chaderghat
-
యువకుడి బైక్‌పై మహిళ.. గమనించిన భర్త.. వారిని వెంబడించి..
సాక్షి, హైదరాబాద్: యువకుడి బైక్‌పై వెళుతున్న భార్యను గమనించిన భర్త.. వారిని వెంబడించి ఆ యువకుడిపై కత్తులతో దాడి చేసిన ఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆజంపురా కట్టెలగూడాకు చెందిన సెంట్రింగ్ కార్మికుడు యూసుఫ్(30) అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో బైక్‌పై వెళుతున్నాడన్న విషయం తెలుసుకున్న భర్త, బంధువులు వెంబడించి హత్య చేసి పరారయ్యారు. మృతుడికి సదరు మహిళతో వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం నిందితులు పీఎస్‌లో లొంగిపోయినట్లు తెలిసింది.. ఘటనా స్థలాన్ని సౌత్ ఈస్ట్ అదనపు డీసీపీ మనోహర్ క్లూస్ టీం సందర్శించి వివరాలు సేకరించారు. కాగా హైదరాబాద్ పరిధిలో గడిచిన 24 గంటల్లో 5 హత్యలు చోటుచేసుకోవడం నగరవాసుల్ని భయాందోళనకు గురిచేస్తోంది. అర్ధరాత్రి టప్పాఛబుత్రలో ఇద్దరు ట్రాన్స్జెండర్లను గుర్తుతెలియని వ్యక్తులు దారణంగా హత్య చేశారు. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో రెండు హత్యలు జరిగాయి. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరిని బండరాళ్లతో కొట్టి చంపారు దుండగులు. తాగతాజగా. చాదర్‌ఘాట్ సమీపంలో మరో హత్య జరిగింది. వరుస హత్యలు పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. చదవండి: స్వామీజీ లీలలు.. గొలుసులతో కట్టేసి రెండేళ్లుగా అఘాయిత్యం -
4 వంతెనలు, 3 నెలల్లో టెండర్లు .. మూసీపై బ్రిడ్జీల నిర్మాణానికి జీహెచ్ఎంసీ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: మూసీపై 4 హైలెవల్ వంతెనల నిర్మాణ బాధ్యతల్ని ప్రభుత్వం జీహెచ్ఎంసీకి అప్పగించడంతో ఆ దిశగా అధికారులు కార్యాచరణకు సిద్ధమయ్యారు. నాలుగు బ్రిడ్జిల అంచనా వ్యయం రూ.168 కోట్లు. వీటి నిర్మాణంతో వానల సమయాల్లోనే కాకుండా అన్ని సమయాల్లోనూ రాబోయే అయిదారు దశాబ్దాలపాటు ప్రజలకు సాఫీ ప్రయాణం సాధ్యమయ్యేందుకు క్షేత్రస్థాయి సర్వే, తగిన డిజైన్లు, ఇతరత్రా పనుల కోసం కన్సల్టెన్సీల సేవలు పొందేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. వీటికి సంబంధించిన డీపీఆర్‌లు మూడు నెలల్లో పూర్తిచేసి, దాదాపు ఏడాది కాలంలో నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. బ్రిడ్జి పనుల్లో భాగంగానే అప్రోచ్‌లు, సర్వీస్‌రోడ్లు, ఫుట్‌పాత్‌లు, డ్రెయిన్లు, డక్ట్లు, సెంట్రల్ మీడియన్లు, కెర్బ్‌లు, స్ట్రీట్లైట్ల ఏర్పాటు వంటి పనులు సైతం పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. సర్వేలో ప్రాధాన్యతనివ్వాల్సిన అంశాలు.. ►రోడ్డు వినియోగదారులకు మెరుగైన సేవలతోపాటు తగిన భద్రత. ►వీలైనంత తక్కువగా భూసేకరణ. ►నిర్మాణ సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు వీలైనంత తక్కువగా ఉండాలి. ►నిర్మాణం త్వరితంగా పూర్తయ్యేందుకు వినూత్న ఆలోచనలతో, ఆధునిక సాంకేతికతను వినియోగించాలి. ►కొత్త బ్రిడ్జిలు ఇలా ఉండాలి.. ►ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా నిరంతరం సాఫీ మూవ్మెంట్ ఉండాలి. ► బ్రిడ్జి వెడల్పు, లేన్లు పెంచి సామర్థ్యం పెంచాలి. ►ఫుట్‌ఫాత్‌ల కింద టెలికాం, విద్యుత్ తదితర కేబుళ్లకు డక్ట్లుండాలి. ►పాదచారులు రోడ్డు దాటేందుకు తగిన సదుపాయాలుండాలి. ►ట్రాఫిక్ సిగ్నళ్లు, రోడ్డు మార్కింగ్లుండాలి. ►మొత్తానికి ప్రజా రవాణా మెరుగవ్వాలి. పర్యాటక ఆకర్షణగా.. మూసారంబాగ్, చాదర్ఘాట్ల వద్ద బ్రిడ్జి పనులు పది రోజుల్లో ప్రారంభించి, 9 నెలల్లో పూర్తి చేయనున్నట్లు ఇటీవల మూసారాంబాగ్ బ్రిడ్జి ముంపు సమయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రకటించినప్పటికీ, పనులు మొదలయ్యేందుకు సమయం పట్టనుంది. డీపీఆర్ తయారీ, టెండర్ల ప్రక్రియకే మూడునెలలు పట్టనుంది. మూసీపై నిర్మించే బ్రిడ్జిల డిజైన్లు ప్రత్యేకంగా ఉండేందుకు, పర్యాటకులను ఆకట్టుకునేందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపడంతో వాటికోసం పోటీలు కూడా నిర్వహించారు. డిజైన్లు మంత్రి పరిశీలనలో ఉన్నాయి. చదవండి: హైటెక్ స్టేషనండి.. రూ. 100 కోట్లతో అభివృద్ధి చేసినా.. బండి ఆగదండి నిధులెలా..? నాలుగు బ్రిడ్జిలకు వెరసి రూ. 168 కోట్లు అవసరం కాగా, సదరు నిధుల్ని జీహెచ్ఎంసీ ఎలా సమకూర్చుకోనుందో ఇంకా స్పష్టత రాలేదు. డీపీఆర్‌ల తయారీకి మూడునెలల సమయమున్నందున ఆలోగా బ్యాంకులోన్లు తీసుకోవడమో, బాండ్ల ద్వారా సేకరించడమో చేసే అవకాశం ఉంది. లేదా జీహెచ్ఎంసీ ఖజానా నుంచే పనులు జరిగేకొద్దీ విడతల వారీగా చెల్లింపులు చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. బ్రిడ్జిలు– అంచనా వ్యయాలు.. 1.మూసీపై ఇబ్రహీంబాగ్ కాజ్‌వేను కలుపుతూ హైలెవెల్ బ్రిడ్జి :రూ. 39 కోట్లు 2. మూసారాంబాగ్‌ను కలుపుతూ హైలెవెల్ బ్రిడ్జి:రూ.52కోట్లు 3.చాదర్‌ఘాట్ వద్ద హైలెవెల్ బ్రిడ్జి : రూ.42 కోట్లు 4. అత్తాపూర్ వద్ద ఉన్న బ్రిడ్జికి సమాంతరంగా కొత్త బ్రిడ్జిలు:రూ.35కోట్లు -
మూసారాంబాగ్, చాదర్‌ఘాట్ బ్రిడ్జిలు క్లోజ్..
-
హైదరాబాద్‌లో దారుణం.. ఇల్లు అద్దెకు ఇస్తానంటూ యువతిని బంధించి..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చాదర్‌ఘాట్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇంటి అద్దె పేరుతో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇల్లు అద్దెకు ఇస్తానంటూ ఇంట్లోకి తీసుకెళ్లిన యువకుడు.. యువతిని నగ్నంగా బంధించాడు. ప్రతిఘటించిన ఆ యువతి.. గట్టిగా కేకలు వేసింది. అరిస్తే లైంగిక దాడి చేస్తానంటూ యువకుడు బెదిరింపులకు దిగాడు. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్లో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హైదరాబాద్: చికెన్ బిర్యానీలో బల్లి.. కంగుతున్న కార్పొరేటర్ -
HYD: చాదర్ ఘాట్‌లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఫుట్‌పాత్‌పై ఉన్న ఓ పూరి గుడిసెలో మంటలు అంటుకున్నాయి. మంటల కారణంగా గుడిసెల్లో ఉన్న చేతివృత్తుల సామగ్రి అగ్నికి ఆహుతి అయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది ఎగిసిపడతున్న మంటలను అదుపు చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 10కి పైగా గుడిసెలు తగలబడ్డాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. -
ఆసుపత్రి నుంచి గర్భిణి అదృశ్యం.. ‘నాకోసం వెతక్కండి’
సాక్షి, చాదర్‌ఘాట్: వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గర్భిణి అదృశ్యమైన ఘటన చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపిన వివరాలు.. హఫీజ్‌బాబానగర్‌కు చెందిన గర్భిణి నసీరున్నీసా బేగం తన వదినతో కలిసి సోమవారం మలక్‌పేట ఏరియా ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం వచ్చింది. ఆమె వదిన డాక్టర్లు ఉన్నారో లేరో తెలుసుకునేందుకు లోనికి వెళ్లి రాగా నసీరున్నీసా కనపడలేదు. ఇంటి వద్ద ఇతర బంధువుల వద్ద వెతికినా ఫలితం లేకపోవటంతో ఆమె కుటుంబ సభ్యులు చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రి నుంచి వారి బంధువైన యువకుడితో ఆటోలో వెళ్లినట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా ఆమె తన భర్త సెల్‌ఫోన్‌కు మెసేజ్ పంపింది. తాను క్షేమంగానే ఉన్నానని, ప్రస్తుతం తాను మహబూబ్‌నగర్‌లో ఉన్నానని తన గురించి వెతకొద్దని అందులో పేర్కొంది. దీంతో ఆమె ఉద్దేశపూర్వకంగానే వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. గృహిణి అదృశ్యం పహాడీషరీఫ్: కూరగాయలు కొనుగోలుకు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఓ గృహిణి కనిపించకుండా పోయిన సంఘటన పహాడీషరీఫ్ పీఎస్ పరిధిలో జరిగింది. ఏఎస్సై నరోత్తం రెడ్డి తెలిపిన వివరాలు.. కర్నాటక బీదర్‌కు చెందిన జాదవ్ నాందేవ్, కవిత (24) దంపతులు. జీవనోపాధి నిమిత్తం రెండేళ్ల క్రితం జల్పల్లి శ్రీరాం కాలనీకి వీరు వలసవచ్చారు. ఈ నెల 17న ఉదయం 9 గంటలకు కూరగాయలు కొనుగోలు చేస్తానంటూ ఇంట్లో చెప్పి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఎంత వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమె ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ స్టేషన్లో గాని 94906 17241 నంబర్లో గాని సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. చదవండి: లాక్డౌన్.. నన్నే బయటకు వెళ్లనివ్వవా? -
దగ్గరి బంధువులే దోపిడి చేశారు
సాక్షి, హైదరాబాద్(చాదర్‌ఘాట్): వృద్ధురాలిని కత్తితో బెదిరించి దోపిడీ చేసిన కేసు మిస్టరీని చాదర్‌ఘాట్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకొని సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అప్పులు తీరే దారిలేక సొంత పెద్దమ్మ ఇంట్లోనే భర్తతో కలిసి యువతి దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపిన వివరాలు.. అజంపురా ఉస్మాన్‌పురాలో నివసించే నికారున్నీసా (65) గురువారం ఇఫ్తార్ ముగించి భర్త బయటకు వెళ్లటంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే సమయంలో బురఖాలో వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఇంట్లోకి చొరబడి ఆమెను కట్టేసి కత్తితో బెదిరించి బీరువాలోని రూ.2 లక్షల నగదు, బంగారు చైను ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన చాదర్‌ఘాట్ పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. నికారున్నీసా సోదరి కుమార్తె అజంపురాకు చెందిన సాదివి ఇదాయాత్ (32), ఆమె భర్త అక్సర్ (43) లను నిందితులుగా గుర్తించారు. దంపతులకు అప్పులు ఎక్కువ కావటంతో దోపిడీకి పాల్పడినట్లు నేరం ఒప్పుకున్నారు. పోలీసులు వారిని అదుపులోనికి తీసుకొని రూ.1.70 లక్షల నగదు, బంగారు చైను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. ( చదవండి: కూకట్‌పల్లిలో కాల్పుల కలకలం..చంపేసి.. దోచేశారు ) -
బైక్‌పై ఫంక్షన్‌కు వెళ్తుండగా..
చాదర్‌ఘాట్: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓల్డ్ మలక్‌పేటకు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్సై సంపత్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓల్డ్ మలక్‌పేట్‌కు చెందిన సోహేల్ అహ్మద్ (18), ఇలాఫ్ ఆహ్మద్ (14)బుధవారం రాత్రి బైక్‌పై చంపాపేటలో ఫంక్షన్‌కు బయలుదేరారు. మలక్‌పేట సోమల్ హోటల్ సమీపంలో వినుకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి వేగంగా వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు కింద పడిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారైనట్లు పోలీసులు తెలిపారు. బస్సును సీజ్‌చేసి స్టేషన్‌కు తరలించామని, డ్రైవర్ కోసం గాలిస్తున్నామన్నారు. -
హార్స్ రేస్‌లో కిందపడి జాకీ మృతి
సాక్షి, హైదరాబాద్/చాదర్‌ఘాట్: మలక్‌పేట్‌లోని హైదరాబాద్ రేస్ క్లబ్లో (హెచ్ఆర్సీ) మరో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం ఉస్మాన్‌సాగర్ ప్లేట్ డివిజన్–2 రేసులో పాల్గొన్న రాజస్తాన్‌కు చెందిన జాకీ జితేందర్ సింగ్ (25) గోల్డెన్ టేబుల్ అనే గుర్రం పైనుంచి పడి ప్రాణం విడిచాడు. హెచ్ఆర్సీలో జరిగే వివిధ రేసుల్లో ఇక్కడి గుర్రాలు స్వారీ చేయడం కోసం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి జాకీలు వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే రెండ్రోజుల క్రితం జితేందర్ సింగ్ నగరానికి చేరుకున్నారు. క్లబ్ ప్రాంగణంలో ఉన్న హెచ్ఆర్సీ గెస్ట్ హౌస్‌లో బస చేశారు. ఈ రేసులో మొత్తం పది మంది పాల్గొన్నారు. మూడో స్థానంలో జితేందర్ సింగ్ ఉన్నారు. రేసు మొదలైన కాసేపటికే గుర్రం 50 కి.మీ. వేగం అందుకుంది. ఎమైందో కానీ ఒక్కసారిగా గుర్రంతో పాటు జితేందర్ సింగ్ పడిపోయాడు. ఈ నేపథ్యంలోనే గుర్రం కాలు ఆయన ఛాతీ భాగంలో బలంగా తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన హెచ్ఆర్సీ వర్గాలు ఆయన్ను మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాయి. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు చెప్పడంతో పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. దీనిపై చాదర్‌ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతానికి సంబంధించిన సీసీ కెమెరా ఫీడ్‌ను సేకరించిన పోలీసులు విశ్లేషిస్తున్నారు. చదవండి: (చేయని నేరానికి బలైపోతున్నా..) గతంలోనూ ముగ్గురు: ►2005 నవంబర్ 28న మెదక్ ప్లేట్ డివిజన్–1 రేసులో ‘గ్రీకువీరుడు’అనే గుర్రం పైనుంచి పడి హైదరాబాద్‌కు చెందిన జాకీ మధుకుమార్ చనిపోయాడు. ►2012 అక్టోబర్ 19న ఎలైజ్ జోన్ ప్లేట్ చేజింగ్‌లో ‘ట్రిపుల్ ఎయిట్’అనే గుర్రం పైనుంచి పడి పుణేకు చెందిన లక్ష్మణ్ అనే జాకీ మరణించాడు. ►2014 ఏప్రిల్ 17న ఎలైట్ జోన్ రేసులో మూడు గుర్రాలు ఒకదాన్ని ఒకటి గుద్దుకోవడంతో జాకీలతో సహా పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే పుణేకు చెందిన జాకీ శ్యామలరావు చనిపోయాడు. -
కిడ్నాపైన బాలుడికి కరోనా పాజిటివ్
చాదర్‌ఘాట్ (హైదరాబాద్): తల్లి పొత్తిళ్ల నుంచి రెండు రోజుల కిందట కిడ్నాప్‌నకు గురైన చిన్నారికి కరోనా పాజిటివ్ అని తేలింది. భర్త చనిపోవటంతో ఓ మహిళ ఏడాదిన్నర వయసున్న కుమారుడితో భిక్షాటన చేస్తూ చాదర్‌ఘాట్ సమీపంలో రోడ్డుపక్కన జీవిస్తోంది. దీంతో తలాబ్‌కట్టకు చెందిన ఆటో డ్రైవర్ ఇబ్రహీం ఆమె పొత్తిళ్ల నుంచి చాకచక్యంగా బాలున్ని కిడ్నాప్ చేశాడు. దీన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించి ఇబ్రహీంను అరెస్ట్ చేశారు. తనకు సంతానం లేకపోవటం వల్లే రోడ్డుపక్కన ఉంటున్న బాలున్ని మూడు, నాలుగు రోజులుగా రెక్కీ చేసి కిడ్నాప్ చేశానని అతను అంగీరించాడు. దీంతో ఇబ్రహీం ఇంటి నుంచి బాలున్ని తీసుకువచ్చి పోలీసులు తిరిగి తల్లికి అప్పగించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించగా బాలునికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో వైరస్ ఎలా సోకిందన్న కోణంలో విచారణ మొదలు పెట్టారు. తల్లితో పాటు కిడ్నాపర్, బాలున్ని రక్షించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులకు కూడా కరోనా టెస్ట్‌లు నిర్వహించారు. బాలునికి కింగ్‌కోఠి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరో 24 గంటలు గడిస్తే బాలునికి వైరస్ అంటించిన వారి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
మహాలక్ష్మి అత్యాచార ఘటన : ఉరి తీయాలి
సాక్షి, హైదరాబాద్ : నగరలోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత బాలిక మహాలక్ష్మిపై అత్యాచారానికి పాల్పడిన షకీల్‌ను కఠిన శిక్షించాలని ఆల్ ఇండియా దళిత హక్కుల ఫోరం (ఏఐడీఆర్ఎఫ్) జాతీయ అధ్యక్షులు కందుల ఆనందరావు డిమాండ్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన షకీల్‌ను తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని అన్నారు. దళిత బాలికపై అత్యాచారాన్నితీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. గతంలో దిశపై అత్యాచారం చేసిన వాళ్ళను తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేశారని, మరి దళిత బాలికకు అన్యాయం చేసిన వారిని ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదని ప్రశ్నించారు. (శిక్ష తప్పదు: సత్యవతి రాథోడ్) శనివారం కందుల ఆనందరావు ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించాల్సిన అవసరం లేదు. వారికి నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే నిందితులను వెంటనే ఎన్కౌంటర్ చేసేలా ప్రభుత్వం మీద పోలీసుల మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇటీవల న్యాయస్థానాలు దళిత గిరిజనులు వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడంతో మాకు న్యాయస్థానాల మీద నమ్మకం కూడా రోజు రోజుకి సడలిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు ఉరిశిక్షను వేయాలి’ అని డిమాండ్ చేశారు. ఘటనను సుమోటోగా స్వీకరించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత బాలికపై జరిగిన అత్యాచార ఘటనను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సుమోటోగా స్వీకరించింది. బాధితురాలికి అండగా ఉంటామని స్పష్టం చేస్తూ.. తక్షణ పరిహారం అందించాలని కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు శాఖకు సూచించారు. మరోవైపు బాలికపై అత్యాచారానికి పాల్పడిన షకీల్‌కు కఠిన శిక్ష పడుతుందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇదివరకే స్పష్టం చేశారు. -
శిక్ష తప్పదు: సత్యవతి రాథోడ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడిన షకీల్‌కు కఠిన శిక్ష పడుతుందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఆమె అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తెలుసుకున్నారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, నిందితుడికి చట్ట ప్రకారం శిక్ష పడేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఘటనను సుమోటోగా స్వీకరించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత బాలికపై జరిగిన అత్యాచార ఘటనను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సుమోటోగా స్వీకరించింది. బాధితురాలికి అండగా ఉంటామని స్పష్టం చేస్తూ.. తక్షణ పరిహారం అందించాలని కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు శాఖకు సూచించారు. (చదవండి: మద్యం ఎక్కువ తాగాడని హత్య) -
అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
-
హైదరాబాద్‌లో విషాదం; యువతి మృతి
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. చాదర్‌ఘాట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కావ్య అనే యువతి మృతి చెందింది. వివరాలు.. చాదర్‌ఘాట్‌లో ఓ వ్యక్తి యువతిని బైక్‌పై ఎక్కించుకుని వెళ్తున్నాడు. రోడ్డుపై ఏర్పడ్డ గుంత కారణంగా వారి టూ వీలర్ ఒక్కసారిగా జారిపడటంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ కింద పడిపోయారు. అదే సమయంలో పక్క నుంచి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు వారి మీద నుంచి వేగంగా దూసుకుని పోయింది. దీంతో కావ్య అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటనలో గాయపడ్డ మరో వ్యక్తి పరిస్థితి విషయంగా ఉంది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని యువతి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రోడ్డు సరిగా ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని, రోడ్డుపై ఏర్పడ్డ గుంతల గురించి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావ్య పరీక్ష రాయడానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని కుటుంబ సభ్యులు బెబుతున్నారు. ఈ ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. -
జీతాలు చెల్లించలేదని చెత్త వాహనాల నిలిపివేత
సాక్షి, హైదరాబాద్ : జీతాలు చెల్లించాలనే డిమాండ్‌తో నగరంలోని చెత్త వాహనాల డ్రైవర్లు శుక్రవారం తమ వాహనాలను నిలిపివేశారు. దీంతో చాదర్‌ఘాట్‌లోని కలెక్షన్ పాయింట్లో చెత్త భారీగా పేరుకుపోయింది. ఇక్కడి నుంచి చెత్తను సేకరించి జవహర్‌నగర్‌లోని డంపింగ్ యార్డుకు చెత్తను తరలించాల్సి ఉంది. చెత్త సేకరించే భారీ వాహనాలను నిలిపివేయడంతో చాదర్‌ఘాట్ నుంచి ఎమ్జీబీఎస్ వరకు ట్రాఫిక్ స్థంభించిపోయింది. ట్రాఫిక్ వల్ల ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
భార్యపై కత్తితో దాడి
చాదర్‌ఘాట్ (హైదరాబాద్) : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త భార్యపై కత్తితో దాడి చేసి గాయపరచిన ఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. షాహీన్‌నగర్‌కు చెందిన నహిమా(21)కు ఉస్మాన్‌పూర్‌కు చెందిన వాజిద్ అలీ(25)తో 2014లో వివాహం జరిగింది. గత కొంత కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. పండుగకు పుట్టింటికి వెళ్లిన నహీమాకు శుక్రవారం సాయంత్రం వాజిద్ అలీ ఫోన్ చేసి ఇంటికి రమ్మని కోరాడు. ఈ మేరకు ఆమె అత్తింటికి చేరుకుంది. చిన్న విషయమై ఆమెకు అత్తతో వాగ్వాదం చోటుచేసుకుంది. అదే సమయంలో ఇంటికి చేరుకున్న వాజిద్ అలీ భార్యను కత్తితో పొడిచాడు. భుజంపై నహిమాకు గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్తయ్య తెలిపారు. -
మత్తు మందు చల్లి నగలు లాక్కెళ్లారు..
చాదర్‌ఘాట్ (హైదరాబాద్) : ఇంటి ముందు కూర్చుని ఉన్న మహిళ ముఖంపై గుర్తుతెలియని దుండగులు మత్తు మందు చల్లి ఆమె ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ సంఘటన నగరంలోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్బాద్ న్యాయమూర్తుల కాలనీలో మంగళవారం జరిగింది. కాలనీలోని పీఎన్ఆర్ అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న తన ఇంటి ముందు కూర్చుని ఉన్న వరలక్ష్మి(25) అనే మహిళ ముఖంపై బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు మత్తు మందు చల్లారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయి పడిపోగా ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు ఆభరణాలను లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బాలుడి వలలో 15 కిలోల చేప
చాదర్‌ఘాట్ (హైదరాబాద్) : నగరంలోని చాదర్‌ఘాట్ సమీపంలో ఉన్న మూసీ నదిలో 15 కిలోల చేపను స్థానికులు పట్టుకున్నారు. చాదర్‌ఘాట్‌కు చెందిన స్థానికులు మూసీ నదిలో చాపలు పట్టుకోవడం సాధారణ విషయం. కాగా శనివారం చాదర్‌ఘాట్ సమీపంలో చేపలు పడుతున్న ఒక బాలుడి వలలో 15 కిలోల చేప చిక్కింది. దీంతో ఆ బాలుడు ఆనందంలో మునిగిపోయాడు. బాలుడు చేపను తీసుకొని వెళ్తుండగా 'సాక్షి' కెమెరాకు చిక్కాడు. -
మొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లు
-
మొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లు
హైదరాబాద్: మొదటి ప్రపంచ యుద్ధం (జూలై 28, 1914 - నవంబర్ 11, 1918) ప్రారంభమై వంద సంవత్సరాలు పూర్తి అయింది. ఆ యుద్దం ముగిసి రేపటికి 96 సంవత్సరాలు కానుంది. ఈ సందర్భంగా ఆనాటి అమరవీరులను తెలంగాణ ప్రభుత్వం స్మరించుకోనుంది. చాదర్‌ఘాట్‌లోని మొదటి ప్రపంచ యుద్ధం స్మారక స్థూపం వద్ద రేపు శుక్రవారం ఆధికారికంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలలో బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్, ప్రాన్స్, జర్మనీ కౌన్సిల్ జనరల్స్ పాల్గొంటారు. మొదటి ప్రపంచం యుద్ధంలో 15 లక్షల మంది భారతీయ సైనికులు పాల్గొన్నారు. యుద్దంలో 75వేల మంది సైనికులు కన్నుమూశారు. ** -
‘జూరాల’లో నలుగురి మునక
ఒకరి మృతదేహం లభ్యం లభించని ముగ్గురి ఆచూకీ ధరూరు, న్యూస్‌లైన్: మహబూబ్‌నగర్ జిల్లా ప్రియదర్శిని జూరాల రిజర్వాయర్‌లో నలుగురు మునిగి పోయారు. స్థానికులు, బాధితులు కథనం మేరకు.. హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతానికి చెందిన కుటుంబం గద్వాలలోని శేరెల్లివీధికి చెందిన మహిమూదా ఇంటికి శనివారం వచ్చింది. రాత్రి గద్వాలలోనే ఉండి ఆదివారం ఉదయం ఆత్మకూరులోని బంధువులను చూసేందుకు జీపులో వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో గద్వాలకు తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యంలోని జూరాల ప్రాజెక్టును చూసి అక్కడే కొద్దిసేపు గడిపి వెళ్దామని ఆగారు. వేసవి కావడం, ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిగా తగ్గి ఉండడంతో వారు కుడికాల్వకు నీటిని విడుదల చేసే రెగ్యులేటరీ వద్దకు చేరుకున్నారు. అక్కడ నీళ్లలో ఆడుకుంటున్న హైదరాబాద్‌కు చెందిన షాకీర్ (17) మునిగిపోయాడు. గమనించిన తోటివారు సాబేర్ (20), మోసిన్ (19)తో పాటు గద్వాల పట్టణానికి చెందిన వారి బంధువుల అబ్బాయి సమీర్ (19) షాకీర్‌ను కాపాడబోయి ఒకరివెంట మరొకరు ఐదుగురూ నీటిలో మునిగిపోయారు. జుబేర్‌ను జాలర్లు కాపాడారు. రిజర్వాయర్‌లో ఒండ్రుమట్టి పేరుకుపోవడంతో పాటు యువకులకు ఈత రాకపోవడంతో నీట మునిగిపోయారు. ఆదివారం రాత్రి వరకు షాకీర్ ఒక్కరి మృతదే హమే లభించింది. మిగిలిన ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది. పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు.. జూబ్లీహిల్స్/ఎర్రగడ్డ, న్యూస్‌లైన్: నీళ్లలోకి దిగి గల్లంతైన యువకుల ఉదం తం స్థానికంగా విషాదం నింపింది. బోరబండ సైట్-1కి చెందిన మహమ్మద్ కుమారులు సాబేర్, షాకిర్ పదో తరగతి పూర్తి చేశారు. షాకిర్ అమీర్‌పేటలోని చెప్పుల దుకాణంలో పనిచేస్తుండగా, సాబేర్ ఇంటి దగ్గరే ఉంటూ చిన్నా చితకా పనులు చేస్తూ కుటుంబానికి సహాయపడుతున్నాడు. అదే ప్రాంతంలో ఉండే వీరి సమీప బంధువు మోసిన్ (19) కూడా చెప్పుల షాపులో పనిచేస్తున్నాడు. వీరు ముగ్గురూ కలిసి శనివారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో ఉండే పెదనాన్న ఇంటికి వెళ్లారు. ఆదివారం ఈత కొట్టడానికని సమీపంలోని జూరాల ప్రాజెక్టుకు వెళ్లి గల్లంతయ్యారు. వీరి తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటిన గద్వాల బయలుదేరి వెళ్లారు. -
అడ్వకేట్ సొసైటీ క్రీడలు షురూ
సుల్తాన్‌బజార్, న్యూస్‌లైన్: అడ్వకేట్ సొసైటీ స్పోర్ట్స్ మీట్ శనివారం చాదర్ ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్స్‌లో ప్రారంభమైంది. రెండురోజుల పాటు జరిగే స్పోర్ట్స్ మీట్‌ను జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ డెరైక్టర్ ప్రేమ్‌రాజ్, సొసైటీ అధ్యక్షులు పాపిరెడ్డి ప్రారంభించారు. న్యాయవాదులకు మొదటిరోజు బాస్కెట్‌బాల్, టెన్నికాయిట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, క్యారమ్, చెస్ క్రీడాంశాల్లో పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు పాపిరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో సొసైటీ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్‌ను నిర్వహిస్తామని తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 6 గంటల వరకు కబడ్డీ, రన్నింగ్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్ పోటీలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కన్వీనర్ శ్రీనాథ్, డెరైక్టర్లు రాజీవ్‌రెడ్డి, విజయ భాస్కర్‌రెడ్డి, బాలకృష్ణ, కార్యదర్శి రమేశ్ గుప్తా, ప్రతినిధులు కొండూరు వినోద్, ప్రవీణ్, జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.