
'ఆ రెండు పార్టీలు కులాలు, మతాలను రెచ్చగొడుతున్నాయి'
కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు కులాలు, మతాలను రెచ్చగొడుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు ఆరోపించారు.
కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు కులాలు, మతాలను రెచ్చగొడుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు ఆరోపించారు. ఆ రెండు పార్టీలను ఓడించడమే తమ ముందున్న లక్ష్యమన్ని తెలిపారు. తెలంగాణ బిల్లు తెలుగు ప్రజల మనోభావాలను అవమానించేలా ఉందని ధ్వజమెత్తారు. తెలుగు దేశం పార్టీ భావాలు తమ పార్టీకి పూర్తి వ్యతిరేకమని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న సంబంధాలు అందరికి తెలుసని రాఘవులు పేర్కొన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసి విలేకర్ల సమావేశంలో ఆయనపై విధంగా మాట్లాడారు.