Bharatiya Janata Party
-
ఘోర ప్రమాదం.. ఎమ్మెల్యే కారు ఢీకొని వ్యక్తి మృతి
లక్నో: పశ్చిమబెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి కాన్వాయ్‌లోని కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన రాష్ట్రంలోని పుర్భా మేదినీపూర్ జిల్లాలోని చందీపూర్‌లో గురువారం రాత్రి జరిగింది. పెట్రోల్‌బంక్ వద్ద సీక్ ఇస్రాఫిల్ అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా కారు ఢికొట్టిన్నట్లు ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపారు. అంతేగాక ప్రమాదం జరిగిన తర్వాత కూడా కారు ఆపకుండా వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. కాగా రోడ్డు ప్రమాదానికి కారణమైన కారు నందిగ్రామ్ ఎమ్మెల్యే కాన్వాయ్‌కు చెందినదో కాదో విషయంపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే సువేందు అధికారి మోయినాలో జరిగిన పార్టీ కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు జాతీయ మీడియా నివేదించింది. మరోవైపు ప్రమాదానికి కారణమైన సువేందు అధికారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసనలు వ్యక్తం చేశారు. ఇక నందిగ్రామ ఎమ్మెల్యే సువేందు అధికారి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. దీనిపై సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ రాత్రి 10.30 గంటలకు పెట్రోల్ బంక్ దగ్గర రహదారి దాటుతుండగా కారు ఢీకొట్టింది. స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడు. మృతుడిని సీక్ ఇస్రాఫిల్‌గా గుర్తించాం. ఎమ్మెల్యే సువేందు కాన్వాయ్ కారు గుద్దడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిని ఇంకా ధృవీకరించలేదు. దీనిపై సువేందు అధికారితో సహా బీజేపీ నాయకులెవరూ స్పందించలేదు.’ అని తెలిపారు. చదవండి: కలబురిగిలో నువ్వా.. నేనా! హైదరాబాద్ కన్నడనాట తీవ్ర పోటీ -
బీజేపీ 43వ ఆవిర్భావ దినోత్సవం: పార్టీ పురోగతిలో ఎన్నో త్యాగాలు: ప్రధాని
ఢిల్లీ: నేడు బీజేపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. ఈరోజు ఉదయం 9.00 గం.లకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ జెండాను ఆవిష్కరించిన తర్వాత.. బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘బీజేసీ పురోగతిలో ఎందరివో త్యాగాలు ఉన్నాయి. హనుమాన్ మాదిరిగా కార్యకర్తలు పని చేయాలి. ప్రజాస్వామ్యానికి బారత్ ఓ మాతృక’ అని మోదీ పేర్కొన్నారు. నేటి మధ్యాహ్నం 12 గంటలకు బెంగాలీ మార్కెట్లో వాల్ రైటింగ్ క్యాంపెయిన్‌ను జేపీ నడ్డా ప్రారంభించనున్నారు. కాగా, లోక్‌సభలో రెండు సీట్లతో ప్రస్థానం ప్రారంభించి అత్యధికంగా 303 సీట్లతో కేంద్ర ప్రభుత్వాన్ని స్థాపించింది బీజేపీ. ఆర్ఎస్ఎస్ హిందూ జాతీయ వాదం ఎజెండాతో తొలుత జన్‌సంఘ్‌గా ప్రస్థానం ప్రారంభించింది. దేశంలో ఎమెర్జెన్నీ అనంతరం 1980, ఏప్రిల్ 6వ తేదీన బీజేపీగా రూపాంతరం చెందింది. -
బీజేపీ దూకుడుకు చెక్ పెట్టేలా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికార పార్టీని అన్నివిధాలా ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీని దీటుగా ఎదుర్కొనేలా వ్యూహానికి పదును పెట్టాలని భారత్ రాష్ట్ర సమితి నిర్ణయించింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ, ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణ, సుఖేశ్ చంద్రశేఖర్ ఆరోపణలు, జర్నలిస్టు రాజ్‌దీప్ వ్యాఖ్యల నేపథ్యంలో.. ఆత్మరక్షణ ధోరణిలో కాకుండా ప్రతి విషయంలోనూ ఎదురుదాడి చేయాలని నిర్ణయించింది. మరికొన్ని నెలల్లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జాతీయ నాయకత్వం కనుసన్నల్లో రాష్ట్ర బీజేపీ రాజకీయంగా మరింత ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశముందని బీఆర్ఎస్ అంచనాకు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్దీ ‘పశ్చి మ బెంగాల్ ఎన్నికల తరహా పరిస్థితిని సృష్టించేందుకు ప్రయత్నించవచ్చనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సంప్రదాయ పద్ధతిలో కేవలం ప్రతి విమర్శలు, ప్రత్యారోపణలతో, సాధారణ కార్యక్రమాలతో అడ్డుకట్ట వేయలేమని పార్టీ భావిస్తోంది. బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టే అంశాలకు పెద్దపీట వేయడం ద్వారా ఆ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రతిదాడి చేసేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. ఆతీ్మయ సమ్మేళనాల పేరిట ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం చేసే పనిలో బీఆర్ఎస్ తలమునకలై ఉంది. తాజాగా ఈ సమావేశాలనే వేదికగా చేసుకుని.. రాబోయే రోజుల్లో బీజేపీ ఎలాంటి వ్యూహాలు, ఎత్తుగడలకు పాల్పడే అవకాశముందనే అంశంపై శ్రేణులకు విడమరిచి చెప్పాల్సిందిగా పార్టీ ముఖ్య నేతలను ఆదేశించింది. ‘స్లీపర్ సెల్స్’పై నిఘా బీజేపీతో పాటు ఆ పార్టీ అనుబంధ సంఘాలు కూడా ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టడం, కేంద్ర నాయకత్వం వ్యూహాలను అమలు చేయడంలో భాగంగా క్షేత్రస్థాయిలో క్రియాశీలంగా పనిచేస్తున్న వైనంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందినట్లు తెలిసింది. భావోద్వేగాలు రెచ్చగొట్టడం, శాంతి భద్రతల సమస్య సృష్టించడం లాంటి ఘటనలు రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయని నిఘా వర్గాలు నివేదించినట్లు సమాచారం. మరోవైపు సుమారు ఏడాది కాలంగా బీజేపీ అనుబంధ సంఘాలకు చెందిన ఇతర రాష్ట్రాల నేతలు, కేడర్.. తెలంగాణలో ‘స్లీపర్ సెల్స్’లా పనిచేస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 2020 చివరలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొన్ని ఎంపిక చేసిన డివిజన్లలో ఈ స్లీపర్ సెల్స్ పనిచేశాయని బీఆర్ఎస్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. బీఆర్ఎస్ బలాలు, బలహీనతలను సూక్ష్మస్థాయిలో పోస్ట్‌మార్టం చేస్తున్న ఈ స్లీపర్ సెల్స్ వాటిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఎప్పటికప్పుడు వ్యూహాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ స్లీపర్ సెల్స్ నుంచి అందుతున్న ఆదేశాల మేరకే పేపర్ లీకేజీ వంటి కుట్రల్లో ఆ పార్టీ కేడర్ పాలుపంచుకుంటోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్లీపర్ సెల్స్‌పై నిఘా పెట్టాలని, బీజేపీ కుట్రలు, వ్యూహాలు సమర్ధంగా తిప్పికొట్టా లని అధికార పార్టీ నిర్ణయించింది. మంత్రులకే నాయకత్వం బీజేపీ నేతల వ్యూహాలు, కుట్రలను తిప్పికొట్టేలా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడంతో పాటు, ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వంపై ఎదురుదాడి బాధ్యతను మంత్రులకు అప్పగించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. బీజేపీపై విమర్శలు, ఎదురుదాడి విషయంలో కేవలం మీడియా సమావేశాలకే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో ప్రత్యక్ష కార్యాచరణలో భాగం కావాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కీలక నేతలందరినీ పార్టీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రశ్నపత్రాల లీకేజీ కేసు లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ప్రధాన నిందితుడుగా ఉండటాన్ని ఆసరాగా తీసుకుని మంత్రులందరూ ఏకకాలంలో మీడియా ద్వారా ఎదురుదాడి చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ చేపట్టిన బండి దిష్టిబొమ్మ దహనం, నిరసన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. -
బీజేపీ పవర్ ప్లే..ఎలా పట్టు సాధించింది ?
భారతీయ జనతా పార్టీ దేశాన్ని చుట్టేస్తోంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రధాని మోదీ ఇమేజ్‌ని పెట్టుబడిగా పెట్టి, డబుల్ ఇంజిన్ నినాదంతో రాష్ట్రాల్లో పాగా వేస్తోంది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాలు కమలం దళంలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అభివృద్ధి, శాంతి స్థాపన లక్ష్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల్ని ఎదుర్కొని, అధికార వ్యతిరేకతను ఎదురొడ్డి త్రిపుర, నాగాలాండ్‌లో అధికారాన్ని నిలబెట్టుకుంది. మేఘాలయలో కూడా ఒకప్పటి మిత్రపక్షం కాన్రాడ్ సంగ్మాకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)కి మద్దతు ఇచ్చి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రావడం ద్వారా 2024లో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు బలమైన పునాదులు వేసుకుంటోంది. ఎలా పట్టు సాధించింది ? ఈశాన్య రాష్ట్రాల్లో అసోం, త్రిపురలో హిందూ జనాభా ఎక్కువ. మిగి లిన రాష్ట్రాల్లో గిరిజనులు, క్రిస్టియన్లదే పట్టు. ఆయా రాష్ట్రాల్లో అత్యధికులు బీఫ్ తింటారు. ఇంగ్లిష్ మాట్లాడతారు. దీంతో ఇతర పార్టీలు బీజేపీ హిందూత్వ, హిందీ ఎజెండాను పదే పదే ఎత్తి చూపుతూ కాషాయ దళాన్ని ఇరుకున పెట్టాలని చూశాయి. అయినప్పటికీ ఈశాన్యంలో కాషాయ జెండా రెపరెపలాడింది. త్రిపుర లో శాంతి స్థాపన, అభివృద్ధికే బీజేపీ మొదట నుంచి ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. మౌలిక సదుపాయాలు, హైవేల నిర్మాణం, సురక్షిత మంచి నీరు, ఉచిత రేషన్ , విద్యుత్ సౌకర్యం వంటివన్నీ బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపడానికి కారణాలే. ఎన్నికలకు కాస్త ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 12% డీఏ ప్రకటించి వారిని తమ వైపు తిప్పుకుంది. కేంద్రంలో అధికారంలో ఉండడంతో నాగాలాండ్‌లో కూడా శాంతి చర్చలు చేసి వారి సమస్య పరిష్కారానికి హా మీలు ఇచ్చింది. ఎన్డీపీపీతో పొత్తుతో అధికారా న్ని మళ్లీ నిలబెట్టుకుంది. కొద్ది రోజుల క్రితం మేఘాలయ బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ బీఫ్ తినడం రాష్ట్ర ప్రజల జీవనశైలిలో ఒక భాగమంటూ వ్యాఖ్యానించి ఈశాన్య రాష్ట్రాల్లో బీఫ్ తినడాన్ని బీజేపీ అడ్డుకోదన్న సందేశాన్ని ఇచ్చారు. మైనార్టీ వ్యతిరేక పార్టీ అని విపక్షాలు ప్రచారం చేసినప్పటికీ నాగాలాండ్‌లో 15% నుంచి 19 శాతానికి ఓటు షేర్‌ను పెంచుకోగలిగింది. మేఘాలయలో 9% ఓట్లను రాబట్టింది. నాగాలో శాంతి మంత్రం.. నాగాలాండ్‌లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఉద్యమం చేస్తున్న నాగాలతో శాంతి చర్చలు జరుపుతూ వారి సమస్యను పరిష్కరిస్తామని నచ్చజెప్పడంలో బీజేపీ విజయం సాధించింది. మరోవైపు కాంగ్రెస్, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) పరిమితమైన సీట్లలో పోటీ చేశాయి. 60 అసెంబ్లీ స్థానాల్లో ఎన్పీఎఫ్ 22 స్థానాల్లో పోటీ చేస్తే, కాంగ్రెస్ 23 స్థానాల్లో పోటీకే పరిమితమైంది. నాగా సమస్యని ఎన్డీపీపీతో కలిసి సమష్టిగా పరిష్కరిస్తామని బీజేపీ ఇచ్చిన హామీలు తిరిగి ఆ కూటమి అధికారాన్ని నిలబెట్టుకునేలా చేశాయి. పక్కా వ్యూహంతో సీఎంల మార్పు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికల జరగడానికి ఏడాది ముందు ముఖ్యమంత్రుల్ని హఠాత్తుగా మార్చి పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకునే వ్యూహంలో బీజేపీ విజయం సాధిస్తోంది. త్రిపురలో కాంగ్రెస్–లెఫ్ట్ కూటమి, తిప్రా మోథాలను దీటుగా ఎదుర్కొని అధికార వ్యతిరేకతను ఎదు రొడ్డడానికి ముఖ్య కారణం నాలుగేళ్ల పాటు సీఎంగా ఉన్న విప్లవ్‌దేవ్‌ను పది నెలల క్రితం మార్చడమే. ఆయన స్థానంలో మిస్టర్ క్లీన్‌గా పేరున్న మాణిక్ సాహాను సీఎంను చేయడంతో అధికార వ్యతిరేకత తుడిచిపెట్టుకుపోయింది. గతంలో ఉత్తరాఖండ్‌లో ఇద్దరు సీఎంలను, గుజరాత్లో సీఎంను మార్చి నెగ్గింది. హిమాచల్‌లోనూ సీఎంను మార్చాలని ఎన్నో గళాలు వినిపించినా జైరామ్ ఠాకూర్‌నే కొనసాగించి ఈ ఏడాది మొదట్లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైంది. చిన్న నియోజకవర్గాలున్న త్రిపురలో అభివృద్ధిని చేసి చూపించడంతో పాటు సీఎంను మార్చడం కూడా బీజేపీకి కలిసివచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోదీ ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండటం కూడా ఒక కారణం. అసోం నుంచి త్రిపుర వరకు ► 2016లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కాంగ్రెస్ 15 ఏళ్ల పరిపాలనకు తెర దించింది. ► 2017లో మణిపూర్‌లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ మాజీ సభ్యుడు ఎన్. బైరాన్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. ► 2018లో త్రిపుర ఎన్నికల్లో బీజేపీ 25ఏళ్ల లెఫ్ట్ పాలనకు తెరదించి అధికారంలోకి వచ్చింది ► అదే ఏడాది బీజేపీ మేఘాలయ, నాగాలాండ్‌లలో ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపి అధికారంలోకి వచ్చింది. ► 2019లో అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 41 స్థానాలను కైవశం చేసుకొని విజయ ఢంకా మోగించింది. ► 2021లో అసోంలో మళ్లీ అధికారాన్ని కాపాడుకుంది. ► 2022లో బీజేపీ మణిపూర్‌లో కూడా తిరిగి అధికారంలోకి వచ్చింది. ► 2023లో త్రిపుర, నాగాలాండ్‌లలో అధికారాన్ని నిలబెట్టుకుంది. మేఘాలయలో కూడా అధికారంలో భాగస్వామ్యం కావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. వాజ్‌పేయి హయాంలోనే అభివృద్ధికి బీజం ► 2016లో అసోంతో మొదలైన బీజేపీ జైత్రయాత్ర 2023 వచ్చినా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం వాజ్‌పేయి హయాంలో తొలి బీజం పడింది. కేంద్రంలో మంత్రులతో కమిటీని కూడా ఏర్పాటు చేసి కొత్త ప్రాజెక్టులకు రూప కల్పన చేశారు. అప్పుడు మొదలైన అభివృద్ధి పథం 2014లో నరేంద్ర మోదీ ప్రధాని మంత్రి అయ్యాక పరుగులు తీసింది. అభివృద్ధి కంటికి కనిపించేలా సాగింది.ప్రజల్లో మంచి పట్టు ఉన్న కాంగ్రెస్ నాయకుడు హిమాంత బిశ్వ శర్మ 2015లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి రావడంతో ఈశాన్య రాష్ట్రాల్లో కమలదళానికి పట్టు పెరిగింది. ప్రస్తుతం అసోం ముఖ్యమంత్రి అయిన శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటైన నార్త్ ఈస్ట్ డెమొక్రాటిక్ అలయెన్స్(ఎన్‌డీపీఏ)తో కాంగ్రెస్‌ను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలన్నీ జత కట్టాయి. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నుంచే బిశ్వ శర్మ మూడు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా పర్యటిస్తూ తమకు అనుకూలంగా ఉండే చిన్న పార్టీలను ఎన్‌డీపీఏ గూటికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. డబుల్ ఇంజిన్ నినాదంతో బీజేపీ తనకు అనుకూలంగా ఉండే ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోతూ ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని కొల్లగొడుతూ వచ్చింది. ఎన్. బైరాన్ సింగ్, ప్రేమ ఖాండూ వంటి నాయకులు కాంగ్రెస్‌ను వీడడంతో ఆ పార్టీ ఉనికి కూడా కోల్పోసాగింది. ఎన్‌డీపీఏ కంటే ముందే ఆరెస్సెస్ ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజన తండాల్లో పని చేస్తూ పట్టు పెంచుకోవడం బీజేపీకి కలిసి వచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈశాన్యంలో కమల వికాసం
అగర్తలా/షిల్లాంగ్/కోహిమా: ‘మిషన్ నార్త్ఈస్ట్’ పేరిట ఈశాన్య రాష్ట్రాల్లో జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ కి నూతనోత్తేజం లభించింది. ఈశాన్య భారతంలో కమలం వికసించింది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయా శాసనసభ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. త్రిపురలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ దక్కింది. 60 స్థానాలకు గాను సొంతంగా 32 స్థానాలు గెలుకొని, ఒక్కే ఒక్క స్థానంలో నెగ్గిన మిత్రపక్షం ఐపీఎఫ్టీతో కలిసి వరుసగా రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. నాగాలాండ్‌లో 60 అసెంబ్లీ స్థానాలుండగా, నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ)–బీజేపీ కూటమి 37 స్థానాల్లో పాగా వేసింది. ఎన్డీపీపీకి 25, బీజేపీకి 12 సీట్లు లభించాయి. రెండు పార్టీలు కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. 60 స్థానాలున్న మేఘాలయాలో ఒంటరిగా పోటీకి దిగి, కేవలం 2 సీట్లే గెలుచుకున్న బీజేపీ కింగ్‌మేకర్‌గా అవతరిస్తుండడం గమనార్హం. 26 సీట్లలో నెగ్గిన అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వంలో బీజేపీ మళ్లీ జూనియర్ భాగస్వామిగా చేరినా ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. నాగాలాండ్‌లో 5, త్రిపురలో 3 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ మేఘాలయాలో సున్నా చుట్టేసింది. త్రిపురలో కొత్త పార్టీ తిప్రా మోథా ఏకంగా 13 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. త్రివేణికే ఈ మొత్త్తం క్రెడిట్: మోదీ ఎన్నికల్లో బీజేపీ స్థిరంగా విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మేఘాలయా, నాగాలాండ్, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మూడు రాష్ట్రాల్లో పార్టీ పనితీరు పట్ల కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. బీజేపీ గెలుపునకు గాను క్రెడిట్ మొత్తం ‘త్రివేణి’కే ఇవ్వాలన్నారు. బీజేపీ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులు, ఆయా ప్రభుత్వాల పని సంస్కృతి, పార్టీ కార్యకర్తల అంకితభావం వల్లే విజయాలు లభిస్తున్నాయని స్పష్టం చేశారు. ఈశాన్య ప్రాంతం ఢిల్లీకి, దిల్(హృదయం)కి ఎక్కువ దూరంలో లేదన్న సంగతి ఈ ఫలితాలను బట్టి తెలుస్తోందన్నారు. త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ కూటమి మళ్లీ అధికారం దక్కించుకోవడం పార్టీ కార్యకర్తలందరికీ గర్వకారణమని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. మర్ జా మోదీ(చనిపో మోదీ) అని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని, ప్రజలు మాత్రం మత్ జా మోదీ(వెళ్లొద్దు మోదీ) అని నినదిస్తున్నారని ప్రధాని స్పష్టం చేశారు. ఫలితాలు నిరుత్సాహకరం:కాంగ్రెస్ త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు నిరుత్సాహం కలిగించాయని కాంగ్రెస్ పేర్కొంది. అయితే, ఉప ఎన్నికల్లో మూడు అసెంబ్లీ సీట్లలో సాధించిన విజయం ప్రోత్సాహం నింపిందని తెలిపింది. ఈ ఫలితాలపై సమీక్ష జరిపి, పార్టీ సంస్థాగత బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. త్రిపురలో కాషాయం రెపరెపలు త్రిపురలో బీజేపీ–స్థానిక పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ) కూటమి రెండోసారి అధికారం దక్కించుకుంది. మొత్తం 60 సీట్లకు గాను ఎన్నికల్లో 33 సీట్లు గెలుచుకుంది. ప్రద్యోత్ కిశోర్ దేవ్‌వర్మ నేతృత్వంలోని తిప్రా మోథా పార్టీ 13 స్థానాలు గెలుచుకుంది. ఇక వామపక్షాలు–కాంగ్రెస్ కూటమికి 14 స్థానాలు లభించాయి. 28 స్థానాల్లో పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కనీసం ఖాతా తెరవలేక చతికిలపడింది. ఆ పార్టీ కి కేవలం 0.88 శాతం ఓట్లు లభించాయి. ‘నోటా’ కంటే తక్కువ ఓట్లు పడడం గమనార్హం. బీజేపీ, ఐపీఎఫ్‌టీకి 2018తో పోలిస్తే ఈసారి సీట్ల సంఖ్య తగ్గింది. తిప్రా మోథా పార్టీ గణనీయంగా పుంజుకోవడమే ఇందుకు కారణం. ఈసారి 55 స్థానాల్లో పోటీకి దిగిన బీజేపీకి 32 స్థానాలు గెలుచుకుంది. ఐపీఎఫ్‌టీకి కేవలం ఒక స్థానం లభించింది. 47 సీట్లలో పోటీ చేసిన సీపీఎం కేవలం 11 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. ఫార్వర్డ్ బ్లాక్, సీపీఐ, ఆర్ఎస్పీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై 13 మంది పోటీ చేయగా, ముగ్గురు విజయం సాధించారు. టౌన్ బార్దోవాలీ స్థానంలో పోటీ చేసిన మాణిక్ సాహా తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఆశి‹Ùకుమార్ సాహాపై 1,257 ఓట్ల తేడాతో గెలుపొందారు. మిస్టర్ క్లీన్‌కే మళ్లీ కిరీటం! త్రిపురలో మిస్టర్ క్లీన్‌గా గుర్తింపు పొందిన సాహా వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10 నెలల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడిపించారు. దంత వైద్యుడైన సాహా గతంలో కాంగ్రెస్‌లో పనిచేశారు. 2016లో బీజేపీలో చేరారు. 2020లో త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. 2022 ఏప్రిల్ 3 నుంచి జూలై 4 దాకా రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. గత ఏడాది జరిగిన టౌన్ బార్దోవాలీ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ విప్లవ్ దేవ్ స్థానంలో ఆయనను సీఎంగా నియమించింది. మాణిక్ సాహా నిజాతీయపరుడిగా, కష్టపడి పనిచేసే నాయకుడిగా ప్రజల మనసులు గెలుచుకున్నారు. నాగాలాండ్‌లో ఎన్డీపీపీ–బీజేపీ హవా నాగాలాండ్‌లో అధికార నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ)–బీజేపీ కూటమి మళ్లీ అధికార పీటం దక్కించుకుంది. 60 స్థానాలున్న అసెంబ్లీలో 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. కూటమిలోని ఎన్డీపీపీకి 25, బీజేపీకి 12 సీట్లు దక్కాయి. ఇతర పార్టీ లేవీ రెండంకెల సీట్లు సాధించలేకపోయాయి. ఎన్సీపీ 7, నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) 5 సీట్లు గెలుచుకున్నాయి. ఎల్జేపీ(రామ్‌విలాస్ పాశ్వాన్) 2, ఆర్పీఐ(అథవాలే) 2, ఎన్పీఎఫ్ 2 సీట్లలో గెలుపొందాయి. జేడీ(యూ) ఒక స్థానంలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కి ఒక్కటంటే ఒక్కటి కూడా దక్కలేదు. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అన్ని పార్టీ ల అభ్యర్థులకు ఎన్డీపీపీ నేత, సీఎం రియో అభినందనలు తెలిపారు. చరిత్ర సృష్టించిన మహిళా ఎమ్మెల్యేలు 60 ఏళ్ల నాగాలాండ్ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అధికార ఎన్డీపీపీ టిక్కెట్‌పై పశ్చిమ అంగామీ స్థానం నుంచి హెకాని జకాలు, దిమాపూర్–3 స్థానం నుంచి సల్‌హోటనో క్రుసె విజయం సాధించారు. వారిద్దరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓడించడం విశేషం. మేఘాలయలో హంగ్! మేఘాలయ శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీ కీ స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. రాష్ట్రంలో హంగ్ పరిస్థితులు నెలకొన్నాయి. మేఘలయలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలుండగా, 59 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. సోహియోంగ్ నియోజకవర్గంలో యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (యూడీపీ) అభ్యర్థి డొంకుపర్ రాయ్ లింగ్డో ఫిబ్రవరి 20న మృతిచెందడంతో పోలింగ్ వాయిదా పడింది. ఈ ఎన్నికల్లో 26 సీట్లు గెలుచుకున్న అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అతిపెద్ద పార్టీ గా అవతరించింది. మెజార్టీ కి కొద్దిదూరంలోనే ఆగిపోయింది. కాన్రాడ్ సంగ్మా ప్రభుత్వంలో ఎన్పీపీ మిత్రపక్షంగా వ్యవహరించిన యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (యూడీపీ) 11 స్థానాల్లో నెగ్గింది. కాంగ్రెస్ 5, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు గెలుచుకున్నాయి. ఒంటరిగా పోటీ చేసిన జాతీయ పార్టీ బీజేపీ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ అధినేత జేపీ నడ్డా వంటి అగ్రనేతలు ప్రచారంలో పాల్గొనప్పటికీ ఆశించిన ఫలితందక్కలేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్పీపీ నేత, ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మద్దతును కోరుతున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్పీపీకి సహకరించాలంటూ తమ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారని హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ఎన్పీపీకి మద్దతు తెలియజేస్తూ లేఖ ఇవ్వబోతున్నామని మేఘాలయ బీజేపీ అధ్యక్షుడు ఎర్నెస్ట్ మారీ చెప్పారు. ముఖ్యమంత్రి సంగ్మా దక్షిణ తురా స్థానంలో గెలిచారు. -
బీజేపీలో కలవరం.. కనీస విలువ లేని పదవి నాకెందుకంటూ ‘బొక్కా’ అలక
సాక్షి, రంగారెడ్డి: భారతీయ జనతాపార్టీ జిల్లా (గ్రామీణ) అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి అలకబూనారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లు ఉంటూ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గాల కన్వీనర్ల నియామకంలో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో కినుక వహించిన బొక్క.. అధ్యక్ష పదవిని వదులుకునేందుకు సిద్ధపడ్డారు. ఆధిపత్యపోరుతో నియోజకవర్గంలో పార్టీగా రెండుగా చీలడంతో కమలం శిబిరంలో కలహాలకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే నర్సింహారెడ్డి సూచించిన వ్యక్తిని సెగ్మెంట్ కన్వీనర్ పదవికి ఎంపిక చేయకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. గౌరవంలేని పదవి తనకెందుకని అధిష్టానం ముందు ఆక్రోషం వెళ్లగక్కినట్లు సమాచారం. అగ్రనేతలు బుజ్జగింపులతో ఒకింత మెత్తబడినప్పటికీ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో నొచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. చెల్లుబాటు కాకపోవడంతో.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా ఇటీవల నియోజకవర్గాలకు కన్వీనర్లు, కో కన్వీనర్లను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వం జిల్లా కోర్‌కమిటీ నుంచి అభిప్రాయాలు సేకరించింది. జిల్లా అధ్యక్షుడిగా బొక్కా కొన్నిపేర్లు సిఫార్సు చేశారు. పార్టీ ప్రకటించిన జాబితాలో తాను సూచించిన వ్యక్తికి కాకుండా మరొకరి పేరు ఉండడంతో ఆయన అవాక్కయ్యారు. పార్టీలో తన మాట చెల్లుబాటుకాకపోవడంతో అధ్యక్ష పదవిని సైతం త్యజించేందుకు సిద్ధపడగా.. పార్టీ నేతలు నచ్చజెప్పడంతో వెనక్కితగ్గారు. కానీ, పార్టీలో అంతర్గతంగా ఉన్న లుకలుకలు మరోసారి బయటపడటంతో కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. ఇప్పుడిప్పుడే సంస్థాగతంగా బలపడుతున్న పార్టీకి అధ్యక్షుడి అలక నష్టాలను తెచ్చిపేట్టే అవకాశం లేకపోలేదు. శిక్షణ తరగతులకు దూరంగా.. క్షేత్రస్థాయి కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి రెండేళ్లకోసారి ప్రశిక్షణ్ శిబిరాలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం శామీర్‌పేటలో పార్టీ శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. పార్టీ మూల సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం, వారిని పార్టీ వైపు ఆకర్షితులను చేయడం, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం ఈ శిబిరాల ముఖ్య ఉద్దేశం. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కేడర్ ఈ శిబిరానికి హాజరైంది. బొక్కా నర్సింహారెడ్డి మాత్రం దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఎల్బీనగర్ తర్వాత మహేశ్వరం నియోజకవర్గంలోనే పార్టీ బలంగా ఉంది. ఇది ఆయన సొంత నియోజకవర్గం కూడా. ఇక్కడి నుంచి అందెల శ్రీరాములు, తూళ్ల దేవేందర్‌గౌడ్ తనయుడు వీరేందర్‌గౌడ్ కూడా పోటీపడుతున్నారు. ఎవరికి వారు వ్యక్తిగత కేడర్‌ను తయారు చేసుకుంటున్నారు. ఈ వర్గపోరు కూడా ఆయన మనస్తాపం చెందటానికి మరో కారణమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
మోదీ ఇలాకాలో ఆ సీట్లు బీజేపీకి అందని ద్రాక్షే.. 75 ఏళ్లలో ఒక్కసారీ గెలవలే..!
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కొద్ది రోజుల్లోనే జరగనున్నాయి. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు అందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటి నుంచే ప్రచారం ముమ్మరం చేశాయి. మరోవైపు చూసుకుంటే గడిచిన 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గుజరాత్‌పై బీజేపీకి అంతటి పట్టు ఉన్నప్పటికీ.. 7 అసెంబ్లీ స్థానాలు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయాయంటే నమ్మశక్యం కాదు కదా? అయితే, అది నిజమే. స్వాతంత్య్రం సాధించినప్పటి నుంచి చూసుకుంటే ఆ సీట్లలో కాషాయ పార్టీ పాగా వేయలేకపోతోంది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి 182 స్థానాలు వస్తాయని బీజేపీ చెబుతోంది. అయితే.. ఆ 7 స్థానాల్లో మాత్రం ఎందుకు గెలవలేకపోతోంది? బోర్సాద్, ఝగ్డియా, అంకలావ్, దానిలిమ్దా, మహుధా, గర్బడా, వ్యారా అసెంబ్లీ స్థానాలను ఈసారి ఎలాగైనా గెలవాలని భావిస్తోంది బీజేపీ. మహారాష్ట్ర నుంచి గుజరాత్ 1960లో వేరుపడి రాష్ట్రంగా ఏర్పడింది. అక్కడ 1962లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఆయా స్థానాల్లో కాంగ్రెస్, ఇతర పార్టీలు, స్వతంత్రులు విజయం సాధిస్తూ వస్తున్నారు. ► బోర్సాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో రెండు ఉప ఎన్నికలు ఉండగా.. తొలిసారి స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఆ తర్వాత ప్రతిసారీ కాంగ్రెస్ విజయఢంకా మోగిస్తోంది. ► ఝగ్డియా సీటులో 1962 నుంచి 2017 వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. అక్కడ కాంగ్రెస్, జనతా దళ్, జనతా దళ్ యునైటెడ్, బీటీపీ పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. కానీ, బీజేపీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. ఇక్కడ 1990 నుంచి చోటు వాసవా గెలుస్తూ వస్తున్నారు. ► వ్యారా నియోజకవర్గంలో 14 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో ఓసారి ఉప ఎన్నికలు జరిగాయి. అన్నిసార్లూ కాంగ్రెస్ విజయం సాధించింది. ► మరో ఆసక్తికర అంశం ఏంటంటే అహ్మదాబాద్‌లోని దనిలిమ్దా నియోజకవర్గం సహా.. అన్ని స్థానాలు ట్రైబల్ ప్రాంతాలకు సంబంధించినవే. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రైబల్ ప్రాంతంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకును బీజేపీ చీల్చలేకపోతోంది. ► 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99, కాంగ్రెస్ 77, స్వతంత్రులు 3, బీటీపీ 2, ఎన్సీపీ 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. ఇదీ చదవండి: కేసీఆర్ సర్కార్ 15 రోజుల్లో కూలిపోతుంది.. రాజగోపాల్‌రెడ్డి -
కాంగ్రెస్ పై నిజమైన మోడీ వ్యాఖ్యలు
-
భువనగిరిలో జిట్టా వెళ్లేది ఆ పార్టీలోకేనా..?
-
టీడీపీతో పొత్తుండదు
కర్నూలు కల్చరల్ : ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ ఇన్చార్జ్ సునీల్ దేవ్‌ధర్ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో జరుగుతున్న గాంధీ సంకల్పయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. దివంగత ఎన్టీఆర్ రాజకీయ, సామాజిక విలువలతో టీడీపీని స్థాపిస్తే.. చంద్రబాబు మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని స్వాధీనం చేసుకున్నాడని విమర్శించారు. ఇప్పుడున్న టీడీపీ అవినీతితో నిండిపోయిందన్నారు. టీడీపీని, చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై కేంద్రానికి ఆధారాలు సమర్పిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. బాబు ఓటుకు నోటు విషయంలో ఆరితేరిన వ్యక్తి అని విమర్శించారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త ముఖాలతో.. గెలుపు బాటలో...
ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలకు సంబంధించినంత వరకు అభ్యర్థుల ఎంపిక అత్యంత కీలకం. వందల సీట్లకు పోటీ పడే వేల మందిలో ఎవరికి టికెట్ ఇవ్వాలి... ఎవరు ఎన్నికల్లో గెలుస్తారు..అన్నది అంచనా వేయడం పార్టీలకు అంత సులభం కాదు. టికెట్ లభించని వారు తిరుగుబావుటా ఎగరేస్తే వారిని బుజ్జగించడం మరో తలనొప్పి వ్యవహారం. అభ్యర్థుల ఎంపికలో ఒక్కో పార్టీ ఒక్కో విధానాన్ని అనుసరిస్తోంది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా ఒక వ్యూహాన్ని అనుసరిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొందరిని తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వడమే ఆ వ్యూహం. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేకతను కొంత వరకు అధిగమించవచ్చని కమలనాథుల ఆలోచన. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వ్యూహాన్నే అమలు పరిచి వరుసగా రెండు సార్లు అధికారం దక్కించుకున్నారు. రాజస్థాన్‌లో సగం మంది ఔట్ ! త్వరలో శాసన సభ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్లలో అభ్యర్థుల ఎంపికలో బీజేపీ ఈ వ్యూహాన్నే అమలు పరుస్తోంది. ఛత్తీస్‌గఢ్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ 78 మందితో తొలి విడత అభ్యర్థులను ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 14 మందికి ఈ సారి టికెట్ ఇవ్వలేదు. వీరిలో ఒక మంత్రి కూడా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ తర్వాత ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌లో కూడా ఈ ప్రాతిపదికనే అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఇక్కడ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలలో సగం మందికి ఈ సారి టికెట్ రాకపోవచ్చని తెలుస్తోంది. గ్యారెంటీ లేదు కొత్త వాళ్లని పెడితే తప్పనిసరిగా గెలుస్తామన్న హామీ ఏమీ లేదు. అయితేగియితే ఘోర పరాజయాన్ని తప్పించుకోవచ్చు. రాజస్థాన్‌లో గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఇదే వ్యూహాన్ని అమలుపరిచినా నూరుశాతం ఫలితం దక్కలేదు. 2008 ఎన్నికల్లో బీజేపీ 193 స్థానాల్లో పోటీ చేసింది. వాటిలో 135 చోట్ల కొత్త ముఖాలనే బరిలోకి దింపింది. అయితే, వారిలో 55 మందే గెలిచారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోయింది. 2013 ఎన్నికల్లో బీజేపీ 92 మంది కొత్తవాళ్లకి టికెట్ ఇస్తే వారిలో 68 మంది నెగ్గారు. ఈ ఎన్నికలు బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టాయి. కొత్త వాళ్లతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా గణనీయంగానే నెగ్గుకు రావడం ఇక్కడ విశేషం. సాధారణంగా పార్టీ ఓడిపోతుందని అంచనా వేసిన నియోజకవర్గాల్లోనే కొత్త అభ్యర్థులకు అవకాశం ఇస్తారు. ఆ అభ్యర్థి నెగ్గితే పార్టీకి అదనపు విజయమే. ఒకవేళ ఓడిపోతే ముందే తెలుసు కాబట్టి పార్టీకి పోయేదేం లేదు. 2013 ఎన్నికల్లో ఈ కొత్త ముఖాలు అందించిన అదనపు విజయం వల్లే బీజేపీ ఈ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి రాగలిగింది. కొత్త ముఖాలంటే రాజకీయాలకు పార్టీకి మరీ కొత్త వాళ్లు కాదు. గతంలో పార్టీలో పనిచేసి గుర్తింపు పొందిన వారు, గత ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లనే ఎంపిక చేస్తారు. అంతర్గత సర్వేల ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యే పరపతి ఎలా ఉంది. మళ్లీ టికెట్ ఇస్తే గెలుస్తాడా లేదా అన్నది నిర్థారిస్తారు. గెలవడని తేలితే అక్కడ కొత్త వారికి అవకాశం కల్పిస్తారు. ఓటర్లు కూడా రెండు, మూడు సార్లు ఒకే వ్యక్తికి ఓటేయడానికి ఇష్టపడరు. అలాంటి చోట్ల కొత్త వారిని పెడితే గెలిచే అవకాశాలు బాగా ఉంటాయని బీజేపీ వ్యూహకర్త ఒకరు తెలిపారు. శక్తియాప్‌తో కాంగ్రెస్ ఎంపిక బీజేపీ కొత్త ముఖాలను దింపి గెలుపుకోసం ప్రయత్నిస్తోంటే, కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల అభిమతం మేరకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఇంత వరకు కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక అధిష్టానం ఇష్టం మేరకే జరుగుతూ వస్తోంది. తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా అధిష్టానం ఎంపిక చేసిన అభ్యర్థినే భరించాల్సి వస్తోంది. దీనివల్ల చాలా చోట్ల పార్టీ విజయావకాశాలు దెబ్బతింటున్నాయి. రాహుల్ వచ్చాకా ఈ పరిస్థితి మారింది. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు, నేతల అభ్రిపాయాల మేరకు అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని, దానివల్ల విజయావకాశాలు మెరుగుపడతాయని ఆయన నిర్ణయించారు. అంతేకాకుండా పోలింగ్ బూత్ స్థాయి నుంచీ దృష్టి పెడితే గెలుపుబాటనందుకోవచ్చని కూడా ఆలోచించారు. ఇందుకోసం శక్తి పేరుతోఒక యాప్‌ను కూడా సిద్ధం చేశారు. బూత్ స్థాయి కార్యకర్తలందరూ ఈ యాప్ ద్వారా తమ అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి(రాహుల్ గాంధీకి) పంపుతారు. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ వాటిని పరిశీలించి ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఇంత వరకు 4 లక్షల మంది ఈ యాప్ ద్వారా అభిప్రాయాలు పంపారని పార్టీ విశ్లేషణ విభాగం వర్గాలు తెలిపాయి. అన్ని బూత్‌లు కవర్ అయ్యాయి.. మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్‌లలో ఇంత వరకు 35,82,595 మంది శక్తి యాప్‌లో రిజిస్టర్ చేసుకున్నారని, రాజస్థాన్‌లో నూరు శాతం బూత్‌లను కవర్ చేయడం జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలోనే కాక ఎన్నికల ప్రచారాంశాలుగా వేటిని తీసుకోవాలన్న అంశంపై కూడా బూత్ స్థాయి కార్యకర్త అభిప్రాయాలను తెలుసుకుని వాటి ఆధారంగా ఎన్నికల మ్యానిఫెస్టో తయారు చేయనున్నారు. -సాక్షి, నాలెడ్జ్సెంటర్ -
హార్దిక్ పటేల్ శృంగార వీడియోపై చర్యలేవీ?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మకమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న పటీదార్ల నాయకుడు హార్దిక్ పటేల్ తనపై ‘మార్పిడి చేసిన సెక్స్ సీడీ’ని భారతీయ జనతా పార్టీ త్వరలోనే విడుదల చేస్తుందని చెప్పిన విషయం తెల్సిందే. ఆయన చెప్పినట్లు ఒకటి కాదు, ఆ పార్టీ రెండు వీడియో సీడీలను విడుదల చేసింది. ఒక వీడియోలో హార్దిక్ పటేల్ ఓ మహిళతో సెక్స్‌లో పాల్గొన్నట్లు మరో వీడియోలో హార్దిక్ పటేల్ ఆల్కహాల్ సేవిస్తున్నట్లు ఉంది. ‘హార్దిక్ ఎక్స్పోజ్డ్’ అనే హాష్‌టాగ్‌తో బీజేపీ కార్యకర్తలు, వారి మద్దతుదారులు ఈ వీడియోలపై ట్వీట్లు చేస్తుండగా, ‘రియల్ ట్రూత్ ఆఫ్ హార్దిక్ పటేల్’, బేషరమ్ హార్దిక్ పటేల్’ అంటూ గుజరాత్ బీజేపీ ఐటీ, సోషల్ మీడియా విభాగం కన్వీనర్‌గా చెప్పుకుంటున్న వ్యక్తి ఈ వీడియాలకు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియోలో ఉన్నది తాను కాదని హార్దిక్ పటేల్ ఇప్పటికే చెప్పుకోగా, ఆయనైతే మాత్రం తప్పేముందని, అది పూర్తి వ్యక్తిగత అంశమని ఆయనకు మద్దతిస్తున్నవారు కౌంటర్ ట్వీట్లు చేస్తున్నారు. సెక్స్ వీడియోలో కనిపిస్తున్నది హార్దిక్ పటేల్ అవునా, కాదా ? చర్చనీయాంశమే కాదని, ఆయనే అనుకుంటే ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ‘ప్రైవసీ ప్రాథమిక హక్కు’ అనే వారంతా వాదిస్తున్నారు. ఇటీవల బీజేపీ చత్తీస్‌గఢ్‌లో వ్యవహరించిన తీరు, గుజరాత్లో వ్యవహరించిన తీరుకు పూర్తి విరుద్ధంగా ఉంది. బీజేపీకి చెందిన రాష్ట్ర మంత్రి సెక్స్‌లో పాల్గొన్న వీడియోను కలిగి ఉన్నందుకు మాజీ బీబీసీ జర్నలిస్ట్‌ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ జర్నలిస్ట్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నానా యాగి చేయడంతో ఆ జర్నలిస్ట్‌పై పోలీసులు కేసు కూడా పెట్టారు. ఇక్కడ బీజేపీ మంత్రి వ్యక్తిగత స్వేచ్ఛకు బీజేపీ కార్యకర్తలు అండగా నిలిచారు. జర్నలిస్టులను టార్గెట్ చేస్తున్న సదురు మంత్రిపై స్టింగ్ ఆపరేషన్‌కు వెళ్లడంతో ఆ జర్నలిస్ట్ మంత్రిగారి శృంగారలీలకు సంబంధించిన క్లిప్పింగ్ దొరికింది. ఇక ఆ విషయాన్ని అంతటితో ఆపేస్తే నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ మహిళపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నిఘా ఏర్పాటుచేసిన ‘స్నూప్‌గేట్ స్కామ్’లో బీజేపీ వ్యక్తిగత స్వేచ్ఛను గాలికొదిలేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్ధించారు. ఆధార్‌కు సంబంధించి ‘ప్రైవసీ’పై సుప్రీం కోర్టులో జరిగిన వాదనల సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారతీయులకు వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు కాదని వాదించింది. అంటే బీజేపీ ఎప్పటికప్పుడు వ్యక్తిగత ప్రైవసీపై తన వైఖరిని మార్చుకుంటోంది. అంటే ఎప్పటి ఏ వైఖరి ప్రయోజనకరమో అప్పటికీ ఆ వైఖరిని అవలంబిస్తోందన్నమాట! ఇప్పుడు హార్దిక్ పటేల్ సెక్స్ వీడియోలో ఆయన పరస్పర అంగీకారంతోనే సెక్స్‌లో పాల్గొన్నట్లు స్పష్టం అవడమే కాకుండా మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు కూడా లేదని, అందుకని చత్తీస్‌గ«ఢ్‌లో పోలీసులు వ్యవహరించిన తీరులోనే ప్రజల్లోకి ఈ వీడియో విడుదల చేసిన, వీడియాను రహస్యంగా చిత్రీకరించిన వ్యక్తులపై కేసు పెట్టి వారిని అరెస్ట్ చేయాలని కూడా పటేల్ మద్దతుదారులు ట్వీట్లు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూడాలి! -
రాజస్థాన్ లో ‘కాలా కానూన్’
సాక్షి, న్యూఢిల్లీ : జడ్జీలకు, ప్రభుత్వ సర్వెంట్లకు వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వారిపై ప్రాథమిక దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం నుంచి తప్పనిసరి ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ రాజస్థాన్‌లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇటీవల ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెల్సిందే. దేశంలో వేళ్లూనుకుంటున్న అవినీతిని కూకటి వేళ్లతో సహా నిర్మూలిస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను ఎలా సమర్థిస్తుంది? అత్యున్నత స్థానాల్లో అవినీతికి సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను రాజస్థాన్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఉల్లంఘించడం లేదా? ప్రభుత్వ సర్వెంట్ల పరిధిలోకి రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధర రాజె, ఆమె క్యాబినెట్ మంత్రులు, శాసన సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు వస్తారు. పదవిలో ఉన్న పబ్లిక్ సర్వెంట్లతోపాటు పదవీ విరమణ చేసిన వారిని కూడా విచారించాలన్నా ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అంటే, వసుంధర రాజే దగ్గరి నుంచి ఆమె మంత్రివర్గ సహచరులపై అవినీతి ఆరోపణలు వచ్చినట్లయితే వారు ఆ పదవుల నుంచి తప్పుకున్నప్పటికీ వారి విచారణకు తప్పనిసరి అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే విచారణ జరపనేరాదు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని 156వ సెక్షన్లో సవరణ తీసుకొచ్చింది. కేంద్ర చట్టంలో సవరణ తీసుకోవాల్సి వచ్చినందున రాష్ట్ర గవర్నర్ దానికి తప్పనిసరి ఆమోదం తెలిపాల్సి వచ్చింది. ఇలాంటి చట్టాల విషయంలో గవర్నర్ ఆమోదమంటే కేంద్ర హోం శాఖ అనుమతి ఉన్నట్లే లెక్క. ఈ ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రమాదకర సవరణ కూడా తీసుకొచ్చింది. అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసుల్లో విచారణకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయక ముందే నిందితుల పేర్లనుగానీ, వారి వివరాలనుగానీ వెల్లడించిన జర్నలిస్టులకు రెండేళ్ల జైలు లేదా జరిమానా విధించాలన్నదే ఆ సవరణ. సుప్రీం కోర్టు తీర్పుల ఉల్లంఘనే.... అవినీతి వ్యతిరేక కార్యకర్త, ప్రముఖ జర్నలిస్ట్ వినీత్ నారాయణ్ కేసులో 1997లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఉంది రాజస్థాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్. కొన్ని కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చే అవినీతి ఆరోపణల విషయంలో సీబీఐ విచారణపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం చెల్లదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అంటే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదన్నది ఈ కేసులో తీర్పు సారాంశం. జాయింట్ సెక్రటరీ స్థాయి, అంతకన్నా పై స్థాయి ఉద్యోగుల విచారణకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరంటూ ‘ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్’లోని నిబంధనను 2014లో సుప్రీం కోర్టు కొట్టివేయడం కూడా ఇక్కడ గమనార్హం. చట్టం ముందు అందరూ సమానమంటూ రాజ్యాంగంలోని 14వ అధికరణంను ఉల్లంఘించడమేనని కూడా ఆ తీర్పు సందర్భంగా కోర్టు పేర్కొంది. కేసు విచారణ మొదలు పెట్టడం ఎలా? ప్రాథమిక విచారణ జరిపేందుకు కూడా ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అంటే పరోక్షంగా కేసు విచారణను కాదనడమే. చాలా కేసుల్లో అవినీతి ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక విచారణ జరపనిదే దర్యాప్తు అధికారులు ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించలేరు. అలాంటప్పుడు వారు ఏదైనా కేసు విచారణకు ప్రభుత్వం నుంచి అనుమతి కోరినప్పుడు ఆ కేసుకు సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాధారాలను ఎక్కడ నుంచి తేగలరు? ఎలా తేగలరు? పైగా ఇక్కడ అవినీతి ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు సంస్థలకున్న విచక్షణ లేదా స్వయం ప్రతిపత్తి అధికారాలను దెబ్బతీయడం కాదా! మీడియాకు కఠిన శిక్షల వెనక ఆంతర్యం ఏమిటి? దర్యాప్తుకు అనుమతి పొందిన కేసుల్లో మాత్రమే నిందితుల పేర్లను వెల్లడించాలని, లేకపోతే జర్నలిస్టులకు రెండేళ్లు జైలు శిక్ష విధించడం అన్న నిబంధన దేన్ని సూచిస్తోంది! ప్రాథమిక దశలోనే అవినీతిని వెల్లడించవద్దనా? నిందితుల పేర్లను వెల్లడించకుండా అవినీతి వార్తలను మీడియా ఎలా కవర్ చేయగలదు? 2జీ స్పెక్ట్రమ్ కేసును తీసుకున్నట్లయితే ఎవరి పేరు లేకుండా ఎలా రాయగలం? ఒకవేళ ప్రస్థావించకపోయినా ప్రధాన నిందితుడు ఏ రాజా అన్న విషయం పాఠకులకు అర్థంకాదా? బోఫోర్స్ కుంబకోణం కేసునే తీసుకుంటే మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ గురించి చెబుతున్నట్లా, కాదా? నిందితుడు ఎవరో తెలుస్తోందన్న కారణంగా కూడా జర్నలిస్టులను శిక్షిస్తారా? ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తే పర్యవసానాలేమిటీ? రాజస్థాన్‌లో ఇలాంటి ఆర్డినెన్స్‌ను తీసుకోవడంలో తమ పార్టీకి ఎలాంటి దురుద్దేశాలు లేవని, తమది అవినీతికి వ్యతిరేకంగా పోరాడే పార్టీ అని కేంద్రంలోని బీజేపీ పార్టీ సమర్థించుకుంది. మరి బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి చట్టాలనే తీసుకొస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయి? బెంగళూరులో ఓ ఉక్కు వంతెన నిర్మాణానికి సంబంధించి బీజేపీ ఇటీవల చేసిన అవినీతి ఆరోపణలను మీడియా ప్రచురించడంతోపాటు అవినీతిని వెలికితీసేందుకు కషి చేసింది. రాజస్థాన్ లాంటి చట్టం కర్ణాటకలో కూడా ఉంటే మీడియాకు ఆ అవినీతి ఆరోపణలను ప్రచురించే అవకాశం ఉండేది కాదుకదా? ఇదే విషయాన్ని బీజేపీ నేతల దష్టికి తీసుకెళితే ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చిన రాష్ట్రం రాజస్థాన్ ఒక్కటే కాదని, ఇంతకుముందు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని సమర్థించుకుంటున్నారు. ఇది సమంజసమేనా? -
మాతో పెట్టుకోవద్దు..
సాక్షి: కేరళ ముఖ్యమంత్రి విజయన్ భారతీయ జనతా పార్టీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వెంగర ఉపఎన్నిక ఫలితం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 'కేరళతో పెట్టుకోవద్దు' అంటూ హెచ్చరించారు. అంతేకాకుండా బీజేపీ చేపట్టిన జన రక్షా యాత్రపై విమర్శలు ఎక్కుపెట్టారు. నెలరోజల పాటు చేపట్టిన యాత్ర దండగ అంటూ దుయ్యబట్టారు. ఉప ఎన్నికలో గెలవడానికి మత ఛాందసవాదాన్ని ఆడ్డుపెట్టుకొని పాటు నీచ రాజకీయాలకు దిగిందని బీజేపీపై విరుచుపడ్డారు. అయితే ప్రజలు బుద్ది చెప్పారని అందుకే నాలుగోస్థానానికి పడిపోయిందని విమర్శించారు. ఇప్పటికైన కేరళతో బీజేపీ పెట్టుకోవద్దని, ఇది వారికి బలమైన హెచ్చరిక అని విజయన్ సూచించారు. ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో బీజేపీ కేరళ పర్యాటక రంగాన్ని దెబ్బతీసేలా విష ప్రచారం చేస్తున్నారని విజయన్ మండిపడ్డారు. బాయ్‌కాట్ కేరళ పేరుతో పర్యాటకులు రాకుండా బీజేపీ నేతలు కుట్రలతో అడ్డుకుంటాన్నారని ఆయన ఆరోపించారు. ప్రమాదంలో ప్రజాస్వామ్యం అంశంపై ప్రసంగించిన ఆయన ఇలాంటి అసత్య వార్తలను కేరళ ప్రజలు, పర్యాటకులు నమ్మెద్దని ముఖ్యమంత్రి కోరారు. -
అక్కడ మళ్లీ మేమే గెలుస్తాం!
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యల రాజీనామాలతో ఘోరక్పూర్, ఫుల్పూర్ పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. త్వరలో ఎన్నికలు జరుగనున్న ఈ రెండు స్థానాలను మళ్లీ తమ ఖాతాలోనే వేసుకోవడంతోపాటు గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సాధించాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు ఇక్కడి నుంచి విజయం సాధించి అధికార పార్టీకి గండికొట్టాలని ప్రతిపక్షాలు వ్యూహాల్లో ఉన్నాయి. 2019లో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకం కానున్నాయి. ఘోరక్పూర్ పార్లమెంట్ నియోజకవర్గం రెండు దశాబ్దాలకుపైగా బీజేపీ ఖాతాలోనే ఉండగా, ఫుల్పూర్ నియోజకవర్గంలో మౌర్య గెలవడమే తొలిసారి. ప్రజలు తమ వెంటే ఉన్నారని తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలు తెలియజేశాయని, కేంద్రంలో బీజేపీ అమలు చేస్తున్న పథకాలు వారికి సంతృప్తినిచ్చాయని బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ త్రిపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ రెండు నియోజకవర్గాలు సమాజ్ వాదీ విజయం సాధించి తీరుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ రెండు రోజుల క్రితం జరిగిన ఓ సభలో జోస్యం చెప్పారు. ఈ విజయం 2019 ఎన్నికలకే కాదు.. 2022 అసెంబ్లీ ఎన్నికల తీర్పును ప్రతిబింభిస్తుందన్నారు. ఫుల్పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గతంలో జవహర్లాల్ నెహ్రూ, విజయలక్ష్మీ పండిట్ లాంటి మహామహులు పోటీ చేసి విజయం సాధించారు. 2014లో మౌర్య 5,03,564 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, యోగి.. 5,39,127 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. -
సాటి మనిషికి ఆ మాత్రం సాయం...
-
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మిస్సింగ్
సాక్షి, యూపీ: భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ కీలక నేత మిస్సింగ్ కేసు ఉత్తర ప్రదేశ్ లో సంచలనంగా మారింది. బరేలీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర సింగ్ రాథోడ్ గత మూడు రోజులుగా కనిపించకుండాపోయారు. మంగళవారం రాథోడ్ మధురకు బయలుదేరారు. అయితే అప్పటి నుంచే ఆయన ఆచూకీ లభించకుండా పోయింది. కుటుంబ సభ్యులతోపాటు పార్టీ కార్యకర్తలు కూడా ఆయన కోసం వెతకటం ప్రారంభించారు. అయినా లాభం లేకపోవటంతో పోలీసులను ఆశ్రయించారు. ప్రత్యేక బృందాలు ఆయన ఆచూకీ కోసం రంగంలోకి దిగినా లాభం లేకపోయింది. రాథోడ్ గాలింపు కోసం మరిన్ని బృందాలను నియమించినట్లు అధికారులు చెబుతున్నారు. -
అమర జవాన్ భార్యను అవమానించిన అఖిలేష్
సాక్షి, లక్నో: సమాజ్ వాదీ పార్టీ యువ నేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అమర జవాన్ కుటుంబాన్ని అవమానించాడంటూ విమర్శలు మొదలయ్యాయి. ఒకరికి బదులుగా మరోకరికి సన్మానం చేయటమే అందుకు కారణం. 1965 ఇండో-పాక్ యుద్ధంలో అబ్దుల్ హమీద్ అనే జవాన్ చనిపోగా, ఆరు రోజుల తర్వాత ఆయనకు కేంద్ర ప్రభుత్వం పరమవీర చక్ర అవార్డును ప్రకటించింది. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం అజంఘడ్ జిల్లా నాథ్‌పూర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హమీద్ భార్య రసూలన్ బీబిని అఖిలేష్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. అయితే ఆ వార్తను టీవీల్లో చూసిన హమీద్ అసలు భార్య రసూలన్ షాక్‌కి గురైంది. అఖిలేష్ సన్మానం చేసింది ఎవరికోనని, అసలు ఆ రోజంతా తాను ఇంట్లోనే ఉన్నానని 90 ఏళ్ల రసూలన్ ప్రకటించింది. ఇదే విషయాన్ని ఆమె మనవడు కూడా ధృవీకరించాడు. ఇక విషయం ఆ నోటా ఈ నోటా పాకి బీజేపీ చెవిన పడటంతో అఖిలేష్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఓ వీరుడి కుటుంబాన్ని ఘోరంగా అవమానించారంటూ సమాజ్ వాదీ చీఫ్ పై మండిపడింది. అంతేకాదు సెప్టెంబర్ 10న రసూలన్ను తాము ఘనంగా సత్కరించబోతున్నామని బీజేపీ ప్రకటించింది. తప్పు జరిగిపోయింది: సమాజ్‌వాదీ పార్టీ సన్మాన కార్యక్రమంలో తప్పు జరిగిపోయిందన్న విషయాన్ని సమాజ్ వాదీ పార్టీ ఒప్పుకుంది. నిజానికి అక్కడ రామ్ సముజ్ యాదవ్ అనే అమర జవాన్ విగ్రహావిష్కరణ కార్యక్రమం. ఈ క్రమంలో చుట్టుపక్కల ఉన్న అమర వీరుల కుటుంబాలను ఆహ్వానించాం. రసూలన్ బిబి పేరు జాబితాలో ఉండగా మైక్‌లో నిర్వాహకులు పేరు చదివారు. వెంటనే ఓ 70 ఏళ్ల ఓ వృద్ధురాలు వేదికపైకి రావటంతో ఆమెకు అఖిలేష్ సన్మానం చేశారు. ఆమె రసూలన్ అవునో.. కాదో... నిర్ధారణ చేసుకోకపోవటం మా తప్పే. ఆమెకు క్షమాపణలు తెలియజేస్తున్నాం అని ఎస్పీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అంతేకాదు త్వరలో పార్టీ తరపున ఆమెను ఘనంగా సత్కరించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. -
అసెంబ్లీని కుదిపేసిన రేప్ కేసు
సిమ్లా: బాలిక హత్యాచార కేసు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపింది. ఘటనపై చర్చ చేపట్టాలంటూ బీజేపీ పట్టుబట్టడం.. అందుకు స్పీకర్ అంగీకరించకపోవటంతో సభలో గందరగోళం నెలకొనగా, చివరకు సభ వాయిదా పడింది. జూలై మొదటి వారంలో సిమ్లా కొట్ఖాయ్ పట్టణంలో 16 ఏళ్ల బాలిక అతి దారుణంగా అత్యాచారం ఆపై హత్యకు గురైన విషయం తెలిసింది. ఘటన వెనుక ఆరుగురు సంపన్న కుటుంబానికి చెందిన యువకులు ఉన్నారంటూ ఆరోపణలు కూడా వినిపించాయి. అంతేకాదు నేరస్థుల ఫోటోలు ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ఫేస్ బుక్ పేజీలో అప్ లోడ్ కూడా అయ్యాయి. అయినప్పటికీ సరైన సాక్ష్యాలు లేవంటూ పోలీసులు చెబుతుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఈ అంశం విధాన సభను కుదిపేసింది. నోటీసులు ఇచ్చినప్పటికీ అంశంపై స్పందించేందుకు ప్రభుత్వం ముందుకు రావటం లేదంటూ బీజేపీ ఆరోపించింది. దీనికి తోడు స్పీకర్ బ్రిజ్ బిహరి లాల్ భుటాలి కూడా తనకు ఎలాంటి నోటీసులు అందలేదని, సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్నందున నివేదిక వచ్చాకే చర్చించాలని సూచించటంతో ప్రతిపక్షం స్వరం పెంచి నినాదాలు చేసింది. దీంతో స్పీకర్ 15 నిమిషాలు సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితి మారకపోవటంతో చివరకు స్పీకర్ సభను వాయిదా వేశారు. ఇక సభ వాయిదాతో బీజేపీ అసెంబ్లీ బయట ఆందోళన చేపట్టింది. రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయని ప్రతిపక్ష నేత ప్రేమ్‌కుమార్ దుమాల్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మరోపక్క ఈ కేసులో న్యాయం కోసం పోరాడుతున్నా గుడియా న్యాయ మంచ్ సంఘం రేపు అసెంబ్లీ బయట నిరసనకు పిలుపునిచ్చింది. -
గోరఖ్‌పూర్ ఘటన కొత్తేం కాదు!
న్యూఢిల్లీ: గోరఖ్‌పూర్ పిల్లల మరణాల అంశం కొత్తేం కాదని, ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం బెంగళూర్‌లో ఉన్న ఆయన సోమవారం మీడియా మాట్లాడుతూ... చిన్నారుల మరణాలు ఘోర తప్పిదమేనని పేర్కొన్నారు. ఇక రాజీనామాల డిమాండ్ పై కూడా ఆయన స్పందించారు. "గత ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయటమే వాళ్లకు పనిగా మారిపోయిందని" అని కాంగ్రెస్‌ను ఉద్దేశించి అన్నారు. అయితే ఘటన వెనుక నిర్లక్ష్యం ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ముఖ్యమంత్రి కాలపరిమితితో కూడిన విచారణ కమిటీని నియమించారు. విచారణ పూర్తయి నివేదిక వస్తేనే కానీ ఎవరి పైనా పార్టీ చర్యలు తీసుకోదని, నేరం రుజువైతే ఎంత వారినైనా వదిలే ప్రసక్తే లేదని షా తెలిపారు. కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించే అంశంపై స్పందిస్తూ... పిల్లల మరణం ప్రతీ ఒక్కరినీ కదిలించి వేసింది. కానీ, జన్మాష్టమి ప్రభుత్వానికి సంబంధించిన పండుగ కాదని ఆయన వివరణ ఇచ్చారు. నోటీసులు పంపినా నిర్లక్ష్యం బాబా రాఘవ దాస్ ఆస్పత్రిలో ఇప్పటిదాకా 72 మంది చిన్నారులు చనిపోయారు. వీరిలో 23 మంది ఆక్సిజన్ అందకే చనిపోయారని ప్రభుత్వం పేర్కొంది. అయితే గత ఆరు నెలలుగా 14 సార్లు బిల్లు చెల్లింపుల నోటీసులు పంపించినప్పటికీ కళాశాల సిబ్బంది నిర్లక్ష్యం చేశారనే వాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది. లక్నోకు చెందిన పుష్ప సేల్స్ హెల్త్ కేర్ సంస్థ ఆస్పత్రికి 2014 నుంచి ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేస్తోంది. ఈ నేపథ్యంలో 63.65 లక్షల రూపాయలు ఆస్పత్రి బకాయి పడటంతో, ఈ యేడాది ఫిబ్రవరి నుంచి సదరు కంపెనీ నోటీసులు పంపుతూనే ఉంది." పెషంట్ల ప్రాణాల విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉంటారనే అనుకుంటున్నాం. మీ ఆస్పత్రిలో వాళ్లకి ఆక్సిజన్ సరఫరా ఎంత ముఖ్యమైన అంశమో మీకు తెలిసే ఉంటుంది. మీరు మా కంపెనీకి చాలా బకాయి ఉన్నారు. అయినా సప్లైను ఆపలేదు. దయచేసి ఇప్పటికైనా బకాయిలు పూర్తి చేయండి. లేనిపక్షంలో సిలిండర్ల సరఫరా కొనసాగటం కష్టమౌతుంది" అని కంపెనీ న్యాయవాది వివేక్ గుప్తా పంపిన నోటీసులో స్పష్టంగా ఉంది. -
రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో..!
నేడు అమిత్ షాతో భేటీ బీజేపీలో చేరతారా? లేక సొంత పార్టీ పెడతారా? సాక్షి, బెంగళూరు: శాండల్‌వుడ్‌లో రియల్‌స్టార్‌గా పేరుగాంచిన ఉపేంద్ర రాజకీయ రంగ ప్రవేశంపై కన్నడనాడులో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో ఉపేంద్ర తన సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుత రాజకీయాలపై తన వైఖరిని తెలియజేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరిపాలనా తీరుపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపేంద్ర భారతీయ జనతా పార్టీలో చేరతారా? లేదంటే సొంత పార్టీ ఏర్పాటు చేస్తారా అన్న విషయంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. నేడు( శనివారం) తన నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు సమాచారం. ఇదే రోజు బెంగళూరు రానున్న జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సాయంత్రం 6.15 గంటలకు భేటీ అయ్యేందుకు ఉపేంద్రకు ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా బీజేపీలో చేరతారని, లోక్‌సభ ఎన్నికల్లో మండ్య లోక్‌సభ స్థానానికి బీజేపీ తరపున బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఉపేంద్ర బీజేపీలో చేరతారా లేక ఆంధ్రప్రదేశ్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తరహాలో సొంత పార్టీ ఏర్పాటు చేస్తారా అన్న విషయంపై స్పష్టత రాలేదు. ఈ విషయంపై బీజేపీ అధికార ప్రతినిధి సురేష్‌కుమార్ మాట్లాడుతూ... ఉపేంద్ర రాజకీయాల్లోకి రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆయన ఒక ప్రగతిశీల విధానాలున్న ఓ కళాకారుడు. అయితే ఉపేంద్ర బీజేపీలో చేరడంపై నాకు ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయంపై ఉపేంద్ర , బి.ఎస్.యడ్యూరప్పతో చర్చించారో లేదో కూడా నాకు తెలియదు అని పేర్కొన్నారు. -
జవాన్ల భార్యలపై అసభ్య వ్యాఖ్య.. ఎమ్మెల్సీపై వేటు
ఆర్మీ సైనికుల భార్యలపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్సీ ప్రశాంత్ పరిచారక్‌పై వేటు పడింది. బీజేపీ మద్దతుతో ఎమ్మెల్సీగా గెలుపొందిన ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ మిత్రపక్షం శివసేన సహా ప్రతిపక్షాలు ఆయనపై మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయనను మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం ఏడాదిన్నరపాటు శాసనమండలి నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా 10మంది సభ్యులతో కమిటీ ఏర్పాటుచేసింది. మండలి చైర్మన్ రాంరాజే నింబల్కర్ నేతృత్వంలోని ఈ కమిటీలో అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఎమ్మెల్సీ పరిచారక్ వాదనను విన్న అనంతరం తుది చర్యలకు సిఫారసు చేయనుంది. స్థానిక ఎన్నికల ప్రచారం సందర్భంగా గత నెల పరిచారక్ ప్రసంగిస్తూ సైనికుల భార్యలపై అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఏడాది పొడుగుతా ఇంటికి రాకపోయినా.. తమ భార్యలకు పిల్లలు పుట్టగానే సైనికులు సరిహద్దుల్లో స్వీట్లు పంచుతారని వ్యాఖ్యానించారు. సైనికుల భార్యలు విశ్వాసపాత్రంగా ఉండరంటూ పరోక్షంగా పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలు, పలువురు నేతలు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో పరిచారక్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. -
కమలనాథుల పోటాపోటీ
అధ్యక్ష పదవులు దక్కించుకునేందుకు వ్యూహాలు 10, 11, 12 తేదీలలో జిల్లా కమిటీల ఎన్నికలు ఎవరికివారుగా ప్రయత్నాలు అవసరమైతే ఎన్నికలకు వెళ్లే యోచన వరంగల్ : భారతీయ జనతా పార్టీలో జిల్లా అధ్యక్షుల ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నారుు. అధ్యక్ష పదవులను ఆశిస్తున్న నేతలు ఎవరికివారుగా జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మిగిలిన రాజకీయ పార్టీల తరహాలోనే కొత్త జిల్లాకు ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ ఐదు జిల్లాల కమిటీల నియామకం కోసం నవంబర్ 10, 11, 12 తేదీల్లో ఆయా జిల్లాల్లో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర పార్టీ నిర్ణరుుంచింది. అన్ని జిల్లాల్లోనూ పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నేతలు ఎక్కువగానే ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో ఎక్కువ మంది నేతలు అధ్యక్ష పదవుల కోసం ప్రయత్నిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర స్థారుు ముఖ్యనేతల పరిచయాలతో జిల్లా అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో పోటీ ఇంకా ఎక్కువగా ఉంది. పోటీ ఎక్కువగా ఉండడంతో ఆశావహులు ఏ అవకాశాన్నీ వదుకోవడం లేదు. ప్రత్యర్థుల బలహీనతలను, తమ బలాలను అధిష్టానానికి నివేదిస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉండడంతో అవసరమైతే ఎన్నికలకు సిద్ధమేనని పలువురు ఆశావహులు చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం ఏకగ్రీవంగానే అధ్యక్షులను నియమించేందుకు ప్రణాళిక రచిస్తోంది. కొత్తగా ఏర్పడిన ఐదు జిల్లాలను పరిశీలిస్తే వరంగల్ అర్బన్ జిల్లాలో బీజేపీకి సంస్థాగతంగా కొంత బలం ఉంది. భవిష్యత్‌లో జరగనున్న ఎన్నికల్లో కొంత వరకై నా బలం నిరూపించుకునే అవకాశం ఈ జిల్లాలోనే ఉండనుంది. దీంతో వరంగల్ అర్బన్ జిల్లాలో అధ్యక్ష పదవి కోసం ఎక్కువ మంది నేతలు పోటీపడుతున్నారను. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రావు పద్మ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాడ శ్రీనివాస్‌రెడ్డి, రావుల కిషన్ జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. వరంగల్ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఎడ్ల అశోక్‌రెడ్డిని వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడిగా నియమించే అంశాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పరిశీలిస్తోంది. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు దొంతి దేవేందర్‌రెడ్డి, గుజ్జ సత్యనారాయణరావు, శ్రీరాముల మురళీమనోహర్ ఈ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. జనగామ జిల్లా అధ్యక్ష పదవికి పోటీ ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీఎల్ఎన్ రెడ్డి, సీనియర్ నేతలు పెదగాని సోమయ్య, నెల్లుట్ల నర్సింహారావు, కొంతం శ్రీనివాస్‌లో జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి సైతం అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష పదవిని బీజేపీ సీనియర్ నేతలు వెన్నంపల్లి పాపయ్య, నాగపురి రాజమౌళి, కొత్త దశరథం, చదువు రాంచంద్రారెడ్డి ఆశిస్తున్నారు.మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష పదవి కోసం యాప సీతయ్య, జి.లక్ష్మణ్ నాయక్, బానోత్ దిలీప్ నాయక్, గాదె రాంబాబు, వద్దిరాజు రాంచందర్‌రావు, పూసల శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నారు. -
ఆ పార్టీలోకి వెళ్లిన వారి పరిస్థితి ఏమయ్యిందో తెలిసిందే !
జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ బెంగళూరు : వేరే పార్టీలో ఉంటూ భారతీయ జనతా పార్టీలోకి వెళ్లిన రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో బహిరంగ రహస్యమేనని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ వ్యంగ్యంగా అన్నారు. ఇందుకు బంగారప్ప, రాజశేఖరమూర్తిల రాజకీయ జీవితాలే ప్రత్యక్ష ఉదాహరణలని పేర్కొన్నారు. బెంగళూరులో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో దేవెగౌడ మాట్లాడుతూ... ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన శ్రీనివాస్ ప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగితే తన మద్దతు ఉంటుందన్నారు. ఇతర బీజేపీలోకి కాని, ఇతర పార్టీల్లోకి కాని వెళ్తే తాను ఏమీ చేయలేనని తెలిపారు. నాకు ఒక్కలిగ సంఘానికి సంబంధం ఏమి. నేను ఒక రాజకీయ వేత్తను. అరుునా ఒక్కలిగ సంఘాన్ని బాగు చేస్తానని మంత్రి డీ.కే శివకుమార్ చెప్పారు. కదా? చూద్దాం.’ అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు దేవెగౌడ సమాధానమిచ్చారు. -
మతతత్వ పార్టీలతో ముప్పు
బెంగళూరు: భారతీయ జనతా పార్టీ దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు అసదుద్దీన్ ఒవైసీ నేతత్వంలోని ఎంఐఎం పార్టీతో పాటు ఎస్డీపీఐ పార్టీలతో కలిసి ప్రయత్నాలు చేస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో దేశంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. కేపీసీసీ అధ్యక్షుడిగా డాక్టర్ జి.పరమేశ్వర్ బాధ్యతలు చేపట్టి ఆరేళ్లు పూరైన సందర్భంగా అభినందన సభతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సురాజ్య పేరుతో సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్సలో గురువారం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో దిగ్విజయ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ...విభజించి పాలించు అనే సూత్రాన్ని బీజేపీ అనుసరిస్తోందని అన్నారు. అందుకే ఎంఐఎం, ఎస్డీపీఐ పార్టీలతో బీజేపీ చేతులు కలిపిందని ఆరోపించారు. స్వాతంత్యాన్రికి పూర్వం, తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ మత సామరస్య విధానాన్నే పాటిస్తూ వస్తోందని అన్నారు. ఇదే విధానాన్ని కార్యకర్తలు కూడా కొనసాగించాలన్నారు. సిద్ధరామయ్య నేతత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అత్యుత్తమ పనితీరును కనబరుస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఉత్తమ పథకాలను మీడియా సైతం ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. కావేరి జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుందని, దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు. అరుుతే కావేరి జలాల విషయంలో బీజేపీ చేసిన రాజకీయ కుట్ర సైతం బయట పడాల్సిన అవసరం ఉందని దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొరుులీ మాట్లాడుతూ...గతంలో ఎప్పుడూ సర్జికల్ స్టైక్స్ ్రజరగలేదేని హోంమంత్రి మనోహర్ పారికర్ అంటున్నారని, అరుుతే అది నిజం కాదని, గతంలో సర్జికల్ స్టైక్స్ ్రజరిగినప్పటికీ వాటిని ప్రభుత్వం తమ ప్రచారానికి వినియోగించుకోలేదని అన్నారు. ఇదే సందర్భంలో లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ...ప్రజలకు ఉపయుక్తమైన పథకాలను ప్రవేశపెట్టేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయరాదని సూచించారు. ఇదే సందర్భంలో పార్టీలోనే ఉంటూ ప్రభుత్వంతో పాటు, పార్టీపై విమర్శలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సిద్ధరామయ్యతో పాటు చాలా మంది బహిరంగ వేదిక పైనే నిద్రలోకి జారుకోవడం గమనార్హం. -
‘మహదాయి’ పై రాజకీయాలు వద్దు
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు : మహదాయి విషయంలో భారతీయ జనతా పార్టీ రాజకీయాలను పక్కన పెట్టి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచించారు. తాగునీటి విషయంలో ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలని హితవు పలికారు. సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహదాయి ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు మహారాష్ట్ర, గోవా, కర్ణాటక ముఖ్యమంత్రులు ఈనెల 21న చర్చలు జరపనున్నామన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈనెల 19న అఖిల పక్షం సమావేశాన్ని ఏర్పాటు చేస్తోందని గుర్తు చేశారు. అదే విధంగా గోవాలోని అధికార పార్టీ బీజేపీ కూడా అఖిల పక్షం సమావేశాన్ని అక్కడ ఏర్పాటు చేస్తోందన్నారు. అయితే ఆ రాష్ట్రంలో విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తాము కళసాబండూరికి ఒప్పించాలని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ పేర్కొనడం సరికాదన్నారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే విపక్షంలో లేదని శివసేనతో పాటు మరికొన్ని పార్టీలు కూడా విపక్ష స్థానంలో ఉన్నాయన్నారు. ‘అఖిల పక్షం సమావేశంలో ప్రభుత్వం అన్ని పార్టీల నాయకుల సలహాల అనంతరం తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదే. ఈ విషయాలు తెలిసి కూడా రాజకీయాలు చేయడం బీజేపీకి తగదు.’ అని సీఎం సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్‌బ్రిడ్జి పారదర్శకం... చాళుక్య సర్కిల్ నుంచి హెబ్బాళ వరకూ నిర్మించనున్న స్టీల్‌బ్రిడ్జ్ వివరాలన్నీ బీడీఏ వెబ్సైట్లో ఉన్నాయని మీడియాసమావేశంలో పాల్గొన్న బెంగళూరు నగరాభివద్ధి శాఖ మంత్రి కే.జే జార్జ్ పేర్కొన్నారు. ఈ విషయంలో అక్రమాలకు తావులేదన్నారు. స్టీల్‌బ్రిడ్జిని ఎస్టీం మాల్ వరకూ పొడగించనున్నామని అందువల్లే ఖర్చు కొంత ఎక్కువగా కనిపిస్తోందని ఆయన వివరణ ఇచ్చారు. ఈ విషయంలో అన్ని విషయాలు పారదర్శకంగా ఉన్నాయని విపక్షాలు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నాయని కే.జే జార్జ్ అసహనం వ్యక్తం చేశారు. -
ప్రజా సమస్యలపై బీజేపీ క్షేత్రస్థాయి ఆందోళనలు
• జిల్లా నాయకులకు సూచన • కేంద్ర ప్రభుత్వ పథకాలపై గ్రామ, జిల్లా స్థాయిలో ప్రచారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను గ్రామ, మండల స్థాయిలో ఎండగట్టాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం పార్టీపరంగా చేపట్టే కార్యకమాలను, ఆందోళనలను క్షేత్ర స్థాయి నుంచి మొదలుపెట్టాలని జిల్లా నాయకులకు సూచించింది. పార్టీ నాయకులంతా జిల్లాలు, మండల స్థాయిల్లో పర్యటించాలని.. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై ఉద్యమించేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. గురు, శుక్రవారాల్లో మహబూబ్‌నగర్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో పార్టీ పటిష్టానికి చేపట్టాల్సిన కార్యక్రమాలను చర్చించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహాయం, కేటాయింపుల గురించి ముందుగా కార్యకర్తలకు అర్థమయ్యేలా వివరించాలని నిర్ణయించారు. కేంద్ర పథకాలపై గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ప్రచారం చేసేందుకు పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని జిల్లా నేతలకు పార్టీ సూచించింది. అలాగే ప్రజల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, వ్యవసాయ రంగం, రైతుల సమస్యలు, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై కార్యక్రమాలను రూపొందించుకోవాలని ఆదేశించింది. -
బీజేపీలో ముదిరిన ఆధిపత్యపోరు
కేఎస్ గీ బీఎస్‌వై ‘సంగొళ్లిరాయణ్ణ బిగ్రేడియర్’ ఏర్పాటుపై యడ్డి గరంగరం వచ్చేనెల 26న ‘హింద’ సమావేశాలు బెంగళూరు : భారతీయ జనతా పార్టీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప, ఆ పార్టీ సీనియర్‌నేత కే.ఎస్ ఈశ్వరప్ప మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో యడ్డీ వద్దంటున్నా కే.ఎస్ ఈశ్వరప్ప ‘సంగొళ్లిరాయణ్ణ బ్రిగేడియర్’ పేరుతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. యడ్యూరప్ప బీజేపీ రాష్ట్రాధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు నెలరోజులకు పార్టీ వివిధ విభాగాలకు అధ్యక్షులను, పార్టీ జిల్లా ఇన్ చార్జులను నియమించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులకు, యడ్యూరప్పకు మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ముఖ్యంగా కే.ఎస్ఈశ్వరప్ప తన వర్గీలకు పదవుల కేటాయింపులో అన్యాయం జరిగిందని గుర్రుగా ఉన్నారు. అప్పటి నుంచి అడపాదడపా యడ్యూరప్పకు వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే యడ్యూరప్ప సూచనలను లెక్కచేయకుండా సామాజికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసమంటూ ‘హింద’ సమావేశాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందులో భాగంగా సంగొళ్లిరాయణ్ణ బ్రిగేడియర్ పేరుతో ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ సంఘం ఆధ్వర్యంలో హింద కార్యక్రమాలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేయలని గురువారం నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ బ్రిగేడియర్ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించడమే కాకుండా ప్రత్యేక పతాకానికి కూడా తుది రూపును ఇచ్చారు. ఈ పతాకంలో పసుపుపచ్చని వస్త్రం పై కత్తి, డాలు పట్టుకుని ఉన్న క్రాంతి వీర సంగోళ్లి రాయణ్ణ చిత్రం ముద్రించబడి ఉంటుంది. ఇక వచ్చేనెల 26న మావేరిలో హింద బృహత్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇక వైపున యడ్యూరప్ప ఏ సమావేశమైనా బీజేపీ ఆధ్వర్యంలోనే జరగాలని పట్టుబడుతుండగా కే.ఎస్ ఈశ్వరప్ప మాత్రం కాంత్రివీర సంగొళ్లి రాయణ్ణ బ్రిగేడ్ ఆధ్వర్యంలో ‘హింద’ సమావేశాలను నిర్వహించడానికి సమాయత్తం కావడం కమల వర్గంలోనే కాక రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. బీజేపీ హయాంలో రామరాజ్యం సాధ్యమయ్యిందా?! సంగొళ్లిరాయణ్ణ బ్రిగేడియర్ సంఘం రూపకల్పన అనంతరం కే.ఎస్ ఈశ్వరప్ప తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బీజేపీ హయాంలో రామరాజ్యం వచ్చిందా? లేదు కదా? అటు వంటి రాజ్యం కోసం తనవంతు కృషి చేస్తున్నానన్నారు. అందువల్లే సంగొళ్లిరాయణ్ణ బ్రిగేడియర్ ఏర్పాటైందన్నారు. ఇందులో తాను సభ్యుడిని కాదని అయితే ‘బ్రిగేడియర్’ సభ్యులు పిలస్తే రూపకల్పనలో పాలుపంచుకున్నానన్నారు. బీజేపీలో యువమోర్చా, రైతుమోర్చ తదితర విభాగాలు ఉన్నమాట వాస్తవమే అయినా వారి వల్లే పార్టీ అధికారంలోకి రావడం సాధ్యం కాదన్నారు. ఆ విభాగాల్లో సభ్యులు కాని వేలమంది ఉదాహరణకు ఐఏఎస్, ఐపీఎస్‌లు సంగొళ్లిరాయణ్ణ బ్రిగేడియర్లో సభ్యులుగా ఉన్నారన్నారు. వారి వల్ల పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి తన వ ంతు ప్రయత్నం చేస్తున్నానన్నారు. తనకు పార్టీ పెద్దల మద్దతు కూడా ఉందన్నారు. -
బీజేవైఎం జిల్లా అధ్యక్షుడుగా శ్రీధర్
శంషాబాద్ రూరల్: భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడుగా మండలంలోని తొండుపల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు బైతి శ్రీధర్‌యాదవ్ నియమితులయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి ఈమేరకు ఆయనకు నియామకపత్రం అందజేశారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌గా, శంషాబాద్ బాగ్ కన్వీనర్‌గా, జిల్లా కో-కన్వీనర్‌గా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా పని చేసిన శ్రీధర్ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడుగా నియమితులు అయ్యారు. ఈ సందర్భంగా శనివారం విలేకరులతో శ్రీధర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు. జిల్లాలో 2019 సంస్థాగత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. -
స్వామిపై బీజేపీ పెద్దల ఆగ్రహం!
బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి.. కేంద్రంలోని సీనియర్ మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులపై చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ పెద్దలకు చికాగు పుట్టిస్తున్నాయి. బీజేపీ అగ్రనేతలు స్వామి పట్ల ఆగ్రహంతో ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆర్ఎస్ఎస్ కూడా స్వామి వ్యాఖ్యలను సమర్థించదని బీజేపీ నేతలు చెప్పారు. కేంద్ర మంత్రులు, బ్యూరోక్రాట్లపై స్వామి చేసే వ్యక్తిగత ఆరోపణలను ఆర్ఎస్ఎస్ ఆమోదించదని తెలిపారు. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్‌ను పదవి నుంచి తొలగించాలని స్వామి డిమాండ్ చేయగా, బీజేపీ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. స్వామిది వ్యక్తిగత అభిప్రాయమని, ఆయన అభిప్రాయాలతో ఏకీభవించడంలేదని బీజేపీ స్పష్టం చేసింది. అరవింద్ పై ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రులు సంప్రదాయ, లేదా మన దేశానికే చెందిన ఆధునిక దుస్తులు ధరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వారు టై, కోట్ ధరిస్తే వెయిటర్లలా కనిపిస్తారంటూ స్వామి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. స్వామి తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో బీజేపీ పెద్దలకు కోపం తెప్పించినట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
నీలగిరిపై.. ‘కమలాస్త్రం’
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన తొలి అస్త్రాన్ని జిల్లాపైనే ప్రయోగించనుంది. తెలంగాణ జిల్లాల్లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు పాల్గొనే తొలి బహిరంగసభకు సూర్యాపేట వేదిక కానుంది. అమిత్‌షా జూన్ పదో తేదీన సూర్యాపేటలో జరగనున్న బహిరంగ సభకు హాజరుకానున్నట్లు బీజేపీ రాష్ట్ర శాఖ సోమవారం ప్రకటించింది. దీంతో ఈసభను విజయవంతం చేసేందుకు స్థానిక కమలనాథులు అప్పుడే కసరత్తు కూడా ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలను క్రియాశీలకం చేయడంతోపాటు రెండేళ్ల మోడీ పాలన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ బహిరంగసభ ఏర్పాట్లపై చర్చించేందుకు మంగళవారం సూర్యాపేటలో పార్టీ జిల్లా పదాధికారుల సమావేశం నిర్వహిస్తున్నారు. తొలిసారిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొనే బహిరంగసభను జయప్రదం చేయడం ద్వారా జిల్లాలో తమకున్న బలాన్ని నిరూపిస్తామని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ బహిరంగ సభకు కనీసం 60వేల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని... ఇందులో మన జిల్లా నుంచే 40వేల మంది ప్రజలను కదిలిస్తామని వారు అంటున్నారు. పొరుగున ఉన్న జిల్లాల నుంచి పార్టీ కేడర్ వస్తుంది కనుక మొత్తం మీద 60వేల మందికి తగ్గకుండా బహిరంగసభను నిర్వహించి తమ సత్తా చాటుతామని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. హైదరాబాద్ సభ మరుసటి రోజే... సూర్యాపేటలో అమిత్‌షా బహిరంగ సభకు సంబంధించిన పరిణామాలు వడివడిగా జరిగిపోయాయి. ఆదివారం హైదరాబాద్‌లోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన మండల ప్రతినిధుల సభ ముగిసిన 24 గంటల్లోపే జిల్లాలో బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రకటించారు. అసోం రాష్ట్రంలో లభించిన ఘన విజయాన్ని దక్షిణ భారతదేశంలో విస్తరింపజేయాలని, ఇందులో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే మొదటి టార్గెట్‌గా పెట్టుకుంటామని హైదరాబాద్ సభలో చెప్పిన కమలనాథులు.. వెంటనే జిల్లాలో బహిరంగసభను ఖరారు చేయడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. అమిత్‌షా పాల్గొన్న ఈ మండల ప్రతినిధుల సభకు జిల్లా నుంచి రెండు వేల మంది ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సభలో బీజేపీ సారధి ఇచ్చిన ప్రసంగంతోకమలానాథులు నూతనోత్తేజం పొందారు. మళ్లీ జిల్లాలో అమిత్‌షా బహిరంగ సభ నిర్వహించేందుకు అనుమతి రావడంతో దాన్ని విజయవంతం చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. బీజేపీకి జిల్లాను ఆయువుపట్టు చేస్తాం అమిత్‌షా హైదరాబాద్ సభ ముగిసిన వెంటనే జిల్లాలో బహిరంగ సభను ప్రకటించడం, అందుకు రాష్ట్ర పార్టీ అనుమతి ఇవ్వడం మంచి పరిణామమే. జిల్లాలో బీజేపీకి ఉన్న బలం ఈ బహిరంగ సభతో రెట్టింపవుతుంది. అమిత్‌షా ఇచ్చిన స్ఫూర్తితో ముందుకెళతాం. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసి తెలంగాణలో బీజేపీకి నల్లగొండ ఆయువుపట్టు అని నిరూపిస్తాం. - వీరెల్లి వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా అధ్యక్షుడు -
ఆయన అలా మాట్లాడటం సరికాదు
బెంగళూరు: కరువు పరిస్థితులు పెద్దగా లేవని కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సహాయం అక్కరలేదని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న సిద్ధరామయ్య పేర్కొనడం సరికాదని భారతీయ జనతా పార్టీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు విషయంలో కూడా రాజకీయాలు చేయడం వల్ల ప్రజలు ఇబ్బందుల పాలవుతారని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో ఎప్పుడూ లేనంతగా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఇక్కడ కరువు పరిస్థితులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిపుణులను కర్ణాటకకు పంపించి క్షేత్రస్థాయి అధ్యయనం జరిపించిందన్నారు. అధికారుల నివేదికను అనుసరించి గతంలో ఏ ప్రభుత్వం మంజూరు చేయని నిధులను కరువు నివారణ పనుల నిమిత్తం రాష్ట్రానికి కేటాయించిందని యడ్యూరప్ప ఈ సందర్భంగా గుర్తుచేశారు. కరువు ఉందనే ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉత్తర కర్ణాటక ప్రాంతంలో పర్యటించలేదా? అని యడ్డీ ప్రశ్నించారు. కరువు పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంతో నివారణ పనుల కోసం తమ పార్టీకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతాన్ని ప్రభుత్వానికి అందజేయనున్నామన్నారు. -
అందరి సహకారంతో పార్టీ బలోపేతం
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యడ్యూరప్ప బెంగళూరు: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖకు సంబంధించిన ఏ విషయమైన పార్టీ పధాదికారులతో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటానని ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప తెలిపారు. ఏ విషయం పైన కూడా తానొక్కడినే నిర్ణయం తీసుకోబోనని ఆయన స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం బీజేపీ పార్టీ నగరంలోని ప్యాలెస్ మైదానంలో ‘సామరస్య-సమావేశం’ పేరుతో నిర్వహించిన కార్యకర్తల బృహత్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులను ఏకతాటిపై నడిపించి కర్ణాటకలో తిరిగి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని తనకు ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా దిశానిర్దేశం చేశారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పై కఠినచర్యలకు వెనుకాడబోనని యడ్యూరప్ప స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 224 నియోజక వర్గాల పరిధిలో పార్టీ పటిష్టత కోసం క్షేత్రస్థాయి మార్పులు అవసరమన్నారు. మహిళ, దళిత, రైతు, యువ మోర్చా విభాగాలను బలోపేతం చేయనున్నానని తెలిపారు. ఇందుకోసం వారంలో మూడు నుంచి నాలుగు రోజులు రాష్ట్ర పర్యటనలో ఉండి ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటానని తెలిపారు.గతంలో బీజేపీలో ఉండి, ఆ తర్వాత పార్టీని వీడిన వారు ఎవరైనా సరే బీజేపీలోకి వస్తే తాము చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని యడ్యూరప్ప ప్రకటించారు. నెలలోపు అవినీతి చిట్టా బయటికి తీస్తా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వ ఆస్పత్రుల్లో ల్యాబ్‌లను ఏర్పాటు చేసే విషయమై ఆయన కుమారుడు డెరైక్టర్‌గా ఉన్న సంస్థకు టెండర్లను దక్కేలా చేశారని విమర్శించారు. సిద్ధరామయ్య ప్రభుతంలో జరిగిన ఇలాంటి అక్రమాలన్నింటిని నెలలోపు ప్రజల ముందుకు తీసుకు వస్తానన్నారు. రాష్ట్రంలో 1,200 మంది రైతులు అత్మహత్యలకు పాల్పడితే కేవలం 340 నుంచి 350 మందికి మాత్రమే పరిహారం అందిందన్నారు. మిగిలిన వారికి బీజేపీ తరపున ఒకలక్ష నుంచి రెండు లక్షరుపాలయ పరిహారం అందించాల్సిన విషయమై వేదిక పై ఉన్న నాయకులే కాకుండా ప్రతి కార్యకర్త ఆలోచించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో కరువు నివారణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1550 కోట్ల నిధులు విడుల చేసినా వాటిని వినియోగించుకోవడంలో సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌తో పాటు బీజేపీ నేతలు శ్రీరాములు, సురేష్‌కుమార్, ప్రహ్లాద్‌జోషి, శోభాకరంద్లాజే, ఆర్.అశోక్ తదితరులు పాల్గొన్నారు. కాగా, మరో కేంద్ర మంత్రి సదానంద గౌడ గైర్హాజరు కావడం గమనార్హం. ఇదిలా ఉండగా ఇక ఈ వేదికను యడ్యూరప్ప తన బలప్రదర్శనకు వినియోగించుకున్నారు. అనుచరులుగా ఉంటూ తాను పార్టీని వీడిన సమయంలో బీజేపీ నుంచి బయటికి వచ్చేసిన వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా బీజేపీకి తన అవసరం ఎంత ఉందన్న విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాక ఈ సమావేశానికి వేలాది సంఖ్యలో కార్యకర్తలను సమీకరించడం ద్వారా తను మాస్ లీడర్నని మరోసారి చాటిచెప్పే ప్రయత్నం చేశారు. -
దీటైన వ్యక్తి ఎవరు !
కాంగ్రెస్‌లో మదనం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీఎస్వైకి కట్టబెట్టిన నేపథ్యంలో ఇతర పార్టీల్లో తర్జన భర్జన చుక్కాని లేని నావలా కాంగ్రెస్ వాయిదా పడుతున్న కేపీసీసీ చీఫ్ ఎంపిక మారుతున్న రాజకీయ సమీకరణలు బెంగళూరు: రాష్ట్ర రాజకీయాల్లో సమీకర ణలు మారుతున్నాయి. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నియమక ప్రకటన వెలువడిన వెంటనే ఇందుకు నాంది పడింది. వచ్చే ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించే నాయకుడి కోసం కాంగ్రెస్ తర్జన భర్జన పడుతోంది. రాష్ట్రంలో మరో రెండేళ్లలో శాసనసభ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాజకీయాల్లో అపర చాణుక్యుడిగా పేరొందిన యడ్యూరప్పకు కర్ణాటకశాఖ అధ్యక్ష పదవి ఇస్తూ కమలనాథులు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర రాజకీయాలను లింగాయత్, ఒక్కలిగ వర్గాలు శాసిస్తున్న విషయం బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో లింగాయత్ సముదాయానికి చెందిన యడ్యూరప్పకు కమలనాథులు రాష్ట్ర అధ్యక్షస్థానం కట్టబెట్టారు. మొదటి నుంచి దూకుడు స్వభావం కలిగిన వ్యక్తిగా పేరొందారు. అధికారంలో ఉన్నా....ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయ ప్రత్యర్థుల తప్పులను సూటిగా పట్టిచూపడంతో పాటు ఆ విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం యడ్యూరప్పకు వెన్నతోపెట్టిన విద్య అని రాజకీయ ప్రత్యర్థులు సైతం కాదనలేని సత్యం. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థ పార్టీలైన కాంగ్రెస్ నాయకులు యడ్డీ చర్యలకు దీటుగా ప్రతిస్పందించే నాయకుల వేటలో పడ్డాయి. కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) ప్రస్తుత అధ్యక్షుడి పదవి కాలం గత ఏడాది చివ రిలోనే ముగిసింది. అప్పటి నుంచి కేపీసీసీ నూతన సారథి ఎంపిక వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తూనే ఉంది. అయితే మొదటి నుంచి ఆ పదవి వెనుకబడిన తరగతుల వర్గానికి చెందిన వారికి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అది కుదరని పక్షంలో లింగాయత్ వర్గానికే చెందిన ఎస్.ఆర్ పాటిల్ లేదా అప్పాజీనాడగౌడకు ఆ పదవి దక్కే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతూ వచ్చారు. అయితే వీరికి రాష్ట్ర రాజకీయాల్లో ‘నెమ్మదస్తులైన నాయకులుగా’ పేరుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం బీజేపీ రాష్ట్రశాఖకు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే లింగాయత్ వర్గానికి చెందిన యడ్యూరప్ప సారథ్యం వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్.ఆర్ పాటిల్ లేదా అప్పాజీనాడగౌడకు పార్టీ అధ్యక్ష పదవి అప్పగించడం ఎంతవరకూ సబబు అన్న ప్రశ్నను ఆ పార్టీ నాయకులే వేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కేపీసీసీ అధ్యక్ష పదవి అటు వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తికి ఇటు లింగాయత్ సముదాయానికి కాకండా రాష్ర్ట రాజకీయాల్లో ప్రధాన భూమికను పోషించే మరో సముదాయమై ఒక్కలిగ సముదాయానికి చెందిన నాయకుడికి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే జరిగితే ప్రస్తుత ఇంధన శాఖ మంత్రి డీ.కే శివకుమార్‌కు కేపీసీసీ అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉంది. త్వరలో జరిగే మంత్రివర్గ పునఃరచనలో కూడా హైదరాబాద్-కర్ణాటక ప్రాంతానికి చెందిన లింగాయత్, ఒక్కలిగ సముదాయాలకే పెద్ద పీఠ వేయాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. జేడీఎస్ నాయకుల చూపు బీజేపీ వైపు... రాష్ట్రంలో జేడీఎస్ అధికారంలోకి వచ్చి దాదాపు పదేళ్లు అవుతోంది. ఈ పదేళ్లలో జరిగిన బీబీఎంపీ, జిల్లా, తాలూకా పంచాయతీ అధ్యక్ష తదితర అన్నికల్లో జేడీఎస్ నిర్ణయాత్మక పాత్ర మాత్రమే పోషించింది తప్పిస్తే ఒక ఎన్నికలో కూడా అధికారాన్ని చేపట్టలేదు. దీంతో ఆ పార్టీ నాయకులు మాటలకు విలువ లేకుండా పోతోంది. దీంతో ఆ పార్టీలోని నాయకులు రాజకీయ భవిష్యత్తు గురించి ఇప్పడే లెక్కలు వేసుకుంటున్నారు. ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీపై అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయినట్లు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, జిల్లా, తాలూకా పంచాయతీ అధ్యక్ష ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు రాబట్టింది. మరోవైపు మాస్ లీడర్‌గా పేరొందిన యడ్యూరప్ప ఆ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీ నుంచి ఎవరు వచ్చినా బీజేపీ తలుపులు తెరిచే ఉంటాయని యడ్డీతో పాటు మండలి విపక్ష నేత కే.ఎస్ ఈశ్వరప్ప బహిరంగంగానే పేర్కొన్నారు. దీంతో దళం నాయకులు మఖ్యంగా పాత మైసూరు ప్రాంతానికి చెందిన వారు బీజేపీ వైపు చూస్తున్నారని చెబుతున్నారు. బీజేపీలోనూ...ప్రస్తుతం శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా లింగాయత్ సముదాయానికి చెందిన జగదీష్‌శెట్టర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా అదే సమాజిక వర్గానికి చెందిన యడ్యూరప్ప బీజేపీ రాష్ట్రాధ్యక్ష పదవిని చేపట్టారు. ఇలా ముఖ్యమైన పదవులన్నీ ఒకే వర్గానికి చెందిన వారికి కేటాయించడం సరికాదని కమల నాయకులు భావిస్తున్నారు. దీంతో శాసనసభ ప్రతిపక్ష నాయకుడి పదవిని రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర చూపిస్తున్న మరో వర్గానికి కట్టబెట్టాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోందని సమాచారం. ఈతరుణంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల్లోనే కాకుండా స్వపక్షంలోనూ రాజకీయ సమీకరణలు మారుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. యడ్డి తొలి సమావేశం.. ఇదిలా ఉంటే యడ్యూరప్ప ఆదివారం నగరంలోని పార్టీ ప్రధాన కార్యాయంలో నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లతో పాటు ఇతర ప్రధాన నాయకులతో సమావేశమై ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. యడ్యూరప్ప అధ్యక్షుడిగా ఎంపికైన తరువాత నిర్వహించిన మొదటి సమావేశం ఇదే. ఇదిలా ఉంటే ఈనెల 14న ప్యాలెస్ గ్రౌండ్స్‌లో సాయంత్రం నిర్వహించే బృహత్ సమావేశాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని తీర్మానించారు. -
గంట కూడా విశ్రాంతి తీసుకోను
బెంగళూరు: భారతీయ జనతా పార్టీని కర్ణాటకలో అధికారంలోకి తీసుకువచ్చేంతవరకూ గంట పాటు కూడా నిద్రపోనని ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడుగా నియమితులైన యుడ్యూరప్ప పేర్కొన్నారు. తనను పార్టీ కర్ణాటక రాష్ట్రాధ్యక్షుడిగా ఎంపిక చేసినందుకు పార్టీ జాతీయాధ్యక్షుడైన అమిత్‌షాను ఢిల్లీలోని ఆయన నివాసంలో శుక్రవారం కలుసుకుని యడ్డీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన పై నమ్మకం ఉంచి అధ్యక్షస్థానం కల్పించిన పార్టీ పెద్దల నిర్ణయాన్ని వమ్ముచేయనన్నారు. 2018లో కర్ణాటకలో జరిగే శాసనసభ ఎన్నికల్లో బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తానని తెలిపారు. ఇందు కోసం ప్రతిక్షణం కష్టపడుతానని తెలిపారు. పార్టీ నాయకులందరినీ ఏకతాటి పై తీసుకువచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళుతానని స్పష్టం చేశారు. తన పై వచ్చిన అవినీతి ఆరోపనల్లో చాలా వరకూ కోర్టులు కొట్టేసాయన్నారు. ఒకటి రెండు కేసుల్లో కూడా తాను నిర్దోషినని తేలుందని యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా శుక్రవారం రాత్రి ఆయన బెంగళూరు చేరుకున్నారు.పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. యడ్యూరప్ప మాట్లాడుతూ శనివారం నుంచి రాష్ర్ట వ్యాప్తంగా పర్యటిస్తానన్నారు. -
విశాల్‌కు బీజేపీ వల
దక్షిణ భారత నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నటుడు విశాల్ కోసం భారతీయ జనతా పార్టీ వల విసిరినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. క్రికెటర్ శ్రీకాంత్ ఇందుకు సంబంధించి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. * క్రికెటర్ శ్రీకాంత్ సిఫార్సు * వచ్చేనెల ప్రధాని మోదీ, అమిత్‌షా రాక చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో అనేక పార్టీల్లో సినీ గ్లామర్ పరిపాటిగా మారింది. అన్నాడీఎంకే, డీఎంకే, డీఎండీకేల్లో కోలీవుడ్ కళకు కొదువేలేదు. మూడు పార్టీల తరఫున నటీనటులు ప్రచారం చేయనున్నారు. అన్నిపార్టీలకు దీటుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను రంగంలోకి దించాలని బీజేపీ భారీ ప్రయత్నాలే చేసింది. తాజా పార్లమెంటు ఎన్నికల సమయంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా నిలిపేందుకు సిద్ధమని రజనీకి బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ ఏకంగా రజనీ ఇంటికే వెళ్లారు. పార్టీ నేతలు అనేకసార్లు కలిశారు. ఎన్నిచేసినా తాను ఎన్నికలకు, రాజకీయాలకు దూరమని నర్మగర్భంగా రజనీ చెబుతూనే ఉన్నారు. విశాల్ కోసం యత్నం ప్రస్తుతం కోలీవుడ్‌లో క్రేజీస్టార్‌గా వెలుగొందుతున్న విశాల్‌ను పార్టీలోకి తీసుకురావాలని బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. చెన్నైవాసుడైన క్రికెటర్ శ్రీకాంత్ విశాల్ కోసం గట్టిగా సిఫార్సు చేస్తున్నారు. పార్టీ అగ్రనేత మురళీధరరావుతో శ్రీకాంత్ సంప్రదింపులు జరిపారు. మైలాపూరు నియోజకవర్గం నుంచి విశాల్‌ను పోటీకి పెట్టాలని శ్రీకాంత్ ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి పోటీకి సీనియర్ నటీనటులు విసు, నటి వైజయంతీమాల తదితరుల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే విశాల్‌ను సైతం ఎన్నికల బరిలో దించాలని బీజేపీ సైతం భావిస్తోంది. నడిగర్ సంఘం భవన నిర్మాణంలో తలమునకలై ఉన్నందున మరో ఆరునెలలు విరామం లేదని విశాల్ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అయితే బీజేపీ మాత్రం విశాల్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. వచ్చేనెల మోదీ, అమిత్‌షా పర్యటన జార్జికోటపై జెండా పాతేందుకు భారతీయ జనతా పార్టీ అధిష్టానమే కదలివస్తోంది. ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా త్వరలో తమిళనాడుకు వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన బీజేపీ కూటమి కోసం రాష్ట్ర నేతలు అన్నిరకాల ప్రయత్నాలు చేశారు. తాజా పార్లమెంటు ఎన్నికల్లో తమతో కలిసి నడిచారన్న నమ్మకంతో డీఎండీకే, పీఎంకే తదితర పార్టీలను అనేకసార్లు ఆహ్వానించారు. అలాగే మరోవైపు అన్నాడీఎంకే నుంచి అమ్మ పిలుపు కోసం ఆశగా ఎదురుచూశారు. ఆఖరుకు కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ ఎన్నికల వ్యవహారాల ఇన్చార్జ్ ప్రకాష్ జవదేకర్ సైతం రంగంలోకి దిగారు. అయితే ఈ ప్రయత్నాలేవీ ఫలించలేదు. పొత్తు చర్చలతో నిమిత్తం లేకుండా బీజేపీ అభ్యర్థుల ఎంపిక సాగుతోంది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థులను నిలపాలని అధిష్టానం ఆదేశించింది. ఎవ్వరూ ఊహించని రీతిలో 234 నియోజకవర్గాలకు మూడువేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఒంటరిపోరా లేక మరేదైనా పార్టీలు ముందుకు వస్తాయా అని బీజేపీ సందిగ్ధంలో ఉంది. పార్టీలోని ఎక్కువ శాతం మంది ఒంటరి పోరుకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఒంటరిగా పోటీ చేయడం ద్వారా బీజేపీ బలమేంటో తేటతెల్లం కాగలదని పార్టీశ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఈ అభిప్రాయాలను పార్టీ అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లడంతో మోదీ, అమిత్‌షా స్వయంగా రాష్ట్రానికి చేరుకుంటున్నారు. అగ్రనేతలు వచ్చేలోగా పార్టీ మేనిఫెస్టోను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ నెలలో మోదీ, అమిత్‌షా ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రంలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు సోమవారం తెలిపాయి. -
మాపై దుష్ర్పచారం
మాపై దుష్ర్పచారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పోలవరం సాకారం బాధ్యత ఏన్డీయే ప్రభుత్వానిదే నిధులపై సీఎం చంద్రబాబుకు బెంగ అక్కర్లేదని వ్యాఖ్య కాకినాడ: ఆంధప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రప్రభుత్వం సహకరించడం లేదని ప్రచారం చేయడం దుష్ర్పచారమేనని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టించడం తప్ప మరొకటి కాదన్నారు. కేంద్రం ఇప్పటివరకూ అన్ని పథకాలు, ప్రాజెక్టులకు కేటాయింపులద్వారా రాష్ట్రప్రభుత్వానికి రూ.లక్షా నలభై వేల కోట్లు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రానికి నిధుల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని షా వ్యాఖ్యానించారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎలాంటి లోటూ రానివ్వదని హామీఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన బీజేపీ బహిరంగసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన ప్రసంగం ఆద్యంతం ఉద్వేగంగా సాగింది. ఈ సందర్భంగా పలు అంశాల్ని ఆయన ప్రస్తావించారు.ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయాన్ని చెప్పడంతోపాటు రాష్ట్రంలో పార్టీని బూత్‌స్థాయిలో బలోపేతం చేయాలని పిలుపునివ్వడానికే రాజమహేంద్రవరం వచ్చానన్నారు. పోలవరం బాధ్యత కేంద్రానిదే.. ఆంధ్రప్రదేశ్‌కు జీవనధారలాంటి పోలవరం ప్రాజెక్టును సాకారం చేసే బాధ్యత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానిదేనని అమిత్ షా భరోసానిచ్చారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులివ్వట్లేదని దుష్ర్పచారం జరుగుతోందన్నారు. ఏ ప్రాజెక్టుకైనా నిధులన్నీ ఒకే బడ్జెట్లో కేటాయించడం జరగదన్నారు. ఒకవేళ అ లా జరగలేదంటే.. కేంద్రం సహకరించట్లేదని ప్రచారం చేయడం ప్రజల్ని తప్పుదారి పట్టించడమేనన్నారు. పోలవరం ముంపు మండలాల్ని ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడంలో బీజేపీ సహకారం మరువకూడదన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించిందంటేనే దాన్ని పూర్తి చేయడమనే లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లని వివరించారు. రాహుల్‌లో విదేశీ రక్తం ప్రవహించడమే కారణం.. దేశాన్ని ముక్కలు చేయాలంటున్న ఉగ్రవాదులను ఉరితీస్తే అందుకు మద్దతుగా మాట్లాడిన ఢిల్లీలోని జేఎన్‌యూ విద్యార్థులను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమర్థించ డం సరికాదని అమిత్‌షా అన్నారు. ఆయన ముత్తాత, నాయనమ్మ, తండ్రికి భిన్నంగా ప్రవర్తించడానికి రాహుల్‌లో విదేశీ రక్తం ప్రవహించడమే కారణమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బలీయశక్తిగా బీజేపీ ఎదగాలి.. ఆద్యంతం ఉద్వేగంగా సాగిన అమిత్ షా ప్రసంగం బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నిం పింది. 11 కోట్ల మంది సభ్యులతో బీజేపీ బలీ యమైన పార్టీగా ఎదిగిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌సహా దక్షిణాదిలోనూ ఒక బలమైన శక్తిగా ఎదిగి, బీజేపీపై ఉత్తరాది పార్టీ అన్న ముద్రను చెరిపేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌లేని భారతదేశాన్ని చూడాలన్నారు. చిన్నమ్మ తడబాటు..: హిందీలో అమిత్ షా ప్రసంగాన్ని బీజేపీ రాష్ట్ర నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి తెలుగులోకి తర్జుమా చేసి వినిపించారు.కొన్నిచోట్ల ఆమె తడబడ్డారు. అమిత్ షా ప్రసంగంలో ఒకచోట తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గురించి ప్రస్తావించినా ఆమె టీడీపీ ఊసెత్తలేదు. ఇదిలా ఉండగా కొన్ని నెలలుగా నలుగుతున్న ప్రత్యేక హోదా గురించి కానీ, స్పెషల్ ప్యాకేజీ గురించి కానీ అమిత్ షా తన ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. అలాగే కాపు రిజర్వేషన్ల గురించి కూడా ఏదో ఒకటి చెబుతారని బీజేపీ కార్యకర్తలు ఆశించినా నిరాశే మిగిలింది. సభ జరగరాదని ఆశించారు: కృష్ణంరాజు బీజేపీ బహిరంగసభ జరగదని, జరగకూడదని చాలామంది ఆశించారని, కానీ తాము ఘనంగా జరిపి చూపించామని కేంద్ర మాజీ మంత్రి, నటుడు యూవీ కృష్ణంరాజు అన్నప్పుడు సభలో కరతాళ ధ్వనులు మోగాయి. టీడీపీ నేతలనుద్దేశించే ఆ మాటలన్నారని కార్యకర్తలు వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి వెంకయ్య తనదైన శైలిలో ప్రసంగిస్తూ మోదీ, అమిత్‌షాలపై ప్రశంసలవర్షం కురిపించారు. టీడీపీతో పొత్తు వద్దు దానవాయిపేట(రాజమహేంద్రవరం): రాష్ట్రంలో టీడీపీతో పొత్తుకు స్వస్తి పలకాలని కోరుతూ బీజేపీ కార్యకర్తలు కొందరు ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరంలో నిర్వహించిన బహిరంగసభలో నినాదాలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రసంగిస్తున్న సమయంలో వేదికకు కొద్దిదూరంలో ఉన్న కొంతమంది కార్యకర్తలు ఒక్కపెట్టున టీడీపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలకు దిగారు. దీంతో అప్రమత్తమైన నాయకులు వారిని వారించారు. ‘ఆయుష్’ పోయండి : మరోవైపు రాష్ట్రంలో ఆయుష్ కేంద్రాలను పరిరక్షించాలని, వాటిని మూసివేయొద్దని కోరుతూ ఆయుష్ సిబ్బంది కొందరు సభా ప్రాంగణంలో ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి తమను ఆదుకోవాలని కోరారు. ఆ నిధులన్నీ కేంద్రానివే.. రాష్ట్రంలో గ్రామగ్రామాన నిరంతరాయ విద్యుత్తు సరఫరా అవుతోందంటే అది ఎన్డీయే ప్రభుత్వ ఘనతేనని అమిత్‌షా చెప్పారు. రాష్ట్రంలోని గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.65 వేల కోట్లు, జలమార్గాల అభివృద్ధికి రూ.1,500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అమృత్ పథకం కింద స్మార్ట్‌సిటీల అభివృద్ధికి సంకల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. అమరావతి నిర్మాణానికి రూ.1,500 కోట్లు రాష్ట్రప్రభుత్వానికి అందించినట్లు చెప్పారు. నెల్లూరులో క్రిప్కో, రాష్ట్ర తీరంలో క్షిపణుల పరీక్ష కేంద్రం, మంగళగిరిలో రూ.1,616 కోట్లతో ఎయిమ్స్ తరహా ఆసుపత్రి, విశాఖ సమీపంలో రూ.2,500 కోట్లతో హెచ్‌పీసీఎల్ రిఫైనరీ, విజయనగరంలో గిరిజన వర్సిటీ, అనంతపురంలో కేంద్రీయవర్సిటీ, విశాఖలో పెట్రోలియం వర్సిటీ.. రాష్ట్రానికి కేంద్రం అందించిన సహకారం గురించి చెప్పుకుంటూ వెళితే వారమైనా పడుతుందన్నారు. -
కేంద్రంలో వెలిగి.. రాష్ట్రంలో నలిగి..
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వెలిగిపోతున్నా తెలంగాణలో ఆ పార్టీ శ్రేణులు నలిగిపోతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా రాష్ట్రంలో బీజేపీ పటిష్టానికి తీసుకుంటున్న చర్యలేమీలేవని ముఖ్య నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ అవకాశాలు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ బలోపేతమవుతుందని ఆశించిన నేతలు గత సాధారణ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో నిరాశకు గురయ్యారు. ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లోనూ అంతకన్నా దారుణమైన ప్రతికూల ఫలితాలను చవిచూసింది. ‘ కేంద్రంలో అధికారంలో ఉన్నాం. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలనుకుంటే అది పెద్ద విషయం కాదు. బీజేపీ రాష్ట్రంలో విస్తరించడానికి సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక వనరులు, విశ్వాసం కల్పించే నాయకుడు, నాయకుల మధ్య సమన్వయం కొరవడ్డాయి. తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన పార్టీగా బీజేపీకి అన్నివర్గాల్లో సానుకూలత ఉంది. కారణం ఏమిటో తెలియదు కానీ రాష్ట్రంలో పార్టీని గుర్తిస్తున్నట్టుగా కనిపించడం లేదు’ అని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. పార్టీకి హైదరాబాద్‌లో ఐదుగురు ఎమ్మెల్యేలున్నా వారి నియోజకవర్గాలను దాటి రాష్ట్రవ్యాప్తంగా విస్తరణకు చేస్తున్న కృషి చెప్పుకోదగిన స్థాయిలో లేదని పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. కేంద్రమంత్రిగా దత్తాత్రేయ ఉన్నా పార్టీ విస్తరణలో పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టుగా చెబుతున్నారు. రాష్ట్ర పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఐదారుగురు నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, వ్యక్తిగత ఆధిపత్యం కోసం ఆరాటం.. పార్టీ విస్తరణకు ప్రధాన అవరోధాలుగా ఉన్నాయంటున్నారు. జాతీయ నాయకత్వం జోక్యం చేసుకుని పనివిభజన చేస్తే ప్రయోజనం ఉంటుందని సీనియర్ నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. -
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పల్లె!
నిజామాబాద్‌నాగారం : భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పల్లె గంగారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే అధికారికంగా ప్రకటించలేదు. సోమవారం అధికారికరంగా ప్రకటించాల్సి ఉన్నా మూహుర్తం బాగాలేదని ఆపివేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్చార్జి వెంకటరమణి, రాష్ట్ర కార్యదర్శి శాంతికుమార్లు సైతం పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అధికారికంగా జరగాల్సి ఉన్నా వాయిదా పడింది. ఈనెల 3న లేదా 4న పార్టీ కార్యకర్తల సమావేశంలో అధికారికంగా వెల్లడించనున్నారు. మొదటి నుంచి పల్లె గంగారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు పార్టీ సీనీయర్ నాయకులు నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. అంతర్గత కలహాలు వీడిన కమలనాథులు, జిల్లా సారథి ఏకగ్రీవంపై కలిసి కట్టుగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. జిల్లా సీనియర్ నాయకులు యెండల లక్ష్మీనారాయణ, లోకభూపతిరెడ్డి తదితరులు కలిసి కట్టుగా జిల్లా అధ్యక్షుడి ఎన్నికను ఏకగ్రీవం చేశారు. జిల్లా ఇన్చార్జి వెంకటరమణి, రాష్ట్ర కార్యదర్శి శాంతికుమార్లు పల్లెగంగారెడ్డి ఎన్నికను విలేకరుల సమావేశంలో అధికారికంగా ప్రకటించి, నియమక పత్రాన్ని అందజేయనున్నారు. -
పల్లెకే మళ్లీ పగ్గాలు
* బీజేపీ జిల్లా సారథి గంగారెడ్డి * ఆనందరెడ్డికి అధిష్టానం బుజ్జగింపు * పోటీచేసే యోచన నుంచి విరమణ * పార్టీ కార్యాలయంలో నేడు ప్రకటన * రాష్ట్ర కమిటీలో ఆనందరెడ్డికి స్థానం * సీనియర్ల చొరవతో ఎన్నిక ఏకగ్రీవం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : భారతీయ జనతా పార్టీ జిల్లా పగ్గాలు మళ్లీ పల్లె గంగారెడ్డికే దక్కనున్నాయి. ఆయనను రెండోసారి జిల్లా అధ్యక్షునిగా కొనసాగించేందుకు పార్టీ నాయకత్వం ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. శనివారం పార్టీ సీనియర్లు, రాష్ట్ర, జిల్లా ముఖ్యులతో అభిప్రాయ సేకరణ జరిపారు. జిల్లా అధ్యక్ష పదవిపై ఆసక్తి చూపిన కేశ్‌పల్లి ఆనందరెడ్డితో మాట్లాడిన మీదట ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అధ్యక్ష పదవికి పోటీ చేయాలని ఆనంద్ రెడ్డి గట్టి నిర్ణయంతో ఉండగా, రెండోసారి జిల్లా అధ్యక్షునిగా కొనసాగేందుకు పల్లె గంగారెడ్డి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర పరిశీలకులు, పార్టీ సీనియర్లు ఆనందరెడ్డి ఇంటికి వెళ్లి మాట్లాడటం తో పునరాలోచన చేసిన ఆయన పోటీ ఆలోచనను విరమించుకున్నట్లు తెలిసింది. పార్టీ అధిష్టానం జరిపిన అభిప్రాయ సేకరణ, సీనియర్లతో సంప్రదింపులు ఫలించడంతో మళ్లీ గంగారెడ్డికే పార్టీ పగ్గాలు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఆనందరెడ్డి, గంగారెడ్డిల మధ్యన సత్సంబంధాలు, ఆనందరెడ్డి పెద్ద మనసు చేసుకుని విరమించుకోవడం వల్ల బీజేపీ జిల్లా అధ్యక్షుని ఎన్నిక ఏకగ్రీవం కానుందన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. గంగారెడ్డి ఎన్నిక ఇక లాంఛనమే కాగా.. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో పల్లె గంగారెడ్డి ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. ఆనందరెడ్డికి రాష్ట్ర కమిటీలో ప్రాతినిధ్యం కల్పించేందుకు అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అంతర్గత కలహాలను వీడిన కమలనాథులు, జిల్లా సారథి ఏకగ్రీవంపై కలిసి కట్టు గా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్చార్జి వెంకటరమణి, రాష్ట్ర కార్యదర్శి శాంతికుమార్, జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు యెండల లక్ష్మీనారాయణ , లోక భూపతిరెడ్డి తదితరులు రెండు రోజులుగా పార్టీ నేతలు, క్యాడర్‌తో సంప్రదింపులు జరి పా రు. కేశపల్లి ఆనందరెడ్డి, గంగారెడ్డి ఎన్నికపై సానుకూలత వ్యక్తం చేయ డం ‘ఏకగ్రీవం’ మరింత సుగమం అయినట్లు చెబుతున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షపదవితో పాటు అన్ని కమిటీలపై ఏకాభిప్రాయానికి రావాలన్న యోచన కూడ నాయకత్వం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు యెండల లక్ష్మీనారాయణ, లోక భూపతిరెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు పెద్దోళ్ల గంగారెడ్డి, ఆలూరు గంగారెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, కేశ్‌పల్లి ఆనందరెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి, గోపాల్, మల్లేశ్‌యాదవ్ తదితరులు గ్రూపులకు అతీ తంగా సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగే ఆ పార్టీ కొత్త సార థి ఎన్నికల్లో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అన్ని స్థాయిల్లో కమిటీలు 2014 సాధారణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనుకున్న బీజేపీ యత్నం ఫలించలేదు. ఆఖరి నిముషంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు అనివార్యంగా మారింది. జిల్లాలో అప్పటికీ పార్టీ ఒంటిరిగా పోటీ చేసి నెగ్గేంత పటిష్టంగా లేదన్న సాకుతో అధిష్టానం జిల్లా నాయకత్వాన్ని పొత్తులకే సై అనిపించింది. దీంతో పార్టీపై కొండంత ఆశలు పెట్టుకున్న పలువురు సీనియర్ బీజేపీ నాయకుల ఆశలు అడియాసలు అయ్యాయి. ఏళ్ల తరబడి ఎన్నికలే లక్ష్యంగా నియోజకవర్గాల్లో రూ.లక్షలు వెచ్చించి కార్యక్రమాలు నిర్వహించిన నేతల శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. పొత్తులలో భాగంగా 9 అసెంబ్లీ స్థానాలకు నాలుగు చోట్ల పోటీచేసే అవకాశం దక్కినా.. టీడీపీ నేతలు సహకరించక, టీఆర్ఎస్ హవాలో ఓట మి తప్పలేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా.. జిల్లా నాయకు ల్లో నిరాశ, నిస్పృహలు ఆవహించాయి. దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ సభ్యత్వ సేకరణ ద్వారా పార్టీని తెలంగాణలో బలోపేతం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. వార్డు కమిటీల నుంచి జిల్లా కమిటీల వరకు అన్ని స్థాయిల్లో కమిటీలను పటిష్టం చేసే పని పెట్టుకున్నారు. ఇదే క్రమంలో అన్ని స్థాయిల్లో కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. -
చెన్నైలో బీజేపీ కేంద్ర మంత్రి జవదేకర్
చెన్నై, సాక్షి ప్రతినిధి: కొలిక్కిరాని కూటమి కోసం భారతీయ జనతా పార్టీ రాయబారం ప్రారంభించింది. తమిళపార్టీలతో రాజకీయ మంతనాలు సాగించేందుకు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ శనివారం చె న్నై చేరుకున్నారు. రెండురోజులపాటు ఆయన ఇక్కడే మకాం వేసి కూటమి ఖరారు చేస్తారని అంచనా. ఎన్నికల నోటిఫికేషన్‌కు కౌంట్‌డౌన్ మొదలైనట్లుగా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. మరో మూడు నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ ఖాయమని తెలుస్తోంది. నోటిఫికేషన్ వెలువడిందే తడవుగా అభ్యర్థుల ఎంపిక, ప్రచార కార్యక్రమాలతో పార్టీ క్యాడర్‌ను పరుగులెత్తించాలి. దక్షిణాదిలో బలం పుంజుకోవావలని ఆశిస్తున్న బీజేపీ అధినాయకత్వం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో తమ బలం ఏమిటో నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉంది. ప్రాంతీయ పార్టీలతో పొత్తులేకుంటే రాష్ట్రంలో మనుగడ ఉండదని కాంగ్రెస్ పార్టీ ఐదు దశాబ్దాల కిందటే అనుభవంతో తెలుసుకుంది. అన్నాడీఎంకే, డీఎంకేలతో పొత్తపెట్టుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా మారింది. ఇపుడు అదే రీతిలో మరో జాతీయ పార్టీ బీజేపీ వంతు వచ్చింది. కమలనాధులు సైతం కాంగ్రెస్ అనుభవంతో అందలం ఎక్కాలని ఆశిస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడే పార్లమెంటు ఎన్నికల్లో బలమైన కూటమిని కూడగట్టుకోగలిగిన బీజేపీ నేడు అధికారంలో ఉండికూడా విఫలమవుతోంది. ఆనాటి కూటమి చిన్నాభిన్నం కాగా ఒక్క డీఎండీకేపై మాత్రమే అశలు పెట్టుకుంది. డీఎంకే సైతం డీఎండీకే కోసం వలవిసిరి ఉంది. విజయకాంత్ తమతో రావాలేగానీ అన్ని త్యాగాలకు సిద్దమని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఆఫర్ ఇచ్చాడు. విజయకాంత్ తమతో చేతులు కలుపుతాడనే విశ్వాసంతోనే ఉన్నారు. అలాగే ప్రజా కూటమి నేతలు సైతం విజయకాంత్‌ను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. తన మద్దతులో మరెవరో సీఎం పీఠం ఎక్కడం కాదు, తానే సీఎంగా ఉండాలని ఆశిస్తున్నట్లు పరోక్షంగా ప్రకటించుకున్న నేపథ్యంలో డీఎంకేతో పొసగకపోవచ్చు. అన్నాడీఎంకే వైపు అవకాశాలు ఇదిలా ఉండగా, అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు ఖాయమని ఏడాదిగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి తగినట్లుగా కేంద్ర ప్రభుత్వం జయలలిత ప్రభుత్వానికి అనేక విషయాల్లో సానుకూలంగా వ్యవహరిస్తోంది. జయను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయమైన కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ శనివారం మధురైలో మీడియాతో మాట్లాడుతూ, బలమైన కూటమి ఏర్పడటం ఖాయమని మాత్రమే వ్యాఖ్యానించారు. పలు పార్టీలతో జవదేకర్ పార్లమెంటు ఎన్నికల్లో ఏర్పడిన కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉండిన డీఎండీకే, పీఎంకేలతో పొత్తు ఖరారుకు కేంద్ర మంత్రి జవదేకర్ ప్రయత్నాలు ప్రారంభించారు. తమిళనాడు కూటమి ఇన్‌చార్జ్‌లుగా కేంద్రమంత్రులు జవదేకర్, పీయూష్గోల్ను పార్టీ నియమించింది. ఈ బాధ్యతల నేపధ్యంలో శనివారం సాయంత్రం జవదేకర్ చెన్నైకి చేరుకున్నారు. రెండు రోజుల పాటూ చెన్నైలోనే ఉండి కమల కూటమి ఖరారు చేస్తారని అంచనాగా ఉంది. శనివారం సాయంత్రం చెన్నైకి చేరుకున్న జవదేకర్ శని, అదివారాల్లో డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్, పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు అన్బుమణి రాందాస్, సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షులు శరత్‌కుమార్‌లతో చర్చలు జరుపుతారు. ఆదివారం సాయంత్రం పార్టీ సమావేశం నిర్వహించి రాత్రికి డిల్లీకి వెళ్లిపోతారు. డీఎండీకే నేత నేతృత్వంలోనే కూటమి ఏర్పడాలి, తనను సీఎం అభ్యర్దిగా ప్రకటించాలని విజయకాంత్ బీజేపీకి షరతులు విధించారు. ఇందుకు అంగీకరిస్తేనే బీజేపీతో చర్చలని విజయకాంత్ భీష్మించకుని ఉన్నారు. కెప్టెన్ వైఖరితో రెండు పార్టీల మధ్య అగాధం ఏర్పడి ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్ది కూటమిని కొలిక్కితేచ్చేందుకు జవదేకర్ రంగంలోకి దిగారు. సీఎం జయను కలుస్తారా అన్నాడీఎంకేతో పొత్తు అవకాశాలను కొట్టిపారేయలేమని బీజేపీ నేతలే ప్రచారం చేస్తున్న తరుణంలో ఢిల్లీ దూతగా చెన్నైకి వచ్చిన జవదేకర్ సీఎం జయలలితను కలుస్తారా అనే చర్చ రాష్ట్రంలో ప్రధానంగా సాగుతోంది. బీజేపీ ప్రభుత్వం నుండి ఎవరు చెన్నైకి వచ్చినా జయను కలవడం ఆనవాయితీగా మారింది. ప్రధాని నరేంద్రమోదీ ఇంటికి వెళ్లి మరీ కలుసుకున్నారు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, పట్టణాభవృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు సైతం కలుసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు, పొత్తు చర్చలు వంటి కీలక తరుణంలో జవదేకర్ సీఎం జయలలితను కలిసే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. అయితే బీజేపీ సాగిస్తున్న కూటమి ప్రయత్నాల్లో భిన్నధృవాలైన అన్నాడీఎంకే, డీఎండీకేతో ఒకేసారి చర్చలకు దిగుతుందా అనేది ప్రశ్నర్థకంగా మారింది. -
అభ్యర్థులు జారిపోకుండా జాగ్రత్త !
హన్మకొండ : భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు జారిపోకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంది. అధికార పక్షం వేసే ఎత్తుగడలకు అందకుండా పార్టీ అభ్యర్థులపై ఆచితూచీ వ్యవహరించింది. తమ పార్టీ అభ్యర్థులకు టీఆర్ఎస్ గాలం వేసిందనే సమాచారంతో బీజేపీ నాయకులు నామినేషన్ల ఉపసంహరణ రోజు శుక్రవారం కావాలనే బీజేపీ అభ్యర్థుల సమావేశం ఏర్పాటు చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి హన్మకొండకు చేరుకుని తమ సమక్షంలో అభ్యర్థులను రోజంతా ఉంచుకున్నారు. పార్టీ ఎన్నికల ఇన్చార్జి, బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత చింతల రాంచంద్రారెడ్డి, అర్బన్ జిల్లా ఇన్చార్జి రాష్ర్ట కార్యదర్శి డాక్టర్ కాసర్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ వరంగల్‌లో మకాం వేసి టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ అభ్యర్థులు చిక్కకుండా చూశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. అధికార టీఆర్ఎస్ పక్షానికి చిక్కకుండా ఉండేందుకు బీజేపీ రోజంతా సమావేశం జరిపింది. ఎన్నికల్లో ఎలా ప్రచారం చేయాలో, ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలో నాయకులు వివరించారు. ఉదయం 8 గంటలకు మొదలైన సమావేశంలో సాయంత్రం 3.30 గంటల వరకు కొనసాగించారు. నామినేషన్ల ఉపసంహరణ సమయం దాటిపోయే వరకు సమావేశం నిర్వహించారు. మధ్యాహ్న భోజన సమయంలో అభ్యర్థులు బయటకు వెళ్లకుండా సమావేశం నిర్వహించిన వేధ బాంక్వెట్ హాల్ తలుపులు మూసి తాళం వేసి నిర్భందించారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఫంక్షన్ హాల్లోనే ఏర్పాటు చేసి అభ్యర్థులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, మార్తినేని ధర్మారావు, రావు పద్మతో పాటు మరికొందరు ముఖ్యనాయకులు కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి అభ్యర్థుల వైపు నుంచి బీఫాంలు అందజేశారు. ప్రచార సమయంలోను అభ్యర్థులు అధికార పక్షానికి లొంగి ప్రచారం నుంచి తప్పుకోకుండా ఉండేలా పార్టీ అన్ని చర్యలు చేపట్టింది. కాంగ్రెస్, టీడీపీల నుంచి టీఆర్ఎస్లోకి భారీగా వలసలు వెళ్లడం, ఆ పార్టీల ప్రధాన నేతలు టీఆర్ఎస్లో చేరడంతో ఆ రెండు పార్టీలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఆ రెండు పార్టీలో పోటీ చేసేందుకు అభ్యర్థులు లే కుండా పోయారు. దీంతో భవిష్యత్‌లో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామే అనే ధీమాలో బీజేపీ నాయకత్వం ఉంది. ఈ సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రమాణ చేయించారు. -
పొత్తుల కోసం ఎత్తులు
= జెడ్పీ అధ్యక్ష స్థానాల కైవసానికి వ్యూహ ప్రతివ్యూహాలు = స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జేడీఎస్‌తో దోస్తీకి కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు = కింగ్ మేకర్‌గా మారనున్న జేడీఎస్ సాక్షి,బెంగళూరు: ఎత్తులు, పై ఎత్తులతో రాష్ట్రంలో గ్రామీణ రాజకీయం వేడెక్కుతోంది. అధికార కాంగ్రెస్‌తోపాటు భారతీయ జనతా పార్టీలు మెజారిటీ జిల్లా పంచాయతీ అధ్యక్ష స్థానాలను కైవసం చేసుకోవడానికి వ్యూహ,ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలూ జేడీఎస్ వైపు చూస్తున్నాయి. దీంతో తక్కువ స్థానాల్లో గెలిచినా కూడా జెడ్పీ అధ్యక్షస్థానాల ఎంపికలో జేడీఎస్ కింగ్‌మేకర్‌గా మారనుంది. జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడిన విషయం తెలిసిందే. అధికార కాంగ్రెస్ పార్టీ 10 జిల్లాల్లో, విపక్ష బీజేపీ 7 జేడీఎస్ 2 జిల్లాల్లో స్పష్టమైన మెజారిటీ సాధించి స్వంత బలంతో జెడ్పీ స్థానాలను కైవసం చేసుకోనున్నాయి. బాగల్‌కోటే, బెంగళూరు నగర, బెళగావి, విజయపుర, ధార్వాడ, కోలార, మైసూరు, రాయచూరు, శివమొగ్గ, తుమకూరు, యాదగిరి జిల్లాల్లో ఆ రెండు పార్టీలకు పొత్తులు అవసరమవుతున్నాయి. దీంతో ఎన్నికల ప్రచారంలో చేసిన ఆరోపణలు మరిచి అటు కాంగ్రెస్‌తో పాటు, బీజేపీలు రెండూ దళంతో దోస్తీతో పాటు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో జెడ్పీ స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి. సాధారణంగా జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో ఆయా జిల్లాలోని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే పొత్తులు విజయమంతమవుతాయి. గత అనుభవాల దృష్ట్యా ఒక జిల్లాలో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవడానికి జేడీఎస్ అంగీకారం తెలిపితే, మరొకొన్ని చోట్ల అదే జేడీఎస్ నాయకులు కమలం నాయకులతో పొత్తు పెట్టుకోవడానికి సమ్మతించవచ్చు. అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీబీఎంపీ తరహాలో జేడీఎస్ అన్ని చోట్లా కాంగ్రెస్ లేదా అన్ని బీజేపీతోనే కలిసి నడవాలని నిర్ణయించిన ఆశ్చర్య పోనక్కరలేదు. మొత్తంగా ఏ పార్టీ ఏ జిల్లాల్లో ఎవరితో పొత్తు పెట్టుకుని జెడ్పీ అధ్యక్ష స్థానాలను కైవసం చేసుకుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. భారీ తాయిలాలు... నూతన చట్టం ప్రకారం జెడ్పీ అధ్యక్షుడికి రాష్ట్ర క్యాబినెట్ మంత్రి పదవికి ఉన్న అధికారులు దక్కనున్నాయి. అంతేకాకండా ఐదేళ్ల పాటు ఆ స్థానంలో కొనసాగవచ్చు. దీంతో ఆ స్థానం పై కన్నేసిన జెడ్పీ సభ్యులు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తూ మిగిలిన సభ్యులకు అన్ని రకాల తాయిలాలు అందజేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో విహార యాత్ర ప్యాకేజీలు మొదలుకొని ఇన్నోవ కార్ల వరకూ ఉండటం గమనార్హం. ఈ విషయంలో అందికంటే ఎక్కువ లబ్ధి పొందుతున్నది మాత్రం హంగ్ అవసరమైన చోట్ల గెలిచిన స్వతంత్య్ర అభ్యర్థుల్లో కొందరని తెలుస్తోంది. కాంగ్రెస్ పూర్తి మెజారిటీ సాధించిన జిల్లాలు (10), చిక్కబళాపుర, రామనగర, హావేరి, చిత్రదుర్గా, బెంగళూరు రూరల్, చామరాజనగర, ఉత్తర కన్నడ, కొప్పల్, గదగ్, బీహార్ బీజేపీ పూర్తి మెజారిటీ సాధించిన జిల్లాలు (7) ఉడిపి, కొడగు, దావణగెరె, దక్షిణకన్నడ, చిక్కమగళూరు, బళ్లారి, కలబుర్గీ జేడీఎస్ పూర్తి మెజారిటీ సాధించిన జిల్లాలు (2) హాసన్, మండ్యా హాంగ్ అవసరమైన జిల్లాలు (11) బాగల్‌కోటే, బెంగళూరు నగర, బెళగావి, విజయపుర, ధార్వాడ, కోలార, మైసూరు, రాయచూరు, శివమొగ్గా, తుమకూరు. -
పొత్తుల కోసం ఎత్తులు
జెడ్పీ అధ్యక్ష స్థానాల కైవసానికి వ్యూహ ప్రతివ్యూహాలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జేడీఎస్‌తో దోస్తీకి కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు కింగ్ మేకర్‌గా మారనున్న జేడీఎస్ బెంగళూరు: ఎత్తులు, పై ఎత్తులతో రాష్ట్రంలో గ్రామీణ రాజకీయం వేడెక్కుతోంది. అధికార కాంగ్రెస్‌తోపాటు భారతీయ జనతా పార్టీలు మెజారిటీ జిల్లా పంచాయతీ అధ్యక్ష స్థానాలను కైవసం చేసుకోవడానికి వ్యూహ,ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలూ జేడీఎస్ వైపు చూస్తున్నాయి. దీంతో తక్కువ స్థానాల్లో గెలిచినా కూడా జెడ్పీ అధ్యక్షస్థానాల ఎంపికలో జేడీఎస్ కింగ్‌మేకర్‌గా మారనుంది. జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడిన విషయం తెలిసిందే. అధికార కాంగ్రెస్ పార్టీ 10 జిల్లాల్లో, విపక్ష బీజేపీ 7 జేడీఎస్ 2 జిల్లాల్లో స్పష్టమైన మెజారిటీ సాధించి స్వంత బలంతో జెడ్పీ స్థానాలను కైవసం చేసుకోనున్నాయి. బాగల్‌కోటే, బెంగళూరు నగర, బెళగావి, విజయపుర, ధార్వాడ, కోలార, మైసూరు, రాయచూరు, శివమొగ్గ, తుమకూరు, యాదగిరి జిల్లాల్లో ఆ రెండు పార్టీలకు పొత్తులు అవసరమవుతున్నాయి. దీంతో ఎన్నికల ప్రచారంలో చేసిన ఆరోపణలు మరిచి అటు కాంగ్రెస్‌తో పాటు, బీజేపీలు రెండూ దళంతో దోస్తీతో పాటు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో జెడ్పీ స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి. సాధారణంగా జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో ఆయా జిల్లాలోని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే పొత్తులు విజయమంతమవుతాయి. గత అనుభవాల దృష్ట్యా ఒక జిల్లాలో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవడానికి జేడీఎస్ అంగీకారం తెలిపితే, మరొకొన్ని చోట్ల అదే జేడీఎస్ నాయకులు కమలం నాయకులతో పొత్తు పెట్టుకోవడానికి సమ్మతించవచ్చు. అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీబీఎంపీ తరహాలో జేడీఎస్ అన్ని చోట్లా కాంగ్రెస్ లేదా అన్ని బీజేపీతోనే కలిసి నడవాలని నిర్ణయించిన ఆశ్చర్య పోనక్కరలేదు. మొత్తంగా ఏ పార్టీ ఏ జిల్లాల్లో ఎవరితో పొత్తు పెట్టుకుని జెడ్పీ అధ్యక్ష స్థానాలను కైవసం చేసుకుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. భారీ తాయిలాలు... నూతన చట్టం ప్రకారం జెడ్పీ అధ్యక్షుడికి రాష్ట్ర క్యాబినెట్ మంత్రి పదవికి ఉన్న అధికారులు దక్కనున్నాయి. అంతేకాకండా ఐదేళ్ల పాటు ఆ స్థానంలో కొనసాగవచ్చు. దీంతో ఆ స్థానం పై కన్నేసిన జెడ్పీ సభ్యులు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తూ మిగిలిన సభ్యులకు అన్ని రకాల తాయిలాలు అందజేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో విహార యాత్ర ప్యాకేజీలు మొదలుకొని ఇన్నోవ కార్ల వరకూ ఉండటం గమనార్హం. ఈ విషయంలో అందికంటే ఎక్కువ లబ్ధి పొందుతున్నది మాత్రం హంగ్ అవసరమైన చోట్ల గెలిచిన స్వతంత్య్ర అభ్యర్థుల్లో కొందరని తెలుస్తోంది. కాంగ్రెస్ పూర్తి మెజారిటీ సాధించిన జిల్లాలు (10), చిక్కబళాపుర, రామనగర, హావేరి, చిత్రదుర్గా, బెంగళూరు రూరల్, చామరాజనగర, ఉత్తర కన్నడ, కొప్పల్, గదగ్, బీహార్ బీజేపీ పూర్తి మెజారిటీ సాధించిన జిల్లాలు (7) ఉడిపి, కొడగు, దావణగెరె, దక్షిణకన్నడ, చిక్కమగళూరు, బళ్లారి, కలబుర్గీ జేడీఎస్ పూర్తి మెజారిటీ సాధించిన జిల్లాలు (2) హాసన్, మండ్యాహాంగ్ అవసరమైన జిల్లాలు (11) బాగల్‌కోటే, బెంగళూరు నగర, బెళగావి, విజయపుర, ధార్వాడ, కోలార, మైసూరు, రాయచూరు, శివమొగ్గా, తుమకూరు. -
అసంతృప్తులకు ఆహ్వానం
టీఆర్ఎస్ టికెట్ దక్కని వారి వైపు బీజేపీ చూపు అధికార పార్టీకిఝలక్ ఇవ్వాలనే ఆలోచన గ్రేటర్లో గెలుపే లక్ష్యంగా కమలనాథుల వ్యూహం హన్మకొండ : టీఆర్ఎస్లో రాజుకుంటున్న అసమ్మతిని అనుకూలంగా మలుచుకోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఈ మేరకు అధికార పార్టీలో టికెట్ రాని వారిని తమ వైపునకు తిప్పుకుని టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలని బీజేపీ ఆశిస్తోంది. వివరాల్లోకి వెళితే.. టీఆర్ఎస్లోకి కాంగ్రెస్, టీడీపీ నుంచి ఇటీవల వలసలు పెరగడంతో మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న నాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఉన్న టీఆర్ఎస్ నాయకులతోపాటు కాంగ్రెస్, టీడీపీల నుంచి వచ్చిన వారు కార్పొరేటర్ల టికెట్లు ఆశిస్తున్నారు. దీంతో అధికార పార్టీలో టికెట్ల కోసం పోటీ పెరిగింది. అయితే టీఆర్ఎస్లో చోటు దక్కని వారిలో ప్రజల్లో పట్టున్న నాయకుడిని తమ వైపునకు లాక్కుని బీజేపీ నుంచి పోటీ చేయించి టీఆర్ఎస్ను దెబ్బ తీయాలనే వ్యూహంతో నాయకులు వ్యూహం రచిస్తున్నారు. కాగా, వలసలతో కాం గ్రెస్, టీడీపీలు డీలా పడడంతో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయంగా బీజేపీ భావిస్తోంది. గతంలో బీజేపీ ఒకసారి మేయర్ పదవిని చేపట్టడంతోపాటు హన్మకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా, అప్పటి హన్మకొండ పార్లమెంట్ నుంచి ఒక పర్యాయం ప్రాతినిథ్యం వహించిన పట్టు బీజేపీకే ఉంది. దీంతో పాటు ప్రధాని నరేంద్రమోదీపై ఉన్న అభిమానాన్ని, కేంద్రంలో అధికారంలో ఉండడం వంటి అంశాలను అనుకూలంగా మలుచుకోవడం ద్వారా గ్రేటర్ వరంగల్‌లో పట్టు నిలుపుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ రెబల్స్‌పై బీజేపీ నాయకులు కన్నేశారు. చోటుదక్కని వారికి ఆహ్వానం.. మొత్తం 58 డివిజన్లలో సోమవారం 26 మంది అభ్యర్థులతో, మంగళవారం 17 మంది అభ్యర్థులతో బీజేపీ జాబితాను విడుదల చేసింది. అయితే టీఆర్ఎస్లో చోటుదక్కని వారు తమ వద్దకు వస్తే తొలుత ప్రకటించిన జాబితాలో నుంచి కొంతమంది అభ్యర్థులను తప్పించి, వచ్చిన వారికి అవకాశం కల్పించి టీఆర్ఎస్కు ఝలక్ ఇవ్వాలనే ఆలోచనలో బీజేపీ వర్గాలు ఉన్నట్లు సమాచారం. ఉద్యమం నాటి నుంచి పనిచేస్తున్న నాయకుల మధ్య టీఆర్ఎస్లో పోటీ తీవ్రంగా ఉండగా, కొత్త వారి చేరికతో ఈ పోటీ మలుపులు తిరుగుతోంది. -
అమితోత్సాహం
తిరుమల, తిరుచానూరు శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించుకున్న అమిత్‌షా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి స్థలాల మంజూరుకు హామీ తిరుమల: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం తిరుమల, తిరుచానూరు, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించుకున్నారు. తన సతీమణి పుట్టిన రోజు సందర్భంగా తిరుమల వేద పాఠశాల విద్యార్థులకు బట్టలు పంపిణీ చేశారు. బీజేపీ, టీడీపీ నాయకులతో ఉత్సాహంగా గడిపారు. ప్రతిపాదనలు పంపిస్తే స్థలాలు మంజూరు చేయిస్తా ఇతర రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపితే స్థలాలు మంజూరు చేయిస్తానని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హామీ ఇచ్చారు. బుధవారం ఉదయం శ్రీవారి దర్శనం నిమిత్తం అమిత్ షా తిరుమలకు వచ్చారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి ఆలయాల నిర్మాణం అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపాదనలు పంపితే బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో సత్వరమే స్థలాలు మంజూరు చేయిస్తానని చెప్పారు. అమిత్ షాకు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ హరిబాబు, చిత్తూరు ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే సుగుణమ్మ, కోలా ఆనంద్ ఉన్నారు. అమిత్ షాకు ఘన సత్కారం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన అమిత్ షాను ఆ పార్టీ శ్రేణులు కోలా ఆనంద్, గుండాల గోపీనాథ్, భాస్కర్, వరప్రసాద్ ఘనంగా సత్కరించారు. ఆలయం వెలుపల పట్టువస్త్రాలతో సత్కరించి, శ్రీవారి చిత్రపటాలు, జ్ఞాపికలు అందజేశారు. -
రాష్ట్ర పార్టీకి చేరిన బీజేపీ ఎన్నిక పంచాయితీ
⇒ జిల్లా, నగర పార్టీలకు ఇద్దరేసి పోటీ ⇒ పార్టీపరిశీలకు ముందు ఏ వర్గం వాదన వారిది? ⇒ రాష్ట్ర పార్టీ నిర్ణయమే శిరోధార్యమంటూ హామీ విజయవాడః భారతీయ జనతా పార్టీ నగర, జిల్లా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ రాష్ట్ర పార్టీకి చేరింది. ప్రస్తుతం అటు రాష్ట్రంలోనూ, ఇటు కేంద్రంలోనూ బీజేపీ అధికారం పంచుకోవడంలో నగర, జిల్లా అధ్యక్ష ఎన్నికలకు పోటీ గట్టిగానే ఉంది. రాష్ట్ర ఎన్నికల పరిశీలకు వచ్చి ఎన్నికల్లో ఏకాభిప్రాయం తీసుకురావాలని ప్రయత్నించినా పెద్దగా ఫలితం లేకపోయింది. జిల్లాలోనూ, నగరంలోనూ సభ్యుల అభిప్రాయాలను తీసుకుని రాష్ట్ర పార్టీకి వివరించేందుకు పరిశీలకులు నిర్ణయించుకున్నారు. జిల్లాకు, నగరానికి ఇద్దరేసి పోటీ.... గుడివాడలో జరిగిన అభిప్రాయసేకరణకు రాష్ట్ర ఎన్నికల అధికారి కపిలేశ్వరయ్య, ఎన్నికల పరిశీలకులు వృద్వీరాజ్, రామకృష్ణారెడ్డి తదితరులు వచ్చారు. జిల్లా అధ్యక్ష పీఠం కోసం తొలుత సక్కుర్తి శ్రీనివాసరావు, చిగురుపాటి నరేష్ పోటీ పడినా, బుధవారం ఉదయానికి వారు ఇరువురు చిగురుపాటి కుమారస్వామికి మద్దతుగా తప్పుకున్నారు. గుత్తికొండ శ్రీరాజబాబు, కుమారస్వామిల మధ్య పోటీ అనివార్యం అయింది. సుమారు 140 మంది పార్టీ సభ్యులు తమ అభిప్రాయాలను పరిశీలకు చెప్పారు. తాము ఎవరికి మద్దతు ఇస్తున్నామో చెబుతూనే పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని అంగీకరిస్తామంటూ హామీ ఇచ్చినట్లు తెలిసింది. విజయవాడలో పరిశీలకులుగా వచ్చిన శాంతారెడ్డి బొమ్మల దత్తు, సురేష్ రెడ్డి, కపిలేశ్వరయ్యలు పార్టీ సభ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. సుమారు 167 మంది తమ అభిప్రాయాలు చెప్పినట్లు సమాచారం. విజయవాడలో తొలుత భావించినట్లుగా ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ దాసం ఉమామహేశ్వరరాజు, గతంలో తాత్కాలిక అధ్యక్షుడుగా పనిచేసిన మువ్వల వెంకట సుబ్బయ్య మధ్యే పోటీ జరిగింది. సభ్యులంతా ఎవరికి వారు తమ అభిప్రాయాలు చెప్పారు. ఉదయం నుంచి పార్టీ కార్యాలయం వద్ద తీవ్ర సందడి నెలకొంది. అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న ఇరువురు నేతల అనుచరులువారి అభిప్రాయాలు వారు చెప్పారు. ఏకాభిప్రాయం సాధ్యం కాదని నాయకులునిర్ణయించి సభ్యుల అభిప్రాయాలు తీసుకున్నారు. పోటీయా? సీల్డ్ కవరా? పార్టీలో చర్చ..... రాష్ట్ర రాజధాని ప్రాంతంలో జిల్లా, నగర అధ్యక్ష పదవి కోసం ఇద్దరేసి నేతలు పోటీపడుతుండటంతో రాష్ట్ర నేతలకు మిగుడు పడటం లేదని తెలిసింది. గతంలో తరహాలోనే ఎన్నిక నిర్వహించాలా? లేక సీల్డ్ కవర్లో అధ్యక్షుడు పేరును సూచిస్తూ నగర, జిల్లా కార్యాలయాలకు పంపాలా? అని ఆలోచిస్తున్నారు. ఎన్నికలు నిర్వహిస్తే పార్టీలో గ్రూపులు పెరిగిపోతున్నాయని, దీనివల్ల పార్టీ ముందుకు పోవడం లేదనే అభిప్రాయం సీనియర్ నేతల్లో వ్యక్తం అవుతోంది. సీల్డ్ కవర్లో అధ్యక్షుడు పేరు పంపితే.. రెండవ వర్గం అసంతృప్తి చెందుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాష్ట్ర పార్టీలో తుది నిర్ణయం తీసుకుని త్వరలోనే అధ్యక్ష ఎన్నికలు నిర్వహించే తేదిని నిర్ణయించాలని భావిస్తున్నారు. లేదా నేతలందర్ని మరోకసారి కూర్చోబెట్టి ఏకాభిప్రాయం తీసుకురావాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల కధనం. -
బీజేపీ నగర అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం
డాబాగార్డెన్స్: భారతీయ జనతాపార్టీ నగర అధ్యక్ష ఎన్నికకు ఒకే ఒక నామినేషన్ దాఖలైంది. అధ్యక్ష స్థానానికి ఎం.నాగేంద్ర ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. బీజేపీ నగర కార్యాలయంలో అధ్యక్ష ఎన్నికకు నాగేంద్ర ఆదివారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల స్క్రూటినీ అనంతరం సోమవారం ఎంవీపీ డబుల్‌రోడ్డులో ఉన్న ఐఐఏఎమ్ సెంటర్లో ఉదయం 10 గంటలకు జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో నగర అధ్యక్షునిగా ప్రకటించనున్నారు. ఎన్నికల అధికారిగా పైడా కృష్ణమోహన్, సహాయ ఎన్నికల అధికారిగా ఎస్విఎస్ ప్రకాష్‌రెడ్డి వ్యవహరించారు. కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు పి.వి.నారాయణరావు, నగర ప్రధాన కార్యదర్శులు అప్పలకొండ యాదవ్, విల్లూరి మోహనరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరేంద్ర ప్రకాష్, నగర కార్యదర్శి గుండు రఘుబాబు, ఉపాధ్యక్షులు దుర్గరాజు, వేదుల దక్షిణామూర్తి, దుర్గారావు, బొడ్డేటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. నాగేంద్ర బీజేపీలో గత 15 ఏళ్లుగా క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీలో అనేక పదవులు చేపట్టారు. బీజేపీ విశాఖ నగర కోశాధికారిగా, ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కౌన్సిల్ సభ్యునిగా పనిచేశారు. 2010-12 ఏడాదికి నగర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. -
‘కమలం’లో ‘కమిటీ’ల సందడి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కమల దళంలో సందడి మొదలైంది. పార్టీ సంస్థాగత ఎన్నికలకు అగ్రనాయకత్వం పచ్చజెండా ఊపడంతో ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈనెల 13నుంచి గ్రామస్థాయి కమిటీల ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టాలని పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశించింది. ఈ క్రమంలో గ్రామ కమిటీల ఎన్నికలపై నాయకులు దృష్టి కేంద్రీకరించారు. మండల కమిటీలు, జిల్లా కమిటీల ఏర్పాటులో గ్రామ కమిటీల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. దీంతో అధ్యక్ష రేసులో ఉన్న లీడర్లు గ్రామ కమిటీల ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. నవంబర్ నెలాఖర్లో జిల్లా కమిటీ ఎన్నిక భారతీయ జనతా పార్టీకి జిల్లాలో ప్రత్యేకస్థానముంది. ఈ పార్టీ నుంచి జిల్లాలో ఒక ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్సీ ఉన్నారు. అంతేకాకుండా స్థానిక సంస్థల్లోనూ పలువురు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం జిల్లాలో గ్రామీణ, పట్టణ కమిటీలుగా పార్టీ వ్యవహారాలు నడుస్తున్నాయి. పట్టణ ప్రాంత అధ్యక్ష, కార్యదర్శులుగా మీసాల చంద్రయ్య, కాంతారావులు బాధ్యతలు నిర్వహిస్తుంగా, గ్రామీణ ప్రాంత అధ్యక్షులుగా అంజన్‌కుమార్, బొక్క నర్సింహారెడ్డి కొనసాగుతున్నారు. తాజాగా సంస్థాగత ఎన్నికల పర్వం మొదలైన నేపథ్యంలో కొత్త కమిటీల ఏర్పాటుతో ప్రస్తుత కమిటీలు రద్దుకానున్నాయి. గ్రామీణంలోనే పోటీ.. జిల్లాలో పార్టీ రెండు కమిటీలుండగా.. ఇందులో పట్టణ కమిటీలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే గ్రామీణ కమిటీలో మాత్రం భారీ మార్పులు జరిగే అవకాశముంది. గత రెండు దఫాలుగా అంజన్‌కుమార్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తాజాగా ఆయన రాష్ట్ర కార్యవర్గంలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న బొక్క నర్సింహారెడ్డి అధ్యక్ష రేసులో ఉన్నారు. అంజన్‌కుమార్ అధ్యక్షుడిగా ఉన్న కార్యవర్గంలో నర్సింహారెడ్డి పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పెద్దల అండదండలు, జిల్లా పార్టీ ఆర్థిక వ్యవహారాల్లోనూ కీలకంగా పాల్గొంటుండడంతో ఆయనకు ఈసారి అవకాశం రానుందని సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా సరూర్‌నగర్ మండలానికి చెందిన శంకర్‌రెడ్డి, పరిగి నియోజకవర్గానికి చెందిన మరో నేత కూడా అధ్యక్ష రేసులో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఈసారి జిల్లా కమిటీ ఎన్నిక ఏకగ్రీవం కాకుండా ఓటింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఓరుగల్లు బరిలో నేనంటే నేను..!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య కొత్త పంచాయితీని తెచ్చిపెడుతోంది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. దీంతో ఇక్కడ నుంచి పోటీకి అన్ని పార్టీలూ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా వరంగల్ స్థానం నుంచి బీజేపీ పోటీచేసింది. అయితే, ఇక్కడ నుంచి ఆ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారి తామే బరిలో దిగాలని టీడీపీ భావిస్తోంది. కానీ, బీజేపీ మాత్రం గత ఎన్నికల్లో ఓటమి పాలైన సీటులో తామే తిరిగి పోటీ చేస్తామని పట్టుబడుతోంది. ఇది రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణానికి దారితీసేలా కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో కేందమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇక్కడ నుంచి తాము పోటీచేస్తామని, ఇందుకు సహకరించాలంటూ వరంగల్ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావును కలసి విజ్ఞప్తి చేశారు. కానీ, ఈ స్థానంలో తమకే అనుకూలత ఉందని, ఈసారి టీడీపీ నుంచే అభ్యర్థి బరిలో ఉంటారని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. టీడీపీ బహుళ వ్యూహం! వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసి గెలవడం ద్వారా పలు ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని టీడీపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జైలుకెళ్లి వచ్చారు. ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడూ ఈ వ్యవహారంలో బదనాం అయ్యారు. దీంతో వరంగల్‌లో గెలవడం ద్వారా పోయిన పరువును కొద్దిగానైనా కాపాడుకోవాలని టీడీపీ భావిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దానిని ఉప ఎన్నికల్లో ఉపయోగించుకుని గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అధికారపార్టీలో స్థానికంగా గ్రూపులు ఉండడం కూడా తమకు లాభిస్తుం దని నమ్ముతోంది. అదేవిధంగా తమపార్టీ నుంచి టీఆర్ఎస్ ఐదుగురు ఎమ్మెల్యేలను లాగేసుకోవడంపై గుర్రుగా ఉన్న టీడీపీ ఉప ఎన్నికల్లో విజయం ద్వారా అధికార పార్టీకి గుణపాఠం చెప్పాలని ఆశిస్తోంది. మిత్రపక్షం బీజేపీని బరిలో నుంచి తప్పించేందుకు కొత్తి ప్రతిపాదననూ తెరపైకి తెస్తోంది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పరిస్థితి ఎవరికి అనూకూలంగా ఉందో తేల్చుకునేందుకు ప్రైవేటు సంస్థ ద్వారా సర్వే చేయించాలని టీడీపీ నేతలు కొందరు ప్రతిపాదిస్తున్నారు. ప్రత్యేక సమావేశంలో ఇదే అంశంపై టీడీపీ నేతలు చర్చించినట్లు తెలిసింది. సానుభూతిపై కమలం ఆశలు... మరోవైపు గత ఎన్నికల్లో ఓటమి చెందిన తమకు ఈసారి సానుభూతి పవనాలు వీస్తాయని బీజేపీ భావిస్తోంది. అంతేకాకుండా ఈసారి కేంద్రంలో అధికారంలో ఉండడం అదనంగా కలిసివచ్చే అంశమని అభిప్రాయపడుతోంది. టీఆర్ఎస్పై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని, ఆ పార్టీకి స్థానిక అభ్యర్ధి లేకపోవడం తమకు అనూకూలిస్తుందని అంచనా వేస్తోంది. టీడీపీని ఎలాగైనా ఒప్పించి బరిలో ఉండాల్సిందేనని పార్టీలో నిర్ణయం కూడా జరిగిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ‘ఓరుగల్లు బరిలో నేనంటే నేనంటూ’ ఇరు పార్టీలూ పట్టుబడుతుండడంతో ఉత్కంఠ నెలకొంది. టీడీపీ, బీజేపీ సీనియర్ నేతల భేటీ హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు, వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు టీడీపీ, బీజేపీ సీనియర్ నాయకులు ఆదివారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ శాసనసభాపక్ష నాయకుడుడాక్టర్ లక్ష్మణ్, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీడీపీ నాయకులు గరికపాటి మోహన్‌రావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పెద్దిరెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాబోయే రోజుల్లో రెండు పార్టీల మధ్య సహృద్భావ వాతావరణాన్ని పెంపొందించడంపై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. రెండు పార్టీలూ కలసి పనిచేసి గ్రేటర్ మేయర్ పీఠాన్ని గెలుచుకోవడంతోపాటు, వరంగల్‌లో విజయం సాధించాలని.. ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై అంతర్గత సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. రెండు పార్టీల మధ్య విభేదాలు ఏవైనా ఉంటే ఎలా సరిదిద్దుకోవాలి అనే దానిపై కూడా చర్చించారు. వరంగల్ లోక్‌సభ పరిధిలో ఏ పార్టీకి ఎంత బలం ఉందనేది కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. -
మద్దతివ్వండి...
- బీబీఎంపీ మేయర్ ఎంపికపై ప్రధాన పార్టీల వైనం - జేడీఎస్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు - కార్పొరేటర్లను కాపాడుకునేందుకు దళ్ నేతల ప్రయత్నం - దళపతిని కలిసిన సదానంద - కుమారతో ఆర్.అశోక్, మంత్రులు భేటీ సాక్షి, బెంగళూరు : మేయర్ పదవిని దక్కించుకోవడానికి జేడీఎస్ చుట్టూ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ప్రదక్షిణం చేస్తున్నాయి. ఎడతెరపి లేకుండా ఇరు పార్టీల నాయకులు శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ జేడీఎస్ జాతీయాధ్యక్షుడు హెచ్.డి.దేవెగౌడతో పాటు ఆ పార్టీలోని పలువురు నాయకులతో భేటీ అవుతున్నారు. ఇదిలా ఉండగా జేడీఎస్ నాయకులు తమ కార్పొరేటర్లు చేజారి పోకుండా రహస్య స్థావరాలకు విమానాల్లో తరలించారు. ఈ పరిణామాలతో మేయర్ ఎన్నిక ప్రక్రియ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కుతూహలం కలుగజేస్తోంది. బృహత్ బెంగళూరు మహానగర పాలికే ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 100 వార్డులు గెలుచుకున్నా ఆ పదవిని చేపట్టడానికి ఆ పార్టీకు ఇంకా రెండు మూడు సీట్లు తక్కువ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేడీఎస్, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ఆ పదవిని దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. అందులో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి నగర ఇన్ఛార్జ్ మంత్రి రామలింగారెడ్డి, బెంగళూరుకే చెందిన దినేష్‌గుండూరావ్ ప్రతి క్షణం జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామితో పాటు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. దీంతో మేలుకున్న బీజేపీ నాయకులు జేడీఎస్ పార్టీ అధినాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అందులో భాగంగా శనివారం కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ నేరుగా జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడను నగరంలోని పద్మనాభనగర్లోని ఆయన ఇంట్లో రెండుసార్లు భేటీ అయ్యారు. మేయర్ పదవిని చేపట్టడానికి సహకారం అందించాలని కోరారు. ఇదిలా ఉండగా మాజీ ఉపముఖ్యమంత్రి ఆర్.అశోక్ చిక్కమగళూరులో విశ్రాంతి తీసుకుంటున్న జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామితో శనివారం ఉదయం భేటీ అయ్యారు. మేయర్, ఉపమేయర్పదవి ఎంపికలో తమకు సహకారం అందించాల్సిందిగా కోరారు. అయితే జేడీఎస్ అధినాయకుల నుంచి బీజేపీ నాయకులకు ఎటువంటి స్పష్టమైన హామి లభించలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా జేడీఎస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్‌ఖాన్ శనివారం సాయంత్రం తమ పార్టీ నుంచి ఎంపికైన 14 మంది కార్పొరేటర్లతో పాటు నగరానికి చెందిన మరికొంతమంది జేడీఎస్ నాయకులతో కలిసి కేరళలోని కొచ్చి, అలెప్పిలకు వెళ్లిపోయారు. అయితే సెప్టెంబర్ 2న పార్టీ నిర్ణయాన్ని తెలియజేస్తానని దేవెగౌడ తనతో చెప్పినట్లు సదానందగౌడ శనివారం సాయంత్రం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో తెలియజేశారు. ఇదిలా ఉండగా తమ మద్దతు పొందడానికి ఒక్కొరికి రూ.10 కోట్లు ముట్టజెప్పడమే కాకుండా స్థానిక వార్డుల్లో అభివృద్ధి పనులకు ఎక్కువ నిధులు విడుదల చేయాల్సిందిగా స్వతంత్ర అభ్యర్థులు డిమాం డ్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
బీజేపీని బలోపేతం చేద్దాం
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ: రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి, అధికారం దిశగా ముందుకెళ్లాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. గురువారం మహబూబ్‌నగర్ పట్టణంలోని గాయత్రి పంక్షన్ హాలులో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో తెలంగాణ రాష్ట్రంలో అధికారం సాధించే దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రణాళికలతో ముందుకెళ్లాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా హామీలకే పరిమితమయ్యారని ఆరోపించారు. విద్య, ఉద్యోగ , రైతు, పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. రానున్న రోజుల్లో రోజుల్లో టీఆర్ఎస్ అధికారం కోల్పోవడం ఖాయమని ఆయన అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో ముందుండాలని, అందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజలకు వివరించి, అవి వారి దరికి చేరేలా కృషి చేయాలని కిషన్‌రెడ్డి నాయకులకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్చార్జిలతో పార్టీ భవిష్యత్ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గానికి చెందిన నాయకులు ఇన్చార్జి లేక నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. పార్టీ ఇచ్చే కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు తదితర అంశాలల్లో తాము ముందుకెళ్లలేకపోతున్నామని, వెంటనే నియోజకవర్గానికి ఇన్చార్జి నియమించాలని వారు కోరారు. దీనికి కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూరావు నామాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆచారి, ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శాంతికుమార్, మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండురెడ్డి, రాష్ట్ర నాయకులు నింగిరెడ్డి, కొండయ్య, వెంకట్‌రెడ్డి, జిల్లా నాయకులు బాలరాజు, శ్రీవర్ధన్‌రెడ్డి, కృష్ణ, నాయక్, ప్రభాకర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, బురుజు రాజేందర్‌రెడ్డి, రామచంద్రయ్య, ప్రభాకర్ వర్ధన్, శ్రీనివాసగౌడ్, శ్రీనివాసరెడ్డి, పడాకుల సత్యం, బుడ్డన్న తదితరులు పాల్గొన్నారు. -
బిజెపిలో సోషల్ వార్!
-
కమలంలో.. ముసలం
- బీబీఎంపీ ఎన్నికల నేపథ్యంలో బహిర్గతం - పార్టీ టికెట్ దక్కలేదంటూ మాజీల అసహనం - స్వపక్షంపై విమర్శల వెల్లువ - మాజీ డీసీఎంపై మండిపాటు సాక్షి, బెంగళూరు : భారతీయ జనతా పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతిృబహత్ బెంగళూరు మహానగర పాలికె ఎన్నికల సందర్భంగాభగ్గుమంది. స్వపక్షంలోని నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియను భుజస్కందాలపై వేసుకున్న మాజీ డిప్యూటీ సీఎం ఆర్.అశోక్‌పై పలువురు నాయకులు తీవ్ర విమర్శలకు దిగారు. బీబీఎంపీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీచేసే 92 మంది అభ్యర్థులతో కూడిన తొలిజాబితాను మంగళవారం రాత్రి దాదాపు 10:30 గంటలకు బీజేపీ విడుదల చేసింది. తాము సూచించిన వారికి వార్డు సభ్యుడిగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వడం లేదని వారు పేర్కొంటున్నారు. మాజీ మంత్రి సోమణ్ణ, పార్లమెంటు సభ్యుడు పీసీ మోహన్, కేంద్ర మంత్రులు అనంతకుమార్, సదానందగౌడ సైతం ఈ విషయంలో ఆర్.అశోక్ వ్యవహార శైలి పట్ల గుర్రుగా ఉన్నారు. సోమణ్ణ మరో అడుగు ముందుకు వేసి ఆర్.అశోక్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. స్థానికంగా పార్టీ పటిష్టతకు కృషి చేసిన కార్యకర్తలకు కాకుండా ఆయన చుట్టూ తిరుగుతున్న వారికి, మాజీ కార్పొరేటర్ల భార్యలకు టికెట్లు కేటాయించారని అసంతృప్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ పేర్కొంటూ పార్టీ పెద్దలకు ఓ నివేదిక పంపడానికి సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం జాబితాలో కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి వారు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. ఎదురైన అనుభవాల దృష్ట్యా తర్వాతి అభ్యర్థుల జాబితా వెల్లడి సందర్భంగా ఎలాంటి అసమ్మతి చెలరేగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమల నాథులు భావిస్తున్నారు. ఇందుకోసం ఆయా వార్డులోని పార్టీ మద్దతుదారులతో నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు సమావేశాలు జరిపి అభ్యర్థులను ఎంపిక చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రచారానికి దూరంగా బీఎస్‌వై! మొదటి జాబితా విడుదలైన తర్వాత మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 9 మంది పేర్లు సూచించగా అందులో ఒక్కరికి కూడా మొదటి జాబితాలో చోటు దక్కకపోవడమే యడ్డీ ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. కనీసం రెండో జాబితాలోనైనా తాను సూచించిన వారికి టికెట్టు ఇవ్వాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. లేదంటే ఈ బీబీఎంపీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటానని ఆయన హెచ్చిరించినట్లు సమాచారం. -
మాటిచ్చి.. తప్పుతారా?
సాక్షి ప్రతినిధి, కడప :‘చెప్పేందుకే శ్రీరంగ నీతులు’ అన్నట్లుగా భారతీయ జనతా పార్టీ వైఖరి ప్రస్ఫుటం అవుతోంది. ప్రతిపక్షంలో ఉండగా ఆంధ్రప్రదేశ్‌పై ప్రేమ ఒలకపోసిన నేతలు అధికార పీఠం దక్కగానే మాట మార్చారు. పార్లమెంటు సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్లు కల్పించాలని నాడు డిమాండ్ చేసిన ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు నేడు కీలకమైన స్థానంలో ఉంటూ న్యాయం చేయలేకపోతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ విభజించడం అన్యాయమని గళమెత్తిన నేతలు వడ్డించే స్థానంలో మాటిచ్చి.. తప్పుతారా? ఉండి రిక్తహస్తం చూపుతున్నారని వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే నిలదీయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పల్లెత్తు మాట మాట్లాడకపోవడాన్ని పలువురు ఎత్తిచూపుతున్నారు. నాడు సమైక్యాంధ్ర ఉద్యమంలో చిత్తశుద్ధి ప్రదర్శించని టీడీపీ నేడు ప్రత్యేక హోదా పట్ల సైతం అదే ధోరణితో ఉందని పలువరు ఆరోపిస్తున్నారు. అధికారమే వాళ్లకు ముఖ్యం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కలిసి రాష్ట్రాన్ని విడగొట్టి తీరని ద్రోహం చేశాయి. అప్పట్లో ఐదేళ్లు సరిపోదు.. పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీతోపాటు టీడీపీ కూడా డిమాండ్ చేసింది. కానీ నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకిగానీ, ఆ పార్టీతో కలిసి ప్రభుత్వం నడుపుతున్న టీడీపీకిగానీ ఆంధ్రప్రదేశ్ సమస్యలు పట్టడం లేదు. వ్యక్తిగత ప్రయోజనాలు, అధికారమే వారికి ముఖ్యమయ్యాయి. వైఎస్ఆర్సీపీ ఒక్కటే చిత్తశుద్దితో ప్రత్యేక హోదా కోసం పోరాడుతోంది. - ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అందరూ కలిసి మోసం చేశారు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ను నిలువునా మోసం చేశారు. రాష్ట్రాన్ని అడ్డంగా విభజించిన కాంగ్రెస్ గానీ, అందుకు సహకరించిన పార్టీలుగానీ ప్రత్యేక హోదా గూరించి పట్టించుకోవడం లేదు. వాళ్లు చేస్తారని వీళ్లు, వీళ్లు చేస్తారని వాళ్లు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం మాట తప్పడం విచారకరం. - శివారెడ్డి, ఎన్జీఓ సంఘం, జిల్లా అధ్యక్షుడు బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రం పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. దానికి చంద్రబాబు వంతపాడుతున్నారు. పార్లమెంటు సాక్షిగా ప్రత్యేకహోదాపై అప్పటి ప్రధాన మంత్రి ప్రకటన చేస్తే ఐదేళ్లు సరిపోదు, పదేళ్లకు పెంచాలని వెంకయ్యనాయుడు చేసిన హంగామా దేశ ప్రజలంతా చూశారు. ఇప్పుడు అధికారం చేపట్టిన బీజేపీ పిల్లిమొగ్గలు వేస్తూ రోజుకో మంత్రి చేత ప్రకటనలు చేయిస్తోంది. విభజన చట్టంలో లొసుగులు ఉంటే ఈ చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టేటప్పుడు ఏం చే శారు..? మా పోరాటం వల్లే పదేళ్ల ప్రత్యేక హోదా సాధ్యమని ఓట్లు వేయించుకొని నేడు మాట తప్పడం సరికాదు. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ఆ ఊసే మరిచారు. - జి. ఈశ్వరయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి రాష్ట్ర ప్రజలకంటే బీజేపీతో స్నేహమే ముఖ్యమైంది అభివృద్దే ఎజెండాగా బీజేపీ, టీడీపీలు గత ఎన్నికల్లో ప్రచారం చేసి ఓట్లు దండుకున్నాయి. రాష్ట్రాన్ని ముక్కలు చేయడంలో కాంగ్రెస్ పాత్ర ఎంత ఉందో, బీజేపీ పాత్ర కూడా అంతే ఉందనేది జగమెరిగిన సత్యం. ఎన్నికల ముందు ప్రధాని మోడీ రెండు రాష్ట్ర్రాలకు అనేక హామీలు ఇచ్చారు. ఒక్క సంవత్సరంలోనే ఆయన నిజ స్వరూపం ప్రజలకు అర్థమయ్యింది. ఇంత జరుగుతున్నా బీజేపీపై విమర్శలు చేయవద్దని చంద్రబాబు మంత్రులకు ఆదేశాలివ్వడం సిగ్గుచేటు. ప్రజల కంటే మీకు బీజేపీతో స్నేహమే ముఖ్యమా... ఈ రెండు పార్టీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశాయి. ఏ. ఆంజనేయులు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చితీరాల్సిందే రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించగా, అందుకు బీజేపీ ఐదేళ్లు చాలదు, పదేళ్లు కావాలని పట్టుబట్టింది. దీన్నిబట్టి కాంగ్రెస్ హామీని బీజేపీ తీసుకుంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బీజేపీని రాష్ట్ర ప్రజలు క్షమించరు. ప్రత్యేక హోదా తెచ్చేందుకు ఎలాంటి పోరాటాలకైనా టీడీపీ సిద్ధంగా ఉంది. - గోవర్ధన్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంపీలంతా విజ్ఞులని అనుకున్నాం ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లు పత్యేక హోదా చాలదు.. పదేళ్లు కావాలని వాదించి వెంకయ్యనాయుడు సన్మానాలు కూడా చేయించుకున్నారు. ఎంపీలంతా విజ్ఞులు కదా.. పార్లమెంటులో తీర్మానం చేసి మాట తప్పుతారా అని అనుకొన్నాం. కానీ నేడు బీజేపీ ఇచ్చిన మాట నిలుపుకోలేదు. అన్ని పక్షాలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రత్యేక హోదాతోపాటు రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. - పోచంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ. రాజకీయాలకు అతీతంగా ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తేవాలి దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించడం ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది. ప్రత్యేక హోదా కల్పిస్తే కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు వచ్చే అవకాశముంటుంది. రాజకీయాలకు అతీతంగా ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. - బి. నారాయణ రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేత ఠ మొదటిపేజీ తరువాయి ఉండి రిక్తహస్తం చూపుతున్నారని వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే నిలదీయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పల్లెత్తు మాట మాట్లాడకపోవడాన్ని పలువురు ఎత్తిచూపుతున్నారు. నాడు సమైక్యాంధ్ర ఉద్యమంలో చిత్తశుద్ధి ప్రదర్శించని టీడీపీ నేడు ప్రత్యేక హోదా పట్ల సైతం అదే ధోరణితో ఉందని పలువరు ఆరోపిస్తున్నారు. అధికారమే వాళ్లకు ముఖ్యం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కలిసి రాష్ట్రాన్ని విడగొట్టి తీరని ద్రోహం చేశాయి. అప్పట్లో ఐదేళ్లు సరిపోదు.. పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీతోపాటు టీడీపీ కూడా డిమాండ్ చేసింది. కానీ నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకిగానీ, ఆ పార్టీతో కలిసి ప్రభుత్వం నడుపుతున్న టీడీపీకిగానీ ఆంధ్రప్రదేశ్ సమస్యలు పట్టడం లేదు. వ్యక్తిగత ప్రయోజనాలు, అధికారమే వారికి ముఖ్యమయ్యాయి. వైఎస్ఆర్సీపీ ఒక్కటే చిత్తశుద్దితో ప్రత్యేక హోదా కోసం పోరాడుతోంది. - ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అందరూ కలిసి మోసం చేశారు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ను నిలువునా మోసం చేశారు. రాష్ట్రాన్ని అడ్డంగా విభజించిన కాంగ్రెస్ గానీ, అందుకు సహకరించిన పార్టీలుగానీ ప్రత్యేక హోదా గూరించి పట్టించుకోవడం లేదు. వాళ్లు చేస్తారని వీళ్లు, వీళ్లు చేస్తారని వాళ్లు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం మాట తప్పడం విచారకరం. - శివారెడ్డి, ఎన్జీఓ సంఘం, జిల్లా అధ్యక్షుడు బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రం పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. దానికి చంద్రబాబు వంతపాడుతున్నారు. పార్లమెంటు సాక్షిగా ప్రత్యేకహోదాపై అప్పటి ప్రధాన మంత్రి ప్రకటన చేస్తే ఐదేళ్లు సరిపోదు, పదేళ్లకు పెంచాలని వెంకయ్యనాయుడు చేసిన హంగామా దేశ ప్రజలంతా చూశారు. ఇప్పుడు అధికారం చేపట్టిన బీజేపీ పిల్లిమొగ్గలు వేస్తూ రోజుకో మంత్రి చేత ప్రకటనలు చేయిస్తోంది. విభజన చట్టంలో లొసుగులు ఉంటే ఈ చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టేటప్పుడు ఏం చే శారు..? మా పోరాటం వల్లే పదేళ్ల ప్రత్యేక హోదా సాధ్యమని ఓట్లు వేయించుకొని నేడు మాట తప్పడం సరికాదు. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ఆ ఊసే మరిచారు. - జి. ఈశ్వరయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి రాష్ట్ర ప్రజలకంటే బీజేపీతో స్నేహమే ముఖ్యమైంది అభివృద్దే ఎజెండాగా బీజేపీ, టీడీపీలు గత ఎన్నికల్లో ప్రచారం చేసి ఓట్లు దండుకున్నాయి. రాష్ట్రాన్ని ముక్కలు చేయడంలో కాంగ్రెస్ పాత్ర ఎంత ఉందో, బీజేపీ పాత్ర కూడా అంతే ఉందనేది జగమెరిగిన సత్యం. ఎన్నికల ముందు ప్రధాని మోడీ రెండు రాష్ట్ర్రాలకు అనేక హామీలు ఇచ్చారు. ఒక్క సంవత్సరంలోనే ఆయన నిజ స్వరూపం ప్రజలకు అర్థమయ్యింది. ఇంత జరుగుతున్నా బీజేపీపై విమర్శలు చేయవద్దని చంద్రబాబు మంత్రులకు ఆదేశాలివ్వడం సిగ్గుచేటు. ప్రజల కంటే మీకు బీజేపీతో స్నేహమే ముఖ్యమా... ఈ రెండు పార్టీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశాయి. - ఏ. ఆంజనేయులు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చితీరాల్సిందే రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించగా, అందుకు బీజేపీ ఐదేళ్లు చాలదు, పదేళ్లు కావాలని పట్టుబట్టింది. దీన్నిబట్టి కాంగ్రెస్ హామీని బీజేపీ తీసుకుంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బీజేపీని రాష్ట్ర ప్రజలు క్షమించరు. ప్రత్యేక హోదా తెచ్చేందుకు ఎలాంటి పోరాటాలకైనా టీడీపీ సిద్ధంగా ఉంది. - గోవర్ధన్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంపీలంతా విజ్ఞులని అనుకున్నాం ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లు పత్యేక హోదా చాలదు.. పదేళ్లు కావాలని వాదించి వెంకయ్యనాయుడు సన్మానాలు కూడా చేయించుకున్నారు. ఎంపీలంతా విజ్ఞులు కదా.. పార్లమెంటులో తీర్మానం చేసి మాట తప్పుతారా అని అనుకొన్నాం. కానీ నేడు బీజేపీ ఇచ్చిన మాట నిలుపుకోలేదు. అన్ని పక్షాలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రత్యేక హోదాతోపాటు రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. - పోచంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ. రాజకీయాలకు అతీతంగా ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తేవాలి దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించడం ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది. ప్రత్యేక హోదా కల్పిస్తే కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు వచ్చే అవకాశముంటుంది. రాజకీయాలకు అతీతంగా ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. - బి. నారాయణ రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేత -
పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు
కమలం వికసించాలి అన్ని చోట్లా బీజేపీ అధికారంలోకి రావాలి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బెంగళూరు: గ్రామ పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంటు వరకు భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. ఇందుకు గాను ముందుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ప్రతి కార్యకర్త కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన దక్షిణ భారత మహా సంపర్క్ అభియాన్‌ను ప్రారంభించిన అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి అమిత్‌షా మాట్లాడారు. 2015 చివరి నాటికి దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక దేశ వ్యాప్తంగా జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు గాను మహా సంపర్క అభియాన్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. మహా సంపర్క అభియాన్‌లో మొత్తం 17 విభాగాలు పనిచేయనున్నాయన్నారు. ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం మొత్తం 24 ప్రజా సంక్షేమ పథకాలను ప్రారంభించిందని చెప్పారు. ఈ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు కార్యకర్తలు శ్రమించాలన్నారు. విపక్షాలు చేసే ఆరోపణలు, విమర్శలను పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. దేశవ్యాప్తంగా పార్టీలో సభ్యత్వం పొందిన వారి వివరాలను డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేసే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నామని, దీనికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వం వహించనున్నారని వెల్లడించారు. పశ్చిమబెంగాల్‌తో పాటు ఒడిశా, అసోం, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. -
ఆశీర్వాదం అడిగితే.. తాళి కట్టబోయిన నేత
-
ఆశీర్వాదం అడిగితే.. తాళి కట్టబోయిన బీజేపీ నేత
చెన్నై (తమిళనాడు): బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి పరధ్యానంలో పచ్చని పెళ్లి పందిట్లో కలకలం రేపారు. తమిళనాడులోని తిరునల్వెలిలో బుధవారం ఆయన ఓ పెళ్లికి హాజరయ్యారు. తాళిబొట్టును తన చేతుల మీదుగా వరుడికి అందించాలని పెద్దలు కోరగా అందుకు ఆయన అంగీకరించారు. పరధ్యానంలో ఉన్న ఆయన తాళి బొట్టును తీసుకొని ఏకంగా పెళ్లికూతురు మెడలో కట్టేందుకు ప్రయత్నించగా చుట్టుపక్కల వారికి అక్కడ ఏం జరుగుతుందో కొన్ని క్షణాలు అర్థం కాలేదు. వెంటనే తేరుకున్న ఓ పెద్దావిడ మంగళసూత్రం కట్టకుండా ఆయనను నిలువరించింది. తాను పరధ్యానంతో చేసిన చర్యకు స్వామి కాస్త సిగ్గుపడి నవ్వుకున్నారు. ఆయన చర్యలతో పెళ్లికి వచ్చిన అతిథులు, వధూవరుల కుటుంబసభ్యులు ఈ సంఘటనతో షాక్ తిన్నారు. -
అవసాన దశలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు
దొడ్డబళ్లాపురం : అవసాన దశలో ఉన్న దేశంలోని కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీలు త్వరలో కనుమరుగు కానున్నాయని, ఒక్క బీజేపీనే బలమైన పార్టీగా అవతరించనుందని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కర్ణాటక ఇన్‌ఛార్జి మురళీధర్‌రావు అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం చివరి రోజు గురువారం ఆయన తాలూకాలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా దొడ్డబళ్లాపురం తాలూకాలోని కొడళ్లి గ్రామానికి చేరుకున్న ఆయన అక్కడ ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో అక్కడక్కడా కనిపిస్తోందని, అందుకే అది మ్యూజియం పార్టీగా మారి పోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా త్వరలో కనుమరుగు కానుందని అన్నారు. ఆయన యూపీలోని అమేథీ నుంచి గెలిచాడని, అయితే యూపీలో కాంగ్రెస్ గల్లంతయిందని, కావున రాహుల్ గాంధీ పార్టీ నాయకత్వం వహిస్తే దేశంలో కాంగ్రెస్ గల్లంతవుతుందన్నారు. భూస్వాధీన చ ట్టం గురించి పార్లమెంట్లో చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అవసరానికనుగుణంగా పలు మార్పులు సవరణలు కూడా చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. బీజేపీ ప్రస్తుతం దేశంలో 10 కోట్ల మంది సభ్యత్వం నమోదు చే యడం ద్వారా ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించిందన్నారు. కర్ణాటక రాష్ట్రంలో రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తుడిచిపెట్టి బీజేపీ అధికారంలోకి రానుం దని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ అవినీతి ఉంటుందన్నారు.కొన్ని పార్టీలు కులాల ప్రాధాన్యంతో, మరి కొన్ని కుటుంబాల ప్రాధాన్యంతో నడుస్తాయని,బీజేపీ మాత్రం సిద్ధాంతాల ప్రాధాన్యంతో నడిచేపార్టీగా చెప్పుకొచ్చా రు. కార్యక్రమంలో సభ్యత్వ నమోదు సం చాలకులు, జెడ్పీ సభ్యుడు హనుమంతేగౌడ, సీనియర్‌నేత కేఎం హనుమంత రా యప్ప, జిల్లా బీజేపీ అధ్యక్షుడు బీసీ నా రాయణ స్వామి, మాజీ ఎమ్మెల్యే నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రానికి టీడీపీ ఏం చేసింది?
కడప రూరల్ : భారతీయ జనతా పార్టీ సహకారాన్ని అభ్యర్థించి మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను తగులబెట్టడం విడ్డూరంగా ఉందని ఆ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. రాష్ట్రానికి టీడీపీ ఏం చేసిందని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వస్తున్న నిధుల కేటాయింపుపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. సోమవారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదినేని రామసుబ్బయ్య, రాష్ట్ర నాయకురాలు చేపూరి శారదమ్మలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై ఉన్న ఫలంగా టీడీపీ నేతలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను కాల్చడం విడ్డూరంగా ఉందన్నారు. అందులోనూ మిత్రపక్షమైన ఆ పార్టీ ఇలా వ్యవహారించడం దారుణమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆజ్ఞ లేకుండానే ఇలా జరుగుతుందా.. అని ప్రశ్నించారు. చంద్రబాబు జోక్యం లేని పక్షంలో దిష్టిబొమ్మను దహనం చేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇందుకు చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికార పగ్గాలను చేపట్టాక రాష్ట్రాభివృద్ధి కోసం ఏం చేసిందని ప్రశ్నించారు. కేంద్రం ఇప్పటికి రూ. 6701 కోట్ల నిధులను కేటాయించిందని, అందుకు సంబంధించిన ఖర్చుల వివరాలను నేటికీ తెలుపలేదన్నారు. పోలవరం పట్ల రాష్ట్రం నిర్లక్ష్యం వహిస్తే కేంద్రం నిధులను కేటాయించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాల వల్లనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు.నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతోందని, నిధులు వస్తున్నాయని, పలు పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై తాము కూడా దిష్టి బొమ్మను దహనం చేయగలమని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేస్తున్న నిధుల కేటాయింపులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్ర విభజనకు సంబంధించి టీడీపీ రెండు నాల్కల ధోరణి ప్రదర్శించిందని, తమ పార్టీ ఎన్నడూ అలా నడుచుకోలేదన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు చలపతి, సుదర్శన్‌రెడ్డి, ప్రమీలారాణి పాల్గొన్నారు. -
పాలనా దక్షతే... సుపరిపాలనకు రక్ష
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రిత్వ అభ్యర్థి నరేంద్రమోదీ ‘ఎక్కువ పరిపాలన - తక్కువ ప్రభుత్వం’ (More Governance and Less ) అనే నినాదాన్నిచ్చారు. ఇది విద్యావంతులైన యువతరాన్ని ఎంతగానో ఆకర్షించింది. ఇంతకీ పరిపాలన- సుపరిపాలన- ప్రభుత్వం అనే భావనల మధ్య తేడా ఏంటి? భారతదేశంలో సుపరిపాలన సాధ్యమేనా? అవరోధాలేంటి? వాటిని ఎలా అధిగమించాలి? దీనికి సమాధానం... పాలనా దక్షతే అనడంలో సందేహం లేదు. పరిపాలన (Governance) అనే పదానికి గ్రీకు భాషలోని అనేది మూల పదం. దీనికి అర్థం సారథ్యం వహించడం. సుప్రసిద్ధ గ్రీకు తత్వవేత్త ప్లాటో మొదటిసారిగా ఈ పదాన్ని రూపకాలంకారం (Metaphorical) గా వాడారు. అనంతరం లాటిన్, ఇంగ్లిష్ భాషల్లో ఈ పదాన్ని పలు అర్థాలతో వాడారు. కాలానుగుణంగా దీని వాడకంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఈ భావనను ‘పాలక చర్య’ గా నిర్వచించడం జరుగుతోంది. నాయకత్వ, నిర్వహణ ప్రక్రియలో ఒక అంశంగా పరిగణిస్తున్నారు. కౌటిల్యుని అర్థశాస్త్రంలో ప్రభుత్వం న్యాయ బద్ధంగా, నైతికంగా తన కార్యకలాపాలను నిర్వహించడమే పరిపాలన (ఎౌఠ్ఛిట్చఛ్ఛి) అని భాష్యం చెప్పాడు. మహాత్మా గాంధీ దృష్టిలో రామరాజ్య భావనేసుపరిపాలన. ‘ నియమ నిబంధనల మేరకు అధికారాన్ని వినియోగించే ప్రవృత్తి (Process) పరిపాలన’ అని చెప్పవచ్చు. సుపరిపాలనకు కొలమానాలు ప్రపంచబ్యాంకు 1989వ సంవత్సరంలో సహారా ఎడారి దిగువ (ఠఛ్చజ్చిట్చ) ఉన్న ఆఫ్రికా దేశాల్లో పాలనా ప్రక్రియను మెరుగు పరచాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ పరిపాలన, సుపరిపాలన అనే పదాలను తాను రూపొందించిన నివేదికలో ప్రస్తావించింది. అప్పటినుంచి ఈ భావాలకు విస్తృత ప్రచారం లభించింది. ప్రపంచబ్యాంకు 1996లో విడుదల చేసిన అధ్యయనంలో పరిపాలనకు సంబంధించి ఆరు ప్రామాణిక కొలమానాలను (Dimensions)ప్రస్తావించింది. అవి 1. జవాబుదారీ తనం, 2. రాజకీయ సుస్థిరత, 3. ప్రభావవంతమైన ప్రభావం, 4. గుణాత్మక నియంత్రణ, 5. సమన్యాయ పాలన , 6. అవినీతిని అదుపులో పెట్టడం. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల్లో ఒకటైన ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం (యూన్‌డీపీ ) 1997లో సుపరిపాలన ప్రధాన లక్షణాలను గుర్తించింది. వాటిలో 1. భాగస్వామ్యం, 2. సమన్యాయ పాలన , 3. పారదర్శకత. 4. ప్రతిస్పందన(Responsiveness), 5. ఏకాభిప్రాయం, 6. సమత, 7. ప్రభావవంతం, సమర్థత, 8. జవాబుదారీతనం, 9. వ్యూహాత్మక దృష్టి (Strategic Vision). పరిపాలన, సుపరిపాలన అనే ఈ రెండు పదాలు దాదాపు ఒకే అర్థంతో వాడటం జరుగుతుంది. కాకపోతే సుపరిపాలన అనే పదం సకారాత్మక భావనను కలిగిస్తే, పరిపాలన అనే పదం తటస్థ (ూ్ఛఠ్టట్చ) భావననిస్తుంది. మరి ప్రభుత్వమంటే ఏంటి? శాసన, కార్య నిర్వాహక, న్యాయ వ్యవస్థల కార్యకలాపాలకు సంబంధించినది. అన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు ప్రజారంజకంగా వ్యవహరిస్తాయని చెప్పలేం. అధికార దుర్వినియోగం, అసమర్థత, అవినీతి మొదలైన అవలక్షణాలు ప్రభుత్వ వ్యవస్థలలో కనిపిస్తున్నాయి. వీటిని నివారించి బాధ్యతాయుతంగా వ్యవహరించే ప్రవృత్తిని సుపరిపాలన/పరిపాలన అనే అర్థంతో వాడుతున్నారు. ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు మార్కెట్, పౌర సమాజం ప్రజా వసరాలను తీర్చడంలో ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి. వీటి సమష్టి కృషినే సుపరిపాలన/పరిపాలనగా అభివర్ణించడం జరుగుతోంది. ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా పౌర సంక్షేమానికి జరిపే కార్యకలాపాలన్నీ సుపరిపాలన / పరిపాలనలో అంతర్భాగాలే. ప్రభుత్వ ప్రాధాన్యత క్రమేణా తగ్గుతూ పౌర సమాజ పాత్ర పెరగడం సుపరిపాలన లక్షణం. సుపరిపాలన అంటే ఎలా ఉండాలి? 1.నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలను మెరుగుపరచాలి. 2.మౌలిక సదుపాయాలైన రహదారులు, వంతెనలు, విద్యుచ్ఛక్తి, టెలిఫోన్, నీటిపారుదల, రవాణా సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉండాలి. 3.సమర్థవంతంగా శాంతి భద్రతలను నిర్వర్తిస్తూ ఆస్తి, ప్రాణ రక్షణ కల్పించాలి. 4.ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో ఉద్యోగాలు కల్పించాలి. 5.సమర్థనీయ, ప్రభావవంతమైన ప్రభుత్వం ఉండాలి. 6.వాణిజ్య కార్యకలాపాలకు అనువైన వాతావరణాన్ని సృష్టించాలి. 7.సమాజంలోని కృత్రిమ అసమానతలు తొలగించడానికి అణగారిన వర్గాలకు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించాలి. 8.ప్రాథమిక హక్కులను అనుభవించడానికి అనుకూల పరిస్థితులు కల్పించడం. ఈ విధంగా పైన ప్రస్తావించిన అంశాల్లో ప్రభుత్వం జోక్య రహిత విధానాన్ని అవలంబించాలి. 9.పౌరులు ప్రధాన కేంద్ర బిందువుగా సేవలు (Citizen centric servicesట) అందించాలి. 10.ఎలాంటి వివక్షను చూపకుండా స్వచ్ఛమైన సేవలను పౌరులకు చేరేలా చూడాలి. సుపరిపాలన-ఎదురవుతున్న సమస్యలు అభివృద్ధి చెందుతున్న అనేక దేశాలతో పోల్చిచూస్తే... మన దేశం గణనీయమైన ప్రగతి సాధించినప్పటికీ, అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి చేరాలంటే నేరపూరిత రాజకీయాలు, అవినీతి అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. నేరమ య రాజకీయ ప్రవృత్తి, ప్రభుత్వోద్యోగులు, వ్యాపారవేత్త లు, మాఫియా శక్తులు ఒక విషవలయంగా రూపొందాయి.ప్రభుత్వ విధాన రూపకల్పన, అమల్లో ఈ దుష్టశక్తుల ప్రభావం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. సుపరిపాలనకు అరిష్టాలు ఈ దుష్ట చతుష్టయమే. అదృష్టవశాత్తూ చురుకైన పౌర సమాజం, క్రియాశీలక న్యాయ వ్యవస్థ, శక్తిమంతమైన ప్రసార మాధ్యమాలు వీరి ఆటకట్టించడానికి తమవంతు కృషి చేస్తున్నాయి. కళంకితులు, నేర పూరితులైన రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యోగులు, వ్యాపారవేత్తలు కటకటా లపాలయ్యారు. అయితే కొందరు ధన,రాజకీయ బలాలతో బెయిలు సంపాదించి తిరిగి అవే నేరాలను కొనసాగిస్తున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని(1951) సవరించి నేర చరితుల్ని ఎన్నికల్లో పోటీచేయడాన్ని పూర్తిగా నిషేధించడంతో పాటు, అక్రమ సంపాదనను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీలుగా అవినీతి వ్యతిరేక చట్టాన్ని(1989) మరిం త పటిష్టం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అలాంటప్పుడే సుపరిపాలన సుసాధ్యమవుతుంది. 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు గనుల వేలంలో అక్రమాలు... ఇలా చెప్పుకుంటూ పోతే భారీ కుంభకోణాలెన్నో దేశంలో వెలుగుచూశాయి. నేటి ఏలికల ఏలుబడిలో ఇలాంటి అవినీతి పర్వాలు సర్వసాధారణమయ్యాయి. అవినీతికి పాల్పడటం మానవ నైజమని సమర్థించడం తప్పు. వ్యవస్థాపరమైన లొసుగులు, జవాబుదారీతనం లోపించడం, కఠినతరమైన శిక్షలు అమలుచేయకపోవడం,సగటు పౌరునిలో నిరాసక్తత,పటిష్టమైన లోక్‌పాల్ వ్యవస్థ ఏర్పడకపోవడం లాంటివి సుపరిపాలన పరిమళాలను భ్రష్టు పట్టిస్తున్నాయి. ప్రజల్లో చైతన్యం, శక్తిమంతమైన అవినీతి నిరోధక వ్యవస్థలు పనిచేయడం ప్రా రంభమైననాడే సర్కారు సుపరిపాలనను అందించగలదు. సుపరిపాలన శోభిల్లాలంటే... సత్పరిపాలనను కోరుకోవడం పౌరుని హక్కు. దాన్ని పొందాలంటే జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన పాలనా యంత్రాంగం అవసరం. గాంధీజీ కలలు గన్న అంత్యోదయ సూత్రానికి ప్రాధాన్యతనిస్తే సుపరిపాలన సాధ్యమవుతుంది. ప్రజల సగటు ఆదాయం పెరుగుతుంది. సంపూర్ణ అక్షరాస్యత సాకారమవుతుంది. సరైన వైద్య సదుపాయాలు కల్పించి సగటు ఆయుః ప్రమాణాన్ని పెంచవచ్చు. ప్రతి పౌరునిలో దేశభక్తి, సత్యాన్వేషణ, రుజు ప్రవర్తన ప్రభవిల్లినప్పుడే ఏలికలు తలపెట్టిన సుపరిపాలన చిరకాలం శోభిల్లుతుంది. సుపరిపాలన - ప్రభుత్వం చొరవ 1.సమాచార హక్కు: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు కేంద్ర బిందువు. ప్రతి పౌరునికి ప్రభుత్వ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించాలి. ఇది సమాచార హక్కు ద్వారానే లభిస్తుంది. రాజ్యాంగంలోని 19వ ప్రకరణలో ప్రస్తావించిన వాక్ స్వాతంత్య్రపు హక్కు ద్వారా సమాచార హక్కు లభిస్తుంది. 2005 నుంచి అమల్లోకి వచ్చిన సమాచార హక్కు చట్టం (Right to Information Act)భారత ప్రజాస్వామ్యంలో గణనీయమైన మార్పునకు నాంది పలికింది. దీనిద్వారా సగటు పౌరునికి సాధికారత చేకూరింది. ప్రభుత్వ కార్యక్రమాల అమలును పరిశీలించడానికి, సామాజిక తనిఖీలకు సమాచార హక్కు చట్టం వీలు కల్పిస్తుంది. ప్రభుత్వ విధానాలకు సంబంధించిన సమాచారం ఎలాంటి అడ్డంకుల్లేకుండా సకాలంలో సగటు పౌరునికి అందుబాటులో ఉన్నప్పుడే జవాబుదారీ తన ంతో పాటు సుపరిపాలన అందించడానికి వీలవుతుంది. ప్రభుత్వంలో వేళ్లూనిన అవినీతిని అరికట్టడానికి సమాచార హక్కు చట్టం వజ్రాయుధం. అయితే దురదృష్టవశాత్తూ ఇది కొందరికే పరిమితమైపోతోంది. ఇప్పటికీ విద్యావంతుల్లో చాలామందికి దీనిపై స్పష్టమైన అవగాహన లేకపోవడం విచారకరం. ఉద్యోగ స్వామ్య సహాయ నిరాకరణ ధోరణి, రాజకీయ నాయకుల నిర్లిప్తత సగటు పౌరునికి పెను శాపంగా మారింది. కుంటి సాకులతో కోరిన సమాచారాన్ని నిరాకరించడం, ఒకవేళ అందించినా అందులో సమగ్ర సమాచారం లేకపోవడం జరుగుతోంది. ప్రభుత్వోద్యోగుల వ్యతిరేక వైఖరిని సవాలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్లు ఉన్నప్పటికీ వాటి ప్రతిస్పందన అంతంత మాత్రంగానే ఉంటోంది. అవినీతిలో కూరుకుపోయిన రాజకీయ వ్యవస్థ పౌరునికి దన్నుగా నిలుస్తుందనుకోవడం భ్రమే. 2.ఇ - పాలన (E-Governance) సమాచార, ప్రసార సాంకేతిక యుగంలో ఎలక్ట్రానిక్ పాలనకు నాంది పలకడం జరిగింది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక స్థాయిల్లో సాంప్రదాయ పాలన స్థానంలో ఎలక్ట్రానిక్ పాలన ఊపందుకుంది. దీనిద్వారా పౌరునికి నాణ్యమైన సేవలు మరింత వేగంగా, చౌకగా లభిస్తున్నాయి. ప్రభుత్వంతో జరిపే లావాదేవీలు పారదర్శకంగా జరగడంతో అవినీతికి, జాప్యానికి అవకాశాలు సన్నగిల్లాయి. సేవలందిస్తున్న వ్యవస్థలను పౌరులతో ప్రత్యక్షంగా అనుసంధానించడంతో దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఏర్పడింది. బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాయితీలు అర్హులైన వారికి అందుతు న్నాయి. ప్రభుత్వ రంగంలో దుబారాను తగ్గించడానికి ఎలక్ట్రానిక్ పాలన అనువైన సాధనం. ఇది ఆశించిన ఫలితాలను ఇవ్వాలంటే ప్రభుత్వోద్యోగుల్లో నిబద్ధత, రాజకీయ మద్దతు, సరిపడే వనరులు అవసరం. నిరక్షరాస్యత, పేదరికం, అరకొర ఇంటర్నెట్ సదుపాయా లు, సగటు పౌరుల్లో అవగాహనా రాహిత్యం మొదలైనవి ఇ-పాలనకు ప్రతిబంధకాలుగా నిలుస్తున్నాయి. 3.ఆధార్‌కార్డు: దేశంలో శాశ్వత ప్రాతిపదికన నివశించే ప్రతివ్యక్తికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య (Unique Identification Number) ను కేటాయించారు. ఇటీవల కాలంలో కేంద్రప్రభుత్వం ప్రారంభించిన జన్‌ధన్ యోజన అమలుకు బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానించి మొబైల్ ద్వారా అర్థిక పరమైన లావాదేవీలను కొనసాగించడానికి (ఒఅక) వీలు కల్పించారు. నిర్దేశిత వ్యక్తికి ప్రభుత్వం కల్పించే రాయితీలు చేరడానికి ఆధార్‌కార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. బోగస్ లబ్ధిదారులను ఏరివేయడానికి ఆధార్ అవసరం. ప్రభుత్వం పెట్టే ఖర్చు దుర్వినియోగం కాకుండా, అసలు వ్యక్తులకే ప్రభుత్వ సేవలు అందడానికి ఇది సరైన సాధనం. ఆధార్‌కార్డు విస్తృత వినియోగం సుపరిపాలనకు దోహదం చేస్తుంది. అయితే ఆధార్ జారీ చేయడంలో కొన్ని అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని, భారతీయులు కానివారు కూడా వీటిని పొందడానికి వీలవుతుందనే విమర్శలు ఉన్నాయి. -
సభ్యత్వ నమోదులో బీజేపీ ప్రపంచ రికార్డు
కైకలూరు: సభ్యత్వ నమోదులో భారతీయ జనతా పార్టీ ప్రపంచ రికార్డు నెలకొల్పిందని ఆ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. సోమవారం కృష్ణాజిల్లా కైకలూరులో ఆయన విలేకరులతో మట్లాడుతూ.. ఇప్పటివరకు చైనా మార్క్సిస్టు పార్టీ 8.30 కోట్ల సభ్యత్వాలు కలిగి ప్రపంచంలోనే ముందంజలో ఉందని పేర్కొన్నారు. దేశంలో ఆదివారం నాటికి బీజేపీ సభ్యత్వాలు 10 కోట్లు దాటాయని తెలిపారు. నమోదుకు మరో 10 రోజులు గడువు ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను గ్రామస్థాయి వరకు తీసుకువెళ్లాలని కార్యకర్తలకు కామినేని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. -
వ్యూహం ఘనం
సమాజంలో చివరి వ్యక్తిని చేరుకోవడమే బీజేపీ లక్ష్యం ‘అంత్యోదయ్’ సంకల్పానికి సభ్యుల అంగీకారం ఎల్.కె.అద్వానీ ప్రసంగం లేకుండానే ముగిసిన బీజేపీ జాతీయ సమావేశాలు బెంగళూరు : సమాజంలోని చిట్ట చివరి వ్యక్తిని సైతం చేరుకోవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తన రా జకీయ వ్యవహారాల తీర్మాణాన్ని రూపొందించింది. ‘అంత్యోదయ్’ సంకల్పంతో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ప్రవేశపెట్టిన రాజకీయ వ్యవహారాల తీర్మానానికి కార్యనిర్వాహక సభ్యుల అంగీకారం లభించింది. ఇక రెండు రోజుల పాటు నగరంలో జరిగిన బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సమావేశాలు శనివారం సాయంత్రం ముగిశాయి. ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల తీర్మానంతో పా టు రాజకీయ వ్యవహారాల తీర్మానాన్ని కార్యనిర్వాహక సభ్యులు అంగీకరించారు. ఇక రాజకీయ వ్యవహారాల తీర్మానంలో కేంద్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, జయాపజయాలపై చర్చ జరిగింది. అంతేకాక భూ స్వాధీన ఆర్డినెన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సభ్యులకు క్షుణ్ణంగా తెలియజేసేందుకు గాను పవర్ పాయింట్ ప్రజంటేషన్ను అందించారు. ఇక పది నెలల కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రారంభించిన కార్యక్రమాలను పార్టీ సమర్థించింది. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యే సందర్భంలో ఏప్రిల్-మే నెలల్లో దేశంలోని అన్ని ప్రాంతాల్లో వార్డు స్థాయిల్లో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు పార్టీ ఆమోదం తెలిపింది. ఇక జాతీయ కార్యనిర్వాహక సమావేశాల ముగింపు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ కార్యనిర్వాహక సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. 2013లో యూపీ ఏ రూపొందించిన భూ స్వాధీన బిల్లు రైతులకు పూర్తి వ్యతిరేకంగా రూపొందగా, ప్రస్తుతం తాము రూ పొందించిన ఆర్డినెన్స్ రైతులకు పూర్తి స్థాయిలో ప్ర యోజనం చేకూర్చే విధంగా ఉందని ఈ సందర్భం గా ప్రధాని మోదీ కార్యనిర్వాహక సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. ఇక పార్టీని క్షేత్ర సా ్థయి నుంచి పటిష్టం చేసే దిశగా ప్రతి జిల్లా కేంద్రం లోనూ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రచించాల్సిందిగా మోదీ సూచించారు. అంతేకా క పార్టీ రూపొందించిన భూ స్వాధీన ఆర్డినెన్స్‌కు సం బంధించి ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసే దిశగా ప్రతి గ్రామ స్థాయికి వెళ్లి కార్యకర్తలు ప్రచారం చేయాల్సిందిగా కోరారు. సమావేశాల అనంతరం సాయంత్రం 5గంటల సమయంలో ప్రధాని మోదీ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అద్వానీ ప్రసంగం లేకుండానే..... ఇక బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగిన జా తీయ కార్యనిర్వాహక సమావేశాలు బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ మార్గనిర్దేశక ప్రసంగం లేకుండానే ముగిశాయి. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సమావేశాల్లో అద్వానీ ప్రసంగం లేకపోవడం ఇదే మొట్టమొద టి సారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. జాతీయ కార్యనిర్వాహక సమావేశాల్లో మోదీ ప్రసంగం లేకపోవడంపై ఆయన వర్గానికి చెందిన కొందరు నేతలు సైతం సమావేశంలో తమ అసంతృప్తిని వెల్లగక్కినట్లు తెలుస్తోంది. -
కమలనాథుల కసరత్తు
రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కమలనాథులు మళ్లీ కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షులు అమిత్‌షా వచ్చేనెల 5న మళ్లీ చెన్నై చేరుకుంటున్నారు. చెన్నై, సాక్షి ప్రతినిధి:ఉత్తరాదిలో పార్టీ బలం పుంజుకోగా దక్షిణాదిలో సైతం కాషాయజెండాను రెపరెపలాడించేందుకు బీజేపీ తహతహలాడుతోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాడే ద క్షిణాదిపై కన్నేసిన కమలనాథులు ముందుగా తమిళనాడును ఎంచుకున్నారు. నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లోకి తమిళనాడులో పార్టీ బలం పెరగడం, అంతేగాక వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు సమీపించడం ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. గడిచిన పార్లమెంటు ఎన్నికలో రాష్ట్రంలో బలమైన కూటమిని ఏర్పాటు చేసుకున్న బీజేపీ ఇదే సూత్రాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అమలు చేయాలని భావిస్తోంది. ఎన్నికల సమయంలో ప్రాంతీయ పార్టీలతో ఏర్పడిన కమిటీ బీటలు వారింది. ప్రాంతీయ తత్వం లేనిదే రాష్ట్రంలో రాణించడం అసాధ్యం కాబట్టి కూటమిని బలపరచడం బీజేపీకి తప్పదు. మూడోసారి అమిత్‌షా: ఎన్నికల వ్యూహంలో మోదీ నుంచి మంచి మార్కులు కొట్టేసిన అమిత్‌షా తమిళనాడుకు రావడం ఇది మూడోసారి. గత ఏడాది మొదటి సారి వచ్చినపుడు మరైమలైనగర్లో బహిరంగ సభలో పాల్గొని రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులను పార్టీలో చేర్చుకున్నారు. గత నెల ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చి పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆనాటి సమావేశంలో దిశానిర్దేశం చేశారు. అమిత్‌షా ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ సుడిగాలి పర్యటన చేస్తూ మిస్డ్ కాల్ ఇవ్వండి..పార్టీలో చేరండనే నినాదాన్ని ప్రచారం చేశారు. ఇంటర్నెట్ ద్వారా సభ్యులను చేర్చుకున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి తేచ్చేందుకు వీలుగా గతంలోనే పార్టీ సభ్యత్వ నమోదు విభాగాన్ని ఏర్పాటు చేశారు. గత ఏడాది నవంబరు 1 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమిత్ షా పర్యటిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో నకిలీ సభ్యత్వ నమోదు సాగినట్లు ఆరోపణలు వచ్చాయి. నకిలీలను అడ్డుకునేందుకు సభ్యులను నేరుగా చూసిగానీ సభ్యత్వ గుర్తింపు కార్డును జారీచేయరాదని అమిత్‌షా ఆదేశించారు. తమిళనాడులో సైతం సభ్యత్వ నమోదు కార్యక్రమం సాగుతుండడంతో ఇతర రాష్ట్రాల్లో వెలుగుచూసినట్లుగా నకిలీలను అరికట్టడమే అమిత్‌షా పర్యటన ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. మార్చి ఆఖరులోగా సభ్యత్వ నమోదును పూర్తిచేయాలని పార్టీ ఆదేశించింది. రికార్డు స్థాయిలో సభ్యులను చేర్చుకోవాలని రాష్ట్ర శాఖ పట్టుదలతో ఉంది. ఇప్పటి వరకు చేర్చిన సభ్యుల వివరాలను పరిశీలించడంతో పాటు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి పార్టీ అధ్యక్షులతో మార్చి 5న సమావేశం కానున్నట్లు తెలిసింది. -
ఆత్మరక్షణలో అధికార పక్షం
సాక్షి, బెంగళూరు: ఆర్కావతి విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది. భారతీయ జనతా పార్టీతోపాటు మరో విపక్షమైన జేడీఎస్ ఆర్కావతి విషయంలో ఎలాగైనా సీఎం సిద్ధరామయ్యను ప్రజల ముందు దోషిగా చేయాలని కంకణం కట్టుకున్నాయి. ఈ పరిస్థితిలో ఆ రెండు పార్టీలను దీటుగా ఎదుర్కొనే చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగా ఓ పుస్తకాన్ని తీసుకురావడంతోపాటు ఫేస్బుక్, ట్విట్టర్ల ద్వారా అందులో ఉన్న సమాచారాన్ని ప్రజలకు చేరువ చేయనుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆ పదవి నుంచి కిందికి దించడమే లక్ష్యంగా బీజేపీ ఆర్కావతి డీ నోటిఫికేషన్ విషయాన్ని బయటకు లాగిన విషయం తెలిసిందే. ఆరోపణల వెల్లువ తాజాగా మరో మూడు చోట్ల సిద్ధు డీ నోటిఫైకు పాల్పడ్డారని శాసనసభ బీజేపీ ఫ్లోర్ లీడర్ జగదీష్ శెట్టర్ బయటపెట్టారు. ఈ విషయమై చట్టసభల్లో బీజేపీ నాయకులు ముఖ్యమంత్రిని నిలదీశారు. మొదట్లో డీ నోటిఫై విషయంలో కాస్త మెతక వైఖరిని అవలంభించిన జేడీఎస్ తర్వాత బీజేపీ కంటే ఒక అడుగు ముందుకు వేసింది. ఏకంగా ఆర్కావతి డీ నోటిఫికేషన్‌కు సంబంధించి ఓ పుస్తకాన్నే బయటకు తీసుకువచ్చింది. ఈ పుస్తకంలో సిద్ధరామయ్య అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల కాలంలో నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 544 ఎకరాల డీ నోటిఫై చేసినట్లు ఆధారాలతో సహా వివరించింది. తాజా పరిణామాలతో సిద్ధు తన సహచరులతో సమాలోచన జరిపారు. ఈ రెండు పార్టీలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ కూడా ఆర్కావతికి డీ నోటిఫైకు సంబంధించి మరో పుస్తకాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. పుస్తకంపై ఊహాగానాలు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురానున్న పుస్తకంలో సిద్ధరామయ్య ప్రభుత్వ హయాంలో ఆర్కావతి లే అవుట్‌కు సంబంధించి రీ-మోడిఫికేషన్ మాత్రమే చేసినట్టు నిరూపించనున్నారు. అంతేకాకుండా జేడీఎస్-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలోనే ఆర్కావతికి సంబంధించి డీ నోటిఫై జరిగినట్లు కొన్ని ఆధారాలను పుస్తకంలో పొందుపరచనున్నట్టు సమాచారం. ఈ మేరకు రూపొందించిన పుస్తకంలోని ముఖ్యవిషయాలతో కూడిన కరపత్రాలను సభ్యత్య నమోదు కేంద్రాల ద్వారా ప్రజలకు పంచాలని భావిస్తోంది. మరోవైపు ఈ విషయాలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికార ఫేస్బుక్ పేజీ, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా ప్రజలకు చేరువ చేయాలని నిర్ణయించారు. తద్వారా విపక్షాల ఆరోపణలను కొంత వరకూ ఎదుర్కొనవచ్చుననేది కాంగ్రెస్ నాయకుల ఆలోచన. ఇందుకు పార్టీ హైకమాండ్ అనుమతి లభించినట్లు సమాచారం. -
సంక్షేమమే ఎజెండా..
బీజేపీ విజన్ డాక్యుమెంట్ విడుదల సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజల సంక్షేమమే ఎజెండాగా భారతీయ జనతా పార్టీ విజన్ డాక్యుమెంట్ విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముద్రతో రూపొందిన ఈ మేనిఫెస్టో మధ్యతరగతి ప్రజల ఆలోచనలను ప్రతిబింబించింది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడీ, ఆ పార్టీ సీనియర్ నేతలు నిర్మలా సీతారామన్, అనంత్‌కుమార్, హర్షవర్ధన్, సతీష్ ఉపాధ్యాయలతో కలిసి మంగళవారం డాక్యుమెంట్ విడుదల చేశారు. 35 అంశాలు, 270 పాయింట్లు ఉన్న ఈ మేనిఫెస్టోలో అభివృద్ధికి, మహిళల భద్రతకు, పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యతనిచ్చారు. ఢిల్లీని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామన్న హామీని ప్రధానంగా చెప్పారు. అయితే ఆప్ ప్రచార అస్త్రమైన ఢిల్లీకి ప్రత్యేక రాష్ట్ర హోదా అనే అంశాన్ని ఈ డాక్యుమెంట్ స్పృశించలేదు. 2013లో ఎన్నికల్లో విద్యుత్తు ఛార్జీలను 30 శాతం తగ్గిస్తామని ఇచ్చిన హామీని కూడా పక్కనబెట్టింది. ‘విజన్ డాక్యుమెంట్ మహిళా భద్రత, విద్యుత్తు, నీరు, పారిశుధ్యం, వాణిజ్యం, వ్యాపారం, విద్య, గృహవసతి, రవాణా, ఉపాధి, పర్యావరణ వ్యవహారాలకు ప్రాధాన్యాన్ని ఇచ్చింది’ అని కిరణ్ బేడీ వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి విభాగంలో పనితీరును పారదర్శకంగా చేస్తామని హామీ ఇచ్చారు. నిధులను జాగ్రత్తగా ఖర్చు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ సిబ్బంది, అధికారులు ప్రజల్లో తిరుగుతూ తనిఖీలు నిర్వహిస్తారని చెప్పారు. ‘మన్‌కీ బాత్’ తరహాలో ‘దిల్ కీ బాత్’ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేడియోలో నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమం తరహాలో ప్రతి నెల ‘దిల్ కీ బాత్’ కార్యక్రమం నిర్వహిస్తామని బేడీ తెలిపారు. ఇందులో తనతో పాటు కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారని వివరించారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రజలతో మాట్లాడే సదుపాయం కూడా అందిస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని, తమ ప్రభుత్వం కేంద్రంతో కలిసి సమన్వయంతో ముందుకుపోతుందని వివరించారు. ఇతర రాష్ట్రాలలో విజయవంతమైన పథకాలను ఢిల్లీలో అమలుచేస్తామని వెల్లడించారు. ప్రతి కార్యక్రమాన్ని నిరంతరం సమీక్షిస్తామని చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు పతి ఇంటికీ నీరు, మధ్యతరగతి ప్రజలకు లక్ష ఇళ్లు నిర్మాణం ఢిల్లీవాసులకు నిర్బంధ ఆరోగ్య బీమా స్మార్ట్ సిటీ, స్కిల్ హబ్‌ల ఏర్పాటు పేదలకు, బీపీఎల్ కుటుంబాలకు సబ్సీడీ రేట్లతో విద్యుత్తు మహిళా భద్రత పర్యాటన, మెడికల్ టూరిజం కేంద్రంగా ఢిల్లీ వ్యాపారం కోసం ఢిల్లీలో అనువైన వాతావరణం సృష్టించడం {పభుత్వ భవనాలు పూర్తిగా వినియోగించడం, స్కూళ్లు, కాలేజీలలో సెకండ్ హాఫ్‌లో ఇతర క్లాసులు నిర్వహించడం దక్షిణ ఢిల్లీలోని వివాదాస్పద బస్ రాపిడ్ ట్రాన్స్‌పోర్టు కారిడార్ రద్దు పతి 5 కి.మీలకు ఒక 15 పడకల ఆస్పత్రి, అంబులెన్సు ఈశాన్య వాసుల భద్రతకు అన్నీ పోలీసు స్టేషన్లలో ప్రత్యేక సెల్, 24 గంటల హెల్ప్‌లైన్ అనధికార కాలనీల క్రమబద్ధీకరణ -
బీజేపీ ప్రశ్నలపై స్పందించబోం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సంధించిన ఐదు ప్రశ్నలపై తాము స్పందించబోమని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) స్పష్టం చేసింది. తాము ఇప్పటికే కాషాయ పార్టీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీని బహిరంగ చర్చకు ఆహ్వానించామని, కానీ ఆమె ముందుకు రాకుండా పారిపోయారని ఆప్ నేత అశుతోష్ విమర్శించారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ‘మనమెందుకు చర్చలో పాల్గొనకూడదు? అందుకే కిరణ్ బేడీని బహిరంగ చర్చలో పాల్గొనాలని సవాల్ విసిరాం. కానీ, ఆమె అందుకు అంగీకరించకుండా పారిపోయింది. ఎందుకంటే ఆమెకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం ఇష్టం లేదు. అసలు ఆమెకు ఢిల్లీ గురించి అవగాహనే లేదు’ అని ఆయన అన్నారు. తమపై సంధించే ప్రశ్నలను బహిరంగంగా లక్షలాది ప్రజలను మధ్యవర్తులుగా ఉంచి అడగొచ్చు కదా... అని ప్రశ్నించారు. దీనికి అంగీకరించకుండా తమపై ప్రశ్నాస్త్రాలను ఎందుకు సంధిస్తున్నారని అశుతోష్ వ్యాఖ్యానించారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై రోజువారీ పద్ధతిలో ప్రశ్నలు విసరడం మాని కాలం చెల్లిన సంప్రదాయ మేనిఫెస్టోతో కాకుండా ఢిల్లీకి ఏం చేస్తారనే దానిని ‘విజన్ డాక్యుమెంట్’గా రూపొందించాలంటూ బీజేపీకి సవాల్ విసిరారు. -
2019లో బీజేపీదే అధికారం
మొయినాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 2019లో జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు మునిగిపోయే పార్టీలని, అప్పటి వరకు అధికార టీఆర్ఎస్పై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, అప్పడు ప్రత్యామ్నాయంగా నిలిచేది బీజేపీనే అన్నారు. టీఆర్ఎస్ నాయకత్వం కంటే బీజేపీ నాయకత్వం పటిష్టంగా ఉందన్నారు. బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజన్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన ఆదివారం మొయినాబాద్ మండలం చిలుకూరులోని బ్లూమ్స్ గార్డెన్లో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన దత్తాత్రేయ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పెద్ద పాత్ర పోషించింది బీజేపీనేనని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ఏకైక జాతీయ పార్టీ కూడా తమదేనన్నారు. అందరం కలిసి బంగారు తెలంగాణ నిర్మాణంకోసం కృషి చేయాలన్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయాలని, అందుకోసం పార్టీ కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాల్సిన అవసరముందన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలనిసూచించారు. భారత్‌ను నంబర్‌వన్‌గా నిలిపేందుకు మోదీ కృషి ప్రపంచంలో భారత్‌ను నంబర్‌వన్‌గా నిలిపేందుకు ప్రధాని నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని దత్తాత్రేయ అన్నారు. గ్రామాలు, పట్టణాలను ఆధునికీకరించి అభివృద్ధి చేసేవిధంగా బృహత్తర కార్యక్రమాలు చేపట్టబోతున్నామన్నారు. దేశంలో 5 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణలు ఇచ్చి పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం చేపట్టబోతున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే బాధ్యతను పార్టీ కార్యకర్తలే తీసుకోవాలన్నారు. అందుకోసం ప్రతి కార్యకర్త తమ వంతు సహకారాన్ని అందించాలన్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి కృష్ణదాస్ మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రను తిరగరాయాల్సిన సమయం ఆసన్నమైందని, ఆ మార్పునకు ఇదే మంచి అవకాశమన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదే లక్ష్యంగా కార్యకర్తలు ముందుకు సాగాలన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా ఇన్చార్జి యెండల లక్ష్మీనారాయణ, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రేంరాజ్, నర్సింహారెడ్డి, బాల్‌రెడ్డి, కంజర్ల ప్రకాష్, జంగయ్య యాదవ్, ప్రహ్లాదరావు, శంకర్‌రెడ్డి, పాపయ్యగౌడ్, బోసుపల్లి ప్రతాష్, ప్రభాకర్‌రెడ్డి, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విక్రంరెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు బొక్క నర్సింహారెడ్డి, రాములు, శివరాజ్, పార్టీ మండల అధ్యక్షుడు గున్నాల గోపాల్‌రెడ్డి, సర్పంచ్‌లు ప్రభాకర్‌రెడ్డి, సంగీత, ఎంపీటీసీ సభ్యులు సహదేవ్, శోభ, నాయకులు శేఖర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శ్రీరాములు, ప్రశాకర్రెడ్డి, నర్సింహారెడ్డి, సుదీంధ్ర తదితరులు పాల్గొన్నారు. -
టార్గెట్.. సైకిల్!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : జిల్లాలో బలోపేతం అయ్యేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యూహం రచిస్తోంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకునే బలోపేతం కావాలని భావిస్తోంది. ఇందుకోసం టీడీపీలో తాజాగా జరుగుతున్న వర్గపోరును తమకు అనుకూలంగా మార్చుకోవాలనిన్నారు. అయితే ఈ మొత్తం ప్రక్రియను మిత్ర బంధానికి విఘాతం కలగకుండా చాకచక్యంగా చేయాలనేది బీజేపీ జిల్లా నాయకత్వం ఆలోచనగా ఉంది. మొత్తం మీద అధికార టీడీపీని లక్ష్యంగా చేసుకుని బలోపేతం అయ్యేందుకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. పోరును పదునెక్కిద్దాం..! అధికార టీడీపీలో రోజురోజుకీ వర్గపోరు తీవ్రం అవుతోంది. మొన్నటివరకు కేఈ-టీజీల మధ్య ఉన్న వర్గపోరు బెరైడ్డి రీ-ఎంట్రీ నేపథ్యంలో పార్టీ మొత్తం రెండు వర్గాలుగా విడిపోయే దుస్థితి నెలకొంది. ఈ వర్గపోరును ఆసరాగా చేసుకుని బలోపేతం కావాలనేది బీజేపీ ఆలోచనగా ఉంది. వాస్తవానికి జెడ్పీ చైర్మన్ ఎపిసోడ్‌తోనే ఈ ఆలోచనకు బీజేపీ పునాదులు వేసుకుందన్న ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచి టీడీపీలో చేరి జెడ్పీ చైర్మన్‌గా ఉన్న రాజశేఖర్‌పై వచ్చిన నకిలీ మద్యం కేసు నేపథ్యంలో ఆయన్ను తొలగించి తాము ఆ పీఠాన్ని అధిష్టించేందుకు టీడీపీలోని కొందరు నేతలు ప్రయత్నించారు. ఈ వర్గపోరును బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు అప్పట్లోనే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే జెడ్పీ చైర్మన్ రాజశేఖర్‌ను అరెస్టు చేయాలంటూ ఏకంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించింది. తద్వారా కేసు ఎదుర్కొంటున్నప్పటికీ జెడ్పీ చైర్మన్‌ను తొలగించేందుకు ససేమిరా అన్న టీడీపీ అధిష్టానాన్ని ధర్నాతో లక్ష్యంగా చేసుకోవడంతో పాటు ఆ పార్టీలోని అసంతృప్తులకు కూడా వల వేసేందుకు ఉపయోగపడుతుందని భావించింది. తద్వారా స్వామి కార్యంతో పాటు స్వకార్యాన్ని పూర్తి చేసుకోవచ్చునేది బీజేపీ నేతల అభిప్రాయం. తాజాగా బెరైడ్డి రాజశేఖరరెడ్డి రీ-ఎంట్రీతో ఆ పార్టీలో లుకలుకలు మళ్లీ మొదలయ్యాయి. బెరైడ్డి రాకను ఒక వర్గం వ్యతిరేకిస్తుండగా.. మరో వర్గం స్వాగతిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం కాస్తా చినికిచినికి గాలివానలాగా మారినట్లు ఆ పార్టీలో బహిరంగ విమర్శలకు దారితీసింది. ఇప్పుడు కూడా తాజా వర్గపోరును నిశితంగా గమనిస్తూ.. ఈ పోరు తీవ్రతరం అయ్యే కొద్దీ అసంతృప్త నేతలను తమవైపు లాక్కోవాలనేది బీజేపీ పార్టీ భావిస్తోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై నజర్.. వాస్తవానికి నియోజకవర్గ ఇంచార్జీలు ప్రతిపాదించిన వ్యక్తులకే నామినేటెడ్ పోస్టులను ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది. అయితే, ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో పార్టీలోకి వచ్చి తాజా మాజీ కాంగ్రెస్ నేతలకు చుక్కెదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ద్వారా ఆ పార్టీ నాయకత్వంలో చెలరేగే అసంతృప్తిని కూడా తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అయితే, ఈ తతంగం చాలా నెమ్మదిగా జరిగే కార్యక్రమమని... తాము తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నామన్న భావన బయటికి రాకుండా చూసుకోవాల్సి ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. ‘కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో తెలుగుదేశం పార్టీ మాకు కూటమిగా ఉంది. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఆ పార్టీతో కలిసి అధికారాన్ని కలిసి పంచుకున్నాయి. అయితే, ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతేకాకుండా రాయలసీమకు టీడీపీ అన్యాయం చేస్తుందన్న భావన కూడా ప్రజల్లో బలపడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీని టార్గెట్ చేసుకుని బలపడాలన్న మా ప్రణాళికను జాగ్రత్తగా అమలు చేయాలనేది మా భావనగా ఉంది’ అని బీజేపీ సీనియర్ నేత ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. మొత్తం మీద బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీలో కలవరం సృష్టిస్తున్నాయి. -
కొత్త సభ్యుణ్ణి చేర్చుకో.. టికెట్ దక్కించుకో
* అనుబంధ సంఘాల నాయకులకు పిలుపు * పార్టీ బలోపేతం చేయడానికి బీజేపీ కొత్త ఎత్తుగడ న్యూఢిల్లీ: ఢిల్లీ పీఠాన్ని దక్కించుకొనేందుకు భారతీయ జనతా పార్టీ విశ్వప్రయాత్నాలు చేస్తోంది. ప్రచారం ఉధృతం చేయడంతోపాటు పార్టీలోకి కొత్త సభ్యులను చేర్పించడానికి బీజేపీ రాష్ర్టశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సభ్యత్వ నమోదు పెంచేందుకు అనుబంధ సంఘాల సెల్స్‌ను సమాయత్తం చేస్తోంది. ‘పార్టీలో నూతనంగా సభ్యులను చేర్పించిన సెల్ నాయకులకు అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుందని పార్టీ నాయకుడు వెల్లడించారు. పార్టీ అనుబంధ సంఘాలివే.. యువ మోర్చా, మహిళా మోర్చా, మైనార్టీ మోర్చా, పూర్వాం చల్ మోర్చాలు ఇప్పటికే ఈ మేరకు కొత్త సభ్యులను పార్టీలో చేర్పించాలని పార్టీ నిర్ణియించింది. ఈ మేరకు ఢిల్లీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఆయా సెల్‌లకు పార్టీ నిర్ణయాలను తెలియజేశారు. కొత్త సభ్యులను చేర్పించిన వారికే ప్రాధాన్యత ఉంటుందనే విషయానికి కట్టుబడి ఉండాలని, తద్వారా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేలా పాటుపడాలని పిలుపు ఇచ్చారు. ‘పార్టీలో కొత్త సభ్యులను చేర్చుకోవాలని సెల్‌లకు ఇచ్చిన టార్గెట్స్‌ను పూర్తి చేయకుంటే అసెం బ్లీ ఎన్నికల టికెట్ కేటాయింపులో ఆయా సెల్ నాయకులకు ప్రాధాన్యత ఉండదని’ కూడా హెచ్చరించినట్లు బీజేపీ ఢిల్లీ శాఖ ఆఫీస్‌బేరర్ తెలియజేశారు. నవంబర్ 1వ తేదీ నుంచి పార్టీ ప్రారంభించిన సభ్యత్వ నమోదు స్పెషల్ డ్రైవ్‌లో 16 లక్షల మంది కొత్త సభ్యులను పార్టీలో చేర్పించినట్లు చెప్పారు. వివిధ మోర్చాలకు టార్గెట్లిలా.. వివిధ సెల్‌లకు పార్టీ టార్గెట్లు నిర్ణయించింది. పూర్వాంచల్ మోర్చా జనవరి 15వ తేదీ వరకు 10 లక్షల కొత్త సభ్యులను చేర్పించాలని సూచించింది. ఇప్పటి వరకు కేవలం సభ్యత నమోదు క్యాంపెయిన్ నిర్వహించి 1 లక్ష మంది కొత్త సభ్యులను చేర్పిం చింది. మైనార్టీ మోర్చా టార్గెట్ 2లక్షల మందిని చేర్పించాల్సి ఉండగా, కేవలం 40 వేల మందిని మాత్రమే చేర్పించింది. అనధికార కాలనీల్లో పట్టుసాధించడానికి పూర్వాంచల్ మోర్చా కృషి చేస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అక్కడ కూల్చివేతలను నిలిపి వేసిన విషయం తెలిసిందే. ఇక్కడ బీజేపీకి పట్టు లభించే అవకాశం ఉండడంతో కొత్త సభ్యత్వాలను ముమ్మరం చేయాలని పార్టీ నిర్ణయించింది. మహిళా మోర్చాకు ఇచ్చిన టార్గెట్ 1.5 లక్షలు కాగా, ఇప్పటి వరకు 80,000 మందిని మాత్రమే పార్టీలో చేర్పించింది. కాలేజీ ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో సమావేశాలు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడంలో భాగంగా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులతో సమావేశాలు ఏర్పాటు చేసి, సాయంత్రం షిప్టులను నడిపించుకోవడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. అదేవిధంగా పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోపై టీచర్ల అభిప్రాయాలు, సూచనలను తెలుసుకొంటున్నారు. వారి డిమాండ్లను పార్టీ మేనిఫెస్టోలో చేర్చుతామని హామీ ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ తూర్పు, పశ్చిమ ప్రాంగణాలను ఏర్పాటు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నరెలా, నజాఫ్‌ఘర్‌లో కాలేజీలు ఏర్పాటు చేయాలని అధ్యాపకులు సూచించారు. కొత్త హాస్టల్స్, డిజిటల్ లైబ్రరరీ ఏర్పాటు చేయాలని కోరారు. విదేశీ వర్సిటీలతో తమ కాలేజీలు అనుబంధంగా ఉండడానికి అనుమతి ఇవ్వాలని ప్రిన్సిపాళ్లు ఆయనకు సూచించారు. -
నేడు అమిత్‌షా రాక
చెన్నై,సాక్షి ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షులు అమిత్ షా రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం చెన్నైకి రానున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సమాయుత్తం చేసేందుకు తొలిసారిగా తమిళనాట కాలుమోపనున్నారు.బీజేపీ జాతీయ అధ్యక్షులుగా ఎందరో పనిచేసి నా వారందరికీ భిన్నమైన మనిషిగా అమిత్‌షా పేరుతెచ్చుకున్నారు. అట్టడుగున ఉన్న పార్టీని అగ్రస్థానం లో నిలబెట్టడంలో సిద్ధహస్తుడని తాజా పార్లమెంటు ఎన్నికలు నిరూపించాయి. పైగా సెంటిమెంట్ల ప్రభా వం అధికంగా ఉన్న బీజేపీలో కలిసొచ్చిన కమలనాథుడుగా అమిత్‌షా కీర్తి గడించాడు. అందుకే కేంద్రం లో ప్రధాని తర్వాత ప్రాముఖ్యం అమిత్‌షాకే. తన రాజకీయ చతురత, వ్యూహంతో ఉత్తరాదిలో బీజేపీకి ఊహించని సీట్లు సాధించి పెట్టిన అమిత్‌షాపై ప్రస్తుతం దక్షిణాది భారం పడింది. నాలుగు దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే తమిళనాడు రాజకీయ కల్లోలంలో పడింది. బలమైన అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత కేసులతో బలహీనపడడం, డీఎంకే పుం జుకోక పోవడం, కాంగ్రెస్ మట్టికరిచిపోవడం వంటి కారణాలతో తమిళనాడు కొట్టుమిట్టాడుతోంది. బీజేపీని బలోపేతానికి ఇదే అదనుగా కమలనాథులు కాలు కదుపుతున్నారు. 2016 నాటి ఎన్నికల్లో ఒంటరి గా లేదా కూటమి పార్టీలతో కలిసి జార్జికోటపై జెండా ఎగురవేయూలని బీజేపీ తహతహలాడుతోంది. పార్లమెంటు ఎన్నికల సమయంలో ఏర్పడిన బీజేపీ కూటమికి బీటలువారాయి. బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి, కూటమి పార్టీలకు మధ్య సఖ్యత కరువై అగాధం ఏర్పడింది. అమిత్‌షా సమ్మోహనాస్త్రం రాష్ట్ర బీజేపీ పార్లమెంటు ఎన్నికల సమయంలో బలం పుంజుకుని నేడు మళ్లీ బలహీనంగా తయారైంది. ఈ పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రధాని మోదీ అమిత్‌షాను రాష్ట్రానికి పంపే ఏర్పాట్లు చేశారు. ఈనెల 20న మధ్యాహ్నం కేరళ నుంచి చెన్నైకి చేరుకుంటారు. గిండీలోని ఒక ఐదు నక్షత్రాల హోటల్ సేదతీరి నగర శివార్లు మరైమలైనగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4.30 నుంచి రాత్రి 7 గంటల వరకు సభలో పాల్గొని హోటల్‌కు చేరుకుంటారు. 7 గంటల అనంతరం పలు పార్టీలకు చెందిన నేతలు, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశమవుతారు. 21వ తేదీ ఉదయం టీనగర్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్రస్థాయి సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తారు. హటల్‌లో మధ్యాహ్నం నుంచి కూటమి పార్టీ నేతలతో చర్చలు జరుపుతారు. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. సీఎం అభ్యర్థి నిర్మలాసీతారామన్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమికి తామే నాయకత్వం వహించబోతున్నట్లు డీఎండీకే అధినేత విజయకాంత్, పీఎంకే అధినేత రాందాస్ ఎవరికివారు ప్రకటించుకున్నారు. సీఎం అభ్యర్థి తానేనంటూ విజయకాంత్, అన్బుమణి రాందాస్ (పీఎంకే) ప్రచారం చేసుకుంటున్నారు. మోదీ చరిష్మానే ప్రధాన ఆకర్షణగా మారిన తరుణంలో సీఎం అభ్యర్థిత్వాన్ని మరో పార్టీకి కట్టబెట్టడం బీజేపీకి ఎంతమాత్రం ఇష్టంలేదు. ఈ తర్జనబర్జనలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేరు తెరపైకి వచ్చింది. ప్రధానికి అత్యంత నమ్మకస్తురాలు, తమిళనాడు ఆడపడుచు కావడం ఆమెకున్న అర్హతలుగా భావిస్తున్నారు. అమిత్ షా పర్యటనలో సీఎం అభ్యర్థి పేరు ప్రస్తావనకు వస్తుందని ఆశిస్తున్నారు. బిజీ బిజీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమిత్ షా తొలిసారిగా రాష్ట్రంలో అడుగుపెట్టడంతో నేతలు భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. 20వ తేదీ నాటి బహిరంగ సభ వేదికను అసెంబ్లీ భవనాన్ని తలపిం చేలా నిర్మిస్తూ జార్జికోటపై పార్టీ గురిపెట్టిందని చెప్పకనే చెబుతున్నారు. అమిత్ షా సమక్షంలో పలువురు ప్రముఖులు, ఇతర పార్టీలకు చెందిన వారు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. అలిగి దూరం గా ఉన్న కూటమి నేతలను సైతం బుజ్జగించే పనిలో పడ్డారు. విజయకాంత్ మినహా మిగిలిన వారు రాకపోవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
నిధుల దాతల వివరాలు వెల్లడించాలి
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీకి నిధులు అందజేసే దాతల వివరాలు వెల్లడిస్తామని, భారతీయ జనతా పార్టీ కూడా ఆ పార్టీకి నిధులు అందజేసే దాతల వివరాల జాబితాను వెల్లడించాలని ఆమ్ఆద్మీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఎన్జీవోస్ నిధులను ఆప్ నాయకులకు మళ్లిస్తున్నారని బీజేపీ చేసిన ఆరోపణలపై ఆప్నేతకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బీజేపీపై పరువు నష్టం కేసు పెట్టినట్లు అరవింద్ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆప్ నిధుల విషయమై బీజేపీ చేస్తున్న నిరాధారమైన ఆరోపణలకు మీడియా అధిక ప్రాధాన్యతను ఇస్తోందని అన్నారు. పార్టీకి నిధులు అందజేసే దాతల వివరాలను పారదర్శకంగా వెల్లడించిన మొదటి రాజకీయ పార్టీ ఆప్ అని, ఈ విషయానికి మీడియా ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. బీజేపీతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా నిధుల అందజేసే దాతల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ‘ తమ దాతలను రెచ్చగొట్టేందు బీజేపీ ప్రయత్నిస్తోంద’ని ఆప్ నేత ట్విట్టర్లో అభిప్రాయపడ్డారు. ‘ఆప్నేతతో కలిసి వ్యాపారుల భోజనం’ అనే కార్యక్రమానికి హాజరైన సభ్యులు ఒకొక్కరు ప్రవేశ రుసుం కింద రూ.20,000ల అందజేశారని, మొత్తంగా 50 లక్షలు ఈ కార్యక్రమానికి వచ్చాయని చెప్పారు. అదే విధంగా ఇటీవల ముంబైలో కూడా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రూ. 91 లక్షలు అందాయని, రెండు కార్యక్రమాలకు గాను రూ. 1.41 కోట్ల నిధులు సేకరించామని చెప్పారు. ఎన్జీవో నిధులను ఆప్ నాయకులకు మళ్లిస్తున్నట్లు బీజేపీ ఆరోపిస్తూ, నిధుల సేకరణకు నిర్వహించిన కార్యక్రమాలపై దర్యాప్తు చేయించాలని ఇటీవల డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
ఉరి నుంచి విముక్తి
తమిళనాడు ప్రజల నుంచి భారతీయ జనతా పార్టీ మంచి మార్కులే కొట్టేసింది. ప్రధానంగా ప్రధాని నరేంద్రమోదీకి తమిళనాడు యావత్తూ జేజేలు పలుకుతోంది. శ్రీలంక కోర్టు ఉరిశిక్ష విధించిన ఐదుగురు తమిళ జాలర్లలకు ఆ దేశాధ్యక్షుడు రాజపక్సే విముక్తి ప్రసాదించడమే ఇందుకు కారణం. * జాలర్ల ఉరిశిక్ష రద్దు * శ్రీలంక మంత్రి వెల్లడి * రాష్ట్రంలో హర్షాతిరేకాలు చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న అనేక సమస్యల్లో శ్రీలంక, తమిళ జాలర్ల మధ్య నడుస్తున్న వివాదం ప్రధానమైనది. తమిళ జాలర్లకు కష్టం కలిగినపుడు కేవలం జాలర్ల కుటుంబాలేగాక రాష్ట్రం యావత్తూ తీవ్రంగా స్పందిస్తోంది. రాజ కీయ పార్టీలన్నీ ఏకమవుతాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత తన హయాంలో కేంద్రంతో ఉత్తరాల యుద్ధమే నడిపారు. తమిళనాడులో బీజేపీ జరిపిన పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో మత్స్యకారుల సమస్యను ప్రధాన అస్త్రంగా ఎం చుకున్నారు. తాము అధికారంలోకి వస్తే జాలర్ల సమస్యకు శాశ్వత ముగింపు ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే పాత సమస్యల మాట అటుం చి ఐదుగురు తమిళజాలర్లకు ఉరిశిక్ష విధింపుతో కేంద్రానికి సరికొత్త చిక్కు వచ్చిపడింది. రామనాథపురం జిల్లా రామేశ్వరం సమీపం తంగచ్చిమండపానికి చెందిన ఎనిమిది మంది జాలర్లు హరాయిన్ మత్తుపదార్థాలను చేరవేస్తున్నారంటూ 2011 నవంబర్ 28న శ్రీలంక గస్తీదళాలు అరెస్ట్ చేశాయి. కేసు వాదోపవాదాల నేపథ్యంలో35 నెలలుగా 8 మంది జాలర్లు శ్రీలంక జైలులోనే మగ్గుతున్నారు. పట్టుబడిన 8 మంది తమిళ జాలర్లలో అగస్టస్, ఎవర్సన్, లింగ్లెట్, ప్రసాద్, విల్సన్ ఉన్నారు. ఈ మత్స్యకారులకు ఉరిశిక్ష విధిస్తూ గత నెల 30వ తేదీన శ్రీలంక కోర్టు తీర్పుచెప్పింది. ఈనెల 14వ తేదీలోగా అప్పీలు చేసుకునే అవకాశం కల్పించింది. దీనిపై ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం రెండుసార్లు ప్రధానికి ఉత్తరాలు రాశారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైతం రాష్ట్రంలోని పరిస్థితి తీవ్రతను విదేశాంగశాఖా మంత్రి సుష్మాస్వరాజ్ ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లింది. ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీని ప్రధాని గుర్తుచేసుకున్నారో ఏమో వెంటనే స్పందించారు. శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయా న్ని యుద్ధప్రాతిపదికన పురమాయించారు. ఉరిశిక్షపై శ్రీలంక హైకోర్టులో అప్పీలు వేయిం చారు. అంతేగాక శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేతో ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 9వ తేదీన టెలిఫోన్ ద్వారా సంభాషించారు. అప్పటి చర్చల ఫలితంగా ఐదుగురు జాలర్లను భారత దేశానికి తరలించేందుకు రాజపక్సే అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఐదుగురు తమిళ జాలర్ల ఉరిశిక్షను రాజపక్సే రద్దుచేసినట్లు శ్రీలంక మంత్రి సెంథిల్ తొండమాన్ శుక్రవారం ప్రకటించారు. ఉరిశిక్షపై భారత రాయబార కార్యాలయం శ్రీలంక హై కోర్టులో దాఖలు చేసిన అప్పీలు కేసును ఉపసంహరించుకోగానే ఉరిశిక్ష రద్దు ఆదేశాలు అమలులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈరాన్ నుంచి ఐదుగురు విడుదల: తమ సరిహద్దులో చేపలవేట సాగిస్తున్నారని ఆరోపిస్తూ కన్యాకుమారి జిల్లాకు చెందిన ఐదుగురు జాలర్లను ఈరాన్ దేశం అరెస్ట్ చేసింది. శ్రీలంకలో ఉరిశిక్ష పడిన ఐదుగురు జాలర్లు విడుదల కానున్న పక్షంలో ఈరాన్ సైతం తమ ఆధీనంలో ఉన్న ఐదుగురు జాలర్లను విడుదల చేసింది. ఈరాన్ చెరలో 55 రోజులు గడిపిన జాలర్లు త్వరలో తమిళనాడుకు చేరనున్నారు. హర్షం తమిళ జాలర్లకు ఉరిశిక్ష పడిన వార్త వెలువడగానే అట్టుడికిపోయిన రాజకీయ పార్టీలు శుక్రవారం హర్షం ప్రకటించాయి. ఉరిశిక్ష రద్దు వార్తతో మనస్సులో ప్రశాంతత ఏర్పడిందని కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ చెప్పారు. తమిళనాడు ప్రజల వేడుకోలును ప్రధాని మోదీ మన్నించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని డీఎంకే అధినేత కరుణానిధి అన్నారు. -
ఒంగిన ఆకాశం
జీవన కాలమ్: ఒక నాయకుడు- అందునా ముఖ్యమంత్రి ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా, కేవలం ఓ పసిపిల్ల ఉత్సాహానికి ఊతం ఇవ్వడానికి తన కార్యక్రమాన్ని సడలించుకుని ఇంటర్వ్యూ ఇవ్వడం ఈ దేశంలో చర్మం ముదిరిన నాయకులు చేయడం మనం వినలేదు. ఓ పదకొండేళ్ల అమ్మాయి మొన్న మహారాష్ట్రలో ముఖ్య మంత్రి పదవీ స్వీకారాన్ని చూసింది. ఆ సంఘటన ఆ అమ్మాయిని ఆకర్షించింది. ఎం దుకు? మహారాష్ట్ర చరిత్రలో జరగని విధంగా కేవలం ఉద్ధతి, నిజాయితీ, సేవాతత్పరత పెట్టు బడులుగా 44 ఏళ్ల వ్యక్తి - మొద టిసారిగా మహారాష్ట్ర చరిత్రలో, భారతీయ జనతా పార్టీ నాయకుడు పదవీ స్వీకారం చేయడాన్ని చూసింది. ఇవన్నీ నా మాటలు. బహుశా ఆ అమ్మాయికి ఇన్ని తెలియక పోవచ్చు. 27వ యేటే ఈ కుర్రాడు నాగపూర్ మేయరు కావడం కూడా ఆమెకి తెలియకపోవచ్చు. రాజకీయ రంగంలో పదవుల్లోకి రావడమే లక్ష్యంగా నాయకుల సాముగరిడీలు ఆ పిల్ల దృష్టికి వచ్చి ఉండవచ్చు. ఈ సంఘటన- ముఖ్యంగా ‘అనుభవం తప్ప పదవికి ఏ పెట్టు బడీలేని’ ఒక నాయకుడి చిరునవ్వు ఆమెను ఆకర్షించి ఉండవచ్చు. మళ్లీ ఇవన్నీ నా మాటలు. ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేయాలని అనిపించిందా అమ్మాయికి. 44 ఏళ్ల వ్యక్తి మొదటిసారిగా ముఖ్యమంత్రి అవడం సాధ్యమ యితే, తాను ఇంటర్వ్యూ చేయగలగడం ఎందుకు సాధ్యం కాదు? అరమరికలు లేని స్వచ్ఛమైన మనస్సే ఇంత సూటిగా ఆలోచించగలదు. మొన్న ఆదివారం దృష్టి హర్చంద్రాయ్ అనే ఈ పిల్ల ముఖ్యమంత్రి ఇంటికి - సహ్యాద్రికి- వచ్చేసింది, తన పిన్నమ్మను వెంటబెట్టుకుని. వాచ్మన్లు లోనికి రానివ్వ లేదు. న్యాయంగా అక్కడితో కథ ముగియవచ్చు. కాని ఈ పిల్ల ముఖ్యమంత్రికి ఓ ఉత్త రం పంపింది- గేటు దగ్గర నుంచి. న్యాయంగా వాచ్ మెన్లు ఆ ఉత్తరాన్ని బుట్టదాఖలు చెయ్యవచ్చు. కాని వాళ్లు ముఖ్యమంత్రికి ఈ ఉత్తరాన్ని అందజేశారు. ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆ ఉత్తరాన్ని చూశారు. ఆయన నాగపూర్ వెళ్లే హడావుడిలో ఉన్నారు. ఇంకా తన ప్రభు త్వానికి రాజకీయమైన గండం గడవలేదు. ఆయన ఆ కాగితాన్ని బుట్టలో పారే స్తే న్యాయంగా ఈ కథ ఇక్కడా ముగియవచ్చు. కానీ ఫడ్నవీస్ ప్రయాణాన్ని కాస్త నిలు పుకుని ఆ అమ్మాయిని లోపలికి పిలిపించారు. 20 నిమి షాలు ఇంటర్వ్యూ ఇచ్చారు. చివరి ప్రశ్న ముఖ్యమంత్రిది. ‘‘చదువయ్యాక జర్నలిస్టువి అవుతావా?’’ అన్నారు పద కొండేళ్ల వయసులోనే ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ సాధిం చిన అమ్మాయిని. దృష్టి నవ్వి, ‘‘నేను డాక్టర్ని అవుతాను’’ అంది. ఒక నాయకుడు- అందునా ముఖ్యమంత్రి ఏ ప్రయో జనాన్ని ఆశించకుండా, కేవలం ఓ పసిపిల్ల ఉత్సాహానికి ఊతం ఇవ్వడానికి తన కార్యక్రమాన్ని సడలించుకుని ఇంటర్వ్యూ ఇవ్వడం ఈ దేశంలో చర్మం ముదిరిన నాయ కులు చేయడం మనం వినలేదు. అందుకూ ఈ వార్త నేల బారు హృదయాన్ని తాకే గెశ్చర్ (సంకేతం). మరో సంఘటన. చాలాయేళ్ల కిందటిమాట. తిరువ నంతపురంలో తుంబా అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఓ సైంటిస్ట్ పనిచేస్తున్నాడు. తెల్లవారి లేస్తే చీకటి పడే దాకా ప్రయోగశాలలో ఊపిరాడని పని. ఏ రాత్రికో ఇంటికి వచ్చే వాడు. ఒక రోజు భార్య చెప్పలేక చెప్పలేక భర్తకి చెప్పింది. ‘‘పిల్లలు ఎన్నాళ్లుగానో సినిమాకి తీసుకెళ్లమని అడుగుతు న్నారు’’ అని. సైంటిస్ట్ బాధపడిపోయాడు. మర్నాడు పిల్లల్ని సాయంకాలం సిద్ధంగా ఉంచమన్నాడు- సినిమాకి. ఆఫీసుకి వస్తూనే బాస్‌తో చెప్పాడు- పిల్లలు సిని మాకి వెళ్లాలంటున్నారు, ఆ సాయంకాలం కాస్త త్వరగా ఇంటికి వెళ్తానని. బాస్ తప్పనిసరిగా వెళ్లమన్నాడు. తీరా పనిలో పడి ఒక దశలో వాచీ చూసుకుంటే రాత్రి ఎనిమి దిన్నర అయింది. పిల్లలు జ్ఞాపకం వచ్చారు. బాధపడి పోయాడు. సిగ్గుపడుతూ భార్యకీ, పిల్లలకీ సంజాయిషీ చెప్పడానికి సిద్ధపడుతూ ఇంటికి వచ్చాడు. భార్య ఆనందంగా ఎదురొచ్చింది. పిల్లలు కనిపించలేదు. ‘‘పిల్ల లేరీ?’’ అనడిగాడు. ‘‘మీ బాస్అట. ఆయన వచ్చి పిల్లల్ని సినిమాకి తీసుకెళ్లారు’’ అంది భార్య. సైంటిస్ట్ బిత్తర పోయాడు. ఆ బాస్ పేరు అబ్దుల్ కలామ్. ఈ దేశంలో మొదటి అణ్వస్త్ర పరీక్ష జరిపించిన శాస్త్రవేత్త. ఈ దేశానికి రాష్ర్టపతి. అంతేకాదు- భారతరత్న. అన్నిటికన్నా గుర్తుంచుకోవల సిన మరో విషయం ఉంది. అతి సామాన్యమైన మత్స్య కారుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఔదార్యం, ఉదాత్తత ఏదైనా ఆకాశంలో ఉండదు. నేలని ఆకాశం ఎత్తుకి నిలుపుతుంది. హృదయంలో ‘చెమ్మ’ ఉన్న వ్యక్తి దృష్టి ఆకాశంలో ఉండదు. నేల మీద నిలబడే వ్యక్తిలో ఉంటుంది. అతను ఆకాశంలోంచి దిగడు. మన మధ్య నుంచే వస్తాడు. ఇవాళ టీ అమ్ముకునే మనిషి దేశంలో కల్లా పెద్ద కుర్చీ లో కూర్చోవడానికి, మొన్న దుబాయ్‌లో వె ల్డర్‌గా పని చేసిన ఒకాయన మంత్రి కావడానికి, 44 ఏళ్ల నాయకుడు పదకొండేళ్ల అమ్మాయి మనసును ఆకట్టుకోవడానికి మూలాధారాలు వెదికితే కనిపిస్తాయి. వాటిని ఓ పద కొండేళ్ల అమ్మాయి ఈ దేశంలో గుర్తుపట్టడం ఈ దేశానికి శుభసూచకం. - గొల్లపూడి మారుతీరావు (వ్యాసకర్త సుప్రసిద్ధ రచయిత, నటుడు) -
కమలంలో కల్లోలం
చెన్నై, సాక్షి ప్రతినిధి:ప్రాంతీయ పార్టీలతో ఏర్పడిన బలమైన బీజేపీ కూటమి బీటలు వారుతోంది. పార్లమెంటు ఎన్నికల సమయంలో కలిసి నడిచిన పార్టీలు పక్కదారిపట్టగా కమలనాథుల కూటమి కల్లోలంలో పడిపోయింది. అన్నాడీఎంకే లేదా డీఎంకే లేని కూటములను రాష్ట్రంలో ఊహిం చుకోలేము. గతంలో అలాంటి కూటములు ఏర్పడిన దాఖలాలు కూడా లేవు. అయితే గత పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే ప్రాతిని థ్యం లేకుండా మరో ఏడు ప్రాంతీయ పార్టీల కూటమిని భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసింది. ఫలితాల పరంగా పెద్ద ప్రయోజనం లేకున్నా, బలహీనమైన బీజేపీ ఒక బలమైన కూటమిగా ఏర్పడటం రాజకీయ సంచలనమే. 2016 నాటి అసెంబ్లీ ఎన్నికల బరిలో అదే కూటమితో దిగాలని ఆశపడిన కమలనాథులను కూటమి నేతలు కంగారు పెడుతున్నారు. కాంగ్రెస్ నుంచి వైదొలిగి కొత్త పార్టీ పెట్టబోతున్న కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్‌కు బీజేపీ కూటమిలోని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ప్రకటన సభకు తమ పార్టీ నేతలు హాజరవుతారని సైతం మాటిచ్చేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను పార్టీలో చేర్చుకునేందుకు సర్వశక్తులు ఒడ్డిన కమలనాథులు, ఆయన అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు శుభాకాంక్షలు చెప్పడంతో ఖంగుతిన్నారు. కూటమిలోని మరోపార్టీ పీఎంకే సైతం డీఎంకే అధినేత కరుణానిధితో స్నేహం పెంచుకుంటోంది. కూటమిలోని మరోపార్టీ ఎండీఎంకే సైతం బీజేపీతో ఢీ అంటే ఢీ అనేలా మారింది. డీఎంకేతో చేతులు కలిపేందుకు ఎండీఎంకే సిద్ధం అవుతున్నట్లు ఆ పార్టీ నేతలు సంకేతాలు ఇచ్చారు. అంతేగాక మరో వైపు కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టడం ప్రారంభించారు. ఐదుగురు జాలర్లకు ఉరిశిక్ష అంశంలో ప్రధాని మోదీ వైఖరిని ఎండీఎంకే అధ్యక్షుడు వైగో తీవ్రంగా దుయ్యబట్టారు. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైతం ప్రతిదాడికి దిగింది. బీజేపీ జాతీయ నేత హెచ్ రాజా, రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ సోమవారం మీడియా వద్ద వైగో వైఖరిని ఎండగట్టారు. ప్రధానిని విమర్శించడం వైగో మానుకోవాలని వారు హెచరించారు. శ్రీలంక అంశంలో మోదీని తప్పుపడితే తమిళనాడు పార్టీ సహించబోదన్నారు. కూటమిలో ఉన్న వైగోను బీజేపీ నేరుగా హెచ్చరించడం ఇదే తొలిసారి. ఎండీఎంకేతో తెగతెంపులకు సిద్దమైన తర్వాతనే బీజేపీ ఇటువంటి నిర్ణయానికి వచ్చినట్లు బోగట్టా. -
డబల్ ధమాకా
-
సీఎం సీటుకు పెరిగిన పోటీ
కమలదళంలో కొత్తగా పుట్టుకొస్తున్న ముఖ్యమంత్రి అభ్యర్థులు సాక్షి, ముంబై: మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం అప్పుడే పోటీ ప్రారంభమైంది. ఇప్పటిదాకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్, శాసనసభలో ప్రతిపక్ష నేత ఏక్నాథ్ ఖడ్సే, మండలిలో ప్రతిపక్ష నేత వినోద్ తావ్డేల పేర్లు మాత్రమే వినిపించాయి. అయితే పోలింగ్ పూర్తయిన తర్వాత బీజేపీ విజయం ఖాయమని ఎగ్జిట్‌పోల్స్ సర్వేలో తేలడంతో ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నవారి సంఖ్య కూడా పెరిగింది. గోపీనాథ్ ముండే తనయ పంకజా ముండే ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ... తానూ సీఎం రేసులో ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు. అంతేకాక మరికొందరు నేతలు కూడా పార్టీ సీనియర్ నేతల వద్ద తమ మనసులోని మాట బయటపెట్టుకుంటున్నారు. పోలింగ్ పూర్తయి ఒకరోజైనా గడవలేదు.. అప్పుడే సీఎం పదవి కోసం పోటీ పడడమేంటి? అని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కిందిస్థాయి నుంచి ఫైరవీలు... సాధారణంగా ఏదైనా పదవి ఆశిస్తున్నవారు ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని కాకాపట్టి పదవులను సంపాదించుకుంటారు. అయితే ఆశపడుతున్నది ముఖ్యమంత్రి పదవి కోసం కావడంతో తప్పకుండా గెలుస్తాడని భావిస్తున్న పార్టీ అభ్యర్థులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. ముఖ్యమంత్రి పదవి కోసం తమకు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలు ఇంతమంది ఉన్నారని చెప్పుకునేందుకే ఆశావహులు ఈ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ముండే ఉండి ఉంటే... గోపీనాథ్ ముండే మరణంతోనే రాష్ట్రంలో ఈ పరిస్థితి తలెత్తిందని కార్యకర్తల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ముండే బతికున్న సమయంలోనే సీఎం అభ్యర్థి ఎవరనే విషయమై చర్చ జరిగిందని, కేంద్రం నరేంద్ర, రాష్ట్రంలో దేవేంద్ర అనే మాట అప్పుడే తెరపైకి వచ్చిందని, ఇప్పుడు కూడా సీఎం అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రమేనని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. అయితే ముండే బతికుంటే అధిష్టానం కచ్చితంగా ఆయనకు మొదటి ప్రాధాన్యతనిచ్చేదని, ముండే తప్పనిసరిగా ముఖ్యమంత్రి అయ్యేవారని మరికొందరు చెబుతున్నారు. అయితే ఆయన కూతురు పంకజా ముండే కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నట్లు చెప్పుకుంటున్నా అధిష్టానం అందుకు పెద్దగా ఆసక్తి కనబర్చకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫడ్నవీస్‌కే ఫస్ట్ఛాన్స్... వెనుకబడిన ప్రాంతమైన విదర్భ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దేవేంద్ర ఫడ్నవీస్‌కే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రత్యేక విదర్భ కోసం ఉద్యమం ఊపందుకుంటున్న తరుణంలో ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తే విదర్భ అభివృద్ధి చెందడం, తద్వారా ఉద్యమం చల్లారడం జరుగుతుందని బీజేపీ అధిష్టానం భావించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. నితిన్ గడ్కరీ అండతో తావ్డే.. పార్టీ సీనియర్ నాయకుల్లో ఒకరిగా పేరున్న నితిన్ గడ్కరీకి సన్నిహితుడిగా భావిస్తున్న వినోద్ తావ్డే కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అధిష్టానం తీసుకునే నిర్ణయాల్లో గడ్కరీ పాత్ర కూడా ఎంతో కొంత ఉంటుందని, ఆయన చక్రం తిప్పితే తావ్డే సీఎం గద్దెనెక్కడం ఖాయమంటున్నారు. అనుభవమున్న నేత ఖడ్సే... పార్టీలో సీనియర్ నాయకుడిగా, అనుభవమున్న నేతగా ఏక్నాథ్ ఖడ్సేకు మంచి గుర్తింపు ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం అభ్యర్థి ఎంపిక జరిగితే తప్పుకుండా ఏక్నాథ్ ఖడ్సేకే పీఠం దక్కవచ్చని చెబుతున్నారు. -
మోడీపై శివసేన వివాదాస్పద వ్యాఖ్యలు
ముంబై: ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీలపై శివసేన తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తమ మద్దతు లేకుంటే మోడీ తండ్రి దామోదర దాస్ కూడా గెలిచేవారు కాదని శివసేన తమ అధికార పత్రిక సామ్నాలో పేర్కొన్నారు. మోడీకి సొంతంగా గెలిచే శక్తి లేదని శివసేన వ్యాఖ్యలు చేసింది. మోడీ ప్రధాని పదవి చేపట్టాక..మహారాష్ట్ర పార్టీ(శివసేన)ను గుర్తించడం మానేశారని సామ్నాలో పేర్కొన్నారు. అధికార దాహాంతో ఉన్న బీజేపీ...శివసేన పార్టీని ఓడించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆపార్టీ చీఫ్ ఉద్దవ్ థాక్రే దుయ్యబట్టింది. రాజకీయ విమర్శల్లోకి మోడీ తండ్రి పేరును లాగడం వివాదస్పదంగా మారింది. ముంబైలో ఉంటున్న గుజరాతీలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని శివసేన ఆరోపించింది. పాకిస్థాన్ ను ఓడించాలని బీజేపీకి అధికారమిస్తే.. ఆపార్టీ మమల్ని పెకిలించాలని ప్రయత్నాలు చేస్తున్నారని శివసేన మండిపడింది. బీజేపీ మోసాని బట్టబయలు చేస్తామని శివసేన తెలిపింది. కాంగ్రెస్, ఎన్సీపీ చచ్చిన పాములు అని సామ్నా ఎడిటోరియల్ తెలిపారు. -
సుబ్రమణ్య స్వామి పై రూ.100 కోట్ల నష్టపరిహారం కేసు
చెన్నై, సాక్షి ప్రతినిధి :భారతీయ జనతా పార్టీ నేత సుబ్రమణ్యస్వామి పేరు మరోసారి నగరంలో మార్మోగిపోయింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును బనాయిం చి చివరకు అమ్మను జైలు పాలుచేసిన స్వామి ఆ తరువాత తొలిసారిగా సోమవారం నగరంలో అడుగుపెట్టడం ఒక కారణం. తమిళమత్స్యకారులకు వ్యతి రేకంగా, శ్రీలంకకు మద్దతుగా మాట్లాడినందుకు స్వామిపై రూ.100 కోట్ల నష్టపరిహారం కేసు సోమవారం దాఖలు కావడం మరో కారణమైంది.గతంలో జనతా పార్టీ అధ్యక్షునిగా ఉన్నా, నేడు బీజేపీ నేతగా మసలుతు న్నా సుబ్రమణ్య స్వామి అంటే సంచలనానికి కేంద్ర బిందువు. జయకు జైలు తో మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారా రు. స్వతహాగా న్యాయవాది కావడంతో అవినీతికి పాల్పడే నేతలను చట్టపరం గా మట్టికరిపించడంలో సిద్ధహస్తుడు. 2జీ స్పెక్ట్రం కుంభకోణం వెలుగుచూడడం కూడా స్వామి చలవే. ఈ వరుస క్రమంలో భాగంగానే జయపై కేసు పెట్టారు. ఆ సమయంలో రాష్ర్టంలో అధికారంలో ఉన్న డీఎంకే నాయకత్వం అమ్మపై రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ కేసును అందిపుచ్చుకుంది. 18 ఏళ్లు నడిచిన ఈ కేసులో ఎట్టకేలకు జయకు నాలుగేళ్ల శిక్ష పడింది. జయకు జైలు శిక్ష ఖాయమని తీర్పుకు ముందే స్వామి ట్విట్టర్లో పేర్కొనడంపై జయ మండిపడ్డారు. స్వామిపై పరువునష్టం దావా వేశారు. ఆ తర్వాత మరో రెండు దావాలు సైతం జయ నుంచి స్వామి ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో జయ జైలుపాలుకాగా స్వామిదే పైచేయి అరుు్యంది. ఈ నెల 7న జయకు జైలు శిక్షపడగానే అన్నాడీఎంకే శ్రేణులు స్వామి ఫొటోను చెప్పులతో కొట్టి దిష్టిబొమ్మను దహనం చేశారు. స్వామి పేరంటేనే రగిలిపోయారు. అమ్మకు బెయిల్ రాకుండా అడ్డుకుంటానని స్వామి ఇటీవల ప్రకటించడంతో మరిం త మండిపోతున్నారు. ఈ తరుణంలో సుబ్రమణ్యస్వామి ఆదివారం రాత్రి 11 గంటలకు చెన్నై విమానాశ్రయంలో అడుగుపెట్టారు. భారీ బందోబస్తు నడుమ చెన్నై శాంతోమ్‌లోని ఆయన ఇంటికి చేరారు. ఇంటి వద్ద సైతం పోలీసు బలగాలు మోహరించారుు. స్వామి ఉదయాన్నే చెన్నైలోని బ్రిటీష్ కౌన్సిల్‌కు వెళ్లి తన యూకే వీసాను పునరుద్ధరించుకున్నట్లు తెలిసింది. స్వామి చెన్నైలో ఉన్నారని తెలుసుకున్న అన్నాడీఎంకే అనుబంధ విభాగం నేతలు ఊరేగింపుగా బయలుదేరారు. స్వామి ఇంటి కి వద్దకు చేరుకోకుండానే పోలీసులు అడ్డుకుని సుమారు 150 మందిని అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం స్వామి ఢిల్లీకి తిరిగివెళ్లారు. స్వామిపై రూ.100 కోట్ల నష్టపరిహారం కేసు శ్రీలంక పేరు చెబితేనే నిప్పులుకక్కుతు న్న తమిళుల సహనాన్ని స్వామి పరీక్షిం చి మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. చేపల వేట సమయంలో సముద్రంలో హద్దులు దాటి వస్తున్న తమిళనాడు జాలర్ల మరపడవలను స్వాధీనం చేసుకోండని శ్రీలంక ప్రభుత్వానికి చెప్పింది తానేనంటూ ఇటీవల ఒక టీవీ ఇంట ర్వ్యూలో స్వామి చెప్పడం అగ్నిలో ఆజ్యం పోసినట్లయింది. స్వామి మాట లకు మండిపడిన చెన్నై మైలాపూర్ నొచ్చికుప్పానికి చెందిన ఆర్సీ కుప్పన్ అనే జాలరి ఆయనపై రూ.100 కోట్ల నష్టపరిహారం కేసు దాఖలు చేశారు. ఈ కేసును కుప్పన్ తరపు న్యాయవాది దురైపాండియన్ ఎగ్మూరు కోర్టులో సోమవారం దాఖలు చేశారు. స్వామి ఇంటర్వ్యూ ప్రసారమైన రోజునే 102 మరపడవలను శ్రీలంక గస్తీదళాలు స్వాధీనం చేసుకున్నాయని తెలిపారు. చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తున్న 10 లక్షల మంది జాలర్ల పొట్టకొట్టే వి ధంగా స్వామి మాట్లాడారని ఆరోపిం చారు. తమ వ్యాపార నష్టానికి కారకుడైన స్వామిపై రూ.100 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కుప్పన్ కోర్టుకు విన్నవించుకున్నారు. నష్టపరిహారాన్ని 102 మరపడవల యజమానులకు చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
మీ నాయకుడెవరు?
ముంబై: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ నాయకుడెవరో ప్రకటించాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ బీజేపీకి సవాలు విసిరారు. నరేంద్ర మోడీ పేరిట ఓట్లు అడగటాన్ని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రోజువారీ నిర్ణయాలు చేసేది ముఖ్యమంత్రి అని, ప్రధాన మంత్రి కాదని పేర్కొన్నారు. పదిహేనేళ్ల కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ప్రజాగ్రహం ఉన్నపక్షంలో వారిని తొలగించేందుకు వెనుకాడబోమని చవాన్ స్పష్టం చేశారు. యువతకు, మహిళలకు మరిన్ని అవకాశాలు ఇస్తామని చెప్పారు. అదే సమయంలో తమ నియోజకవర్గాలను తీర్చిదిద్దిన వారిని విస్మరించబోమని కూడా ఆయన తేల్చి చెప్పారు. దీనిని బట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో అనుభవానికి, యువతకు ప్రాధాన్యతనివ్వనున్నట్లు చవాన్ సూచనప్రాయంగా వెల్లడించారు. ‘మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి కాలేరు. ఢిల్లీలో మాకు మోడీ ఉన్నాడని చెప్పి బీజేపీ ప్రచారం చేస్తుండవచ్చు. కానీ ఎలా సాధ్యమవుతుంది. ఇక్కడ రోజువారీ వ్యవహారాలను నడపాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కదా?’ అని సీఎం వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ నాయకుడెవరో ప్రకటించాలని అన్నారు. నాయకత్వం అంశంపై బీజేపీ, శివసేనల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. మహాకూటమిగా ఉద్ధవ్ ఠాక్రే నాయకునిగా ఉంటారని శివసేన ఇదివరకే ప్రకటించింది. ప్రజలు పార్టీని, పార్టీ విధానాలను, పార్టీ నేతను బట్టి ఎన్నుకుంటారని చవాన్ పేర్కొన్నారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు తమ నాయకులను ప్రకటించాయని, బీజేపీ మాత్రమే ఇంతవరక వెల్లడించలేదని అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారానికి వస్తుందని చవాన్ ధీమా వ్యక్తం చేశారు. గత రెండు నెలల కాలంలో అనేక ప్రజల నిర్ణయాల్లో మార్పు వచ్చిందన్నారు. ఉప ఎన్నికల ఫలితాలను బట్టి ప్రజల తీర్పు విభిన్నంగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. జాతీయ ప్రభుత్వ ఏర్పాటుకు, రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఓటర్లు భిన్నంగా స్పందిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యమిస్తారా అన్న ప్రశ్నకు చవాన్ సానుకూలంగా స్పందించారు. అయితే గత ఐదు, పదేళ్లుగా నియోజకవర్గాలను తీర్చిదిద్దిన ఎమ్మెల్యేలను వదిలివేయబోమని స్పష్టం చేశారు. మంచిపనులు చేసిన ఎమ్మెల్యేలకు మరో అవకాశం తప్పకుండా ఇస్తామని చెప్పారు. తమ పార్టీలో యువత, మహిళలు చురుకుగా పని చేస్తున్నారని, విద్యావంతులకు కూడా అవకాశం ఇవ్వాల్సి ఉందని అన్నారు.