రాష్ట్రంలో జగన్ ప్రభంజనం ఉంది: రాఘవులు
రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రభంజనం కొనసాగుతోంది అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అని అన్నారు. జగన్ ప్రభంజనాన్ని తట్టుకోలేకనే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజిస్తున్నది అని విమర్శలు చేశారు. గతంలో వచ్చిన 33 సీట్లు రాకపోయిన 15 సీట్లైన సంపాదించుకున్నామని కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుంది అని రాఘవులు అన్నారు.
అంతేకాక సీమాంధ్ర రాజకీయ నేతలతీరుపై రాఘవులు మండిపడ్డారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర రాజకీయ పార్టీల నేతలు ద్వంద్వ వైఖరి మానుకోవాలి అని ఆయన సూచించారు. సీమాంధ్ర నేతలు వారి పార్టీ నేతలనైనా ఒప్పించాలి లేదంటే పార్టీలకు రాజీనామాలైనా చేయాలని డిమాండ్ చేశారు.
టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింపచేశామంటున్నారని.. అయితే వారి ఆందోళన విభజన కోసమా.. సమైక్యం కోసమో స్పష్టం చేయాలి అని రాఘవులు అన్నారు. విభజనతో సీమాంధ్రలో ఏర్పడే నదీజలాల సమస్యను పరిష్కరించాలి అని రాఘవులు తెలిపారు.