్ద సమస్య అని ఆమె తెలిపారు. తుపాన్ల నష్టాలు, కరెంట్ కష్టాలు, కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు అంశాలపై చర్చకు కూడా డిమాండ్ చేసినట్లు వివరించారు. ప్రజాసమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదని విజయమ్మ తెలిపారు. -
'అధికారమనే అమృతం ఇస్తే, విషం కక్కుతున్నారు'
హైదరాబాద్: రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే వైఎస్ జగన్మోహన రెడ్డి లక్ష్యం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తమ్మినేని సీతారామ్ చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో రాష్ట్రాలు సమైక్యంగా ఉంటేనే పురోగతి సాధించగలమన్నారు. అందుకనే విభజనను అడ్డుకోండని జగన్ జాతీయ నేతలను కలుస్తున్నారని చెప్పారు. రాష్ట్రం విడిపోకుండా ఉండేందుకు ఆయన తన ప్రయత్నాలు తను చేస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నియంతృత్వ ధోరణితో ఏవిధంగానైనా రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ కంకణం కట్టుకుందని విమర్శించారు. ఓట్లు, సీట్ల కోసం వారు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అధికారమనే అమృతాన్ని ఇస్తే, వారు విషం కక్కుతున్నారన్నారు. ఏ ప్రయోజనాలు ఆశించి రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. -
విభజనపై ఎన్నికలే రెఫరెండం
-
అసెంబ్లీలో తీర్మాణం తప్పనిసరి
-
వైయస్ జగన్ సమావేశం తర్వాత మీడియాతో పవార్
-
తెలుగోళ్లమంటూ మోసం చేసిన్రు: నాయిని నర్సింహారెడ్డి
కమ్మర్పల్లి, న్యూస్‌లైన్ : తెలుగు మాట్లాడే వా ళ్లంతా ఒక్కటిగా ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసి సీమాంధ్రులు మోసానికి పాల్పడ్డారని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యు డు నాయిని నర్సింహారెడ్డి ఆరోపించారు. మం డల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ చెప్రాసీ కొలువు ఇవ్వలేదని మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర వేరుకావాలని పొట్టి శ్రీరాములుతో ఆమరణ నిరాహార దీక్ష చేయించారన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ మీద కన్నేసి తెలంగాణను విలీనం చేసుకొని మోసాలకు తెరలేపారన్నారు. సమైక్యాంధ్రలో అన్ని రకాలుగా నష్టపోయామని, అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్‌గా తీర్చిద్దిదడానికి టీఆర్ఎస్ ప్రణాళిక రూపొందించిందని పేర్కొన్నారు. 72 లక్షల ఎకరాలకు సాగునీరు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 72 నియోజకవర్గాల్లో 72 లక్ష ఎకరాలకు సాగునీరందించడానికి ప్రాజెక్టులు చేపట్టే ప్రణాళిక సిద్ధంగా ఉందన్నారు. విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసి విద్యుత్ కొరత లేకుండా చేస్తామన్నారు. టీఆర్ఎస్ పాలన లేకుంటే తెలంగాణ పరిస్థితి అధోగతి అవుతుందన్నారు. తెలంగాణ అంశం మరుగున పడకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు కేసీఆర్ ప్రజలను చైతన్యపరిచారని ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు పట్టం కడితే తెలంగాణ ఏర్పాడ్డాక మండల కేంద్రాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు, జిల్లాలో నిమ్స్ తరహా ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేముల సురేందర్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్చార్జి కరిమెల్ల బాబూరావు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ భాస్కర్ యాదవ్, నాయకులు కొండ ప్రకాశ్‌గౌడ్, చిన్నారెడ్డి, రాజలింగం తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ తెలంగాణే లక్ష్యం ధర్పల్లి : పది జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణ రాష్ట్ర సాధనే టీఆర్ఎస్ లక్ష్యమని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రమణాచారి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని షాదీఖానా హాల్లో టీఆర్ఎస్ కార్యకర్తల శిక్షణ శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఆధ్వర్యంలో సాగిన ఉద్యమం వల్లే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. తెలంగాణ ప్రకటనకే కాంగ్రెస్ నేతలు జైత్రయాత్రలు నిర్వహించటం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదం అయ్యేలా నేతలు చూడాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుది తెలంగాణపై కుక్క తోక వంటి ప్రవర్తన అని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మండవకు చీమూనెత్తురు లేదన్నారు. ఇప్పటికీ చంద్రబాబు వద్దే ఉన్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, రూరల్ ఇన్చార్జి భూపతిరెడ్డి, నాయకులు కిశోర్, విఠల్‌రెడ్డి, సుజావుద్దీన్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
సడలని సమైక్య పోరు
సాక్షి నెట్వర్క్: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్రలో కొనసాగుతున్న ఉద్యమం బుధవారం 113వ రోజూ కొనసాగింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎం హైస్కూల్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ పటం ఆకారంలో కూర్చుని సమైక్య నినాదాలు చేశారు. శ్రీకాకుళం జెడ్పీ ఉద్యోగులు కేంద్రమంత్రి కిల్లి కృపారాణి ఫ్లెక్సీని దహనం చేశారు. గుంటూరు జిల్లా ఏఎన్‌యూలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు రాస్తారోకో చేశారు. బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఇన్‌కంటాక్స్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జగ్గయ్యపేటలో విజ్ఞాన్ విద్యార్థులు ‘371డితో విభజన ఢాం’ అనే అక్షరాల క్రమాన్ని ఏర్పాటుచేసి మానవహారం నిర్వహించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో విద్యార్థి జేఏసీ నేతలు వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు. రచ్చబండ కార్యక్రమానికి రావద్దంటూ వైఎస్సార్సీపీ, జేఏసీ నాయకులు తిరుపతి ఎంపీ చింతా మోహన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
‘సమైక్య’ పిటిషన్లపై నేడు విచారణ
-
‘సమైక్య’ పిటిషన్లపై నేడు విచారణ
రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీం కోర్టు సోమవారం విచారించనుంది. విభజన నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ తొలుత వైఎస్సార్ కాంగ్రెస్ నేత, పారిశ్రామికవేత్త కె.రఘురామ కృష్ణంరాజు పిటిషన్ వేశారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌తో పాటు కె.కృష్ణమూర్తి వేసిన పిటిషన్లను దీనికి జతపరిచారు. ఇవన్నీ ఈ నెల 1న జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ మదన్ బి.లోకూర్‌తో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. అయితే తమ సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్.నారిమన్ అందుబాటులో లేరని ప్రధాన పిటిషనర్ తరఫు న్యాయవాదులు నివేదించడంతో విచారణ ఈ నెల 18వ తేదీకి వాయిదా పడింది. అనంతరం విభజనను వ్యతిరేకిస్తూ మరో 6 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య రైతుల సంఘం, కె.ప్రభాకర్‌రాజు తదితరులు, అనిశెట్టి చంద్రమోహన్ ప్రభృతులు, ఎం.రామకృష్ణ వేసిన పిటిషన్లను సోమవారం విచారణకు రానున్న నాలుగు పిటిషన్లకు జతపరిచారు. దీంతో మొత్తం 8 పిటిషన్లు ధర్మాసనం ముందు లిస్టయినట్టయింది. ఇలావుండగా టీడీపీ నేత సీఎం రమేష్, మరొకరు వేసిన పిటిషన్ల విచారణకు కూడా వారి న్యాయవాదులు సోమవారం విజ్ఞప్తి చేయవచ్చని సమాచారం. పిటిషనర్లు ప్రస్తావించిన ముఖ్యాంశాలు... శాసనసభ అభిప్రాయం తెలుసుకోకుండానే కేంద్రం విభజన నిర్ణయం తీసుకుందని, ఈ దృష్ట్యా దానిని రాజ్యాంగవిరుద్ధమైనదిగా ప్రకటించాలని తొలుత పిటిషన్ వేసిన రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టును కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ 3వ అధికరణం ఆధారంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగవిరుద్ధంగా ప్రకటించాలని వైఎస్సార్సీపీ నేత సోమయాజులు తన పిటిషన్లో అభ్యర్థించారు. ‘‘కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగంలోని 3వ అధికరణం ద్వారా పార్లమెంటుకు దఖలు పడిందన్నది వాస్తవమే. కానీ ఆ అధికారాన్ని... అందుకోసం ఏర్పరచిన విధి విధానాలకు అనుగుణంగా ఉపయోగించాలే తప్ప వివక్షాపూరితంగానో, ఇష్టారాజ్యంగానో వాడకూడదు. ప్రభుత్వ చర్యలేవైనా చెల్లుబాటు కావాలంటే అవి ఎట్టి పరిస్థితుల్లోనూ నిరంకుశ పోకడలకు లోనై తీసుకున్నవి అయ్యుండకూడదు. ఇదే మనల్ని పాలించే న్యాయ పాలన వ్యవస్థ తాలూకు మౌలిక పునాది. రాజ్యాంగంలోని 14వ అధికరణం సారాంశం కూడా ఇదే’’ అని నివేదించారు. కానీ ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కేంద్రం ఈ మౌలిక సూత్రాన్నే ఉల్లంఘిస్తోందని తన పిటిషన్లో ఆరోపించారు. ఇప్పటిదాకా 3వ అధికరణం ప్రకారం ఏర్పాటైన రాష్ట్రాలన్నీ మొదటి ఎస్సార్సీ సిఫార్సుల మేరకు గానీ, లేదా సంబంధిత రాష్ట్ర అసెంబ్లీ కోరిక మేరకు జేవీపీ కమిటీ, దార్ కమిటీ, లేదా వాంచూ కమిటీ వంటివి ఇచ్చిన నివేదికల ఆధారంగా గానీ ఏర్పడ్డవేనని సోమయాజులు గుర్తు చేశారు. ‘‘దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తూ మరో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ఇలాంటి ప్రాతిపదిక ఏదీ లేదు. పెపైచ్చు, రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించడమే అత్యుత్తమ పరిష్కారమని పేర్కొన్న జస్టిస్ శ్రీకష్ణ కమిటీ సిఫార్సులకు కేంద్రం నిర్ణయం పూర్తి విరుద్ధంగా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగవిరుద్ధం’’ అని పిటిషన్లో పేర్కొన్నారు. మంత్రుల బృందం(జీవోఎం) ఏర్పాటుకు వీలు కల్పించిన నోటిఫికేషన్‌ను కొట్టివేయాలని, సదరు నోటిఫికేషన్‌ను రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 3, 14, 371డీకి ఉల్లంఘనగా ప్రకటించాలని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తన పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. -
విభజనతో అభివృద్ధి ఆగిపోతుంది-సిరణ్
-
అప్పుడు కావూరి, ఇప్పడు నల్లారి: అంబటి
హైదరాబాద్: అప్పుడు కావూరి సాంబశివరావు మంత్రి పదవి కోసం సమైక్యవాదం వినిపించినట్లే ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తన సెటిల్మెంట్ కోసం ఈ వాదనను వినిపిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సీఎం నిజంగా సమైక్యవాది అయితే సమైక్యరాష్ట్రం కోసం ఈ వంద రోజులు ఏం చేశారు? అని ప్రశ్నించారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని, జీవోఎం ఏర్పాటును ఎందుకు అడ్డుకోలేకపోయారు? అని అడిగారు. విభజన డ్రామాలో అన్ని పాత్రలు కాంగ్రెస్ పార్టీయే పోషిస్తుందని విమర్శించారు. సీఎం కిరణ్ చేత పార్టీ పెట్టించి మళ్లీ కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవాలని ఆశిస్తుందన్నారు. ఈ డ్రామానంతటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, తగిన బుద్ధి చెబుతారని అంబటి హెచ్చరించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్, కిరణ్‌లు విభజన డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. విభజనకు కిరణ్ ఆమోదించినట్లు ఒక పక్క దిగ్విజయ్ చెబుతుంటే, మరో పక్క సీఎం మాత్రం ఇంకా తాను సమైక్యవాదినేనని చెబుతున్నారని విమర్శించారు. పదవి ముఖ్యం కాదంటున్న సీఎం కిరణ్ జులై 30న ఎందుకు రాజీనామా చేయలేదు? అని అంబటి ప్రశ్నించారు. ఆ రోజే సీఎం పదవికి రాజీనామా చేసుంటే రాష్ట్ర విభజన ప్రకటన వచ్చేదా? అని అడిగారు. వార్ రూమ్‌లో పదవి కోసం కన్వీన్స్ అయిన సీఎం బయటకొచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. నల్లారి నాటకంతో ప్రజలు క్షోభిస్తున్నారన్నారు. కాంగ్రెస్ తెలుగు ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
హైదరాబాద్ పై ఎవరి భయం వారిది!
అందరి దృష్టి, అందరి ఆలోచనలు హైదరాబాద్ పైనే కేంద్రీకృతమై ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో ఈ ప్రముఖ నగరానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. భాగ్యనగరం విషయంలో ఎవరి భయం వారికి ఉంది. హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించినప్పటికీ మంత్రుల బృందం(జిఓఎం), అఖిలపక్ష సమావేశాలు అనేసరికి తెలంగాణవాదుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ విషయంలో కేంద్ర ఏదైనా మతలబు పెడుతుందేమోనని వారు భయపడుతున్నారు. హైదరాబాద్‌కు సంబంధించి ఏదైనా లొల్లిచేస్తే ఊరుకోం అని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు హెచ్చరించారు. సీమాంధ్ర ప్రజలు 56 ఏళ్లుగా హైదరాబాద్ మన రాజధాని, మన మహానగరం అని నమ్ముతూ దానితో అనుబంధాన్ని పెంచుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాడిననాటికి చిన్నవారిగా ఉన్నవారు, ఆ తరువాత పుట్టిన వారే అధికంగా ఉన్నారు. చదువు, ఉద్యోగం, వైద్యం, వ్యాపారం.... .అన్ని రకాలుగా తెలంగాణ జిల్లాల వారి మాదిరే సీమాంధ్రులు కూడా హైదరాబాద్‌తో సంబంధ బాంధవ్యాలు పెంచుకున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా 'హైదరాబాద్‌తో మీకేమీ సంబంధంలేదు, వెళ్లిపోండి' అంటే వారి పరిస్థితి ఏలా ఉంటుందో ఊహించుకోవచ్చు. హైదరాబాద్ నగరం తెలంగాణలో అంతర్భాగం అనేది ఎంత నిజమో, ఈ నగర అభివృద్దిలో తెలంగాణ వారితోపాటు సీమాంధ్రుల పాత్ర ప్రముఖంగా ఉందన్న విషయం కూడా అంతే వాస్తవం. అందరూ కలిసే భాగ్యనగరాన్ని ఈ స్థాయికి తెచ్చుకున్నారు. తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్‌పై హక్కులు అన్నీ వదులుకోవలసివస్తుందనే అంశాన్ని సీమాంధ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందువల్ల సీమాంధ్రులు అసలు విభజన వద్దని, ఒక వేళ విభజిస్తే హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయాలని, కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కోరుతున్నారు. జిఓఎం, అఖిలపక్ష సమావేశాలనే సరికి ఈ నగరంపై కేంద్రం ఏదైనా తమకు అనుకూల నిర్ణయం తీసుకుంటుందేమోనన్న ఆశతో వారు ఉన్నారు. అయితే మరో పక్క విభజనకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సుముఖంగా ఉండటం, హైదరాబాద్ విషయమై ఏమీ మాట్లాడకపోవడంతో దానిపై ఆశలు వదులుకోవలసి వస్తుందేమోనన్న అనుమానం వారిలో ఉంది. చంద్రబాబు మద్దతు ఉండటంతో కాంగ్రెస్ తన ఇష్టం వచ్చిన విధంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం సీమాంధ్రులలో ఉంది. కొంతమంది తెలంగాణవాదులు చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో తెలంగాణ ఏర్పడిన తరువాత తమ వ్యాపారాలు, ఆస్తుల భద్రతపై వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. వారే కాకుండా ఈ అంశంలో ఐపిఎస్, ఐఏఎస్ అధికారులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు.విభజన నేపథ్యంలో తలెత్తే శాంతిభద్రతల సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహాలు రూపొందించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్ అధినేత, సీనియర్ ఐపిఎస్ అధికారి విజయకుమార్ ఇటీవల హైదరాబాద్ వచ్చారు. నగరంలోని సీనియర్ అధికారులతోపాటు పారిశ్రామికవేత్తలతో ఆయన చర్చించి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. హైదరాబాద్ రక్షణ విషయంలో జాగ్రత్తలు వహించాలి - కేంద్రం ఆధీనంలో నగర శాంతిభద్రతలు - భాగ్యనగరంలో ఉండే సీమాంధ్రుల ఆస్తులు, వ్యాపారాల భద్రత కోసం ప్రత్యేక చట్టం చేయాలి.... అని అధికారులు, వ్యాపారవేత్తలు పలురకాల సూచనలు చేశారు. ఈ రకంగా విభజన అంశంలో అందరి దృష్టిలో హైదరాబాద్ కేంద్ర బిందువైంది. కేంద్రానికి కూడా ఇది కీలక అంశంగా మారింది. రాష్ట్ర విభజన, భాగ్యనగరంపై ఇరు ప్రాంతాల వారి అనుమానాలు, ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. -
సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సమైక్య ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఆధ్వర్యంలో సమైక్య ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎల్ బ్లాక్ నుంచి ఉద్యోగులంతా తెలుగు తల్లి విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం అధ్యక్షుడు మురళీకృష్ణ, వైస్ చైర్మన్ బెన్సన్, కో చైర్మన్ మురళీమోహన్, కన్వీనర్ వెంకటసుబ్బయ్య, కోఆర్డినేటర్ రవీందర్రావు, సచివాలయ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, సచివాలయ సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య, మహిళా ఉద్యోగుల సంఘం ప్రతినిధి నిర్మల తదితరులు పాల్గొన్నారు. -
కనువిప్పే ఢిల్లీ కర్తవ్యం
యూపీఏ-2 చీకటి బాగోతం ప్రజలకు నరకం చూపించింది. కుంభకోణాలు దేశ ప్రతిష్టను దిగజార్చాయి. ఇప్పుడున్న పరిణామాలను బట్టి రేపటి ఎన్నికలలో తెలంగాణ కాంగ్రెస్‌కు కొన్ని సీట్లు కట్టబెట్టినా, అవి కాంగ్రెస్ హ్యాట్రిక్‌కు మాత్రం దోహదం చేయలేవు. ఏ సర్వే చూసినా ఇదే చెబుతోంది. మ్యాజిక్ ఫిగర్ 272కు ఆమడదూరంలోనే ఆ పార్టీ ఉండబోతున్నట్టు అంచనా. రాజకీయ పార్టీల ‘అభిప్రాయాల’ పుణ్యమా అని తలెత్తిన ఈ కల్లోలానికి సమాధానం చెప్పాలని కంకణం కట్టుకున్న వైఎస్ఆర్సీపీ 26న ‘సమైక్య శంఖారావం’ పూరించబోతున్నది. స్వతంత్రం వచ్చాక వ్యవస్థల పునర్ నిర్మాణం జరగాలి. మన దేశం కూడా అందుకు ప్రయ త్నించింది. స్వాతంత్య్రం ఇచ్చిన స్ఫూర్తితోనే మేరునగధీరులైన నాటి రాజనీతిజ్ఞులు, మేధావు లు, కవులూ కళాకారులు మన సావాచా నమ్మారు. అందులో భాగమే తెలుగువారికి ఒక రాష్ట్రం. తెలుగువారంతా ఒకే ఛత్రంకింద ఉండాలని ప్రజా కవులు, గాయకులు గానం చేశారు.‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ అందరి నాల్కల మీద నడయాడింది ఆ రీతిలోనే. తెలుగువారి ఆత్మగౌరవ నినాదం అందుకు ఎన్టీఆర్ ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గలవోడా!’ (వేములపల్లి శ్రీకృష్ణ గేయం) లీడ్ సాంగ్ చేసు కున్నారు. ఆంధ్రమహాసభ నాయకత్వంలో సాగిన తెలం గాణ సాయుధ పోరాట లక్ష్యాల్లో విశాలాంధ్ర స్థాపన ఒక టన్నది ఎలా విస్మరిస్తాం? ఆ పోరాట యోధులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల సోదరులు, ఆరు ట్ల కమలాదేవి వంటి ఎందరో సమైక్యతనే చాటి చెప్పారు. బూర్గుల రామకృష్ణారావు లాంటి వారి అసమాన త్యాగాల వల్లనే ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఆనాడు కాంగ్రెస్‌లోని మితవాదవర్గం వ్యతిరేకించినా, వారి ఆటలు, అపశ్రుతు లు ఆంధ్రప్రదేశ్ అవతరణను అడ్డుకోలేకపోయాయి. నెహ్రూ మాటను ఎవరూ కాదనలేకపోయారు. ఆంధ్రప్ర దేశ్ అవతరణలో భాగస్వాములు కానివారూ, పదవుల కోసం ఆరాటపడేవారు విభజన వాదాన్ని అందుకున్నారు. సమైక్యాంధ్రకు చక్కటి రాజధాని దేశంలో మేటి నగరంగా హైదరాబాద్‌కు మంచి భవిష్యత్తు ఉన్నదని భావిస్తున్న తరుణంలో ఈ విభజన నిర్ణయం ఆ నగరాన్ని గందరగోళంలో పడేసింది. కేవలం డబ్బుతో చక్కటి రాజధాని సిద్ధించదు. ఈ 57 ఏళ్లలో భాగ్యనగరం అన్ని హంగులతో చక్కటి రాజధానిగా రూపొందింది. ఎన్ని ప్రతిష్టాత్మక సంస్థలు విద్య, వైద్య, వ్యాపార రంగా లలో నెలకొన్నాయో! ఐదు లక్షల కోట్లు కాదు, పది లక్షల కోట్లు ఖర్చు చేసినా; పదికాదు, ముప్ఫై ఏళ్లయినా అటు వంటి మరో నగరాన్ని నిర్మించలేము. అంత ఆదాయం చేకూర్చగల నగరం సాధ్యమా? కొత్త రాజధాని కోసం కొందరు అంచనా వేస్తున్న ఆ పది లక్షలతో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు, జిల్లాలకు అభివృద్ధి ప్యాకేజీలు ఇవ్వవచ్చు. జలయజ్ఞాన్ని వేగంగా పూర్తి చేయవచ్చు. ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం, ఒక విశ్వవిద్యాలయం అన్న వైఎస్ కలను సాకారం చేయవచ్చు. ప్రతి స్కూలుకు టాయిలెట్ సమకూర్చవచ్చు. ప్రతి కుటుంబానికి రక్షిత మంచినీరు, టాయిలెట్ సౌకర్యం కలిగించవచ్చు. సమై క్యాన్ని అలాగే ఉండనివ్వండి. రాజధానిని గురించిన సీమాంధ్రుల కలలను వికలం కానీయరాదు. కొత్త రాజ ధాని మీద పెట్టే ఖర్చంతా అనుత్పాదకమైందే. దిగ్విజయ్ లిటిగెంటు విభజనకు ప్రధాన పక్షాలన్నీ సమ్మతించాయట. అందుకే ఈ నిర్ణయమట. సోనియా ముచ్చట తీర్చడానికి కాదట! ఇందులో రాజకీయమే లేదట! ఎనభై రోజులు దాటిపో యినా, ఇంకా సాగుతున్న కోట్లాది సీమాంధ్ర జనఘోష సైతం దిగ్విజయ్‌సింగ్‌కు వినపడలేదట! కనబడలేదట! పైగా తగ్గుముఖం పట్టిందట! కాంగ్రెస్ వారు ఎవరైనా, ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, ఎంపీలైనా ప్రతి ఒక్కరు అధి ష్టానం నిర్ణయానికి కట్టుబడాల్సిందేనట! అంటే ఎన్ను కున్న ప్రజలు దిగ్విజయ్ దృష్టిలో దద్దమ్మలు. మనకు స్వాతంత్య్రం సాధించి పెట్టిందీ, రాజ్యాంగాన్ని ఇచ్చింది ప్రజలు కాదా? రాజకీయ పక్షాలు మాట ఇచ్చాయి, కాబట్టి ప్రజల ఆకాంక్ష ఏమైనా, వారి ఘోష ఏైదైనా రాజకీయ పక్షాలు ఇచ్చిన మాట వల్ల మరచిపోవలసిందేనని దిగ్వి జయ్ భాష్యం చెప్పడం కక్షిదారుని మనస్తత్వం. ఈ 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చెందింది. ఈ విషయాన్నే జస్టిస్ శ్రీకృష్ణకమిటీ ఘంటాపథంగా చెప్పింది. తెలంగాణ కంటే రాయలసీమ వెనుకబడిందని వెల్లడించింది. హైద రాబాద్ పది జిల్లాలకు రాజధాని కావటంకంటే 23 జిల్లాల రాజ ధాని కావటం ఎంతో మేలని రావి నారాయణరెడ్డి చెప్ప లేదా? రాజధాని ప్రభావం చుట్టూ ఉన్న రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల మీద పడిం ది. ఉపాధి అవకాశాలు పెరిగాయి. భూముల ధరలు పెరి గాయి. వైఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాంతీయ అసమానతల మీద దృష్టి పెట్టి, తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. చంద్రబాబు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకొని వారిని అనాథలనుచేస్తే, వైఎస్ ఆ జిల్లాకు చెందిన కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులకు వేల కోట్లు ఖర్చు పెట్టి, పనులను పరుగులు తీయించాడు. ఏ ఇతర జిల్లాకు పెట్టనంత ఖర్చు ఆ జిల్లాకు పెట్టాడు. పచ్చటి తెలంగాణ వైఎస్ కల తెలంగాణను కోసాంధ్ర స్థాయికి పెంచాలని వైఎస్ ఆశ. ఆ ఉద్దేశంతోనే తెలంగాణలోని ఆరు జిల్లాలో 16 లక్షల ఎకరా లకు నీరందించే ప్రాణహిత చేవెళ్ల భారీ పధకాన్ని సర్వే చేయించి శంకుస్థాపన చేశారు. ఆ పధకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కేంద్రాన్ని ఒత్తిడి చేస్తున్న సమ యంలో కన్నుమూశారు. వైఎస్ అధికారం స్వీకరించిన వెంటనే తొలి సంతకం చేసింది ఉచిత విద్యుత్ పధకం మీదనే! దానితో ఎక్కువ లబ్ధి చేకూరినది తెలంగాణకే. రాష్ట్రంలో 32 లక్షల పంపుసెట్లు ఉంటే అందులో తెలం గాణలోనే 18 లక్షలు ఉన్నాయి. వారి విద్యుత్ బకాయిలు రద్దయ్యాయి. విద్యుత్ కేసులు మాఫీ అయ్యాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు దిగువన గోదావరి మీద నిర్మి స్తున్న భారీ ఎత్తిపోతల పధకాలకు భారీ స్థాయిలో విద్యు త్తు అవసరం. వాటికి మాత్రమే ఆరువేల మెగావాట్ల విద్యుత్తు అవసరం. విభజన జరిగితే ఈ ఖర్చు తెలంగాణ రాష్ట్రానికి పెద్ద గుదిబండ కాగలదు. ఆరుసూత్రాల పధకం లోని 610 జీవో ఉల్లంఘనలను పరిశీలించి, సరిచేయడా నికి వైఎస్ శ్రద్ధ తీసుకున్నారు. అందుకు తెలంగాణ మం త్రులతోటి ఒక ఉపసంఘాన్ని నెలకొల్పారు.ఇవన్నీ సౌల భ్యం కోసం నాయకులు విస్మరిస్తున్నారు. కానీ ప్రజలు మరచిపోతారని అనుకోలేం. జలయుద్ధాలను ఆపగలరా? నీటి యుద్ధాలు వర్తమాన భారత, అంతర్జాతీయ దృశ్యం. వీటిని నివారించాలంటే సమైక్యతతోనే సాధ్యం. దీనిని గుర్తించబట్టే వైఎస్ జల యజ్ఞాన్ని రూపొందించి, తాను మరణించే నాటికి సుమారు 40 వేల కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టులకు ఖర్చు చేసి, వాటి నిర్మాణాన్ని వేగవంతం చేయించారు. కేంద్రం ఇప్పుడు ఆహారభద్రత అంటూ ఒక చట్టం చేసి ఉండవచ్చు. కానీ వైఎస్ జీవించి ఉండగానే ఆహార భద్రత, కరువుల నివారణ అన్న రెండు లక్ష్యాలతో జలయజ్ఞానాన్ని రూపొందించాడు. కృష్ణ నీరు ప్రతి బొట్టు వినియోగం జరుగుతోంది. గోదావరి నీరు ప్రతి ఏటా 2 వేల నుంచి 3 వేల టీఎంసీల వరకు సముద్రం పాలవుతోం ది. ఆ నీటిలోని 20 శాతమైనా సద్వినియోగం చేసుకోగలి గితే కరువుసీమ ప్రజల వెతలు తీరుతాయి. కర్ణుని చావుకి కారణాలు ఎన్నో! సీమకు ఉన్న శాపాలెన్నో! చరిత్ర తెలిసి కొందరు, తెలియక కొందరు మాట్లాడుతున్నారు. వాస్తవా లను మరుగుపరచడం విజ్ఞత కాదు. సీమాంధ్ర ఎడారి కాకుండా ఉండాలంటే సమైక్య రాష్ట్రం నిలబడాలి. కుమ్మక్కులు ముంచాయి! సీల్డ్ కవర్ ముఖ్యమంత్రినని కిరణ్ కుమార్ తిరుగులేకుం డారుజువు చేసుకున్నాడు. తన జీవితంలో ఊహించని విధంగా ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకు సోనియాకు పరమ విధేయుడుగా ఉండాలి. పీసీసీ అధ్యక్షుడు బొత్స కూడా అంతే. కానీ 2014 ఎన్నికల్లో ప్రజలకు ముఖం చూపించాలంటే సమైక్యవాదులం అన్న ముసుగు తగిలిం చుకు తీరాలి. వారిద్దరూ మొదటనే రాజీనామా చేసి ఉంటే ప్రజలకు ఈ బాధలు తప్పేవి. రాజకీయాల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు చంద్రబాబు ప్రతీకగా మారాడు. వైఎస్ అనం తర రాజకీయాలు భ్రష్టుపట్టడానికి ఈ నేతలే కారణం. రాష్ట్రం కష్టాలు, నష్టాలు ఎలా ఉన్నా రాహుల్‌గాం దీని గద్దెనెక్కించడమే ధ్యేయంగా సోనియా ఈ నాటకం ఆడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయత్నం విజయవంతమయ్యే సూచనలే లేవు. యూపీఏ-2 చీకటి బాగోతం ప్రజలకు నరకం చూపించింది. కుంభకోణాలు దేశ ప్రతిష్టను దిగజార్చాయి. ఇప్పుడున్న పరిణామాలను బట్టి రేపటి ఎన్నికలలో తెలంగాణ కాంగ్రెస్‌కు కొన్ని సీట్లు కట్టబెట్టినా, అవి ఆ పార్టీ హ్యాట్రిక్‌కు దోహదం చేయలేవు. ఏ సర్వే చూసినా ఇదే చెబుతోంది. మ్యాజిక్ ఫిగర్ 272కు ఆమడదూరంలోనే ఆ పార్టీ ఉండబోతున్నట్టు అంచనా. రాజకీయపార్టీల ‘అభిప్రాయాల’ పుణ్యమా అని తలెత్తిన ఈ కల్లోలానికి సమాధానం చెప్పాలని కంకణం కట్టుకున్న వైఎస్ఆర్సీపీ 26వ తేదీన ‘సమైక్య శంఖారావం’ పూరించ బోతున్నది. ఇది న్యాయం కోసం ఆక్రోశిస్తున్న జనాల ఘోష. చరిత్రనీ, నిన్నటి త్యాగాలనీ అవహేళన చేస్తున్న వైఖరికి, పెడార్థాలు తీసే ధోరణికి జవాబు చెప్పే ప్రయ త్నం. ఇదైనా ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కలిగించాలి. - ఎన్.శివరామిరెడ్డి, మాజీ శాసన సభ్యులు -
సమైక్య శంఖారావంలో భవిష్యవాణి
బలమైన నాయకత్వం ప్రజల ఆకాంక్షకు అద్దంపట్టే నాయకత్వం, అన్యాయాన్ని ఎదిరించే శక్తి సామర్థ్యాలు గల నాయకత్వం, అన్నింటికీ మించి ప్రజలలో విశ్వాసం కలిగిన నాయకత్వం రాష్ట్రంలో ఈ సందర్భంలో చారిత్రక అవసరం. ఆ చారిత్రక అవసరాన్ని తీర్చగలిగే శక్తులు జగన్మోహన్రెడ్డి, ఆయన నాయకత్వంలోని వైఎస్సార్సీపీ. శరవేగంతో అభివృద్ధి పథంలో పరిగెడుతున్న ఆంధ్రప్రదేశ్ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవలసివ చ్చింది. నేడు రాష్ట్రంలో జరు గుతున్న పరిణామాలు మొత్తం జాతినే కలవర పరుస్తున్నాయి. ఈ పరిణామాలకు మూలం కాంగ్రెస్, చంద్రబాబు, టీఆర్ఎస్ పార్టీలు. తొలి భాషాప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో తలెత్తిన ప్రత్యేక తెలంగాణ (1969), ప్రత్యేక ఆంధ్ర (1972) ఉద్యమాలు కాంగ్రెస్ అసమ్మతివాదుల నుంచి పుట్టుకొ చ్చినవే. ఆ ఉద్యమాలలో ప్రజలు భారీగా పాల్గొని ఉండవచ్చు. అయితే నాయకత్వ పోటీ, పదవుల పందేరం వాటిలో పనిచేసిన సంగతి గుర్తుం చుకోవాలి. తెలుగుప్రజల ఆత్మగౌరవం, సర్వతో ముఖాభివృద్ధే ధ్యేయం గా పుట్టిన టీడీపీ రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే భావనకు ప్రాధాన్యం ఇచ్చింది. కానీ హైటెక్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ప్రత్యేక తెలంగాణవాదం మళ్లీ ఊపిరిపోసుకున్న సంగతి గమనించాలి. అభి వృద్ధి కార్యక్రమాలు సరిగా అమలుకాని పరిస్థితులలో తెలంగాణ ఉద్య మం ఒక మేరకు బలపడింది. 2004- 2009 మధ్య వైఎస్ అందించిన పాలనతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా పరుగులుతీసింది. అలాం టి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 26న చరి త్రాత్మక హైదరాబాద్ నగరంలో ‘సమైక్య శంఖారావానికి’ సమాయత్త మవుతున్నారు. అభివృద్ధికి ఆటంకంగా పరిణమించిన శక్తులను అడ్డు కోవడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తన వారసత్వంగా ఇచ్చిన జగన్ ఇప్పుడు రాష్ట్ర ప్రజానీకానికి ఆశాకిరణమయ్యారు. కుటుంబం మీద కక్షతోనే కుంపటి వైఎస్ మరణానంతరం ఆయన కుటుంబం మీద కక్షతో, అప్రజాస్వామికంగా కాంగ్రెస్ రాష్ట్రవిభజన ప్రకటన చేసింది. నదీ జలాలు, విద్యుత్ సమస్యలు, రాజ ధాని సమస్య, ఉద్యోగస్తుల సమస్యలన్నింటినీ మించి రాజధాని నుంచి వచ్చే ఆదాయం పంపిణీ దగ్గర తలెత్తే సమస్యలను పట్టించుకోకుండా, పరిష్కారా లను చూపకుండా, పదేళ్లు మాత్రమే హైదరాబాద్‌లో ఉండి, ఆపై వదిలి వెళ్లా లని సీమాంధ్ర ప్రజలను కాంగ్రెస్ హైకమాండ్ నిర్దేశించింది. ఈ పరిణామం సీమాంధ్ర ప్రజలు తెలంగాణను దోచుకుంటున్నారని ప్రచారం చేస్తున్న వారి సరసన నిలబడి వారు చెప్పేదంతా నిజమని, న్యాయమని చెప్పినట్టు ఉంది. ఈ తీరు అందరినీ బాధించింది. హైకమాండ్ పేరుతో బాధ్యతారహితంగా స్పష్టత లేకుండా, తెలుగువారి మనోభావాలను గాయపరిచేటట్లు కాంగ్రెస్ పెద్దలు ప్రవ ర్తించారు. ప్రతిపక్షం టీడీపీ, ఆ పార్టీ సిద్ధాంతకర్త రామోజీరావు, ప్రచారకుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు ఈ ప్రక్రియకు దాసోహమనడం గమనార్హం. ఈ పరిణామాలు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వారితో పాటు, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాలలోని తెలుగు వారినీ, ఎన్ఆర్ఐలనూ కూడా ఆవేదనకు గురిచేశాయి. తెలుగు వాళ్లందరికీ ఒక రాష్ట్రం అన్న భావన నుంచి పుట్టుకొచ్చిన సమైక్యవాదం ఒక ఆదర్శం. ఇటీవల మరోసారి ఆ ఆదర్శం కోసం తెలుగువాడు నినదించడం ప్రపంచ చరిత్ర పుటల్లోకి చేరింది. విశాఖ ఉక్కు, ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర, ఎన్టీఆర్ బర్త రఫ్ వ్యతిరేక నిరసన (1984), మహిళా లోకం చేపట్టిన సారా వ్యతిరేక ఉద్యమం చెప్పుకోదగ్గవి. ఈ ఉద్యమాల వెనుక బలమైన రాజకీయశక్తులు పనిచేశాయి. నేటి సమై క్యాంధ్ర ఉద్యమం ప్రజల గుండెల్లో నుంచి పుట్టుకొచ్చిం ది. ఒక ప్రాంతం ఇలా విడిపోవడానికి అంగీకరించే సంప్ర దాయానికి నేటి కాంగ్రెస్ తెరలేపింది. ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడాలనే ప్రతిపాదనలు ఉత్తరప్ర దేశ్ నుంచి అసెంబ్లీ తీర్మానాల రూపంలో వచ్చాయి. గుర్ఖాలాండ్, విదర్భ డిమాండ్లు కూడా ఉన్నా, అవన్నీ పక్కన పెట్టి ఎన్నికలముందు కేవలం ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ చేపట్టడం ఏ ప్రమాణాలకు సంకేతం? 1969, 72లో వచ్చిన ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలను ఇందిరాగాంధీ నిర్దాక్షిణ్యంగా అణచివేశారు. 8.2.1969న తిరుపతిలో (శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మైదానంలో) జరిగిన బహిరంగ సభలో ఇందిరాగాంధీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ సూటిగా, ‘భాషా ప్రయుక్త రాష్ట్రాలు రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డాయి. కొందరు వ్యక్తులు లేదా వ్యవస్థలు లేదా ప్రాంతాలు ఈ భావనకు వ్యతిరే కంగా ప్రత్యేక విభజన వాదం పేరుతో ఉద్యమించడం అనైతికం, చట్టవ్యతిరేకం. ఇది జాతి సమైక్యత, సమగ్రతలకు ప్రమాదం’ అంటూ హెచ్చరించారు. జాతి సమైక్యత, సమగ్రతల కోసం ప్రాణాలు పోగొట్టుకున్న ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల వారసత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అందిపుచ్చుకోగలదా? లేదా? ఇది తేల్చుకోవలసిన తరుణం. కపట నాటకం కాదా? నేడు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అనేక ఎత్తుగడలు పన్నుతూ ప్రజాభిప్రా యాన్ని నీర్చుగార్చడానికి ప్రయత్నిస్తున్నది. ముఖ్యమంత్రి తాను సమైక్యతకు కట్టుబడి ఉన్నానంటూ, హైకమాండ్‌ను ధిక్కరిస్తున్నట్లు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ ప్రజల్ని మోసగిం చడానికి ఆడే కపట నాటకాలు. మరోవైపు, విభజనకు కాం గ్రెస్‌తో కలిసి పునాదులు వేసిన ప్రతిపక్షనేత గందరగోళం సృష్టిస్తూ, సీమాంధ్రకు అన్యాయం జరుగుతున్నదంటూ, విభజన ప్రక్రియ సరైన పద్ధతుల్లో అమలు చేయడంలేదంటూ ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించే యత్నం చేస్తున్నారు. దివాళా తీసిన తమ పార్టీ వల్ల ఉపయోగం లేదని, సమైక్య రాష్ట్రం ఆశయంగా కొత్త పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేయా లని కాంగ్రెస్‌లోనే కొందరు ఆలోచిస్తున్నారు. మూడు రాష్ట్రాల విభజ నను విజయవంతంగా అమలుపరిచామని చెప్పే బీజేపీ, విభజనను సమర్థిస్తూనే, ఇక్కడ ఆ ప్రక్రియ సరిగాలేదని సాంకేతిక కారణాలు చూపెడుతూ మరో తీరులో ప్రజలను మోసగించడానికి ప్రయత్నిస్తు న్నది. ఒకప్పుడు చంద్రబాబు సూచన మేరకు తెలంగాణ విభజనను పక్కన పెట్టింది బీజేపీయే. శంఖారావం ఒక అవసరం విభజన ప్రక్రియలో తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి అంటూ నేడు కేంద్ర ప్రభుత్వం జీఓఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) పేరుతో ఓ కుట్రపూరిత చర్యను చేపట్టింది. మహారాష్ర్ట, కర్ణాటక నుంచి ప్రాతి నిధ్యం వహించే వారికి, చిన్న రాష్ట్రాలను సమర్థించే నాయకులకు ఈ కమిటీలో చోటు కల్పించారు. కావేరీ జలాల వివాదంలో కర్ణాటక, తమిళనాడు మధ్య సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయని పరిస్థితిని చూస్తున్నాం. తుంగభద్ర, కృష్ణా, గోదావరి జలాలను, ఎగువన వినియోగించుకోవడానికి అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్న సంగతీ మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన షిండే ప్రముఖ పాత్ర పోషించే మంత్రుల కమిటీ తెలుగు వారికి న్యాయం చేయ గలదా? బలమైన నాయకత్వం ప్రజల ఆకాంక్షకు అద్దంపట్టే నాయకత్వం, అన్యాయాన్ని ఎదిరించే శక్తి సామర్థ్యాలు గల నాయకత్వం, అన్నింటికీ మించి ప్రజలలో విశ్వాసం కలిగిన నాయకత్వం రాష్ట్రంలో ఈ సందర్భంలో చారిత్రక అవసరం. ఆ చారిత్రక అవసరాన్ని తీర్చగలిగే శక్తులు జగన్మోహన్రెడ్డి, ఆయన నాయకత్వంలోని వైఎస్సార్సీపీ. ఈ 26న చరిత్రాత్మక హైదరాబాద్‌లో జగన్ సమైక్య శంఖారావానికి ఉద్యుక్తులు కావడం అలాంటి చారిత్రక అవస రంలో భాగమే. ఇదొక చారిత్రక సందర్భం ప్రత్యేక తెలంగాణ కాదు, ప్రజల అభివృద్ధి కావాలి. ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. నన్ను నమ్మండి అంటూ జగన్ పంపిన సందేశం 26వ తేదీన ఒక ప్రభంజనంగా మారబోతున్నది. పార్టీని స్థాపించిన రెండేళ్లకే ఎన్నో సాధించి, జగన్ సంస్థను నడిపించిన తీరు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నది. వైఎస్ పథకాలను తాను కూడా అమలు చేయగలనని స్పష్టమైన సంకేతాలు పంప గలిగారు. మూడే ళ్లలో 16 నెలలు జైలు జీవితం గడిపినా, ప్రజలకు ఇంత చేరు వైన నాయకుడు ఇటీవల కాలంలో కనిపించరు. జగన్మోహన్రెడ్డి ఎదుగు దలను నిలువరించడానికి జరగని కుట్రలేదు. చివరి అస్త్రంగా జగన్‌ను బలహీన పరచడానికి రాష్ట్రాన్నీ, తెలుగు ప్రజలను చీల్చడానికి సమాయత్తమయ్యారు. ప్రజలు ఈ పన్నాగాన్ని వ్యతిరేకించాల్సిన చారిత్రక సందర్భంలో ఉన్నారు. మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధి సాధనకు చేపట్టిన సమైక్య శంఖారావానికి ప్రతి తెలుగోడు మద్దతు ప్రకటించాలి. జలాల సమస్య, జనాల సమస్యల పరిష్కారం కోసం జగన్ పూరిస్తున్న శంఖారావమిది. -ఇమామ్, సంపాదకులు 'కదలిక' -
సమైక్య శంఖారావానికి చురుగ్గా ఏర్పాట్లు
ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ బహిరంగ సభకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సభకు తరలివస్తున్నట్టు నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి సమాచారం పంపిస్తున్నారు. పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుపుతున్నారు. సభకు భారీఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలని పార్టీ నిర్ణయించింది. సమైక్య శంఖారావం ద్వారా ప్రజల మనోభావాలను మరోసారి ఢిల్లీకి వినిపించాలని నిర్ణయించిన పార్టీ అందుకు ఏర్పాట్లను రోజూ సమీక్షిస్తోంది. ఉద్యోగ, కార్మిక, కర్షక సంఘాలు కూడా సమైక్య శంఖారావానికి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌కు చెందిన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. సమైక్య శంఖారావం ఎవరికీ వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సభ కాదని, రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ నిరంకుశ వైఖరిని ఎండగట్టడంతోపాటు మెజారిటీ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌తో సభ నిర్వహిస్తున్న విషయాన్ని ప్రజలకు చెప్పాలని నేతలకు వివరించారు. ఈ సభ పూర్తి శాంతియుత వాతావరణంలో జరగాలని, ప్రశాంతంగా సభను విజయవంతం చేయడంలో నేతలు తమ వంతు కృషి చేయాలని కోరారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో జగన్ సమావేశం జరగ్గా, బుధవారం రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాలకు చెందిన పార్టీ నాయకులతో జరగనుంది. మరోవైపు ఆయా జిల్లాలకు చెందిన నేతలు శంఖారావం ఏర్పాట్ల వివరాలను పార్టీ నాయకులను కలిసి వివరిస్తున్నారు. -
‘సమైక్య’ సభను విజయవంతం చేయండి
రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ సభకు ఉద్యోగులు, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రజల ఆకాంక్షలను బలంగా వినిపించే లక్ష్యంతో ఏర్పాటవుతున్న సభకు బాసటగా నిలుస్తామని ఆయా సంఘాల నాయకులు పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రం కోసం నినదించే ఉద్యమ శక్తులకు ఉద్యోగుల మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రల గోడును కూడా సభ వేదిక మీద నుంచి వినిపించాలని కోరారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి మద్దతుగా నిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల మద్దతు ఎప్పుడూ ఉంటుంది సమైక్యవాదానికి ఉద్యోగుల మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఇందులో రెండో ఆలోచనకు తావు లేదు. సమైక్య ఉద్యమ శక్తులకు మద్దతుగా నిలుస్తాం. సమైక్య శంఖారావం సభ విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. - అశోక్‌బాబు, ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు సమైక్య శంఖారావం విజయవంతం కావాలి ప్రజల ఆకాంక్షలను బలంగా వినిపించనున్న సమైక్య శంఖారావం సభ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే లక్ష్యంతో ఏర్పాటయ్యే సభలు, సమావేశాలకు ఉద్యోగుల మద్దతు ఉంటుంది. - చంద్రశేఖరరెడ్డి, ఏపీఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి సమైక్య శంఖారావానికి సంఘీభావం రాష్ట్ర రాజధానిలో సమైక్యవాదాన్ని చాటిచెప్పడానికి ఏర్పాటు చేయనున్న సమైక్య శంఖారావం సభకు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ మద్దతు ప్రకటిస్తున్నాం. బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షడు అన్ని వర్గాలు పాల్గొనాలి సమైక్యవాదాన్ని వినిపించే ఏ సభకైనా ఉద్యోగులుగా మద్దతు ఇస్తాం. సమక్య శంఖారావం సభను విజయవంతం చేయడానికి ఉద్యోగులతో పాటు అన్ని వర్గాలు పాల్గొనాలి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ప్రజల ఆకాంక్షను సభలో బలంగా వినిపించాలి. - రవికుమార్, ట్రెజరీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలి సమైక్య శంఖారావం సభను విజయవంతం చేయడానికి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటాం. విభజన వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే దిశలో సాగుతున్న ఉద్యమంలో సమైక్య శంఖారావం సభ మైలురాయిగా నిలవాలి. - వెంకట్రామిరెడ్డి, సచివాలయ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ఏ పార్టీ ఉద్యమించినా మున్సిపల్ ఉద్యోగులు అండగా నిలుస్తారు: వైఎస్సార్సీపీ నిర్వహించతలపెట్టిన సమైక్య శంఖారావం సభకు అండగా నిలుస్తాం. స్వచ్ఛందంగా సభకు తరలి రావాలని పిలుపునిస్తున్నాం. రాష్ట్ర విభజన వల్ల ఇరు రాష్ట్రాల ఆదాయం గణనీయంగా తగ్గిపోతుంది. రెవెన్యూ రాబడి తగ్గితే తొలి ప్రతికూల ప్రభావం పట్టణీకరణ మీదే పడుతుంది. - కృష్ణమోహన్, మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ రాయలసీమ, ఉత్తరాంధ్ర గోడు వినిపించాలి తెలంగాణ కంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతాలు. ఈ ప్రాంతాలు అభివృద్ధి జరగకముందే విభజన జరిగితే.. ఉత్తరాంధ్ర, సీమ తీవ్రంగా నష్టపోతాయి. రాయలసీమ ఏడారిగా మారిపోతుంది. సమైక్య శంఖారావం సభలో.. రాయలసీమ, ఉత్తరాంధ్ర గోడు వినిపిస్తారని ఆశిస్తున్నాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రతిపాదనకు వైఎస్సార్ సీపీ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. - సి.హెచ్.చంద్రశేఖరరెడ్డి, ఆర్టీసీ ఈయూ అధ్యక్షుడు సమైక్య శంఖారావం సభకు మా అండ సమైక్యవాదాన్ని విపిపించే సమైక్య శంఖారావం సభ విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రతిపాదనకు సమైక్యవాద పార్టీ అయిన వైఎస్సార్సీపీ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. - పి.వి.రమణారెడ్డి, ఎన్ఎంయూ సమైక్యాంధ్ర స్టీరింగ్ కమిటీ నేత ప్రతి సమైక్యవాదీ సమైక్య శంఖారావంలో పాల్గొనాలి రాజకీయాలకు అతీతంగా ప్రతి సమైక్యవాదీ సమైక్య శంఖారావంలో పాల్గొనాలి. ప్రధానంగా హైదరాబాద్, తెలంగాణలో ఉన్న సమైక్యవాదులు పెద్ద సంఖ్యలో సభకు తరలిరావాలి. గతంలో విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన పార్టీలు కూడా వైఖరి మార్చుకొని రాష్ట్ర సమగ్రతను కాపాడాల్సిన సమయం ఇదే. - వి.లక్ష్మణరెడ్డి, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక కోఆర్డినేటర్ -
ఇంకా దారులు మూసుకుపోలేదు: లగడపాటి
ఢిల్లీ: సమైక్యరాష్ట్రం కోసం ఇంకా దారులు మూసుకుపోలేదని విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ ధీమా వ్యక్తం చేశారు. తమ రాజీనామాలు ఆమోదిస్తే యూపీఏకు బలం తగ్గిపోతుందని చెప్పారు. తమ ఒత్తిడి వల్లే ఇన్నాళ్లు తెలంగాణ ప్రక్రియ ఆగిపోయిందని ఆయన అన్నారు. దత్తపుత్రుడు దొరికిన తరువాత తమని పట్టించుకోకపోతే ఎలా? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తే కేంద్రపై ఒత్తిడి పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేస్తే పరిస్థితిలో మార్పు వస్తుందన్నారు. కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తే బిల్లు ఆగిపోతుందన్నారు. తమని కాదని కేంద్రం ముందుకు వెళ్లలేదని లగడపాటి చెప్పారు. ఇదిలా ఉండగా, తన రాజీమానా ఆమోదం కోసం లగడపాటి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నారు. ఆయన ఈరోజు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ను వ్యక్తిగతంగా కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయనకు స్పీకర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. రాజీనామాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని,లోక్‌సభ సెక్రటరీ జనరల్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తన రాజీనామా ఆమోదించకపోతే నిరసనకు దిగుతానని లగడపాటి హెచ్చరించినట్లు తెలిసింది. -
సమైక్యం కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్నది జగనే: ఎన్నారైలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చిత్తశుద్ధితో పోరాడుతున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఒక్కరేనని పలువురు ఎన్నారైలు ప్రశంసించారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని ఎన్నారైలు సమైక్యాంధ్రకు మద్దతుగా ఓర్లాండ్ నగరంలో గత ఆదివారం సమావేశమయ్యారు. సమైక్యాంధ్రకోసం జగన్మోహన్రెడ్డి కొనసాగిస్తున్న పోరాట పటిమ ప్రశంసనీయమని, నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు నిరాహారదీక్ష చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డా.ఎన్.వాసుదేవరెడ్డి, వై.సాయిప్రభాకర్, డా.కె.మోహన్‌రెడ్డి, డా.ఆదినారాయణ, డా.విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. -
ఫ్లోరిడాలో వైఎస్ జగన్‌కు మద్దతుగా సమావేశం
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న పోరాటానికి మద్దతుగా అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రవాసాంధ్రులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ రంగాల్లో పనిచేస్తున్న నిపుణులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ జగన్ చేసిన దీక్షను కొనియాడారు. విభజనకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ చేస్తోన్న కృషి, పోరాట పటిమను పలువురు ఎన్నారైలు ప్రశంసించారు. -
టీడీపీ ఎంపీలవి రాజీ‘డ్రామా’లే..
సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేశామని ప్రకటించుకున్న తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుల అసలు రంగు మరోసారి బట్టబయలైంది. టీడీపీ ఎంపీలు సమర్పించిన రాజీనామాలు ఉత్తుత్తి డ్రామానే అని తేలిపోయింది. కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు కూడా డ్రామాలేనన్న అనుమానాలకు బలం చేకూరింది. కొద్ది రోజులుగా రాజీనామాలపై హడావుడి చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలకు ఇప్పుడు ఆ రాజీనామాల ఆమోదం అగ్నిపరీక్షగా మారింది. సీమాంధ్రకు చెందిన లోక్‌సభ సభ్యుల రాజీనామా వ్యవహారంపై సోమవారం మధ్యాహ్నం లోక్‌సభ స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన బులెటిన్‌తో ఆయా ఎంపీల రాజీనామాల అసలు గుట్టు బయటపడింది. కొందరు ఎంపీలైతే అసలు రాజీనామాలే సమర్పించకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేశారన్న విషయం తేలిపోయింది. సీమాంధ్ర ప్రాంతం నుంచి రాజీనామాలు సమర్పించిన వారుగా.. పది మంది కాంగ్రెస్ (ఎస్.పి.వై.రెడ్డితో కలిపి), ఇద్దరు వైఎస్సార్ కాంగ్రెస్, ఒకే ఒక్క టీడీపీ ఎంపీ పేర్లు మాత్రమే స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన బులెటిన్‌లో ఉన్నాయి. వీరిలో సీమాంధ్రకు చెందిన ఏ ఒక్క మంత్రి పేరూ లేదు. అలాగే రాజీనామాలు సమర్పించిన ఎంపీల వైఖరిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజుల్లో తనను వ్యక్తిగతంగా కలవాలని స్పీకర్ ఆయా ఎంపీలకు సూచించినట్లు తెలుస్తోంది. ఇలా కలిసినప్పుడు వారు స్పీకర్ ముందు ఏం చెప్తారన్నది చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ ఇచ్చే తీర్పుననుసరించి.. రాజీనామాలపై కాంగ్రెస్ ఎంపీల్లోనూ ఎంతమంది చిత్తశుద్ధితో ఉన్నారు? ఎంతమంది డ్రామాలాడుతున్నారు? అన్న అంశం కూడా కొద్ది రోజుల్లోనే స్పష్టమయ్యే అవకాశముంది. అసలు రాజీనామాలే పంపలేదా..? రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేయాలన్న డిమాండ్ అన్ని వైపుల నుంచి బలంగా వినిపించింది. ఈ విషయంలో సీమాంధ్ర కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఎంపీల్లో అత్యధికులు మొదటి నుంచి హైడ్రామా నడిపిస్తూ వచ్చారు. టీడీపీ లోక్‌సభ సభ్యులు తమ పదవులకు చేసిన రాజీనామాలు బూటకమని అధికారికంగా తేలిపోయింది. సోమవారం లోక్‌సభ సచివాలయం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్న 13 మంది ఎంపీల్లో టీడీపీ నుంచి కొనకళ్ల నారాయణ (మచిలీపట్నం) ఒక్కరి పేరు మాత్రమే ఉండటం దీనికి సాక్ష్యం. జూలై 30న సీడబ్ల్యూసీ సమావేశం తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సీమాంధ్రలో నూతన రాజధాని ఏర్పాటు చేసుకునేందుకు నాలుగైదు లక్షల కోట్లు అవసరమవుతాయని తమ పార్టీ నేతలు అంచనా వేశారని, ఆ మొత్తాన్ని కేంద్రం భరించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆగస్టు రెండో తేదీన చంద్రబాబు నివాసంలోనే టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి గంట ముందు రాజ్యసభ సభ్యుడు వై.సత్యనారాయణచౌదరి కార్యాలయంలో అందుబాటులో ఉన్న పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా విభజించటాన్ని నిరసిస్తూ తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించారు. రాజ్యసభ సభ్యులు వై.సత్యనారాయణచౌదరి, సి.ఎం.రమేష్‌లతో పాటు లోక్‌సభ సభ్యులు కొనకళ్ల నారాయణరావు, నిమ్మల కిష్టప్ప, మోదుగుల వేణుగోపాలరెడ్డి ఉన్నారు. వీరంద రూ తమ రాజీనామా పత్రాలను ఆ తరువాత పార్టీ అధినేత చంద్రబాబుకు చూపించగా.. వాటిని లోక్‌సభ స్పీకర్‌కు, రాజ్యసభ చైర్మన్‌కు అందచేయాలని సూచించారు. ఆ మేరకు టీడీపీ ఎంపీలంతా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాము రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే వారిలో లోక్‌సభ సభ్యులు మోదుగుల, నిమ్మల కిష్టప్ప, ఎన్.శివప్రసాద్‌లు తమ రాజీనామా లేఖలను అసలు స్పీకర్ కార్యాలయానికి గానీ లేదా లోక్‌సభ సచివాలయానికి గానీ పంపలేదు. కొనకళ్ల మాత్రం రాజీనామా పత్రాన్ని స్పీకర్ కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపారు. తాజాగా స్పీకర్ కార్యాలయం నుంచి విడుదలైన బులెటిన్‌తో మిగిలిన ఇద్దరు ఎంపీలు రాజీనామా లేఖలే పంపలేదన్న విషయం బయటపడింది. ముందే బయటపెట్టిన హరికృష్ణ టీడీపీ ఎంపీల రాజీనామాలన్నీ ఉత్తుత్తి రాజీనామాలేనని అదే పార్టీకి చెందిన పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ మొద ట్లోనే బయటపెట్టారు. ఆగస్టు 5వ తేదీన పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగా ఆగస్టు 2వ తేదీనే రాజీనామా చేసినట్టు టీడీపీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ప్రకటించారు. అయినా పార్లమెంటు సమావేశాలకు హాజరై నానా హడావుడి చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఒక ఎంపీ అయితే విజయ్చౌక్లోని మీడియా పాయింట్ వద్ద చెర్నకోలతో శరీరంపై కొట్టుకున్నారు. రకరకాల వేషాలు ప్రదర్శించారు. ఈ ఎంపీల డ్రామా నడుస్తుండగానే రాజీనామా ఎందుకు ఆమోదం పొందడం లేదో తెలుకోవడానికి స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన హరికృష్ణకు టీడీపీ ఎంపీల రాజీనామాలన్నీ సరిగా లేవని, ఉత్తుత్తి రాజీనామాలని తెలిసి షాకయ్యారు. దాంతో ఆయన వెనువెంటనే మరో రాజీనామా లేఖను అక్కడికక్కడే అందజేసి ఆమోదించాలని స్పీకర్‌ను కోరి మరీ తన రాజీనామాను ఆమోదింపచేసుకున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా టీడీపీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎన్.శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప తాము రాజీనామా చేశామని చెప్పుకుంటూ ఇంతకాలం హైడ్రామా నడిపారు. దాంతో వీరు సమర్పించిన రాజీనామా సరైనపద్ధతిలో లేవని, అవి ఉత్తుత్తి రాజీనామాలేనని హరికృష్ణ మీడియా ముందు బయటపెట్టారు. అయినప్పటికీ వీరు కిమ్మనకుండా యథావిధిగా తమ డ్రామాను కొనసాగించారు. పార్లమెంటు సమావే శాలు ప్రారంభమైన రోజు నుంచి పూర్తయ్యే వరకు ఢిల్లీలోనే మకాం వేసి ప్రతి రోజూ మీడియా ముందు మాట్లాడుతూ రెండు నెలలుగా హడావుడి చేశారు. తాజాగా స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన బులెటిన్‌తో ఒక్క కొనకళ్ల నారాయణ రాజీనామా పత్రం మినహా మిగిలినవి ఏవీ సభాపతి వద్దకు చేరలేదని, లేదా అసలు అవి స్పీకర్ ఫార్మాట్లో లేవని బయటపడింది. ఇక టీడీపీ రాజ్యసభ సభ్యులదీ అదే దారి. పార్టీ రాజ్యసభ సభ్యులు సుచనాచౌదరి, సి.ఎం.రమేష్‌లు రాజీనామాలను చైర్మన్‌కు పంపించామని ఆర్భాటంగా ప్రకటనలు చేసినా ఇంతవరకు వాటిని ఆమోదించాలని ఏ రోజూ రాజ్యసభ చైర్మన్‌ను కలిసి కోరలేదు. కోరివుంటే హరికృష్ణ రాజీనామా ఆమోదించిన తరహాలోనే వీరి రాజీనామా కూడా ఆమోదం పొందేది. వీరు తమ రాజీనామా ఆమోదానికి ఏమాత్రం సిద్ధంగా లేరని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ కేంద్ర మంత్రుల హైడ్రామా... మరోవైపు కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీల తీరు కూడా ఇలాగే ఉంది. రాజీనామా డిమాండ్ వచ్చినప్పుడు పార్లమెంటులో బిల్లును అడ్డుకుంటామని, సీమాంధ్ర వాణిని వినిపిస్తామని చెప్తూ కొంత కాలం డ్రామా నడిపిన ఎంపీలు ఆ తర్వాత తాము రాజీనామా చేశామని ప్రకటించుకున్నారు. అలాగే మంత్రి పదవులకు రాజీనామా చేసి ఎంపీలుగా కొనసాగుతూ విభజనపై కేంద్రం ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటామని పలువురు సీమాంధ్ర కేంద్ర మంత్రులు ప్రకటనలు చేస్తూవచ్చారు. అసలు కేబినెట్ ముందుకు తెలంగాణ నోట్ రాకుండా చూస్తామని ప్రక టించారు. కాంగ్రెస్ అధిష్టానం విభజన అంశంపై ఆంటోనీ నేతృత్వంలో కమిటీ నియమిస్తే అది తమ ఒత్తిడి వల్లనేనని చెప్పుకొచ్చారు. ఆంటోనీ కమిటీ సభ్యులు రాష్ట్రంలో పర్యటించి అందరితో చర్చిస్తారని, ఆ కమిటీ నివేదిక ఇవ్వకండా తెలంగాణ నోట్ కేబినెట్ ముందుకు రాదని రకరకాల ప్రకటనలతో గంద రగోళపరిచారు. కానీ వారి మాటలకు జరుగుతున్న పరిణామాలకు పొంతనే లేకుండా పోయింది. కమిటీ రాష్ట్రంలో పర్యటించలేదు సరికదా ఢిల్లీలోనూ రాష్ట్రానికి చెందిన ఏ ముఖ్యమైన వర్గంతోనూ మాట్లాడిన పాపాన పోలేదు. కేవలం మొక్కుబడిగా కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు, ఇతర నేతలతో చర్చలకే పరిమితమైంది. ఆ కమిటీ నివేదిక ఇవ్వకుండానే తెలంగాణ నోట్ రూపొందడం, దాన్ని కేబినెట్ ఆమోదించడం కూడా చకచకా జరిగిపోయాయి. ఇవన్నీ కేంద్రమంత్రులకు తెలిసే జరిగినా తమకు ఏమీ తెలియకుండానే జరిగిపోయినట్లుగా మంత్రులు ఒకటి రెండు రోజులు హడావుడి చేశారు. వారివీ ఉత్తుత్తి రాజీనామాలే..! ఇక మరి కొందరు కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలు చేశామని బయటకు చెప్తున్నప్పటికీ అసలు ఆ ప్రయత్నమే చేయలేదు. రాజీనామాలు చేశామని ప్రకటించి ఆ మేరకు స్పీకర్‌కు లేఖలు అందించామని కొందరు చెప్తే.. పార్లమెంటు కార్యాలయంలో సమర్పించామని, ఫ్యాక్స్ ద్వారా పంపించామని మరికొందరు ప్రకటించారు. అయితే ఇవన్నీ ఎంతవరకు నిజమైన రాజీనామాలు, ఎన్ని ఉత్తుత్తి రాజీనామాలు అన్న అంశంపై ప్రతి ఒక్కరిలోనూ అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీలు, సీమాంధ్ర కేంద్రమంత్రులు చేస్తున్న ప్రకటనలకు, కేంద్రం తెలంగాణపై వేస్తున్న అడుగులకు పొంతన లేకపోవటంతో రాజీనామాలపై వారు చేస్తున్న ప్రకటనలు కూడా ఉత్తుత్తివేనన్న అభిప్రాయం ఇప్పటికే సమైక్యాంధ్ర ఉద్యమకారుల్లో పాతుకుపోయింది. తాజాగా సోమవారం స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన బులెటిన్‌తో ఆ విషయం మరింతగా స్పష్టమవుతోంది. స్వచ్ఛందంగానే చేశామని చెప్తారా..? ఇంతకాలం స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవటంతో రాజీనామాలు చేశామంటూ కొందరు ఎంపీలు హడావుడి చేశారు. ఇప్పుడు స్పీకర్ కార్యాలయం నుంచి పిలుపు రావటంతో.. వారు ఇరకాటంలో పడ్డారు. పలువురు ఎంపీలు దానినుంచి తప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. వ్యక్తిగతంగా స్పీకర్‌ను కలిసినా రాజీనామాలు ఆమోదం పొందకుండా ఉండేలా స్పష్టత ఇవ్వకుండా ఒత్తిళ్ల మేరకు రాజీనామా చేస్తున్నామన్న వివరణ ఇవ్వాలనే వ్యూహంలో ఎంపీలు ఉన్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. రాజీనామాలు ఇచ్చామని పైకి చెప్పుకోవటానికి వీలుగా రాజీనామాలు తిరస్కారం కాకుండా స్పీకర్ వద్దనే పెండింగ్‌లో ఉండేలా వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. పలువురు ఎంపీలు తమ రాజీనామాలపై స్పష్టత ఇవ్వటానికి స్పీకర్‌ను మరికొంత గడువు కోరాలన్న ఆలోచనలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. -
'నేను పదవిలో ఉన్నంతకాలం విభజన జరగదు' - ఉద్యోగులతో సీఎం కిరణ్
ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డితో బుధవారం మధ్యాహ్నం ఉద్యోగ సంఘాల నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమ్మె విరమించడానికి ఉద్యోగ సంఘాలు నిరాకరించారు. సమైక్య రాష్ట్రంపై ప్రభుత్వం హామీ ఇస్తే తప్ప సమ్మె విరమించేది లేదు అని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. పదవిలో ఉన్నంత కాలం రాష్ట్ర విభజన జరగదని ముఖ్యమంత్రి కిరణ్ తెలిపారని ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో అన్నారు. అన్ని ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపిన తర్వాతనే సమ్మె విరమణపై ఓ నిర్ణయం తీసుకుంటామని జేఏసీ నేతలు వెల్లడించారు. త్వరలోనే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. రాష్ట్రానికి తుఫాన్ ముప్పు ఉన్నందున్న ప్రభుత్వానికి సహకరించి..సమ్మెను విరమించాలని ముఖ్యమంత్రి కోరినట్టు సమాచారం. ముఖ్యమంత్రితో మూడు గంటలపాటు జరిగిన చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో చర్చలు అనంతరం జేఏసీ నేత అశోక్ బాబు మాట్లాడుతూ.. తుఫాన్ వస్తే అత్యవసర సేవల్లో పాల్గొంటాం. సమ్మె యధావిధిగా కొనసాగుతుంది. ఈ నెల 11, 12 తేదిన అన్ని ఉద్యోగ సంఘాల నేతలతో చర్చిస్తాం అని అన్నారు. -
నేను ముమ్మాటికీ సమైక్యవాదినే: కిషోర్ చంద్రదేవ్
విజయనగరం: తాను ముమ్మాటికీ సమైక్యవాదినేనని కేంద్రమంత్రి కిశోర్‌చంద్ర దేవ్ స్పష్టం చేశారు. విజయనగరం ప్రజలు కోరితే తాను రాజీనామాచేస్తానని చెప్పారు. విభజనను అడ్డుకోవడానికి తాను ప్రయత్నించినట్లు తెలిపారు. అయితే తనకు ఎవరూ సహకారం అందించలేదని చెప్పారు. సీమాంధ్ర నుంచి మొత్తం 9 మంది కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, పళ్ళం రాజు, కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, పురంధేశ్వరి, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, జేడీ శీలం, కిషోర్ చంద్రదేవ్ తలా ఒక మాట్లాడుతున్నారు. కాసేపు రాజీనామా అంటారు. మరికాసేపాగితే పార్లమెంటులో వాణి వినిపించాలంటారు. ఒకరు సోనియా తొందరపడొద్దన్నారని చెబితే, ఒకొకరు అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అంటారు. ఇప్పుడు కిషోర్ చంద్ర దేవ్ మాత్రం తాము ముమ్మాటికీ సమైక్యవాదినే అంటున్నారు. ఆయనేం చేస్తారో చూడాలి. -
విద్యుదుత్పత్తికి ఉద్యమ సెగ
సీలేరు , న్యూస్‌లైన్: విశాఖ జిల్లా సీలేరు, డొంకరాయి జల విద్యుత్ కేంద్రాలకు సమైక్యాంధ్ర ఉద్యమసెగ తగిలింది. దీంతో గంటపాటు విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. రాష్ట్ర విభజనకు నోట్‌తో సమైక్యవాదులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఇందులో భాగంగా సీలేరు కాంప్లెక్స్‌లోని జల విద్యుత్ కేంద్రాలను శనివారం ముట్టడించారు. వెంటనే విద్యుదుత్పత్తి నిలిపివేయాలంటూ నినాదాలతో హోరెత్తిం చారు. జెన్కో ఉద్యోగులు విధులు బహిష్కరించాలంటూ రెండు గంటలసేపు ఉద్యమకారులు బైఠాయించారు. ఆందోళనకారుల డిమాండ్‌ను మోతుగూడెం సీఈ కృష్ణయ్య దృష్టికి ఇంజినీరింగ్ సిబ్బంది తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు గంటపాటు విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. దీంతో సీలేరు నాలుగు యూనిట్లలో 240 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఇదే సమయంలో డొంకరాయి జలవిద్యుత్ కేంద్రాన్ని కూడా సుమారు వెయ్యి మంది ముట్టడించడంతో అక్కడ కూడా 25 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఈమేరకు గాజువాక, బొంగూరు సబ్స్టేషన్లకు 220 కేవీ విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో విద్యుత్ ప్లీడర్ర్లు మొరాయించి సీలేరులో లోవోల్టేజి సమస్య తలెత్తింది. కొన్ని ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న సీలేరు పోలీసులు విద్యుత్ కేంద్రాల వద్దకు చేరుకుని ఉద్యమకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. తాము శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నామని, సీమాంధ్ర అల్లకల్లోలం అవుతుంటే ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసి పంపడం సరికాదని, తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటలపాటు సమైక్యవాదులతో ఎస్ఐ కె.శ్రీనివాసరావు చర్చలు జరిపి వారిని ఒప్పించి బయటకు పంపారు -
ఎల్బీ స్టేడియంలో 19న సమైక్య శంఖారావం: వైఎస్ఆర్సీపీ
ఎల్బీ స్టేడియం వేదికగా సమైక్య శంఖారావం సభను నిర్వహించేందుకు అక్టోబరు 19న వైఎస్ఆర్ కాంగ్రెస్ సిద్ధమవుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సమైక్యరాష్ట్రం కోసం వైఎస్సార్సీపీ భారీ సభను ఈనెల 19న నిర్వహించనుంది. ఈనెల 19న హైదరాబాద్‌లో చేపట్టబోయే సమైక్య శంఖారావం సభకు అనుమతి ఇవ్వాలని డీజీపీ ప్రసాదరావుని కలిసిన వైఎస్ఆర్ సీపీ నేతలు కలిశారు. డీజీపీని కలిసిన తర్వాత మీడియాతో వైఎస్ఆర్ సీపీ నేతలు జూపూడి ప్రభాకర్ రావు, గట్టు రామచందర్ రావు, జనక్‌ప్రసాద్, శివకుమార్ మాట్లాడుతూ.. సభకు అనుమతివ్వాలని డీజీపీని కోరాం అని అన్నారు. స్థానిక డీసీపీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని డీజీపీ అన్నారని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. గత మూడేళ్లుగా ఎక్కడ పర్యటించినా..శాంతిభద్రతల సమస్యలు తలెత్తలేదు. శాంతియుత పంథాలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పయనిస్తోంది అని జూపూడి అన్నారు. రాజ్యాంగం ప్రకారం..విభజన, సమైక్యం ఎదైనా అభిప్రాయాన్ని..చెప్పుకునే హక్కు అందరికీ ఉంది అని గట్టు అన్నారు. -
సమైక్య దీక్ష
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య దీక్ష సాక్షి ప్రతినిధి, కర్నూలు: సమైక్య రాష్ట్రమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తోంది. పార్టీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ సమన్వయకర్తలు, నాయకులు చేపట్టిన 48 గంటల నివధిక దీక్ష గురువారం రెండో రోజుకు చేరుకుంది. దీక్షలోని నాయకులకు మద్దతు తెలియజేయడానికి అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అదేవిధంగా ఏపీఎన్జీఓలు, ప్రజాసంఘాలు, విద్యార్థులు, వైద్యులు, రైతు సంఘం నాయకులు సంఘీబావం తెలియజేస్తున్నారు. ఆళ్లగడ్డలో దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే శోభానాగిరెడ్డికి మద్దతుగా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహర దీక్ష కొనసాగింది. రుద్రవరంలో యువకులు రిలే నిరాహర దీక్ష చేపట్టారు. శిరివెళ్ల మండలంలోని యర్రగుంట్ల గ్రామంలో గిరిజనులు ర్యాలీ నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినదించారు. నంద్యాలలో కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణుల దీక్ష కొనసాగుతోంది. మద్దతుదారులతో పాటు పట్టణ ప్రముఖులు, -
పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి: మైసూరారెడ్డి
సాక్షి, కడప: ‘సమైక్యాంధ్ర ఆవశ్యకతపై సీఎం బాగానే మాట్లాడాడు. సంతోషమే! అయితే మాటలు చేతల్లో చూపాలి. అధిష్టానాన్ని ధిక్కరించేలా మాట్లాడినందుకు కాంగ్రెస్ ఏ క్షణమైనా సీఎంని తొలగించవచ్చు. ఆలోపు ఆయన అసెంబ్లీని సమావేశపరచాలి. సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలి. దానికి మేము మద్దతిస్తాం. అప్పుడు అన్నిపార్టీల రంగు బయటపడుతుంది. అన్నీ ఏకతాటిపైకి వచ్చి ‘సమైక్య తీర్మానం’ చేస్తే ఆ నోట్‌ను సోనియాగాంధీకి పంపిద్దాం. అప్పుడు విభజన నిర్ణయం మారుతుంది. సమైక్యాశయం నెరవేరుతుంది.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యులు ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య వేదిక’ పేరుతో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ అన్ని జిల్లాల జేఏసీల నేతలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉద్యోగులుగా తాము కొన్ని పరిమితులకు లోబడి, జీతాలు లేకున్నా 2నెలలుగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని ఏపీఎన్జీవో, ఆర్టీసీ, విద్యుత్, న్యాయవాదులు, ఉపాధ్యాయులు వివరించారు. అయితే తాము ఎన్ని నిరసనలు చేసినా కేంద్రం చులకనగా చూస్తోందని, ఓ రాజకీయపార్టీ అండగా ఉంటే ఉద్యమానికి ఫలితం ఉంటుందని చెప్పారు. ఉద్యమానికి జగన్ నాయకత్వం వహించాలి: జేఏసీలు తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ నాయకత్వం వహించారని, సీమాంధ్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యం వహించి ఉద్యమాన్ని నడపాలని జేఏసీల నేతలు విన్నవించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచిన శక్తి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని, ఆ తర్వాత అలాంటి వ్యక్తి జగన్ మాత్రమే అని వారు స్పష్టం చేశారు. దీనిపై మైసూరా స్పందించారు. ‘‘తెలంగాణ ఉద్యమం రాజకీయ అండతో సాగింది. కానీ ఇక్కడ ఏ రాజకీయపార్టీ అండ లేకుండా గొప్ప ఉద్యమం నడుస్తోంది. జీతాలను పణంగా పెట్టి ఉద్యమించిన ప్రతి ఒక్కరికీ పార్టీ తరఫున ధన్యవాదాలు. సమైక్య ప్రకటన వెలువడక ముందే మాపార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేశారు. అయితే కొందరు నేతలు.. ముందుగా రాజీనామాలు చేశారు. విభజన నిర్ణయం మీకు ముందే తెలుసు అంటూ అవివేకంగా మాట్లాడారు. విభజన నిర్ణయం వస్తోందని ప్రజలందరికీ తెలుసు. ఆ మాత్రం తెలీనివారు రాజకీయనేతలు ఎలా అయ్యారు? ప్రజల భవిష్యత్తుకు వీరేమి భరోసా ఇస్తారు? సమైక్యానికి అండగా విజయమ్మ దీక్ష చేశారు. జగన్ జైల్లోనే ఆమరణ దీక్ష చేశారు. దీనికి చాలా ఇబ్బందులు ఉంటాయి. గాంధీజీ తర్వాత జైల్లో దీక్ష చేసిన వ్యక్తి జగన్ మాత్రమే..’’ అని చెప్పారు. సమైక్యవాదాన్ని ముందుకు తీసుకెళతాం సమైక్య ఉద్యమానికి వైసీపీ అండగా ఉండి ముందుకు నడిపించాలని అందరూ కోరుతున్నారని, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా సమైక్యవాదాన్ని భుజాన వేసుకుని ముందుకు తీసుకెళ్లే బాధ్యత వైఎస్సార్‌సీపీదేనని మైసూరా హామీ ఇచ్చారు. తమతో పాటు సీపీఎం, ఎంఐఎం కూడా సమైక్యానికి అండగా ఉన్నాయని తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్‌లు కూడా తమ వైఖరి స్పష్టం చేయాలన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జేఏసీ నేతలు ఓ లేఖరాస్తే దానిపై మొదటి సంతకం జగన్‌తో పెట్టిస్తామని, అలాగే సీపీఎం, ఎంఐఎంతో పాటు చ ంద్రబాబు, బొత్స కూడా సంతకం చేసేలా జేఏసీ నేతలు ప్రయత్నించాలని సూచించారు. తెలంగాణపై కేబినెట్ నోట్ సిద్ధమయ్యేలోపే ఈ ప్రక్రియ పూర్తికావాలన్నారు. అప్పుడు ప్రజాభిప్రాయం మేరకు, ప్రజాప్రతినిధుల నిర్ణయం మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అనివార్య పరిస్థితి తలెత్తుతుంది, 60 రోజుల ఉద్యమ ఫలితం 6 గంటల్లోనే తేలిపోతుందని మైసూరా వివరించారు. ఉద్యమం బలోపేతానికి రైల్‌రోకోలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మూసివేత, సకలజనుల సమ్మె చేయాలని జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు. భవిష్యత్ కార్యాచ రణను ఎలా రూపొందిస్తే అలా నడుచుకోవడానికి వైఎస్సార్సీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని మైసూరా తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు రఘురామిరెడ్డి, రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాధ్‌రెడ్డి, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అలీ, ఏపీఎన్జీవోల సంఘం జిల్లా నేత గోపాల్‌రెడ్డి, గెజిటెడ్ అధికారుల సంఘం నాయకుడు రాంమూర్తినాయుడు, ఇతర జేఏసీల నేతలు పాల్గొన్నారు. -
సమ్మె విరమించండి ఉపాధ్యాయ సంఘాలకు శైలజానాథ్ వినతి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమైక్యాంధ్ర సమ్మెను విరమించాలని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ ఉపాధ్యాయ సంఘాలను కోరారు. సమ్మెను విరమించినంత మాత్రాన ఉద్యమం ఆగిపోతుందనుకోవద్దని చెప్పారు. ఆయన ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. 60 రోజులుగా చేస్తున్న సమ్మెవల్ల సీమాంధ్రలో జనజీవనం స్తంభించిపోయిందన్నారు. విభజనను వ్యతిరేకిస్తూ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలంటూ వస్తున్న డిమాండ్లను ఆయన తోసిపుచ్చారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకునే వరకూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వాస్తవాలు మాట్లాడారే తప్ప కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించలేదన్నారు. ఆయనకు కొత్త పార్టీ పెట్టే ఉద్దేశం కూడా లేదన్నారు. సీఎంను కొందరు నేతలు ఎందుకు తప్పుపడుతున్నారో అర్థమవడం లేదన్నారు. విభజన విషయంలో జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై అక్టోబర్ 3న సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని మంత్రి చెప్పారు. -
అంతా అధిష్టానుసారమే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ పైకి ప్రకటనలు చేస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, నేతలు చివరకు అధిష్టానం బాటలోనే నడవాలన్న అభిప్రాయానికి వస్తున్నారు. శుక్రవారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల అనంతరం కాంగ్రెస్‌లో నేతల మధ్య చర్చలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఈ విషయమై శనివారం రోజంతా వరుస భేటీలు కొనసాగాయి. ఈ భేటీలన్నింటిలోనూ నేతల మాటతీరు వేర్వేరుగా ధ్వనించినా, అంతిమంగా అధిష్టానం బాటలోనే వెళ్లాలన్న అభిప్రాయానికి అందరూ వచ్చారు. విభజన అనివార్యంగా కనబడుతున్న దశలో కాంగ్రెస్‌లో కొందరు నేతలు తామే సీమాంధ్ర చాంపియన్లం కావాలంటూ ప్రయత్నాలు కూడా ప్రారంభించారు! ‘‘విభజన నిర్ణయంతో అధిష్టానం తప్పు చేసింది. అయితే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడతామని మనమంతా ముందే చెప్పినందున దాన్ని శిరసావహించక తప్పదు. విభజనతోవచ్చే సమస్యలకు పరిష్కారాలు చూపమందాం. అసెంబ్లీలో, పార్లమెంటులో బిల్లు పెట్టడానికి ముందే కేంద్ర మంత్రుల బృందాన్ని రాష్ట్రానికి పంపాలని కోరదాం. అప్పుడు ప్రజల్లో నమ్మకం కలిగించిన వాళ్లమవుతాం. ఉద్యమం తగ్గుముఖం పడితే మనకూ వెసులుబాటు కలుగుతుంది’’ అన్న ఆలోచనకు నేతలు వచ్చారు. శనివారం వివిధ స్థాయిల్లో జరిగిన మంత్రుల సమావేశాలు ఇదే సారాంశంతో ముగిశాయి. కిరణ్ తీరుతో పార్టీకి నష్టమన్న బొత్స! సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అధిష్టానం బాటలో వెళ్లాలన్న నిర్ణయానికి వస్తున్నా... వారిలో పలువురు తమకు తామే సమైక్యాంధ్రకు చాంపియన్లుగా నిలవాలని ప్రయత్నిస్తున్నారు. అందుకోసం పరస్పరం తలపడుతున్నారు! ఆ దిశగా వారు ఎత్తులు పై ఎత్తులతో కదులుతున్నట్టు శనివారం నాటి పరిణామాలు తెలియజేస్తున్నాయి. శుక్రవారం విలేకరుల సమావేశంలో కిరణ్ చేసిన వ్యాఖ్యలు సమైక్య చాంపియన్‌గా నిలిచే ప్రయత్నాలేనని భావించిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ... సమైక్యం కోసం తాను మంత్రి పదవికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టు మీడియాకు లీకులిచ్చారు. దాంతో శనివారం ఉదయం నుంచీ కాంగ్రెస్‌లో వాతావరణం వేడెక్కింది. ఉదయం సీఎం నివాసంలో కిరణ్‌తో బొత్స, మంత్రి కొండ్రు మురళి, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి భేటీ అయ్యారు. విభజన దిశగా అధిష్టానం కదలికలు, పార్టీ ముఖ్యనేతలుగా తాము మంత్రులు, ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వైఖరి తదితరాలపై చర్చ జరిగింది. మీడియాతో కిరణ్ వ్యాఖ్యలను బొత్స తప్పుబట్టినట్టు సమాచారం! అలా బహిరంగంగా మాట్లాడడం పార్టీకి నష్టం కలిగించేదిగా ఉందని ఆయనన్నారు. వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికి ఇలా చేయడం సరికాదంటూ ఆక్షేపించారు! ఇటీవల తాను ఢిల్లీలో పార్టీ పెద్దలను కలసినప్పుడు చర్చించిన అంశాలను కూడా బొత్స వివరించారు. ‘‘ఎన్ని చెప్పినా వారు సమైక్యం తప్ప ఇంకేమైనా మాట్లాడమంటున్నారు. ఆంటోనీ కమిటీ ద్వారా సమస్యలకు పరిష్కారం చూపుతారనుకుంటే ఆ పరిస్థితీ కన్పించడం లేదు. కేబినెట్ కు తెలంగాణ నోట్ వచ్చాక ఇక దాన్ని ఆపడం కష్టం. అసెంబ్లీ తీర్మానానికి కూడా అవకాశమిచ్చేలా లేరు. అసెంబ్లీకి వస్తే అడ్డుకుందామని చూసినా ఫలితం ఉండదు. కేవలం అభిప్రాయం కోసం మాత్రమే అసెంబ్లీకి పంపిస్తారేమో. చర్చలో మనమేం చెప్పినా వాటిని ఆమోదించాల్సిన అవసరం కేంద్రానికి లేదు. కాబట్టి ఈ తరుణంలో విభజన అనివార్యం. అప్పటిదాకా ఎదురుచూసే కన్నా ముందే రాజీనామా చేస్తే మన చేతుల మీదుగా విభజన జరిగిందన్న అపవాదుకైనా దూరంగా ఉండవచ్చు’’ అని బొత్స చెప్పినట్టు తెలుస్తోంది. కిరణ్ మాత్రం రాజీనామాలు చేస్తే మన అభిప్రాయాన్ని కూడా చెప్పలేమంటూ వ్యతిరేకించారు. తెలంగాణ అంశం అభిప్రాయం కోసమైనా అసెంబ్లీకి వస్తుంది గనుక అప్పుడు మన అభిప్రాయాలు చెప్పుకుందామని, సీమాంధ్ర సమస్యలకు పరిష్కారాల కోసం గట్టిగా పట్టుబడదామని అన్నట్టు తెలిసింది. అధిష్టానం ముందుకే వెళ్తున్నందున కిరణ్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఢిల్లీ వెళ్లి సోనియాను కలుద్దామని జేసీ ప్రతిపాదించగా, ఆమె అపాయింట్మెంటే ఇవ్వడం లేదు గనుక వెళ్లినా ఫలిత ముండదని ఇతరులన్నారు. రాజీనామాలు కాకుండా బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగేదాకా వేచి చూడాలని అభిప్రాయానికి వచ్చారు. త్వరలో కిరణ్ నేతృత్వంలో సీమాంధ్ర మంత్రులందరితో విస్తృతస్థాయి సమావేశం జరిపి దీనిపై తుది నిర్ణయానికి రావాలని నిర్ణయించారు. బొత్స, ఆనం, రఘువీరా భేటీ కిరణ్ ‘సమైక్య చాంపియన్’ యత్నాలకు గండి కొట్టి ఆ క్రెడిట్‌ను దక్కించుకోజూస్తున్న బొత్స శనివారం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చాంబర్లో మంత్రులు రఘువీరారెడ్డి, బాలరాజు, కొండ్రులతో మంతనాలు జరిపారు. బొత్స తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆనంకు తెలిపారు. కానీ దానివల్ల ఫలితముండదని ఆనం అన్నారు. అధిష్టానాన్ని కించపరిచేలా కిరణ్ మాట్లాడటం సమంజసంగా లేదని బొత్స, ఆనం, రఘువీరా అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో కిరణ్ ఫ్లెక్సీలు వెలుస్తున్న వైనమూ చర్చకు వచ్చింది. కిరణ్ తీరుపై మంత్రులు తీవ్రంగా మండిపడినట్టు తెలిసింది. ‘‘తనొక్కడే చాంపియన్ అనిపించుకోజూస్తున్నారే తప్ప పార్టీలోని ఇతర నేతలను విస్మరించారు. ఇది నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదు’’ అన్నారు. బొత్సకు అధిష్టానమే చెప్పింది: ఆనం విభజనపై అసెంబ్లీలో అభిప్రాయం తెలియజేయడమే తప్ప ఓటింగ్ ఉండకపోవచ్చని ఆనం సచివాలయంలో తనను కలిసిన విలేకరులతో అన్నారు. సీమాంధ్రకు సీఎం చాంపియన్ అయితే సీమాంధ్ర మంత్రులంతా కూడా చాంపియన్లేనన్నారు. ‘‘రెండు పదవుల్లో కొనసాగరాదని బొత్సకు అధిష్టానం చెప్పింది. పీసీసీ, మంత్రి పదవుల్లో దేన్ని వదులుకోవాలో ఆయన త్వరలో నిర్ణయించుకుంటారు’’ అని తెలిపారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి చట్ట, న్యాయ పరిధిలోనే బెయిల్ వచ్చింది తప్ప దానితో కాంగ్రెస్‌కు ఎలాంటి సబంధమూ లేదన్నారు. -
సమ్మెలో ఆర్అండ్బీ ఇంజనీర్లు
కర్నూలు(అర్బన్),న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లు ప్రత్యక్షంగా సమ్మెలోకి వెళ్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ సి. సుదర్శన్‌రెడ్డిని కలిసి సమ్మె నోటీసును ఆర్అండ్బీ ఎస్ఈ వై. రాజీవ్‌రెడ్డి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు ఆర్అండ్బీ మినిస్ట్రీయల్ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఇంజనీర్లు సైతం అర్ధరాత్రి నుంచి ప్రత్యక్షంగా సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. ఆర్అండ్బీ ఎస్ఈతో పాటు కర్నూలు, నంద్యాల, ఆదోని, ఆర్డీసీ ఈఈలు, డీఈఈ, జేఈ, ఏఈలు అందరూ కలిపి 40 మంది సమ్మెలో పాల్గొంటున్నట్లు వివరించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో కర్నూలు ఈఈ ఉమా మహేశ్వరరావు, డీఈఈ శ్రీధర్‌రెడ్డి, ఆర్అండ్బీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రసాదరెడ్డి తదితరులు ఉన్నారు. విభజనతో సీమకు తీవ్ర నష్టం - ఆర్అండ్బీ ఎస్ఈ రాజీవ్‌రెడ్డి కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమ తీవ్రంగా నష్టపోతుందని రోడ్లు భవనాల శాఖ ఎస్ఈ వై. రాజీవ్‌రెడ్డి తెలిపారు. స్థానిక ఎస్ఈ కార్యాలయ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన ఆర్అండ్బీ ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల సమష్టి కృషితో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, రాష్ట్ర రాజధానిని వదలిపెట్టే ప్రసక్తేలేదన్నారు. రాష్ట్ర విభజనతో తాగు, సాగునీటికి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. పాలక ప్రభుత్వాలు కూడా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నడచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ భారీగా తరలివచ్చి ఈ నెల 29వ తేదీన కర్నూలులో జరగనున్న ప్రజాగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డిప్యూటీ ఎస్ఈ వెంకటరమణారెడ్డి, ఈఈలు తులసీనాయక్, చెన్నకేశవులు, ఆర్డీసీ ఈఈ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
సమైక్య రాష్ట్ర పరిరక్షణ ఉద్యమం నేటికి 50 రోజులు పూర్తి
సాక్షి, రాజమండ్రి : సమైక్య రాష్ట్ర పరిరక్షణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి బుధవారం నాటికి 50 రోజులు పూర్తవుతోంది. అయినా ఎక్కడా ఉద్యమ సెగ తగ్గలేదు. జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాలను ఉద్ధృతం చేశారు. రాజమండ్రిలో ఇంటర్ బోర్డు పరిధిలోని అధ్యాపకులు గూడ్సు గేటు సెంటర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. సమ్మెలోకి మంగళవారం ప్రభుత్వ ఎయిడెడ్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు చేరినట్టు ఆ వర్గాలు ప్రకటించాయి. యూటీఎఫ్ నగర శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మెయిన్‌రోడ్డులో ప్రదర్శన చేశారు. మోరంపూడిలో యూటీఎఫ్ దీక్షలను ఎంపీడీఓ ఎస్. సుభాషిణి ప్రారంభించారు. మోరంపూడి వద్ద జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించి నోట్లో పాల పీకలతో నిరసన తెలిపారు. కాకినాడలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్ష శిబిరంలో కె.గంగవరం మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, ఏపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు ప్రదర్శనలు చేశారు. ముమ్మిడివరంలో 216 జాతీయ రహదారిపై విద్యార్థులకు టీచర్లు పాఠాలు చెప్పారు. మామిడికుదురులో 216 జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు రోడ్డుపై డప్పులు వాయించారు. ఏలేశ్వరంలో పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టారు. రాష్ట్రాన్ని విభజించ వద్దంటూ రాసిన కార్డులను సోనియాగాంధీకి పోస్టు చేశారు. ముందుగా బాలాజీ చౌక్ వద్ద కార్డులు ప్రదర్శిస్తూ రాస్తారోకో చేశారు. మండపేట కలువపువ్వు సెంటర్లో ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించారు. రావులపాలెంలో ప్రైవేట్ పాఠశాలల బస్సులతో ర్యాలీ చేసి కళా వెంకటరావు సెంటర్లో బస్సుల హారం నిర్వహించారు. విద్యార్థుల సమైక్య రాగం విద్యార్థులు ఉద్యమానికి కొత్త రూపు తెస్తున్నారు. రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇన్నీసుపేటలో మానవహారంగా ఏర్పడ్డారు. కాకినాడ అచ్చంపేట సెంటర్లో ఏయూ క్యాంపస్ విద్యార్థులు రాస్తారోకో చేశారు. సర్పవరం పోలీస్‌స్టేషన్ ఎదురుగా వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. భారతమాత వేషాలు వేసి రాష్ట్రం విడిపోకూడదనే సందేశాలు ఇస్తూ నృత్య ప్రదర్శనలు చేశారు. కాకినాడ - యానాం రోడ్డులో తూరంగి వద్ద ఎంఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. కోనసీమ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కోనసీమలో ప్రైవేట్ విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. రామచంద్రపురంలో విద్యార్థులు ర్యాలీ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల బంద్ రాజమండ్రిలో ప్రైవేట్ నర్సింగ్ హోంలు బంద్ పాటించాయి. డాక్టర్లు, సిబ్బంది మెయిన్‌రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. కాకినాడలో ప్రైవేట్ నర్సింగ్ హోంలు బంద్ చేసి, డాక్టర్లు, సిబ్బంది ప్రదర్శన చేశారు. అమలాపురంలో కూడా నర్సింగ్ హోంలు మూసివేశారు. కొత్తపేట పాత బస్టాండు సెంటర్లో ప్రైవేట్ వైద్యులు రోడ్డుపై సేవలు అందించారు. ఏలేశ్వరంలో వైద్య సిబ్బంది భారతదేశ పటం ఆకారంలో నిలబడి సమైక్య నినాదాలు చేశారు. కాకినాడలో సమైక్య సెగలు కాకినాడ మెయిన్‌రోడ్డులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టారు. మహిళలు కూడా నిరసన గళం వినిపించారు. 300 అడుగుల జాతీయజెండాను ప్రదర్శించారు. ఐసీడీఎస్ పీడీ కార్యాలయం వద్ద పిఠాపురం, రాజమండ్రి, అమలాపురం ప్రాజెక్టుల పరిధిలోని సిబ్బంది దీక్షలు చేపట్టారు. డిప్యూటీ కలెక్టర్లు నగరంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద జేఏసీ దీక్షల్లో రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు మెడలో ఆంధ్రప్రదేశ్ పటాలు వేసుకుని నిరసన తెలిపారు. జోర్గాన్ మ్యూజిక్ ఇనిస్టిట్యూట్ వద్ద గిటార్లు వాయిస్తూ ప్రదర్శన చేపట్టారు. రమణయ్యపేటలో వాణిజ్య పన్నుల కార్యాలయం వద్ద ఉద్యోగులు రోడ్లు తుడిచి, రాస్తారోకో నిర్వహించారు. కోనసీమలో.. అమలాపురంలో ఆర్టీసీ కార్మికులు, వైద్యులు ర్యాలీ నిర్వహించారు. గడియారం స్తంభం సెంటర్లో కొనసాగుతున్న 46వ రోజు రిలే దీక్షల్లో తెలగ, బలిజ కాపు కులాల సంఘం డివిజన్ అధ్యక్షుడు కలువకొలను తాతాజీ ఆధ్వర్యంలో 220 మంది రిలే దీక్షలు చేపట్టారు. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి హైస్కూల్ గ్రౌండ్లో మండలంలోని ప్రభుత్వ శాఖల జేఏసీ అధికారులు సభ నిర్వహించారు. ఉద్యమం ఉద్ధృతికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఓడలరేవు ఓఎన్జీసీ ప్లాంటు వద్ద వాహనాలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. తాగునీటి ట్యాంకర్లను మాత్రమే అనుమతించారు. ముమ్మిడివరంలో రైతులు రాస్తారోకో చేశారు. ముమ్మిడివరం నుంచి మురమళ్ల వరకూ ఏపీఎన్జీవోల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన డి.వెంకటేశ్వరరావు ఉభయ గోదావరి జిల్లాల్లో చేపట్ట తలపెట్టిన సైకిల్‌యాత్ర మంగళవారం రాజోలు చేరుకుంది. కొత్తపేటలో జేఏసీ ఆధ్వర్యంలో మెయిన్‌రోడ్డుపై మానవహారంగా ఏర్పడ్డారు. అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో రాష్ట్ర విభజనపై ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఓటింగ్ నిర్వహించారు. సమైక్య సింహగర్జన జగ్గంపేటలో మంత్రి తోట నరసింహం ఆధ్వర్యంలో సుమారు అయిదు వేల మందితో సమైక్య సింహగర్జన నిర్వహించారు. ముందుగా పట్టణంలో ర్యాలీ చేశారు. 500 మీటర్ల జాతీయ జెండాను ఊరేగించారు. ద్రాక్షారామలో జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టారు. రంపచోడవరం అంబేద్కర్ సెంటర్లో పాస్టర్స్ ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టారు. సమైక్య గణపతి ప్రసాదం పంపిణీ రాజమండ్రి పుష్కరాల రేవు వద్ద ఏర్పాటు చేసిన సమైక్య గణపతి నవరాత్రి ఉత్సవాల వద్ద ఉంచిన 7200 కిలోల లడ్డూను భక్తులకు సమైక్యాంధ్ర నినాదాలతో పంపిణీ చేశారు. ఏపీఎన్జీవోలు రిక్షాలు తొక్కి నిరసన తెలిపారు. ఎన్జీవో హోం నుంచి పుష్కరాల రేవు, మెయిన్‌రోడ్డు మీదుగా ర్యాలీ చేశారు. మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద వంటావార్పు చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 49వ రోజు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కడియంలో ఏపీఎన్జీవోలు మోటారు బైక్ ర్యాలీ చేసి వేమగిరి వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మంత్రుల సోనియా భజన పెద్దాపురంలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య వాదులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, కేంద్రమంత్రుల మాస్క్‌లు ధరించి తహసీల్దారు కార్యాలయం వద్ద రోడ్ షో నిర్వహించారు. వాయిద్య పరికరాలతో భజన చేసి మంత్రులు సోనియా భజన చేస్తున్నారంటూ విమర్శించారు. సామర్లకోటలో ఫొటో స్టూడియోల నిర్వాహకులు బైక్ ర్యాలీ చేసి జేఏసీ శిబిరంలో రిలే దీక్షల్లో పాల్గొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం వద్ద, గొల్ల అప్పారావు సెంటర్లో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఏలేశ్వరంలో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో రోడ్డుపై ఇస్త్రీ చేస్తూ నిరసన తెలిపారు. -
సిడబ్ల్యూసి నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం:సీమాంధ్ర మంత్రులు
హైదరాబాద్: తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని సీమాంధ్ర మంత్రులు స్పష్టం చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో సమైక్యాంధ్ర మంత్రుల సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి 9 మంది మంత్రులు హాజరయ్యారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తాము సిడబ్ల్యూసి నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు తెలిపారు. తమని రాజీనామాలు చేయమనడం సమైక్యవాదులకు తగదన్నారు. రెండు మూడు రోజులలో మళ్లీ సమావేశమవుతామని చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామన్నారు. విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి రాజీనామాలపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
విభజన ఆపమని షిండేకు విజయమ్మ లేఖ
హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియను వెంటనే ఆపాలని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ లేఖ రాశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆ లేఖలో ఆమె కోరారు. వాస్తవాలను మరుగునపరుస్తున్నారని పేర్కొన్నారు. సీపీఎం మినహా మిగిలిన పార్టీలు తెలంగాణకు సానుకూలమని ఎలా చెప్తారని ఆమె ప్రశ్నించారు. విభజనకు ఐదుపార్టీలు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, సీపీఐ తెలంగాణకు అనుకూలం అని వివరించారు. వైఎస్సార్సీపీ, సీపీఎం, ఎంఐఎం విభజనను వ్యతిరేకిస్తున్నాయని స్పష్టం చేశారు. ఉన్నత పదవిలో ఉన్న మీరు వాస్తవాలను ఎందుకు మరుగునపరుస్తున్నారని విజయమ్మ షిండేను ప్రశ్నించారు. 2012 డిసెంబర్ 28నాటి అఖిలపక్ష సమావేశం నుంచి తాము విభజనను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రధానికి రాసిన లేఖను కూడా ఆ లేఖకు జతపరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక ప్రాంతానికి న్యాయం చేయమంటే మరో ప్రాంతానికి అన్యాయం చేయమని కాదుకదా? అని ప్రశ్నించారు. ఓట్లు, సీట్ల కోసం ప్రాథమిక న్యాయసూత్రాలను కాంగ్రెస్ విస్మరించిందన్నారు. విభజన నిర్ణయంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాలు అట్టుడుకుతున్నాయని తెలియజేశారు. అలాంటప్పుడు ఏకాభిప్రాయం కుదిరిందని కాంగ్రెస్ ఎలా చెప్పగలదు? అని విజయమ్మ ప్రశ్నించారు. రాష్ట్రం కలిసున్నప్పుడు మహారాష్ట్ర, కర్ణాటకతో నీటిసమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్రం విడిపోతే పోలవరం ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? అని అడిగారు. రాష్ట్ర ఆదాయంలో 50 శాతం హైదరాబాద్ నుంచే వస్తుంది. విడిపోతే ఉద్యోగాల కోసం సీమాంధ్రులు ఎక్కడికెళ్లాలి? అని ప్రశ్నించారు. 43 రోజులుగా సీమాంధ్రలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ప్రజల జీవితాలతో కాంగ్రెస్ పార్టీ చెలగాటమాడుతోందని ఆ లేఖలో విజయమ్మ విమర్శించారు. -
నేడు జిల్లాకు షర్మిల యాత్ర
సాక్షి ప్రతినిధి, విజయవాడ : సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ‘సమైక్య శంఖారావం’ బస్‌యాత్ర బుధవారం జిల్లాలోకి ప్రవేశించనుంది. రెండు రోజులపాటు సాగే ఈ యాత్ర దివిసీమ గుండె తట్టి కొల్లేరు వాసుల అభిమాన అలల నడుమ పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుతుంది. అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, కైకలూరు నియోజకవర్గాల గుండా ఈ యాత్ర సాగుతుంది. ఈ నెల 2న ఇడుపులపాయలోని వైఎస్ సమాధిని దర్శించి నివాళులర్పించిన షర్మిల అదే రోజున తిరుపతి నుంచి సమైక్య శంఖం పూరించిన విషయం విదితమే. చిత్తూరు, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో యాత్రను పూర్తిచేసుకొని బుధవారం సాయంత్రం 4గంటల సమయంలో రేపల్లె నుంచి పెనుమూడి-పులిగడ్డ వారధి మీదుగా ఆమె కృష్ణా జిల్లా అవనిగడ్డకు చేరుకుంటారు. అవనిగడ్డ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో రాత్రి జరిగే బహిరంగ సభలో షర్మిల మాట్లాడతారు. ఆ రాత్రికి అవనిగడ్డలోనే బస చేసి గురువారం ఉదయం అక్కడ నుంచి చల్లపల్లి, కొడాలి, పామర్రు, అడ్డాడ, గుడ్లవల్లేరు, విన్నకోట, ముదినేపల్లి మీదుగా కైకలూరు చేరుకుంటారు. కైకలూరులో సుమారు 11గంటల సమయంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తారు. ఏలూరు వైపునకు ఆమె బస్‌యాత్ర సాగనుంది. అవనిగడ్డ బహిరంగసభ ఏర్పాట్లు పరిశీలన అవనిగడ్డ బస్టాండ్ సెంటర్లో జరిగే బహిరంగ సభ ప్రాంతాన్ని, ఏర్పాట్లను వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, బందరు, గుడివాడ తాజా మాజీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్, పార్టీ నేతలు గుడివాక శివరావు, యాసం చిట్టిబాబు, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు మంగళవారం పరిశీలించారు. షర్మిల బస్ పైనుంచే ప్రసంగించే ఏర్పాటు ఉన్నందున స్థానికంగా వేదిక అవసరంలేదని వారు గుర్తించారు. జనం పెద్ద ఎత్తున తరలివస్తే.. సభ జరిగే ప్రాంతం సరిపోతుందా లేదా అనేది వారు చర్చించారు. కాంగ్రెస్, టీడీపీల్లో గుబులు.. మరోప్రజాప్రస్థానం పాదయాత్రతో అటు పార్టీశ్రేణుల్లోను, ఇటు ప్రజల్లోను ఉత్సాహం నింపిన షర్మిల సమైక్య శంఖారావంతో ఇప్పుడు జిల్లాకు రానుండడం.. కాంగ్రెస్, టీడీపీలకు కలవరపాటుగా మారింది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్సీపీకి ప్రజలు మరింత దగ్గర కావడంతో పాలక, ప్రధాన ప్రతిపక్షాలకు గుబులు రేగుతోంది. ఇప్పటికే తెలంగాణ ఏర్పాటుకు అనుకూల నిర్ణయంతో జిల్లాలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి తలెత్తింది. తెలంగాణాకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ పరిస్థితి కూడా దాదాపు అదే విధంగా ఉంది. లేఖ వెనక్కి తీసుకుంటానని చెప్పలేక, సమైక్యతకే కట్టుబడినట్టు తేల్చలేక చంద్రబాబు సంకటస్థితిని ఎదుర్కొంటుండగా.. ఆయనపై ప్రజలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. జిల్లాలో ఐదు రోజులుగా ఆయన నిర్వహిస్తున్న యాత్రకు జనం నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో నిరుత్సాహం అలముకుంది. రోజుల తరబడి ఉద్యమిస్తున్న ఉద్యోగులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులంతా.. వైఎస్సార్సీపీ తీసుకున్న సమైక్య నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు. విజయవంతం చేయండి సాక్షి, విజయవాడ : షర్మిల సమైక్యశంఖారావం బస్సుయాత్రను జిల్లాలో విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, ప్రోగ్రాం కమిటీ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ కోరారు. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు అవనిగడ్డ బస్టాండ్ సెంటర్, గురువారం ఉదయం 11గంటల సమయంలో కైకలూరు బహిరంగ సభల్లో ఆమె ప్రసంగిస్తారని తెలిపారు. -
3 నెలల్లో ‘విభజన’!
-
3 నెలల్లో ‘విభజన’!, ప్రక్రియ పూర్తవుతుందన్న ఢిల్లీ వర్గాలు
రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలంటూ ఆంధ్ర, రాయలసీమల్లో గత 36 రోజులుగా ఉవ్వెత్తున ఉద్యమాలు, ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ.. వాటిని ఏ మాత్రం పట్టించుకోని కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన ప్రక్రియను మౌనంగా స్థిరంగా ముందుకు తీసుకెళుతున్నాయి. ‘విభజన ప్రక్రియను ఇక మరింత జాప్యం లేకుండా వేగవంతం చేయటానికి మేం కృషిచేస్తున్నాం. మూడు నెలల్లోగా మొత్తం సిద్ధం చేయాలి. ఈ ఏడాది చివరికల్లా (ఆంధ్రప్రదేశ్‌లో) రెండు ప్రభుత్వాలు ఏర్పాటు కావటం మా లక్ష్యం. అలా జరగనిపక్షంలో.. శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమైనట్లయితే.. ప్రభుత్వాన్ని సుప్తచేతనావస్థలో ఉంచుతాం. కానీ.. ప్రక్రియ మాత్రం ఆగదు’ అని కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు స్పష్టంచేశాయి. తెలంగాణ ఏర్పాటుపై కేబినెట్ నోట్ రూపకల్పన మొదలుపెట్టిన కేంద్ర హోంశాఖ.. ఆ నోట్‌కు సంబంధించిన ఒక కాపీని న్యాయశాఖకు పంపినట్లు సమాచారం. హైదరాబాద్‌కు కేంద్ర పాలిత ప్రాంతం హోదా వంటి ఊహాగానాలకు ఈ నోట్లో తెరదించినట్లు చెప్తున్నారు. ఢిల్లీలో టైమ్ వేస్ట్ చేసుకోవద్దు... ఇదిలావుంటే.. తెలంగాణ ఏర్పాటు జరిగి తీరుతుందని ఆంటోనీ కమిటీలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులతో పాటు.. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే, ఆర్థికమంత్రి పి.చిదంబరం, పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌లు పార్టీ సీమాంధ్ర నేతలకు నిష్కర్షగా స్పష్టంచేశారు. గత రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో పాటు, సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు.. పదేపదే ఢిల్లీకి రావటం మానుకుని సీమాంధ్రలో పార్టీని బలోపేతం చేయటంపై దృష్టిపెట్టాలని అధిష్టానం పెద్దలు నిర్దేశించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ‘ఈ అంశంపై సమయాన్ని, శక్తిని వృథా చేయవద్దని మేం వారికి చెప్పాం. తెలంగాణ ఏర్పాటు ఒక వాస్తవం. అధినేత్రి దీనిపై వెనక్కు వెళ్లటం జరగదు. రెండో విషయం.. నదీ జలాల పంపిణీ, విద్యుత్ అవసరాలు తదితర వివాదాస్పద అంశాలను పార్టీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తాయి. నిజానికి.. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ, న్యాయశాఖలకు నిర్దేశం చేయటం జరిగింది’ అని కాంగ్రెస్‌లో ఉన్నతస్థాయి వర్గాలు గురువారం వెల్లడించాయి. ‘యూటీ’ ప్రతిపాదన లేదు..! ‘ఆర్థికమంత్రి చిదంబరం ఇప్పటికే వివరించినట్లు.. హోంశాఖ నోట్లో మేం చేయబోయే మార్పుచేర్పుల్లో నదీ జలాల పంపిణీ, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, మూడు ప్రాంతాల్లో నివసించేవారందరి భద్రత, రక్షణ, పౌరులందరికీ ప్రాథమిక హక్కుల హామీ తదితర అంశాలు ఉంటాయి’ అని న్యాయశాఖలోని వర్గాలు తెలిపాయి. ‘నిజానికి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్న ప్రతిపాదనకు మా పార్టీ సీమాంధ్ర నేతల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రతిపాదన కేంద్ర హోంమంత్రి నుంచి వచ్చింది. దానిని ముందుకు తెస్తోంది హోంమంత్రి, ఆయన సలహాదారులు కొందరు మాత్రమే. అందరూ కాదు. దీనికి ఇతరులు వ్యతిరేకించటంతో ఆ ప్రతిపాదనను పక్కనపెట్టేలా ఆయనను ఒప్పించాం’ అని ఆ వర్గాలు వివరించాయి. ఇదిలావుంటే.. విభజనపై కోర్టు జోక్యం కోసం ఉత్కంఠగా నిరీక్షిస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ నాయకత్వానికి.. ఈ మార్గంలో ఏదైనా ఊరట లభిస్తుందా అన్నది వేచిచూడాల్సిందే. తెలంగాణ అంశంపై కేంద్రం వెనక్కు వెళ్లబోదని పూర్తిగా అవగతం చేసుకున్న సీమాంధ్ర నాయకత్వం.. ఇప్పుడిక కొత్త రాష్ట్రం ఏర్పాటును అడ్డుకునేందుకు న్యాయపరమైన నిబంధనలు, రాజ్యాంగ అంశాలపై ఆధారపడుతోంది. -
పులివెందులలోని యూసీఐఎల్‌కు సమైక్య సెగ
సమైక్యాంధ్ర ఉద్యమానికి పులివెందుల యురేనియం ప్లాంట్ (యూసీఐఎల్) లోని ఉద్యోగులు తమ సంఘీభావం ప్రకటించారు. నేటి నుంచి 72 గంటలపాటు బంద్‌కు పిలుపునిచ్చామని... అందుకు సంబంధించి ప్లాంట్ సీఎండీ బెహల్తోపాటు ఇతర ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు పులివెందుల సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు గురువారం ఇక్కడ వెల్లడించారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం పట్ల వారు ఆగ్రహాం వ్యక్తం చేశారు. యూసీఐఎల్ కార్యకలాపాలను స్తంభింపజేయడం ద్వారా ఉద్యమ ప్రభావ తీవ్రత కేంద్రానికి తెలపాలని నిర్ణయించినట్లు వారు తెలియజేశారు. ప్రస్తుతం 72 గంటల బంద్‌కు పిలుపునిచ్చామని .. మార్పు రాకపోతే నిరవధికంగా మైనింగ్ కార్యకలాపాలను స్తంభింపజేస్తామని వారు హెచ్చరించారు. మైనింగ్‌తోపాటు ఇతర కాంట్రాక్టు సంస్థలకు సంబంధించిన అన్ని పనులను నిలిపివేసేలా ఉద్యోగ సంఘాలతోపాటు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో ఇప్పటికే చర్చించామని వారు తెలిపారు. -
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి: మైసూరారెడ్డి
-
సమైక్యతే మా ఆశయం : శ్రీకాంత్ రెడ్డి
-
సమైక్యతే మా ఆశయం : శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ ఆశయం అని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. శాసనసభ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సమ న్యాయం కోసం ఎప్పుడూ తాము కట్టుబడి ఉంటామని చెప్పారు. తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యంగా సమ న్యాయం చేయాలని, అలా చేయలేకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ డిమాండ్ అన్నారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఉవ్విళ్లూరుతున్నారన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే సిఎం కావచ్చని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారని విమర్శించారు. సీమాంధ్రకు సీఎం కావాలని బొత్సతోపాటు మంత్రులూ లాబీయింగ్ చేస్తున్నారని చెప్పారు. అందుకే వారంతా విభజనకు అంగీకరిస్తున్నారన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ మరణం సోనియా గాంధీ అనిగానీ, చంద్రబాబు అని గానీ వైఎస్ఆర్సీపీ ఏ నాడు ఆరోపించలేదన్నారు. ఆయన మరణంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూనే ఉన్నామన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖ వల్లే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఈ ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే అందుకు వ్యతిరేకంగా చంద్రబాబు విప్ జారీ చేశారని చెప్పారు. ఒక ప్రతిపక్ష పార్టీ ఈ విధంగా చేయడం ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదన్నారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా ప్రత్యేక రాష్ట్రం విషయం ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నట్లు తెలిపారు. సీమాంధ్ర ఎలా తగలబడిపోతుందో చూడటానికే బాబు యాత్ర చేస్తున్నారన్నారు. రోమ్ చక్రవర్తిని మించిన దుర్మార్గుడు చంద్రబాబు అని విమర్శించారు. రాష్ట్ర విభజనకు ఆయన రాజకీయ కుట్రలే కారణం అన్నారు. సమైక్యాంధ్ర కోసం తమ రాజీనామాలను ఆమోదింపజేసుకుంటామని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చెప్పారు. శాసనసభ్యత్వాలకు తాము చేసిన రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్‌ను కోరినట్లు తెలిపారు. టిడిపి వారు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చిత్తశుద్దితో పోరాటం చేస్తున్నది ఒక్క వైఎస్ఆర్ సిపియే నని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పాటు క్రెడిట్ తనదే అని చంద్రబాబు అన్నట్లు చెప్పారు. సీమాంధ్ర రాజధాని నిర్మాణానికి ఆయన 4 లక్షల కోట్ల రూపాయలు అడిగారని గుర్తు చేశారు. చంద్రబాబు సమైక్యరాష్ట్రం కోసం ఏనాడూ మాట్లాడలేదని చెప్పారు. -
సమైక్య శంఖారావం పూరించిన షర్మిల
-
సమైక్య శంఖారావం పూరించిన షర్మిల
తిరుపతి: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సాగిస్తున్న పోరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకు వేసింది. రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలు నెలరోజులుగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా విభజనపై వెనక్కు వెళ్లేది లేదని కాంగ్రెస్ నేతలు చెప్పడం దారుణమంటోంది వైఎస్సార్ సీపీ. నదీ జలాలు, హైదరాబాద్ నగరం, శాంతిభద్రతలు వంటి జటిలమైన అంశాలను పరిష్కరించటం సాధ్యంకాదంటోంది. ఈ కారణంగానే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి బస్సుయాత్ర ప్రారంభించారు. సమైక్య శంఖారావం పూరించారు. ఈ సాయంత్రం తిరుపతి చేరుకున్నారు. ఆమె వెంట పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా ఉన్నారు. -
త్వరలో మంచి వార్త వింటాం: సబ్బం హరి
విశాఖపట్నం: రాష్ట్ర సమైక్యత కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి ధృడ నిర్ణయం తీసుకున్నారని, దానిని తాను స్వాగతిస్తున్నట్లు అనకాపల్లి ఎంపీ సబ్బం హరి చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రజలంతా తిప్పికొట్టారన్నారు. త్వరలోనే మంచి వార్త వింటామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలనే భావనతోనే దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలించారని సబ్బం హరి అన్నారు. అందుకే ఆయన చనిపోయి నాలుగేళ్లైనా దేశ వ్యాప్తంగానే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. విశాఖలోని 72 వార్డుల్లోనూ కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. -
సమైక్యాంధ్ర కోసం ఆర్థిక నిపుణుల జేఏసీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ హైదరాబాద్ కేంద్రంగా చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్థిక నిపుణుల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఏర్పాటయింది. జూబ్లీహిల్స్‌లోని ఒక హోటల్లో ఆదివారం జరిగిన సమావేశంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్థిక నిపుణులు రాష్ట్ర విభజన జరిగితే వచ్చే అనర్థాలపై విసృ్తతంగా చర్చలు జరిపారు. అభివృద్ధికోసం సమైక్యాంధ్రకే మద్దతు తెలపాలని నిర్ణయించారు. గత నెల రోజులుగా ఏపీ ఎన్జీవోలు, విద్యార్థులు, అడ్వొకేట్లు, జర్నలిస్టులు జేఏసీలుగా ఏర్పడి ఉధృతంగా సాగిస్తున్న ఉద్యమానికి ఈ నిపుణులంతా గట్టి మద్దతు తెలిపారు. విభజన వల్ల ఉత్పన్నమయ్యే ఆర్థిక అనర్థాలపై ఒక నివేదికను రూపొందించి త్వరలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు సమర్పించాలని తీర్మానించారు. ఇదే నివేదికను రాష్ట్రంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటుగా సంబంధిత కమిటీలన్నింటికీ కూ డా సమర్పించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో తాత్కాలిక జేఏసీని ఏర్పా టు చేశారు. జేఏసీ చైర్మన్‌గా లంకా దినకర్ (హైదరాబాద్), ఉపాధ్యక్షులుగా జీఎల్ఎన్ ప్రసాద్ (గుంటూరు), పి.సుధాకర్ (విజయవాడ), కొండూరు రాజే ష్ (నెల్లూరు), కార్యదర్శులుగా ఎం.ప్రేమ్‌చంద్ (హైదరాబాద్), చల్లం(విశాఖపట్టణం), సంయుక్త కార్యదర్శులుగా ఎం.కళ్యాణ్ (హైదరాబాద్), సీహెచ్ మల్లికార్జునరెడ్డి(ఒంగోలు), చక్కా మహేష్ (గుంటూరు), కేకేవీ ప్రసాద్ (ప.గోదావరి), కార్యవర్గ సభ్యులుగా సోమా వి.సి.రెడ్డి, కుందరవల్లి శ్రావణ్ , వి.వాసురాజు, పి.మోహన్‌రావు, ఎం.విష్ణువర్ధన్, వెంకటరెడ్డిని ఎన్నుకున్నారు. -
రాజీనామాలు చేయండి: కేంద్రమంత్రులకు ఏపీఎన్జీఓల అల్టిమేటం!
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంతో సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలకు ఎన్నడూ లేనంతగా గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల (ఎపీఎన్జీఓ)లను బుజ్జగించ లేక సీమాంధ్ర మంత్రులు, ఎంపీల తల ప్రాణం తోకకు వస్తున్నట్టు తెలుస్తోంది. న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఏపీఎన్జీఓ, సీమాంధ్ర ప్రాంత నాయకుల మధ్య వాడివేడి చర్చ జరిగినట్టు తెలుస్తోంది. గంటకుపైగా సాగిన ఈ సమావేశానికి కిషోర్ చంద్ర దేవ్ తప్ప మిగితా కేంద్ర మంత్రులందరూ హాజరైనట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఎపీఎన్జీఓ నాయకులు సంధించిన ప్రశ్నలకు సీమాంధ్ర నేతల వద్ద సమాధానం కరువైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. సీమాంధ్ర మంత్రుల, ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయకుండా..మౌనం పాటించడంపై ఎపీఎన్జీఓ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. వెంటనే రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు తమ పదవులకు రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాలని ఏపీఎన్జీఓలు సూచించినట్టు తెలిసింది. దాంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పై ఒత్తిడి పెరుగుతుందని, హైదరాబాద్ లో సెప్టెంబర్ 7 తేదిన తలపెట్టే సభకు అనుమతి వచ్చేలా చూడాలని విజ్క్షప్తి చేయగా, రాష్ట విభజన చేసేందుకు కేంద్రం ముందుకెళితే తాము రాజీనామాలు సమర్పిస్తామని ఎపీఎన్జీఓలు బుజ్జగించినట్టు తెలిసింది. -
మదనపల్లిలో లక్ష గర్జన సమర భేరి
సమైక్యాంధ్రకు మద్దతుగా సోమవారం చిత్తూరు జిల్లా మదనపల్లిలో లక్ష గర్జన సమరభేరి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక హెడ్ పోస్టాఫీసు సమీపంలోని అనిబిసెంట్ సర్కిల్ వద్ద లక్ష గర్జన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో పాటు సమైక్యవాదులు పాల్గొన్నారు. లక్షసార్లు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేపట్టారు. అలాగే బెంగళూరు రోడ్డు, మల్లికార్జున సర్కిల్, పటేల్ రోడ్డులను దిగ్బంధం చేశారు. -
వైస్ అవినాష్ రెడ్డి అరెస్ట్, రిమ్స్ కు తరలింపు
-
రాష్ట్రంలో జగన్ ప్రభంజనం ఉంది: రాఘవులు
రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రభంజనం కొనసాగుతోంది అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అని అన్నారు. జగన్ ప్రభంజనాన్ని తట్టుకోలేకనే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజిస్తున్నది అని విమర్శలు చేశారు. గతంలో వచ్చిన 33 సీట్లు రాకపోయిన 15 సీట్లైన సంపాదించుకున్నామని కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుంది అని రాఘవులు అన్నారు. అంతేకాక సీమాంధ్ర రాజకీయ నేతలతీరుపై రాఘవులు మండిపడ్డారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర రాజకీయ పార్టీల నేతలు ద్వంద్వ వైఖరి మానుకోవాలి అని ఆయన సూచించారు. సీమాంధ్ర నేతలు వారి పార్టీ నేతలనైనా ఒప్పించాలి లేదంటే పార్టీలకు రాజీనామాలైనా చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింపచేశామంటున్నారని.. అయితే వారి ఆందోళన విభజన కోసమా.. సమైక్యం కోసమో స్పష్టం చేయాలి అని రాఘవులు అన్నారు. విభజనతో సీమాంధ్రలో ఏర్పడే నదీజలాల సమస్యను పరిష్కరించాలి అని రాఘవులు తెలిపారు. -
కడపలో వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్, రిమ్స్ కు తరలింపు
రాష్ట్రంలోని నీటి సమస్యలు, హైదరాబాద్ అంశం పరిష్కారమయ్యేంత వరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందే అంటూ చేపట్టిన పులివెందుల సమన్వయకర్త వైఎస్ అవినాష్ రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అవినాష్ రెడ్డి శిబిరం వద్దకు భారీ ఎత్తున పోలీసులు చేరుకుని అరెస్ట్ చేశారు. సమన్యాయం జరిగేంత వరకు సమైక్యంగా ఉంచాలంటూ అవినాష్ రెడ్డి చేపట్టిన దీక్ష ఆదివారానికి ఏడో రోజుకు చేరుకుంది. అవినాష్ రెడ్డి ఆరోగ్యం క్షీణించి.. ఆందోళనకరంగా మారింది. వైద్యులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా.. అవినాష్ రెడ్డి దీక్షను కొనసాగించడానికే సిద్ధమయ్యారు. ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమ్స్ అస్పత్రికి తరలించారు. అయితే వైఎస్ అవినాష్ రెడ్డి ఆస్పత్రిలో కూడా దీక్షను కొనసాగిస్తున్నారు. -
టిడిపికి తమ్మినేని సీతారామ్ గుడ్ బై
-
తెలుగుదేశానికి తమ్మినేని సీతారాం గుడ్ బై
తెలుగువారి ఆత్మగౌరవాన్ని తెలుగుదేశం పార్టీ కాపాడలేకపోయింది అని ఆ పార్టీకి సీనియర్ నేత తమ్మినేని సీతారాం రాజీనామా సమర్పించారు. రాజీనామాతోపాటు పార్టీ అధినేత చంద్రబాబుకు 10 పేజిల బహిరంగ లేఖను తమ్మినేని రాశారు. ఎన్టీఆర్ ఆశయాలకు విరుద్దంగా చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోంది అంటూ లేఖలో ఘాటైన విమర్శలు చేశారు. ఎన్టీఆర్ సిద్దాంతాలను, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడలేకపోయినందునందునే టీడీపీకి రాజీనామా చేస్తున్నానని మీడియా సమావేశంలో ప్రకటించారు. బలహీన ప్రభుత్వం, ప్రతిపక్షం ఉన్నందునే రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది అని తమ్మినేని అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. తమ్మినేని సీతారాం రాజీనామాతో తెలుగుదేశానికి ఉత్తరాంధ్రలో మరో గట్టి షాక్ తగిలింది. -
అలుపెరగని పోరు
సాక్షి, నెల్లూరు: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే లక్ష్యంతో సింహపురి వా సులు అలుపెరగని పోరాటం సాగిస్తున్నారు. యూపీఏ ప్రభుత్వ మెడలు వం చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నిరసన కార్యక్రమాలతో జిల్లా ను హోరెత్తిస్తున్నారు. 25వ రోజు ఉద్యమాన్ని శనివారం ఉధృతంగా కొనసాగించారు. నెల్లూరులోని కనకమహల్ సెంటర్లో వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగులు రాస్తారోకో చేయగా, విద్యుత్ శా ఖ ఉద్యోగులు రిలేదీక్షలు చేశారు. ఎన్జీఓలు, విద్యాశాఖ మినీస్టీరియల్ సిబ్బం ది, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మ హాప్రదర్శన నిర్వహించారు. గెజిటెడ్ ఆ ఫీసర్లు, ఉద్యోగ సంఘాల ఉద్యమ కా ర్యాచరణను ఏజేసీ పెంచలరెడ్డి ప్రకటించారు. నారాయణరెడ్డిపేట, కొత్తకాలువ సెంటర్లో జరిగిన నిరసన కార్యక్రమాలకు టీడీపీ పొలిట్‌బ్యూరో స భ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర హాజరయ్యారు. ముత్తుకూరులో రాస్తారోకో, ఏపీ జె న్కో ప్రాజెక్టులో ఉద్యోగులు ధర్నా చేశా రు. టీపీగూడూరులో విద్యార్థులు మా నవహారం నిర్వహించారు. సాలిపేట సెంటర్లో మోకాళ్లపై నిలుచుని నిరస న తెలిపారు. ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో హైవేపై వెంకటాచలం వద్ద వంటావార్పు చేపట్టారు. విజయమ్మ దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గూడూరులో బంద్ జరిగింది. కా శీపేట, రాజావీధి, ఆర్టీసీ సెంటర్లలోని దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛం దంగా మూసేశారు. ఆర్టీసీ బస్టాండ్, పాతబస్టాండ్ సెంటర్లలో ర్యాలీలు, రా స్తారోకోలు జరిగాయి. వెంకటగిరిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట అన్ని శాఖల సిబ్బంది రిలేదీక్షలు చేపట్టారు. వారికి జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు. వెంకటగిరి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేపట్టారు. ఉదయగిరిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వరికుంటపాడులో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు వం టా వార్పు నిర్వహించారు. కలిగిరిలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. గ్రంథాలయం సమీపం లో రిలేదీక్షలు చేపట్టారు. కొండాపురం లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాస్తారో కో జరిగింది. చిల్లకూరులో జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు. టోల్‌ప్లాజా ఉద్యోగులు నిరసనను రెండో రోజు కొనసాగించా రు. వాకాడులో ధర్నా నిర్వహించారు. కోట మండలం కొత్తపాళెం, కొక్కుపాడుతో పాటు చిట్టమూరులోనూ ర్యాలీలు జరిగాయి. సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నా యి. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ముస్లిం యువకులు రిలే నిరాహారదీ క్షలు చేస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సుమారు 10 బస్సులతో ర్యాలీ నిర్వహించారు. జేఏసీ, వైఎస్సార్సీపీ రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నా యి. యువకులు చేస్తున్న ఆమరణ ని రాహారదీక్షను పోలీసులు భగ్నం చేశా రు. వైఎస్సార్సీపీ తడ మండల కన్వీనర్ మారంరెడ్డి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులతో జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దొరవారిసత్రంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమి టీ సభ్యుడు దువ్వూరు బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష ప్రారంభమైంది. దీక్ష లో ఉన్న వారికి పార్టీ సమన్వయకర్తలు నెలవల సుబ్రమణ్యం, కిలివేటి సంజీవయ్య సంఘీభావం తెలిపారు. ఆత్మకూరు మున్సిపల్ బస్టాండులో మహిళలు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. విద్యార్థులతో పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది. కావలిలోని పొట్టిశ్రీరాములుబొమ్మ సెంటర్ వద్ద రిలే దీక్షలో ఉన్నవారికి వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఏరియా వైద్యశాల సెంటర్లో సమైక్యాంధ్ర పరిరక్షణసమితి ఆధ్వర్యంలో దీక్షలో ఉన్న వారికి టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర సంఘీభావం ప్రకటించారు. -
విభజనతో రాష్ట్రం అథోగతే!
కుప్పం రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనతో రాష్ట్రం అథోగతి పాలవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త, జెడ్పీ మాజీ చైర్మన్ ఎం.సుబ్రమణ్యంరెడ్డి పేర్కొన్నారు. రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలి, లేకుంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుంటూరులో చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా కుప్పంలో ఆమరణ దీక్ష చేస్తున్న వారిని ఆయన గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు తల్లిని విడదీసే అధికారం సోనియూకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇప్పటికే సీమాంధ్రప్రజలు సాగు, తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారని, రాష్ట్రాన్ని విభజిస్తే తీరని నష్టం కలుగుతుందని అన్నారు. సమైక్యాంధ్ర కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమేనన్నారు. కుప్పంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కన్నన్, వసనాడు సర్పంచ్ మురళీధరన్, సేవాదళ్ జిల్లా కన్వీనర్ కదిరవేలు, సామగుట్టపల్లెకు చెందిన పార్టీ కార్యకర్త మణికంఠ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష గురువారం నాలుగో రోజుకు చేరింది. వీరికి మద్దతుగా పార్టీ మండల కన్వీనర్ సోమమూర్తి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సెంథిల్‌కుమార్, డీకేపల్లె సర్పంచ్ శోభామణి, వానగుట్టపల్లె సర్పంచ్ లక్ష్మీకాంతయ్య, పార్టీ నాయకులు రాంకుమార్, మంజు, ఆర్ముగం, శ్రీనివాసులు, క్రిష్టియన్ పాస్టర్లు, బెస్త కులస్తులు, సుమో యూనియన్ సభ్యులు దీక్షలో పాల్గొన్నారు. -
అధిష్టానంపై ఒత్తిడికి ఇదే మంచితరుణం:ఎంపి హరి
విశాఖపట్నం: రాష్ట్ర విభజన అంశం ఆగిపోతుందనే సంకేతాలు వస్తున్నాయని ఎంపీ సబ్బం హరి చెప్పారు. అధిష్టానంపై సీమాంధ్ర నేతలు ఒత్తిడి చేయడానికి ఇదే మంచి తరుణం అని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు హరి తెలిపారు. హైదరాబాద్ విషయంలో టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ కోసం పాటుపడలేదన్నారు. స్వప్రయోజనాలకే తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుంటున్నట్లు ఆరోపించారు. హైదరాబాద్ నుంచి వెళ్లిపోమ్మని చెప్పడానికి కేసీఆర్ ఎవరు? అని ప్రశ్నించారు. హైదరాబాద్ అందరిదని హరి అన్నారు. -
అలిపిరి పీఎస్ వద్ద ఉద్రిక్తత, నేతల విడుదలకు డిమాండ్
అక్రమంగా అరెస్ట్ చేసిన సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారుల నిరసన కార్యక్రమం చేపట్టడంతో తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతలను విడుదల చేయాలని భారీ ఎత్తున ఆందోళనకారులు అలిపిరి వద్ద ధర్నా చేపట్టారు. సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్ నుంచి వెళ్లి పోవాలన్న కాంగ్రెస్‌నేత వి.హనుమంతరావుకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి గాంధీగిరి పద్ధతిలో నిరసన తెలియజేయాలనుకుంటే పోలీసులు లాఠీ చార్జి చేయడంపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. వీహెచ్ కారు ఆపకుండా వెళ్లిపోతుంటే శాంతియుతంగా నిరసన తెలిపేందుకు కారుకు అడ్డంగా పడుకుంటే పోలీసులు విచక్షణ లేకుండా దాడి చేయడం అమానుషమని అంటున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఉద్యమకారులపై పోలీసుల లాఠీచార్జి కి నిరసనగా శాప్స్ నాయకులు ఆదివారం తిరుపతి బంద్‌కు పిలుపునిచ్చారు. సమైక్యవాదులపై పోలీసుల దాడులు దారుణమని శాప్స్ నేతలు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు టీటీడీ ఏడీ బిల్డింగ్ సమీపంలోనున్న ఎస్పీ క్యాంపు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ శాంతియుత ఉద్యమాన్ని రాద్ధాంతం చేస్తూ సీమాంధ్రులపై హనుమంతరావు అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. దాడులు చేసే నీచ సంస్కృతి టీఆర్ఎస్ నేతలదేనన్నారు. తమ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించిన టీఆర్ఎస్ నాయకులు తెలుగు ప్రజల కోసం ఉద్యమం చేస్తున్న సీమాంధ్రులను విమర్శించే అర్హత లేదన్నారు. రెచ్చగొడితే రాయలసీమ వాసుల సత్తా రుచి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతేకాక వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావుపై కేసు నమోదు చేయాలని శాప్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు స్వస్థలాలకు వెళ్లిపోవాలంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసి ఉద్యమకారులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన హనుమంతరావుపై కేసు నమోదు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తను కాదని, సమైక్యాంధ్ర ఉద్యమకారుడిగా వీహెచ్‌ను అడ్డుకునేందుకు వెళ్లామని స్పష్టం చేశారు. -
క్షీణిస్తున్న శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రారెడ్డి ఆరోగ్యం ఏడవ రోజుకు చేరిన దీక్షలు
వైఎస్ఆర్ జిల్లా కడప కలెక్టరేట్ వద్ద ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాధరెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు ఆదివారానికి ఏడవ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం ఉదయం దీక్ష చేస్తున్న నేతలకు వైద్యులు మరోసారి పరీక్షించనున్నారు. శనివారం సాయంత్రం శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రారెడ్డి, ఇతర నేతలను పరీక్షించి.. ఆరోగ్య పరిస్థితి బాగా లేదని చెప్పారు. అయినా దీక్షలు కొనసాగించడానికే శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి నిర్ణయించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నేతల చేపట్టిన దీక్షకు పెద్ద ఎత్తున ప్రజలు, అధికారులు, అన్ని వర్గాల వారు తరలివచ్చి వీరికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. మాజీ మంత్రులు వైఎస్ వివేకానందరెడ్డి, పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డిలతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఈసీ గంగిరెడ్డి, జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు సంఘీభావం తెలిపారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాధరెడ్డి దీక్షలు ఆదివారం నాటికి నాలుగురోజుకు చేరాయి. -
సీమాంధ్ర బంద్, చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న దీక్షలు
రాష్ట్ర విభజనకు నిరసనగా చిత్తూరు జిల్లాలో దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుమలలో బస్సులు సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. పాఠశాలలు మూసివేత కొనసాగుతూనే ఉంది. చిత్తూరు జిల్లాలో వివిధ సంఘాలు, వర్గాలు నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో మున్సిపల్ కార్యాలయం వద్ద జేఏసీ దీక్షలు 18వ రోజుకు చేరుకోగా, కేబుల్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో 12వ రోజుకు, రెవెన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో 5వ రోజుకు, విద్యుత్ ఉద్యోగులు ఆధ్వర్యంలో 8వ రోజుకు చేరుకున్నాయి. అంతేకాకుండా సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతి సిమ్స్, రోయాఆస్పత్రిల వద్ద దీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా నేడు సీమాంధ్ర జిల్లాల బంద్ పాటించనున్నాయి. -
విజయమ్మ దీక్షకు కార్మికులు మద్దతు
-
జిల్లా వ్యాప్తంగా ఉధృతంగా కొనసాగుతున్న ఉద్యమం
అనంతపురం జిల్లా పరిషత్తు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని జిల్లా వాసులు స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కుగ్రామం మొదలు నగరం వరకూ ఆందోళనలు మిన్నంటాయి. 13వ రోజైన సోమవారం కూడా జిల్లాలో ఉద్యమం జోరుగా కొనసాగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల బంద్ రెండో రోజూ విజయవంతమైంది. అనంతపురం నగరంతో పాటు పట్టణాలు, పల్లెల్లో సైతం పార్టీ శ్రేణులు బంద్ చేపట్టాయి. వివిధ పార్టీలు, ప్రజా, కుల సంఘాలు, నాన్‌పొలిటికల్ జేఏసీ, జాక్టో, విద్యార్థి, యువజన, ఉద్యోగ, కార్మిక, కర్షక, కళాకారుల సంఘాల నాయకులతో పాటు దాదాపు అన్ని వర్గాల ప్రజలు అనంత కుతకుత సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు, అర్ధనగ్న ప్రదర్శనలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. విభజనకు కారకులంటూ సోనియాగాంధీ, కేసీఆర్, దిగ్విజయ్ తదితర నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు. విభజనను జీర్ణించుకోలేక సోమందేపల్లికి చెందిన బాదయ్యపల్లి వెంకటేశ్వర్లు (58) గుండెపోటుతో మృతి చెందారు. ఎస్కేయూ విద్యార్థులు వర్సిటీ ముఖద్వారం ఎదుట రోడ్డుపైనే కుర్చీలు వేసుకుని చదువుకుంటూ దాదాపు రెండు గంటల పాటు నిరసన తెలిపారు. ఇక్కడే విద్యార్థి జేఏసీ దీక్షలు కొనసాగుతున్నాయి. అనంతపురం నగరంలో వైఎస్సార్సీపీ నేతలు బి.ఎర్రిస్వామిరెడ్డి, చవ్వా రాజశేఖరరెడ్డి నేతృత్వంలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట జాక్టో, టవర్‌క్లాక్ సర్కిల్లో నాన్‌పొలిటికల్ జేఏసీ నేతల దీక్షలకు వైఎస్సార్సీపీతో పాటు వివిధ సంఘాల నాయకులు, సమైక్యవాదులు సంఘీభావం ప్రకటించారు. విద్యుత్ ఉద్యోగులు నోటికి నల్లగుడ్డ కట్టుకుని మౌన ప్రదర్శన చేశారు. ఎంఐఎం, ఏపీ ఎన్జీఓ, దంత వైద్యులు, వివిధ విద్యాసంస్థలు, కుల, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సమైక్యవాదులు నగరంలో ర్యాలీలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా స్థానిక సప్తగిరి సర్కిల్లో సోనియా, కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్‌ల దిష్టిబొమ్మలు తగులబెట్టారు. ధర్మవరంలో సమైక్యవాదులు, జేఏసీ నేతలు ర్యాలీలు నిర్వహించారు. బత్తలపల్లి మండలం పోట్లమర్రిలో గ్రామస్తులు రోడ్డుపై వంటా వార్పు చేపట్టారు. ముదిగుబ్బలో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో బంద్ విజయవంతం చేశారు. గుంతకల్లు పట్టణం నిరసన ర్యాలీలతో హోరెత్తింది. నక్కనదొడ్డి దగ్గర జాతీయ రహదారిపై గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. పామిడిలో సమైక్యవాదులు గాడిదలను ఊరేగించారు. హిందూపురం పట్టణంలో వైఎస్సార్సీపీ నేతలు బంద్ నిర్వహించారు. పార్టీకి చెందిన 28 మంది నాయకులు ఆమరణ దీక్షకు పూనుకున్నారు. జేఏసీ నేతలు రోడ్డుపైనే స్నానం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు, విద్యాసంస్థల నిర్వాహకులు, కూరగాయల వ్యాపారులు, వ్యవసాయ శాఖ ఉద్యోగులు నిరసన ర్యాలీలు చేపట్టారు. చిలమత్తూరు, లేపాక్షిలో బంద్ సంపూర్ణంగా కొనసాగింది. కదిరి అంబేద్కర్ సర్కిల్లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షల్లో చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ, టీడీపీ నేతలు వేర్వేరుగా బైక్ ర్యాలీలు నిర్వహించారు. గాండ్లపెంట, నల్లచెరువు, తలుపుల, తనకల్లు మండలాల్లో ర్యాలీలు కొనసాగాయి. కళ్యాణదుర్గంలో సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలతో శవయాత్రలు నిర్వహించారు. జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మడకశిరలో బంద్ విజయవంతమైంది. ఎంఆర్పీఎస్ నేతలు ర్యాలీ చేశారు. అమరాపురం మండలం మద్దనకుంటలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తమ్మేడుకుంటలో ముగ్గురు యువకులు రిలే దీక్షలకు దిగారు. రొళ్లలో సమైక్యవాదులు భారీ మానవహారం నిర్మించారు. రొళ్ల మండలం అగ్రహారంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. గుడిబండ మండలం మోదుగులకుంట గ్రామస్తులు రాస్తారోకో చేశారు. పుట్టపర్తిలో మహిళలు భారీ ర్యాలీ చేశారు. చిన్నారులు రోడ్డుపైనే చదువుకొని నిరసన తెలిపారు. ఓడీసీలో రోడ్డుపైనే వంటావార్పు చేపట్టారు. నల్లమాడలో ముగ్గుల పోటీ నిర్వహించారు. అమడగూరు, గోరంట్ల, బుక్కపట్నం, కొత్తచెరువు, రొద్దం మండలాల్లో సమైక్య నినాదాలు మార్మోగాయి. రాయదుర్గంలో జేఏసీ నేతల దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు మౌనప్రదర్శన నిర్వహించారు. జ్యువెలరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. గుమ్మఘట్టలో కేసీఆర్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. కణేకల్లులో ర్యాలీలు జోరుగా సాగాయి. కనగానపల్లిలో కురుబ సంఘం, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు. చెన్నేకొత్తపల్లిలో 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. రామగిరి మండలం చెర్లోపల్లి, శ్రీహరిపురంలో నిరసనలు చేపట్టారు. శింగనమలలో ఆర్యవైశ్యులు, ఉద్యోగులు ర్యాలీలు చేశారు. గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో సమైక్య నినాదాలు హోరెత్తాయి. తాడిపత్రిలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. పట్టణంలోని శ్రీనివాసపురం, సీబీరోడ్డులో వంటా వార్పు చేపట్టారు. తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని చీమలవాగుపల్లి, పెరన్నపల్లి, సజ్జలదిన్నె, ఎర్రగుంట, కిష్టిపాడు తదితర గ్రామాల్లో సైతం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉరవకొండలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కూడేరు, విడపనకల్లు, వజ్రకరూరు తదితర మండలాల్లో నిరసనలు హోరెత్తాయి. -
గురువాజ్ఞ లేదట!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రామాయణ కాలంలో వానర సేనకు సుగ్రీవుడు రాజు. ఆయన మాటే వారికి వేదవాక్కు. ఆయన అనుజ్ఞ ఇస్తే చాలు దేనికైనా సిద్ధపడతారు. అనుజ్ఞ లేనిదే ఒక్క అడుగు కూడా కదపరు. అందుకే సుగ్రీవాజ్ఞ అనే నానుడి వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు మన జిల్లాలోనూ ఒక సుగ్రీవుడు ఉన్నారు. ఆయన పాలకొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. లక్షమందికిపైగా ఓటర్లకు ప్రతినిధి. నాడు సుగ్రీవాజ్ఞకు వానరులు బద్ధులైతే.. నేడు మన సుగ్రీవులు వేరొకరి ఆజ్ఞకు బద్ధులు కావడం విశేషం. ఆయనే కేంద్ర మంత్రి, సుగ్రీవులవారి రాజకీయ గురువు కిశోర్‌చంద్ర దేవ్. కిశోర్ ఆజ్ఞ లేనిదే సుగ్రీవులు ఏ పనీ చేయరు.. అసలేమీ మాట్లాడరు!ఏటీ.. నమ్మకం కలగడం లేదా!.. ప్రస్తుతం జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్నే చూడండి.. ఉద్యమకారుల ఒత్తిడికి తలొగ్గి మంత్రులు మినహా జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసినా సుగ్రీ వులు ఆ ఊసే ఎత్తడం లేదు. ఉద్యమం వైపే కన్నెత్తి చూడటం లేదు. కారణం.. గురువాజ్ఞ లేకపోవడమే!.. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదన్నట్లు.. ఉద్యమం గురించి ఎవరైనా ప్రస్తావిస్తే గురువుగారు ఎలా చెబితే అలా చేస్తానంటూ దాట వేస్తున్నారు. విలేకరులు అడిగే ప్రశ్నలకు ఆయన చెప్పే సమాధానం ఒక్కటే. ‘మీకు తెలుసు కదా.. మా గురువుగారు చెప్పినట్లు చేస్తున్నా.. అంతకు మించి ఏమీ చెప్పలేనంటూనే.. నా గురించి అంతకు మించి ఏమీ రాయొద్దు అని కూడా కోరుతున్నారు. సుగ్రీవులు రాజకీయాలకు కొత్త. అరకు లోక్‌సభ సభ్యుడు, కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ ఈయనకు రాజకీయ గురువు. ఆయన ప్రోత్సాహంతోనే 2009లో ఉద్యోగానికి రాజీనామా చేసి పాలకొండ ఎస్టీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఈ నియోజకవర్గం అరకు లోక్‌సభ స్థానం పరిధిలోనే ఉంది. దీంతో కిశోర్ చెప్పినట్లు చేయడం, ఏదైనా సమస్య ఉందని ప్రజలు వస్తే మంత్రి ద్వారా పనులు చేయించడమే ఆయనకు తెలుసు. రాష్ట్ర విభజన, సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో కిశోర్‌చంద్రదేవ్ సుగ్రీవులుకు గురుబోధ చేసినట్లు తెలిసింది. ‘పదవికి రాజీనామా చేయొద్దు. చేస్తే.. ఇక అధికార పార్టీ నీ గురించి పట్టించుకోదు. అప్పుడు నేను కూడా ఏమీ మాట్లాడలేను’.. అన్నదే గురుబోధ సారాంశం. ఇది సుగ్రీవులు మనసులో బాగా నాటుకుపోయింది. దాంతో రాజీనామా గురించి అసలు ఆలోచించడం లేదు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసే అవకాశం వస్తుందో రాదోనన్న అనుమానం కూడా ఉంది. అందుకే ఉన్న నాలుగు రోజులు అధికారాన్ని అంటిపెట్టుకొని ఉండాలన్న ఆలోచన ఆయనది. మంత్రి చాటు బిడ్డగా ఉన్న సుగ్రీవులును జనం కూడా పట్టించుకోవడం మానేశారు. జై సమైక్యాంధ్ర అంటూ నియోజకవర్గమంతటా ఎవరికి వారు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చాలాచోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వీరికి నాయకత్వం వహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. రోజురోజుకూ ఉద్యమం ఉద్ధృతమవుతున్నా ఎమ్మెల్యే సుగ్రీవులు మాత్రం నిమ్మళంగా ఉంటున్నారు.