జీతాలు చెల్లించలేదని చెత్త వాహనాల నిలిపివేత | Drivers stopped garbage collecting vehicles demanding to pay salaries | Sakshi
Sakshi News home page

జీతాలు చెల్లించలేదని చెత్త వాహనాల నిలిపివేత

Published Fri, Sep 20 2019 12:55 PM | Last Updated on Fri, Sep 20 2019 12:55 PM

Drivers stopped garbage collecting vehicles demanding to pay salaries - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జీతాలు చెల్లించాలనే డిమాండ్‌తో నగరంలోని చెత్త వాహనాల డ్రైవర్లు శుక్రవారం తమ వాహనాలను నిలిపివేశారు. దీంతో చాదర్‌ఘాట్‌లోని కలెక్షన్‌ పాయింట్‌లో చెత్త భారీగా పేరుకుపోయింది. ఇక్కడి నుంచి చెత్తను సేకరించి జవహర్‌నగర్‌లోని డంపింగ్‌ యార్డుకు చెత్తను తరలించాల్సి ఉంది. చెత్త సేకరించే భారీ వాహనాలను నిలిపివేయడంతో చాదర్‌ఘాట్‌ నుంచి ఎమ్‌జీబీఎస్‌ వరకు ట్రాఫిక్‌ స్థంభించిపోయింది. ట్రాఫిక్‌ వల్ల ఇతర వాహనదారులు  తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement