ప్రధాని నిర్ణయం నిజమైన గేమ్ ఛేంజర్: పీఎం మోదీపై రామ్ చరణ్ ప్రశంసలు | Ram Charan Tweet On PM Narendra Modi About Movie Industry | Sakshi
Sakshi News home page

Ram Charan: ప్రధాని నిర్ణయం నిజమైన గేమ్ ఛేంజర్ అవుతుంది: రామ్ చరణ్ ప్రశంసలు

Published Tue, Dec 31 2024 8:08 PM | Last Updated on Tue, Dec 31 2024 8:19 PM

Ram Charan Tweet On PM Narendra Modi About Movie Industry

భారత ప్రధాని నరేంద్ర మోదీపై టాలీవుడ్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram Charan) ప్రశంసలు కురిపించారు. భారతీయ సినిమా అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని చూస్తుంటే అద్భుతంగా ఉందన్నారు.  భారత ప్రభుత్వం మీడియా, వినోద రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత, మద్దతు చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.

సినిమా రంగంపై మన ప్రధాన మంత్రి(narendra Modi) దృష్టి సారించడం అద్భుతమైన విషయమని ట్వీట్ చేశారు. వచ్చే ఏడాదిలో ఫిల్మ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్ సమ్మిట్(Waves-2025) నిర్వహించనుండటం మన దేశానికి, భారతీయ సినిమాకు గర్వకారణమని పోస్ట్ చేశారు. సినీ పరిశ్రమకు సహకారం అందించడం నిజమైన గేమ్ ఛేంజర్‌ అవుతుందని రామ్ చరణ్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా.. ఇటీవల మన్‌ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సినీ ప్రముఖుల గురించి ప్రస్తావించారు. మన టాలీవుడ్ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు పేరును స్మరించుకున్నారు. భారతీయ సినిమా అభివృద్ధికి ఆయన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఆయన సినిమాల్లో మన సంప్రదాయం, విలువలు కళ్లకు కట్టేలా చూపించారని ప్రధాని అన్నారు. మన్‌ కీ బాత్‌లో ఏఎన్నార్‌ పేరును ప్రస్తావించడంపై అక్కినేని నాగార్జున, నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానికి నాగార్జున సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శంకర్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. కోలీవుడ్ స్టార్ ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

జనవరి 1న గేమ్ ఛేంజర్ ట్రైలర్..

కొత్త ఏడాదిలో గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఇటీవల విజయవాడలో 256 అడుగుల రామ్ చరణ్ కటౌట్‌ను ఆవిష్కరించిన ఆయన ట్రైలర్‌పై అప్‌డేట్ ఇచ్చారు. మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ట్రైలర్‌ ఈ బుధవారం విడుదల కానుంది. అంతేకాకుండా ఏపీలోని రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement