
సాక్షి, చెన్నై : రజనీకాంత్ రాజకీయాలపై ఇలా ప్రకటన చేశాడోలేదో.. వెంటనే బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి స్పందించారు. కాసేపటి క్రితం ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడిన ఆయన మరోసారి రజనీపై విమర్శలు చేశారు.
‘‘రజనీ రాజకీయాల్లోకి వస్తానని మాత్రమే చెప్పాడు. అంతకు మించి వేరే ఏ వివరాలు చెప్పలేకపోయాడు. అతనో నిరక్షరాస్యుడు. ఇదంతా మీడియా హైప్ మాత్రమే. తమిళ ప్రజలను రజనీ తక్కువగా అంచనా వేస్తున్నారు. కానీ, ఆయన అనుకుంటున్నట్లు వారు అంత తెలివి తక్కువోళ్లు కాదు. చాలా తెలివైన వాళ్లు. ఎప్పుడెలా స్పందించాలో వాళ్లకు బాగా తెలుసు’’ అని స్వామి వ్యాఖ్యలు చేశారు.
కాగా, గతంలోనూ స్వామి రజనీకాంత్‌ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కూడా. రజనీకాంత్ రాజకీయాలకు సరిపోడని..రాజకీయాల్లో ఎలా మెలగాలన్న జ్ఞానం తలైవాకు లేదని. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఇబ్బందికర పరిస్ధితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని స్వామి హెచ్చరించారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment