సుబ్రమణ్య స్వామి పై రూ.100 కోట్ల నష్టపరిహారం కేసు
చెన్నై, సాక్షి ప్రతినిధి :భారతీయ జనతా పార్టీ నేత సుబ్రమణ్యస్వామి పేరు మరోసారి నగరంలో మార్మోగిపోయింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును బనాయిం చి చివరకు అమ్మను జైలు పాలుచేసిన స్వామి ఆ తరువాత తొలిసారిగా సోమవారం నగరంలో అడుగుపెట్టడం ఒక కారణం. తమిళమత్స్యకారులకు వ్యతి రేకంగా, శ్రీలంకకు మద్దతుగా మాట్లాడినందుకు స్వామిపై రూ.100 కోట్ల నష్టపరిహారం కేసు సోమవారం దాఖలు కావడం మరో కారణమైంది.గతంలో జనతా పార్టీ అధ్యక్షునిగా ఉన్నా, నేడు బీజేపీ నేతగా మసలుతు న్నా సుబ్రమణ్య స్వామి అంటే సంచలనానికి కేంద్ర బిందువు. జయకు జైలు తో మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారా రు. స్వతహాగా న్యాయవాది కావడంతో అవినీతికి పాల్పడే నేతలను చట్టపరం గా మట్టికరిపించడంలో సిద్ధహస్తుడు. 2జీ స్పెక్ట్రం కుంభకోణం వెలుగుచూడడం కూడా స్వామి చలవే.
ఈ వరుస క్రమంలో భాగంగానే జయపై కేసు పెట్టారు. ఆ సమయంలో రాష్ర్టంలో అధికారంలో ఉన్న డీఎంకే నాయకత్వం అమ్మపై రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ కేసును అందిపుచ్చుకుంది. 18 ఏళ్లు నడిచిన ఈ కేసులో ఎట్టకేలకు జయకు నాలుగేళ్ల శిక్ష పడింది. జయకు జైలు శిక్ష ఖాయమని తీర్పుకు ముందే స్వామి ట్విట్టర్‌లో పేర్కొనడంపై జయ మండిపడ్డారు. స్వామిపై పరువునష్టం దావా వేశారు. ఆ తర్వాత మరో రెండు దావాలు సైతం జయ నుంచి స్వామి ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో జయ జైలుపాలుకాగా స్వామిదే పైచేయి అరుు్యంది. ఈ నెల 7న జయకు జైలు శిక్షపడగానే అన్నాడీఎంకే శ్రేణులు స్వామి ఫొటోను చెప్పులతో కొట్టి దిష్టిబొమ్మను దహనం చేశారు.
స్వామి పేరంటేనే రగిలిపోయారు. అమ్మకు బెయిల్ రాకుండా అడ్డుకుంటానని స్వామి ఇటీవల ప్రకటించడంతో మరిం త మండిపోతున్నారు. ఈ తరుణంలో సుబ్రమణ్యస్వామి ఆదివారం రాత్రి 11 గంటలకు చెన్నై విమానాశ్రయంలో అడుగుపెట్టారు. భారీ బందోబస్తు నడుమ చెన్నై శాంతోమ్‌లోని ఆయన ఇంటికి చేరారు. ఇంటి వద్ద సైతం పోలీసు బలగాలు మోహరించారుు. స్వామి ఉదయాన్నే చెన్నైలోని బ్రిటీష్ కౌన్సిల్‌కు వెళ్లి తన యూకే వీసాను పునరుద్ధరించుకున్నట్లు తెలిసింది. స్వామి చెన్నైలో ఉన్నారని తెలుసుకున్న అన్నాడీఎంకే అనుబంధ విభాగం నేతలు ఊరేగింపుగా బయలుదేరారు. స్వామి ఇంటి కి వద్దకు చేరుకోకుండానే పోలీసులు అడ్డుకుని సుమారు 150 మందిని అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం స్వామి ఢిల్లీకి తిరిగివెళ్లారు.
స్వామిపై రూ.100 కోట్ల నష్టపరిహారం కేసు
శ్రీలంక పేరు చెబితేనే నిప్పులుకక్కుతు న్న తమిళుల సహనాన్ని స్వామి పరీక్షిం చి మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. చేపల వేట సమయంలో సముద్రంలో హద్దులు దాటి వస్తున్న తమిళనాడు జాలర్ల మరపడవలను స్వాధీనం చేసుకోండని శ్రీలంక ప్రభుత్వానికి చెప్పింది తానేనంటూ ఇటీవల ఒక టీవీ ఇంట ర్వ్యూలో స్వామి చెప్పడం అగ్నిలో ఆజ్యం పోసినట్లయింది. స్వామి మాట లకు మండిపడిన చెన్నై మైలాపూర్ నొచ్చికుప్పానికి చెందిన ఆర్‌సీ కుప్పన్ అనే జాలరి ఆయనపై రూ.100 కోట్ల నష్టపరిహారం కేసు దాఖలు చేశారు. ఈ కేసును కుప్పన్ తరపు న్యాయవాది దురైపాండియన్ ఎగ్మూరు కోర్టులో సోమవారం దాఖలు చేశారు. స్వామి ఇంటర్వ్యూ ప్రసారమైన రోజునే 102 మరపడవలను శ్రీలంక గస్తీదళాలు స్వాధీనం చేసుకున్నాయని తెలిపారు. చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తున్న 10 లక్షల మంది జాలర్ల పొట్టకొట్టే వి ధంగా స్వామి మాట్లాడారని ఆరోపిం చారు. తమ వ్యాపార నష్టానికి కారకుడైన స్వామిపై రూ.100 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కుప్పన్ కోర్టుకు విన్నవించుకున్నారు. నష్టపరిహారాన్ని 102 మరపడవల యజమానులకు చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.