ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో హృదయాలను ద్రవింపజేసే ఒక కథ వెలుగుచూసింది. ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి వెళుతోంది. ఆ సమయంలో ఆమెకు ఆసుపత్రి బయట మానసికంగా కుంగిపోయిన ఒక వ్యక్తి కనిపించాడు. ఆమె ఆతనికి దగ్గరగా వెళ్లి పరిశీలనగా చూడగా, అతను మరెవరో కాదు తన భర్తే అని గుర్తించింది. 10 ఏళ్ల క్రితం ఆమె భర్త కనిపించకుండా పోయాడు.
ఇప్పుడు భర్తను ఇటువంటి పరిస్థితిలో చూసిన ఆమె అతనికి తల దువ్వడంతో పాటు శరీరాన్ని శుభ్రపరుస్తూ స్నానం చేయించింది. అలాగే ఆమె ఏడుస్తూ పదేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన తన భర్త ఇతనేనని చుట్టుపక్కల వారికి తెలియజేసింది. ఇన్నాళ్లూ ఎక్కడికి వెళ్లిపోయారు? ఏమైపోయారు? అని అతనిని అడుగుతూ కనిపించింది. అయితే అతను అమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. మౌనంగా ఆమెను అలా చూస్తూనే ఉన్నాడు.
ఇంతలో ఆ మహిళ ఇంటిలోని వారికి ఫోను చేసి, తండ్రికి దుస్తులు తీసుకురావాలని కోరింది. కొద్దిసేపటి తరువాత బైక్‌పై వచ్చిన ఒక యువకుడు ఆ మహిళను, అతనిని తనతో పాటు తీసుకువెళ్లిపోయాడు. కాగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 2020లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. ఒక డీఎస్‌పీ రోడ్డు పక్కక బిచ్చగాని మాదిరిగా కనిపించాడు. అతని బ్యాచ్‌మేట్ అతనిని గుర్తించారు.
ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ ప్రోగ్రాం ఉందని మొహర్రం సెలవు రద్దు..!
Comments
Please login to add a commentAdd a comment