యువకుడి బైక్‌పై మహిళ.. గమనించిన భర్త.. వారిని వెంబడించి.. | Man Who Was Riding Bike With Woman Was Killed By Her Husband | Sakshi

యువకుడి బైక్‌పై మహిళ.. గమనించిన భర్త.. వారిని వెంబడించి..

Jun 21 2023 4:09 PM | Updated on Jun 21 2023 4:37 PM

Man Who Was Riding Bike With Woman Was Killed By Her Husband - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

యువకుడి బైక్‌పై వెళుతున్న భార్యను గమనించిన భర్త వారిని వెంబడించి ఆ యువకుడిపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: యువకుడి బైక్‌పై వెళుతున్న భార్యను గమనించిన భర్త.. వారిని వెంబడించి ఆ యువకుడిపై కత్తులతో దాడి చేసిన ఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆజంపురా కట్టెలగూడాకు చెందిన సెంట్రింగ్ కార్మికుడు యూసుఫ్(30) అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో బైక్‌పై వెళుతున్నాడన్న విషయం తెలుసుకున్న భర్త, బంధువులు వెంబడించి హత్య చేసి పరారయ్యారు.

మృతుడికి సదరు మహిళతో వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం నిందితులు పీఎస్‌లో లొంగిపోయినట్లు తెలిసింది.. ఘటనా స్థలాన్ని సౌత్ ఈస్ట్ అదనపు డీసీపీ మనోహర్  క్లూస్ టీం సందర్శించి వివరాలు సేకరించారు.

కాగా హైదరాబాద్‌ పరిధిలో గడిచిన 24 గంటల్లో 5 హత్యలు చోటుచేసుకోవడం నగరవాసుల్ని భయాందోళనకు గురిచేస్తోంది.  అర్ధరాత్రి టప్పాఛబుత్రలో ఇద్దరు ట్రాన్స్జెండర్లను గుర్తుతెలియని వ్యక్తులు దారణంగా హత్య చేశారు. మైలార్దేవ్పల్లి పరిధిలో రెండు హత్యలు జరిగాయి. ఫుట్పాత్పై నిద్రిస్తున్న ఇద్దరిని బండరాళ్లతో కొట్టి చంపారు దుండగులు. తాగతాజగా. చాదర్‌ఘాట్‌ సమీపంలో మరో హత్య జరిగింది. వరుస హత్యలు పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
చదవండి: స్వామీజీ లీలలు.. గొలుసులతో కట్టేసి రెండేళ్లుగా అఘాయిత్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement