
పుష్ప (ఫైల్)-సరస్వతి, అఖిల (ఫైల్)
నల్లకుంట(హైదరాబాద్): భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చిన ఓ ఇల్లాలు తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని ఇంటి నుంచి అదృశ్యమైన ఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రమాదేవి తెలిపిన వివరాల ప్రకారం.. రాజేశ్వరి కుటుంబసభ్యులతో కలిసి అడిక్‌మెట్ వడ్డెర బస్తీలో నివసిస్తోంది. ఓ ప్రైవేటు స్కూల్‌లో ఆయాగా పనిచేస్తున్న పెద్ద కూతురు పుష్ప(30)కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది.
కాగా కూతురు అల్లుడి మధ్య గొడవల కారణంగా ఇద్దరు కుమార్తెలు సరస్వతి(16), అఖిల(14)లను తీసుకుని పుట్టింటికి వచ్చింది. ఈనెల 6న రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇద్దరు కుమార్తెలను తీసుకుని పుట్టింటి నుంచి వెళ్లిపోయింది. పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో తన కుమార్తె ఇద్దరు మనుమరాళ్లు కనిపించడం లేదని రాజేశ్వరి శనివారం సాయంత్రం నల్లకుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: పంట చేనుకు కాపలా వెళ్లిన యువతి.. చివరికి ఊహించని ఘటన.. అసలేం జరిగింది?
Comments
Please login to add a commentAdd a comment