చాదర్‌ఘాట్ (హైదరాబాద్) : ఇంటి ముందు కూర్చుని ఉన్న మహిళ ముఖంపై గుర్తుతెలియని దుండగులు మత్తు మందు చల్లి ఆమె ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ సంఘటన నగరంలోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్‌బాద్ న్యాయమూర్తుల కాలనీలో మంగళవారం జరిగింది.
కాలనీలోని పీఎన్‌ఆర్ అపార్ట్‌మెంట్ ఎదురుగా ఉన్న తన ఇంటి ముందు కూర్చుని ఉన్న వరలక్ష్మి(25) అనే మహిళ ముఖంపై బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు మత్తు మందు చల్లారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయి పడిపోగా ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు ఆభరణాలను లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.