
శిరీష- చిన్నారి
కుషాయిగూడ(హైదరాబాద్): ‘నీతో కలిసి ఉండటం ఇష్టం లేదు’ అని భర్తకు లేఖ రాసిన భార్య 16 నెలల కూతురును తీసుకొని అదృశ్యమైన ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కామారెడ్డికి చెందిన వదనల స్వామి, శిరీష దంపతులు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి వీఎన్‌రెడ్డినగర్‌లో ఉంటున్నారు.
చదవండి: మేనత్త ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి బస్సులో బయలుదేరి..
వారికి పాప, బాబు ఉన్నారు. స్వామి ఎలక్ట్రీయన్ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. పనిలో భాగంగా వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉండేవాడు. ఈ నెల 7న పని నిమిత్తం కరీంనగర్ వెళ్లాడు. అక్కడి నుంచే రోజు భార్యకు ఫోన్‌లో మాట్లాడేవాడు.ఈ నెల 14న ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో పక్కింటి వారికి ఫోన్ ఉదయం షాపింగ్, సాయంత్రం బాబును తీసుకొచ్చేందకు స్కూల్‌కు వెళ్లానని చెప్పినట్లు పక్కింటి వారు స్వామికి తెలిపారు. భార్య కదిలికలపై అనుమానం వచ్చిన స్వామి సాయంత్రానికి ఇక్కడికి వచ్చి చూడగా శిరీషతో పాటు 16 నెలల కూతురు కనిపించలేదు. ఇంట్లో చూడగా నీతో ఉండటం నాకు ఇష్టం లేదు నాకోసం వెతకొద్దంటూ రాసిన లేఖ లభించడంతో స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment