రాత్రి భర్త, పిల్లలతో కలిసి భోజనం.. ఉదయం లేచి చూసేసరికి.. | Married Woman Goes Missing Unknown Reason Ysr Kadapa | Sakshi
Sakshi News home page

రాత్రి భర్త, పిల్లలతో కలిసి భోజనం.. ఉదయం లేచి చూసేసరికి..

Published Thu, Mar 17 2022 1:17 PM | Last Updated on Thu, Mar 17 2022 1:21 PM

Married Woman Goes Missing Unknown Reason Ysr Kadapa - Sakshi

సాక్షి,మైలవరం, (జమ్మలమడుగు రూరల్‌): మైలవరం మండలంలోని గంగులనారాయణపల్లె గ్రామానికి చెందిన నాగలక్ష్మీ (24) అనే వివాహిత మహిళ అదశృమైనట్లు ఎస్‌ఐ రామకృష్ణ బుధవారం తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు నాగలక్ష్మీకి 7 సంవత్సకాల క్రిందట కర్నూల్‌ జిల్లా ఆళ్లగడ్డ తాలూకాలోని దోర్నిపాడు గ్రామానికి చెందిన మహేంద్ర అనే యువకుడితో వివాహమైంది. మహేంద్ర భార్యతో కలసి అత్తగారి గ్రామమైన గంగునారాయణపల్లెలో నివాసం ఉంటున్నారు. (చదవండి: షాకింగ్‌.. తల్లి చేతి నుంచి ఐదు నెలల బాలుడు జారిపడి.. )

 వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. మార్చి 14వ తేదీ రాత్రి భార్య, భర్త, పిల్లలు భోజనం చేసి ఇంటిలో నిద్రపోయారు. తెల్లవారే సరికి నాగలక్ష్మీ కనపించలేదు. మహేంద్ర చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లేదు. వెంటనే అత్త పిల్లి ఈశ్వరమ్మకు తెలిపాడు. ఆమె మైలవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement