సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడిన షకీల్‌కు కఠిన శిక్ష పడుతుందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఆమె అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తెలుసుకున్నారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, నిందితుడికి చట్ట ప్రకారం శిక్ష పడేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
ఘటనను సుమోటోగా స్వీకరించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత బాలికపై జరిగిన అత్యాచార ఘటనను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సుమోటోగా స్వీకరించింది. బాధితురాలికి అండగా ఉంటామని స్పష్టం చేస్తూ.. తక్షణ పరిహారం అందించాలని కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు శాఖకు సూచించారు.
(చదవండి: మద్యం ఎక్కువ తాగాడని హత్య)
Comments
Please login to add a commentAdd a comment