మాటిచ్చి.. తప్పుతారా? | AP TO Ten years of special status | Sakshi
Sakshi News home page

మాటిచ్చి.. తప్పుతారా?

Published Sun, Aug 2 2015 1:36 AM | Last Updated on Sun, Sep 3 2017 6:35 AM

AP TO Ten years of special status

 సాక్షి ప్రతినిధి, కడప :‘చెప్పేందుకే శ్రీరంగ నీతులు’ అన్నట్లుగా భారతీయ జనతా పార్టీ వైఖరి ప్రస్ఫుటం అవుతోంది. ప్రతిపక్షంలో ఉండగా ఆంధ్రప్రదేశ్‌పై ప్రేమ ఒలకపోసిన నేతలు అధికార పీఠం దక్కగానే మాట మార్చారు. పార్లమెంటు సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్లు కల్పించాలని నాడు డిమాండ్ చేసిన ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు నేడు కీలకమైన స్థానంలో ఉంటూ న్యాయం చేయలేకపోతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ విభజించడం అన్యాయమని గళమెత్తిన నేతలు వడ్డించే స్థానంలో
 
 మాటిచ్చి.. తప్పుతారా?
 ఉండి రిక్తహస్తం చూపుతున్నారని వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే నిలదీయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పల్లెత్తు మాట మాట్లాడకపోవడాన్ని పలువురు ఎత్తిచూపుతున్నారు. నాడు సమైక్యాంధ్ర ఉద్యమంలో చిత్తశుద్ధి ప్రదర్శించని టీడీపీ నేడు ప్రత్యేక హోదా పట్ల సైతం అదే ధోరణితో ఉందని పలువరు ఆరోపిస్తున్నారు.
 
  అధికారమే వాళ్లకు ముఖ్యం
 కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కలిసి రాష్ట్రాన్ని విడగొట్టి తీరని ద్రోహం చేశాయి. అప్పట్లో ఐదేళ్లు సరిపోదు.. పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీతోపాటు టీడీపీ కూడా డిమాండ్ చేసింది. కానీ నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకిగానీ, ఆ పార్టీతో కలిసి ప్రభుత్వం నడుపుతున్న టీడీపీకిగానీ ఆంధ్రప్రదేశ్ సమస్యలు పట్టడం లేదు. వ్యక్తిగత ప్రయోజనాలు, అధికారమే వారికి ముఖ్యమయ్యాయి. వైఎస్‌ఆర్‌సీపీ ఒక్కటే చిత్తశుద్దితో ప్రత్యేక హోదా కోసం పోరాడుతోంది.
    - ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
 
 అందరూ కలిసి మోసం చేశారు
 అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ను నిలువునా మోసం చేశారు. రాష్ట్రాన్ని అడ్డంగా విభజించిన కాంగ్రెస్ గానీ, అందుకు సహకరించిన పార్టీలుగానీ ప్రత్యేక హోదా గూరించి పట్టించుకోవడం లేదు. వాళ్లు చేస్తారని వీళ్లు, వీళ్లు చేస్తారని వాళ్లు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం మాట తప్పడం విచారకరం.
 - శివారెడ్డి, ఎన్జీఓ సంఘం, జిల్లా అధ్యక్షుడు
 
 బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది
     కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రం పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. దానికి చంద్రబాబు వంతపాడుతున్నారు. పార్లమెంటు సాక్షిగా ప్రత్యేకహోదాపై అప్పటి ప్రధాన మంత్రి ప్రకటన చేస్తే ఐదేళ్లు సరిపోదు, పదేళ్లకు పెంచాలని వెంకయ్యనాయుడు చేసిన హంగామా దేశ ప్రజలంతా చూశారు. ఇప్పుడు అధికారం చేపట్టిన బీజేపీ పిల్లిమొగ్గలు వేస్తూ రోజుకో మంత్రి చేత ప్రకటనలు చేయిస్తోంది. విభజన చట్టంలో లొసుగులు ఉంటే ఈ చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టేటప్పుడు ఏం చే శారు..? మా పోరాటం వల్లే పదేళ్ల ప్రత్యేక హోదా సాధ్యమని ఓట్లు వేయించుకొని నేడు మాట తప్పడం సరికాదు. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ఆ ఊసే మరిచారు.
   - జి. ఈశ్వరయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి
 
 రాష్ట్ర ప్రజలకంటే బీజేపీతో స్నేహమే ముఖ్యమైంది
 అభివృద్దే ఎజెండాగా బీజేపీ, టీడీపీలు గత ఎన్నికల్లో ప్రచారం చేసి ఓట్లు దండుకున్నాయి. రాష్ట్రాన్ని ముక్కలు చేయడంలో కాంగ్రెస్ పాత్ర ఎంత ఉందో, బీజేపీ పాత్ర కూడా అంతే ఉందనేది జగమెరిగిన సత్యం. ఎన్నికల ముందు ప్రధాని మోడీ రెండు రాష్ట్ర్రాలకు అనేక హామీలు ఇచ్చారు. ఒక్క సంవత్సరంలోనే ఆయన నిజ స్వరూపం ప్రజలకు అర్థమయ్యింది. ఇంత జరుగుతున్నా బీజేపీపై విమర్శలు చేయవద్దని చంద్రబాబు మంత్రులకు ఆదేశాలివ్వడం సిగ్గుచేటు. ప్రజల కంటే మీకు బీజేపీతో స్నేహమే ముఖ్యమా... ఈ రెండు పార్టీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశాయి.
  ఏ. ఆంజనేయులు, సీపీఎం జిల్లా కార్యదర్శి
 
 ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చితీరాల్సిందే
 రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించగా, అందుకు బీజేపీ ఐదేళ్లు చాలదు, పదేళ్లు కావాలని పట్టుబట్టింది. దీన్నిబట్టి కాంగ్రెస్ హామీని బీజేపీ తీసుకుంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బీజేపీని రాష్ట్ర ప్రజలు క్షమించరు. ప్రత్యేక హోదా తెచ్చేందుకు ఎలాంటి పోరాటాలకైనా టీడీపీ సిద్ధంగా ఉంది.
    - గోవర్ధన్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి
 
 ఎంపీలంతా విజ్ఞులని అనుకున్నాం
 ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లు పత్యేక హోదా చాలదు.. పదేళ్లు కావాలని వాదించి వెంకయ్యనాయుడు సన్మానాలు కూడా చేయించుకున్నారు. ఎంపీలంతా విజ్ఞులు కదా.. పార్లమెంటులో తీర్మానం చేసి మాట తప్పుతారా అని అనుకొన్నాం. కానీ నేడు బీజేపీ ఇచ్చిన మాట నిలుపుకోలేదు. అన్ని పక్షాలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రత్యేక హోదాతోపాటు రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి.
     - పోచంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ.
 
 రాజకీయాలకు అతీతంగా ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తేవాలి
 దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించడం ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది. ప్రత్యేక హోదా కల్పిస్తే కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు వచ్చే అవకాశముంటుంది. రాజకీయాలకు అతీతంగా ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.
        - బి. నారాయణ రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేత
 
 ఠ మొదటిపేజీ తరువాయి
 ఉండి రిక్తహస్తం చూపుతున్నారని వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే నిలదీయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పల్లెత్తు మాట మాట్లాడకపోవడాన్ని పలువురు ఎత్తిచూపుతున్నారు. నాడు సమైక్యాంధ్ర ఉద్యమంలో చిత్తశుద్ధి ప్రదర్శించని టీడీపీ నేడు ప్రత్యేక హోదా పట్ల సైతం అదే ధోరణితో ఉందని పలువరు ఆరోపిస్తున్నారు.
 అధికారమే వాళ్లకు ముఖ్యం
 కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కలిసి రాష్ట్రాన్ని విడగొట్టి తీరని ద్రోహం చేశాయి. అప్పట్లో ఐదేళ్లు సరిపోదు.. పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీతోపాటు టీడీపీ కూడా డిమాండ్ చేసింది. కానీ నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకిగానీ, ఆ పార్టీతో కలిసి ప్రభుత్వం నడుపుతున్న టీడీపీకిగానీ ఆంధ్రప్రదేశ్ సమస్యలు పట్టడం లేదు. వ్యక్తిగత ప్రయోజనాలు, అధికారమే వారికి ముఖ్యమయ్యాయి. వైఎస్‌ఆర్‌సీపీ ఒక్కటే చిత్తశుద్దితో ప్రత్యేక హోదా కోసం పోరాడుతోంది.
                 - ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
 అందరూ కలిసి మోసం చేశారు
 అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ను నిలువునా మోసం చేశారు. రాష్ట్రాన్ని అడ్డంగా విభజించిన కాంగ్రెస్ గానీ, అందుకు సహకరించిన పార్టీలుగానీ ప్రత్యేక హోదా గూరించి పట్టించుకోవడం లేదు. వాళ్లు చేస్తారని వీళ్లు, వీళ్లు చేస్తారని వాళ్లు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం మాట తప్పడం విచారకరం.
          - శివారెడ్డి, ఎన్జీఓ సంఘం, జిల్లా అధ్యక్షుడు
 బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది
 కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రం పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. దానికి చంద్రబాబు వంతపాడుతున్నారు. పార్లమెంటు సాక్షిగా ప్రత్యేకహోదాపై అప్పటి ప్రధాన మంత్రి ప్రకటన చేస్తే ఐదేళ్లు సరిపోదు, పదేళ్లకు పెంచాలని వెంకయ్యనాయుడు చేసిన హంగామా దేశ ప్రజలంతా చూశారు. ఇప్పుడు అధికారం చేపట్టిన బీజేపీ పిల్లిమొగ్గలు వేస్తూ రోజుకో మంత్రి చేత ప్రకటనలు చేయిస్తోంది. విభజన చట్టంలో లొసుగులు ఉంటే ఈ చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టేటప్పుడు ఏం చే శారు..? మా పోరాటం వల్లే పదేళ్ల ప్రత్యేక హోదా సాధ్యమని ఓట్లు వేయించుకొని నేడు మాట తప్పడం సరికాదు. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ఆ ఊసే మరిచారు.
 
 - జి. ఈశ్వరయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి రాష్ట్ర ప్రజలకంటే బీజేపీతో స్నేహమే
 ముఖ్యమైంది
 అభివృద్దే ఎజెండాగా బీజేపీ, టీడీపీలు గత ఎన్నికల్లో ప్రచారం చేసి ఓట్లు దండుకున్నాయి. రాష్ట్రాన్ని ముక్కలు చేయడంలో కాంగ్రెస్ పాత్ర ఎంత ఉందో, బీజేపీ పాత్ర కూడా అంతే ఉందనేది జగమెరిగిన సత్యం. ఎన్నికల ముందు ప్రధాని మోడీ రెండు రాష్ట్ర్రాలకు అనేక హామీలు ఇచ్చారు. ఒక్క సంవత్సరంలోనే ఆయన నిజ స్వరూపం ప్రజలకు అర్థమయ్యింది. ఇంత జరుగుతున్నా బీజేపీపై విమర్శలు చేయవద్దని చంద్రబాబు మంత్రులకు ఆదేశాలివ్వడం సిగ్గుచేటు. ప్రజల కంటే మీకు బీజేపీతో స్నేహమే ముఖ్యమా... ఈ రెండు పార్టీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశాయి.
 
 - ఏ. ఆంజనేయులు, సీపీఎం జిల్లా కార్యదర్శి
 ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చితీరాల్సిందే
 రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించగా, అందుకు బీజేపీ ఐదేళ్లు చాలదు, పదేళ్లు కావాలని పట్టుబట్టింది. దీన్నిబట్టి కాంగ్రెస్ హామీని బీజేపీ తీసుకుంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బీజేపీని రాష్ట్ర ప్రజలు క్షమించరు. ప్రత్యేక హోదా తెచ్చేందుకు ఎలాంటి పోరాటాలకైనా టీడీపీ సిద్ధంగా ఉంది.
 
 - గోవర్ధన్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి
 ఎంపీలంతా విజ్ఞులని అనుకున్నాం
 ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లు పత్యేక హోదా చాలదు.. పదేళ్లు కావాలని వాదించి వెంకయ్యనాయుడు సన్మానాలు కూడా చేయించుకున్నారు. ఎంపీలంతా విజ్ఞులు కదా.. పార్లమెంటులో తీర్మానం చేసి మాట తప్పుతారా అని అనుకొన్నాం. కానీ నేడు బీజేపీ ఇచ్చిన మాట నిలుపుకోలేదు. అన్ని పక్షాలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రత్యేక హోదాతోపాటు రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి.
 
 - పోచంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ.

 రాజకీయాలకు అతీతంగా
 ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తేవాలి
 దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించడం ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది. ప్రత్యేక హోదా కల్పిస్తే కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు వచ్చే అవకాశముంటుంది. రాజకీయాలకు అతీతంగా ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.            - బి. నారాయణ రెడ్డి,
 ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేత
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement