kadapa YSRCP
-
కడప దెబ్బ.. ఢిల్లీ అబ్బా.. సీఎం రేవంత్ కు అదిరిపోయే కౌంటర్..
-
కడప ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి ఆధిక్యం
-
ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన
-
ఇదో అదృష్టం
సాక్షి ప్రతినిధి, కడప: మత సామరస్యానికి ప్రతీకగా, మహిమాన్విత సూఫీగా వెలుగొందుతున్న కడప అమీన్‌పీర్ దర్గాను సందర్శించడంతో తన జన్మ చరితార్థం అయిందని, ఇది తన అదృష్టం, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్ గురువారం మధ్యాహ్నం కడప అమీన్‌పీర్ (పెద్ద దర్గా) దర్గాను సందర్శించి ప్రభుత్వ లాంఛనాలతో పూల చాదర్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్‌బాషా, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేయర్ కె.సురేష్‌బాబు, జిల్లా కలెక్టర్ వి.విజయ్‌రామరాజు, జాయింట్ కలెక్టర్ గణేష్‌కుమార్, కడప నగర పాలక సంస్థ కమిషనర్ జీఎస్ఎస్ ప్రవీణ్‌చంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఐకమత్యతతో దర్గా ఖ్యాతి, మహిమలు, ప్రపంచవ్యాప్తంగా పరిమళిస్తున్నాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. తాను పుట్టి పెరిగిన జిల్లాలో ఇంత మహత్తరమైన, మహిమాన్వితమైన దర్గా ఉండడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అమీన్‌పీర్ దర్గాను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆదరిస్తున్న జిల్లా ప్రజలు ఎంతో అదృష్టవంతులన్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులతో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలను అందివ్వగలుగుతున్నామన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకుంటూ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా మైనారిటీల సేవలో తరిస్తున్న మిత్రుడు ఎస్బీ అంజద్‌బాషాకు అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. సంప్రదాయ పేటా, షేలా ధరించి.. కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన అమీన్‌పీర్ దర్గా ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు దర్గా ప్రతినిధులు సంప్రదాయ లాంఛనాలతో ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రిని ముందుగా పెద్ద దర్గా ప్రధాన మందిరంలోకి పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేని, దర్గా కమిటీ సభ్యులు సాదరంగా ఆహా్వనించారు. దర్గా సేవలో నిరంతరం నిమగ్నమైన ముజావర్లు, కమిటీ సభ్యులు, చౌదరీ కలీఫాలను దర్గా పీఠాధిపతులు హజరత్ ఖాజా సయ్యద్ షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. దర్గా పీఠాధిపతులచే ‘సూఫీ సర్మాస్త్ సానీ షిలాక్‘ సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రికి తలపాగా (పేటా) అలంకరించి మెడలో షేలా (కండువా), ఇలాచి (దండ) ధరింపజేశారు. అనంతరం పీఠాధిపతులతో కలిసి ముఖ్యమంత్రి జగన్ అమీన్‌పీర్ దర్గా గుమ్మం వద్దకు చేరుకుని నారికేళి రాతిపై కొబ్బరికాయ కొట్టి స్వామివారికి సమర్పించుకున్నారు. ముజావర్లు అందించిన పూలు, వస్త్ర చాదర్, సుగంధ పరిమళాల అత్తరుతో కూడిన తట్టను ముఖ్యమంత్రి తలపై పెట్టుకుని భక్తి పారవశ్యంతో ప్రధాన దర్గా లోపలికి ప్రవేశించారు. అక్కడ పీరుల్లా మాలిక్ జీవ సమాధి వద్ద చాదర్, పూలమాల, అత్తరు సమర్పించిన అనంతరం ఫాతెహ నిర్వహించి ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి నేరుగా అరీఫుల్లా మాలిక్, అమీన్ స్వామి మొదలైన 16 మంది పూర్వపు పీఠాధిపతుల మజార్ల వద్దకు చేరుకుని గంధం, చాదర్, పూలు సమర్పించారు. పూర్వ పీఠాధిపతుల మజార్లకు పూలు సమర్పించి గురువులతో ప్రార్థనలు చేశారు. అమీన్‌పీర్ దర్గా గ్రంథాలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి దర్గా విశిష్టత, ప్రాశస్త్యాన్ని, చారిత్రక వైభవాన్ని పీఠాధిపతి వివరించారు. దర్గా మేనేజర్ ఎస్ఎండీ అలీఖాన్, ముజూవర్ అమీర్, దర్గా కో ఆర్డినేటర్ కుతుబుద్దీన్, హజ్ హౌస్ చైర్మన్ గౌసుల్లాజం, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్, వేర్‌హౌస్ కార్పొరేషన్ ఛైర్మన్ కరీముల్లా, స్టేట్ మైనారిటీ కమిషన్ మెంబర్ హిదయతుల్లా, వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్ సోహేల్, అఫ్జల్ఖాన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆధ్వర్యంలో అమీన్‌పీర్ దర్గా ప్రాంగణం వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఘన స్వాగతం పెద్దదర్గాను దర్శించుకునేందుకు నంద్యాల నుంచి కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌కు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కలెక్టర్ వి.విజయ్‌రామరాజు, ఎస్పీ సిద్దార్్థకౌశల్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, మేయర్ కె.సురేష్‌బాబు, శాసన మండలి వైస్ చైర్మన్ జకియాఖానం, ఎమ్మెల్సీలు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, సి.రామచంద్రయ్య, ఎం.రామచంద్రారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యేలు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, దాసరి సుధ, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేడా వెంకట మల్లికార్జునరెడ్డి, మూలే సుదీర్‌రెడ్డి, నవాజ్‌బాషా తదితరులు స్వాగతం పలికారు. సీఎం జగన్ వెంట ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజాద్‌బాషా, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హెలికాఫ్టర్‌లో కడప చేరుకున్నారు. -
రాత్రి భర్త, పిల్లలతో కలిసి భోజనం.. ఉదయం లేచి చూసేసరికి..
సాక్షి,మైలవరం, (జమ్మలమడుగు రూరల్): మైలవరం మండలంలోని గంగులనారాయణపల్లె గ్రామానికి చెందిన నాగలక్ష్మీ (24) అనే వివాహిత మహిళ అదశృమైనట్లు ఎస్ఐ రామకృష్ణ బుధవారం తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు నాగలక్ష్మీకి 7 సంవత్సకాల క్రిందట కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ తాలూకాలోని దోర్నిపాడు గ్రామానికి చెందిన మహేంద్ర అనే యువకుడితో వివాహమైంది. మహేంద్ర భార్యతో కలసి అత్తగారి గ్రామమైన గంగునారాయణపల్లెలో నివాసం ఉంటున్నారు. (చదవండి: షాకింగ్.. తల్లి చేతి నుంచి ఐదు నెలల బాలుడు జారిపడి.. ) వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. మార్చి 14వ తేదీ రాత్రి భార్య, భర్త, పిల్లలు భోజనం చేసి ఇంటిలో నిద్రపోయారు. తెల్లవారే సరికి నాగలక్ష్మీ కనపించలేదు. మహేంద్ర చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లేదు. వెంటనే అత్త పిల్లి ఈశ్వరమ్మకు తెలిపాడు. ఆమె మైలవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
బద్వేలులో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు: మంత్రి వెల్లంపల్లి
-
ఎన్నికల ఘట్టం.. వైఎస్ కుటుంబానికే పట్టం..
సాక్షి కడప: వైఎస్ కుటుంబమంటే ఎనలేని ప్రేమ.. ఆది నుంచి తెలియని అభిమానం.. ఆ కుటుంబం కోసం ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా ఇచ్చే జనం.. కష్టమొచ్చినా.. నష్టమొచ్చినా.. చివరకు సుఖం వచ్చినా..వైఎస్ కుటుంబానికి చెప్పి పంచుకోవడం ప్రజలకు అలవాటు. ఎన్నో ఏళ్లుగా పులివెందుల ప్రజలు ఆ కుటుంబం వెంట నడుస్తున్నారు. ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. దాదాపు కొన్ని ఏళ్ల తరబడి ఎలాంటి ఎన్నికలు వచ్చినా వైఎస్ కుటుంబానికి పులివెందుల ప్రజలు పట్టం కడుతూ వస్తున్నారు. ఎన్నిక ఏదైనా సరే ఓటరు తీర్పు మాత్రం వారివైపే ఉంటుంది. అడగకుండా అమ్మయినా అన్నం పెట్టదంటారు...అలాంటిది ఏమీ అడగకుండానే అండగా నిలిచిన పులిందుల ప్రజల రుణం తీర్చుకునేందుకు వైఎస్ కుటుంబం అన్నీ చేసి పెడుతోంది. అందుకే ప్రజలకు ఆ కుటుంబంపై ఇప్పటికీ మమకారం తీరలేదు. 1978 నుంచి ఇప్పటివరకు తిరుగులేని రికార్డు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి పులివెందుల చరిత్రలో ఎన్నో మైలురాళ్లు. ఓటమి ఎరుగని నేతగా పులివెందుల గ(బి)డ్డగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చరిత్రలో నిలిచిపోయారు. పులివెందులలో దివంగత వైఎస్ రాజారెడ్డి హయాం నుంచి ప్రజల కష్టాల్లో వైఎస్ కుటంబం పాలుపంచుకుంటూ వస్తుండడంతో ఇప్పటికీ ఆ కుటుంబమంటే ప్రజలకు చాలా మక్కువ. 1978 నుంచి ఇప్పటివరకు జరిగిన, జరుగుతున్న అన్ని ఎన్నికల్లోనూ వైఎస్ కుటుంబానికి ప్రజలు బాసటగా నిలుస్తూ వస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ఏ ఎన్నికలైనా సరే...పులివెందులలో మాత్రం వైఎస్ కుటుంబానికి కంచుకోట అని ఎవరిని అడిగినా ఇట్టే చెబుతారు. 2011లో ఎంపీగా ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని 5.40 లక్షల పైచిలుకు భారీ మెజారీ్టతో గెలిపించి ఢిల్లీ పెద్దలు అదిరిపోయి పులివెందుల వైపు చూసేలా చేశారు. ప్రతి ఎన్నికలలోనూ ప్రజలు మాత్రం వైఎస్ కుటుంబానికి అండగా నిలుస్తూ పట్టం కడుతున్నారు. వైఎస్ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికీ ప్రజల పట్ల విధేయత చూపుతూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ప్రజలను కూడా సొంత మనుషుల్లా చూస్తున్నారు. అందుకేనేమో మొక్కవోని అభిమానంతో ఏళ్ల చరిత్రలో ప్రజలు రికార్డుల మీద రికార్డులు మోగిస్తున్నారు. పులివెందులలో క్లీన్ స్వీప్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు క్లీన్‌స్వీప్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలపై ఉన్న ప్రేమను ఓట్ల రూపంలో అందించారు. ప్రత్యేకంగా పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జి వైఎస్ భాస్కర్‌రెడ్డి, తొండూరు మండల ఇన్చార్జి వైఎస్ మధురెడ్డి, చక్రాయపేట మండల ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డి, లింగాల, సింహాద్రిపురం మండలాల ఇన్చార్జి నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిలు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి జరిపిన చర్చలు కూడా సత్ఫలితాలు ఇచ్చాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కూడా పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించడంతో 108 చోట్ల అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. టీడీపీ మచ్చుకైనా కనిపించకుండా అడ్రస్ గల్లంతు అయిందంటే ప్రజలకు వైఎస్ కుటుంబంపై ఉన్న ఎనలేని అభిమానాన్ని తేట తెల్లం చేస్తోంది. చదవండి: పులివెందుల ‘పంచ్’ అదిరింది -
‘‘వెయ్యి’’కుండానే మోసమా..?
సాక్షి, కడప అగ్రికల్చర్ : రైతులను మభ్య పెట్టడం, మోసగించడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. రైతుకు టోకరా వేయడం మరింత సులువన్నది ఆయన భావన. ఐదు సంవత్సరాలుగా ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా, పంట రుణాలపై వడ్డీ రాయితీ ఇవ్వకపోగా, అన్నదాత.. సుఖీభవ పేరిట రూ.1000 ఖాతాలో వేస్తున్నట్లు నమ్మబలుకుతున్నారు. ఈ పథకంలో కొంతమంది రైతుల ఖాతాలకే నిధులు జమ చేశారు. 50 వేల మంది ఖాతాలకు డబ్బులు పడలేదని తెలిసింది. ఎన్నికల వేళ లేని ఆశలు కల్పిస్తూ వంచిస్తున్న ప్రభుత్వ తీరుపై రైతు సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. టీడీపీకి అనుకూలంగా ఉన్నవారికి, ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రమే పథకాలు అందుతున్నాయని.. అందుకే నిన్ను నమ్మం బాబూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. ఏదో చేస్తున్నట్లు భ్రమ కల్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతుకు ఒరిగిందేమీలేదు. ‘అన్నదాత సుఖీభవ’ అంటూ గొప్ప పథకాన్ని తీసుకువచ్చినట్లు టీడీపీ ప్రభుత్వం బిల్డప్ ఇస్తోంది. ఈ పథకం కిందేమైనా రైతులకు పెద్ద ప్రయోజనం ఏమైనా చేకూరుతుందా? అంటే అదీలేదు. జిల్లాలో దాదాపు ఐదు సంవత్సరాలుగా వరుస కరువులతో వ్యవసాయం అతలాకుతలం అయింది. అనావృష్టి, అతివృష్టి, మరో పక్క ప్రకృతి విపత్తులు, అంతు చిక్కని చీడపీడలతో పంటలు తుడిచి పెట్టుకుపోయాయి. నేల తల్లిని నమ్ముకున్న జిల్లా రైతులు ఆర్ధికంగా చితికిపోయారు. బ్యాంకుల నుంచి, బయట ప్రయివేటు వారి వద్ద తీసుకున్న అప్పులు తీర్చే దారిలేక కొంతమంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆసరా కల్పించాల్సిన సర్కారు మాటలతో కాలహరణం చేస్తోంది. 14.35 లక్షల ఎకరాల్లో భూమి...దీనిపై ఆధారపడిన కుటుంబాలు 4.89 లక్షలు జిల్లా వ్యవసాయ, ప్రణాళిక శాఖ లెక్కల ప్రకారం 14.35 లక్షల ఎకరాల భూములున్నాయి. వీటిపై ఆధారపడి 4,89,757 రైతు కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం కింద 3,59,205 కుటుంబాలు అర్హత కలిగినట్లు జిల్లా యంత్రాంగం తేల్చింది. అంటే 1,30,552 కుటుంబాలకు మొండిచేయి చూపినట్టేనని అర్ధమవుతోంది. జిల్లాలో 12 వ్యవసాయ డివిజన్లు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా వర్షాధారంపై ఆధారపడిన భూములే అధికం. జిల్లా వ్యవసాయ, ప్రణాళికశాఖ సంయుక్తంగా సర్వేచేసి 3,24,965 అకౌంట్లు రైతు కుటుంబాలు కలిగిన ఉన్నాయని లెక్కలు కట్టారు. ఫిబ్రవరి 18 నుంచి రైతుల ఖాతాలకు రూ.1000 రియల్ టైం గవర్నెన్స్ సిస్టం (ఆర్టీజీఎస్) ద్వారా బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. బ్యాంకులకు, ఏటీఎంలకు వెళ్లి పరిశీలించుకుంటుండగా నగదు జమకానట్లు చూపుతోందని చాలామంది ఆరోపిస్తున్నారు. ఆదివారం సాయంత్రం వరకు 2,88,077 అకౌంట్లకు ఆన్లైన్ చేయగా, ఇందులో 2,58,416 అకౌంట్లకు నగదు జమ అయిందని, 30,012 అకౌంట్లకు జమ కావాల్సి ఉందని తెలిపారు. మొత్తం 3,24,965 అకౌంట్లలో 48,946 అకౌంట్లకు బ్యాంకుల్లో ఆధార్ అనుసంధానం కాలేదని, ఐఎఫ్ఎస్సీ కోడ్ లేనందున ఆన్లైన్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా, కెవైసీ ఫారత పూర్తి చేసి ఇచ్చినా కూడా మొండిచేయి చూపారని రైతులు దుమ్మెత్తి పోస్తున్నారు. రైతు సాధికార సర్వే సమయంలో కూడా అన్ని పత్రాలు ఇచ్చామని, అయినా నగదు పడిందెక్కడని ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసమే ఇదంతా.. వ్యతిరేకతను తగ్గించుకోవడానికే సుఖీభవ పథకాన్ని పెట్టి నమ్మబలుకుతోందని రైతు సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. వాస్తవానికి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పధకం కింద ఏటా రైతులకు పెట్టుబడి సాయంగా రూ.6వేలు అందించాలని నిర్ణయించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం రూ.9వేలు, కేంద్రం ఇచ్చే రూ.6వేలు కలిపి రూ.15వేలు ఇస్తామని ప్రకటించింది. దీంట్లో మొదటి విడతగా కేంద్రం రూ.2వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1000లు ఇప్పుడే జమ చేస్తామని, మిగిలిన మొత్తం ఈ నెలలో ఇస్తామని ప్రకటించింది. దాదాపు 50 వేల మంది రైతుల ఖాతాలకు నగదు పడలేదని తేలిపోయింది. ఇన్‌ఫుట్ సబ్సిడీ, బీమా, రుణాల వడ్డీ రాయితీలకు ఎగ్గొట్టిన ప్రభుత్వం.. నాలుగున్నరేళ్లుగా ఇన్‌ఫుట్ సబ్సిడీ, పంటల బీమా, రూ.లక్షలోపు సాగు రుణాలు సకాలానికంటే ముందే చెల్లించగా వచ్చే రుణ రాయితీ ఇప్పటికి రాలేదని రైతులు మండిపడుతున్నారు. న్యాయంగా రావాల్సిన సొమ్ములు ఇవ్వకుంటే కొసరు దేనికని రైతులు, రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. 2012 నుంచి ఇప్పటి వరకు పంటపెట్టుబడి రాయితీ రూ.130 కోట్లు, పంటల బీమా రూ.117 కోట్లు, రుణాల వడ్డీ రాయితీ రూ.400 కోట్లు కలిపి రూ.647కోట్లు రైతులకు అందజేయాల్సి ఉంది. ఈ మొత్తమంతా ప్రభుత్వం ఎగ్గొట్టిందని రైతులు, రైతు సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఇది ఎన్నికల ఎత్తుగడే తెలుగు దేశం ప్రభుత్వం రైతులను ఏనాడో వదిలేసింది. పంటలు నష్టపోయినప్పుడు పట్టించుకోవడం మరచి పోయింది. ఇప్పుడు రైతుల ఓట్లు రాబట్టుకోవడానికి సుఖీభవ పథకం తీసుకువచ్చారు. ఇది ఎన్నికల జిమ్మిక్కే తప్ప రైతులకు మేలు చేయడానికి కాదు. –డేరంగుల రామాంజనేయులు, వేంపల్లె, వేంపల్లె మండలం రైతులను మభ్యపెట్టెందుకే.. ఎన్నికల సమయం దగ్గర పడడంతో రైతుల ఓట్లు బుట్టలో వేసుకోవడానికే తాయిలం. ఐదు సంవత్సరాలుగా రైతుల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు రైతుల అవసరం వచ్చింది కాబట్టి నగదు ఇస్తామంటున్నారు. రైతులను మభ్యపెట్టడానికే ఈ రైతు సుఖీభవ పధకం. –సంబటూరు ప్రసాదరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం ఈ ప్రభుత్వానిది అంతా బూటకమే.. తెలుగు దేశం ప్రభుత్వం అధికారం కోసం ప్రతిసారీ రైతులను ఏదో ఒక విధంగా బోల్తాకొట్టించాలని చూస్తుంది. పది రూపాయలు విధిలించి రైతులను బిక్షగాళ్ల మాదిరిగా చూస్తోంది. ఈ ప్రభుత్వం చేసేవన్నీ బూటకపు పనులే తప్ప రైతులకు మేలు చేసేది ఉండదు. ఇన్పుట్ సబ్సిడీ, వడ్డీ రాయితీ, బీమాను ఎగ్గొట్టింది. –చంద్ర,జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘం(సీపీఐ) -
‘అల్లూరి’ పోరాట స్ఫూర్తి మనందరిలో ఉండాలి
రైల్వేకోడూరు : అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి మనందరిలో ఉండాలని వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్‌రెడ్డి , జెడ్పీటీసీ మారెళ్ల రాజేశ్వరి, పార్టీ పట్టణ కన్వీనర్ సీహెచ్ రమేష్ పిలుపునిచ్చారు. అల్లూరి జయంతిని పురస్కరించుకుని బుధవారం పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు. సమాజం, రాష్ట్రం కోసం పోరాడాలని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి మందల నాగేంద్ర, ఇనమాల మహేష్, సుబ్బరామరాజు, ఎంపీటీసీలు మందల శివయ్య, ఆవుల రవిశంకర్, రత్తయ్య, గంగయ్య, రాజా పాల్గొన్నారు. స్వాతంత్య్ర పోరాట సమరయోధుడు అల్లూరి రైల్వేకోడూరు అర్బన్ : స్వాతంత్య్ర పోరాట సమరయోధుడు అల్లూరి సీతారామరాజు అని అల్లూరి యువజన సేవా సంఘం నాయకులు పేర్కొన్నారు. అల్లూరి జయంతి సందర్భంగా బుధవారం సంఘం నాయకులు స్థానిక టోల్గేట్ వద్ద ఉన్న అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు నాటి పోరా టాలే.. నేడు మనందరికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. బీజేపీ ఇన్చార్జి గల్లా శ్రీనివాసులు, అల్లూరి యువజన సంఘం అధ్యక్షుడు గడ్డం చంగల్ రాజు, ఓబులవారిపల్లె ఎంపీపీ వెంకటేశ్వర రాజు, క్షత్రియ సంఘం నాయకులు బలరామరాజు, తోట శ్రీనివాసులు, జయప్రకాశ్ నారాయణ వర్మ, సుబ్బరామరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రవికుమార్‌రాజు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకోవాలి బొమ్మవరం(ఓబులవారిపల్లె): మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీపీ వెంకటేశ్వరరాజు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా బుధవారం బొమ్మవరం ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిం చారు. ఈ సందర్భంగా బొమ్మవరంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాలలో వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, ప్యాడ్స్ తదితర విద్యాసామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్వతంత్య్రం సాధించడంలో బ్రిటీష్ దొరలను దేశం నుంచి తరిమికొట్టేందుకు చేసిన పోరాటాలు గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకుడు గడ్డం చెంగల్రాజు, గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన్యంవాసుల్లో ధైర్యం నింపిన వీరుడు పీవీజీపల్లె(పుల్లంపేట): మన్యంవాసుల్లో ధైర్యం నింపిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని వక్తలు పేర్కొన్నారు. అల్లూరి జయంతి సందర్భంగా బుధవారం పీవీజీ పల్లె ఉన్నత పాఠశాలలో ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు కే కృష్ణవేణి మాట్లాడుతూ తెల్లదొరలను ఎదిరించి గిరిజనులకు అండగా నిలిచిన యోధుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఉపాధ్యాయురాలు భారతి ఆధ్వర్యంలో జయంతి సభను నిర్వహించారు. భారతి మాట్లాడుతూ మన్యం వాసుల కష్టాలను కడతేర్చడానికి బ్రిటీష్ వారిని ఎదిరించిన ధీరుడు అల్లూరి అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు రెడ్డి ప్రసాద్, తెలుగు పండితులు గంగనపల్లె వెంకటరమణ, పీఈటీ చంద్రకుమార్, సుబ్బరామిరెడ్డి, శివశంకర్‌రాజు, సుజిత, నవీన్‌కుమార్ ప్రసంగించారు. -
ప్రజల్ని వంచిస్తున్న బీజేపీ, టీడీపీ
రైల్వేకోడూరు అర్బన్: విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలో బీజేపీ, టీడీపీ ప్రజల్ని నయవంచన చేస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి దార్ల రాజశేఖర్ ఆరోపించారు. ఉక్కు పరిశ్రమ సాధనలో భాగంగా బుధవారం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ కడపకు ఉక్కు పరిశ్రమ నెలకొల్పుతామని హామీ ఇచ్చి నేడు కుదరదని చెప్పడం ప్రధాని నరేంద్ర మోదీకి తగదన్నారు. ఉక్కు పరిశ్రమ సాధించలేని టీడీపీకి అధికారంలో ఉండే అర్హత లేదన్నారు. ఉక్కు పరిశ్రమ వల్ల లక్షలాది మంది యువకులకు ఇక్కడ ఉపాధి లభిస్తుందన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, నవీన్, క్రాంతి, పెంచలయ్య, తేజ పాల్గొన్నారు. -
సీఎం రమేష్ దీక్ష ఓ డ్రామా
ప్రొద్దుటూరు కల్చరల్ : సీఎం రమేష్ నాయుడు చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఓ డ్రామా అని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి విమర్శించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికార యంత్రాంగం కనుసన్నుల్లో 10 రోజుల పాటు సీఎం రమేష్ నాయుడు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిందని తెలిపారు. సీఎం చంద్రబాబు నిమ్మరసం ఇవ్వడంతో డ్రామా దీక్ష ముగిసిందన్నారు. రమేష్ నాయుడు ఈ దీక్ష ఎవరిపైన చేశారో.. ఎందుకు విరమించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమని, కేంద్రం హామీ ఇస్తేనే దీక్ష విరమించారా అని ప్రశ్నించారు. సీఎం ఉక్కు ఫ్యాక్టరీ కట్టదల్చుకుంటే కేంద్రంపై పోరాటం ఎందుకని ప్రశ్నించారు. రమేష్ నాయుడు వ్యాపార వేత్తగా, బడా కాంట్రాక్టర్‌గా మాత్రమే జిల్లా ప్రజలకు తెలుసునని పేర్కొన్నారు. రమేష్‌నాయుడు సీఎం బినామి, పవర్ బ్రోకర్ అని ప్రజలు తెలుసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధిగా జిల్లా వాసులు ఆయనను గుర్తించలేదని తెలిపారు. టీడీపీ అధికారంలో లేని రోజుల్లో జిల్లాలో ఎప్పుడూ కనిపించలేదన్నారు. ప్రత్యేకహోదా, ఉక్కు ఫ్యాక్టరీ రావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారని ఆయన పేర్కొన్నారు. -
ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య
కలసపాడు: మండల పరిధిలోని పిడుగుపల్లెకు చెందిన ఆర్మీ ఉద్యోగి నాగిరెడ్డి దస్తగిరిరెడ్డి (28) సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పిడుగుపల్లెకు చెందిన నాగిరెడ్డి పిచ్చిరెడ్డి, వెంకటసుబ్బమ్మ కుమారుడు దస్తగిరిరెడ్డి మహారాష్ట్రలోని పూణేలో 13 ఏళ్లుగా ఆర్మీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం నరవ గ్రామానికి చెందిన క్రిష్ణవేణితో వివాహం అయింది. వారికి రెండు నెలల క్రితం ఆడపిల్ల జన్మించింది. దస్తగిరిరెడ్డి ఇటీవల 15 రోజుల క్రితం సెలవుపై ఇంటికి వచ్చాడు. ఇంట్లో కుటుంబ సమస్యలు ఉన్నాయి. అతనికి మద్యం సేవించే అలవాటు ఉంది. ఈ క్రమంలో సోమవారం కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. రాత్రి బెడ్ రూంలో ఒకడే పడుకున్నాడు. తెల్లవారి చూసే సరికి ఫ్యా¯Œన్కు చీరతో ఉరి వేసుకుని మరణించాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని కిందికి దించారు. మెడ చుట్టూ కమిలిపోయి ఉంది. మృతునికి అవివాహిత చెల్లెలు ఉంది. కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
టీడీపీ నేతల దౌర్జన్యం
ప్రొద్దుటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లపై టీడీపీ వర్గీయులు శనివారం దౌర్జన్యం చేశారు. దాడి చేయడానికి ప్రయత్నించారు. అడ్డువచ్చిన వైఎస్సార్సీపీ నేతలను తోసేశారు. పోలీసుల రంగ ప్రవేశంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పార్కులో ట్యాంక్ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత ఆసం రఘురామిరెడ్డి ఇటీవల ప్రారంభించారు. అక్కడ ట్యాంక్ నిర్మిస్తే ఆహ్లాదకర వాతావరణం దెబ్బతింటుందని ప్రజలు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి ఫిర్యాదు చేశారు. ట్యాంక్‌ను అక్కడ కాకుండా.. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్మించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. దీంతో ఎమ్మెల్యే ట్యాంక్ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని టీడీపీ వర్గీయులు మున్సిపల్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంలో మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్తున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు.. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే టీడీపీ శ్రేణులు జోక్యం చేసుకుని.. వాగ్వాదానికి దిగారు. ప్రొద్దుటూరు టౌన్ : స్థానిక మున్సిపల్ గాంధీ పార్కులో ట్యాంకు నిర్మించడాన్ని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అడ్డుకోవడం లేదని, మరో ప్రాంతంలో నిర్మించాలని చెప్పారని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు రాచమల్లు రమాదేవి, రాగుల శాంతి, ఎమ్మెల్యే బావమరిది బంగారురెడ్డి ప్రజలకు వివరించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట టీడీపీ కౌన్సిలర్ గణేష్‌బాబు, తలారి పుల్లయ్య, వారి బంధువులు, ఆ ప్రాంత ప్రజలతో శనివారం ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ ఫ్లెక్సీని రాసి కార్యాలయ ప్రధాన ద్వారానికి కట్టి నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లే సమయంలో.. ఎమ్మెల్యే డౌన్ డౌన్, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పార్కులో ట్యాంకు నిర్మాణంతో ప్రజలకు ఆహ్లాద వాతావరణం పోతుందనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే వద్దన్నారని, మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్మించవచ్చని అధికారులకు చెప్పారని ఆందోళనకు వచ్చిన ప్రజలకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు చెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలో కౌన్సిలర్ గణేష్‌బాబు, టీడీపీ కౌన్సిలర్లు.. వైఎస్సార్సీపీ నాయకుడు బంగారురెడ్డిని దుర్భాషలాడారు. ‘మీతో మేము మాట్లాడటం లేదు, ప్రజలకు చెబుతున్నాం’ అని అంటుండగానే.. మరో టీడీపీ కౌన్సిలర్ తలారి పుల్లయ్య బంగారురెడ్డి భుజంపై చేయి వేసి పక్కకు లాగి దౌర్జన్యానికి దిగాడు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు, వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ కౌన్సిలర్ గణేష్‌బాబు, ఆయన వర్గీయ మహిళలు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పరుష పదజాలంతో దూషించడంతో.. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు హెచ్చరించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగనూరు మురళీధర్‌రెడ్డి అక్కడికి వచ్చారు. ఇబ్బందిగా ఉంటుందని ప్రజలు ఫిర్యాదు చేస్తేనే.. ఎమ్మెల్యే అలా చెప్పారని, మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తే తప్పేంటని టీడీపీ కౌన్సిలర్లను ఆయన ప్రశ్నించారు. అయితే వారు ఆవేశంతో ఊగిపోయారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డి, కంట్రోల్ రూం సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్ఐ లక్ష్మీనారాయణ, బ్లూకోల్ట్ సిబ్బంది అక్కడికి వచ్చి ఇరు వర్గాలను బయటికి పంపించారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
కడప అర్బన్ : కడప సబ్ డివిజన్ పరిధిలోని ఎర్రగుంట్ల మండలం చిలంకూరు గ్రామం ముద్దనూరురోడ్డులో మంగళవారం ఉదయం క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎర్రగుంట్ల పరిధిలో క్రికెట్ బెట్టింగ్ భారీగా జరుగుతోందని సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. పుల్లాసి గురుప్రసాద్‌కు సంబంధించిన ప్రసాద్ హోటల్లో తొమ్మిది మంది ఈ నెల 23న జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన డబ్బులను మార్పిడి చేసుకుంటూ, గంజాయి సంచితో కనిపించగా వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 8.98 లక్షల నగదు, 1150 గ్రాముల నిషేధిత గంజాయి సంచి, కారు (ఏపీ04 ఏఎం7793), 16 సెల్ఫోన్లు, క్రికెట్ బెట్టింగ్ పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో ప్రొద్దుటూరు దస్తగిరిపేటకు చెందిన కటిక సులేమాన్, ఎర్రగుంట్ల మండలం వలసపల్లెకు చెందిన తమ్మిశెట్టి బాలయ్య, వీఎన్ పల్లె మండలం ఉరుటూరు వాసి సొదుం రమేష్‌కుమార్‌రెడ్డి, ఎర్రగుంట్ల మండలం వలసపల్లె నివాసి రాజోలు బయపురెడ్డి, కర్చుకుంటపల్లె గ్రామానికి చెందిన బొందల వెంకటేశు, చిలంకూరుకు చెందిన పుల్లాసి గురుప్రసాద్, ఎర్రగుంట్ల పట్టణంలోని దొండపాడు రోడ్డులో నివసిస్తున్న చింతల వెంకటప్రసాద్ అలియాస్ నల్ల ప్రసాద్, అదే ప్రాంత నివాసి పిల్లిగోయిల శ్రావణ్‌కుమార్ అలియాస్ చిన్నా, ప్రొద్దుటూరు టౌన్ జిన్నారోడ్డులో నివసిస్తున్న షేక్ మహమ్మద్ ఉన్నారు. నిందితులను పకడ్బందీగా అరెస్టు చేయడంలో కృషి చేసిన ఎర్రగుంట్ల సీఐ శ్రీనివాసరెడ్డి, కడప రూరల్ సీఐ హేమసుందర్రావు, ఎర్రగుంట్ల ఎస్ఐ జె.శివశంకర్, పెండ్లిమర్రి ఎస్ఐ ఎస్కే రోషన్, కడప తాలూకా ఎస్ఐ రాజరాజేశ్వర్‌రెడ్డి, ఎర్రగుంట్ల కానిస్టేబుళ్లు పాములేటి, నాగాంజనేయులును డీఎస్పీ అభినందించారు. -
బిజిలీ బంద్
కడప కార్పొరేషన్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు నిర్వహించిన బిజిలీ బంద్ జిల్లాలో విజయవంతమైంది. వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించడంతో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నాయకులు, శ్రేణులు బంద్‌లో పాల్గొని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు ధరించి రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకూ దీపాలు ఆర్పి వేసి నిరసన తెలిపారు. పులివెందులలోమాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి పూల అంగళ్ల వరకూ ర్యాలీగా వెళ్లి లైట్లు ఆఫ్ చేసి బ్లాక్ డే నిర్వహించారు. రైల్వేకోడూరులోని వైఎస్ఆర్ సర్కిల్లో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో లైట్లు ఆఫ్ చేసి కొవ్వొత్తులు ప్రదర్శించారు. కడపలో ఏడు రోడ్ల కూడలి వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో లైట్లు ఆర్పి కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు కరిముల్లా, నగర అధ్యక్షుడు షఫీ, నగర మహిళా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు ఈశ్వరయ్య, ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు నీలి శ్రీనివాసరావు, సత్తార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు సుధాకర్ రాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు. రాయచోటిలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కార్యాలయంలో దీపాలు ఆర్పి కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కమలాపురంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, వీఎన్ పల్లిలో మండల అధ్యక్షుడు రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్‌లో విద్యుత్ ఆపివేసి నిరసన తెలిపారు. బద్వేల్లో పార్టీ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయంలో నల్లబ్యాడ్జీలు ధరించి లైట్లు ఆర్పి నిరసన తెలిపారు. పార్టీ నాయకులు సుందరరామిరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, గోపాలస్వామి పాల్గొన్నారు. రాజంపేటలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆకేపాటి మురళీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజంపేట పాతబస్టాండులో లైట్లు ఆర్పివేసి నిరసన తెలిపారు. పట్టణ అధ్యక్షులు పోలా శ్రీనివాసులరెడ్డి, చొప్పాయల్లారెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్సార్ అండతోనే మీకు రాజకీయ జీవితం
ఎర్రగుంట్ల : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అండతో..ఆయన బొమ్మతోనే మీకు రాజకీయ జీవితం వచ్చిందని , వైఎస్సార్ సీపీ జెండాతో గెలిచి కేసుల మాఫీ కోసం టీడీపీలోకి వెళ్లారని వైఎస్సార్ సీపీ కడప పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజనేయరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహుబూబ్ వలి ధ్వజమెత్తారు. శనివారం ఎర్రగుంట్లలోని వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2009 ఎన్నికల్లో కేవలం 5 వేల మెజార్టీ అప్పటి ఎమ్మెల్యే ఆదినారాయరెడ్డికి వచ్చిందని, 2014 ఎన్నికల్లో డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి మద్దతు ఇవ్వడంతో పది వేల మెజార్టీ వచ్చిన విషయాన్ని మంత్రి ఆది సోదరుడు జయరామిరెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. రాజీనామ చేశాకే పార్టీ మారుతామని చెప్పిన మంత్రి ఆది ఎందుకు రాజీనామ చేయలేదని ప్రశ్నించారు. ఇప్పటికీ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగానే ఆసెంబ్లీలో కొనసాగుతున్న విషయం గుర్తుంచు కోవాలన్నారు. మా నాయకుడు సుధీర్‌రెడ్డిని విమర్శించే అర్హత ఎవరికి లేదన్నారు. ఎర్రగుంట్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలిచిన విషయం తెలియదా అని అన్నారు. పార్టీ ఫిరాయింపు దారులను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. చంద్రబాబు పుట్టిన రోజు అంటూ కోట్లాది రూపాయాల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసుబై బ్రదర్స్, ముద్దనూరు మైనార్టీ నాయకులు ఖాదర్‌ఖాన్ పాల్గొన్నారు. -
దీక్ష పేరుతో ప్రజాధనం వృథా
రైల్వేకోడూరు అర్బన్ : రాష్ట్రానికి ప్రత్యేకహోదా తేవడంలో నాలుగేళ్లుగా ప్రజలను మభ్యపెట్టి, ఇప్పుడు ఒక రోజు దీక్ష అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారని వైఎస్సార్ సీపీ నాయకులు విమర్శించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనవారం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా ప్రజలను మభ్య పెట్టడం మానాలని హితవు పలికారు. విభజన చట్టం ప్రకారం అప్పటి ప్రధాని హామీలు, రావల్సిన నిధులు తెప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్య పెట్టడానికి ప్రతిరోజు ఏదోక నాటకానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. దీక్ష చేయాల్సింది రాష్ట్రంలో కాదని, ధైర్యం ఉంటే ఢీల్లీలో ప్రధాని నివాసం ముందు చేయాలన్నారు. బీజేపీతో తెగతెంపులు అంటూ ప్రజలను నమ్మించి, లోపాయికారిగా కేసుల కోసం బీజేపీ వారికి టీటీడీ పాలక మండలి సభ్యులుగా పదవులు ఇవ్వడమేంటని వారు ప్రశ్నించారు. ఏసీలు పెట్టుకుని దీక్షలు చేసే చంద్రబాబుకు ఉద్యమాల గురించి ఏం తెలుసునని వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ మారెళ్ల రాజేశ్వరి, పట్టణ కన్వీనర్ సీహెచ్ రమేష్ విమర్శించారు. పార్టీ మండల కన్వీనర్ గుంటిమడుగు సుధాకర్‌రాజు, నియోజకవర్గ అధికార ప్రతినిధి మందల నాగేంద్ర, జిల్లా స్టీరింగ్ కమిటీ సబ్యులు నందాబాల, ఎంపీటీసీలు మందల శివయ్య, డాక్టర్ సుబ్రమణ్యం, పట్టణ కన్వీనర్ అబ్దుల్‌రౌఫ్, సిగమల రామచంద్రారెడ్డి, నాయకులు తిరుపతి శేఖర్, సుదర్శన్ రాజు, గంగయ్య, తిప్పన మణి, డీవీ రమణ పాల్గొన్నారు. -
శిల్పారామం..ఇక కొత్త రూపం!
జిల్లాలో కడపతోపాటు పులివెందులలో శిల్పారామాలు ఉన్నాయి. రోజువారి జీవితంలో అలసిన వారికి ఈ ఆరామాలు ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వీటిని ఏర్పాటు చేసి పదేళ్లు కావస్తోంది. చిన్నచిన్న మార్పులు మినహా మారుతున్న కాలానికి అనుగుణంగా పెద్దగా మార్పులేవీ జరగలేదు. ఇటీవల సందర్శకులు నూతనత్వం కొరవడిందని పెదవి విరుస్తున్నారు. ఒక దశలో శిల్పారామాల నిర్వహణ ప్రభుత్వానికి బరువుగా మారింది. ప్రతి ఆదివారం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా స్థానికంగా స్పాన్సర్లను వెతుక్కోవలసి వచ్చింది. దీంతో ఆదాయం తగ్గింది. ప్రభుత్వం దీన్ని గమనించి కొత్త అందాలతో శిల్పారామాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమైంది. రాష్ట్ర శిల్పారామాల స్పెషలాఫీసర్ బి.జయరాజ్ కడప శిల్పారామంలో చేపట్టాల్సిన మార్పులను పరిశీలించేందుకు కడప నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. కడప కల్చరల్ : కడప, పులివెందుల శిల్పారామాలలో జనం సందడి తగ్గినట్లు కనిపిస్తోంది. కారణం? ఆదాయం తగ్గలేదుగానీ పెరగని మాట నిజమే. ఆశించిన మేరకు ఆర్థికంగా అభివృద్ధి కనిపించడం లేదు. మీ దృష్టికి వచ్చిన లోపాలు ఏమిటి? నివారణకు తీసుకుంటున్న చర్యలేమిటి? కడప శిల్పారామం నగరం నుంచి దూరమని పలువురు ప్రజలు భావిస్తున్నారు. ఎస్టేట్ తర్వాత మూడు, నాలుగు కిలోమీటర్ల వరకు నిర్మానుష్యంగా ఉంటుంది. కానీ ఇటీవల నగరం వైపు నుంచి రైల్వేట్రాక్ వరకు, శిల్పారామం నుంచి పెట్రోలు బంకు వరకు అక్కడక్కడా భవనాలు వెలిశాయి. జనం సందడి పెరుగుతోంది. శిల్పారామాల పూర్తిస్థాయి అభివృద్ధికి చేపట్టనున్న చర్యలేమిటి? వీటిని పూర్తిగా ఆధునికీకరిస్తాం. స్థానికతను కోల్పోకుండా ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ సందర్శకులకు మెరుగైన వసతులు కల్పిస్తాం. వారు ఉల్లాసంగా గడిపేందుకు శిల్పారామానికి కొత్త లుక్ వచ్చేలా మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఏమేం మార్పులు చేపడతారు? ముఖ్యంగా వినోదానికి, ఉల్లాసంగా గడపడానికి అనుగుణంగా మార్పులు చేస్తాం. కొన్ని సాంకేతిక కారణాలతో గ్రీనరీ (పచ్చిక) లేకుండా పోయింది. కడప శిల్పారామంలో ఓ భాగాన్ని పూర్తిగా పచ్చికతో నింపుతాం. ప్రస్తుతం షాపింగ్ స్టాల్స్ దూరంగా విసిరేసినట్లు ఉన్నాయి. వాటిని ఎదురెదురుగా దగ్గరలో ఉండేటట్లు మారుస్తాం. తరుచూ హస్తకళా రూపాల ప్రదర్శన, విక్రయాలు ఏర్పాటు చేస్తాం. నైపుణ్యం గల కళాకారులకు స్టాల్స్‌ను ఉచితంగా ఇస్తాం. సందర్శకుల కోసం పాత్‌వేలను అభివృద్ధి చేస్తాం. సౌకర్యవంతంగా సేద తీరేందుకు పలుచోట్ల బెంచీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ప్రత్యేకించి వినోదం కోసం ఏం చేస్తున్నారు? కడప శిల్పారామానికి పడమర వైపునగల చెరువును నీటితో నింపి బోటింగ్, వాటర్‌గేమ్స్ నిర్వహించాలని ఆలోచిస్తున్నాం. 56 ఎకరాల చెరువులో 40 ఎకరాల్లో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించేందుకు అనుకూలంగా మార్చేందుకు కృషి చేస్తున్నాం! ఆధునీకరణ అన్నారు...వివరాలు చెప్పగలరా..? ఆధునీకరణ కోసం అంతర్జాతీయ అనుభవం గల ఇద్దరు యువ అర్కిటెక్చర్లకు ఈ పని అప్పగించాం. వారు ప్రత్యేకించి కడప శిల్పారామాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించనున్నారు. ఇప్పటికే ఇక్కడ పర్యటించి సందర్శకుల అభిప్రాయాలు సేకరించారు. ఆ ప్రణాళిక అమలైతే కడప శిల్పారామానికి కొత్త లుక్ వస్తుందని చెప్పగలను. సందర్శకులను ఆకట్టుకునేందుకు సీమ రుచులు లాగా స్థానిక వంటకాలు, ఆహార పదార్థాలు, అల్పాహారం అందించేందుకు ఫుడ్ కోర్టును ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయని భావిస్తున్నారు? ఈనెలాఖరుకు మాస్టర్ ప్లాన్‌ను తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తాం. కార్యాలయ పరమైన అనుమతులు అనంతరం సీఎం ఆమోదంతో వెంటనే పనులు చేపడతాం. జూలై నాటికి దశలవారీగా అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయగలమన్న విశ్వాసం ఉంది. ఈ పనులను ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యాల సమ్మేళనంతో 40–60 శాతం పద్ధతిలో చేపడుతాం. రాష్ట్రంలో శిల్పారామాల పరిస్థితి ఎలా ఉంది? పులివెందుల శిల్పారామాన్ని ఆధునీకరించి ఆర్థికంగా మెరుగైన స్థితికి చేర్చేందుకు అంచనాలు రూపొందిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది శిల్పారామాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. ప్రస్తుతం కడపతోపాటు తిరుపతి, విశాఖ, అనంతపురం, పుట్టపర్తిలలో శిల్పారామాలు ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు, కాకినాడ, విజయనగరంలలో పనులు సాగుతున్నాయి. 21న కర్నూలులో శిల్పారామానికి శంకుస్థాపన నిర్వహించనున్నాం. -
వైఎస్ జగన్‌తోనే ప్రత్యేక హోదా సాధ్యం
రాయచోటి : వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాట ఫలితంగానే రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధ్యమవుతుందని వైఎస్సార్సీపీ నాయకులు నినదించారు. రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రీలే దీక్షలు శనివారంతో 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా బీసీ శాఖ ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్ అధ్యక్షతన పట్టణం, మండల పరిధిలోని బీసీ నాయకులు దీక్షలో కూర్చొన్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదనమోహన్‌రెడ్డి మాట్లాడుతూ పూర్తి స్థాయిలో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకహోదా ఒక్కటే శరణ్యమన్నారు. ప్రత్యేకహోదా కేటాయింపులో బీజేపీ, టీడీపీ రాష్ట్రానికి తీవ్ర మోసం చేశాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు కూర్చొన్నారని, ఈ విషయంలో టీడీపీ కూడా చిత్తశుద్ధితో ఎంపిల చేత రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు. దీక్షా శిబిరం ప్రారంభం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేకహోదా కోసం చేపట్టిన రిలే దీక్షా శిబిరానికి మున్సిపల్ చైర్పర్సన్ నసిబూన్‌ఖానమ్, కో ఆప్షన్ సభ్యులు సలావుద్దీన్, కౌన్సిలర్లు ఫయాజ్ రహిమాన్, కొలిమి చాన్‌బాషా, లయన్ నాగేశ్వరరావు, అన్వర్‌బాషా, గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు గుండా సురేంద్ర, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు అఫ్జల్‌అలీఖాన్, డీసీఎంఎస్ మాజీ డైరెక్టరు బుల్లి వెంకటరమణ సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా కార్యదర్శి కిషోర్, జగన్ యువసేన నాయకులు సురేష్‌కుమార్‌రెడ్డి, విక్కీ, దేవేంద్రకుమార్, మహేష్, లాలాదాస్, సాదిక్, మండెం ప్రసాద్, హేమంత్నాయక్, గిరివర్దన్ దీక్షల్లో కూర్చొన్నారు. -
నేనున్నానని..
ప్రజా సంకల్ప యాత్రకు బయలుదేరిన జననేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి రెండో రోజు మంగళవారం అడుగడుగునా ప్రజలు అఖండ స్వాగతం పలికారు. వేలాది మంది తమ అభిమాన నేత అడుగుల్లో అడుగులేస్తూ.. మా కష్టాలు తీరే రోజులు రానున్నాయని ఆనంద పరవశులయ్యారు. అందరి సమస్యలు వింటూ.. కష్టాలు తెలుసుకుంటూ.. వారికి భరోసా ఇస్తూ వైఎస్ జగన్ ముందుకు కదిలారు. మహిళలు.. వృద్ధులు.. విద్యార్థులు.. నిరుద్యోగులు.. ఉద్యోగులు.. రైతులు.. వికలాంగులు.. ఇలా ఒక్కరేమి.. అన్ని వర్గాల వారికి తాను అండగా ఉంటానని ప్రతిపక్ష నేత హామీ ఇచ్చారు. సాక్షి ప్రతినిధి, కడప: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం రెండో రోజు పాదయాత్ర జోరుగా, హుషారుగా సాగింది. వేంపల్లెలో పాదయాత్ర సాగే మార్గంలో జనం లేకుండా చేయడానికి పోలీసులు విధించిన ఆంక్షలు ప్రజాగ్రహంతో తుస్సుమన్నాయి. తమ అభిమాన నాయకుడికి జనం అడుగడుగునా హారతులు ఇచ్చి ఆయన్ను పలుకరించి, చేతులు కలిపి, ఆశీర్వదించి కానీ ముందుకు పంపలేదు. దీంతో పాదయాత్ర నిర్ణీత సమయం కంటే మూడు గంటలు ఆలస్యంగా సాగింది. వేంపల్లె వాసులు ఊహించని విధంగా జగన్‌కు అఖండ స్వాగతం పలికారు. వేంపల్లె శివారులోని రాత్రి బస నుంచి మంగళవారం ఉదయం 8–45 గంటలకు బయటకు వచ్చిన జగన్ పులివెందుల నియోజక వర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిపారు. అక్కడి నుంచి యాత్ర ప్రారంభించి 9–50 గంటలకు వేంపల్లె నాలుగు రోడ్ల కూడలికి రావాల్సి ఉంది. అయితే ఈ మార్గంలో అడుగడుగునా ప్రజలు భారీ సంఖ్యలో జగన్ కోసం వేచి చూశారు. తన కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరినీ ఆయన పలుకరిస్తూ ముందుకు సాగారు. దీంతో చాలా ఆలస్యంగా మధ్యా హ్నం 12–15 గంటలకు ఆయన నాలుగు రోడ్ల కూడలికి వచ్చారు. ఉదయం 9 గంటల నుంచే జగన్ కోసం నాలుగు రోడ్ల కూడలిలో ఎదురు చూస్తున్న పార్టీ కార్యకర్తలు, జనం మీద పోలీసులు ఆంక్షలు విధించారు. రోడ్డుకు పక్కన కూడా జనం గుమికూడరాదని హుకుం జారీ చేశారు. పోలీసుల హెచ్చరికలతో నాలుగు రోడ్ల కూడలి నుంచి బస్టాండ్ వరకు హాటళ్లు, ఇతర దుకాణాలన్నీ మూసి వేయడంతో వ్యాపారులు నష్టపోవడంతో పాటు, యాత్రకు వచ్చిన వారికి టిఫిన్, టీ, కాఫీ లాంటివి దొరక్క ఇబ్బంది పడ్డారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే జగన్‌కు స్వాగతం పలుకుతూ అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. పోలీసులు వారిని అడ్డుకుని కేసులు పెడతామని హెచ్చరించారు. పోలీసు హెచ్చరికలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా జనం పెద్ద సంఖ్యలో తిరగబడటంతో పోలీసులు మిన్నకుండి పోవాల్సి వచ్చింది. జగన్ నాలుగు రోడ్ల సర్కిల్‌కు చేరుకోవడంతోనే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. ఆయన అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి ముందుకు సాగారు. జగన్‌ను చూడటానికి, ఆయనతో మాట్లాడటానికి మహిళలు, యువకులు భారీ ఎత్తున హాజరయ్యారు. ఇక్కడి నుంచి ఒకటిన్నర కిలో మీటర్ దూరంలోని శ్రీనివాస కల్యాణ మండపానికి చేరుకోవడానికి రెండున్నర గంటల సమయం పట్టింది. జెడ్పీ హైస్కూల్ వద్ద టీచర్లు జగన్‌ను కలసి సీపీఎస్ విధానం రద్దు చేస్తామని హామీ ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ నిర్వహించిన మొదటి రచ్చ బండ కార్యక్రమం 3–45 గంటలకు ముగిసింది. ఇక్కడ కూడా జగన్‌కు తమ బాధలు చెప్పుకోవడం కోసం పెద్ద ఎత్తున హాజరైన మహిళలు మూడు గంటల పాటు ఎదురు చూశారు. జగన్ రావడంతోనే వారిలో ఉత్సాహం పెరిగి ఆయనతో తమ కష్టాలు పంచుకున్నారు. అక్కడి నుంచి యాత్ర ప్రారంభించిన జగన్ సాయంత్రం 4–50 గంటలకు పత్తి పంట కోల్పోయిన కౌలు రైతు జయన్నకు ధైర్యం చెప్పి ముందుకు సాగారు. హైవే మీద కూడా జనం భారీ సంఖ్యలో ఆయన వెంట అడుగులో అడుగు వేశారు. సాయంత్రం 5–20 గంటలకు మధ్యాహ్న భోజన విడిదికి చేరుకున్న జగన్ 10 నిమిషాల్లోనే మళ్లీ పాదయాత్ర ప్రారంభించారు. యురేనియం కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు జగన్‌ను కలిసి తమ కాంట్రాక్టు సంస్థ ఇబ్బందులు కల్పిస్తోందని ఫిర్యాదు చేశారు. జగన్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌తో మాట్లాడారు. అలాగే చక్కెర ఫ్యాక్టరీ ఉద్యోగులు కూడా జగన్‌ను కలిశారు. రాత్రి 7–40 గంటలకు మర్రిపల్లె క్రాస్‌కు చేరుకుని అక్కడి నుంచి రాత్రి 8–30 గంటలకు నేల తిమ్మాయ పల్లిలోని బసకు చేరుకున్నారు. రెండో రోజు పాదయాత్ర ఇలా ముగిసింది. -
మాటిచ్చి.. తప్పుతారా?
సాక్షి ప్రతినిధి, కడప :‘చెప్పేందుకే శ్రీరంగ నీతులు’ అన్నట్లుగా భారతీయ జనతా పార్టీ వైఖరి ప్రస్ఫుటం అవుతోంది. ప్రతిపక్షంలో ఉండగా ఆంధ్రప్రదేశ్‌పై ప్రేమ ఒలకపోసిన నేతలు అధికార పీఠం దక్కగానే మాట మార్చారు. పార్లమెంటు సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్లు కల్పించాలని నాడు డిమాండ్ చేసిన ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు నేడు కీలకమైన స్థానంలో ఉంటూ న్యాయం చేయలేకపోతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ విభజించడం అన్యాయమని గళమెత్తిన నేతలు వడ్డించే స్థానంలో మాటిచ్చి.. తప్పుతారా? ఉండి రిక్తహస్తం చూపుతున్నారని వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే నిలదీయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పల్లెత్తు మాట మాట్లాడకపోవడాన్ని పలువురు ఎత్తిచూపుతున్నారు. నాడు సమైక్యాంధ్ర ఉద్యమంలో చిత్తశుద్ధి ప్రదర్శించని టీడీపీ నేడు ప్రత్యేక హోదా పట్ల సైతం అదే ధోరణితో ఉందని పలువరు ఆరోపిస్తున్నారు. అధికారమే వాళ్లకు ముఖ్యం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కలిసి రాష్ట్రాన్ని విడగొట్టి తీరని ద్రోహం చేశాయి. అప్పట్లో ఐదేళ్లు సరిపోదు.. పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీతోపాటు టీడీపీ కూడా డిమాండ్ చేసింది. కానీ నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకిగానీ, ఆ పార్టీతో కలిసి ప్రభుత్వం నడుపుతున్న టీడీపీకిగానీ ఆంధ్రప్రదేశ్ సమస్యలు పట్టడం లేదు. వ్యక్తిగత ప్రయోజనాలు, అధికారమే వారికి ముఖ్యమయ్యాయి. వైఎస్ఆర్సీపీ ఒక్కటే చిత్తశుద్దితో ప్రత్యేక హోదా కోసం పోరాడుతోంది. - ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అందరూ కలిసి మోసం చేశారు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ను నిలువునా మోసం చేశారు. రాష్ట్రాన్ని అడ్డంగా విభజించిన కాంగ్రెస్ గానీ, అందుకు సహకరించిన పార్టీలుగానీ ప్రత్యేక హోదా గూరించి పట్టించుకోవడం లేదు. వాళ్లు చేస్తారని వీళ్లు, వీళ్లు చేస్తారని వాళ్లు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం మాట తప్పడం విచారకరం. - శివారెడ్డి, ఎన్జీఓ సంఘం, జిల్లా అధ్యక్షుడు బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రం పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. దానికి చంద్రబాబు వంతపాడుతున్నారు. పార్లమెంటు సాక్షిగా ప్రత్యేకహోదాపై అప్పటి ప్రధాన మంత్రి ప్రకటన చేస్తే ఐదేళ్లు సరిపోదు, పదేళ్లకు పెంచాలని వెంకయ్యనాయుడు చేసిన హంగామా దేశ ప్రజలంతా చూశారు. ఇప్పుడు అధికారం చేపట్టిన బీజేపీ పిల్లిమొగ్గలు వేస్తూ రోజుకో మంత్రి చేత ప్రకటనలు చేయిస్తోంది. విభజన చట్టంలో లొసుగులు ఉంటే ఈ చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టేటప్పుడు ఏం చే శారు..? మా పోరాటం వల్లే పదేళ్ల ప్రత్యేక హోదా సాధ్యమని ఓట్లు వేయించుకొని నేడు మాట తప్పడం సరికాదు. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ఆ ఊసే మరిచారు. - జి. ఈశ్వరయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి రాష్ట్ర ప్రజలకంటే బీజేపీతో స్నేహమే ముఖ్యమైంది అభివృద్దే ఎజెండాగా బీజేపీ, టీడీపీలు గత ఎన్నికల్లో ప్రచారం చేసి ఓట్లు దండుకున్నాయి. రాష్ట్రాన్ని ముక్కలు చేయడంలో కాంగ్రెస్ పాత్ర ఎంత ఉందో, బీజేపీ పాత్ర కూడా అంతే ఉందనేది జగమెరిగిన సత్యం. ఎన్నికల ముందు ప్రధాని మోడీ రెండు రాష్ట్ర్రాలకు అనేక హామీలు ఇచ్చారు. ఒక్క సంవత్సరంలోనే ఆయన నిజ స్వరూపం ప్రజలకు అర్థమయ్యింది. ఇంత జరుగుతున్నా బీజేపీపై విమర్శలు చేయవద్దని చంద్రబాబు మంత్రులకు ఆదేశాలివ్వడం సిగ్గుచేటు. ప్రజల కంటే మీకు బీజేపీతో స్నేహమే ముఖ్యమా... ఈ రెండు పార్టీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశాయి. ఏ. ఆంజనేయులు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చితీరాల్సిందే రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించగా, అందుకు బీజేపీ ఐదేళ్లు చాలదు, పదేళ్లు కావాలని పట్టుబట్టింది. దీన్నిబట్టి కాంగ్రెస్ హామీని బీజేపీ తీసుకుంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బీజేపీని రాష్ట్ర ప్రజలు క్షమించరు. ప్రత్యేక హోదా తెచ్చేందుకు ఎలాంటి పోరాటాలకైనా టీడీపీ సిద్ధంగా ఉంది. - గోవర్ధన్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంపీలంతా విజ్ఞులని అనుకున్నాం ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లు పత్యేక హోదా చాలదు.. పదేళ్లు కావాలని వాదించి వెంకయ్యనాయుడు సన్మానాలు కూడా చేయించుకున్నారు. ఎంపీలంతా విజ్ఞులు కదా.. పార్లమెంటులో తీర్మానం చేసి మాట తప్పుతారా అని అనుకొన్నాం. కానీ నేడు బీజేపీ ఇచ్చిన మాట నిలుపుకోలేదు. అన్ని పక్షాలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రత్యేక హోదాతోపాటు రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. - పోచంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ. రాజకీయాలకు అతీతంగా ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తేవాలి దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించడం ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది. ప్రత్యేక హోదా కల్పిస్తే కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు వచ్చే అవకాశముంటుంది. రాజకీయాలకు అతీతంగా ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. - బి. నారాయణ రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేత ఠ మొదటిపేజీ తరువాయి ఉండి రిక్తహస్తం చూపుతున్నారని వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే నిలదీయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పల్లెత్తు మాట మాట్లాడకపోవడాన్ని పలువురు ఎత్తిచూపుతున్నారు. నాడు సమైక్యాంధ్ర ఉద్యమంలో చిత్తశుద్ధి ప్రదర్శించని టీడీపీ నేడు ప్రత్యేక హోదా పట్ల సైతం అదే ధోరణితో ఉందని పలువరు ఆరోపిస్తున్నారు. అధికారమే వాళ్లకు ముఖ్యం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కలిసి రాష్ట్రాన్ని విడగొట్టి తీరని ద్రోహం చేశాయి. అప్పట్లో ఐదేళ్లు సరిపోదు.. పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీతోపాటు టీడీపీ కూడా డిమాండ్ చేసింది. కానీ నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకిగానీ, ఆ పార్టీతో కలిసి ప్రభుత్వం నడుపుతున్న టీడీపీకిగానీ ఆంధ్రప్రదేశ్ సమస్యలు పట్టడం లేదు. వ్యక్తిగత ప్రయోజనాలు, అధికారమే వారికి ముఖ్యమయ్యాయి. వైఎస్ఆర్సీపీ ఒక్కటే చిత్తశుద్దితో ప్రత్యేక హోదా కోసం పోరాడుతోంది. - ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అందరూ కలిసి మోసం చేశారు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ను నిలువునా మోసం చేశారు. రాష్ట్రాన్ని అడ్డంగా విభజించిన కాంగ్రెస్ గానీ, అందుకు సహకరించిన పార్టీలుగానీ ప్రత్యేక హోదా గూరించి పట్టించుకోవడం లేదు. వాళ్లు చేస్తారని వీళ్లు, వీళ్లు చేస్తారని వాళ్లు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం మాట తప్పడం విచారకరం. - శివారెడ్డి, ఎన్జీఓ సంఘం, జిల్లా అధ్యక్షుడు బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రం పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. దానికి చంద్రబాబు వంతపాడుతున్నారు. పార్లమెంటు సాక్షిగా ప్రత్యేకహోదాపై అప్పటి ప్రధాన మంత్రి ప్రకటన చేస్తే ఐదేళ్లు సరిపోదు, పదేళ్లకు పెంచాలని వెంకయ్యనాయుడు చేసిన హంగామా దేశ ప్రజలంతా చూశారు. ఇప్పుడు అధికారం చేపట్టిన బీజేపీ పిల్లిమొగ్గలు వేస్తూ రోజుకో మంత్రి చేత ప్రకటనలు చేయిస్తోంది. విభజన చట్టంలో లొసుగులు ఉంటే ఈ చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టేటప్పుడు ఏం చే శారు..? మా పోరాటం వల్లే పదేళ్ల ప్రత్యేక హోదా సాధ్యమని ఓట్లు వేయించుకొని నేడు మాట తప్పడం సరికాదు. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ఆ ఊసే మరిచారు. - జి. ఈశ్వరయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి రాష్ట్ర ప్రజలకంటే బీజేపీతో స్నేహమే ముఖ్యమైంది అభివృద్దే ఎజెండాగా బీజేపీ, టీడీపీలు గత ఎన్నికల్లో ప్రచారం చేసి ఓట్లు దండుకున్నాయి. రాష్ట్రాన్ని ముక్కలు చేయడంలో కాంగ్రెస్ పాత్ర ఎంత ఉందో, బీజేపీ పాత్ర కూడా అంతే ఉందనేది జగమెరిగిన సత్యం. ఎన్నికల ముందు ప్రధాని మోడీ రెండు రాష్ట్ర్రాలకు అనేక హామీలు ఇచ్చారు. ఒక్క సంవత్సరంలోనే ఆయన నిజ స్వరూపం ప్రజలకు అర్థమయ్యింది. ఇంత జరుగుతున్నా బీజేపీపై విమర్శలు చేయవద్దని చంద్రబాబు మంత్రులకు ఆదేశాలివ్వడం సిగ్గుచేటు. ప్రజల కంటే మీకు బీజేపీతో స్నేహమే ముఖ్యమా... ఈ రెండు పార్టీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశాయి. - ఏ. ఆంజనేయులు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చితీరాల్సిందే రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించగా, అందుకు బీజేపీ ఐదేళ్లు చాలదు, పదేళ్లు కావాలని పట్టుబట్టింది. దీన్నిబట్టి కాంగ్రెస్ హామీని బీజేపీ తీసుకుంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బీజేపీని రాష్ట్ర ప్రజలు క్షమించరు. ప్రత్యేక హోదా తెచ్చేందుకు ఎలాంటి పోరాటాలకైనా టీడీపీ సిద్ధంగా ఉంది. - గోవర్ధన్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంపీలంతా విజ్ఞులని అనుకున్నాం ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లు పత్యేక హోదా చాలదు.. పదేళ్లు కావాలని వాదించి వెంకయ్యనాయుడు సన్మానాలు కూడా చేయించుకున్నారు. ఎంపీలంతా విజ్ఞులు కదా.. పార్లమెంటులో తీర్మానం చేసి మాట తప్పుతారా అని అనుకొన్నాం. కానీ నేడు బీజేపీ ఇచ్చిన మాట నిలుపుకోలేదు. అన్ని పక్షాలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రత్యేక హోదాతోపాటు రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. - పోచంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ. రాజకీయాలకు అతీతంగా ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తేవాలి దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించడం ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది. ప్రత్యేక హోదా కల్పిస్తే కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు వచ్చే అవకాశముంటుంది. రాజకీయాలకు అతీతంగా ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. - బి. నారాయణ రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేత