Raghavulu
-
బీజేపీపై పోరాడే సమయం లేదా?
సాక్షి, యాదాద్రి: కేరళకు వెళ్లి సీపీఎంను తిట్టేంత సమయం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీజేపీపై పోరాడటానికి మాత్రం లేదని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికినట్లు.. కేరళకు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయ్‌ని రేవంత్ విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన ఓటుకు నోటు సంగతి ఏమైందని ప్రశ్నించారు. భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి సీపీఎం అభ్యర్థిగా ఎండీ జహంగీర్ నామినేషన్ దాఖలు సందర్భంగా జరిగిన బహిరంగసభలో రాఘవులు పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడుతూ, నోరు పారేసుకోవద్దని రేవంత్‌రెడ్డికి సూచించారు. కేసీఆర్ అహంకారంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారని, సీఎం రేవంత్ ఆ బాటలో నడవద్దని అన్నారు. కేరళలో బీజేపీ, కమ్యూనిస్టులు కలసి పనిచేస్తున్నారని రేవంత్ పేర్కొనడం అతని అవివేకం అని అన్నారు. కేరళ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేసిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. కవితను బీజేపీ జైల్లో పెట్టిందని, ఇప్పటికైనా బీఆర్ఎస్ ఇండియా కుటమిలోకి రావాలని సూచించారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడాలని ఆయన ప్రజలను కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్‌తో కలసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని రాఘవులు అన్నారు. మమ్మల్ని కలుస్తామని కాంగ్రెస్ సమాచారం ఇచ్చింది : తమ్మినేని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీజేపీని ఓడించడానికి అందరితో కలసి వెళ్తామని, ఇండియా కూటమి పార్టీలను కాంగ్రెస్ సంప్రదిస్తూ పెద్దన్న పాత్ర పోషించాలని అన్నారు. ఈ నెల 21న కాంగ్రెస్ నాయకత్వం సీపీఎంను కలవనున్నట్లు సమాచారం ఇచ్చిందని వెల్లడించారు. అయినప్పటికీ తెలంగాణలో భువనగిరి నుంచి సీపీఎం పోటీచేయడం ఖాయమన్నారు. -
రేవంత్‌రెడ్డీ... ఇంటగెలిచి రచ్చ గెలువు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు ఫైర్ అయ్యారు. ముందు ఇంటగెలిచి రచ్చ గెలవాలన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఎంబీభవన్‌లో ఆయన తెలుగులో అనువదించిన సీపీఎం ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. ఈ సంద ర్భంగా రాఘవులు విలేకరులతో మాట్లాడుతూ ‘కేరళలో కాంగ్రెస్, సీపీఎం ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నా.. బీజేపీ రాకుండా ఆపగలిగారు. ఈసారి అది జరుగుతుంది. బీజేపీ తెలంగాణలో అడుగుపెట్టడమే కాదు అధికస్థానాలు గెలవాలని వ్యూహా లు రచిస్తున్నట్టు మీడియాలో వస్తుంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. రేవంత్‌రెడ్డి అక్కడకు వెళ్లి వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. ఇక్కడ బీజేపీకి ఒక్కస్థానం రాకుండా ఆలోచిస్తే బాగుంటుంది. అది ప్రజలకు, దేశానికి, లౌకికవాదానికి మంచిది. అక్కడకు వెళ్లి ఇండియాకూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలపై నోరుపారేసుకోవడం కన్నా బీజేపీపై నోరుపారేసుకుంటే బాగుంటుంది. మా కర్తవ్యం అదే. దానికి కాంగ్రెస్ తోడుకావాలి. ఇంకా బాగా ఫలితాలు వస్తాయి. ఆ పని మేం ఒక్కరమే చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా రేవంత్‌రెడ్డి తగిన నిర్ణయం తీసుకోవాలి’అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఇండియాకూటమి పార్టీలను కాంగ్రెస్ సంప్రదించడం లేదు: తమ్మినేని ఇండియాకూటమిలోని భాగస్వామ్య పార్టీలను కలుపుకుపోయే పని ప్రధానపార్టీగా ఉన్న కాంగ్రెస్ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. కానీ కాంగ్రెస్ అలాంటి ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. కలిసొచ్చే పార్టీలతో సంప్రదించే పనిచేయడం లేదన్నారు. ఈసారి భువనగిరిలో సీపీఎం పోటీ చేస్తుందని వివ రించారు. తమ అభ్యర్థి ఎండీ జహంగీర్ బాల్యం నుంచి కమ్యూనిస్టు పార్టీలో ఉన్నారని, ఆయనకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. నేడు జహంగీర్ నామినేషన్: ఎస్ వీరయ్య సీపీఎం భువనగిరి ఎంపీ అభ్యర్థిగా జహంగీర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య చెప్పారు. అనంతరం ప్రదర్శన, బహిరంగసభ ఉంటుందని, ఈ కార్యక్రమంలో రాఘవులు, తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొంటారని వివరించారు. -
అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేయాలి: రాఘవులు
సుందరయ్య విజ్ఞానకేంద్రం (హైదరాబాద్): బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్‌ను వెంటనే రద్దు చేయాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞానకేంద్రం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా, సికింద్రాబాద్‌లో జరిగిన కాల్పులను ఖండిస్తూ నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ దేశ సేవ, భద్రత కోసం పనిచేసే వారికి భద్రత లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. -
‘రాష్ట్రంలో కుస్తీలు.. ఢిల్లీలో పిల్లికూనలు’.. టీఆర్ఎస్ తీరుపై రాఘవులు ఫైర్
సాక్షి, వరంగల్: రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు నిత్యం కుస్తీ పట్టడం.. ఢిల్లీలో మాత్రం టీఆర్ఎస్ పిల్లికూనలా మోదీకి సలామ్ చేయడం సిగ్గుచేటుగా ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. ప్రజా సంక్షేమంపై బీజేపీ, టీఆర్ఎస్ దొందూ దొందేనని, రాష్ట్ర హక్కులను కేంద్రం కాలరాస్తోందని, రాష్ట్ర వాటా లేకుండా పన్నుల రూపేణా ఆదాయాన్ని కేంద్రమే కాజేస్తోందని ఆయన ఆరోపించారు. వరంగల్ శంభునిపేటలో గురువారం జరిగిన సీపీఎం జిల్లా మహాసభలకు ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ పెత్తనం తగ్గే వరకూ పోరాటాలు చేయాల్సిన ఆవసరం ఉందన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం మతతత్వ, హిందూత్వానికి పెద్దపీట వేస్తూ.. మతాల మధ్య చిచ్చుపెడుతూ మతమార్పిడిని ప్రోత్సహిస్తోందన్నారు. బీజేపీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్తో మైనార్టీలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. బీజేపీ అగ్రకులాల వ్యవస్థను పెంచి పోషిస్తున్న క్రమంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మహిళలకు రక్షణ కరువైందని, అత్యాచారాలు పెరిగిపోయాయని, శిక్షించాల్సిన చట్టాలే నిందితులను రక్షిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, మరణాల సంఖ్య భారీగా పెరిగిందని, అదే చైనా, రష్యా వంటి దేశాల్లో కరోనా నియంత్రించడంలో సఫలీకృతమయ్యారన్నారు. గులాబీ, కాషాయం రంగులు మారుస్తుందే తప్ప ఎరుపు రంగు ఎన్నటికి మారదన్నారు. సమాజంలో దోపిడీ, దుర్మార్గులు ఉన్నంత కాలం సీపీఎం బతికే ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఎం ఉద్యమాలు, పోరాటాలు మరింత ఉధృతంగా చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక నిత్యావసరాల ధరలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. విచ్చలవిడిగా మద్యం షాపులకు అనుమతులు ఇస్తూ యువతను మద్యానికి బానిస చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. మహాసభలు పోరాటలకు కేంద్ర బిందువుగా మారాలని, ఉద్యమాలకు పుట్టినిళ్లు వరంగల్ నుంచే కార్యాచరణ రూపొందించి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.రాములు, జిల్లా కమిటీ సభ్యులు రత్నమాలు, సీహెచ్ రంగయ్య, కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య, హనుమకొండ, వరంగల్ జిల్లా కార్యదర్శులు సుకన్న, రంగన్న, కార్యకర్తలు పాల్గొన్నారు. చదవండి: వైరల్‌గా మారిన ‘మజ్ను మిస్సింగ్’ యాడ్.. పూర్తిగా చదవకపోతే పప్పులో కాలేసినట్టే! -
మా ప్రధాన ఉద్దేశం అదే: రాఘవులు
న్యూఢిల్లీ: కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఇప్పటికీ ప్రాసంగికత ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, లెఫ్ట్‌వర్డ్ సంపాదకుడితో కలిసి రాఘవులు శుక్రవారం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ సిద్దాంతాలు యువతలోకి తీసుకెళ్లడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఇక సీపీ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 21ను రెడ్‌బుక్ దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. లక్ష పుస్తకాలు ప్రింట్ చేశామని.. ఆరెస్సెస్‌కు గట్టి జవాబుగా కమ్యూనిస్టు మేనిఫెస్టో ఉందటుందని పేర్కొన్నారు. ‘‘ప్రజల చేతిలో ఆయుధం ఈ కమ్యూనిస్టు మేనిఫెస్టో. ప్రపంచవ్యాప్తంగా రైట్‌వింగ్ సిద్ధాంతాలు వస్తున్నాయి. ఇవి చాలా ప్రమాదకరం. ఫ్రీ థింకింగ్, ఫ్రీ థాట్, అసమ్మతి తెలియజేయడం అనేది చాలా ముఖ్యం’అని వ్యాఖ్యానించారు. -
కుట్రతోనే వ్యతిరేకిస్తున్నారు
హైదరాబాద్: భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చాలనే ఉద్దేశంతోనే పలువురు ఎన్ఆర్సీ, సీఏఏలను వ్యతిరేకిస్తున్నారని వీహెచ్‌పీ అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి రాఘవులు విమర్శించారు. దేశ విభజన నుంచి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి శరణార్థులు మనదేశానికి వలస వస్తున్నారని వారందరికీ పౌరసత్వం కల్పించాలని గత పాలకులంతా అనుకున్నారు కానీ దాన్ని అమలు చేయలేకపోయారని ఆయన అన్నారు. ఆదివారం కోఠిలోని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయంలో రాఘవులు విలేకరులతో మాట్లాడుతూ.. దేశానికి వలస వచ్చిన వారిని అన్ని పార్టీలు ఆదరించాలని వారి పార్టీల ఎన్నికల అజెండాలలో పొందుపరిచారన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాల వల్ల ఎన్ఆర్సీ, సీఏఏ బిల్లు అమలుకు నోచుకోలేదన్నారు. గత పాలకుల చేయలేని పనిని దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్రమోదీ అమలు చేసి చూపించారన్నారు. ప్రపంచ దేశాలను కబలించిన తరహాలోనే భారత దేశాన్ని ఆక్రమించుకునేందుకుగాను జీహాదీలు కుట్ర పన్నుతున్నారని, ఇందులో భాగంగానే మతమార్పిడులు, చొరబాటు, జమీన్ కబ్జా, కులాలమధ్య చిచ్చు, హత్యలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన ఆరోపించారు. చొరబాటుదారుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో అస్సోం, త్రిపుర, బెంగాల్, కశ్మీర్ వంటి దేశాలతో పాటు అనేక ప్రాంతాలు అశాంతికి గురయ్యాయన్నారు. రాబోయే 35 ఏళ్లలో భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మారుస్తామని ప్రకటించడం చూస్తుంటే చొరబాటుదారుల కుట్ర అర్థమవుతోందన్నారు. పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏమిటో అత్యధికులకు తెలియదని, నేతల తప్పుడు వ్యాఖ్యలకు ప్రభావితమై వారు రోడ్లపైకి వస్తున్నారన్నారు. ఈ సమావేశంలో వీహెచ్‌పీ రాష్ట్ర నేత బండారి రమేష్, భజరంగ్‌దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్‌చందర్, రాష్ట్ర నేత పగుడాకుల బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో విద్యాసంస్థలు: రాఘవులు
సాక్షి, హైదరాబాద్ : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో మతోన్మాదం పెరిగింద ని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ప్రారంభమయ్యాయి, ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ, రాజ్యమే మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని, ప్రతీ అంశాన్ని మతానికి జోడించి, ప్రజల మధ్య విభజన తెస్తోందని మండిపడ్డారు. విద్యా, న్యాయ వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఆర్ఎస్ఎస్ చూస్తోందని, దీనికి కేంద్రం సహకరిస్తోందని ఆరోపించారు. మనువాద సిద్ధాంతాన్ని అమలుచేస్తూ, మతాల మధ్య చిచ్చుపెడుతున్నదని విమర్శించారు. దేశంలో సామాజిక తరగతులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఉగ్రవాదం, నల్లధనం పెట్రేగిపోయాయని విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. పేదలు, అట్టడుగు, సామాజిక వర్గాల ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే 28 రాజకీయ, సామాజిక, ఉద్యమ శక్తులతో కలసి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ శిక్షణా తరగతులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నర్సింహారావు ప్రిన్సిపల్‌గా వ్యవహరించగా పార్టీ ముఖ్యులు టి.జ్యోతి, జాన్‌వెస్లీ పాల్గొన్నారు. -
18 నుంచి సీపీఎం జాతీయ మహాసభలు: రాఘవులు
హైదరాబాద్: భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలు ఈ నెల 18 నుంచి 22 వరకు నగరంలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు తెలిపారు. శనివారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జాతీయ మహాసభల ప్రచార బెలూన్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 4 రోజులపాటు జరిగే అఖిల భారత మహాసభలకు సీపీఎం జాతీయ నాయకులు సీతారాం ఏచూరి, బృందాకారత్, కేరళ సీఎం పినరై విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, ఇతర వామపక్షాల నేతలు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. పార్టీ నూతన కమిటీలో మార్పులు, చేర్పులు ఉంటాయన్నారు. మహాసభ సందర్భంగా నగరాన్ని ఎరుపురంగు తోరణాలతో అలంకరిస్తున్నట్లు వివరించారు. మహాసభలకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ నెల 22న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బహిరంగ సభ జరుగుతుందని, సభకు లక్షలాదిగా ప్రజలు తరలిరావాలని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, డి.జి.నర్సింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు సాగర్, ఎస్.రమ, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి భూపాల్ తదితరులు పాల్గొన్నారు. -
‘భూకుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకే’
విజయవాడ: ఇద్దరు మంత్రుల మధ్య తగాదా పెట్టి భూ కుంభకోణం పై నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని సీపీఎం నాయకులు రాఘవులు అన్నారు. ఈ అంశంపై సిట్ దర్యాప్తు సరిపోదని సీబీఐ విచారణ చేపడితే అసలు నిజాలు బయటికొస్తాయన్నారు. రాఘువులు సోమవారం ఉదయం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. హుద్ హుద్ తుఫాన్ పేరుతో రికార్డులు మాయం చేసి వేల కోట్లు విలువ చేసే భూములను దోచుకున్నారన్నారు. భూ కుంభకోణం పై రోజుకో విధంగా ప్రభుత్వం మాట్లడుతోందని విమర్శించారు. బ్యాంక్‌ల నుంచి లోన్లు తీసుకోవడానికే భూ రికార్డులు ట్యాంపర్ చేశారని డీజీపీ చెబుతున్నారని.. అయితే ఇది నేరం కాదా అని రాఘవులు ప్రశ్నించారు. -
వారు అసమర్థులా.. వీరు సమర్థులా
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణపై సీపీఎం నేత బీవీ రాఘవులు స్పందించారు. లోకేష్ కోసమే మంత్రి వర్గ విస్తరణ చేపట్టారని ఆయన విమర్శించారు. 'మంత్రివర్గ విస్తరణ సందర్భంగా మంత్రి పదవి పోయిన వారు అసమర్థులా.. లేక కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన వారు సమర్థులా' అని రాఘవులు ప్రశ్నించారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు అన్యాయం అని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చేసింది న్యాయమా అని రాఘువులు ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపు నేతలకు మంత్రివర్గ విస్తరణలో చంద్రబాబు పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. -
'అంకెలు, గ్రాఫిక్స్ గారడీలు మానుకో'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సీపీఎం నేత బీవీ రాఘవులు ఫైర్ అయ్యారు. ఏపీ సర్కారు తీరు ఇంట్లో ఈగల మేత.. బయట పల్ల మేత అనే సామెతను గుర్తు చేస్తోందని అన్నారు. ఆర్థికాభివృద్ధి పేరిట చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని.. అంకెలు, గ్రాఫిక్స్‌తో ప్రజలను మాయచేయడం మానుకోవాలని హితవుపలికారు. -
ఆ చర్యలతో బాబుకే నష్టం: రాఘవులు
తిరుపతి : ప్రత్యేక హోదా సాధన కోసం విపక్షాలు జరుపుతున్న ఆందోళనలను పోలీసుల నిర్భంధంతో అణచివేయడం వల్ల చంద్రబాబుకే నష్టమని సీపీఎం కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రమంతా పోలీస్ రాజ్యంగా మారుతోందని, ప్రశ్నించే వారిని అణగదొక్కే క్రమంలో చంద్రబాబు పోలీసుల ద్వారా ఉద్యమకారులను నిర్బంధానికి గురి చేయడం సహేతుకం కాదన్నారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు రూ.4 లక్షల కోట్ల నల్లధనాన్ని బయటకు తీస్తామన్న ప్రధాని మోదీ సర్కారు ఇప్పటి వరకు ఎంత మేర బయటకు తీసిందో వెల్లడించలేదని ఆయన మండిపడ్డారు. రూ.16 లక్షల కోట్ల విలువ చేసే రూ.500, 1000 నోట్లను కేంద్రం రద్దు చేస్తే, బ్యాంకుల్లోకి రూ.17 లక్షల కోట్లు వచ్చాయని ఆరోపించారు. పార్టిసిపేటరీ కరెన్సీ(విదేశీ ఇన్వెస్టర్ల కోసం ప్రభుత్వం విడుదల చేసే కరెన్సీ)ని రద్దు చేస్తే విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లడబ్బు బయటకు వస్తుందని అన్నారు. అసలు నోట్ల రద్దు అనేది నల్లధనాన్ని బయటకు తీయడం కోసం కాదని, వేరే ఉద్దేశంతో చేసిన పనిగా రాఘవులు ఆరోపించారు. బడ్జెట్ సమావేశాల్లో తప్పని సరిగా లెక్కలు చెప్పాల్సిందేనని, లేదంటే మోదీని మాయల మరాఠీగా భావించాల్సి ఉంటుందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరిలు అడ్డమైన సవాళ్లు విసరడం మాని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని రాఘవులు సూచించారు. -
నల్లధనంతో నడుస్తున్న సర్కార్: రాఘవులు
ఖమ్మం: నల్లధనాన్ని రద్దు చేసేందుకు పెద్ద నోట్లు రద్దు చేసినట్లు చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ నల్లధనంతోనే నడుస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు ఆరోపించారు. ఖమ్మంలోని మంచికంటి భవన్లో శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. 50 రోజుల్లో అద్భుతం జరుగుతుందని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలపై పెనుభారం మోపారని ఆరోపించారు. -
మోదీ విధానాలతో ఐక్యత ప్రశ్నార్థకం
• సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు సూర్యాపేట: ప్రధాని మోదీ అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలతో దేశంలో ఐక్యత ప్రశ్నార్థకంగా మారిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ప్రారంభమైన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉగ్రవాదుల దాడులను వ్యూహాత్మకంగా వ్యవహరించి తిప్పికొట్టాలి.. కానీ, భారత్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పరిణామాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఉడీలో ఉగ్రవాదులు దాడి చేసి 19 మంది జవాన్లను పొట్టనపెట్టుకుంటే ఎన్డీయే ప్రతినిధి ప్రతిపక్షాలపై విరుచుకు పడడంలో అర్థం లేదన్నారు. కాగా, ప్రజల సౌలభ్యం కోసం జిల్లాల విభజన చేయడం మంచిపనే కానీ శాస్త్రీయ పద్దతిలో వ్యవహరించకుండా సీఎం తన లక్కీ నంబర్ కోసం అవసరమైతే 42 జిల్లాలను కూడా చేసేందుకు ప్రయత్నా లు చేస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఆరోపించారు.జిల్లాల విభజన పూర్తయ్యే వరకు రెండుసార్లు అఖిలపక్షాన్ని పిలుస్తానని చెప్పి ఎందుకు పిలవలేదన్నారు. -
ఏపీకి ప్రత్యేక హోదాకు సీపీఎం మద్దతు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు సీపీఎం పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు టీడీపీ గట్టిగా పోరాడటం లేదని విమర్శించారు. ఢిల్లీలో శనివారం సీపీఎం కేంద్ర కార్యాలయంలో పొలిట్‌బ్యూరో సమావేశమై దేశ రాజకీయ పరిస్థితులపై చర్చించింది. ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని కాదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ప్రజల ఆందోళనను చూసి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని రాఘవులు విమర్శించారు. ప్రత్యేక హోదా సాధించడానికి సీపీఎం మద్దతు ఇస్తుందని చెప్పారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు గురించి రాఘవులు మాట్లాడుతూ.. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని అన్నారు. మల్లన్నసాగర్‌పై ప్రత్యామ్నయాన్ని ఆలోచించాలని సూచించారు. -
సాంకేతిక కారణాలు సరిచేయించాల్సింది..
స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపట్టిన సీపీఎం నేత బి.వి.రాఘవులు అల్లిపురం (విశాఖపట్నం) : పార్టీ ఫిరాయింపులపై చర్యల పిటిషన్‌ను సాంకేతిక కారణాలతో తిరస్కరిస్తున్నాం అనే బదులు వాటిని సరిచేసి ఇవ్వాలని పిటిషన్‌దారులకు స్పీకర్ సూచించి ఉండాల్సిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అన్నారు. టీడీపీలోకి వెళ్లిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ వేసిన పిటిషన్ చెల్లదనడం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు తగదన్నారు. కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్ పరిశీలనలో భాగంగా విశాఖపట్నం వచ్చిన ఆయన ఆదివారం ఇక్కడి సీపీఎం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పిటిషన్లో లోపాలుంటే చెప్పి సరిచేయించాలని, ఇది కేవలం అధికార పార్టీకి మేలు చేయడమేనని స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. స్పీకర్ వ్యవహార శైలి చట్టానికి విరుద్ధంగా ఉందని భావిస్తే వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చన్నారు. -
ఏం ఆశించి వెళ్లారో చెప్పాలి: రాఘవులు
హైదరాబాద్: ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీకి వెళ్లడం అనైతికమని, నేతలు ఏం ఆశించి అధికార పార్టీలోకి వెళ్లారో చెప్పాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని అధికార పార్టీ భావిస్తోందని ఆయన విమర్శించారు. అధికారంలో ఉన్న తరువాత ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడం చంద్రబాబుకు తగదని రాఘవులు హితవు పలికారు. ఓటుకు కోట్ల కేసు, కాల్‌మనీ కేసులు ఎందుకు మూత పడ్డాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాల్‌మనీ కేసులో టీడీపీ నేతలు దొంగల్లా దొరికారు కాబట్టి ప్రభుత్వం స్పందించాలన్నారు. రాష్ట్రంలో కరువు, ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. రాజధాని పేరుతో ఒకే దగ్గర నిధులు కెటాయించడం సరికాదని రాఘవులు తెలిపారు. -
100రోజుల దీక్ష చేస్తాం..
నిజాంషుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిజాం షుగర్ రక్షణ కమిటీడిమాండ్ చేసింది. గురువారం బోదన్ మండల కేంద్రంలో కమిటీ సభ్యులు దీక్ష చేపట్టారు.కమిటీకన్వీనర్ రాఘవులు మాట్లాడుతూ.. 100రోజుల పాటు రీలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. కార్మికులు, రైతులు, పలు ప్రజా సంఘాలు ఈ దీక్షలో పాల్గొన్నాయి. -
విశ్వనగరం ఎలా సాధ్యం?
♦ సమస్యలను గాలికొదిలేసిన టీఆర్ఎస్ ♦ స్థానిక సంస్థలను అవినీతిమయంగా మార్చిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ♦ వీటిని కాక ప్రత్యామ్నాయాన్ని ప్రజలు ♦ ఎంచుకోవాలి.. ‘వన్హైదరాబాద్’ నేతలు ♦ రాఘవులు, చాడ, జేపీ, తమ్మినేని, గౌస్ పిలుపు సాక్షి, హైదరాబాద్: తాగునీరు, రోడ్లు, ట్రాఫిక్ వంటి ప్రధాన సమస్యలు, నగర ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా విశ్వనగరం ఎలా సాధ్యమని వన్ హైదరాబాద్ కూటమి సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ, లోక్‌సత్తా నేతలు ప్రశ్నించారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి, వాటిని అసమర్థ, అవినీతిమయంగా మార్చిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్లను కాకుండా, స్వచ్ఛమైన పాలన అందించే తమ కూటమిని ప్రజలు గెలిపించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో సోమవారం సీపీఎం నేతలు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేతలు చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషా, లోక్‌సత్తా నేతలు జయప్రకాష్‌నారాయణ, పాండురంగారావు, ఎండీ గౌస్(ఎంసీపీఐ-యూ) విలేకరుల సమావేశంలో మాట్లాడారు.పాత, కొత్త నగరాలు... ముస్లిం, హిందువు... తెలంగాణ, ఆంధ్రా, ఉత్తర భారత్ అనే తేడా లేకుండా ప్రజలంతా ఒకటే అని గర్వంగా ప్రకటించడమే... ‘వన్ హైదరాబాద్’ అని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలకు నిధులను హరించడం, సమస్యల పరిష్కారంలో చిన్న చూపు తప్ప స్థానిక సంస్థలపై నమ్మకం, గౌరవం లేదని బీవీ రాఘవులు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల హక్కులను హరించి, పరోక్షంగా తామే పాలన సాగిస్తున్నాయని చాడ వెంకటరెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని, తానే తెలంగాణ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్లు గెలిస్తే ఎలాంటి మార్పు ఉండదని, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తమకు ఎలాంటి ప్రాతినిధ్యం కావాలో తేల్చుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని జయప్రకాష్‌నారాయణ సూచించారు. ప్రజల్లో మార్పు కోసం జీవితాంతం కృషి చేసి, నిజాయితీగా బతుకుతున్న వామపక్ష, లోక్‌సత్తా కూటమి నేతలు కావాలా?... ఎన్నికలను, పదవులను నిచ్చెనగా చేసుకుని సకల సౌకర్యాలు సొంతం చేసుకోవాలనుకుంటున్న వారు కావాలో?.. ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. గతంలో తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేసిన వారే ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల కోసం రాజకీయ అవకాశవాదంతో ప్రకటనలు చేస్తున్నారని ఎండీ గౌస్ ఎద్దేవా చేశారు. రాజకీయ అనిశ్చితి కోసమే టీఆర్ఎస్ పనిచేస్తోందని, ఆ పార్టీ నాయకులు చేస్తున్న ప్రసంగాలకు ఎలాంటి విశ్వసనీయత లేదన్నారు. -
'కాల్‌మనీపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి'
రాజమండ్రి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ వ్యవహారంపై ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణ జరిపించాలని శుక్రవారం సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. కాల్‌మనీ వ్యవహారంలో బాధితులైన మహిళలకు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఈ వ్యవహారంలో దోషులను గుర్తించి వెంటనే శిక్షించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణంపై అఖిలపక్షంతో చర్చించాలని రాఘవులు ప్రభుత్వాన్ని కోరారు. -
'ఏక మొత్తంలో చెల్లించాల్సిందే'
నాగార్జున సాగర్: ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని సీపీఎం నేత రాఘవులు అన్నారు. ఏక మొత్తంలో తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణమాఫీలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ లో ఆదివారం రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో రైతుల కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. -
'కేంద్రం వేసే భిక్షం కోసం చంద్రబాబు పడిగాపులు'
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశం జరిపింది. ఈ భేటీకి సీపీఎం నేతలు సీతారాం ఏచూరి, రాఘవులు హాజరయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదా హామీని విస్మరించాయని వారు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన ప్రత్యేక హోదాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డుకుంటున్నారని వారు మండిపడ్డారు. అదేవిధంగా రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి కేటాయింపులు ఇవ్వకుండా కేంద్రం భిక్షం వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వేసే భిక్షం కోసమే సీఎం చంద్రబాబు పడిగాపులు కాస్తున్నారని విమర్శించారు. తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలపై స్పందించకపోవటం దారుణమని సీపీఎం నేతలు సీతారాం ఏచూరి, రాఘవులు అన్నారు. -
రాజధాని నిర్మాణంలో భారీ అవినీతి
-
'భూమి పూజను అడ్డుకుంటాం'
గుంటూరు: రైతులకు, రైతు కూలీలకు న్యాయం చేయకుండా జూన్ 6 న భూమి పూజ నిర్వహిస్తే అడ్డుకుంటామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో రైతాంగ సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 2న చంద్రబాబు నాయుడు చేపట్టే నవనిర్మాణ దీక్షను రైతు ద్రోహి దీక్షగా అభివర్ణించారు. -
రగిలిన అంగన్వాడీలు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి మాట తప్పిన చంద్రబాబుపై మండిపడ్డ మహిళలు సాక్షి, విజయవాడ బ్యూరో: చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారుపై అంగన్వాడీ మహిళల్లో ఆగ్రహజ్వాలలు ఎగసిపడ్డాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో బాబు వస్తే జాబు వస్తుందంటూ ప్రచారం చేసి తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగులను ఊడబెరుకుతున్నారంటూ మహిళలు మండిపడ్డారు. సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఐకేపీ యానిమేటర్లు, ఆశా వర్కర్లు, గ్రామీణ ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు ఆందోళనల్లో పాల్గొన్నారు. అంగన్వాడీలకు నెలకు రూ.పదివేల వేతనం, అర్హులకు సూపర్వైజర్ పోస్టులను ఇవ్వాలని కోరారు. ఇప్పుడే ప్రకటన చేయాలి: రాఘవులు అంగన్వాడీలకు, కాంట్రాక్టు కార్మికులను న్యాయం జరిగేలా ప్రస్తుత శాసన సభ సమావేశాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ముట్టడి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల హామీకి కట్టుబడి రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు.బాబు సీఎంగా వ్యవహరించడంలేదన్నారు. సింగపూర్, జపాన్, బడా పెట్టుబడిదారులు, ప్రైవేట్ సంస్థలకు సీఈవోగా మారిపోయారని ఎద్దేవా చేశారు. మూడు నెలలుగా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ధర్నాలో పొల్గొన్న గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. ముట్టడి కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఆందోళనలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు సర్కారు కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు తీసేస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా పోలీసులు, నిరసనకారులకు తోపులాట జరిగి కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ప్రకాశం జిల్లాలో ఉద్రిక్తత.. ప్రకాశం జిల్లాలో కలెక్టరేట్‌ను ముట్టడించిన అంగన్వాడీలు, సీఐటీయు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీన్ని ప్రతిఘటించడంతో తొక్కిసలాట జరిగి ఓ అంగన్వాడీ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయింది. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో అంగన్వాడీలు, ఐకేపీ యానిమేటర్లు రాకుండా సరిహద్దుల్లోనే పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్ జిల్లాలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. కర్నూలు జిల్లాలో ఆందోళనకు దిగిన అంగన్వాడీలు తమను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి సంఘీభావం తెలిపారు. విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోను ఆందోళన చేశారు.