పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదు:శివాజీ | Hero Shivaji joins Bharatiya Janata Party at Hydrabad | Sakshi
Sakshi News home page

పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదు:శివాజీ

Published Thu, Mar 27 2014 11:44 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

పదవులు ఆశించి రాజకీయాల్లోకి  రాలేదు:శివాజీ - Sakshi

పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదు:శివాజీ

ప్రస్తుత సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి,నరేంద్ర మోడీ సేవలు దేశానికి అత్యంత అవసరం అని ప్రముఖ టాలీవుడ్ నటుడు శివాజీ అన్నారు. గురువారం హైదరాబాద్లో బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడు సమక్షంలో శివాజీ ఆ పార్టీలో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీలో కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు గొడవలు లేవన్నారు. తాను పదవులు ఆశించి రాజకీయాల్లోకి రావడం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

 

సామాన్య రైతు కుటుంబం నుంచి తాను వచ్చానని చెప్పారు. తనకు ఇంత గుర్తింపు వచ్చిందంటే అది తెలుగు ప్రజల వల్లే అని ఆయన పేర్కొన్నారు. గతంలో వరదల సమయంలో తన వంతుగా విరాళాలు సేకరించి ఇచ్చానని ఈ సందర్బంగా శివాజీ గుర్తు చేశారు. అయితే టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన మరో ప్రముఖ నటుడు సురేష్ బుధవారం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement