
సాక్షి, హైదరాబాద్: పెళ్లైయిన నెల రోజులకు తల్లిగారింటికి వచ్చిన యువతి కుటుంబ సభ్యుల కళ్లుగప్పి పరారైన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కర్నాటక బీదర్‌కు చెందిన పార్వతి ఇద్దరు కూతుళ్లు, కొడుకుతో కలిసి గోపన్‌పల్లి తండాలో నివాసం ఉంటోంది. పెద్ద కూతురు జగ్దేవికి ఔరత్‌కు చెందిన పవార్‌తో మే నెల 29న వివాహం జరిగింది.
కొద్ది రోజుల క్రితం జగ్దేవి తల్లి గారింటికి వచ్చింది. జూన్ 29న సాయంత్రం 4 గంటల సమయంలో తల్లి, కూతుళ్లు బయటకు వచ్చారు. వారి కళ్లు గప్పి జగ్ధేవి పారిపోయింది. సమీప ప్రాంతాలలో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment